Joguramanna
-
పోరాట కేంద్రంగా ‘సీసీఐ’ సెల్ఫీ పాయింట్
ఆదిలాబాద్ టౌన్: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మూతపడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్ట రీని పునఃప్రారంభించాలనే ఉద్యమి స్తున్న సీసీఐ సాధన కమిటీ కొత్త పోరాట రూపాన్ని ఎంచుకుంది. నెల రోజులుగా ఆందోళన చేస్తున్న కమిటీ.. తమ పోరాటాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకు మంగళవారం ‘ఐ లవ్ సీసీఐ’ పేరుతో ఆదిలాబాద్ పట్టణంలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేసింది. పట్టణ ప్రజలు, యువకులు ఇక్కడ ఫొటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసి కేంద్రానికి చేరేలా షేర్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే జోగు రామన్న సెల్ఫీ పాయింట్ వద్ద మొదటి ఫొటో దిగి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీసీఐ పునరుద్ధరణ అంశం ప్రజా ఉద్యమంగా మారు తుందన్నారు. సెల్ఫీ పాయింట్ వద్ద ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాలని కోరారు. సీసీఐ పునఃప్రారంభానికి కేంద్రం అనుమతి ఇచ్చే వరకూ పోరాటం కొనసాగుతుందని సీసీఐ సాధన కమిటీ కోకన్వీనర్ విజ్జగిరి నారాయణ, నర్సింగ్, రమేశ్, శివ, కిరణ్, మనోజ్, సూరజ్ తెలిపారు. -
జోగు రామన్న కు మళ్ళీ రాజయోగం పట్టనుందా?
-
ఆదిలాబాద్ టీఆర్ఎస్లో వార్!
సాక్షి, ఆదిలాబాద్: అధికార పార్టీలో వార్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు, ముఖ్యనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. గత కొద్ది రోజులుగా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే, ముఖ్యనేతల మధ్య వైరం నడుస్తుండగా..తాజాగా ఎమ్మెల్యేల మధ్య కూడా సఖ్యత కొరవడింది. ఈ తాజా రాజకీయ పరిణామాలు ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎక్కడి వారు అక్కడే.. జిల్లా రాజకీయాల్లో అధికార పార్టీ పరంగా ఇటీవల జరిగిన సంఘటనలు పార్టీలో రాజకీయ విభేదాలను ప్రస్పుటం చేస్తున్నాయి. సాధారణంగా మంత్రులు జిల్లాలో పర్యటించినప్పుడు ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇటీవల మంత్రి ఐకేరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని దుర్గానగర్‌లో అటవీశాఖకు సంబంధించి ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు రాగా, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు దాంట్లో పాల్గొనలేదు. రెండు రోజుల క్రితం బోథ్ మండలం ధనోరలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొనగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. ఇటు ఆదిలాబాద్, అటు బోథ్ నియోజకవర్గాల్లో ఏ కార్యక్రమం జరిగినా ముఖ్యనేతలు హాజరైతే ఇరువురు ఎమ్మెల్యేలు పాల్గొనేవారు. అయితే తాజాగా ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు ఎమ్మెల్యే జోగు రామన్నతో పొసగక పోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా ఈ ఇరువురు మధ్య విభేదాలు శాసనసభ ఎన్నికల సమయం నుంచే అంతర్లీనంగా ఉన్నప్పటికీ తాజాగా అవి బహిర్గతం అవుతున్నాయన్న చర్చ సాగుతోంది. ఆ ఎన్నికలకు ముందు అప్పుడు ఎంపీగా ఉన్న గోడం నగేశ్‌తో ఎమ్మెల్యే జోగు రామన్న సఖ్యతగా ఉంటున్నారనే అభిప్రాయంతో రాథోడ్ బాపురావు వర్గీయులు విభేదించారు. ఆ తర్వాత ఎన్నికల్లో బోథ్ నియోజకవర్గం నుంచి తిరిగి అసెంబ్లీ పోటీ చేసి విజయం సాధించిన రాథోడ్ బాపురావు విభేదాలను పక్కన బెట్టి ఎమ్మెల్యే జోగు రామన్నతో కలిసి సాగుతున్నట్లు కనిపించినప్పటికీ తాజాగా ఆ పరిస్థితులు మారిపోయాయి. టీఆర్ఎస్ సర్కార్ రెండోసారి కొలువుదీరిన తర్వాత జోగు రామన్నకు తిరిగి మంత్రి పదవి దక్కకపోవడం.. ఈ విషయంలో బోథ్ ఎమ్మెల్యేతో సఖ్యతగా ఉండే నాయకులు కొంతమంది రామన్నకు వ్యతిరేకంగా అనేక చోట్ల ప్రస్తావించడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు తెలుస్తోంది. తాను రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందడం మరోపక్క అధికార కాలం మరో నాలుగేళ్లు ఉండడంతో బాపురావు కూడా ఇదివరకు రామన్నతో వ్యవహరించిన తీరుకు భిన్నంగా పోతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో మంత్రివర్గ విస్తరణ తర్వాత రామన్న అజ్ఞాతంలోకి వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత పలువురు ముఖ్యనాయకులు ఆయనను కలిసి పరామర్శించినప్పటికీ బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆయనను పరామర్శించలేదనే అపవాదు ఉంది. విభేదాల కారణంగానే ఈ పరిస్థితి ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్య నేతలతోనూ.. రాథోడ్ బాపురావుకు టీఆర్ఎస్ జిల్లా ముఖ్యనేతలతోనూ సత్సంబంధాలు లేవు. పార్టీలో ఈ విషయంలో సామాన్య కార్యకర్తకు కూడా అవగతం ఉంది. ప్రధానంగా మాజీ ఎంపీ గోడం నగేశ్‌తో విభేదాలు ఉన్నాయి. ప్రధానంగా శాసనసభ ఎన్నికలకు ముందు నగేశ్ బోథ్ అసెంబ్లీ నుంచి పోటీ చేయడం ఖాయమనే సంకేతాలను ఆయన అనుచరులు బాహాటంగానే పేర్కొనడం అప్పట్లో జరిగింది. అయితే ఎన్నికల్లో తిరిగి బాపురావు టికెట్ దక్కించుకొని గెలుపొందడం ద్వారా తన ప్రభావం చాటారు. అప్పట్లో బోథ్ నియోజకవర్గంలో నగేశ్ కేడర్‌గా ఉన్నవారిని ఆయన కొంతదూరం పెట్టారు. అంతకు ముందు బోథ్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ వర్గం కూడా ఉండేది. ఆయన పార్టీ మారిన తర్వాత ఆ కేడర్‌కు సరైన ప్రాధాన్యత ఎమ్మెల్యే వర్గీయులు ఇవ్వలేదన్న ప్రచారం లేకపోలేదు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోనూ కొంత వర్గ రాజకీయాలకు దారితీశాయి. రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డితోనూ బాపురావుకు విభేదాలు ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తలమడుగు జెడ్పీటీసీ స్థానం నుంచి లోక భూమారెడ్డి తన అల్లుడికి టికెట్ కోసం ప్రయత్నం చేశారు. అయితే ఎమ్మెల్యే ఆయనకు సహకరించకపోవడం ఈ విభేదాలకు కారణమైంది. అంతకుముందు నుంచే ఈ ఇరువురి మధ్య విభేదాలు ఉండగా, ఆ సంఘటనతో మరింత ముదిరాయి. ఇప్పటికీ ఈ ఇరువురి నేతల మధ్య ఎడమొహం.. పెడమొహం అన్న తీరుగానే రాజకీయం ఉందన్న చర్చ సాగుతోంది. జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్‌తో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో సఖ్యతగా ఉండగా, నార్నూర్ జెడ్పీటీసీగా గెలిచి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన రాథోడ్ జనార్దన్ ఆ తర్వాత కొంత ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్‌పై దృష్టి సారించడంతో ఆ ఎమ్మెల్యే రేఖానాయక్ ఇటు జెడ్పీ చైర్మన్‌పై, అటు ఆయనకు సపోర్ట్‌గా ఉన్న బోథ్ ఎమ్మెల్యేపై కొంత గుర్రుగా ఉన్నారన్న ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో బోథ్ ఎమ్మెల్యే వర్సెస్ జిల్లా ముఖ్యనేతలు అన్న చందంగా ప్రస్తుతం అధికార పార్టీలో రాజకీయ వ్యవహారాలు సాగుతున్నాయి. జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్ ఇటు బాపురావుతో, అటు రామన్నతో సఖ్యతగా ఉంటూ వస్తున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ ఎంపీ నగేశ్, డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రస్తుతం ఒక వర్గంగా ఉండగా, రాథోడ్ బాపురావు మరో వర్గంగా ఒంటరిగా నిలవడం గమనార్హం. -
మహిళా సంక్షేమానికి సీఎం కృషి
ఆదిలాబాద్‌రూరల్ : రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి సీఎం కేసీఆర్ మహిళలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర మంత్రి జోగు రామన్న అన్నారు. జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్ధిదారులకు సోమవారం చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అతిథిగా హాజరై మాట్లాడారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఇప్పటికే ఇతర రాష్ట్రల ముఖ్యమంత్రులు, అధికారులు సీఎం కేసీఆర్‌ను అభినందిస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం 32 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, వైస్‌ఎంపీపీ గంగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు నైతం శుక్లాల్, ఖయ్యుం, యూనుస్ అక్బానీ, ఎంపీడీవో రాథోడ్ రవీందర్, తహసీల్దార్ మధుకర్, తదితరులు పాల్గొన్నారు. -
బీసీల అభివృద్ధికి సీఎం కృషి
ఆదిలాబాద్‌రూరల్: బీసీల అభివృద్ధికోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అ న్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డెన్స్‌లో నిర్వహించిన వడ్డెర కులస్తుల మహాసభకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టారన్నారు. చేతి వృత్తులపై ఆధారపడి జీవనం కొనసాగించే వారిలో వడ్డెర కులస్తులు మొదటిస్థానంలో ఉన్నారన్నారు. కులవృత్తుల వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రభుత్వం బడ్జెట్లో కో ట్లాది రూపాయల నిధులు కేటాయిస్తోందన్నా రు. జిల్లా కేంద్రంలో సంఘ భవన నిర్మాణం కోసం ఎకరం స్థలం కేటాయించి వారికి భవనం నిర్మించి ఇస్తామన్నారు. త్వరలో అందజేయనున్న డబుల్ బేడ్ రూం ఇళ్లలో వందఇళ్లు వడ్డెర కుస్తులకు కేటా యిస్తామన్నారు. వడ్డెరులు ఎదుర్కొం టున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటి పరి ష్కరం కోసం కృషి చేస్తానన్నారు. అంతకు ముం దు మంత్రిని శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాములు, మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీ ష, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, జోగు ఫౌండేషన్ చైర్మన్ జోగు ప్రేమేం దర్, వడ్డెర సంఘం రాష్ట్ర నాయకుడు సత్తిబాబు, నారాయణ స్వామి, అంజనేయులు, జిల్లా అధ్యక్షుడు గంగయ్య, వడ్డెర కులస్తులు పాల్గొన్నారు. -
తన పేరులోనే ‘నర.. సింహం’ వైవిధ్యం..
సాక్షి, హైదరాబాద్: జీవవైవిధ్యానికి తన పేరే నిదర్శనమని.. తన పేరులోనే ‘నర.. సింహం’ వైవిధ్యం ఉందని గవర్నర్ నరసింహన్ సరదాగా వ్యాఖ్యానించారు. మంగళవారం హైదరాబాద్‌లోని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 25వ అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్.. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించారు. అనంతరం ప్రసంగించారు. భారతీయులు వేల సంవత్సరాలుగా జీవవైవిధ్యాన్ని పాటిస్తున్నారని.. భారత సంస్కృతి, సంప్రదాయాల్లోనే జంతువులు, వృక్షాలను పూజించే సంస్కృతి ఉందని నరసింహన్ పేర్కొన్నారు. ప్రతి దేవుడి వాహనంగా ఒక జంతువు ఉంటుందని, అలా జంతువులకు కూడా దేవుడితో సమానంగా పూజలు చేసే సంస్కృతి ఉందని చెప్పారు. జీవవైవిధ్యం అంటే పర్యావరణ పరిరక్షణ కూడా అని.. అందుకే పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా కృషి చేయాలని సూచించారు. ఒకప్పుడు హైదరాబాద్ నగరం చెరువులతో కళకళలాడేదని, ఇప్పుడు కాంక్రీట్ జంగిల్‌గా మారిపోయిందని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం మనిషికి మంచి చేసేదిగా ఉండాలేగానీ.. చెడు చేసేలా ఉండకూడదని చెప్పారు. ఎటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనల్ని కాపాడలేదని, పర్యావరణ పరిరక్షణ ఒక్కటే మనం ఆరోగ్యంగా జీవించడానికి తోడ్పడుతుందని స్పష్టం చేశారు. పర్యావరణానికి హాని కలిగిస్తున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మనుగడకు వైవిధ్యమే ఆధారం: జోగు రామన్న జీవవైవిధ్యాన్ని కాపాడటం మనందరి బాధ్యత అని.. మనిషి మనుగడకు, జీవనోపాధికి కూడా జీవవైవిధ్యమే ఆధారమని మంత్రి జోగురామన్న పేర్కొన్నారు. జీవవైవిధ్యంలో ప్రపంచంలోనే భా రతదేశం 8వ స్థానంలో ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం జీవవైవిధ్య పరిరక్షణలో భాగంగా రాష్ట్ర జీవవైవిధ్య మండలి ఏర్పాటు చేసి.. ‘జీవవైవిధ్య నియమావళి–2015’ను రూపొందించిందని చెప్పారు. జీవ వనరుల సేకరణ, వినియోగానికి సంబంధించిన కార్యకలాపాలపై నియంత్రణ, స్థానిక సంస్థల పరిధిలో జీవవైవిధ్య యాజమాన్య కమిటీల ఏర్పాటు, జీవవైవిధ్య వారసత్వ స్థలాల గుర్తింపు, నిర్వహణ విధులను జీవవైవిధ్య మండలి చేపడుతోందన్నారు. రాష్ట్రంలో జీవవైవిధ్యానికి నెలవుగా మెదక్ జిల్లాలోని అమీన్పూర్ చెరువును గుర్తించామని, అక్కడికి దేశదేశాల నుంచి పక్షులు వలస వస్తాయని చెప్పారు. మూసీ ప్రక్షాళనకు, కాలుష్యం తగ్గుముఖం పట్టేలా చర్యలు చేపడుతున్నామన్నారు. పలువురికి జీవవైవిధ్య అవార్డులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో జీవవైవిధ్యాన్ని కాపాడుకుంటూ ఉపాధిని పొందుతున్న పలువురికి ‘ఇండియా జీవవైవిధ్య సదస్సు–2018’అవార్డులను గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేశారు. బహుమతిగా లక్ష రూపాయల చెక్కు ఇచ్చారు. -
అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్నాం..
ఆదిలాబాద్ రూరల్ : అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ రూరల్ మండలం కుంభఝరి, శివ్‌ఘాట్, మావల మండలం పిట్టలవాడలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయా ప్రాంతాల్లో అంబేద్కర్ చిత్రపటాలు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఉపాధి కల్పిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ చదువుతోనే చరిత్రలో నిలిచిపోయారని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు తల్లిదండ్రులు వారి పిల్లలకు ఉన్నత చదువులు చదివించాలని అన్నారు. పేదవారు ఉన్నత చదువులు చదువుకోవడానికి ప్రభుత్వం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసిందన్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మావల గ్రామ పంచాయతీ సర్పంచ్ రఘుపతి, కుంభఘరి గ్రామ పంచాయతీ సర్పంచ్ లాయరి లక్ష్మి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు నల్ల రాజేశ్వర్, దళిత సంఘాల నేతలు తదితరులు పాల్గొన్నారు. -
జోగు రామన్నకు తప్పిన ప్రమాదం
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాలలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు. అధికారులతోపాటు కొంతమంది పోలీసు సిబ్బంది, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదిన కేక్‌ను కట్ చేశారు. అక్కడ టపాసులు కాల్చడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే టపాసుల కారణంగా మంటలు చెలరేగాయి. అవికాస్త టెంట్‌కు, ఇతర ఫర్నీచర్‌కు అంటుకోవడంతో అగ్నికి అవి ఆహుతి అయ్యాయి. తృటిలో మంత్రి జోగురామన్నతోపాటు ఇతరులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. -
లైవ్‌స్టాక్ హెరిటేజ్ ఫాం ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆది లాబాద్‌లో జంతు, పశు, జీవవైవిధ్య పరిరక్షణకు లైవ్‌స్టాక్ హెరిటేజ్ ఫాం ఏర్పా టుకు చర్యలు తీసు కోవాలని కేంద్ర మంత్రి మహేశ్ శర్మను మంత్రి జోగురామన్న కోరారు. బుధ వారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఫాం ఏర్పాటుకు సంబంధించి రూ.185 కోట్లతో డీపీఆర్‌ను సమర్పించి కేంద్రం తరఫున నిధులు విడుదల చేయా లని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో కేట గిరీ–1 సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 6న తాను హైదరా బాద్ వస్తున్నానని, అప్పుడు రాష్ట్ర అధి కారులతో సమావేశమై లైవ్‌స్టాక్ ఫాం, సైన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్యలు తీసు కుంటానని హామీ ఇచ్చినట్టు మంత్రి తెలి పారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లట్‌ను కలసి రాష్ట్రంలో బీసీ జాబితాలోని మిగిలిన 26 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. కేంద్ర పర్యాటక మంత్రి అల్ఫో న్స్ను కలసి ఆదిలాబాద్‌లో పర్యాటకాభి వృద్ధికి రూ.141 కోట్ల డీపీఆర్‌కు ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలన్నారు. -
వికలాంగుల సంక్షేమానికి రూ.30 కోట్లు కేటాయింపు
-
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
► రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న ► అదనపు తరగతి గదుల నిర్మాణం ప్రారంభం బేల : గత ప్రభుత్వాల్లో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళశాలలో నాబార్డు ఆర్ఐడీఎఫ్–21 నిధులు రూ.కోటి వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణ పనుల ప్రారంభానికి శిలాఫలకం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల పాలనలో ప్రభుత్వం 250 గురుకులాలను ఏర్పాటు చేయడం విద్యా వ్యవస్థ పటిష్టతకు నిదర్శనమని పేర్కొన్నారు. జనాభాలో 52శాతం ఉన్న బీసీలకు ప్రత్యేకంగా 109 గురుకులాలు త్వరలోనే మంజూరు కానున్నాయని తెలిపారు. బేలలో డిగ్రీ కళశాల మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. స్థానిక జూనియర్ కళశాలలో ప్రహరీ నిర్మాణానికి రూ.30 లక్షలు త్వరలోనే మంజూరు చేస్తామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పట్టుదలతో చదువుకోవాలని, లక్ష్యంతో భవిష్యత్‌లో గమ్యం చేరాలని తెలిపారు. ప్రతి సంవత్సరం మండలంలో మొత్తంగా ఏవైనా రెండు సంఘాల కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.5లక్షల చొప్పున మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రుణాల సబ్సిడీ నిధుల విడుదలలో వాస్తవంగా జాప్యం జరిగిందని, ఈ నెలాఖరులోపు నిధులన్నీ తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి విడుదలవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి నాగేందర్, జెడ్పీటీసీ సభ్యుడు నాక్లే రాందాస్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు రావుత్ మనోహార్, ఎంపీపీ అధ్యక్షుడు కుంట రఘుకుల్‌రెడ్డి, కళశాల ప్రిన్సిపాల్ కన్నం మోహన్ బాబు, కస్తూరిబా ప్రత్యేక అధికారి గేడాం నవీన, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు నిపుంగే సంజయ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు టాక్రే గంభీర్, మండల అధ్యక్షుడు ఓల్లఫ్వార్ దేవన్న, ప్రధాన కార్యదర్శి టాక్రే మంగేష్ పాల్గొన్నారు. వినతుల వెల్లువ బేల : అదనపు తరగతుల నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి జోగు రామన్నకు వినతులు వెల్లువెత్తాయి. రజక, కుమ్మర, కమ్మరి, మేదరి, ప్రధాన్ పురోహిత్, గున్ల, తదితర సంఘాల వారు మంత్రిని ఘనంగా సన్మానించి.. కమ్యూనిటీ హాల్లు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. కస్తూరిబా బృందం, కాంట్రాక్ట్ లెక్చరర్లు, గిరిజన సంక్షేమ, ఆశ్రమోన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీఆర్టీలు క్రమబద్ధీకరణ, 10వ పీఆర్ఎసీ అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని వినతిపత్రం సమర్పించారు. ఆ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొన్నారు. -
గుడ్డిగా విమర్శిస్తున్నారు
విపక్ష నేతలపై మంత్రి జోగురామన్న ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేయడమే విపక్షాలు పని గా పెట్టుకున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. దేశం లో ఎక్కడా లేని విధంగా బీసీ సంక్షేమానికి నిధులు వెచ్చిస్తూ సంక్షేమ పథకాల అమల్లో అగ్రగామిగా రాష్ట్రం కొనసాగుతుంటే.. బీసీల ను ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ వర్గాల నుంచి ప్రధానిగా ఎదిగిన మోదీ హయాంలో వారి కోసం ఒక్క పథకమైనా మొదలుపెట్టకపోవడం బీసీలపై కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని బీజేపీ నాయ కులు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో బీసీల కోసం రూ.7,365 కోట్లు కేటాయించి, ఇప్ప టివరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లకు వెంటనే రగ్గులు బీసీ హాస్టళ్లు, గురుకులాల్లోని విదార్థులకు వెంటనే రగ్గులు పంపిణీ చేయాలని అధికా రులను మంత్రి ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లోని కాం ట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల వేతనాలు పెం చాలని సంబంధిత అధి కారులకు సూచించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలపై మంగళవారం సచి వాలయంలో మంత్రికి బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. బీసీ స్టడీ సర్కిళ్లలోని హాస్టళ్లలో బీసీల సీట్లను 90 శాతానికి పెంచాలని, సంక్షేమ విద్యార్థుల ఫీజు బకారుులు రూ.2,090 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. నేడు మెక్సికో కాప్ సదస్సుకు మంత్రి మెక్సికోలో జరగనున్న కన్వెన్షన్ ఆన్ బయో లాజికల్ డైవర్సిటీ (కాప్-13) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జోగురామన్న బుధ వారం రాత్రి బయలుదేరనున్నారు. ఈ నెల 9 నుంచి 10 రోజుల పాటు మెక్సికోలోని కాన్కన్ నగరంలో జరగనున్న ఈ సదస్సులో మంత్రితో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ సి.సువర్ణ పాల్గొంటారు. -
వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలి
► రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న ► జిల్లా పరిషత్‌లో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఆదిలాబాద్ అర్బన్ : వికలాంగులు ఆత్మస్థైర్యంతో జీవించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ దివ్యాంగుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని, వారి అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. జిల్లాలో అంగవైకల్యం కలిగి ఉన్న 33,722 మంది అభ్యర్థులకు గతంలో ఉన్న పింఛన్లను అధిక మొత్తంలో పెంచారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 3.34 లక్షల మందికి పింఛన్ అందజేస్తున్నామని అన్నారు. జిల్లాలో వికలాంగులు ఎదుర్కొంటున్న సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళా శిశు సంక్షేమ అధికారి ఉమాదేవి మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 13,644 అంధులు, 5,336 మంది చెవిటి, మూగ, 10,615 మంది శారీరక, 4,127 మంది మానసిక వికలాంగులు కలిపి మొత్తం 33,722 మంది ఉన్నారని తెలిపారు. అన్ని రకాల స్కాలర్షిప్లు, వివాహ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని పేర్కొన్నారు. బ్యాంకుల ద్వారా 50 శాతం సబ్సిడీపై రూ.లక్ష వరకు బ్యాంకు రుణాలు అందజేస్తున్నామని, అన్ని సౌకర్యాలు ఉన్న శారీరక వికలాంగులకు పెట్రోల్‌పై రారుుతీ కూడా అందజేస్తున్నామని అన్నారు. వికలాంగులకు ప్రభుత్వ శాఖల్లో మూడు శాతం రిజర్వేషన్‌పై నియామకం చేపడుతున్నామని, మూడు చక్రాల బండ్లు, సంక కర్రలు, బ్రెరుులీ పలక, ఎంపీ3 ప్లేయర్లు, ట్యాప్‌టాప్‌లు ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు. వివిధ క్రీడా పోటీల్లో విజేతలకు మంత్రి బహుమతులు ప్రదానం చేశారు. వికలాంగులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించారుు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, జిల్లా పరిషత్ సీఈవో జితేందర్‌రెడ్డి, గ్రామీణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌రాథోడ్, మహిళా సంక్షేమ అధికారి ఉమాదేవి, వికలాంగుల సంక్షేమ సంఘం నాయకులు, దివ్యాంగులు పాల్గొన్నారు. -
విద్యావ్యవస్థను పటిష్ట పరుస్తాం
► పాఠశాలల్లో మౌలిక వసతులకు చర్యలు ► రాష్ట్ర మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ టౌన్ : విద్యావ్యవస్థను పటిష్టపరుస్తామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. శనివారం రిమ్స్ ఆడిటోరియంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడతూ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల సంఖ్యను తగ్గించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు. సర్కార్ బడులపై విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. 2012-13 సంవత్సరంలో ప్రారంభించిన పాఠశాల భవనాలు ఇంకా 146 వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయని, ఆర్వీఎం అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. క్షేత్రస్థారుులో ఆధికారులు పరిశీలించకపోవడంతోనే పనులు ముందుకు సాగడం లేదని పేర్కొన్నారు. పనులు పూర్తి చేయకుండా నిధులు డ్రా చేసుకున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలైనా మినహారుుంపు లేదని స్పష్టం చేశారు. పాఠశాలలో మౌలిక వసతులు, ఫర్నిచర్ కోసం ప్రతీ నియోజక వర్గానికి ఏసీడీపీ కింద రూ.4 కోట్లు కేటారుుంచామని, త్వరలోనే నిధులు విడుదల అవుతాయని తెలిపారు. చాలా పాఠశాలల్లో హరితహారం కింద నాటిన మొక్కలు కనిపించడం లేదని, మధాహ్న భోజన పథకం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మండల విద్యాధికారులు పాఠశాలలను పర్యవేక్షించి ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు. మండల స్థారుులో ప్రత్యేక టీం ఏర్పాటు చేసి ప్రతి రోజు ఏడు పాఠశాలలను తనిఖీ చేసేలా చూడాలని డీఈవోను మంత్రి ఆదేశించారు. కొన్ని పాఠశాలల్లో విద్యార్థులు చదవడం, రాయలేకపోతున్నారని అన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలని ఆదేశించారు. జేసీ కృష్ణారెడ్డి, డీఈవో లింగయ్యలు మాట్లాడుతూ ఈ నెల 31లోగా పదో తరగతి సిలబస్ పూర్తి చేయాలని, చదువుల్లో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. జిల్లాలో 25 శాతం పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలను అమర్చుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలకు గ్రేడింగ్ ఇస్తామని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు బోధించేందుకు ఉపాధ్యాయులు లేకపోతే సర్దుబాటు చేస్తామన్నారు. పాఠశాల సమయంలో విద్యార్థులను బయటకు పంపించొద్దని, బంద్‌లు, రాస్తారోకో పేరిట విద్యార్థి సంఘాలు, ఏవరైనా వచ్చినా పంపించొద్దని తెలిపారు. సమావేశంలో డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, డీఎస్వో శ్రీకాంత్‌రెడ్డి, డీఎంహెచ్‌వో చందు, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి కిషన్, స్టెప్ సీఈవో వెంకటేశ్వర్లు, ఆదిలాబాద్ జెడ్పీటీసీ సభ్యుడు అశోక్, వివిధ శాఖ అధికారులు, ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, కేజీబీవీ ప్రత్యేక అధికారులు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు పాల్గొన్నారు. -
రూ.10 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు
మంత్రి జోగు రామన్న పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీలోని 36 వార్డుల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని 26, 31వ వార్డుల్లో రూ.4 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించడానికి రూ.4 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని, విద్యుత్ సౌకర్యం లేని వీధులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్, కౌన్సిలర్లు నజీర్ ఆస్మపర్వీన్, వెంకన్న, కమిషనర్ కమిషనర్ మంగతాయారు, ఈఈ నాగమల్లేశ్వర్రావు, సానిటరీ ఇన్స్పెక్టర్ ఆయాజ్‌ఖాన్, టీఆర్ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్‌రంజానీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు -
ఆరె కటికల సమస్యల పరిష్కారానికి కృషి
మంత్రి జోగు రామన్న హామీ హైదరాబాద్: ఆరె కటికల సమస్యల పరిష్కారానికి తన శాయశక్తులా కృషి చేస్తానని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మాటలు చెప్పడం కన్నా చేతల ద్వారా చూపించాలన్న తపన ఉందని పేర్కొన్నారు. పరిష్కార హామీని ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే ఇప్పించేలా కృషి చేస్తానని చెప్పారు. సోమవారం ఇక్కడ జరిగిన ఆరె కటిక పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రాష్ట్రంలో 53 శాతంగా ఉన్న బీసీలకు మంచి చేయాలనే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారని పేర్కొన్నారు. ఇందుకుగాను తనను ఒక ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరినట్లు తెలిపారు. బీసీలు ఫెడరేషన్లు కావాలని కోరుతున్నారని, కానీ, వాటి వల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి స్పష్టం చేశారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గోగికర్ సుధాకర్ మాట్లాడుతూ ఆరె కటికలకు ప్రభుత్వపరమైన నామినేటెడ్ పోస్టు ఇవ్వాలని కోరారు. అరెకటికల సమస్యల పరిష్కారానికి డిసెంబర్ 7, 8 తేదీల్లో చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం సంఘం 31 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుని మంత్రి సమక్షంలో ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, ప్రశాంత్, ఈశ్వర్‌చౌదరి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం చేకూరాలి
మంత్రి జోగు రామన్న సాక్షి, హైదరాబాద్: పాలనా సౌలభ్యం కోసమే ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిందని మంత్రి జోగురామన్న అన్నారు. సంక్షేమ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్ని ప్రజలకు చేరవేయాలని, ప్రతి లబ్ధిదారుడికి ప్రయోజనం కలిగేలా చూడాలన్నారు. సోమవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ అధికారుల 2 రోజుల శిక్షణ తరగతుల్ని ఆయన ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది కొత్తగా మహాత్మా జ్యోతిబాపూలే ఓవర్సీస్ బీసీ విద్యానిధి పథకాన్ని అమల్లోకి తెచ్చామన్నారు. ఈ పథకం కింద అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. కాగా, బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వి.కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశంకర్‌లు మంత్రితో భేటి అయ్యారు. -
మంత్రికి తప్పిన ప్రమాదం
డిచ్పల్లి (నిజామాబాద్): రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్నకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మంత్రి ఆదిలాబాద్ జిల్లాలో జరుగనున్న కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలు దేరారు. కాన్వాయ్ వాహనాలు 44వ నెంబరు జాతీయ రహదారిపై డిచ్పల్లి మండలంలోని టీఎస్ఎస్పీ ఏడో బెటాలియన్ సమీపంలోకి చేరుకున్నాయి. అదే సమయంలో కాన్వాయ్ ముందుగా కర్నూలు నుంచి నిర్మల్‌కు వెళుతున్న బొలెరో వాహనం వెనుక టైరు అకస్మాత్తుగా ఊడి పోవడంతో ఆ వాహనం రోడ్డుపై నిలిచి పోయింది. వెనక నుంచి వేగంగా వస్తున్న మంత్రి కాన్వాయ్‌లోని ఎస్కార్ట్ వాహనం రోడ్డుపై నిలిచి పోయిన వాహనాన్ని ఢీకొట్టింది. ఆ వెనకనే మంత్రి జోగు రామన్న వాహనం ఉంది. మంత్రి కారు డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి పక్కకు తప్పించి సడన్‌బ్రేక్ వేసి వాహనాన్ని నిలిపి వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఎస్కార్ట్ వాహనంలో ఉన్న పోలీసు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే తన వాహనం దిగిన మంత్రి ఎస్కార్ట్ వాహనం డ్రైవర్ సుదర్శన్‌ను, ఏఆర్ఎస్సై భూమన్న, సిబ్బందిని పలకరించి ఏవైనా దెబ్బలు తగిలియా అని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డిచ్పల్లి ఎస్సై కట్టా నరేందర్‌రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తాను అర్జంటుగా ఆదిలాబాద్ వెళ్లాల్సి ఉందని, ఎస్కార్ట్ వాహనం విషయం చూసుకోమని డిచ్పల్లి పోలీసులకు చెప్పిన మంత్రి కాన్వాయ్‌లో ఇతర వాహనాలు వెంట రాగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ప్రమాదంలో ఎస్కార్ట్ వాహనం ముందు భాగం ధ్వంసమైంది. -
జోగురామన్నకు పితృవియోగం
తెలంగాణ అటవీశాఖా మంత్రి జోగురామన్న తండ్రి జోగు ఆశన్న(95) బుధవారం మధ్యాహ్నాం తుదిశ్వాస విడిచారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు కన్ను మూశారు. దీంతో మంత్రి హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్‌కు హుటాహుటిన బయలుదేరి వెళ్లారు. స్వగ్రామం జైనత్ మండలం దీపాయిగూడలో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. -
పూలే విగ్రహం ఏర్పాటుపై సీఎంతో చర్చిస్తా
పూలే జయంతి సభలో మంత్రి జోగురామన్న హైదరాబాద్: ట్యాంక్‌బండ్‌పై పూలే విగ్రహం ఏర్పాటు విషయుంపై వుుఖ్యవుంత్రితో చర్చిస్తానని రాష్ర్ట వెనుకబడిన తరగతుల సంక్షేవు శాఖ వుంత్రి జోగురావున్న చెప్పారు. సోమవారం రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిరావుపూలే జయంతి ఉత్సవాలు జరిగాయి. పూలే జయంతి ఉత్సవ కమిటీ నిర్వహించిన ఈ ఉత్సవంలో మంత్రి జోగు రామన్నతో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యేలు ఆర్ కృష్ణయ్య, చింతల రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ‘పూలే ఆశయ సాధనకు శక్తివంచన లేకుండా కృషిచేస్తాం. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పైనా లేక అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేసే ప్రాంగణంలో నెలకొల్పాలా అన్నది సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయిస్తాం. అలాగే పది జిల్లాల్లో బీసీ భవన్లు, ప్రతి నియోజకవర్గంలో రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తాం. కళాశాలల వసతి గృహాలు నెలకొల్పతాం. ప్రతి జిల్లాకూ ఒక స్టడీ సర్కిల్ అందుబాటులోకి తెచ్చి అందులో ఏడాదంతా శిక్షణ కొనసాగేలా చర్యలు తీసుకొంటాం. బీసీ కార్పొరేషన్ కింద పదివేల మందికి రుణాలు మంజూరు చేశాం. ఈ ఏడాది 50 వేల మందికి తగ్గకుండా రుణాలు ఇస్తాం. కుల సంఘాల సదస్సులు నిర్వహించుకొనేలా ఆడిటోరియం నిర్మిస్తాం. త్వరలోనే బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తాం. పూలే జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేరుస్తాం’ అని చెప్పారు. ప్రభుత్వాన్ని నిందించడం తగదు... స్వామిగౌడ్ మాట్లాడుతూ... ఏమీ చేయలేదని ప్రభుత్వాన్ని నిందించడం కంటే బీసీల అభ్యన్నతికి మనమేం చేస్తున్నామో ఆలోచించాలన్నారు. పూలే ఆశయ సాధనకు పాటుపడకుండా బీసీలను అగ్రవర్ణాలు అణగదొక్కుతున్నాయనడం సరికాదన్నారు. జన్మతః సంక్రమించే హక్కులను కూడా పోరాటం చేసి సాధించుకోవడం దురదృష్టకరమని ఆర్ కృష్ణయ్య అన్నారు. అనంతరం బీసీ హాస్టల్లో చదువుకుంటూ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన ఆనంద్‌ను సత్కరించారు. ఉత్సమ కమిటీ చైర్మన్ రామరాజు, వైస్‌చైర్మన్ కుందారం గణేష్‌చారి, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రతినిధి సోమేశ్‌కుమార్, బీసీ నాయకుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. పూలే కృషి స్ఫూర్తిదాయకం... రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన అంబర్‌పేట చౌరస్తాలో జరిగిన పూలే జయంతి ఉత్సవంలో మంత్రి జోగురామన్న పాల్గొన్నారు. సాంఘిక దురాచారాలు రూపుమాపేందుకు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే చేసిన కృషి స్ఫూర్తిదాయకమని మంత్రి కొనియాడారు. అనంతరం పూలే విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అంబర్‌పేట చే నంబర్ చౌరస్తాలో జ్యోతిరావుపూలే పేరిట ఆడిటోరియాన్ని నిర్మించాలన్న వీహెచ్ మంత్రిని కోరగా, సీఎం దృష్టికి తీసుకెళతానని ఆయన హామీ ఇచ్చారు. -
'బీసీల సంక్షేమానికి పెద్దపీట'
రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న బీసీల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, బంగారు తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర అటవీశాఖా, బీసీ సంక్షేమ శాఖా మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం ఆటోనగర్‌లోని మహావీర్ హరిణ వనస్థలి జాతీయ పార్కులో తెలంగాణ మున్నూరుకాపు ఎంప్లాయీస్, ప్రొఫెషనల్స్ ఎల్బీనగర్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీకమాస వనభోజనాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని వచ్చే సంవత్సరం నుంచి ఎస్సీ, ఎస్టీలకు అమలు చేస్తున్న విధంగానే బీసీలకు కూడా కళ్యాణలక్ష్మీ పథకాన్ని అమలు చేయనుందని చెప్పారు. బీసీ స్టడీ సర్కిళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలను పెంచేందుకు ప్రభుత్వం కతనిశ్చయంతో ఉందన్నారు. త్వరలోనే మున్నూరుకాపు రాష్ట్రస్థాయి సమ్మేళనాన్ని హైదరాబాద్‌లో నిర్వహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చర్చించి ఒప్పిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. -
ఛనాఖా-కొరట బ్యారేజీకి మహారాష్ట్ర ఓకే
సాక్షి, హైదరాబాద్: పెన్‌గంగా డ్యామ్ దిగువన ఛనాఖా-కొరట వద్ద నిర్మిస్తున్న బ్యారేజీకి మహారాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ అంగీకారం తెలిపింది. ఈ మేరకు మంత్రుల స్థాయిలో జరిగిన చర్చల్లో ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలకు సంబంధించి మౌఖిక ఒప్పందాలు చేసుకున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో ఈ నెల 30న మరో సమావేశం నిర్వహించిన అనంతరం అధికారిక ఒప్పందాలను చేసుకునే అవకాశం ఉంది. ఛనాఖా-కొరట బ్యారేజీ నిర్మాణానికి సహకారం కోరుతూ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ, అటవీ శాఖ మంత్రి జోగురామన్నలు మంగళవారం మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి గిరీశ్ మహాజన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీకి ఆదిలాబాద్ ఎంపీ నగేశ్, ప్రభుత్వ సలహాదారులు డి.శ్రీనివాస్, విద్యాసాగర్‌రావు, ముఖ్యకార్యదర్శి ఎస్కే జోషి, సీఈ మధుసూధన్, ఓఎస్డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర భూభాగంలోని రెండున్నర ఎకరాల భూమి అవసరమౌతుందని హరీశ్‌రావు మహారాష్ట్ర మంత్రికి నివేదించారు. బ్యారేజీ నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని, భూసేకరణకు అవసరమైన చర్యలన్నీ తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రతిపాదనను వారు సూత్రప్రాయంగా అంగీకరించారు. అయితే మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అందుబాటులో లేనందున, ఆయనతో చర్చించాక తుది నిర్ణయం చేస్తామని చెప్పారు. ఈనెల 30న సీఎంతో మరోమారు సమావేశం నిర్వహించిన అనంతరం అధికారికంగా దస్తావేజులపై ఇరు రాష్ట్రాలు సంతకాలు చేసుకునే అవకాశాలున్నాయి. లెండిపైనా చర్చలు.. లెండి ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగడంపై ఇరు రాష్ట్రాలు సమావేశంలో సమీక్షించుకున్నాయి. ఇప్పటికే రెండు ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టుపై రూ.500 కోట్లు ఖర్చు పెట్టినట్లు హరీశ్‌రావు గుర్తు చేశారు. పునరావాస సమస్యల వల్ల ప్రాజెక్టు పనులు నెమ్మదిగా సాగుతున్నాయని, వీటిని వేగిరం చేయాల్సిన అవసర ఉందని వారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రాణహితలో భాగంగా నిర్మించదలిచిన తుమ్మిడిహెట్టి బ్యారేజీపై ఎలాంటి చర్చ జరగలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
దత్తత గ్రామాలపై చర్చ..
♦ అదనంగా మండలానికో గ్రామం ఎంపిక ♦ నేడు సిద్ధం కానున్న జాబితా సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దత్తత గ్రామాల ఎంపిక తీరుపై శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన మారు‘మూలకేనా..!’ కథనం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస సౌకర్యాలకు నోచుకోని వందలాది గ్రామాలను కాకుండా పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకోవడం ఒకింత విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒకరిద్దరు మినహా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ మారుమూల గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ దత్తత గ్రామాలను అభివ ృద్ధిలో ముందువరుసలో నిలపడం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. మండలానికొకటి చొప్పున.. గ్రామజ్యోతి కార్యక్రమంలో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మండలానికి ఒక గ్రామం చొప్పున నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు గ్రామాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈసారైనా మారుమూల ప్రాంతాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకుంటే ఆయా గ్రామాల ప్రజలు త్వరితగతిన అభివ ృద్ధి బాటపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
అటవీ అభివృద్ధికి భారీగా నిధులివ్వండి
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం సంబంధిత అధికారులతో చర్చించి 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అటవీశాఖ నిర్లక్ష్యానికి గురైందని, కేవలం రూ.59 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని రామన్న వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి బడ్జెట్లో రూ.300 కోట్లు కేటాయించారని, కొత్తగా చేపట్టనున్న భారీ ప్రాజెక్టుల దృష్ట్యా ఈసారి బడ్జెట్‌ను నాలుగింతలు పెంచాలని కోరారు. -
ఎర్రచందనం చెట్లు పెంచుతాం
దక్షిణకొరియా జీవవైవిధ్య సదస్సులో హరితహారానికి అపూర్వ స్పందన అటవీమంత్రి జోగురామన్న హైదరాబాద్: రాష్ట్రంలో ఎర్రచందనం చెట్ల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగురామన్న ప్రకటించారు. అలాగే, వచ్చే మూడు సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా 230 కోట్ల చెట్లను నాటుతామని ఆయన చెప్పారు. దక్షిణ కొరియాలో జరిగిన ప్రపంచ 12వ జీవవైవిధ్య సదస్సుకు హాజరై తిరిగి వచ్చిన మంత్రి ఆదివారం సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో హరిత హారం కార్యక్రమం క్రింద అటవీ విస్తరణను పెంచడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన బృహత్పథకం గురించి ఆ సదస్సులో వివరించగా మంచి స్పందన లభించిందని ఆయన తెలిపారు. సర్పంచ్‌లు చైర్మన్‌గా మొత్తం 600 జీవవైవిధ్య కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో 40 వేల చెట్లను నాటాలనే లక్ష్యాన్ని సదస్సులో వివరించినట్టు చెప్పారు. జీవవైవిధ్యంతో పట్టణాలను కూడా స్మార్ట్‌సిటీలుగా తీర్చిదిద్దాలని సదస్సులో సూచించారని తెలిపారు. అయితే భారత్‌లో 70 శాతం ప్రజలు గ్రామాల్లోనే నివసిస్తారు కాబట్టి తెలంగాణలో మాత్రం ‘స్మార్ట్‌విలేజ్’లను అభివృద్ది చేయడం తమ లక్ష్యమని వివరించిన ట్టు ఆయన తెలిపారు. జీవవైవిధ్యానికి ప్రభుత్వాలు కేటాయిస్తున్న బడ్జెట్‌ను రెట్టింపు చేయాలని ఈ సదస్సు తీర్మానించిందని వివరించారు. ఎర్రచందనం చెట్ల పెంపకానికి ఏపీ భూములే అనువుగా ఉన్నాయనేది నిజం కాదని, తెలంగాణలోనూ వీటిని పెంచడానికి ఆస్కారం ఉందని మంత్రి పేర్కొన్నారు. పట్టాభూములలో వీటిని పెంచడానికి సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని జోగురామన్న తెలిపారు. ఎర్రచందనం పట్ల చైనా ఆసక్తి చూపుతుందని, దీనిని ఎగుమతి చేయకుండా ఇక్కడే ఫర్నిచర్‌ను తయారు చేయించి ఎగుమతి చేసే ఆలోచన ఉందన్నారు. -
8న జిల్లాకు కేసీఆర్ రాక
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈనెల 8న జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం హో దాలో ఆయన తొలిసారి ఆదిలాబాద్‌కు రానున్నారు. ఈ మేరకు కేసీఆర్ పర్యటన ఖరారైనట్లు రాష్ట్ర అట వీశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని రోజంతా జిల్లాలోనే ఉంటారన్నారు. బంగారు తెలంగాణ సాధించడంలో భాగంగా జిల్లా స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో రోజంతా సమీక్షలు చేయనున్నారు. జిల్లాలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, రోడ్లు, సాగునీటి రంగం వంటి అంశాలపై ఆయన శాఖలవారీగా సమీక్షించనున్నారు. అయితే సీఎం పర్యటన అధికారికంగా ఇంకా ఖరారు కావాల్సి ఉంది.