
సాక్షి, మంచిర్యాల : తెలంగాణ మంత్రి జోగు రామన్న తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసిన అనంతరం ఓ భూమిపూజ కార్యక్రమానికి హాజరైన ఆయన అనూహ్యంగా చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మంచిర్యాలలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ శంకు స్థాపనకు మంత్రి జోగు రామన్న, విప్ ఓదేలు, ఎమ్మెల్యే దివాకర్‌రావు ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు హాజరయ్యారు.
అధికారులతోపాటు కొంతమంది పోలీసు సిబ్బంది, టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు కూడా అక్కడ ఉన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ జన్మదిన కేక్‌ను కట్ చేశారు. అక్కడ టపాసులు కాల్చడం మొదలుపెట్టారు. ఈ సమయంలోనే టపాసుల కారణంగా మంటలు చెలరేగాయి. అవికాస్త టెంట్‌కు, ఇతర ఫర్నీచర్‌కు అంటుకోవడంతో అగ్నికి అవి ఆహుతి అయ్యాయి. తృటిలో మంత్రి జోగురామన్నతోపాటు ఇతరులు ప్రమాదం నుంచి బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment