
అటవీ అభివృద్ధికి భారీగా నిధులివ్వండి
హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ.1373.30 కోట్లు కేటాయించాలంటూ అటవీ శాఖ ప్రతిపాదించింది. అటవీ శాఖ మంత్రి జోగు రామన్న సోమవారం సంబంధిత అధికారులతో చర్చించి 2015-16 బడ్జెట్ ప్రతిపాదనలు ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌కు అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో అటవీశాఖ నిర్లక్ష్యానికి గురైందని, కేవలం రూ.59 కోట్ల బడ్జెట్ మాత్రమే కేటాయించారని రామన్న వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత తొలి బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించారని, కొత్తగా చేపట్టనున్న భారీ ప్రాజెక్టుల దృష్ట్యా ఈసారి బడ్జెట్‌ను నాలుగింతలు పెంచాలని కోరారు.