
సాక్షి, న్యూఢిల్లీ: ఆది లాబాద్‌లో జంతు, పశు, జీవవైవిధ్య పరిరక్షణకు లైవ్‌స్టాక్ హెరిటేజ్ ఫాం ఏర్పా టుకు చర్యలు తీసు కోవాలని కేంద్ర మంత్రి మహేశ్ శర్మను మంత్రి జోగురామన్న కోరారు. బుధ వారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఫాం ఏర్పాటుకు సంబంధించి రూ.185 కోట్లతో డీపీఆర్‌ను సమర్పించి కేంద్రం తరఫున నిధులు విడుదల చేయా లని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్‌లో కేట గిరీ–1 సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
ఈ నెల 6న తాను హైదరా బాద్ వస్తున్నానని, అప్పుడు రాష్ట్ర అధి కారులతో సమావేశమై లైవ్‌స్టాక్ ఫాం, సైన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్యలు తీసు కుంటానని హామీ ఇచ్చినట్టు మంత్రి తెలి పారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లట్‌ను కలసి రాష్ట్రంలో బీసీ జాబితాలోని మిగిలిన 26 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. కేంద్ర పర్యాటక మంత్రి అల్ఫో న్స్‌ను కలసి ఆదిలాబాద్‌లో పర్యాటకాభి వృద్ధికి రూ.141 కోట్ల డీపీఆర్‌కు ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment