minister mahesh sharma
-
లైవ్‌స్టాక్ హెరిటేజ్ ఫాం ఏర్పాటు చేయండి
సాక్షి, న్యూఢిల్లీ: ఆది లాబాద్‌లో జంతు, పశు, జీవవైవిధ్య పరిరక్షణకు లైవ్‌స్టాక్ హెరిటేజ్ ఫాం ఏర్పా టుకు చర్యలు తీసు కోవాలని కేంద్ర మంత్రి మహేశ్ శర్మను మంత్రి జోగురామన్న కోరారు. బుధ వారం ఆయన ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి ఫాం ఏర్పాటుకు సంబంధించి రూ.185 కోట్లతో డీపీఆర్‌ను సమర్పించి కేంద్రం తరఫున నిధులు విడుదల చేయా లని విజ్ఞప్తి చేశారు. కరీంనగర్లో కేట గిరీ–1 సైన్స్ సెంటర్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 6న తాను హైదరా బాద్ వస్తున్నానని, అప్పుడు రాష్ట్ర అధి కారులతో సమావేశమై లైవ్‌స్టాక్ ఫాం, సైన్స్ సెంటర్ ఏర్పాటుపై చర్యలు తీసు కుంటానని హామీ ఇచ్చినట్టు మంత్రి తెలి పారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లట్‌ను కలసి రాష్ట్రంలో బీసీ జాబితాలోని మిగిలిన 26 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. కేంద్ర పర్యాటక మంత్రి అల్ఫో న్స్ను కలసి ఆదిలాబాద్‌లో పర్యాటకాభి వృద్ధికి రూ.141 కోట్ల డీపీఆర్‌కు ఆమోదం తెలిపి నిధులు విడుదల చేయాలన్నారు. -
టాటా సూచనపై తగు నిర్ణయం
5/20 నిబంధనపై కేంద్ర మంత్రి మహేశ్ శర్మ న్యూఢిల్లీ: దేశీ ఎయిర్‌లైన్స్ విదేశాలకు విమానాలు నడిపే నిబంధనలకు సంబంధించి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అభిప్రాయాలను స్వాగతిస్తున్నట్లుగా పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ చెప్పారు. దీనిపై తగు సమయంలో నిర్ణయం తీసుకోగలమని ఆయన తెలిపారు. విదేశాలకు ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించాలంటే భారత విమానయాన సంస్థలు అయిదేళ్ల పాటు దేశీ రూట్లలో సర్వీసులు అందించడంతో పాటు 20 విమానాలు ఉండాలన్న నిబంధనపై (5/20) వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త కంపెనీల నుంచి పోటీకి భయపడి పాత సంస్థలు గుత్తాధిపత్యంతో ఈ నిబంధనను ఎత్తివేయకుండా ఒత్తిడి తెస్తున్నాయంటూ రతన్ టాటా పరోక్షంగా వ్యాఖ్యానించడం తాజాగా వివాదం రేపింది. కొత్తగా ఏర్పాటైన ఎయిర్ఏషియా ఇండియా, విస్తార సంస్థల్లో టాటా గ్రూప్‌నకు వాటాలు ఉన్నాయి. -
బిజినెస్@పార్లమెంట్
దేశీ ఎయిర్‌లైన్స్ నిబంధనల సడలింపు దేశీ విమానయాన సంస్థలు విదేశాలకు సర్వీసులు నడపాలంటే అయిదేళ్లపాటు దేశీయంగా సేవలు అందించడంతో పాటు 20 విమానాలు ఉండాలనే 5/20 నిబంధనను సవరించనున్నట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ రాజ్యసభకు తెలిపారు. మొండిబకాయిలు: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల్లో సుమారు రూ. 28,152 కోట్లు టాప్ 10 రుణగ్రస్తుల నుంచి రావాల్సి ఉంది. మొత్తం రుణాల్లో ఇది 1.73 శాతం. రూ. 1,000 కోట్ల పైచిలుకు రుణాలు తీసుకున్న వారు 433 మంది ఉన్నారని ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభ కు వివరించారు. పన్నుల రిఫండ్: గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాల్లో రూ. 1.19 లక్షల కోట్ల మేర ఆదాయ పన్ను రిఫండ్లు పెండింగ్‌లో ఉన్నట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా రాజ్యసభకు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ మొత్తం రూ. 68,032 కోట్లుగా ఉన్నట్లు వివరించారు.