రూ.10 కోట్లతో పట్టణాభివృద్ధి పనులు
మంత్రి జోగు రామన్న పనులకు శంకుస్థాపన
ఆదిలాబాద్ కల్చరల్ : ఆదిలాబాద్ మున్సిపాల్టీలోని 36 వార్డుల్లో రూ.10 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. సోమవారం పట్టణంలోని 26, 31వ వార్డుల్లో రూ.4 లక్షల చొప్పున వ్యయంతో నిర్మించనున్న మురికి కాలువల పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రామన్న మాట్లాడుతూ పట్టణ ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా సీసీ రోడ్లు, మురికి కాలువల నిర్మాణానికి రూ.10 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా కనెక్షన్ అందించడానికి రూ.4 వేల కోట్లతో పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
అర్హులైన వారికి రెండు పడక గదుల ఇళ్లు నిర్మించి ఇస్తామని, విద్యుత్ సౌకర్యం లేని వీధులకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరూఖ్ అహ్మద్, కౌన్సిలర్లు నజీర్ ఆస్మపర్వీన్, వెంకన్న, కమిషనర్ కమిషనర్ మంగతాయారు, ఈఈ నాగమల్లేశ్వర్‌రావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ ఆయాజ్‌ఖాన్, టీఆర్‌ఎస్ నాయకులు సాజిదొద్దీన్, అడ్డి బోజారెడ్డి, కౌన్సిలర్లు బండారి సతీష్, జహీర్‌రంజానీ, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు