సౌందర్య ప్రియులు, బ్యూటీ ఇండస్ట్రీ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఫౌండేషన్ ప్రొడక్ట్ షీగ్లామ్(SheGlam) ఇండియాలో లాంచ్ అయ్యింది. మేకప్ ప్రియులను ఇష్టపడే ఈ ప్రొడక్ట్‌ని రిలయన్స్ రిటైల్(Reliance Retail)కు చెందిన టిరా(Tira) ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. మేకప్ ప్రోడక్ట్స్‌లో ది బెస్ట్ షీగ్లామ్ ప్రొడక్ట్స్. బ్యూటీ ప్రియులు అత్యంత మెచ్చే ప్రోడక్ట్ ఇది. ఈ షీగ్లామ్ ప్రొడక్ట్స్‌లో గ్లో బ్లూమ్ లిక్విడ్ హైలైటర్, డైనమాట్ బూమ్ లాస్టింగ్ లిప్‌స్టిక్‌లు, స్కిన్‌ఫైనెట్ హైడ్రేటింగ్ ఫౌండేషన్ వంటి ఇతర ఉత్పత్తలు అందుబాటలో ఉంటాయి.
ఇవి ముఖానికి చక్కటి అందమైన మేకప్(Make Up)ని ఇస్తాయి. అంతేగాక సరసమైన ధరలో లభించనుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్‌ల, మేకప్ ఆర్టిస్ట్‌లు తక్కవ ధరలోనే మంచి నాణ్యతతో కూడిన ఉత్పత్తి లభిస్తుందని ప్రశంసించిన ప్రొడక్ట్ ఇది. ఇప్పుడు టిరాలో షెగ్లామ్ అరంగేట్రంతో అందాల ఔత్సాహికులకు చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది.
సమగ్ర సౌందర్యానికి భారతదేశాన్ని గమ్యస్థానంగా చేసేలా టిరా ఈ ప్రొడక్ట్ లాంచ్‌తో బలపరుస్తోంది. యావత్తు ప్రపంచం మెచ్చిన ఈ బ్రాండ్‌ని టిరా వెబ్‌సైట్‌లో, యాప్‌లలో అందుబాటులో ఉంటుందని రిలయన్స్ రిటైల్ టిరా ప్రకటించింది. ఇక త్వరలో టిరా స్టోర్‌లలో కూడా అందుబాటులో ఉండనుందని పేర్కొంది.
చర్మ సంరక్షణ జాగ్రత్తలు..
ఎంతటి బ్రాండెడ్ ఉత్పత్తులైనా.. చర్మానికి సరిపోతుందో లేదో పరీక్షించాలి
అవసరమైతే చర్మ నిపణలను సంప్రదించి వినియోగించడం మంచిది
ఏ బ్యూటీ ప్రొడక్స్ట్ అయినా.. అతిగా వాడితే ప్రమాదమే
నిద్రించే సమయంలో తప్పనిసరిగా మేకప్‌ని తొలగించుకోవాలి.
(చదవండి: మహాకుంభమేళాలో ఆకర్షణగా మరో వింత బాబా..ఏకంగా తలపైనే పంటలు..!)
Comments
Please login to add a commentAdd a comment