♦ అదనంగా మండలానికో గ్రామం ఎంపిక
♦ నేడు సిద్ధం కానున్న జాబితా
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దత్తత గ్రామాల ఎంపిక తీరుపై శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన మారు‘మూలకేనా..!’ కథనం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస సౌకర్యాలకు నోచుకోని వందలాది గ్రామాలను కాకుండా పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకోవడం ఒకింత విమర్శలకు దారితీసింది.
ఈ విషయమై మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒకరిద్దరు మినహా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ మారుమూల గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ దత్తత గ్రామాలను అభివ ృద్ధిలో ముందువరుసలో నిలపడం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు.
మండలానికొకటి చొప్పున..
గ్రామజ్యోతి కార్యక్రమంలో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మండలానికి ఒక గ్రామం చొప్పున నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు గ్రామాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈసారైనా మారుమూల ప్రాంతాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకుంటే ఆయా గ్రామాల ప్రజలు త్వరితగతిన అభివ ృద్ధి బాటపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
దత్తత గ్రామాలపై చర్చ..
Published Sat, Aug 15 2015 3:56 AM | Last Updated on Sun, Sep 3 2017 7:27 AM
Advertisement