Indra Karan Reddy
-
కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలిస్తాం... మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
ఆసిఫాబాద్: సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా భద్రాచలం, మహబూబాబాద్ తరువాత మూడో స్థానంలో కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పోడు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 24న జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనను పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్, బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాలు, జిల్లా పోలీస్ కార్యాలయంతోపాటు సీఎం సభ నిర్వహించనున్న స్థలాన్ని కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సురేశ్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఎమ్మెల్యే ఆత్రం సక్కుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్ పనులు పూర్తి చేసే విషయంపై కాంట్రాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 24న హెలీక్యాప్టర్ ద్వారా సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి చేరుకుంటారని తెలిపారు. పట్టణంలో కొత్తగా ఏర్పాటు చేసిన కొమురంభీం, దివంగత మంత్రి కొట్నాక భీమ్రావు విగ్రహాల ఆవిష్కరణ, ఎస్పీ కార్యాలయం ప్రారంభోత్సవం అనంతరం సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. సమయాభావం, సీఎం షెడ్యూల్‌కు అనుగుణంగా బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. కలెక్టరేట్లో ప్రారంభోత్సవానికి పనులు చురుకుగా సాగుతున్నాయన్నారు. సమీకృత కలెక్టరేట్లో 40 శాఖలకు చెందిన కార్యాలయాలతో పాటు స్టేట్ చాంబర్, మంత్రులు, వీవీఐపీలు వచ్చినప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహించేందుకు ప్రత్యేక చాంబర్లు నిర్మించినట్లు చెప్పారు. కొత్త భవనంలో వసతులతో అధికారులు 20నుంచి 30శాతం వరకు అధికంగా ఏకాగ్రతతో విధులు నిర్వహించే అవకాశం ఉంటుందన్నారు. వందేళ్ల క్రితం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా ఉన్నప్పటికీ అప్పుడు జరగని అభివృద్ధి ప్రస్తుతం జరుగుతోందని వివరించారు. జెడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్రావు, ఎంపీపీ అరిగెల మల్లికార్జున్, సింగిల్‌విండో చైర్మన్ అలీబిన్ అహ్మద్, ఏఎంసీ మాజీ చైర్మన్లు గాదెవేణి మల్లేశ్, చిలువేరు వెంకన్న, మాజీ ఎంపీపీ బాలేశ్వర్‌గౌడ్, డీఎస్పీలు శ్రీనివాస్, కరుణాకర్, సంబంధిత శాఖల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
కొమురెల్లి మల్లన్నకు 6.5 కిలోల బంగారు కిరీటం
సాక్షి, సిద్దిపేట: కోర మీసాల కొమురెల్లి మల్లన్న ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వనున్నారు. రూ.4 కోట్లు ఖర్చు చేసి 6.5కిలోల బంగారంతో కిరీటం తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీలు హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమయ్యారు. భక్తులు కానుకల రూపంలో అందించిన బంగారం, ఎస్బీఐ బాండ్ల ద్వారా వచ్చిన బంగారంతో కిరీటం తయారు చేయించేందుకు నిర్ణయించారు. దాని నమూనాను ఆవిష్కరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి సీఎం నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రులు తెలిపారు. -
ఇది అన్నదాతల విజయం
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైతులు సాగించిన ఉద్యమం ఫలితంగానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకుందని మంత్రులు ఎర్రబెల్లిదయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది అన్నదాతలు సాధించిన విజయమని వారు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు. రైతులకు మద్దతుగా... వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిం దని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందన్నారు. -
అటవీ నేరాల అదుపునకు రహస్య నిధి
సాక్షి, హైదరాబాద్: అటవీ నేరాలను మరింత సమర్థంగా అదుపు చేసేందుకు సీక్రెట్ రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అడవుల రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్‌ను అరికట్టడంపై సమాచారం ఇచ్చే వారిని ప్రోత్సహించడానికి ఈ నిధిని వినియోగిస్తామన్నారు. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్‌డీవో)కి రూ.2 నుంచి 3 లక్షలు, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)కి రూ.3 నుంచి 7 లక్షలు, చీఫ్ కన్జర్వేటర్‌కు రూ. 5 నుంచి 13 లక్షలు, పీసీసీఎఫ్‌కు రూ.50 లక్షల వరకు.. సమాచారం విలువ ఆధారంగా ఆయా వ్యక్తులకు పారితోషికాలు ఇచ్చేందుకు అధికారం ఉంటుందన్నారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అటవీ శాఖ కార్యకలాపాలపై జరిగిన వర్క్‌షాప్‌లో పచ్చదనం పెంపు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్‌ను అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధిపై చర్చ జరిగింది. -
సాక్షి తో ఇంద్రకరణ్ రెడ్డి ఫోన్ ఇన్
-
దాతల సహాయం కూడా తీసుకోండి: ఎర్రబెల్లి
సాక్షి, సంగారెడ్డి: దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. శనివారం సంగారెడ్డి జిల్లా హరితహారం కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సహా ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా వాటిని అధిగమించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాక ముందు 9 గంటలు విద్యుత్ వచ్చేదని ఇప్పుడు 24 గంటలు విద్యుత్ అందించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 2016 నుంచి ప్రతి ఇంటికి నల్లా ఇచ్చిన ఘనత తమ ప్రభుత్వానిదే అని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తమకు ప్రాతినిథ్యం కలగలేదని సర్పంచ్‌లు ఆందోళన వ్యక్తం చేశారని ఎర్రబెల్లి అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పంచాయతిరాజ్ చట్టంలోమార్పులు చేసి ఉద్యోగుల సరిగ్గా పని చేస్తున్నారా లేదా చూసే బాధ్యతను సర్పంచ్ లకు అప్పగించిందని అన్నారు. ఒకవేళ సర్పంచ్‌లు సరిగ్గా విధులు నిర్వహించకపోతే తీసివేసే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నట్లు ఆయన అన్నారు. హరితహారంలో భాగంగా సర్పంచ్‌లు కేవలం ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా సొంత గ్రామాలలో దాతల సహాయం తీసుకోవాలని సర్పంచులకు సూచించారు. మొక్కలు నాటే బాధ్యతను 80 శాతం పూర్తి చేసిన గ్రామాన్ని దత్తత తీసుకుంటామని ఎర్రబెల్లి తెలిపారు. అడవులు అంతరించిపోయి కోతులు ఊర్లకు వస్తున్న స్రస్తుత తరుణంలో హరితహారాన్ని పెంచే విధంగా ప్రజా ప్రతినిధులు, సమాజం కృషి చేయాలని ఎర్రబెల్లి సూచించారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ... టీడీపీ, కాంగ్రెస్ పాలనలో అడవులను, పర్యావరణాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. అటవీశాఖలో నిధులు కేటాయించామని అన్ని గ్రామాల్లో మొక్కలు పెంచాలని సూచించారు. ఇక జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ 657గ్రామపంచాయతీలలో 1లక్ష 50 వేల మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నామని, దాదాపు 3 లక్షలు మొక్కలు నాటి కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ అడవులు అంతరించిపోయి వర్షాలు లేని ప్రస్తుత తరుణంలో మొక్కలు నాటడం ఎంతో అవసరం అని అన్నారు. రేపటి తరాలకు ఆక్సిజన్ అందించాలంటే అందరు మొక్కలు నాటాలని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా సింగూరుకు నీటిని అందిస్తామని ఇంద్రకరణ్ హామీ ఇచ్చారు. వీటితో పాటు రెండు పడకల ఇళ్ళకు మంత్రి నిధులు మంజూరు చేశారు. ఇంకా ఈ కర్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. -
సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం
సాక్షి, బాసర : బాసర ట్రిపుల్ఐటీ విశ్వవిద్యాలయాన్ని సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ ఎస్పీ శశి ధర్ రాజులు కలిసి సందర్శించారు. మంత్రి మా ట్లాడుతూ విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి రవి వరాలను విధులు నుంచి శాశ్వతంగా తొలగించి కేసులు నమోదు చే యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కళా శాలలో ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుం డా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వారి వల్ల కళాశాల మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కళాశాలలో 60 శాతం బాలికలే ఉన్నందువల్ల ట్రిపుల్ఐటీకి ప్రత్యేక మహిళా ఎస్సైని నియమించాలని జిల్లా ఎస్పీ శశిధర్‌రాజుకు సూచిం చారు. కళాశాలలో విద్యార్థినులపై వే« దింపులు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన మహిళ వార్డేన్ నందినిని మంత్రి అభినందించారు. కళాశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం.. ఔట్ గేట్ సెక్యూరిటీ గార్డులపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలోని సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటికి పంపిస్తారని మందలించారు. కళాశాలలోని ప్రత్యేక చాంబర్లో పరి పాలన అధికారి శ్రీహరితోపాటు టీచించ్, నాన్ టీచింగ్ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. భైంసా డీఎస్పీ రాజేష్‌భ ల్లా, ముథోల్ సీఐ శ్రీనివాస్, బాసర ఎస్సై రాజు, బాసర సర్పంచ్ లక్ష్మన్‌రావు, కిర్గుల్ సర్పంచ్ సు ధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, కళాశాల పరిపాలనాధికారి శ్రీహరి, నాయకులు కోర్వశ్యాం, దేవేందర్, ట్రిపుల్ఐటీ అధికారులు ఉన్నారు. -
నిర్మల్ పై మనసు పెట్టమ్మా.!
సాక్షి, నిర్మల్: ఈ ప్రాంతవాసుల రవాణా సౌకర్యం మెరుగు పర్చేందుకు ఆదిలాబాద్–నిర్మల్–ఆర్మూర్‌లను కలుపుతూ రైల్వేలైన్ నిర్మించాలని ఉమ్మడి జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో అప్పటి కేంద్ర రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ప్రభును కలిశారు. ఈ రైల్వేలైన్ నిర్మాణంలో సగం వాటా భరిస్తామంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఇచ్చిన లేఖను ఆయనకు అందించారు. రాష్ట్రం సగం ఖర్చుకు ముందుకు రావడంతో కేంద్రం కూడా వెంటనే పచ్చజెండా ఊపింది. దాదాపు రూ.2,720 కోట్లతో నిర్మాణానికి ముందుకు వచ్చింది. కానీ.. ఇప్పటి వరకు రైల్వేశాఖ ఒక్కపని కూడా చేపట్టలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ(మెమోరాండమ్ ఆఫ్ అండర్ స్టాండింగ్) కూడా కుదుర్చుకోలేదు. రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ఏడాది క్రితం సికింద్రాబాద్, నాందేడ్‌లలో పలుమార్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులతో రాష్ట్ర ఎంపీలు భేటీ అయ్యారు. ఇందులో ఆర్మూర్ – నిర్మల్ –ఆదిలాబాద్ లైన్ నిర్మాణాన్నీ లేవనెత్తారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంటామని అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ ముందడుగు పడలేదు. ఎప్పటి నుంచో ఉంది.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అగ్రభాగాన ఉన్న ఆదిలాబాద్‌కు హైదరాబాద్ నుంచి నేరుగా రైల్వేలైన్ నిర్మించాలనే ప్రతిపాదన దశాబ్ధాల క్రితం నుంచి ఉంది. ప్రస్తుత మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడే పీవీ నర్సింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చారు. రాష్ట్ర రాజధాని సమీపంలోని పటాన్చెరువు నుంచి ఆదిలాబాద్‌కు వయా ఆర్మూర్, నిర్మల్ మీదుగా పారిశ్రామిక–వెనుకబడిన ప్రాంతాలను కలుపుతూ రైల్వేలైన్ వేయాలని నిర్ణయించారు. 2009 రైల్వే బడ్జెట్లోనే లైన్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. జాతీయ రహదారి వెంట ఈ లైన్ నిర్మించాలన్న ప్రతిపాదనలూ చేశారు. కొన్నేళ్లకు సర్వే కూడా పూర్తిచేశారు. తీరా.. 317 కిలోమీటర్ల దూరభారంగా ఉన్న ఈ లైన్ నిర్మాణానికి రూ.3,771కోట్లు పెట్టడం లాభదాయకం కాదేమో.. అంటూ అప్పట్లో రైల్వేశాఖ చేతులెత్తేసింది. ఆ తర్వాత ఏళ్లు గడిచిపోయాయి. ఈ లైన్నిర్మాణం మూలనపడింది. మళ్లీ రెండున్నరేళ్ల కిందట అప్పటి మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, అప్పటి ఎంపీ నగేశ్‌లు పట్టుబట్టి సీఎం కేసీఆర్‌ను సగం వాటా భరించేందుకు ఒప్పించారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్లి అప్పటి కేంద్రం రైల్వేమంత్రి సురేశ్ప్రభుతోనూ పచ్చజెండా ఊపించారు. ఈసారి పటాన్చెరు నుంచి కాకుండా పెద్దపల్లి–నిజామాబాద్ రైల్వేమార్గంలో ఉన్న ఆర్మూర్ నుంచి నిర్మల్ మీదుగా ఆదిలాబాద్ వరకు 137కి.మీ. రైల్వేలైన్ వేస్తే సరిపోతుందని తేల్చారు. కేంద్రం 2017లో పచ్చజెండా ఊపినా రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ తర్వాత ఈ అంశంపై ఎలాంటి స్పందన కూడా చూపలేదు. ప్రతిసారి కేంద్ర బడ్జెట్ వచ్చినప్పుడల్లా రైల్వేలైన్ తెరపైకి వస్తూనే ఉంది. ఈఎస్ఐ కూడా.. రైల్వేలైన్‌తో పాటు జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. మూడేళ్ల కిందటే అప్పటి కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న బండారు దత్తాత్రేయను కలిసి విన్నవించారు. ఈ మేరకు ఆయన నిర్మల్‌లో ఈఎస్ఐ ఆస్పత్రితో పాటు భైంసాలో డిస్పెన్సరీ మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం ఈఎస్ఐ అధికారులు జిల్లా కేంద్రానికి వచ్చారు. ఇక్కడి అధికారులు స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయ భవనాన్ని చూపించారు. దానిపై ఈఎస్ఐ అధికారులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత దత్తాత్రేయ మంత్రి పదవీ నుంచి దిగిపోవడంతో ఫైల్ పెండింగ్‌లో పడింది. మళ్లీ దీనిపై మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లి కొత్తగా బాధ్యతలు చేపట్టిన కేంద్రమంత్రి సంతోష్ గంగ్వార్‌ను కలిసి ఆస్పత్రి ఏర్పాటుపై వివరించారు. ఆయన కూడా సానుకూలంగా స్పందించినా ఇప్పటికీ ఈఎస్ఐ ఆస్పత్రి కోసం ముందడుగు పడలేదు. దీంతో పాటు బాసర్, భైంసాల మీదుగా బోధన్, బాన్సువాడల నుంచి సరిహద్దులో జాతీయ రహదారి నిర్మాణం పెండింగ్‌లోనే ఉంది. జిల్లాకు రావాల్సిన కేంద్రీయ విద్యాలయం ఇప్పటికీ ఊసు లేదు. ఈసారి ఆదిలాబాద్ నుంచి బీజేపీకే చెందిన ఎంపీ సోయంబాపురావు ఉండటంతో మళ్లీ ఆశలు చిగురించాయి. ఈసారైన కేంద్రం జిల్లాపై కరుణించాలని జిల్లావాసులు కోరుతున్నారు. రైల్వేలైన్ కోసం కృషి చేస్తా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజల ఆకాంక్షల మేరకు రైల్వేలైన్ నిర్మాణం విషయాన్ని కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. త్వరలోనే రైల్వేలైన్ నిర్మాణంపై కదలిక తీసుకువచ్చేలా, రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేయించడంపైనా కృషిచేస్తాను. దీంతో పాటు ఇతర కేంద్ర పథకాలను తీసుకువచ్చేందుకు నావంతు ప్రయత్నం చేస్తాను. – సోయం బాపురావు, ఎంపీ, ఆదిలాబాద్ -
భావోద్వేగానికి లోనైన ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తనకు మంత్రి పదవి దక్కడంపై ఎర్రబెల్లి దయాకర్ రావు భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలను అందరిని కలుపుకొని వెళ్తానని, జిల్లా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తానని చెప్పారు. ‘ఎన్టీఆర్ నాకు మంత్రి పదవి ఇస్తానని అన్నారు కానీ లక్ష్మీపార్వతి వల్ల రాలేదు. చంద్రబాబు నన్ను మంత్రిని చేస్తానని మాటతప్పారు. కేసీఆర్ నాకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. వరంగల్ జిల్లాకు పెండింగ్ లో ఉన్న రింగ్ రోడ్డు, టెక్స్ టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పీ నీళ్లు తేచ్చేందుకు కృషిచేస్తా. సీనియర్ నాయకులు కడియం శ్రీహరి, చందూలాల్, మధుసూదనాచారిలను కలుపుకొని వారి అనుభవంతో ముందుకు వెళతా. వరంగల్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ శ్రేణులకు అండగా ఉంటాన’ని ఎర్రబెల్లి అన్నారు. అరుదైన గౌరవమని: కొప్పుల ఈశ్వర్ తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా చోటు దక్కడం ఆనందంగా ఉందని కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఉద్యమ నాయకుడిగా తనకిది అరుదైన గౌరవమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి తన మీద పెట్టిన నమ్మకాన్ని నెరవేరుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్టీకి, ప్రభుత్వానికి జవాబుదారిగా పనిచేస్తానని చెప్పారు. (నేడే కేసీఆర్ కేబినెట్ విస్తరణ) కేసీఆర్‌కు కృతజ్ఞతలు: ఇంద్రకరణ్ రెడ్డి తనపై నమ్మకం ఉంచిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇంద్రకరణ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. మొదటి ఐదేళ్లలో కేసీఆర్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. బంగారు తెలంగాణ కల సాకారం చేసేందుకు సమిష్టిగా పనిచేస్తామన్నారు. కార్యకర్తల కృషి వల్లే తనకు మంత్రి పదవి దక్కిందన్నారు. నిర్మల్ నియోజకవర్గ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు. ముఖ్యమంత్రి తనకు ఏ శాఖ అప్పగించిన శిరసావహిస్తానని స్పష్టం చేశారు. -
ఆనాడే తుపాకీ పట్టేవాడిని
సాక్షి, హైదరాబాద్: ‘అసోంలో ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న నా సోదరుడిని ఆఫీసులోనే బాంబు పేల్చి పొట్టనబెట్టుకున్నారు. నాకు ధైర్యం ఉండి ఉంటే అప్పుడే తుపాకీ పట్టేవాడిని. అదే జరిగి ఉంటే ఉగ్రవాదినని నా కోసం పోలీసులు లుక్ఔట్ నోటీసు ఇచ్చి ఉండేవారు’అని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. తన సోదరుడి హత్య కేసును సీబీఐ, కోర్టులు దర్యాప్తు చేసినా నిందితులందరూ శిక్ష పడకుండానే తప్పించుకున్నారని, ఇలాంటి సందర్భాల్లోనే న్యాయం లభించినట్లు కనబడాలని, సత్వర తీర్పుల ద్వారా న్యాయం గెలిచిందనే భావన ప్రజలకు తెలియాలని చెప్పారు. సమాజ శ్రేయస్సులో న్యాయ వ్యవస్థది కీలకపాత్ర అన్నారు. శనివారం హైదరాబాద్ శివారులోని షామీర్పేట నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 16వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సత్వర న్యాయం లభించడం లేదని చాలా మంది విమర్శిస్తుంటారని, వాస్తవానికి కోర్టుల్లో పని భారం ఎక్కువగా ఉందని చెప్పారు. ఖాళీగా ఉన్న జడ్జీల పోస్టుల్ని భర్తీ చేయాలన్నారు. నేటి పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలకు చేయదలిస్తే.. సమాజ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. కొన్ని నిర్ణయాల వల్ల కొద్ది మంది నష్టపోవచ్చని, కానీ ఇలాంటి సందర్భాల్లో విస్తృత సమాజ శ్రేయస్సు ముఖ్యమన్నారు. రాజ్యాంగానికి రక్షణ కవచం న్యాయ వ్యవస్థ లా పట్టాలు పొంది బయటకు వెళుతున్న విద్యార్థులకు అనేక సవాళ్లు ఎదురవుతాయని.. క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా, రాగద్వేషాలకు అతీతంగా పనిచేయాలని గవర్నర్ సూచించారు. దేశ ప్రధాని (ఇందిరాగాంధీ పేరు ప్రస్తావించలేదు) హత్య జరిగినపుడు నిందితుల తరఫున ఎందుకు వాదించాలని ప్రశ్నించే వారుంటారని, వారి వాదన చెప్పుకునే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని అన్నారు. ‘డబ్బున్న నిందితుడికి గుండెపోటు వస్తే ఆస్పత్రిలో చేరుస్తారని, పేదవాడికి జైలులోనే వైద్యం చేస్తారని, కొన్ని కేసుల్లో మీడియా చూపించే వార్తలు న్యాయ విచారణపై ప్రభావం చూపుతున్నాయని, ఇలా వాస్తవానికి దగ్గరగా ఉన్నట్లు ఎంతో మంది ప్రశ్నలు వేస్తారు. కానీ క్షేత్ర స్థాయిలో నిజానిజాలు బేరీజు వేసుకుని నైతిక విలువలకు కట్టుబడి పని చేయాలి’అని విద్యార్థులకు సూచించారు. రాజ్యాంగానికి రక్షణ కవచంలా న్యాయ వ్యవస్థ ఉందని.. అది దెబ్బతింటే అరాచకాలు, అన్యాయాలు పెరిగిపోతాయన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా చివరికి కోర్టుల దగ్గరకే వస్తారని, అలాంటి న్యాయ వృత్తిలోకి అడుగుపెట్టబోయే విద్యార్థులంతా నిత్య అధ్యయనం చేస్తూ ధైర్యంగా ముందడుగు వేయాలన్నారు. బంగారు పతకాల పంట కార్యక్రమంలో 409 మంది విద్యార్థులకు వివిధ న్యాయ శాస్త్ర పట్టాలను ప్రదానం చేశారు. 49 బంగారు పతకాలను ప్రదానం చేయగా ఎల్ఎల్బీ విద్యార్థిని తన్వీ తహిన 11.. కరణ్ గుప్తా, శుభ్రా త్రిపాఠి 6 చొప్పున అందుకున్నారు. దేశంలో 5వ స్థానంలో నల్సార్ దేశంలోని నాలుగు వందల వర్సిటీల్లో నల్సార్‌కు 5వ స్థానం లభించిందని నల్సార్ వైస్ చాన్స్‌లర్ పైజన్ ముస్తఫా చెప్పారు. తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసేటపుడు నల్సార్ తమ వంతు సహకారం అందిస్తోందని, ఎన్నికలకు సంబంధించిన అంశాలపై భారత ఎన్నికల సంఘంతో ఎంవోయూ కుదుర్చుకున్నామని వెల్లడించారు. నల్సార్ వర్సిటీ చాన్స్‌లర్, ఉమ్మడి తెలుగు రాష్ట్రాల హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టి.రాధాకృష్ణన్ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ప్రముఖ న్యాయ కోవిదుడు ప్రొఫెసర్ ఉపేంద్ర భక్షికి కార్యక్రమంలో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు. భక్షి మాట్లాడుతూ.. జీవించే హక్కు గురించి రాజ్యాంగంలో చిన్నగా ఉన్నా కోర్టులు విశాల భావజాలంతో తీర్పులు ఇచ్చాయని గుర్తు చేశారు. పర్యావరణ హితంగా సాగిన జీవనం.. ఇప్పుడు మనిషి మాత్రమే ముఖ్యమనే ధోరణిలో సాగుతోందని, రానున్న కాలంలో ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో పర్యావరణం ఒకటని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తులు జస్టిస్ ఎస్ఎస్ఎం ఖాద్రి, జస్టిస్ పి.వెంకట్రామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్పందన కుటుంబానికి మంత్రి పరామర్శ
సాక్షి, నిర్మల్ : సోన్ మండల కేంద్రంలో అత్యాచారానికి గురై హత్యకు గురైన చిన్నారి స్పందన కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. బాలిక కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా నిందితులు తోకల ప్రవీణ్, తోరపు గణేష్‌ల ఇళ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పందన మృతికి సంతాపంగా పాఠశాలను మూసివేయాలని గ్రామస్తులు ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. స్పందన అత్యాచారం, హత్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రజల సౌకర్యం కోసమే క్యాంపు కార్యాలయం
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తెలిపారు. బుధవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలో రూ.కోటి అంచనాతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు, నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు, టీఆర్ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల క్యాంపు, నివాస గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. దశలవారీగా వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, వ్యవసామ మార్కెట్ కమిటీటి చైర్మ సిలువేరి నర్సింగం, కలెక్టర్ ఆర్వీ.కర్ణన్, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్, మున్సిపల్ చైర్పర్సన్ పసుల సునీతారాణి, టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి అరిగెల నాగేశ్వర్రావు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. -
నిరుపేదలకు అండగా ప్రభుత్వం
దిలావర్పూర్(నిర్మల్): ఆడపిల్లల వివాహానికి ఆర్థికసాయం అందిస్తూ సీఎం కేసీఆర్ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో గురువారం దిలావర్పూర్, నర్సాపూర్(జి) మండలాలకు చెందిన 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆర్డీవో ప్రసూనాంబా మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ ఆడపిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయా లని సూచించారు. 18ఏళ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం మంత్రిని రైతులు సన్మానించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, ఏఎంసీ చైర్మన్ కె.దేవేందర్‌రెడ్డి, ఎంపీపీ పాల్దె లక్ష్మి, సర్పంచ్ నంద అనిల్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణగౌడ్, మండల కన్వీనర్ రాజేశ్వర్, నాయకులు రమణారెడ్డి, సంభాజీరావు, నర్సారెడ్డి, రేఖ, కవిత, రవి, నర్సయ్య, భూమన్న, మనేశ్, సుధాకర్‌రెడ్డి, గుణవంత్‌రావు, అనిల్, గంగారాం, భుజంగ్‌రావు, భూమేశ్ తదితరులు పాల్గొన్నారు. -
దత్తత గ్రామాలపై చర్చ..
♦ అదనంగా మండలానికో గ్రామం ఎంపిక ♦ నేడు సిద్ధం కానున్న జాబితా సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల దత్తత గ్రామాల ఎంపిక తీరుపై శుక్రవారం ‘సాక్షి’లో వచ్చిన మారు‘మూలకేనా..!’ కథనం సంబంధిత వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కనీస సౌకర్యాలకు నోచుకోని వందలాది గ్రామాలను కాకుండా పట్టణాలకు, నియోజకవర్గ కేంద్రాలకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామాలను దత్తత తీసుకోవడం ఒకింత విమర్శలకు దారితీసింది. ఈ విషయమై మంత్రులు జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి శుక్రవారం జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు సమాచారం. ఒకరిద్దరు మినహా జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులందరూ మారుమూల గ్రామాలను ఎంపిక చేయలేదు. ఈ దత్తత గ్రామాలను అభివ ృద్ధిలో ముందువరుసలో నిలపడం ద్వారా ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. మండలానికొకటి చొప్పున.. గ్రామజ్యోతి కార్యక్రమంలో ఇప్పటి మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గానికి ఒక గ్రామం చొప్పున దత్తత తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా మండలానికి ఒక గ్రామం చొప్పున నియోజకవర్గంలో ఎన్ని మండలాలుంటే అన్ని గ్రామాలను దత్తత తీసుకోవాలని ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు ఎమ్మెల్యేలు గ్రామాల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. ఈసారైనా మారుమూల ప్రాంతాలను దత్తత గ్రామాలుగా ఎంపిక చేసుకుంటే ఆయా గ్రామాల ప్రజలు త్వరితగతిన అభివ ృద్ధి బాటపట్టే అవకాశాలున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
ట్రిపుల్ ఐటీ సమస్యలు పరిష్కరిస్తా
బాసర : బాసర ట్రిపుల్ ఐటీ కళాశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తానని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బాసర ట్రీపుల్ ఐటీ కళాశాలను ఆదివారం ఆయన ముథోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ట్రిపుల్ ఐటీ కళాశాల విద్యార్థులు మార్వేల్ మెస్ నిర్వాహకులు సరైన భోజనం అందించడం లేదని ఆందోళనకు దిగిన నేపథ్యంలో వారు కళాశాలను సందర్శించారు. సుమారు 2 గంటలపాటు మెస్ కేఏంకే, మార్వేల్‌లోని కూరగాయాల స్టోరేజ్, వంట గదులు, విద్యార్థులకు అందిస్తున్న భోజనం తనిఖీ చేశారు. ఇంజినీరింగ్ ఈ2, ఈ3, ఈ4 విద్యార్థులతో మాట్లాడారు. మెస్ నిర్వాహకులు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదని విద్యార్థులు తెలిపారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. సీనియర్ విద్యార్థులు మార్వేల్ మెస్ తీరుపై, సమస్యలపై మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్‌లో కళాశాలలో మరో మెస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన ఆహారం అందించి సమస్యలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. మరో ఫిజికల్ డెరైక్టర్, ఫ్యాకల్టీ పోస్టులు భర్తీ చేస్తామని హామీనిచ్చారు. రూ.2 కోట్లు స్కాలర్షిప్ బకారుులు విడుదల చేయించేందుకు విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్తానని అన్నారు. నిర్మల్ ఆర్డీవో శివలింగయ్య, భైంసా డీఎస్పీ అందె రాములు, ట్రీపుల్ ఐటీ డెరైక్టర్ అప్పల నాయుడు, నాయకులు పీఏసీఎస్ ఛైర్మన్ సురేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్ రమేశ్, జెడ్పీటీసీ సభ్యుడు సావ్లీ రమేశ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు పోతన్న యాదవ్, బాసర మాజీ సర్పంచ్ రమేశ్, నూకం రామారావు, బాల్గాం దేవేందర్, పాల్గొన్నారు.