సాక్షి, బాసర : బాసర ట్రిపుల్‌ఐటీ విశ్వవిద్యాలయాన్ని సోమవారం రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, నిర్మల్ ఎస్పీ శశి ధర్ రాజులు కలిసి సందర్శించారు. మంత్రి మా ట్లాడుతూ విద్యార్థినులను వేధిస్తున్న కళాశాల కెమిస్ట్రీ విభాగాధిపతి రవి వరాలను విధులు నుంచి శాశ్వతంగా తొలగించి కేసులు నమోదు చే యడం జరిగిందని తెలిపారు. భవిష్యత్తులో కళా శాలలో ఇటువంటి చర్యలు పునరావృత్తం కాకుం డా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.
తులసి వనంలో గంజాయి మొక్కలాంటి వారి వల్ల కళాశాల మొత్తానికి చెడ్డ పేరు వస్తుందన్నారు. కళాశాలలో 60 శాతం బాలికలే ఉన్నందువల్ల ట్రిపుల్‌ఐటీకి ప్రత్యేక మహిళా ఎస్సైని నియమించాలని జిల్లా ఎస్పీ శశిధర్‌రాజుకు సూచిం చారు. కళాశాలలో విద్యార్థినులపై వే« దింపులు జరుగుతున్న విషయాన్ని గుర్తించిన మహిళ వార్డేన్ నందినిని మంత్రి అభినందించారు. కళాశాలలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.
సెక్యూరిటీ గార్డులపై మంత్రి ఆగ్రహం..
ఔట్ గేట్ సెక్యూరిటీ గార్డులపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కళాశాలలోని సంబంధిత అధికారుల అనుమతి లేకుండా విద్యార్థులను ఎలా బయటికి పంపిస్తారని మందలించారు. కళాశాలలోని ప్రత్యేక చాంబర్‌లో పరి పాలన అధికారి శ్రీహరితోపాటు టీచించ్, నాన్ టీచింగ్ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకులతో కలిసి హరితహారంలో పాల్గొన్నారు. భైంసా డీఎస్పీ రాజేష్‌భ ల్లా, ముథోల్ సీఐ శ్రీనివాస్, బాసర ఎస్సై రాజు, బాసర సర్పంచ్ లక్ష్మన్‌రావు, కిర్గుల్ సర్పంచ్ సు ధాకర్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు నర్సింగ్‌రావు, కళాశాల పరిపాలనాధికారి శ్రీహరి, నాయకులు కోర్వశ్యాం, దేవేందర్, ట్రిపుల్‌ఐటీ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment