
సాక్షి, హైదరాబాద్ : దేశవ్యాప్తంగా రైతులు సాగించిన ఉద్యమం ఫలితంగానే కేంద్రం మూడు వ్యవసాయ చట్టాల రద్దుకు నిర్ణయం తీసుకుందని మంత్రులు ఎర్రబెల్లిదయాకర్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది అన్నదాతలు సాధించిన విజయమని వారు వేర్వేరు ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య పద్ధతిలో రైతులు చేసిన సుధీర్ఘ పోరాటానికి కేంద్రం దిగిరాక తప్పలేదన్నారు.
రైతులకు మద్దతుగా... వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ చేపట్టిన ఉద్యమ సెగ ఢిల్లీకి తగిలిం దని తెలిపారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్‌ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా ఉంటుందని, వారి కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment