శిలాఫలకం ఆవిష్కరిస్తున్న మంత్రులు ఐకేరెడ్డి, జోగు రామన్న
బెల్లంపల్లి : అసెంబ్లీ నియోజకవర్గ ప్రజల సౌలభ్యం కోసమే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, నివాస గృహాలను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోందని మంత్రులు అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న తెలిపారు. బుధవారం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఏరియాలో రూ.కోటి అంచనాతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు, నివాస గృహానికి ప్రారంభోత్సవం చేశారు. అంతకుముందు ఎమ్మెల్యే దంపతులు, టీఆర్‌ఎస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఇతర నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేల క్యాంపు, నివాస గృహాల నిర్మాణాలు జరుగుతున్నాయని వివరించారు. దశలవారీగా వాటిని ప్రారంభోత్సవం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, నడిపెల్లి దివాకర్‌రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్, మహిళా శిశు సంక్షేమ శాఖ రీజినల్ కో ఆర్డినేటర్ అత్తి సరోజ, వ్యవసామ మార్కెట్ కమిటీటి చైర్మ సిలువేరి నర్సింగం, కలెక్టర్ ఆర్‌వీ.కర్ణన్, సబ్ కలెక్టర్ పీఎస్.రాహుల్‌రాజ్, మున్సిపల్ చైర్‌పర్సన్ పసుల సునీతారాణి, టీఆర్‌ఎస్ పార్టీ ఇన్‌చార్జి అరిగెల నాగేశ్వర్‌రావు, అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ నాయకులు, ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment