ఆదిలాబాద్‌రూరల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మా వల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ముందుగా ట్రాక్టర్లతో చేపట్టిన భారీలో పాల్గొన్నారు. అనంత రం ఆయన మాట్లాడారు. రైతు బాగుపడితే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రైతు ల సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమయిందన్నారు.
మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ అన్నదాతపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జెడ్పీటీసీ వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, నాయకులు ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు.
రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు
జైనథ్: సాగుకు కేవలం మూడు గంటల విద్యుత్ మా త్రమే చాలంటూ రైతాంగాన్ని కించపర్చిన రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు క్షమాపణలు చెప్పకపోవడం సి గ్గుచేటని ఎమ్మెల్యే రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment