![Minister Indrakaran Reddy Express condolence to Spandana Family - Sakshi](/styles/webp/s3/article_images/2018/06/18/Indra-karan-Reddy.jpg.webp?itok=PGAU9URD)
సాక్షి, నిర్మల్ : సోన్ మండల కేంద్రంలో అత్యాచారానికి గురై హత్యకు గురైన చిన్నారి స్పందన కుటుంబ సభ్యులను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. బాలిక కుటుంబానికి తన సానుభూతి వ్యక్తం చేశారు. ముందస్తు చర్యల్లో భాగంగా నిందితులు తోకల ప్రవీణ్, తోరపు గణేష్‌ల ఇళ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. స్పందన మృతికి సంతాపంగా పాఠశాలను మూసివేయాలని గ్రామస్తులు ఉపాధ్యాయులతో వాగ్వివాదానికి దిగారు. స్పందన అత్యాచారం, హత్యపై జిల్లా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. విద్యా సంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment