కిరీట నమూనాను ఆవిష్కరిస్తున్న మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్ రెడ్డి
సాక్షి, సిద్దిపేట: కోర మీసాల కొమురెల్లి మల్లన్న ఇక స్వర్ణ కిరీటంతో దర్శనమివ్వనున్నారు. రూ.4 కోట్లు ఖర్చు చేసి 6.5కిలోల బంగారంతో కిరీటం తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. మంత్రులు తన్నీరు హరీశ్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వరంగల్ జోన్ ఉప కమిషనర్ శ్రీకాంత్ రావు, ఆలయ ఈఓ బాలాజీలు హైదరాబాద్‌లో మంగళవారం సమావేశమయ్యారు.
భక్తులు కానుకల రూపంలో అందించిన బంగారం, ఎస్‌బీఐ బాండ్ల ద్వారా వచ్చిన బంగారంతో కిరీటం తయారు చేయించేందుకు నిర్ణయించారు. దాని నమూనాను ఆవిష్కరించారు. కొమురవెల్లి మల్లన్న ఆలయ అభివృద్ధికి సీఎం నేతృత్వంలో మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని మంత్రులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment