సాక్షి, హైదరాబాద్: అటవీ నేరాలను మరింత సమర్థంగా అదుపు చేసేందుకు సీక్రెట్ రిజర్వ్ ఫండ్‌ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం సీఎం కేసీఆర్ రూ.4.06 కోట్లు కేటాయించినట్లు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. అడవుల రక్షణ, ఆక్రమణల నివారణ, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్‌ను అరికట్టడంపై సమాచారం ఇచ్చే వారిని ప్రోత్సహించడానికి ఈ నిధిని వినియోగిస్తామన్నారు.
ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్‌డీవో)కి రూ.2 నుంచి 3 లక్షలు, జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో)కి రూ.3 నుంచి 7 లక్షలు, చీఫ్ కన్జర్వేటర్‌కు రూ. 5 నుంచి 13 లక్షలు, పీసీసీఎఫ్‌కు రూ.50 లక్షల వరకు.. సమాచారం విలువ ఆధారంగా ఆయా వ్యక్తులకు పారితోషికాలు ఇచ్చేందుకు అధికారం ఉంటుందన్నారు. సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో అటవీ శాఖ కార్యకలాపాలపై జరిగిన వర్క్‌షాప్‌లో పచ్చదనం పెంపు, వన్యప్రాణుల వేట, స్మగ్లింగ్‌ను అరికట్టడం, అర్బన్ ఫారెస్ట్ పార్క్‌ల అభివృద్ధిపై చర్చ జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment