నన్ను ఎవరూ ఆహ్వానించలేదు
- గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ప్రాతినిధ్యమే లేదు
- ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి
నల్లగొండ : ప్రభుత్వ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన గ్రామజ్యోతి కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఎలాంటి ప్రాతినిధ్యం కల్పించలేదని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించారు. 14 తేదీన మంత్రి జగదీశ్‌రెడ్డి నిర్వహించిన సమీక్ష సమావేశంలో తాము ఇచ్చిన సలహాలు, సూచనలను ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం ఆగమేఘాల మీద జీఓలు జారీ చేసి కార్యక్రమాన్ని అమలు చేస్తుందని ఆ రోపించారు. సోమవారం నల్లగొండలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి సమీక్షలో కేవలం గ్రామాలను దత్తత తీసుకోవాలని చెప్పారే తప్పా నిధులు, విధుల విషయం లో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదన్నారు.
ఎంపీ హోదాలో గతంలోనే తాను ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నానని కాబట్టి దాని అభివృద్ధి పైనే దృష్టి సారిస్తానని చెప్పారు. గ్రామజ్యోతి కార్యక్రమానికి తనను ఎవ రూ ఆహ్వానించలేదు కాబట్టి ఎక్కడా తాను పాల్గొనలేదని ఓ ప్రశ్నకు ఎంపీ బదులిచ్చారు. పార్టీలకతీతంగా చేపట్టాల్సిన గ్రామజ్యోతిని అందుకు భిన్నంగా నిర్వహిస్తున్నారన్నారు. గ్రామ కమిటీ ల్లో టీఆర్‌ఎస్ నాయకులనే సభ్యులుగా నియమిస్తున్నారని చెప్పారు.గ్రామజ్యో తి కార్యక్రమానికి నయాపైసా విడుదల చేయలేదన్నారు. ప్రజలను మభ్యపెట్టకుండా ప్రభుత్వం కళ్లు తెరిచి వాస్తవ పరిస్థితులను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీపీ పాశం రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.