
గుడ్డిగా విమర్శిస్తున్నారు
విపక్ష నేతలపై మంత్రి జోగురామన్న ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేయడమే విపక్షాలు పని గా పెట్టుకున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. దేశం లో ఎక్కడా లేని విధంగా బీసీ సంక్షేమానికి నిధులు వెచ్చిస్తూ సంక్షేమ పథకాల అమల్లో అగ్రగామిగా రాష్ట్రం కొనసాగుతుంటే.. బీసీల ను ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ వర్గాల నుంచి ప్రధానిగా ఎదిగిన మోదీ హయాంలో వారి కోసం ఒక్క పథకమైనా మొదలుపెట్టకపోవడం బీసీలపై కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని బీజేపీ నాయ కులు.. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో బీసీల కోసం రూ.7,365 కోట్లు కేటాయించి, ఇప్ప టివరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
బీసీ హాస్టళ్లకు వెంటనే రగ్గులు
బీసీ హాస్టళ్లు, గురుకులాల్లోని విదార్థులకు వెంటనే రగ్గులు పంపిణీ చేయాలని అధికా రులను మంత్రి ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లోని కాం ట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల వేతనాలు పెం చాలని సంబంధిత అధి కారులకు సూచించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలపై మంగళవారం సచి వాలయంలో మంత్రికి బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. బీసీ స్టడీ సర్కిళ్లలోని హాస్టళ్లలో బీసీల సీట్లను 90 శాతానికి పెంచాలని, సంక్షేమ విద్యార్థుల ఫీజు బకారుులు రూ.2,090 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు.
నేడు మెక్సికో కాప్ సదస్సుకు మంత్రి
మెక్సికోలో జరగనున్న కన్వెన్షన్ ఆన్ బయో లాజికల్ డైవర్సిటీ (కాప్-13) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జోగురామన్న బుధ వారం రాత్రి బయలుదేరనున్నారు. ఈ నెల 9 నుంచి 10 రోజుల పాటు మెక్సికోలోని కాన్‌కన్ నగరంలో జరగనున్న ఈ సదస్సులో మంత్రితో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ సి.సువర్ణ పాల్గొంటారు.