
రూ.11,405 కోట్లు కేటాయింపు
2024–25 బడ్జెట్‌తో పోలిస్తే రూ.2,200 కోట్లు పెరుగుదల
నాలుగు సంక్షేమ శాఖలకు కలిపి రూ.34,079 కోట్లు ప్రతిపాదన
రాజీవ్ యువ వికాసానికి రూ.6 వేల కోట్లు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖకు తాజా బడ్జెట్ భారీ ఊరటనిచ్చింది. 2025– 26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.11,405 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన అవసరాల కోసం రూ.1,008 కోట్లు కేటాయించగా.. సంక్షేమ పథకాల కోసం రూ.10,397 కోట్లు కేటాయించారు. 2024–25 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు రూ.9,200.32 కోట్లు కేటాయించగా ప్రస్తుతం రూ.2,204 కోట్లు అదనంగా ప్రతిపాదించారు.
వివిధ కులాలకు చెందిన ఒక్కో ఆర్థిక సహకార సంస్థకు రూ.50 కోట్లు చొప్పున కేటాయించారు. వడ్డెర, కృష్ణబలిజ, వాల్మీకి బోయ, భట్రాజు, విశ్వబ్రాహ్మణ, శాలివాహన, కల్లుగీత, సగర, నాయీబ్రాహ్మణ, వాషర్‌మెన్, ముదిరాజ్, కుమ్మర, మున్నూరుకాపు, పద్మశాలి, పెరిక, లింగాయత్, మేర, గంగపుత్ర కార్పొరేషన్లకు నిధులు ప్రతిపాదించారు. రజక, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్లకు విద్యుత్ చార్జీల రాయితీకి రూ.100 కోట్లు చొప్పున కేటాయించారు. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.400 కోట్లు కేటాయించారు.
‘రాజీవ్ యువ వికాసం’తో స్వయం ఉపాధి
4 ప్రధాన సంక్షేమ శాఖలకు తాజా బడ్జెట్లో రూ.34,079 కోట్లు కేటాయించారు. ఇందులో బీసీ శాఖకు రూ.11,405 కోట్లు, ఎస్సీడీడీకి రూ.11,561 కోట్లు, గిరిజన సంక్షేమానికి రూ.7,522 కోట్లు, మైనార్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. షెడ్యూల్డ్ కులాల అభి వృద్ధి శాఖకు తాజా బడ్జెట్లో రూ.11,561 కోట్లు కేటా యించారు. ఇందులో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురు కుల విద్యా సంస్థల సొసైటీకి రూ.4,394.68 కోట్లు కేటా యించారు. దళితబంధు పథకానికి (అంబేడ్కర్ అభయ హస్తం) రూ.1,000 కోట్లు ప్రతిపాదించారు.
గతేడాది రూ.2 వేల కోట్లు ప్రతిపాదించినప్పటికీ నిధులు విడుదల చేయకపోవడం గమనార్హం. కాగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖకు రూ.7,522 కోట్లు కేటాయించారు. గిరిజన గురు కుల సొసైటీకి రూ.667.89కోట్లు ప్రతిపాదించారు. మైనా ర్టీ సంక్షేమ శాఖకు రూ.3,591 కోట్లు కేటాయించారు. గత బడ్జెట్‌తో పోలిస్తే మైనార్టీ సంక్షేమానికి రూ.589 కోట్లు అధికంగా కేటాయించారు.
రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజీవ్ యువ వికాసాన్ని కొత్తగా ఆవిష్కరించింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.6వేల కోట్లు కేటాయించింది. సంక్షేమ శాఖలకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా రాయితీ పద్ధతిలో ప్రభుత్వం ఆర్థిక సహకారాన్ని అందించనుంది
రాష్ట్ర మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖకు ఈసారి బడ్జెట్‌లో రూ.2,862 కోట్లు కేటాయించారు. ఇందులో శాఖాపరమైన నిర్వహణకు రూ.973 కోట్లు, సంక్షేమ పథకాల కోసం రూ.1,888 కోట్లు కేటాయించారు.
కార్మిక సంక్షేమ శాఖకు రూ.900 కోట్లు కేటాయించారు. ఇందులో నిర్వహణ కింద రూ.479 కోట్లు, పథకాల కింద రూ.421 కోట్లు ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment