BC Welfare Department
-
బీసీ రుణాలపై 2014 నుంచి ఆడిట్ చేయండి
సాక్షి, అమరావతి: బీసీ రుణాలపై ఆడిట్ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. బీసీ కార్పొరేషన్ ద్వారా 2014 నుంచి రుణాలు తీసుకొని లబ్ధి పొందిన వారి సమాచారాన్ని సేకరించాలని చెప్పారు. వృత్తి ప్రామాణికంగా రుణాలు తీసుకున్న వారు ఎంత మంది వృత్తి కొనసాగిస్తున్నారో కూడా ఆడిట్ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం బీసీ సంక్షేమ శాఖపై సీఎం సమీక్ష చేశారు. బీసీలకు స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్ల పునరుద్ధరణకు కేబినెట్లో ఆమోదం తెలిపామని, అవసరమైతే న్యాయ పోరాటం చేయాల్సి ఉందని తెలిపారు.ఆ హత్యలపై వేగంగా విచారణవైఎస్సార్సీపీ హయాంలో బీసీలను ఊచకోత కోశారని, ఆ హత్యలపైనా విచారణ వేగవంతం చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం చెప్పారు. అవసరమైతే ఇందుకు ప్రత్యేక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. సబ్ కమిటీ నివేదిక రాగానే బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 2014–19 మధ్య జిల్లా కేంద్రాల్లో 13 కాపు భవనాలను మంజూరు చేసి, ఐదింటి నిర్మాణాలను ప్రారంభించామని, తర్వాత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిలిపేసిందని అన్నారు. ఇప్పుడు వాటి నిర్మాణానికి మళ్లీ నిధులు విడుదల చేసినట్లు చెప్పారు.బీసీ హాస్టల్స్ ట్యూటర్స్ బకాయిలు విడుదల485 హాస్టల్స్‌లో ట్యూటర్స్ గౌరవ వేతనం బకాయిలు రూ.4.35 కోట్లు విడుదలకు అనుమతి ఇచ్చారు. డైట్ ఛార్జెస్ బకాయిలు రూ.185.27 కోట్లలో రూ.110.52 కోట్లు చెల్లించడానికి సీఎం అంగీకారం తెలిపారు. కాస్మోటిక్ బిల్లులు రూ.29 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. సత్యసాయి జిల్లాలోని నసనకోట, ఆత్మకూరు బీసీ సంక్షేమ బాలికల పాఠశాలలను రెసిడెన్షియల్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కుప్పంలోనూ బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ఈ సమీక్షలో మంత్రి ఎస్.సవిత, అధికారులు పాల్గొన్నారు. సంజీవయ్య ప్రస్థానం స్ఫూర్తిదాయకంమాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా ఉండవల్లి నివాసంలో ఆయన చిత్రపటానికి సీఎం చంద్రబాబు పూలమాల వేసి నివాళులరి్పంచారు. కాగా అన్నమయ్య జిల్లాలో ప్రేమోన్మాది యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయించడానికి సీఎం చంద్రబాబు విశాఖ ఎంపీ భరత్, ఎమ్మెల్సీ చిరంజీవిరావు, ఏఎస్ రామకృష్ణలతో త్రిసభ్య కమిటీ ఏర్పాటుచేశారు.ప్రతి పౌరుడు భాగస్వామి కావాలి స్వచ్చాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో పరిశుభ్రత పెంచేందుకు, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు అమలు చేస్తున్న కార్యాచరణపై సీఎం శుక్రవారం సమీక్ష చేశారు. ప్రతి నెల 3వ శనివారం ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తోందన్నారు. స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో భాగంగా 14 ఇండికేటర్స్ ఆధారంగా జిల్లాలకు ర్యాంకులను సీఎం ప్రకటించారు. మొత్తం 200 పాయింట్లకు గాను 129 పాయింట్లతో ఎనీ్టఆర్ జిల్లా మొదటి స్థానంలో, 127 పాయింట్లతో విశాఖ జిల్లా రెండో స్థానంలో, 125 పాయింట్లతో తూర్పు గోదావరి మూడో స్థానంలో నిలిచాయి. -
120 సమీకృత గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సమీకృత గురుకులాల నిర్మాణానికి వెంటనే ఆయా నియోజకవర్గాల్లో స్థలాలు సేకరించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.5 వేల కోట్లతో 30 ప్రాంతాల్లో 120 సమీకృత గురుకులాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సాధ్యమైనంత త్వరగా స్థలాల సేకరణతో పాటు, భవనాల నమూనాలు (డిజైన్లు) పూర్తి చేయాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 25 ఎకరాల్లో, పట్టణ ప్రాంతాల్లో 10 నుంచి 15 ఎకరాల్లో సమీకృత గురుకుల పాఠశాలల ఏర్పాటు కోసం స్థల సేకరణ చేయాలని చెప్పారు. రాబోయే ఎడెనిమిది నెలల్లో ఈ భవనాలను పూర్తి చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సోమవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ గురుకుల పాఠశాలల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని, అందుకు తగ్గట్టుగా అధికారుల పనితీరు ఉండాలని సూచించారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలు వందశాతం పూర్తి చేయాలని చెప్పారు. ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకోవాలి ఈ ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి మంచం పైనే పడుకునేలా చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని భట్టి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న 1,029 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు ఇప్పటివరకు మంచాలు, పరుపులు, దుప్పట్లు ఎన్ని ఉన్నాయి? ఇంకా ఎంతమందికి ఇవి కావాలి అనే దానిపై వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు. ప్రతి గురుకుల పాఠశాలలతో పాటు ప్రభుత్వ హాస్టళ్లలో విద్యార్థులకు తప్పనిసరిగా మరుగుదొడ్లు, స్నానాల గదులు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం ఉండేలా చూడాలని, వసతి గదులకు తలుపులు, కిటికీలు, దోమలు రాకుండా వాటికి మెష్‌లు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులకు సౌకర్యాల కల్పనపై చెక్ లిస్టు రూపొందించి ఈనెల 29వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు. చెక్ లిస్టును ప్రతి హాస్టల్లో ప్రదర్శించాలన్నారు. ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తాం విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ రెండో విడత నిధులను వెంటనే విడుదల చేయాలంటూ మంత్రి పొన్నం చేసిన విజ్ఞప్తిపై డిప్యూటీ సీఎం సానుకూలంగా స్పందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలో పెండింగ్‌లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్íÙప్ బకాయిల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 800 మంది బీసీ విద్యార్థులకు, 500 మంది చొప్పున ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. పెద్దాపూర్ పాఠశాలపై సమీక్ష జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలను తాము సందర్శించిన తర్వాత అక్కడ తీసుకున్న చర్యలపై గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ను డిప్యూటీ సీఎం ఆరా తీశారు. విద్యార్థులకు మంచాలు, పరుపులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల మైదానం చదును చేయాలని, నూతన భవనాల నిర్మాణం కోసం కావాల్సిన ప్రతిపాదనలు పంపించాలని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. -
‘విదేశీ విద్య’కు నిధి ఏది?
నల్లగొండ జిల్లాకు చెందిన స్వాతి (పేరుమార్చాం) 2019–20 సంవత్సరంలో విద్యానిధి పథకానికి అర్హత సాధించి అమెరికాకు వెళ్లి ఎంఎస్ చేసింది. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత సర్టిఫికెట్లు అన్నీ వెబ్సైట్లో అప్లోడ్ చేసి అధికారులను పలుమార్లు సంప్రదిస్తే తొలివిడత సాయం కింద రూ.10 లక్షలు అందాయి. రెండో సంవత్సరం కోర్సు పూర్తి చేసి దాదాపు మూడు సంవత్సరాలు కావొస్తున్నా ఇప్పటివరకు రెండో విడత సాయం రూ.10 లక్షలు ఇంకా అందలేదు. ఇప్పటివరకు దాదాపు ఇరవైసార్లు బీసీ సంక్షేమ శాఖ అధికారుల చుట్టూ తిరిగినా, ఎప్పుడిస్తారనే దానిపై సరైన సమాధానం రాలేదు.సాక్షి, హైదరాబాద్: విదేశీ విద్యానిధి బకాయిల చెల్లింపులపై నీలినీడలు కమ్ముకున్నాయి. బకాయిలు రూ.100 కోట్లకు పైగా ఉండగా, ఈ బడ్జెట్లో కేవలం రూ.80 కోట్లే కేటాయించారు. దీంతో బకాయిల చెల్లింపుల ప్రక్రియ అటకెక్కినట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పథకం కింద అర్హత సాధించి విదేశాలకు వెళ్లి కోర్సు పూర్తి చేసినా, ఆ విద్యార్థులకు ఇంకా రెండోవిడత ఆర్థికసాయం అందనే లేదు. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి విద్యానిధి నిధుల విడుదల నెమ్మదించింది. దీంతో బీసీ సంక్షేమశాఖ తనవద్ద ఉన్న నిధుల లభ్యతకు అనుగుణంగా విద్యార్థులకు మొదటివిడత సాయాన్ని అందిస్తూ రాగా... క్రమంగా రెండోవిడత సాయం అందలేదు. కోర్సు పూర్తి చేసి సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం రెండోవిడత ఇవ్వకపోవడంతో ఆయా విద్యార్థులు దీనిపై ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది.ఏటా రూ.60 కోట్లు కేటాయిస్తున్నా..విదేశాల్లో ఉన్నతవిద్య అభ్యసించే బీసీ పేద విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా జ్యోతిబాపూలే విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హత సాధించిన విద్యార్థి ఉన్నతవిద్య చదివేందుకు ఆర్థికసాయం కింద గరిష్టంగా రూ.20 లక్షలు అందిస్తుంది. ఈ మొత్తాన్ని విద్యార్థి తిరిగి చెల్లించాల్సిన పనిలేదు. ప్రతి సంవత్సరం ఈ పథకం కింద 300 మందికి సాయం చేసేలా విద్యార్థుల అర్హతలను గుర్తించి లబ్ధిదారులను ఎంపిక చేశారు.ఎంపికైన విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లోనే రెండు వాయిదాల్లో రూ.10లక్షల చొప్పున ప్రభుత్వం జమ చేసేది. అయితే నాలుగేళ్లుగా ఈ పథకానికి నిధుల విడుదల తగ్గిపోయింది. ఏటా ఈ పథకం కింద రూ.60 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తున్నా, వార్షిక సంవత్సరం పూర్తయ్యే నాటికి నిధుల విడుదల మాత్రం పూర్తిస్థాయి లో జరగడం లేదు. ఫలితంగా బకాయిలు పేరుకుపో యాయి. 2019–20 వార్షిక సంవత్సరం నుంచి పూర్తి స్థాయి నిధులివ్వకపోవడంతో ఇప్పటివరకు రూ.100 కోట్లు బకాయిలున్నట్టు బీసీ సంక్షేమశాఖ వర్గాలు చెబుతున్నాయి.నిధుల లభ్యతను బట్టి మంజూరు..విద్యానిధి పథకం కింద ప్రభుత్వం బీసీ సంక్షేమశాఖకు ఏటా రూ.60కోట్లు బడ్జెట్లో కేటాయిస్తుంది. కానీ వార్షిక సంవత్సరం ముగిసే నాటికి కేటాయించిన బడ్జెట్లో అరకొరగానే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తోంది. ఈ క్రమంలో అర్హత సాధించిన విద్యార్థులకు తొలివిడత కింద రూ.10లక్షలు చొప్పున ఖాతాల్లో జమ చేస్తున్న బీసీ సంక్షేమశాఖ...ఆ తర్వాత రెండోవిడత చెల్లింపులపై చేతులెత్తేసింది. దీంతో ఆ చెల్లింపులు క్రమంగా పేరుకుపోతు న్నాయి. 2019–20, 2020–21, 2021–22 విద్యా సంవత్సరాలకు సంబంధించి చాలామంది విద్యార్థులకు తొలివిడత నిధులు అందగా... 2022–23 విద్యా సంవత్సరం విద్యార్థులకు మాత్రం తొలివిడత నిధులు కూడా అందలేదు. -
రూ. 5 లక్షలిస్తే ‘విద్యానిధి’ మీదే!
వరంగల్ జిల్లాకు చెందిన మురిపాల సిద్ధార్థ్ ఎంఎస్ కోసం అమెరికాకు వెళ్లాలనుకున్నాడు. బీటెక్‌లో మంచి మార్కులు రావడంతో విదేశీ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకున్నాడు. అయితే ఓ మధ్యవర్తి.. ఈ పథకం కింద రూ. 20 లక్షల ఆర్థిక సాయం అందేలా చూస్తానని, అందుకు ప్రతిఫలంగా రూ. 5 లక్షలు ఇవ్వాలంటూ బేరమాడాడు. ఆర్థిక సాయంపై ఆశతో సిద్ధార్థ్ తండ్రి ఒప్పుకున్నాడు. రూ.లక్ష కూడా ఇచ్చాడు. ధ్రువపత్రాల పరిశీలన సమయంలో అధికారులు సిద్ధార్థ్ తండ్రిని పిలిచి మంచి మార్కులు, ఉత్తమ స్కోర్ ఉండడంతో మీ కుమారుడు తప్పకుండా ఎంపికవుతాడని చెప్పాడు. ఈ క్రమంలో ఎంపికైన సిద్ధార్థ్ అమెరికా వెళ్లి చదువు కొనసాగిస్తున్నాడు. అయితే ఎంఎస్ కోర్సులో చేరిన తర్వాత అడ్మిషన్ సర్టిఫికెట్, ధ్రువపత్రాలను సమర్పించాలని సిద్ధార్థ్ తండ్రికి అధికారులు ఫోన్ చేశారు. దీంతో ధ్రువపత్రాలను సమర్పించిన ఆయన మధ్యవర్తి విషయాన్ని వెల్లడించారు. అధికారులు ఫిర్యాదు ఇవ్వాలని చెప్పడంతో లేఖ ఇచ్చాడు. కానీ మధ్యవర్తి ఫోన్ నంబర్ పనిచేయకపోవడంతో అధికారులు చర్యలు తీసుకోలేదు. మధ్యవర్తి మాటలు విని తాను మోసపోయినట్లు చివరకు సిద్ధార్థ్ తండ్రి గుర్తించాడు. సాక్షి, హైదరాబాద్: ప్రతిభావంతులైన పేద విద్యార్థులు విదేశాల్లో ఉన్నత విద్య చదివేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యా నిధి పథకం కింద గరిష్టంగా రూ. 20 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల ద్వారా అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి, బీసీ సంక్షేమ శాఖ ద్వారా మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్యానిధి, మైనార్టీ సంక్షేమ శాఖ ద్వారా చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ విద్యా నిధి పేరిట ఈ పథకాలు అమలవుతున్నాయి. అర్హుడైన విద్యార్థికి రెండు దఫాలుగా గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ఆర్థిక సాయం అందించే పథకం ఇదే కావడం గమనార్హం. కాగా తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో ఈ పథకానికి విపరీతమైన క్రేజ్ ఉంది. దీంతో మధ్యవర్తులు దరఖాస్తుదారులను మాయ మాటలతో మోసం చేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. అత్యంత గోప్యంగా ఎంపిక ప్రక్రియ పరిమిత కోటాతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఏటా గరిష్టంగా 2 వందల మందికి, బీసీ, ఈబీసీలకు 300 మందికి సాయం అందిస్తోంది. బీసీ, ఈబీసీ కేటగిరీలో ఈ ఏడాది ఏకంగా 3వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పోటీ తీవ్రంగా ఉండటంతో దరఖాస్తు, సర్టిఫికెట్ల పరిశీలన సమయంలో మధ్యవర్తులు తల్లిదండ్రులను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అడుగుతూ ఈ పథకం కింద తప్పకుండా మీకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని నమ్మబలుకుతున్నారు. విద్యానిధి పథకం కింద దరఖాస్తులు, సర్టిఫికెట్ల పరిశీలన, అర్హుల ఎంపికకు స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. సంబంధిత సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి/కార్యదర్శితో పాటు సంక్షేమ శాఖ కమిషనర్/డైరెక్టర్, అదనపు సంచాలకులు, సంయుక్త సంచాలకులు, ఉప సంచాలకులు ఇందులో ఉంటారు. ఈ ప్రక్రియ ఆద్యంతం గోప్యంగా సాగుతుంది. ఎంపికైన తర్వాత జాబితా వెలువడినప్పుడు మాత్రమే అర్హుల పేర్లు బయటకు వస్తాయి. ఈ అంశాన్ని మధ్యవర్తులు అవకాశంగా మలుచుకుంటున్నారు. కొందరు జాబితా వెలువడిన వెంటనే లబ్ధదారులకు ఫోన్లు చేసి తమ ప్రయత్నం వల్లే ఆర్థిక సాయం అందుతోందంటూ తల్లిదండ్రులకు ఫోన్లు చేసి వసూళ్లకు తెగబడుతున్నారు. అధికార యంత్రాంగం నజర్ వరంగల్ జిల్లాకు చెందిన విద్యార్థి తండ్రి ఇటీవల ఫిర్యాదు చేయడంతో విద్యానిధి పథకంలో జరుగుతున్న అక్రమ వ్యవహారంపై అధికారులు దృష్టి పెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పిలిపించి మధ్యవర్తుల అంశంపై ఆరా తీస్తున్నారు. సమాచారం ఇచ్చిన వారి నుంచి లిఖిత పూర్తక ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. దీనిపై ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులు చెబుతున్నారు. విద్యానిధి అర్హతలు, ఎంపిక ఇలా... విదేశీ విద్యా నిధి పథకంలో గ్రాడ్యుయేషన్ మార్కులు కీలకం. నిర్దేశించిన దేశాల్లో ఎంఎస్ చదువుకునే విద్యార్థులు ఈ పథకం కింద ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించాలి. విద్యార్థి డిగ్రీ మార్కులకు 60 శాతం స్కోర్, జీఆర్ఈ/జీమ్యాట్ స్కోర్‌కు 20 శాతం, ఐఈఎల్టీఎస్/టోఫెల్‌కు మరో 20 శాతం మార్కులుంటాయి. దరఖాస్తులను అధికారులు వడపోసి నిబంధనల ప్రకారం అత్యధిక మార్కులున్న వారిని రిజర్వేషన్ల వారీగా ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల్లో అత్యధిక మార్కులున్న వారి జాబితాను రూపొందించి పరిమితికి లోబడి అర్హుల ఎంపిక చేపడతారు. బీసీల్లో మాత్రం సబ్ కేటగిరీలు, ఈబీసీ కేటగిరీ వారీగా వడపోత చేపట్టి ఎంపిక చేస్తారు. ఎంపికైన విద్యార్థికి మొదటి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక సగం, చివరి రెండు సెమిస్టర్లు పూర్తయ్యాక మిగతా సాయాన్ని ప్రభుత్వం విద్యార్థి బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది. విద్యార్థి చదువుకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారులకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే నిధులు విడుదలవుతాయి. -
15 నుంచి కులగణన
సాక్షి, అమరావతి: వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్రంలో నవంబర్ 15 నుంచి సమగ్ర కులగణనకు శ్రీకారం చుడుతున్నట్టు బీసీ సంక్షేమ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ తెలియజేశారు. సచివాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుల గణన ద్వారా ఎస్సీ, ఎస్టీలతో పాటు బీసీ వర్గాలను సైతం గుర్తిస్తామన్నారు. అనంతరం వారి అభ్యున్నతి కోసం వివిధ కులాలకు చెందిన కార్పొరేషన్ల ద్వారా తగిన పథకాలు రూపొందించి అమలు చేసేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ప్రతి పదేళ్లకు ఒక సారి జరిగే జనగణనతో పాటు సమగ్ర కులగణన జరిపించాలని గత బడ్జెట్ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినా ఇప్పటి వరకు సమాధానం రాలేదన్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న అధికారాలకు అనుగుణంగా ఏపీలో కులగణన చేయించాలని ఇటీవల శాసన సభ సమావేశాల్లో తీర్మానించినట్లు మంత్రి చెప్పారు. ఇందుకు అనుగుణంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, గ్రామ, వార్డు సచివాలయ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులతో ఒక అధ్యయన కమిటీ ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ నేతృత్వంలో గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల సహకారంతో ప్రత్యేక యాప్ ద్వారా కులగణన ప్రారంభిస్తున్నట్టు వివరించారు. బీసీ నాయకుల సూచనలు, సలహాల కోసం ప్రాంతాల వారీగా విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, కర్నూలు, తిరుపతిలో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వ్యక్తిగతంగా సలహాలు, సూచనల ఇచ్చేవారి కోసం ప్రత్యేక ఈ–మెయిల్ ఐడీ అందుబాటులో పెడతామన్నారు. 1931లో జరిగిన కుల గణనే చివరిది.. దేశంలో బ్రిటిష్ కాలంలో 1872లో కులగణన ప్రక్రియ ప్రారంభమైందని మంత్రి చెల్లుబోయిన చెప్పారు. ఇది 1941 వరకు ప్రతి పదేళ్లకోసారి జరిగిందన్నారు. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1941 కులగణను పరిగణనలోకి తీసుకోలేదని, అందువల్ల 1931 కులగణనే చివరిదని మంత్రి చెప్పారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1951 నుంచి జనగణన మాత్రమే చేస్తున్నారన్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాలను మినహా మిగిలిన అన్ని కులాలను గంపగుత్తగా లెక్కిస్తున్నట్టు చెప్పారు. ఈ నేపథ్యంలో దశాబ్దాలుగా కులగణన డమాండ్ వినిపిస్తోందన్నారు. బీసీ వర్గాల కులగణన వినతులను గత ప్రభుత్వాలు పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేశాయని విమర్శించారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ 139 బీసీ కులాలను గుర్తించి వాటికి ప్రత్యేకకార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. మంత్రివర్గంలో ఏకంగా 10 మంది బీసీలకు స్థానం కల్పించారన్నారు. -
ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు..
సాక్షి, అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్‌గా అనంతరాము బాధ్యతలు నిర్వహించనున్నారు. సాంఘిక సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా జి.జయలక్ష్మి, ఎక్సైజ్ శాఖ స్పెషల్ సీఎస్‌గా రజత్ భార్గవ బదిలీ అయ్యారు. పర్యాటక, సంస్కృతికశాఖ అదనపు బాధ్యతలు కూడా రజత్ భార్గవకు అప్పగించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ బాధ్యతలను సీఎస్ పర్యవేక్షించనున్నారు. మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఇంతియాజ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. చదవండి: స్థూల జాతీయ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ అగ్రగామి -
ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం: ఆర్.కృష్ణయ్య
పంజగుట్ట (హైదరాబాద్): వచ్చే బడ్జెట్లో బీసీ సంక్షేమ శాఖకు రూ.20 వేల కోట్లు కేటాయించాలని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. కాలేజీ విద్యార్థులకు ఇస్తున్న స్కాలర్షిప్లు రూ.5,500 నుంచి రూ.20 వేలకు పెంచాలని, విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలన్నారు. సోమ వారం బీసీ సంక్షేమ శాఖమంత్రి గంగుల కమలాకర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. పెద్దఎత్తున విద్యార్థులు ఈ కార్యక్రమానికి హాజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఏపీలో ముఖ్యమంత్రి జగన్ ఒక్కో విద్యార్థికి రూ.20 వేల స్కాలర్షిప్, పాఠశాల విద్యార్థులకు రూ.15 వేలు, మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారని తెలిపారు. లోటుబడ్జెట్లో ఉన్న రాష్ట్రమే ఇస్తుండగా ధనిక రాష్ట్రమైన తెలంగాణలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ‘ఇది బీసీ వ్యతిరేక ప్రభుత్వం. ఎనిమిదేళ్లుగా 5.70 లక్షల మంది బీసీ రుణాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఒక్కరికీ మంజూరు చేయలేదు’అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, విద్యార్థి నాయకుడు జిల్లపల్లి అంజి తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మన్యూనత నుంచి ఆత్మగౌరవానికి బీసీలు
భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఆత్మన్యూనతలో ఉన్న బీసీలను ఆత్మగౌరవంతో బతికేలా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసి ఆయా సామాజికవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఏపీ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్టీఆర్ జిల్లా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. గత ప్రభుత్వ హయాంలో విద్యావకాశాలు లేక వెనుకబడిన బీసీలకు జగనన్న ప్రభుత్వం వచ్చాక విద్యా రంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చిందన్నారు. బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయలక్ష్మి మాట్లాడుతూ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ డీబీటీ ద్వారా నవరత్నాలను అందించేందుకు గ్రామ సచివాలయ వ్యవస్థ దోహదడుతుందన్నారు. ఎమ్మెల్సీ టి.కల్పలత రెడ్డి మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక సీఎం జగన్మోహన్రెడ్డి అని అన్నారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ అమరావతి అంటూ హడావుడి చేసే చంద్రబాబు అక్కడ లోకేశ్‌ను గెలిపించుకోలేకపోయారని, ఆయన రాజకీయ సన్యాసం తీసుకుంటే మంచిదని హితవు పలికారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ వీసీ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అర్జునరావు, నవరత్నాల అమలు కమిటీ వైస్ చైర్మన్ నారాయణమూర్తి, 56 బీసీ కార్పొరేషన్ల సమన్వయకర్త ఎ.ప్రవీణ్, పర్సన్ ఇన్చార్జిలు కె.మల్లికార్జున, ఎ.కృష్ణమోహన్, డి.చంద్రశేఖరరాజు, పి.మాధవి లత, ఎస్.తనూజ, జి.ఉమాదేవి, ఎం.చినబాబు, భీమ్శంకర్, కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. -
బీసీల ఆత్మగౌరవం పెంచేలా పాలన
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పాదయాత్రలో గీత కార్మికుల జీవన కష్టాన్ని కళ్లతో కాకుండా మనసుతో చూశారని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. అందుకే బీసీల ఆత్మగౌవరం పెంచేలా, జీవన భద్రత కల్పించేలా పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. గీత కార్మికుల కోసం కొత్త పాలసీ తెచ్చి, వారికి భద్రత కల్పించారని తెలిపారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బీసీ ఉప కులాల కార్పొరేషన్ చైర్మన్లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ‘రాష్ట్రంలో గౌడ, శెట్టిబలిజ, శ్రీశైన, యాత, ఈడిగ ఉపకులాలతో పాటు షెడ్యూల్ కులాలు, తెగల వాళ్లు కూడా కల్లు గీత వృత్తి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి జీవన విధానం మెరుగు పడేలా ఈ నెల 5న జీవో 693 ద్వారా సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రమాదవశాత్తు గీత కార్మికులు మృతి చెందితే, ఆ కుటుంబాలు రోడ్డునపడకుండా ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచారు’ అని చెప్పారు. ఈ గొప్ప నిర్ణయంపై రాష్ట్రంలోని గీత, గీత ఉప కులాలన్నీ ముక్త కంఠంతో హర్షం వ్యక్తం చేస్తూ ర్యాలీలు నిర్వహించి, సీఎం జగన్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి ఇంకా ఏమన్నారంటే.. బీసీలకు అన్ని విధాలుగా అండగా నిలిచిన సీఎం ► సీఎం జగన్ అన్ని విధాలా బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. నన్ను బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా, మరో ఐదుగురిని గీత ఉప కులాల కార్పొరేషన్ల చైర్మన్లుగా నియమించడం పట్ల మాకు ఎంతో ఆనందంగా ఉంది. గీత కులాల వారు సీఎం జగన్‌ను తమ బిడ్డగా భావిస్తున్నారు. ► గీత ఉప కులాల వారు.. శ్రీకాకుళం ప్రాంతంలో శ్రీశైనులుగా, విజయనగరం, విశాఖపట్నంలో యాతలుగా, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో శెట్టిబలిజలుగా, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో గౌడలుగా, రాయలసీమ జిల్లాల్లో ఈడిగలుగా జీవనం సాగిస్తున్నారు. ► ఈ ఐదు కులాల ప్రధాన వృత్తి గీత. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాకముందు, గీత వృత్తిదారుల్లో చదువు పట్ల ఆసక్తి చూపించిన వారి సంఖ్య చాలా తక్కువ. వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి రూపకల్పన చేసి, అమలు చేశాక, లక్షలాది మంది పిల్లలు ఉన్నత చదువులు చదివి, విదేశాలకు వెళ్లారు. సీఎం జగన్ పాలనలో ఇప్పుడు ఆ సంఖ్య ఇంకా పెరిగింది. ► టీడీపీకి గీత కులాల గురించి మాట్లాడే అర్హతే లేదు. బీసీలను చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ మోసం చేశారు. ఓట్లు కోసం మాత్రమే మమ్మల్ని వాడుకున్నారు. దేశంలో ఎక్కడా ఎక్స్‌గ్రేషియా రూ.లక్షకు మించి లేదు. అదే సీఎం జగన్ రూ.10 లక్షలకు పెంచడం హర్షణీయం. గీత కార్మికులకు ఏపీలో అందుతున్న సహకారం దేశంలో మరెక్కడా లేదు. ► ఈ సమావేశంలో కార్పొరేషన్ల చైర్మన్లు డాక్టర్ గుబ్బాల తమ్మయ్య (శెట్టి బలిజ), మాదు శివరామకృష్ణ (గౌడ), పిల్లి సుజాత (యాత), కె.సంతు (ఈడిగ) పాల్గొన్నారు. -
బీసీ సీఎంలకూ సాధ్యం కాలేదు
సాక్షి, అమరావతి: కుల వృత్తులతో తరతరాలుగా సమాజానికి సేవలందిస్తున్న బీసీ సామాజిక వర్గాలకు దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆర్థిక తోడ్పాటుతోపాటు రాజకీయంగా ఉన్నత అవకాశాలు కల్పిస్తున్న ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని బీసీ ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ప్రతి పనిలోనూ బీసీల శ్రమ, కృషి దాగుందన్నారు. బీసీల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ మూడున్నరేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న కృషిని సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. బీసీలే ముఖ్యమంత్రులుగా ఉన్న ఇతర రాష్ట్రాల్లోనూ బలహీన వర్గాలకు ఇంత సంక్షేమం సాధ్యం కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని 175 స్థానాల్లోనూ గెలిపించి సీఎం జగన్ రుణం తీర్చుకుంటామని, మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉంటారని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని సీఎస్ఆర్ కళ్యాణ మండపంలో వైఎస్సార్ సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి అధ్యక్షతన బీసీ ప్రజా ప్రతినిధుల సమావేశం జరిగింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి దీనికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం బీసీ నేతలు మాట్లాడారు. త్వరలో 26 జిల్లాల్లోనూ సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ ప్రజా ప్రతినిధులు సామాజిక న్యాయానికి పెద్దపీట: బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి సామాజిక న్యాయానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే 243 బీసీలకే ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. మూడున్నరేళ్లలో డీబీటీ ద్వారా వారికి దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర ప్రయోజనం చేకూర్చాం. పోరాడే బాధ్యత మాదే: జోగి రమేశ్, గృహ నిర్మాణశాఖ మంత్రి బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైఎస్సార్ సీపీ స్వీకరించింది. బీసీ సామాజిక వర్గాలన్నింటిని ఏకం చేసి వారి ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైఎస్సార్ సీపీ మాత్రమే. కలసికట్టుగా పార్టీని తిరిగి అధికారంలోకి తెచ్చి సీఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకుంటాం. అండగా నిలుద్దాం: సీదిరి అప్పలరాజు, పశుసంవర్థక శాఖ మంత్రి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి కుల అహంకారం ఉంది. బీసీలు న్యాయమూర్తులుగా పనికి రారని గతంలో కేంద్రానికి లేఖలు రాశారు. మత్స్యకారులను తోకలు కత్తిరిస్తానని బెదిరించారు. ఎస్సీల కుటుంబంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని కుల అహంకారంతో మాట్లాడారు. చంద్రబాబు హయాంలో బీసీ హాస్టళ్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. అధికారం కోల్పోయాక రాష్ట్రానికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకోవాలని చూశారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాకే సామాజిక న్యాయం సాకారమైంది. ఆయనకు అంతా అండగా నిలవాలి. బాబు నైజాన్ని ఎండగట్టాలి: ఉషశ్రీ చరణ్, మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి బీసీలను ఎంతో ఆదుకుంటున్న సంక్షేమ పథకాలను ఆపాలంటున్న చంద్రబాబు నైజాన్ని ప్రజల్లో ఎండగట్టాలి. అనంతపురం అంటే బీసీల జిల్లా. వారంతా సీఎం జగన్ వెంటే నడుస్తున్నారు. గతంలో ఎప్పుడూ, ఎవరూ చేయనన్ని సంక్షేమ పథకాలను సీఎం జగన్ ప్రవేశపెట్టి అన్ని కులాలకు అండగా నిలిచారు. బీసీలకు చేయాల్సిందంతా చేసినా ఇంకా ఏం చేయగలమా? అని తపిస్తుంటారు. బీసీలను బెదిరించిన చంద్రబాబు: పోతుల సునీత, ఎమ్మెల్సీ బీసీల తోకలు కత్తిరిస్తానంటూ చంద్రబాబు గతంలో బెదిరించారు. సీఎం జగన్ నా బీసీ సోదరులు, అక్క చెల్లెమ్మలంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఆయనకు మనపై ఉన్న ప్రేమకు అదే నిదర్శనం. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని, పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, హనుమంతరావు, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, దాడి వీరభద్రరావు, వైఎస్సార్సీపీ మహిళా నేత కిల్లి కృపారాణి పాల్గొన్నారు. సమానంగా ఎదిగేలా తోడ్పాటు ఇతర సామాజిక వర్గాలతో సమానంగా బీసీలు అభివృద్ధి చెందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. టీడీపీ ఐదేళ్లలో బీసీలకు విదిల్చింది కేవలం రూ.19,369 కోట్లు మాత్రమే. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ.2 లక్షల కోట్ల మేర పారదర్శకంగా లబ్ధి చేకూర్చింది. – గుమ్మనూరు జయరాం, కార్మిక శాఖ మంత్రి -
అధి‘కార్ల’ బాగోతం.. వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా కక్కుర్తి పోలేదు!
ఇక్కడ కనిపిస్తున్న వాహనాన్ని ఓ ఐసీడీఎస్ అధికారి వినియోగిస్తున్నారు. కారుపైన ‘ఆన్ గౌట్ డ్యూటీ’ అని రాసి ఉంది. నిబంధనల ప్రకారం ఎల్లో ప్లేట్ వాహనం వినియోగించాలి. కానీ ఇందులోనే సదరు అధికారి క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపడుతున్నారు. ఈయనొక్కరే కాదు.. ఆర్అండ్బీ, ఐటీడీఏ ఇంజనీరింగ్, పబ్లిక్ హెల్త్, వైద్యారోగ్యశాఖ, వయోజన విద్య, బీసీ వెల్ఫేర్, ఇరిగేషన్, పశుసంవర్ధక శాఖ, ఆర్డబ్ల్యూఎస్, డీపీఓ, తహసీల్దార్లు, ఎంపీడీఓలు చాలా వరకు వైట్‌ప్లేట్ వాహనాల్లోనే తిరుగుతూ ఎల్లో ప్లేట్ పేరిట బిల్లులు డ్రా చేసుకుంటుండడం గమనార్హం. సాక్షి, ఆదిలాబాద్: జిల్లాలో కొంతమంది అధికారులు వేలకు వేలు జీతాలు తీసుకుంటున్నా ఇంకా కక్కుర్తి పడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో జిల్లా స్థాయితో పాటు కొంతమంది క్షేత్రస్థాయి పరిశీలన కోసం వెళ్లే అధికారులకు ప్రభుత్వం వాహన సౌకర్యం కల్పించింది. ప్రభుత్వ వాహనాలు అందుబాటులో లేని చోట అద్దె వాహనాల వెసులుబాటు కల్పించింది. అయితే ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. తమ సొంత వాహనాల్లోనే క్షేత్రస్థాయి పర్యటనలు చేస్తూ ‘అద్దె’ను సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో చాలా మంది వైట్ ప్లేట్ వాహనాల్లో వెళ్తూ ఇతరుల పేరిట బిల్లులు తీసుకుంటున్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో.. ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఆయా శాఖల్లో ప్రభుత్వ వాహనాలు లేని అధికారులకు ట్యాక్స్ ప్లేట్ వాహనాలు అద్దెకు తీసుకునే అవకాశం కల్పించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ తదితర శాఖల నుంచి నిరుద్యోగులకు ఓనర్ కమ్ డ్రైవర్ వంటి స్కీమ్‌లను ప్రవేశపెట్టి వాహనాలను సబ్సిడీ రూపంలో అందించింది. ఆయా శాఖల్లో వాహనాలు అద్దెకు పెట్టేందుకు అనుమతినిచ్చింది. అయితే కొంతమంది అధికారులు ఎల్లో ప్లేట్‌కు బదులు వైట్ ప్లేట్ వాహనాలనే వినియోగిస్తూ నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారు. బిల్లులు తీసుకునే సమయంలో ఇతరుల వాహనాలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాలు సమర్పిస్తున్నారు. సంబంధిత శాఖల అధికారులకు విషయం తెలిసినప్పటికీ ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. నెలకు 2,500 కిలో మీటర్లు వాహనం తిరగాల్సి ఉంటుంది. ఇందుకు గాను రూ.33వేలను ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే కొంతమంది అధికారులు తమ వాహనాల్లో తక్కువ కిలో మీటర్లు తిరుగుతూ సొమ్ము చేసుకుంటున్నారు. వాహనాల్లో క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకపోయినా టూర్ డైరీలో మాత్రం వెళ్లినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. చదవండి: పాతబస్తీలో బిర్యానీ ఫైట్ కలకలం.. అర్ధరాత్రి హోంమంత్రికి ఫోన్ చేసి సర్కారు ఆదాయానికి గండి.. ప్రభుత్వ కార్యాలయాల్లో వ్యక్తిగత వాహనాలను వినియోగించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. వైట్ ప్లేట్ వాహనాలను సొంత పనులకు మాత్రమే వినియోగించాలి. వీటికి పన్ను చెల్లింపు ఉండదు. ఎల్లో ప్లేట్ ట్యాక్స్ వాహనాలను ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర అద్దె కోసం వినియోగించాల్సి ఉంటుంది. వీటికి మాత్రం ఫిట్నెస్, ఏడాదికి ఇన్సూరెన్స్ రూ.20వేల నుంచి రూ.25వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రం దాటితే టీపీ తీయాలి. అయితే ఇలాంటివి పన్నులు లేకుండా కొందరు అధికారులు తమ సొంత వాహనాలనే వినియోగిస్తూ బిల్లులు డ్రా చేసుకుంటున్నారు. ఇతర వ్యక్తులకు సంబంధించిన వాహనాలుగా చూపుతూ వారికి నెలకు రూ.1500 నుంచి రూ.2వేలు వరకు చెల్లిస్తున్నారు. అదే బాటలో ఎంపీడీఓలు, తహసీల్దార్లు.. జిల్లాలో 18 మండలాలున్నాయి. క్షేత్రస్థాయిలో ప ర్యటించే తహసీల్దార్లు, ఎంపీడీఓలకు ప్రభుత్వం అద్దె వాహన సౌకర్యం కల్పించింది. కొంతమంది మాత్రం దీనిని దుర్వినియోగం చేస్తున్నారు. అద్దె వాహనాలు వినియోగించాల్సి ఉన్నా కాసులకోసం కక్కుర్తి పడుతూ తమ సొంత వాహనాలనే విని యోగిస్తూ బిల్లులు కాజేస్తున్నారు. రోజు కార్యాలయానికి వచ్చేది వైట్ ప్లేట్ వాహనంలోనే అయినా.. బిల్లులు మాత్రం ఎల్లో ప్లేట్‌కు సంబంధించి తీసుకుంటున్నారు. ఈ విషయమై అదనపు కలెక్టర్ నటరాజ్, డీఆర్డీవో కిషన్‌ను ఫోన్లో సంప్రదించగా వారు సమావేశంలో ఉన్నామని తెలిపారు. వివరాలు తెలిపేందుకు అందుబాటులోకి రాలేదు. -
వచ్చేనెల నుంచి కొత్త బీసీ గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన గురుకుల పాఠశాలలు, డిగ్రీ కాలేజీల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. అక్టోబర్ 11వ తేదీన 33 బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించేందుకు బీసీ గురుకుల సొసైటీ ఏర్పాట్లు చేస్తోంది. అదే విధంగా వచ్చేనెల 15వ తేదీన 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. ఆయా తేదీల నుంచే తరగతులు ప్రారంభించాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు, గురుకుల సొసైటీ కార్యదర్శితో ఆయన సమీక్ష నిర్వహించారు. నూతనంగా ప్రారంభించనున్న గురుకుల విద్యా సంస్థల్లో అత్యున్నత స్థాయి ప్రమాణాలు పాటిస్టున్నట్లు తెలిపారు. సాగర్ ఉప ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం హాలియాలో, అలాగే దేవరకద్ర, కరీంనగర్, సిరిసిల్ల, వనపర్తితో పాటు పాత జిల్లాల ప్రతిపాదికగా ప్రతి జిల్లాలో డిగ్రీ కాలేజీలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజాగా ప్రారంభించనున్న కొత్త గురుకులాలతో కలిపి బీసీ గురుకుల సొసైటీ పరిధిలో విద్యా సంస్థల సంఖ్య 310కి చేరిందని వివరించారు. ఆత్మగౌరవ భవనాలకు 8న అనుమతి పత్రాలు బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణ బాధ్యతలను ఏక సంఘంగా ఏర్పడిన కుల సంఘాలకు అప్పగిస్తున్నామని మంత్రి గంగుల తెలిపారు. 24 కుల సంఘాలు ఇప్పటికే ఏకగ్రీవంగా నిర్మాణ అనుమతులు పొందాయన్నారు. ఇలా ఏక సంఘంగా ఏర్పడి ఆత్మగౌరవ భవనాలు నిర్మించుకునే వారికి ఈ నెల 8న అనుమతి పత్రాలు అందజేస్తామని చెప్పారు. ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయనుండటంతో.. ప్రస్తుతం ఉన్న 12 బీసీ స్టడీ సర్కిళ్లకు అదనంగా మరో 50 స్టడీ సెంటర్లు తెరిచి గ్రూప్స్, డీఎస్సీ, తదితర పోటీ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు, బీసీ స్టడీ సర్కిల్స్ డైరెక్టర్ అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు చేయాల్సిందే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెనకబడిన వర్గాలకు సామాజిక న్యాయం దక్కాలంటే కేంద్రం తక్షణమే బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాల్సిందేనని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. కేంద్రంలో 72 మంత్రిత్వ శాఖలు ఉన్నప్పుడు 75 కోట్ల జనాభా ఉన్న బీసీలకు ప్రత్యేక శాఖ ఏర్పాటు చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. ఈ విషయమై త్వరలోనే ప్రధాని నరేంద్రమోదీని కలిసి విన్నవిస్తామని చెప్పారు. న్యూఢిల్లీలోని ఏపీభవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీలు ఆర్.కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణారావు, మార్గాని భరత్, బీశెట్టి సత్యవతి, డాక్టర్ సంజీవ్‌కుమార్, తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్ మాట్లాడారు. ఎవరికీ అభ్యంతరంలేని విషయంపై అలక్ష్యం వద్దు ఎంపీ కృష్ణయ్య మాట్లాడుతూ మండల్ కమిషన్ సిఫార్సులు, సంక్షేమ పథకాల అమలుకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ అవసరమని చెప్పారు. పలు రాష్ట్రాల్లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఉన్నప్పటికీ కేంద్రస్థాయిలో లేకపోవడం శోచనీయమన్నారు. ‘1992లోనే సుప్రీంకోర్టు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఉండాల్సిన అవసరం ఉందని సూచించింది. బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటుపై ఎవరికీ అభ్యంతరాలు లేవు. ఇలాంటప్పుడు శాఖ ఏర్పాటుపై ఆలస్యం తగదు. దీనిపై పార్టీ తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. కేంద్రస్థాయి ఉద్యోగాల్లో, సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాల్లో బీసీలకు ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరతాం..’ అని చెప్పారు. బీసీల అభ్యున్నతికి వివిధ సంక్షేమ పథకాల అమలుతో పాటు, సామాజిక న్యాయం చేసేలా బీసీలకు రాజకీయ పదవుల్లో 50 శాతానికిపైగా కట్టబెట్టి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు. చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి పెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లు ఆమోదం పొందేవరకు ఒత్తిడి తేవాలని ముఖ్యమంత్రి సూచించారని తెలిపారు. నామినేటెడ్, కార్పొరేషన్ పదవుల్లో 50 శాతం పదవులు బీసీలకు ఇచ్చేలా చట్టం తెచ్చారన్నారు. మాటల్లో కాకుండా ఆచరణలో బీసీల సంక్షేమం కోసం ఏపీ సీఎం జగన్ కృషిచేస్తున్నారని, ఆయన కృషిని చూసి పలు రాష్ట్రాల సీఎంలు, నేతలు ఆశ్చర్యపోతున్నారని చెప్పారు. జగన్ నిర్ణయాలు ఓటుబ్యాంకు రాజకీయాల్లా కాకుండా ఒక తత్వవేత్త, సిద్ధాంతవేత్త తీసుకున్నట్లు ఉంటున్నాయన్నారు. బీసీలకు కేంద్ర బడ్జెట్లో కనీసంగా రూ.లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కులగణన కోసం పోరాడతాం ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ బీసీలకు జాతీయ స్థాయిలో ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు కోసం కృషిచేస్తామని చెప్పారు. రాష్ట్రప్రభుత్వం బీసీ సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాల్లో కేంద్రం మ్యాచింగ్ గ్రాంటు ద్వారా భాగస్వామి కావాలన్నారు. రాష్ట్రస్థాయిలో అమలవుతున్న పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. బీసీల కులగణన కోసం ప్రధానిని కోరతామని చెప్పారు. ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కేంద్ర బడ్జెట్ లో కేటాయింపులు పెంచాలని కోరారు. బీసీలకు అవరోధంగా ఉన్న క్రీమిలేయర్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ సత్యవతి మాట్లాడుతూ బీసీ నినాదాన్ని బలంగా మోస్తున్న ఎనిమిది ప్రాంతీయ పార్టీలను కలుపుకొని ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం కృషిచేస్తామని చెప్పారు. -
‘బడుగుల కోసం పోరాడిన మహానుభావుడు పూలే’
గన్‌ఫౌండ్రీ: విద్యను ఆయుధంగా మార్చుకోవాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మా జ్యోతిబా పూలే అని పలువురు ప్రముఖులు కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే 196వ జయంతి వేడుకలను సోమవారం రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల జీవితాల్లో సమూల మార్పుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు జ్యోతిబా పూలే అని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పూలే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తున్నారని తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీసీ జనగణనను నిర్వహించాలని డిమాండ్ చేశారు. పలు పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈనెల 16న ఆన్లైన్ వేదికగా పరీక్షను నిర్వహిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. కార్యక్రమంలో బీసీ గురుకుల విద్యాసంస్థల కార్యదర్శి భట్టు మల్లయ్య, బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్రచారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్, పూలే జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్లు ఆనంద్‌కుమార్ గౌడ్, నీల వెంకటేశ్, రాజేందర్, బడేసాబ్ పాల్గొన్నారు. -
కోచింగ్.. స్టైపెండ్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 80,039 ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం వెనుకబడిన, బీసీ వర్గాల అభ్యర్థులకు కోచింగ్ ఇచ్చేందుకు బీసీ సంక్షేమ శాఖ పెద్దఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. రూ.50 కోట్ల వ్యయంతో 16 స్టడీ సర్కిళ్లతోపాటు 103 స్టడీ సెంటర్లలో 1.25 లక్షల మందికి ఉచిత కోచింగ్ ఇవ్వనుంది. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్ కూడా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ విషయాన్ని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. బుధవారం బీసీ సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశంతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీ సంక్షేమ శాఖ అందించే శిక్షణలో బీసీ వర్గాలకు 75 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీ లకు 5 శాతం, ఈబీసీలకు 5 శాతం, మైనారిటీలకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పారు. ఆన్లైన్ పరీక్ష ద్వారా ఎంపిక 1.25 లక్షల మంది అభ్యర్థుల్ని ఎంపిక చేసే ప్రవేశ పరీక్ష కోసం ప్రతిష్టాత్మక ‘అన్ అకాడమీ’తో ఒప్పందం కుదుర్చుకున్నామని గంగుల తెలిపారు. ‘16 బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా 25వేల మందికి నేరు గా, మరో 50వేల మందికి హైబ్రిడ్ మోడ్ (ఆన్లైన్/ ఆఫ్‌లైన్ విధానం)లో శిక్షణ ఇస్తాం. అలాగే 103 బీసీ స్టడీ సెంటర్ల ద్వారా ఒక్కో దాంట్లో 500 మందికి తగ్గకుండా 50వేల మందికి శిక్షణ ఇస్తాం. అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈనెల 16న ఉద యం 11 గంటలకు ఆన్లైన్లో ఎంట్రన్స్ టెస్ట్ ఉం టుంది. దీనికోసం బుధవారం నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది. ఈనెల 16 ఉదయం 10 గంటల వరకూ రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుం ది. మార్కుల ఆధారంగా అభ్యర్థులకు ఏ ఉద్యోగం కోసం కోచింగ్ ఇవ్వాలో నిర్ణయిస్తారు. అధిక మార్కులు సాధించిన వారిని గ్రూప్–1 శిక్షణకు ఎంపిక చేసి మెటీరియల్‌తోపాటు నెలకు రూ.5వేల చొప్పున ఆరు నెలలపాటు స్టైపెండ్ ఇస్తాం. మిగతావారిని మెరిట్ ఆధారంగా గ్రూప్–2, 3, 4, కానిస్టేబుల్, ఎస్సై వంటి ఇతర శిక్షణలకు ఎంపిక చేస్తాం. వీరికి 3 నెలల శిక్షణలో నెలకు రూ.2వేల స్టైపెండ్ ఇస్తాం. అలాగే, కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల లోపు ఉన్నవారికి ఉచిత శిక్షణతోపాటు స్టైపెండ్ ఇస్తాం. ఈనెల 20 లేదా 21 నుంచి క్లాసులు ప్రారంభిస్తాం’ అని మంత్రి చెప్పారు. 100 మార్కులకు పరీక్ష ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌ను https://studycircle. cgg.gov.in/, https://mjpabcwreis. cgg. gov.in/, https://unacademy.com/ scholarship/tsgovt&scholarship& test తోపాటు బీసీ సంక్షేమ శాఖ వెబ్సైట్లోనూ చేసుకో వచ్చని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. 90 నిమిషాలపాటు నిర్వహిం చే ఈ పరీక్షలో 5 విభాగాలు ఉంటాయని, మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తామన్నారు. నెగె టివ్ మార్కులు ఉండే ఈ పరీక్షలో టాంపరిం గ్‌కు అవకాశం ఉండదన్నారు. మెరిట్ అభ్యర్థులకు తాము సైతం 20వేలు విలువ చేసే స్టడీ మెటీరియ ల్ను ఇస్తామని ‘అన్ అకాడమీ’ ప్రతినిధి చెప్పారు. -
జ్యోతిబా పూలే జయంతి: రచనలపై పోటీ, బహుమతులు
మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ విద్యాసంస్థల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వ్యాస, కవిత, పద్య, చిత్రకళల్లో పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తామని బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు. విద్యార్థుల్లో సాహిత్య సృజన పెంచేందుకు, జ్యోతి బా పూలే జీవిత ప్రభావం నేటి సమాజం పై ఎలా ఉంది అన్న విషయం తెలుసుకునేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన జ్యోతిబా పూలే గురించి ఆయన చేసిన సేవల గురించి ప్రతి ఒకరికీ తెలియజేస్తూ గడప గడపకి సాహిత్యాన్ని చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలు తెలంగాణ సాహిత్య అకాడమీతో కలిసి నిర్వహిస్తున్నామని బుర్రా వెంకటేశం వివరించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని అన్ని విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు, తెలుగు ఉపాధ్యాయులు ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని వెంకటేశం చెప్పారు. ఆర్సీఓలు, ప్రిన్సిపాల్స్, తెలుగు ఉపాధ్యాయులు విద్యార్థులకు ఈ విషయాలు చెప్పి వారిలో రచనాశక్తిని పెంపొందించాలని ఆయన సూచించారు. ‘జ్యోతి బా పూలే జీవితం-నేటి సమాజం పై ప్రభావం’ అనే అంశంపై రెండుపేజీలకు మించకుండా వ్యాసం, పదికి మించకుండా పద్యాలు లేదా కవిత పంపాలన్నారు. అలాగే చిత్రం వేయాలనుకున్నవారు ఏ4 సైజు పేపరు పై చిత్రం గీసి పంపించాలని తెలిపారు. రాష్ట్రస్థాయిలో ఎంపిక చేసిన ఉత్తమ రచనలకు ఏప్రిల్ 11న హైదరాబాద్ లో నిర్వహించే జ్యోతిబా పూలే జయంతి ఉత్సవాల్లో బహుమతి ప్రదానం ఉంటుందని అన్నారు. గురుకుల విద్యార్థులతో పాటు హాస్టల్ విద్యార్థులు, టీచర్లు, వార్డన్లు కూడా ఈ పోటీల్లో పాల్గొన్నవచ్చని ఆయన చెప్పారు. అలాగే తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ పోటీల్లో వచ్చిన వాటిల్లో అత్యుత్తమైనవి ఎంపిక చేసి పుస్తకంగా తీసుకురానున్నట్టు బుర్రా వెంకటేశం వెల్లడించారు. -
రాష్ట్రవ్యాప్తంగా బీసీల సదస్సులు
సాక్షి,అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చేపట్టిన చర్యలతో వారిలో ఆత్మగౌరవం పెరిగిందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఏప్రిల్ 15 తర్వాత తాను, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నెల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించి, వారి ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మేలు ప్రతి ఇంటికీ తెలిసేలా చేస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ, వైఎస్సార్సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. ముందుగా కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రెండు, మూడు జిల్లాలకు ఒక సదస్సు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని ప్రజలకు తెలియజేయడం, లోపాలను సవరించడమే సదస్సుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్ కోసం రూ. 31 వేల కోట్లు కేటాయించిందన్నారు. విద్యుత్ చార్జీల భారం వేసింది టీడీపీనే విద్యుత్ చార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం వేసింది టీడీపీనే అని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడమే టీడీపీ లక్ష్యమని అన్నారు. -
పద్మశాలి భవన నిర్మాణానికి రూ.5 కోట్లు
సాక్షి, హైదరాబాద్: పద్మశాలి భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.5 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శుక్రవారం నిర్మాణ పనులకు పరిపాలన అనుమతులు జారీ చేశారు. బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల కార్యక్రమంలో భాగంగా ఈ భవనాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మండలంలో నిర్మించనున్నారు. -
ప్యాకేజీ పెంచుకునేందుకే శ్రమదానం
కాకినాడ సిటీ: ఒక పార్టీకి అధినేతగా ఉండి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడమే కాక.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ వచ్చే ఎన్నికల్లో ప్యాకేజీని పెంచుకునేందుకు పవన్ కళ్యాణ్‌ను ఇప్పటి నుంచే తాపత్రయం పడుతున్నాడని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఎద్దేవా చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ఆర్ అండ్ బీ అతిథిగృహంలో శనివారం రాత్రి మీడియాతో మాట్లాడారు. పవన్ జిల్లాలో వ్యవహరించిన తీరుపై మండిపడ్డారు. దేశానికి అహింస, సత్యం మార్గాలను చూపించిన గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రిల పుట్టినరోజు నాడు పవన్‌కళ్యాణ్ రాజమహేంద్రవరం వచ్చి ప్రజలను రెచ్చగొట్టి ఒక అసాంఘిక శక్తిగా యుద్ధ వాతావరణం తీసుకొచ్చి మాట్లాడడం చాలా సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఆయన తీరును ఏ ఒక్కరూ హర్షించరని, ప్రజలు తిప్పికొడతారని మంత్రి అన్నారు. ఒక సీజనల్ రాజకీయ నాయకుడిగా ఉంటున్న పవన్‌కు రోడ్లు ఎప్పుడు వేస్తారో తెలీదని ఎద్దేవా చేశారు. శ్రమదానం అంటే పవన్ దృష్టిలో క్లాప్, కెమెరా, యాక్షన్.. ఒక నిమిషం పాటు పార పట్టుకుని ఫొటోలు దిగడం.. ఆ తర్వాత ప్రజలను రెచ్చగొట్టడమేనని చెల్లుబోయిన వేణు అన్నారు. రాజకీయాల్లో పుష్కరకాలం పనిచేసినా ఎమ్మెల్యే కాలేదన్న బాధ పవన్‌లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పనులు ప్రారంభమవుతున్నాయని తెలిసే.. వర్షాకాలంలో ఎక్కడా రోడ్లు వేయరన్న విషయం కూడా జనసేనానికి తెలియకపోవడం శోచనీయమని మంత్రి అన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇందుకు రూ.2,200 కోట్లు కేటాయించిందన్న సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. త్వరలో పనులు ప్రారంభమవుతున్నాయని తెలిసే రోడ్డుపై శ్రమదానం చేశారన్నారు. ఇటువంటి చిల్లర మనస్తత్వం కేవలం చంద్రబాబు, ఎల్లో మీడియా, పవన్‌కు మాత్రమే ఉందన్న విషయం రాష్ట్ర ప్రజలు ఎప్పుడో గుర్తించారని మంత్రి వేణు వ్యాఖ్యానించారు. పవన్ మాటలు చూస్తే గాంధీ జయంతి నాడు గాడ్సే వారసుడులా మాట్లాడుతున్నట్లు ఉందన్నారు. రాజమహేంద్రవరంలో శెట్టిబలిజలకు భరోసా ఇవ్వడానికి వచ్చాననడంపై మంత్రి మాట్లాడుతూ.. శెట్టిబలిజలకు మీ భరోసా ఏంటో గత ఎన్నికల్లోనే తెలిసిందన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో శెట్టిబలిజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఇతర అగ్రవర్ణాలకు ఒకరితో ఒకరికి ఎలాంటి ఇబ్బందిలేదని, అందరూ ఐక్యంగానే ఉన్నామన్నారు. పవన్ వల్ల బాగుపడిన కాపులు ఎవరూ లేరన్నారు. -
బెస్తల బాగు సీఎం జగన్‌తోనే సాధ్యం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని బెస్తల బాగు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితోనే సాధ్యమని బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ చెప్పారు. రాష్ట్రంలో బెస్తలకు భరోసా వైఎస్సార్‌సీపీతోనే లభించిందని తెలిపారు. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ ఎదుగుదల సీఎం జగన్ ఆశయమని పేర్కొన్నారు. మత్స్యకారుల్లో ఎవరికీ అన్యాయం జరగకుండా ఆయా ప్రాంతాల్లో పిలిచే పేర్ల ఆధారంగా కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బెస్త కార్పొరేషన్ చైర్పర్సన్ తెలుగు సుధారాణి అధ్యక్షతన తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన బెస్త కులస్తుల రాష్ట్రస్థాయి ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ప్రసంగించారు. కులాల మధ్య వ్యత్యాసాలు చూపకుండా బీసీలలోని అన్ని కులాలు సమాంతరంగా అభివృద్ధి చెందాలన్నదే సీఎం జగన్ కోరిక అని చెప్పారు. తమ కులం పేరు చెప్పుకోవడానికి కూడా భయపడే కులాలను గుర్తించి, వాటికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా కులస్తులతో సమావేశాలు నిర్వహించడం ద్వారా వారికి భరోసా కల్పించిన పార్టీ వైఎస్సార్సీపీ అని తెలిపారు. దీనికి కర్త, కర్మ, క్రియ అయిన సీఎం జగన్‌కు బీసీలుగా తాము ఏం చేసినా రుణం తీర్చుకోలేమన్నారు. అన్ని రంగాల్లో ఎదిగే స్వేచ్ఛ, అధికారం సీఎం జగన్ బీసీలకు ఇచ్చారని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక్క సీఎం జగన్ వల్లే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని, వైఎస్సార్సీపీ వల్లే సమస్యలు తీరతాయని ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని లబ్ధి చేకూర్చేలా సీఎం ప్రణాళికలు రచించుకుని ముందుకు సాగుతున్నారని చెప్పారు. ఈ క్రమంలోనే పింఛన్లు ఎత్తేశారనే తప్పుడు ప్రచారంతో ప్రతిపక్షాలు ప్రజల్ని పక్కదారి పట్టించాలని చూస్తున్నట్లు తెలిపారు. అలాంటి అవాస్తవాలను తిప్పికొట్టేందుకు బీసీలు సిద్ధంగా ఉండాలని కోరారు. బీసీలను బలోపేతం చేసేందుకే.. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను బలోపేతం చేసేందుకే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయా బీసీ కార్పొరేషన్ల ఆధ్వర్యంలో కులసంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయిలో విస్తృత సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ మత్స్యకారులకు మేలు చేసేందుకే ప్రభుత్వం 217 జీవో తెచ్చినట్లు చెప్పారు. దీనిపై తెలుగుదేశం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఈ జీవోను అడ్డం పెట్టుకుని మత్స్యకారుల భావోద్వేగాలు రెచ్చగొట్టాలని చంద్రబాబు చూస్తున్నారని విమర్శించారు. ఈ సమ్మేళనంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, వడ్డీలు కార్పొరేషన్ చైర్పర్సన్ సైదు గాయత్రిసంతోషి, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్, నవరత్నాలు నారాయణమూర్తి, బెస్త కుల నాయకులు కందుకూరు సోమయ్య, బోలా నారాయణ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. -
బీసీలకు ఇది స్వర్ణయుగం
సాక్షి, అమరావతి: దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో సీఎం జగన్ నాయకత్వంలో వెనుకబడిన వర్గాలకు స్వర్ణయుగం లాంటి పాలన అందుతోందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ తెలిపారు. సోమవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘బీసీలకు రుణాలెక్కడ?’ అంటూ ఈనాడు పత్రిక తప్పుడు కథనాన్ని ప్రచురించిందని మండిపడ్డారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయోజనాల కోసం మభ్యపెట్టే యత్నాలను మానుకోవాలని ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 యాజమాన్యాలకు హితవు పలికారు. బీసీలను నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు తన అనుకూల మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో బీసీలకు కేవలం రూ.1,626 కోట్ల రుణాలు విదిల్చి రుణగ్రస్తులను చేస్తే సీఎం జగన్ 26 నెలల వ్యవధిలో రూ.69,841.67 కోట్ల మేర బీసీలకు ఆర్థిక తోడ్పాటు అందించి వెన్నెముక వర్గాలుగా నిలబెట్టారని చెప్పారు. బీసీలకు నేరుగా డబ్బులివ్వడం తప్పు అనే రీతిలో ఈనాడు పత్రిక వార్తలను వండి వార్చడం దుర్మార్గమన్నారు. బీసీలను రుణగ్రస్తులుగానే ఉంచాలనే చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. బీసీల జీవితాలను మరింత కుంగదీయాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. నేరుగా ఖాతాల్లోకే నగదు బీసీలను రుణాల నుంచి విముక్తులను చేసేలా మధ్యవర్తులకు తావులేకుండా ప్రతి పైసాను నేరుగా లబ్ధిదారులకే అందిస్తూ సీఎం జగన్ పారదర్శక పాలనతో దేశంలోనే ఆదర్శంగా నిలిచారని మంత్రి వేణు పేర్కొన్నారు. 26 నెలల కాలంలో 4.4 కోట్లకుపైగా బీసీ లబ్ధిదారులకు నేరుగా, పరోక్షంగా రూ. 69,841.67 కోట్లు అందించారని వివరించారు. ప్రభుత్వ పథకాల ద్వారా రాష్ట్ర ప్రజలకు కలిగిన ప్రయోజనాల్లో బీసీలకు 50.11 శాతం మేర లబ్ధి చేకూరగా సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం చేసిన ఖర్చులో బీసీలకు 49.66 శాతం దక్కిందన్నారు. పలు సంక్షేమ పథకాల ద్వారా 3.24 కోట్ల మందికిపైగా బీసీ లబ్ధిదారులకు రూ.50,495.28 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ (డీబీటీ) చేశామన్నారు. ఏడు పథకాల ద్వారా 1,21,52,921 మంది బీసీలకు రూ.19,346.39 కోట్ల మేర పరోక్షంగా లబ్ధి చేకూరిందని వివరించారు. చరిత్రను తిరగరాస్తున్న సీఎం జగన్ బీసీలు చంద్రబాబు పాలనలో అణచివేతకు గురైతే సీఎం జగన్ పాలనలో ఎదుగుతున్నారని మంత్రి వేణు పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాలను సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెన్నెముకగా నిలిపేలా సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలను బీసీలంతా స్వాగతిస్తున్నట్లు చెప్పారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా నామినేటెడ్ పదవులను బీసీలకు కట్టబెట్టడం, ముఖ్యంగా మహిళలకు 50 శాతానికిపైగా పదవులు దక్కడం ఒక చరిత్ర అన్నారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్ల ఏర్పాటుతోపాటు ప్రతి కార్పొరేషన్‌కూ 12 మంది డైరెక్టర్లు ఉండేలా నియామకాలు చేశామన్నారు. కార్పొరేషన్ల చైర్మన్లలో 29 పోస్టులు, 672 మంది డైరెక్టర్లలో 339 పదవులను మహిళలకే అప్పగించడం ద్వారా మహిళా సాధికారతలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామన్నారు. బాబా సాహెబ్ అంబేడ్కర్, మహాత్మ జ్యోతిబా పూలే బాటలో నడుస్తూ మహిళాభ్యున్నతి కోసం కృషి చేస్తున్న సీఎం జగన్ చరిత్రలో నిలుస్తారన్నారు. వెనుకబడిన వర్గాలకు ఇన్ని పదవులు ఇవ్వటం, అందులో సగం మహిళలకు దక్కటం ఎక్కడైనా చూశారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు ఏ రోజూ మహిళలకు గౌరవం ఇవ్వలేదని, బీసీలను తోకలు కత్తిరిస్తానంటూ బెదిరించారని గుర్తు చేశారు. బాబు పాలనలో పింఛన్‌కూ లంచమే.. చంద్రబాబు పాలనలో లంచం ఇవ్వనిదే ఏ పని జరిగేది కాదని, జన్మభూమి కమిటీలు పింఛన్ మంజూరు కూడా లంచాలు గుంజిన సంగతి అందరికీ తెలుసని మంత్రి వేణు గుర్తు చేశారు. బీసీలకు రుణాలు, పింఛన్, ఇళ్ల స్థలం, రేషన్‌కార్డు ఏది కావాలన్నా లంచం ఇవ్వనిదే కనికరించిన పరిస్థితిని చంద్రబాబు హయాంలో చూశామన్నారు. చంద్రబాబు సొంత కులానికి మినహా ఇతరులకు చేసింది ఏమీ లేదన్నారు. తమకు తెలియకుండా మీటర్లు బిగించారని శ్రీకాకుళం జిల్లా జములూరు మండలానికి చెందిన రైతు కింజారపు సత్యన్నారాయణ చెప్పినట్లు ఈనాడులో ప్రచురించిన కథనంలో నిజం లేదన్నారు. ఈమేరకు రైతు సత్యన్నారాయణ ఖండనను మంత్రి వేణు విలేకరులకు వినిపించారు. -
సీఎం జగన్ వల్లే బీసీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో బీసీలు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. బీసీలు కుల వృత్తులకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వం తగిన సహకారమందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అర్థం చేసుకుని.. క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
4,02,336 మందికి ఈబీసీ నేస్తం
సాక్షి, అమరావతి: ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు చేయూత అందించే ఈబీసీ నేస్తం పథకం అమలుకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు, వారిని ఏవిధంగా గుర్తించాలనే దానిపై మంగళవారం బీసీ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనంతరాము ఉత్తర్వులిచ్చారు. ఈ పథకం కింద 45 నుంచి 60 ఏళ్లలోపు వయసున్న అగ్రవర్ణాల మహిళలకు ప్రభుత్వం ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు సంవత్సరాలపాటు రూ.45 వేలు ఇవ్వనుంది. ఈ పథకం కింద 4,02,336 మంది లబ్ధిపొందే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది. ఏడాదికి రూ.603.5 కోట్ల చొప్పున మూడేళ్లకు రూ.1,810.51 కోట్లు ఈ పథకం అమలుకు ఖర్చవుతుంది. ఇందుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులపై సర్కారు ఉత్తర్వులు జారీచేసింది. లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలు ఆధార్‌కార్డు, బ్యాంక్ ఖాతా ఉండాలి. కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.10 వేలు, పట్టణ ప్రాంతాల్లో రూ.12 వేలలోపు ఉండాలి. మాగాణి 3 ఎకరాలు, మెట్ట 10 ఎకరాలలోపు మాత్రమే ఉండాలి. మునిసిపల్ ఏరియాలో 750 చదరపు అడుగులలోపు ఇల్లు ఉన్న వాళ్లు అర్హులు. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అనర్హులు. ఇందులో పారిశుధ్య ఉద్యోగులకు మినహాయింపు ఉంటుంది. కారు ఉండకూడదు (ట్యాక్సీ, ట్రాక్టర్, ఆటో ఉండవచ్చు). కుటుంబ సభ్యులెవరూ ఆదాయపు పన్ను చెల్లించి ఉండకూడదు. ప్రభుత్వం ఈ పథకం గురించి ఆదేశం ఇచ్చిన రోజు నుంచి లబ్ధిదారుల వయసును పరిగణనలోకి తీసుకుంటారు. గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటి సర్వేచేసి అర్హతలున్న వారిని గుర్తిస్తారు. ఆ తర్వాత వివిధ దశల్లో పరిశీలించి జిల్లా కలెక్టర్ తుది జాబితా రూపొందిస్తారు. ఈ పథకం అమలుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ఠీఠీఠీ. n్చఠ్చిట్చజ్చుఝ. ్చp. జౌఠి. జీnను అభివృద్ధి చేశారు. అర్హుల గుర్తింపు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు ప్రక్రియ అంతా దీనిద్వారానే జరుగుతుంది. ఎంపిక పూర్తయ్యాక నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేస్తారు. -
బీసీల సంక్రాంతి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని, వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని ఆయన చెప్పారు. స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన కులాలకు అండగా ఉంటానని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బీసీల కోసం ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి హాజరయ్యే వారికి పాస్‌లు జారీ చేస్తామని చెప్పారు. బీసీల కల నెరవేరబోతోంది: మంత్రి చెల్లుబోయిన వెనుకబడిన తరగతుల వారిని కల్చర్ ఆఫ్ ఇండియాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ వేసి, ఏడాది వ్యవధిలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించినట్టు వివరించారు. వారిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఒకే వేదికపై డైరెక్టర్లు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా బీసీలకు ముందే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, డీసీపీ హర్షవర్దన్‌రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
ఎన్నడూ లేని విధంగా బీసీల సంక్షేమం
సాక్షి, అమరావతి/మంగళగిరి: బలహీనవర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్ధికంగా, సామాజికంగా బలోపేతం చేసేందుకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి బీసీల పక్షపాతిగా నిలిచారని కొనియాడారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, చైర్మన్లు, డైరెక్టర్లను నియమించి సరికొత్త నాయకత్వానికి శ్రీకారం చుట్టారని ప్రశంసించారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరులో శుక్రవారం బీసీల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా 56 మంది బీసీ కార్పొరేషన్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. మహాత్మా జ్యోతిరావు పూలే, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి వేదికపైకి ఆహ్వానించగా ఎంపీ మోపిదేవి వెంకట రమణారావు సభకు అధ్యక్షత వహించారు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు, డైరెక్టర్లకు తిరుపతిలో ప్రొటోకాల్ దర్శనం కల్పిస్తామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ.. బీసీలకు ఆత్మస్థైర్యం కలిగించిన ఏకైక సీఎం జగన్ అని కొనియాడారు. మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. బీసీల కోసం చంద్రబాబు ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు ఖర్చు చేస్తే వైఎస్ జగన్ ఏడాదిన్నర కాలంలోనే రూ.67 వేల కోట్లు అందించారన్నారు. రహదారులు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబుకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. ఎంపీలు.. పిల్లి సుభాష్ చంద్రబోస్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు.. కొలుసు పార్థసారథి, జోగి రమేశ్, మధుసూదన్ యాదవ్, కాపు రామచంద్రారెడ్డి, అదీప్‌రాజ్, విడదల రజని, రెడ్డి శాంతి, ఎమ్మెల్సీ శేషుబాబు, రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడు చిల్లపల్లి మోహనరావు, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు పూలే ఏ సమాజాన్ని అయితే ఆశించారో.. అదే సమాజ స్థాపన దిశలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని తోడు చేసుకుని సీఎం ముందుకు సాగుతున్నారని చెప్పారు. -
మరో 4.39 లక్షల మంది అర్హులకు నేటి నుంచి సాయం
సాక్షి, అమరావతి: వివిధ పథకాల కింద అర్హత ఉండీ ఇప్పటివరకు సాయం అందని వారికి శనివారం నుంచి ఆయా పథకాల కింద సాయం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్ కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వైఎస్సార్ చేయూత పథకాలకు అర్హులై ఉండీ లబ్ధి కలగని 4.39 లక్షల మందికి ఈనెలలో వాటిని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం (నేడు) కాపునేస్తం, 9న వాహనమిత్ర, 10న జగనన్న చేదోడు, 11న నేతన్న నేస్తం, 12న చేయూత పథకాల కింద 4.39 లక్షల మందికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వలంటీర్ వ్యవస్థ ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో 28,19,000 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. సీఎం జగన్ ప్రజాసేవ అనే తపస్సులో భాగమే ప్రజా సంకల్పయాత్ర అని పేర్కొన్నారు. జగన్లాగా ఇచ్చినమాట నిలుపుకొనే వ్యక్తులు అరుదన్నారు. కష్టపడ్డ నాయకుడు కనుకే కష్టాలు తెలిసి, కష్టపడ్డవారికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా విపత్తులోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా సాగుతున్నాయన్నారు. నాడు చంద్రబాబుది పథకాలు ప్రకటించి ఎగ్గొట్టాలనే లక్ష్యం ఉన్న ప్రభుత్వమని విమర్శించారు. -
‘పాలక’ పండగ
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు సమున్నత గౌరవం కల్పిస్తూ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వాటికి పాలక మండళ్లను నియమించింది. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమం దిశగా వడివడిగా చర్యలు చేపట్టింది. ప్రతి బీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌తోపాటు 12 మంది డైరెక్టర్లను నియమించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లను ఆయన ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, మహిళలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని వివరించారు. పాలక మండళ్లలో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లు చెప్పారు. సంఘాల కంటే మిన్నగా: డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కులాలకు ప్రభుత్వంలో ఎంతో గౌరవం కల్పించారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకునే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా వెనుకబడిన వర్గాలకు అన్ని విధాల సాయం అందించి ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్పొరేషన్లు కుల సంఘాల కంటే మిన్నగా ఆయా కులాల కోసం పనిచేస్తాయన్నారు. పాలక మండళ్లు ఆయా కులాల ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో ఎంపీ మోపిదేవి, మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ బడ్జెట్ కంటే మిన్నగా: మంత్రి బొత్స బీసీలంటే వెన్నెముకలాంటి వారని ముఖ్యమంత్రి జగన్ చేతల్లో నిరూపించారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో నాయకత్వ పటిమను గుర్తించి గౌరవించిన సీఎంకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. బీసీలకు బడ్జెట్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక, సామాజిక మార్పులే లక్ష్యం: ఎంపీ మోపిదేవి గత ప్రభుత్వాలు బీసీలకు తాళ్లు, గేదెలు, ఇస్త్రీపెట్టెలు లాంటివి ఇచ్చి అదే సంక్షేమం అని మభ్యపుచ్చాయని, ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు విమర్శించారు. ఇప్పుడు వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. బీసీల బాధలను ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో స్వయంగా చూశారని, ఆయన హృదయంలో నుంచి ఈ కార్పొరేషన్ల వ్యవస్థ పుట్టుకొచ్చిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా బీసీల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, మాలగుండ్ల శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు 1. రజక కార్పొరేషన్: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా) 2. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం) 3. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డాక్టర్ బి.నళిని (అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె.వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: తరిగొండ మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియార్: తిరుపతూర్ గోవిందరాజన్ సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి) 10. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి) 11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి) 12. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి) 13. షేక్/షెయిక్: షేక్ యాసిన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు) 15. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు) 16. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్ (కడప) 18. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప) 20. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప) 21. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప) 22. విశ్వబ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా) 26. వాల్మీకి/బోయ: డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు) 27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు) 28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు) 29. వీరశైవ లింగాయత్: వై.రుద్రగౌడ్ (కర్నూలు) 30. ముదిరాజ్/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్ (నెల్లూరు) 31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి: ఎస్.కిషోర్‌సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం) 36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం) 43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం) 44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పిల్లి సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం) 51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52. దాసరి: డాక్టర్ రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి) 54. శెట్టిబలిజ: డాక్టర్ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి) 55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి) -
మహిళలకు ఆర్థిక భరోసా
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ చేయూత’ పథకం కింద వచ్చిన సొమ్ముతో చిన్నపాటి వ్యాపారాలు ప్రారంభించిన మహిళలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టింది. సర్కారు లక్ష్యానికి అనుగుణంగా వివిధ కంపెనీలు, ఆయా శాఖల కార్పొరేషన్ల ఎండీలు, లబ్ధిదారులతో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుకొచ్చిన కంపెనీలు ► బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన మహిళలు వైఎస్సార్ చేయూత పథకం లబ్ధిదారులుగా ఉన్నారు. ఒక్కొక్కరికీ ప్రభుత్వం నాలుగేళ్ల పాటు రూ.75 వేలు ఆర్థిక సాయం చేస్తుంది. ► వారికి ఇప్పటికే మొదటి విడత సాయం అందించింది. ఆ సొమ్ముతో అత్యధికులు కిరాణా దుకాణాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ► వారికి వివిధ కంపెనీలు తమ ఔట్లెట్స్ ద్వారా సరుకులు సరఫరా చేసేందుకు అంగీకరించాయి. ► హిందుస్థాన్ లీవర్ కంపెనీ ప్రతినిధులు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ సరుకులు సరఫరాకు అయ్యే రవాణా ఖర్చులు తామే భరిస్తామని చెప్పారు. ► 3 నెలల వరకు సరుకు అమ్ముడుకాకపోతే రిటర్న్ తీసుకునేందుకు కూడా పలు కంపెనీలు అంగీకరించాయి. ► హిందుస్థాన్ యూనివర్సల్ లిమిటెడ్, ఐటీసీ, పీఅండ్‌జీ కంపెనీలు సంబంధిత మహిళలకు అవసరమైతే రుణ సాయం చేస్తామని, సరుకులు సరఫరా చేసి వ్యాపారాభివృద్ధికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపాయి. ► లబ్ధిదారుల సందేహాలకు ఆయా కంపెనీల ప్రతినిధులు సమాధానాలు ఇచ్చారు. -
సంతోషంగా బీసీలు
సాక్షి, అమరావతి: బీసీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న కృషిని చూసి వారంతా ఎంతో సంతోషంగా, ఆనందంగా ఉన్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకర్ నారాయణ అన్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే బీసీల సంక్షేమం, అభ్యున్నతి కోసం సీఎం పనిచేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో బీసీలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు. గత ప్రభుత్వంలో బీసీలకు జరిగిన అన్యాయం, వారి కష్టాలు తెలుసుకునేందుకు సీఎం వైఎస్ జగన్ అధ్యయన కమిటీని వేశారన్నారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్, బీసీ ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి శంకర్ నారాయణ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. – బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, నామినేటెడ్ వర్కుల్లో, మహిళలకు పదవుల్లో 50 శాతం రిజర్వేషన్‌ను సీఎం వైఎస్ జగన్ కల్పించారు. – స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది. కేబినెట్లో కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. – ఈ నెల 20 బీసీలకు పండుగ రోజు. బీసీల సంక్షేమానికి 28 కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు సీఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. 30 వేల జనాభా మించిన బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చైర్మన్, డైరెక్టర్లను నియమిస్తాం. – కొత్తవాటితో కలుపుకుని బీసీల కోసం మొత్తంగా 52 కార్పొరేషన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కార్పొరేషన్ల ద్వారా గతంలో 69 కులాలనే పరిగణనలోకి తీసుకోగా, ఇప్పుడు మొత్తం 139 కులాలు కవర్ అవుతున్నాయి. – వైఎస్సార్ చేయూత ద్వారా సింహభాగం లబ్ధి బీసీ మహిళలకే జరుగుతుంది. – గత ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూసింది. అందుకే బీసీలు గత ఎన్నికల్లో టీడీపీకి బుద్ధి చెప్పారు. – బీసీలంతా వైఎస్ జగన్ వెంటే ఉన్నారు. ఆయనకు బీసీలందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారు: మంత్రి ధర్మాన కృష్ణదాస్ – 2014 ఎన్నికల్లో బీసీలు టీడీపీకి మద్దతిచ్చి గెలిపిస్తే చంద్రబాబు బీసీలను అన్ని విధాలా మోసం చేశారని రోడ్లు, భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. – టీడీపీ బీసీలను బ్యాక్వర్డ్ క్యాస్ట్‌గా కాకుండా బిజినెస్ క్యాస్ట్‌గా చూసింది. – వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటివరకు వివిధ పథకాల ద్వారా 2,12,40,810 మంది బీసీలకు రూ.22,685.74 కోట్ల లబ్ధి జరిగింది. – ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. చంద్రబాబు బీసీలను వాడుకున్నారు తప్ప బీసీల బాగోగులు చూడలేదని అన్నారు. – ఎమ్మెల్యే జోగి రమేశ్ మాట్లాడుతూ.. బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ క్యాస్ట్ అని భావించిన వైఎస్ జగన్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనారిటీల అభ్యున్నతికి అనేక చట్టాలు చేసిందన్నారు. – మీడియా సమావేశంలో ఎమ్మెల్యేలు మధుసూదన్ యాదవ్, చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. -
కాపు నేస్తం
-
వైఎస్సార్ కాపు నేస్తంకు శ్రీకారం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాపు నేస్తం పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి సామాజికవర్గాల మహిళలకు ఆపన్నహస్తం అందించడానికి సిద్ధమైంది. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వయసున్న మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏటా రూ.15 వేల చొప్పున ఐదేళ్లలో మొత్తం రూ.75 వేలను అందించనుంది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.కరికాలవలవన్ మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఈ పథకాన్ని అమలు చేయాలని సర్కార్ నిర్ణయించింది. లబ్ధిదారుల ఎంపిక కోసం సర్కార్ జారీ చేసిన మార్గదర్శకాలు.. - ఒక్కో కుటుంబానికి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.10 వేలు.. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ.12 వేలలోపు ఆదాయం ఉండాలి. - కుటుంబానికి మూడెకరాల మాగాణి లేదా పదెకరాల్లోపు మెట్ట భూమి ఉండొచ్చు. - కుటుంబసభ్యుల్లో ఏ ఒక్కరూ ఆదాయ పన్ను చెల్లించి ఉండకూడదు. - పట్టణ ప్రాంతాల్లో 750 చ. అడుగుల్లోపు నిర్మిత భవనం ఉన్నా అర్హులే. - 45–60 ఏళ్లలోపు వయసు ఉన్నట్లు ధ్రువీకరించే ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్టిఫికెట్, జనన ధ్రువీకరణ పత్రం, ఓటర్ గుర్తింపు కార్డు, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన పెన్షన్ కార్డు గానీ ఉండాలి. - కుటుంబానికి నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు. - కుటుంబంలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే అనర్హులు. పారిశుధ్య ఉద్యోగులు ఉంటే అర్హులే. లబ్ధిదారుల ఎంపిక ఇలా.. వైఎస్సార్ కాపు నేస్తం కింద లబ్ధిదారులను గ్రామీణ ప్రాంతాల్లో గ్రామ వలంటీర్లు.. పట్టణ ప్రాంతాల్లో వార్డు వలంటీర్లు ఇంటింటా సర్వే చేసి గుర్తిస్తారు. లబ్ధిదారు, కుటుంబ పెద్ద ఆధార్ నంబర్లు, కుల, జనన ధ్రువీకరణ పత్రాలు, కుటుంబ ఆదాయం, బ్యాంక్ పాస్ పుస్తకం, ఆస్తుల వివరాలను అధికారులు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. -
ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందనే బాబు భయం
మడకశిర: అమరావతిలో జరిగిన ఇన్సైడర్ ట్రేడింగ్ ఎక్కడ బయటపడుతుందోనని చంద్రబాబు భయపడుతున్నారని, అందుకే రైతులను పావులుగా వాడుకుంటూ నీచ రాజకీయం చేస్తున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా మడకశిరలో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను రెచ్చగొట్టేందుకు చంద్రబాబుకు జనసేన అధినేత పవన్ కూడా తోడయ్యారని దుయ్యబట్టారు. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు, టీడీపీ నేతలు, చంద్రబాబు సామాజికవర్గం వారు పెద్ద ఎత్తున ఇన్సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు తెలిపారు. ఈ వ్యవహారం బయటికి రాకుండా చంద్రబాబు రాజధాని రైతులను రెచ్చగొట్టి ఆందోళనలు చేయిస్తున్నారని ఆరోపించారు. రాజధాని రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, అన్ని ప్రాంతాల అభివృద్ధికే సీఎం వైఎస్ జగన్ పాలనా వికేంద్రీకరణ ప్రతిపాదన చేశారని, ప్రస్తుతం రాజధానిపై ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, కమిటీ నివేదిక రాకుండానే చంద్రబాబు రాజధానిపై రాద్ధాంతం చేయడం తగదని శంకరనారాయణ హితవుపలికారు. -
బీసీ విద్యార్థులకు సర్కారు బొనాంజ
వెనుకబడిన తరగతుల వారికి విదేశీ విద్య కింద అందజేసే ఆర్థిక సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచింది. రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఈ ఉత్తర్వులతో ఎంతోమందికి బీసీ విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే ఇది అమలుకానుంది. విదేశాల్లో చదువుకునేందుకు దరఖాస్తు చేసి ఇటీవల ఎంపికైన వారికి ఈ మొత్తం అందనుంది. ఆర్థిక సాయం పెంపుతో బీసీ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, అమరావతి ఎంపిక విధానం - ఏపీ ఈపాస్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో దరఖాస్తు చేసుకోవాలి. - 33 శాతం మహిళలకు రిజర్వు చేస్తారు. - వారు లేని పక్షంలో పురుషులకు అవకాశం కల్పిస్తారు. - బీసీల్లో ఏ, బీ, డీ గ్రూపుల వారికి నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది. ఆర్థిక సాయానికి నిబంధనలివీ.. - పోస్టు గ్రాడ్యుయేషన్ చదివేందుకు వీలుగా ఏటా వెయ్యి మందికి ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు.. - అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం ఆరు లక్షలలోపు ఉండాలి. ఉద్యోగుల పిల్లలు కూడా ఈ పథకానికి అర్హులు. అయితే, వారి సంవత్సర ఆదాయం కూడా ఆరు లక్షలకు మించకూడదు. - దరఖాస్తు చేసిన సంవత్సరం జూలై ఒకటి నాటికి అభ్యర్థి వయస్సు 35 ఏళ్లకు మించరాదు. ఏఏ దేశాల్లో చదువుకోవచ్చు అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, న్యూజిలాండ్, స్వీడన్, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, డెన్మార్క్, రష్యా, ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా (ఫిలిప్పీన్స్, కజకిస్థాన్, చైనా దేశాల్లో కేవలం మెడిసిన్ చదువుకునేందుకు మాత్రమే అనుమతి). సెలక్షన్ కమిటీలో ఎవరెవరు కమిటీ చైర్మన్‌గా బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఉంటారు. సభ్యులుగా ఏపీ ఉన్నత విద్యా మండలి కార్యదర్శి, జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ ఉంటారు. స్కాలర్షిప్ ఇచ్చే విధానం - విద్యార్థి ల్యాండింగ్ పర్మిట్ చూపించగానే రూ.5లక్షలు మొదటి దఫాగా ఇస్తారు. - సెప్టెంబర్ రిజల్ట్ రాగానే రెండో దఫా రూ.5లక్షలు ఇస్తారు. - చదువుకున్న విశ్వవిద్యాలయం నుంచి విద్యార్థి యుటిలైజేషన్ సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో ఇలా.. - రూ.10 లక్షలు మాత్రమే ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇచ్చేవారు. - ప్రపంచంలోని 15 యూనివర్సిటీలు, కాలేజీల్లో మాత్రమే చదువుకునేందుకు అనుమతి ఇప్పుడు ఇలా.. - రూ.15 లక్షలు ఫీజు రీయింబర్స్మెంట్ కింద ఇస్తారు. - రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ప్రపంచంలోని టాప్ 100 యూనివర్సిటీల్లో ఎక్కడైనా చదువుకోవచ్చు. - సీటు రాగానే అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులు అర్హులు. మెరిట్ విద్యార్థులకు సువర్ణావకాశం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఎంతోమంది పేద విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు దోహదపడుతుంది. తాజాగా దరఖాస్తు చేసుకున్న వారికి రూ.15లక్షల రూపాయలు అంబేడ్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ పథకంలో ఆర్థిక సాయం అందిస్తాం. విదేశాల్లో అత్యున్నత వర్సిటీల్లో బీసీ విద్యార్థులకు విద్యను అందించాలని సర్కారు భావించడం గొప్ప నిర్ణయం. మెరిట్ విద్యార్థులకు ఇదొక మంచి సువర్ణావకాశం. – బి. రామారావు, బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ -
గురుకులాలకు కొత్త రూపు
సాక్షి, అమరావతి: బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు విద్యార్థులకు అన్నివిధాలా ఉపయోగపడేలా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అత్యవసరంగా కనీస మౌలిక వసతులు కల్పించడానికి నిధులు కేటాయించింది. టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇన్నాళ్లుగా సవాలక్ష సమస్యలతో కునారిల్లిన వీటిని అన్ని విధాలా తీర్చిదిద్దేందుకు నూతన ప్రభుత్వం కార్యాచరణను ప్రారంభించింది. మొత్తం 106 బీసీ గురుకుల విద్యాలయాలు ఉంటే అందులో భవనాలు లేక ఇప్పటికీ 20 గురుకుల స్కూళ్లను గత ప్రభుత్వం ప్రారంభించలేదు. 60 గురుకుల స్కూళ్లు ప్రైవేట్ భవనాల్లో నడుపుతున్నారు. ఈ భవనాలు విద్యార్థులు చదువుకోవడానికి అనువుగా లేవు. అన్నింటిలో మొత్తం 27,212 మంది విద్యార్థినీ, విద్యార్థులు కనీస సౌకర్యాలు లేకుండా విద్యాభ్యాసం చేస్తున్నారు. బీసీ విద్యార్థుల దుస్థితిని గుర్తించిన ప్రభుత్వం అత్యవసరంగా మౌలిక వసతులు (బాత్రూములు, మంచినీటి పైపులు, సెప్టిక్ ట్యాంకులు, భవనంలో దెబ్బతిన్న నేలలకు మరమ్మతులు, ఫ్యాన్లు, లైట్ల ఏర్పాటు, విద్యుత్ వైరింగ్, భవనాలకు పెయింట్లు, అదనపు తరగతి గదులు, మరుగుదొడ్లు, డార్మెట్రీలు, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలు, ల్యాబుల ఏర్పాటు) కల్పించేందుకు రూ.4 కోట్లు మంజూరు చేసింది. కాగా, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ గురుకుల విద్యాలయాలు, హాస్టళ్లలో ‘నాడు–నేడు’ కార్యక్రమం కింద వసతులు మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు మొదలుపెట్టింది. 4 భవనాల నిర్మాణాలు పూర్తి ప్రస్తుతం నాలుగు గురుకుల భవనాల నిర్మాణం పూర్తి కావస్తోంది. గుండుమల (బాలురు), గుండిబండ (బాలికలు), గొనబావి (బాలికలు), ఉదయమాణిక్యం (బాలికలు)ల్లో నిర్మాణాలు తుదిదశకు చేరుకున్నాయి. ప్రతిపాదనలు సిద్ధం రాష్ట్రంలో 26 బీసీ గురుకుల విద్యాలయాలు ప్రభుత్వ భవనాల్లో ఉన్నాయి. బాలికలవి 16, బాలురవి 10. ఈ స్కూళ్లలో వసతుల కోసం రూ.52.63 కోట్లతో గురుకుల విద్యాలయాల సంస్థ ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపింది. ఒక్కో భవనానికి రూ. 60 కోట్లు ప్రస్తుతం 60 గురుకులాలు అద్దె భవనాల్లో ఉంటున్నాయి. 52 స్కూళ్ల నిర్మాణానికి స్థలాలు ఇవ్వాల్సిందిగా రెవెన్యూ శాఖను బీసీ గురుకుల సొసైటీ కోరింది. కొత్తగా ఒక్కో భవనానికి రూ.60 కోట్లతో మొత్తం 76 భవనాల నిర్మాణానికి అంచనాలు సిద్ధం చేసింది. రూ.4,560 కోట్లు అవుతుందని అంచనా. నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. త్వరలోనే అన్ని సౌకర్యాలు త్వరలోనే బీసీ గురుకుల విద్యాలయాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తాం. ప్రైవేట్ భవనాల్లో ఉన్న స్కూళ్లలో పూర్తిస్థాయి సౌకర్యాలు లేవు. అయినా విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. కొత్త భవనాల నిర్మాణాలు, స్థల సేకరణ విషయంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఎ కృష్ణమోహన్, కార్యదర్శి, బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ. గిరిజన విద్యార్థులకు సమకూరిన సదుపాయాలు సీఎం ఆదేశాలతో కదిలిన యంత్రాంగం రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ హాస్టళ్లు, గురుకులాల్లోని విద్యార్థులకు అన్ని సదుపాయాలు సమకూరాయి. రెండు నెలల క్రితం నిర్వహించిన గిరిజన సంక్షేమ శాఖ సమీక్షలో విద్యార్థులకు సదుపాయాలు కల్పించడంలో విఫలమైతే చర్యలు తప్పవని, రెండు నెలల్లో పూర్తి సదుపాయాలు కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం ఆగమేఘాలపై ఏర్పాట్లు చేసింది. గిరిజన హాస్టల్ విద్యార్థులకు 32,88,499 నోట్ పుస్తకాలు, 98,706 కార్పెట్స్, 8,315 బెడ్‌షీట్స్, 14,72,146 మీటర్ల యూనిఫామ్ క్లాత్, 90,391 ఉలెన్ దుప్పట్లు, 53,181 ట్రంకు పెట్టెలు, 53,181 ప్లేట్లతోపాటు గ్లాసులు, 4,560 బంక్ బెడ్స్, 2,114 డ్యూయల్ డెస్క్‌లు సమకూర్చారు. గురుకుల బాలికల హాస్టళ్లకు 375 పొయ్యిలు, 1,119 డీప్ ఫ్రిజ్‌లు అందించి నూరు శాతం హాస్టళ్లు, గురుకుల విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారు. గురుకుల విద్యార్థులకు ఏడాదికి నాలుగు జతల బట్టలు ఇవ్వాల్సి ఉండటంతో.. 7.96 లక్షల మీటర్ల క్లాత్, 9.35 లక్షల నోట్ పుస్తకాలు అందించారు. 52 వేల కార్పెట్స్, 25,229 బెడ్ షీట్స్, 52 వేల కండువాలు, 25,949 ఉలెన్ దుప్పట్లు, 51,506 బ్లాక్ షూస్, రెండేసి జతల సాక్స్‌లు, 51,506 వైట్ షూస్, రెండేసి జతల సాక్స్‌లు అందించారు. యూనిఫామ్‌ను మెప్మా సభ్యులతో కుట్టించే కార్యక్రమాన్ని గత ప్రభుత్వం చేపట్టగా.. చాలాచోట్ల ఈ పని పూర్తి కాలేదు. 2019–20వ సంవత్సరానికి సంబంధించి యూనిఫామ్ క్లాత్‌ను అందజేసి, కుట్టు చార్జీలను సైతం విద్యార్థుల తల్లిదండ్రులకే ఇచ్చారు. -
కొత్తగా 60 కార్పొరేషన్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వివిధ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కొత్తగా 60 కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇందులో బీసీలకు 57, ఈబీసీలకు 3 కార్పొ రేషన్లు ఉన్నాయి. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారిని ఆర్థికంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ శాఖ ప్లాన్ ‘ఏ’ కింద 16, ప్లాన్ ‘బీ’ కింద మరో 41 కార్పొరేషన్ల ఏర్పా టుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇవికాకుండా కమ్మ, రెడ్డి, క్షత్రియులకు ప్రత్యేకంగా ఒక్కొక్క కార్పొరేషన్ ప్రతిపాదించారు. ఈ నెల 1న ముఖ్యమంత్రితో బీసీ సంక్షేమ శాఖ సమీక్ష జరగాల్సి ఉండగా.. అనివార్య కారణాల వాయిదా పడింది. త్వరలో జరగబోయే సమీక్షలో కొత్త కార్పొరేషన్ల ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. బీసీ–ఏ గ్రూపులో ఆదిమ తెగలు, విముక్తి జాతులు, సంచార, సెమీ సంచార జాతుల వారు, బీసీ–బీ గ్రూపులో వృత్తిపరమైన పనులు చేసుకునే, బీసీ–సీ గ్రూపులో క్రైస్తవ మతంలోకి మారిన వారు, బీసీ–డీ గ్రూపులో ఇతర బీసీ కులాల వారు, బీసీ–ఈ గ్రూపులో ముస్లింలలో వెనుకబడిన కులాలున్నాయి. కాగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 30 కార్పొరేషన్లు ఉండగా.. ఇందులో ఈబీసీలకు (కాపు, ఈబీసీ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ) కార్పొరేషన్లు ఉన్నాయి. దేవదాయ శాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్ మినహా యించి మిగిలిన ఈబీసీల కార్పొరేషన్లు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోకే వస్తాయి. -
విద్యార్థి ప్రగతికి ‘హాయ్’
సాక్షి, నెహ్రూనగర్(గుంటూరు) : వసతి గృహ విద్యార్థులకు పూర్తి వివరాలతో కూడిన హెల్త్, అకడమిక్ అండ్ ఐటెంటిటీ (హాయ్) కార్డుల అమలుకు బీసీ సంక్షేమ శాఖ శ్రీకారం చుట్టింది. ఈ విధానం గతంలో ఉండేది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మరుగున పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వెనకబడిన తరగతుల విద్యార్థుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపధ్యంలో గుంటూరు జిల్లాలో ముందుగా బీసీ సంక్షేమ శాఖ అడుగు లేసింది. విద్యార్థి పూర్తి సమాచారం హాయ్కార్డు చూడగానే విద్యార్థి విద్య, ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత వివరాలు ఉంటాయి. విద్యార్థి 3వ తరగతిలో హాస్టల్లో చేరగానే ఈ కార్డులో వివరాలు పొందుపరచాలి. మొదటి పేజీలోనే విద్యార్థి వ్యక్తిగత సమాచారం పూరించాలి. పేరు, బాలుడు/బాలిక, స్వస్థలం, చిరునామా, కాంటాక్ట్ నంబర్, కులం, ఆధార్ నంబర్, సంక్షేమ శాఖలో విద్యార్థి యూనిక్ నంబర్, గుర్తింపు చిహ్నాలు ఎంటర్ చేసి తండ్రి/సంరక్షకుడు సంతకం చేయాల్సి ఉంటుంది. మరో వైపు వసతి గృహ సంక్షేమ అధికారి సంతకం చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలంలో విద్యార్థి, ఎత్తు, బరువు, రక్తం గ్రూపు, ఇతర వివరాలు నమోదు చేస్తారు. విద్యార్థి హాస్టల్ నుంచి బయటికి వెళ్లే దాకా కార్డులో అన్ని వివరాలు పొందుపరుస్తూ వస్తారు. హాయ్ కార్డులను వార్డెన్లే నిర్వహించాల్సి ఉంటుంది. వారిదే పూర్తి బాధ్యత ఇప్పటికే ముద్రణ జరుగుతుడంటతో...మరి కొద్ది రోజుల్లోనే కార్డులు సరఫరా చేసేందుకు బీసీ సంక్షేమ శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. విద్యా సంబంధిత వివరాలు... విద్యార్థి త్రైమాసిక, అర్ధ సంవత్సరం, వార్షిక పరీక్షల్లో సాధించే మార్కుల వివరాలను ఎప్పటికప్పుడు ఇందులో నమోదు చేస్తారు. ఇందుకోసం కార్డులో ప్రత్యేక పట్టిక రూపొందించారు. సబ్జెక్టుల వారీగా సాధించిన మార్కులూ నమోదు చేస్తారు. సాధించిన మార్కులు, గరిష్టం, శాతం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్య వివరాలు... మరోవైపు ప్రతినెలా హాస్టళ్లలను వైద్యాధికారులు సందర్శించి విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధన ఉన్నా ఇప్పటికి దాకా అమలైన దాఖాలాలు లేవు. ఇకపై ఆ పరిస్థితి ఉండదు. కచ్చితంగా వైద్యాధికారులు ప్రతినెలా వెళ్లాల్సిందే. వారు వెళ్లి విద్యార్థికి పరీక్షలు నిర్వహించి ఏవైనా ఆరోగ్య ఇబ్బందులను గుర్తిస్తే హాయ్కార్డులో పొందుపరచాలి. తల్లిదండ్రులకు విద్యార్థుల ప్రగతి... ప్రతి నెలా జరిగే తల్లిదండ్రుల సమావేశంలో పిల్లల హాయ్కార్డులను వార్డెన్ తల్లిదండ్రులకు చూపిస్తారు. వీటిని చూసి తమ పిల్లలకు పరీక్షల్లో వస్తున్న మార్కులు, ఏయే సబ్జెక్టులో వెనుక బడ్డారో తెలుసుకుని అవగాహన కల్పించే వీలుంటుంది. ఇది ట్యూటర్లకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి శిక్షణ ఇచ్చే వీలుంటుంది. అలాగే ఎవరైనా అధికారులు ఆకస్మిక తనిఖీ చేసిన సంధర్బంలో కార్డులను పరిశీలించి పిల్లల ప్రగతిని అంచనా వేసే వీలుంటుంది. పక్కగా అమలు చేస్తాం హాయ్ కార్డుల విధానాన్ని పక్కగా అమలు చేస్తాం. విద్యార్థుల చదువుతో పాటు, ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇందులో నమోదు చేస్తాం. వీటి నిర్వహణ బాధ్యత హెచ్‌డబ్ల్యూఓలు తీసుకోవాలి. కార్డుల ముద్రణ జరుగుతుంది. మరి కొద్ది రోజుల్లోనే ఈ కార్డులను విద్యార్థులకు సరఫరా చేస్తాం. – డి.కల్పన, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
శిశు సంక్షేమం టాప్..
సాక్షి, హైదరాబాద్: ప్రోగ్రెస్ రిపోర్టు స్కూల్ విద్యార్థులకే కాదు ప్రభుత్వ శాఖలకూ వచ్చేశాయ్. హాజరుశాతం, మార్కుల ఆధారంగా బడిపిల్లలకు ఖరారు చేసే ర్యాంకులను శాఖలకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రతిభ, పనితీరు, వార్షిక నివేదికల మదింపు ఆధారంగా ర్యాంకులను ప్రకటించింది. 2018–19లో కనబరిచిన ప్రగతి.. 2019–20 ఆర్థిక సంవత్సరం కార్యాచరణ ప్రణాళికను పరిగణనలోకి తీసుకోవడంతో మహిళా, శిశుసంక్షేమ శాఖకు తొలి ర్యాంకును లభించింది. ఇక పనితీరులో బీసీ సంక్షేమ శాఖ వెనుకబడింది. కార్మికశాఖ రెండోస్థానంలో నిలవగా.. మూడో ర్యాంకును వ్యవసాయ, సహకార శాఖ కైవసం చేసుకుంది. నాణ్యతాప్రమాణాలు, పౌరసేవలు, శాఖల పనితీరును పరిగణనలోకి తీసుకున్న సర్కారు.. ఆయా శాఖలు అందజేసిన నివేదికలను సమీక్షించింది. ఈ మేరకు పర్యావరణ, అటవీశాఖ, గృహ నిర్మాణం, రెవెన్యూ, వాణిజ్య, ఎక్సైజ్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలకు సారథ్యం వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో ర్యాంకుల వడపోత ప్రక్రియ జరిగింది. సగటున 2 నుంచి 4 శాఖల పనితీరును మదింపు చేసిన ఈ అధికారులు.. మార్కులను ఖరారు చేశారు. సచివాలయంలోని 34 విభాగాలకుగానూ 20 శాఖలు వార్షిక నివేదికలు సమర్పించగా.. ఇందులో మహిళా, శిశుసంక్షేమం (9.84 మార్కులు), కార్మిక, ఉపాధి (9.42), వ్యవసాయ, సహకార (8.44), వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం (8.12), పశుసంవర్థకశాఖ (8.10)లు టాప్–5లో నిలిచినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి ప్రకటించారు. కాగా, బీసీ సంక్షేమశాఖ అట్టడుగున నిలవగా.. జీఏడీ విభాగానికి 19వ ర్యాంకు రావడం గమనార్హం. -
సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు
సాక్షి, అమరావతి: దేశంలో ఎక్కడాలేని విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు, వీటిలో 50 శాతం మహిళలకు రిజర్వేషన్లు కల్పించడంతో పాటుగా బీసీ వర్గాల అభ్యున్నతికి శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రత్యేక బిల్లులు తెచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ వర్గాలకు చెందిన ప్రతినిధులు మంగళవారం అసెంబ్లీలోని సీఎం కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైనదని, ఇది ఏపీ రాజకీయాల్లో ఓ సువర్ణాధ్యాయం అని వారు కొనియాడారు. బిల్లులు అసెంబ్లీలో ఆమోదించిన ఈ రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగినదన్నారు. భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న ఈ తరుణంలో సమాజంలోని అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి శ్రమిస్తున్న యువ నాయకుడు జగన్ అంటూ వారు అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రిని శాలువాలు, కిరీటంతో వైఎస్సార్సీపీ ప్రజా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పార్టీ బీసీ విభాగం అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం.శంకరనారాయణ, ఎమ్మెల్యేలు జోగి రమేశ్, కారుమూరి నాగేశ్వరరావు, విడదల రజని, ధనలక్ష్మి, అనంతపురం బీసీ నేత మీసాల రంగన్న ఉన్నారు. -
ఏపీలో సువర్ణాధ్యాయం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిజమైన సామాజిక విప్లవానికి నాంది పలుకుతూ రాష్ట్ర శాసనసభ నూతన అధ్యాయాన్ని లిఖించింది. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సామాజిక, ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కీలక బిల్లులను మంగళవారం ఆమోదించింది. సామాజిక న్యాయ స్ఫూర్తిని ప్రతిఫలింపజేస్తూ రాజ్యాంగ లక్ష్యాల సాధన దిశగా గొప్ప ముందడుగు వేసింది. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేసే బిల్లుతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అన్ని నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, మహిళలకు నామినేటెడ్ పోస్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు, నామినేషన్లపై ఇచ్చే పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ బిల్లుల లక్ష్యాలు, ఉద్దేశాలను రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ మంగళవారం శాసనసభకు వివరించారు. అనంతరం ఈ బిల్లులపై మంత్రులు, సభ్యులు కూలంకుషంగా చర్చించారు. ఈ బిల్లులతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని ఏకాభిప్రాయం వ్యక్తం చేస్తూ ప్రశంసించారు. రాష్ట్రంలో నూతన సామాజిక విప్లవానికి తెరతీస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని సభ్యులు కొనియాడారు. అనంతరం సభ ఈ బిల్లులను ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇది సుదినం.. కొత్త చరిత్రకు తెరతీస్తూ కీలకమైన బిల్లులను ఆమోదించడం ద్వారా శాసనసభ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు, మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు తీసుకువచ్చింది. ఎన్నో ఏళ్ల వివక్షకు ముగింపు పలుకుతూ ఆ వర్గాలకు సామాజిక, ఆర్థిక, రాజకీయంగా న్యాయమైన అవకాశాలను కల్పించేందుకు రాచబాట పరిచింది. బడుగు, బలహీన వర్గాల కష్టాలను పాదయాత్రలో చూసి చలించిన ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆ వర్గాల సర్వతోముఖాభివృద్ధికి విప్లవాత్మకమైన ముందడుగు వేశారు. బీసీల హక్కుల పరిరక్షణకు చట్టబద్ధత కల్పిస్తూ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో బీసీలు తమ హక్కులకు భంగం వాటిల్లినా, వివక్షకు గురైనా ఆశ్రయించడానికి వారికి ఓ చట్టబద్ధ వేదిక లభించింది. బీసీ జాబితాలో కొత్త కులాల చేర్పు, తొలగింపులను పరిశీలించేందుకు ఓ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. న్యాయాధికారాలు కలిగి ఉండే బీసీ కమిషన్ ఆ వర్గాల హక్కుల పరిరక్షణకు పెద్ద దిక్కుగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రాజకీయ, ఆర్థిక అభ్యున్నతికి చట్టబద్దత కల్పించింది. అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ 50 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో కార్పొరేషన్ చైర్మన్లు, మార్కెట్ కమిటీలు, ఇతర నామినేటెడ్ పోస్టుల్లో సగం బడుగు, బలహీన వర్గాలకు దక్కనున్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును కూడా శాసనసభ ఆమోదించింది. దాంతో ఆ వర్గాలు ఆర్థికంగా స్వావలంబన సాధనకు మార్గం సుగమమైంది. ఆకాశంలో సగం.. అవనిలో సగం ఉన్న మహిళలకు అవకాశాల్లోనూ సగం కల్పించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశయానికి ఆమోద ముద్ర వేసింది. అన్ని నామినేటెడ్ పోస్టుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభ ఆమోదించింది. దాంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పదవుల్లో మహిళలకు సగభాగం హక్కు దక్కింది. నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లును ఆమోదించింది. ఈ నేపథ్యంలో బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతికి దోహదం చేసేకీలక బిల్లులపై చర్చను ప్రతిపక్ష పార్టీ టీడీపీ బహిష్కరించడం విస్మయపరిచింది. ఆద్యంతం అడ్డుకునేందుకే యత్నం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలతో పాటు మహిళలకు ఆర్థిక, సామాజిక, రాజకీయ అధికారం కల్పించే కీలక బిల్లులపై అసెంబ్లీలో చర్చను అడ్డుకోడానికి ప్రతిపక్ష టీడీపీ శతథా యత్నించింది. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లు ఉద్దేశాలను మంత్రి శంకర నారాయణ అసెంబ్లీలో వివరిస్తుండగా టీడీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో అంతరాయం సృష్టించారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. కొందరు ఏకంగా స్పీకర్ పోడియం మీదకు చేరి నినాదాలు చేశారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళల సంక్షేమం, సాధికారికత కోసం కీలక బిల్లులపై చర్చకు సహకరించాలని ప్రభుత్వం తరఫున మంత్రి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ సభ్యులు ఏమాత్రం వినిపించుకోలేదు. మంత్రి శంకర నారాయణ ప్రసంగిస్తున్నంతసేపు నినాదాలు చేస్తునే ఉన్నారు. టీడీపీ సభ్యుల అరుపులు, కేకల మధ్యే డిప్యూటీ స్పీకర్ కొన రఘుపతి బిల్లులపై చర్చను కొనసాగించాల్సి వచ్చింది. తమ స్థానాల్లో కూర్చొని చర్చకు సహకరించాల్సిందిగా డిప్యూటీ స్పీకర్ చేసిన విజ్ఞప్తిని కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు. బిల్లుపై చర్చలో పాల్గొంటూ ఎమ్మెల్యేలు వేణుగోపాల్, కరణం ధర్మశ్రీ మాట్లాడుతున్నంతసేపూ టీడీపీ సభ్యులు వారి ప్రసంగానికి అడ్డుతగిలేందుకు ప్రయత్నిస్తునే ఉన్నారు. అయినప్పటికీ డిప్యూటీ స్పీకర్ నిబద్ధతతో చర్చను కొనసాగించారు. చివరికి ఎమ్మెల్యే పార్థసారథి ప్రసంగిస్తుండగా చంద్రబాబు, టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. బడుగు, బలహీన వర్గాలు, మహిళలకు అన్ని విధాలా మేలు చేకూర్చే విషయంలో టీడీపీ సభ్యులు వ్యవహరించిన తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అంబేడ్కర్ స్ఫూర్తిని పుణికిపుచ్చుకున్న సీఎం చట్టసభల్లో బడుగు, బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ అంబేడ్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ 366ను పొందుపరిచారు. ఆయన స్ఫూర్తితో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. – పీడిక రాజన్న దొర, ఎమ్మెల్యే, సాలూరు బీసీల సాధికారికతను అడ్డుకునేందుకు టీడీపీ కుట్ర బీసీలకు సాధికారికత చేకూర్చే చరిత్రాత్మక బిల్లులను అడ్డుకోవడానికి చంద్రబాబు, ఆయన బృందం సభకు అంతరాయం కలిగించేందుకు ప్రయత్నిస్తోండటం సబబు కాదు. వైఎస్ జగన్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న అక్కసుతో సభా వ్యవహారాలను అడ్డుకుంటున్నారు. బీసీలకు శాశ్వత కమిషన్ ఏర్పాటైతే తమ సమస్యలను నోరు విప్పి చెప్పుకోలేని స్థితిలో ఉన్న బీసీల విషయాలను సుమోటో కేసులుగా స్వీకరించే వెసులుబాటు లభిస్తుంది. – చెల్లుబోయిన వేణుగోపాల్, ఎమ్మెల్యే, రామచంద్రాపురం ఇలాంటి సీఎం కావాలని అందరూ కోరుకుంటున్నారు గత ప్రభుత్వం మైనార్టీలను ఓటు బ్యాంకుగానే చూసింది. కానీ మైనార్టీల సంక్షేమానికి చిత్తశుద్ధితో పని చేయడం ఎలాగో సీఎం వైఎస్ జగన్ చేసి చూపించారు. వారి పురోభివృద్ధికి ఏకంగా చట్టం తీసుకువస్తున్నారు. అలాంటి సీఎం కావాలని అన్ని రాష్ట్రాల ప్రజలూ కోరుకుంటున్నారు. – ముస్తఫా, ఎమ్మెల్యే, గుంటూరు ఈస్ట్ టీడీపీ ఓర్వలేకపోతోంది.. దేశ చరిత్రలోనే తొలిసారిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, నామినేషన్లపై ఇచ్చే పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. దీన్ని చూసి ప్రతిపక్ష టీడీపీ ఓర్వలేకపోతోంది. ఇంతటి చరిత్రాత్మక సమయంలో సభలో ఉండకుండా వెళ్లిపోవడం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం. 40 ఏళ్ల అనుభవం ఉందని చెప్పుకునే ఆయన తన పాలనలో బీసీలను అన్ని విధాలుగా మోసం చేశారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేస్తుంటే కూడా చూడలేకపోతుండటం టీడీపీ నైజాన్ని బయటపెడుతోంది. – అనిల్ కుమార్ యాదవ్, నీటి పారుదల శాఖ మంత్రి ఈ ఘనత సీఎం జగన్‌దే ఆకాశంలో సగం.. అవనిలో సగం.. అని మహిళల గురించి అందరూ అంటుంటారు. మహిళలకు నిజంగా అవకాశల్లో సగం ఇచ్చి సీఎం వైఎస్ జగన్ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఉప ముఖ్యమంత్రిగా గిరిజన మహిళ, హోం మంత్రిగా ఎస్సీ మహిళకు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు అన్ని నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేషన్లపై ఇచ్చే అన్ని పనుల్లోనూ మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. టీడీపీ ప్రభుత్వంలో మహిళలు అవమానాలకు గురయ్యారు. కానీ రాష్ట్రంలో మహిళలను చెల్లిగా, తల్లిగా గౌరవించే మహోన్నత స్వభావం ఉన్న వైఎస్ జగన్ సీఎం కావడం మన అదృష్టం. – ఆర్కే రోజా, ఎమ్మెల్యే, నగరి ఇది పండుగ దినం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇది నిజమైన పండుగ రోజు. రాజకీయ అధికారం, ఆర్థిక స్వావలంబన కల్పిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అణగారిన వర్గాలకు సామాజిక గౌరవం కల్పించారు. – కొరుముట్ల శ్రీనివాసులు, ఎమ్మెల్యే, రైల్వేకోడూరు బీసీల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు బీసీలు అంటే బ్యాక్ వర్డ్ కాదు బ్యాక్ బోన్ కులాలు అని చాటి చెప్పేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే చంద్రబాబు సహకరించకపోగా ఆటంకాలు సృష్టిస్తున్నారు. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. బీసీ హృదయాలలో జగన్ చిరస్మరణీయునిగా ఉంటారు. – కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్యే, చోడవరం బీసీల హక్కుల పరిరక్షణకు నాంది చంద్రబాబు బీసీలకు తీవ్ర ద్రోహం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 550తో రాష్ట్రంలో దాదాపు 500 మంది బీసీ విద్యార్థులు మెడికల్ సీట్లు కోల్పోయారు. చంద్రబాబు పాలనలో రాజధానితో సహా రాష్ట్రమంతటా కుల, మతాల తారతమ్యాలు, కుల వివక్ష విపరీతంగా పెరిగిపోయింది. ఇలాంటి సామాజిక రుగ్మతలను రూపు మాపడానికి సీఎం వైఎస్ జగన్ శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ నియమించాలని నిర్ణయించారు. ఈ కమిషన్‌తో బీసీల హక్కుల పరిరక్షణ సాధ్యపడుతుంది. – కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే, పెనమలూరు మరో అంబేడ్కర్, అల్లూరి అన్ని స్థాయిల్లోని పదవుల్లో బడుగు, బలహీన వర్గాలకు అంబేడ్కర్ చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించారు. ప్రస్తుతం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో అడుగు ముందుకు వేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో, నామినేషన్లపై పనుల్లోనూ 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇంతే కాకుండా ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ చేయబోమని ప్రకటించడం గిరిజనుల్లో సంతోషం కలిగించింది. అందుకే గిరిజనులు వైఎస్ జగన్‌ను మరో అంబేడ్కర్‌గా, మరో అల్లూరిగా కీర్తిస్తున్నారు. – భాగ్యలక్ష్మి, ఎమ్మెల్యే, పాడేరు మహిళా సాధికారికత సాకారం పార్లమెంటులో మహిళా బిల్లు మూడు దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. కానీ సీఎం వైఎస్ జగన్ తాను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే అన్ని నామినేటెడ్ పదవులు, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. తద్వారా మహిళా సాధికారికత కలను సాకారం చేశారు. – జొన్నలగడ్డ పద్మావతి, ఎమ్మెల్యే, శింగనమల దేశ చరిత్రలో ఇదే తొలిసారి అసమానతలకు గురవుతున్న అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. నామినేషన్లపై ఇచ్చే పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. వైఎస్ జగన్ నామినేషన్లపై ఇచ్చే పనుల్లో బడుగు, బలహీన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా నిజమైన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. – మేరుగ నాగార్జున, ఎమ్మెల్యే, వేమూరు సామాజిక న్యాయానికి శ్రీకారం బడుగు, బలహీన వర్గాలు, మహిళల అభ్యున్నతి, నిజమైన సామాజిక న్యాయం, సమాన హక్కుల కల్పన పట్ల సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధి, నిబద్ధత దేశానికి ఆదర్శప్రాయం. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుతో బలహీన వర్గాల హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పాత కమిషన్ బిల్లులున్నా అవి సరిగా పని చేయకపోవడంతో నూతన బిల్లును తీసుకువచ్చాం. ఈ కొత్త శాసనం బీసీలలో విశ్వాసం కలిగిస్తుందని విశ్వసిస్తున్నాం. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ అధికారంలో భాగస్వామ్యం కల్పించడం ద్వారానే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సామాజిక గౌరవం దక్కుతుందనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విధానం. అందుకే ఆ వర్గాలకు అన్ని నామినేటెడ్ పదవుల్లో, అన్ని నామినేటెడ్ పనులు, సర్వీస్ కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లులను ప్రవేశపెట్టి ఆ వర్గాల ఆర్థిక స్వావలంబన సాధనకు ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక పురుషులతో సమానంగా అన్ని రంగాల్లోనూ మహిళలు పురోగతి సాధించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన విధాన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా మహిళలకు నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించడం ద్వారా మహిళా సాధికారికత సాధనకు మార్గం సుగమమవుతుంది. – ఎం.శంకర నారాయణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి మహిళల అభ్యున్నతికి విప్లవాత్మక నిర్ణయం టీడీపీ ప్రభుత్వంలో మహిళలు పూర్తిగా మోసానికి గురయ్యారు. డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తామన్న హామీని చంద్రబాబు నెరవేర్చలేదు. సున్నా వడ్డీకి రుణాలను ఇవ్వలేదు. బెల్టు షాపులు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి దిగేనాటికి రాష్ట్రంలో వాటి సంఖ్యను 40 వేలకు పెంచారు. తహశీల్దార్ వనజాక్షి మీద దాడి చేసిన టీడీపీ ఎమ్మెల్యేను అప్పటి సీఎం చంద్రబాబు వెనకేసుకొచ్చారు. అందుకే ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఓడించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా మహిళలు బలోపేతం అయ్యేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. – పుష్ప శ్రీవాణి, డిప్యూటీ సీఎం మనసున్న పాలకుడి గొప్ప నిర్ణయం పదేళ్ల పాటు ప్రజల్లో ఉంటూ వారి కష్టాలు, కన్నీళ్లను దగ్గరి నుంచి చూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. మనసున్న పాలకుడి పాలన ఎలా ఉంటుందో ఆయన చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దేశానికి ఆదర్శంగా నిలిచారు. – బాలరాజు, ఎమ్మెల్యే, పోలవరం వైఎస్ జగన్‌కు సెల్యూట్.. ఐదు నెలల క్రితం ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే చేసి చూపిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. విలువలు, విశ్వసనీయత అంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్ర ప్రజల మనసులో నిలిచిపోతారు. అందుకే బీసీ వర్గాల తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సెల్యూట్ చేస్తున్నా. – జోగి రమేష్, ఎమ్మెల్యే, పెడన మహిళల ఆత్మవిశ్వాసం పెంచే మహా విప్లవం తరతరాలుగా మహిళల పట్ల జరుగుతున్న అన్యాయాలను సరిదిద్దే దిశగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పెద్ద ముందడుగు వేశారు. మహిళల ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవం పెంచే మహా విప్లవం ఇది. ఈ నిర్ణయం దేశ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతోంది. ఇందుకు మహిళా లోకం తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. – విడదల రజని, ఎమ్మెల్యే, చిలకలూరిపేట -
బీసీల అభ్యున్నతి, సాధికారత లక్ష్యంగా..
సాక్షి, అమరావతి: సుదీర్ఘ పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాట ప్రకారం, వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫేస్టోలో చేసిన వాగ్దానం మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీల అభ్యున్నతే లక్ష్యంగా శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీ కమిషన్ ఏర్పాటుకుచట్టం చేయడానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా సోమవారం అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎం. శంకర్ నారాయణ బీసీ కమిషన్ ఏర్పాటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల అడ్డంకులు, నినాదాలు, అధికార పార్టీ సభ్యుల హర్షాతిరేకాల మధ్య బిల్లును అసెంబ్లీ ముందుంచారు. శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా.. బీసీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడంతోపాటు సాధికారత పెంచాలని ప్రభుత్వం బలంగా కోరుకుంటున్న నేపథ్యంలో బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు బిల్లు ఉద్దేశాలు, లక్ష్యాల్లో పేర్కొన్నారు. బీసీ కమిషన్ శాశ్వత ప్రాతిపదికన.. పారదర్శకంగా పనిచేస్తుందని అందులో తెలిపారు. వెనుకబడిన తరగతుల సాధికారత, అభ్యున్నతికి సంబంధించిన అన్ని అంశాలను బీసీ కమిషన్ చూస్తుందని స్పష్టం చేశారు. కులధ్రువీకరణ పత్రాల దగ్గర నుంచి బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించడం, గ్రూపుల్లో చేర్పులు, మార్పులు, తదితర అంశాలపై కమిషన్ పనిచేస్తుంది. బీసీలపై జరిగే వేధింపులు, సాంఘిక బహిష్కరణ అంశాలు కూడా కమిషన్ పరిధిలోకే వస్తాయి. కమిషన్ ఏర్పాటుతో బీసీల్లో ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుందని, బీసీలకు అన్ని రంగాల్లో అవసరమైన రక్షణ చర్యలను ఈ కమిషన్ కల్పిస్తుందని బిల్లులో స్పష్టం చేశారు. ఎవరైనా తమను వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చాలని కోరితే వారి వినతిని కమిషన్ అధ్యయనం చేసి, తగిన సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తుంది. బీసీలకు సంబంధించిన ఇతర అంశాలపైన కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సిఫార్సులు చేయొచ్చు. విద్యా సంస్థల ప్రవేశాల్లో, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో రిజర్వేషన్లు పాటించకపోవడం వంటి ఫిర్యాదులపై కమిషన్ విచారణ చేసి ప్రభుత్వానికి నివేదికను సమర్పించనుంది. బీసీలతోపాటు బీసీల్లో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి సామాజిక ఆర్థిక, విద్య స్థితిగతులపై ఎప్పటికప్పుడు సర్వేలు, అధ్యయనాలు చేస్తుంది. వీరి అభ్యున్నతికి అవసరమైన సిఫార్సులు చేసి.. విధానాలను రూపొందించి ప్రభుత్వానికి సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఏదైనా అంశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటే అందుకు సంబంధించిన సిఫార్సులను కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు, సంక్షేమ కార్యక్రమాలపైన అధ్యయనం చేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడైనా సరే కమిషన్ ప్రజాభిప్రాయాన్ని సేకరించవచ్చు. బీసీ కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు కొత్తగా ఏర్పాటు చేసే బీసీ కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా హైకోర్టు జడ్జి ఉంటారు. సభ్యులుగా ఒక సామాజిక శాస్త్రవేత్త, వెనుకబడిన వర్గాలపై ప్రత్యేక అవగాహన ఉన్న మరో ఇద్దరు, కమిషన్ సభ్య కార్యదర్శిగా ప్రభుత్వ కార్యదర్శి ఉంటారు. వీరు మూడేళ్లు పదవిలో కొనసాగుతారు. వీరిపై ఏమైనా క్రిమినల్ కేసులున్నా, ఆశించిన రీతిలో విధులు నిర్వహించకుండా అసమర్థంగా వ్యవహరించినా, ఒకరిని ఒకరు దూషించుకున్నా, సెలవు పెట్టకుండా వరుసగా మూడు సమావేశాలకు గైర్హాజరైనా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. చైర్మన్, సభ్యులు మీడియాకు ఎలాంటి విధానపర నిర్ణయాలను వెల్లడించరాదని స్పష్టం చేశారు. కాగా.. కమిషన్‌కు సివిల్ కోర్టు అధికారాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన ఎవరినైనా తమ ముందు హాజరుకావాల్సిందిగా పిలిచే అధికారం ఉంటుంది. అలాగే అవసరమైన డాక్యుమెంట్లు, సమాచారాన్ని ప్రభుత్వం నుంచి తీసుకునే అధికారం కలిగి ఉంటుందని బిల్లులో స్పష్టం చేశారు. ప్రభుత్వ అనుమతితో బీసీ కమిషన్ సాంకేతిక నిపుణుల సేవలను కూడా పొందొచ్చునని బిల్లులో పేర్కొన్నారు. శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్‌ను ఏర్పాటు చేస్తున్నందున బిల్లులో ఆర్థిక మెమోరాండంను కూడా పొందుపరిచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,49,94,000 కేటాయించినట్లు పేర్కొన్నారు. -
నవరత్నాలకు అనుగుణంగా బడ్జెట్ అంచనాలు
సాక్షి, అమరావతి: సంక్షేమ శాఖలు 2019–20 సంవత్సరానికి బడ్జెట్ ప్రతిపాదనలు తయారు చేశాయి. బుధవారం ఆర్థిక శాఖ ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు లక్ష్యంగా బడ్జెట్ నివేదికలు సిద్ధమవుతున్నాయి. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ నవరత్నాలను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం బీసీల సంక్షేమానికి 2019–20 సంవత్సరంలో రూ.15వేల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్థిక శాఖకు బీసీ సంక్షేమ శాఖ బడ్జెట్ అంచనాలు తయారు చేసి సమర్పించింది. ఎస్సీల సంక్షేమానికి రూ.4వేల కోట్లకు పైగా, ఎస్టీల సంక్షేమానికి రూ.3,400 కోట్లతో బడ్జెట్ అంచనాలు రూపొందించి ఆర్థిక శాఖకు పంపించారు. మైనార్టీల సంక్షేమానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.1,300 కోట్లు కేటాయించగా కొత్త ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ రూ.1,800 కోట్లుగా ఉంది. ఇవన్నీ ప్రతిపాదనలు మాత్రమే కావడంతో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే బడ్జెట్‌ను బాగా పెంచాల్సి వస్తున్నదని అధికారులు చెబుతున్నారు. నేరుగా లబ్ధిదారునికి నగదు రూపంలో అందే పథకాలు ఎక్కువగా ఉన్నందున సంవత్సరానికి ఆయా కుంటుంబాలకు ఎంత మొత్తం ఇవ్వాల్సి ఉంటుందో లెక్కలు వేసి బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు. మ్యానిఫెస్టో ప్రకారం బడ్జెట్ అంచనాలు తయారు చేయాలని ఇప్పటికే అధికారులకు ప్రభుత్వం సూచన చేసింది. బీసీ సంక్షేమానికి సంబంధించి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు బడ్జెట్ అంచనాలు తయారు చేస్తే సుమారు రూ.15 వేల కోట్ల వరకు వచ్చినట్లు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి కరికాల వళవన్ చెప్పారు. మైనార్టీ సంక్షేమానికి కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బడ్జెట్లో రూ.1,800 కోట్ల వరకు అవసరం అవుతుందని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి రాంగోపాల్ తెలిపారు. ప్రతి సంక్షేమ శాఖలోనూ బడ్జెట్‌పై కసరత్తు పూర్తయింది. -
ఆ రైతు కుటుంబాలకు రూ.39 లక్షలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 49 రైతు కుటుంబాలకు ఊరట లభించింది. వెనుకబడిన తరగతుల ఆర్థిక సహకార కార్పొరేషన్ ద్వారా కేటగిరీ–1 యూనిట్ల కింద ఆ కుటుంబాలను ఆర్థిక సహకార పథకాలకు ఎంపిక చేసిన ప్రభుత్వం, తాజాగా నిధులు విడుదల చేసింది. ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఉపాధి యూనిట్లు తెరుచుకునే అవకాశాన్ని కల్పించింది. ఇందులో 80 శాతం మొత్తాన్ని ప్రభుత్వం రాయితీ రూపం లో ఇస్తుండగా, 20 శాతాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరించడమో లేదా బ్యాం కు రుణం తీసుకోవడంతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. ఇందులో భాగంగా 49 మందికి 80 శాతం రాయితీ కింద ఒక్కో కుటుంబానికి రూ.80 వేల చొప్పున మొత్తం రూ.39.20 లక్షలు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బి.వెంకటేశం గురువారం ఆదేశాలు జారీ చేశారు. -
పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి
హైదరాబాద్: పంచాయతీరాజ్ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడంతో పాటుగా, బీసీలకు పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రిజర్వేషన్లు పెంచాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో ఆయన నివాసంలో శుక్రవారం ఆర్.కృష్ణయ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్లను 34% నుంచి 22% తగ్గిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే రాష్ట్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరిపారని, దీనిమూలంగా 1,600 సర్పంచ్ పదవులు, 20 వేల వార్డు మెంబర్లు బీసీలకు దక్కకుండా పోయాయని వాపోయారు. రాష్ట్రంలో బీసీలు సమగ్ర సర్వే ప్రకారం 52% ఉంటే 34% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం పట్ల బీసీల్లో అసంతృప్తి ఉందన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో 34% రిజర్వేషన్ల ప్రకారం ఎన్నికలు జరపాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ సమస్య శాశ్వత పరిష్కారానికి రాజ్యాంగ సవరణకు సీఎం అధ్యక్షతన అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానితో చర్చలు జరపాలని మంత్రికి విన్నవించారు. పార్లమెంటు సమావేశాలు జరగడంలేదు కాబట్టి రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ జారీ చేయించవచ్చునన్నారు. దీనికి మంత్రి సానూకులంగా స్పందిస్తూ.. కేసీఆర్ నాయకత్వంలో కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపి రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్లు పెంచడానికి ప్రయత్నిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, నీల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
గతి తప్పిన వసతి!
- రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి బీసీ బాలుర వసతిగృహ సంక్షేమాధికారి.. మరో మూడు హాస్టళ్లకు ఇన్చార్జిగా బాధ్యతల్లో ఉన్నారు. వారంలో ఒకట్రెండు రోజులు మాత్రమే ఆయన విధులకు వస్తుంటారు. దీంతో అక్కడి వార్డెన్ వచ్చిన రోజు మినహా మిగతా రోజుల్లో విద్యార్థులదే రాజ్యం. తరగతులకు హాజరు కాకుండా జులాయిగా తిరగడం అక్కడి విద్యార్థులకు అలవాటైపోయింది. - మేడ్చల్ జిల్లా ఉప్పల్ బీసీ బాలుర వసతిగృహంలోనూ ఇదే పరిస్థితి. వార్డెన్ చాలా అరుదుగా విధులకు హాజరవుతారు. దీన్ని అలుసుగా తీసుకుంటున్న విద్యార్థులు కేవలం భోజన సమయాల్లోనే హాస్టల్‌కు వస్తుంటారు. మరి మిగతా సమయమంతా ఎక్కడికెళ్తారనే మీ సందేహానికి సమాధానం దొరకదు. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న వసతిగృహాల్లో పర్యవేక్షణ గతి తప్పింది. హాస్టళ్ల నిర్వహణలో కీలకమైన వ్యక్తి వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూవో). కానీ చాలాచోట్ల పూర్తిస్థాయి వార్డెన్లు లేకపోవడంతో.. ఆయా శాఖలు ఇన్‌చార్జీలతోనే వెళ్లదీస్తున్నాయి. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 2,245 వసతిగృహాలున్నాయి. వీటి పరిధిలో 2.84లక్షల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. ఈ వసతిగృహాలకు తగినంత సంఖ్యలో హెచ్‌డబ్ల్యూఓలు ఉండాలి. కానీ 1,218 వసతిగృహ సంక్షేమాధికారులు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో 1,027 సంక్షేమ వసతిగృహాలు ఇన్‌చార్జీలతోనే నడుస్తున్నాయి. వాస్తవానికి రెండేళ్ల క్రితమే శాఖల వారీగా హెచ్‌డబ్ల్యూవో పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చింది. కానీ నియామక ప్రక్రియలో తీవ్ర జాప్యం నెలకొనడంతో వాటి భర్తీ ప్రక్రియ ఇప్పటికీ కొలిక్కిరాలేదు. ఇన్చార్జీల నియామకంతో సంక్షేమ శాఖలు చేతులు దులుపుకున్నప్పటికీ.. విద్యార్థులను పర్యవేక్షించడం గాడితప్పడంతో విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారింది. పైరవీల జోరు మూడేళ్లుగా వసతిగృహ సంక్షేమాధికారుల భర్తీ నిలిచిపోయింది. ఉన్న సీనియర్లు పదవీ విరమణ పొందుతుండటం, ఖాళీల భర్తీ చేపట్టకపోవడంతో.. ఖాళీలు ఏటేటా పెరిగిపోతున్నాయి. మరోవైపు.. ఈ ఖాళీల్లో ఇన్‌చార్జీగా బాధ్యతలు కావాలంటూ సంక్షేమ శాఖల్లో పైరవీలు జోరుగా సాగుతున్నాయి. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న హాస్టల్లో పోస్టింగ్ కోసం జిల్లా సంక్షేమాధికారులను సైతంప్రభావితం చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల సంక్షేమాధికారులపై రాష్ట్ర కార్యాలయానికి ఫిర్యాదులు సైతం రావడంతో ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించారు. పెండింగ్‌లో ఏసీబీ కేసులు బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని వసతిగృహాల్లో రెండేళ్ల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రికార్డులన్నీ పరిశీలించగా భారీ స్థాయిలో అక్రమాలు వెలుగుచూశాయి. హాస్టల్ రికార్డుల్లో విద్యార్థులకు, వసతి పొందుతున్న వారి సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దీంతో దాదాపు 42 మంది హెచ్డబ్ల్యూవోలపై ఏసీబీ కేసులు నమోదు చేసింది. అవన్నీ ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. ఇందులో ఇరవై మందికి తిరిగి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ వారి పదోన్నతులను మాత్రం నిలిపివేశారు. షాడోల పాలనలో సగానికిపైగా వసతిగృహాల్లో ఇన్చార్జీలను నియమించడంతో అక్కడ పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పూర్తిస్థాయి హెచ్‌డబ్ల్యూలు లేనందున సమీపంలోని హెచ్‌డబ్ల్యూఓలకు ఇన్చార్జిగా బాధ్యత ఇచ్చారు. దీంతో రెగ్యులర్ హాస్టల్‌ను చూసుకుంటూనే ఆ ఉద్యోగి పక్క హాస్టల్‌కు ఇన్చార్జీ బాధ్యతలను నిర్వహిం చాలి. కానీ మెజారిటీ హాస్టళ్లలో ఇన్చార్జీలు కనీసం వారినికోసారైనా హాజరు కావడం లేదనే ఆరోపణలున్నాయి. చుట్టపుచూపుగా వచ్చి సంతకాలు చేయడం పరిపాటిగా మారింది. ఇన్చార్జీ రాకపోవడంతో హాస్టల్లో కిందిస్థాయి సిబ్బందిదే హవా. హాస్టల్ ఖర్చుల లెక్కలన్నీ వారి ఇష్టారాజ్యంగా సాగుతున్నాయి. హాస్టళ్లలోని విద్యార్థులు స్కూల్/కాలేజీకి హాజరవుతున్నారా? లేదా? అనేది పట్టించుకోవడం లేదు. కేవలం భోజన సమయానికి వస్తుండటం, తిరిగి బయటకు వెళ్లిపోవడం సర్వసాధారణమైంది. -
వేలిముద్ర పడితేనే ‘హాజరు’
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లో బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానుంది. వేలిముద్రలతో హాజరు స్వీకరణ ఇదివరకు అమలు చేసినప్పటికీ అందులో ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం లేదు. పిల్లల వేలిముద్రలు నమోదు చేసిన తర్వాత వాటి ఆధారంగా రోజువారీ హాజరును తీసుకునేవారు. కానీ ఈ ప్రక్రియ సాంకేతిక కారణాల వల్ల చాలాచోట్ల నిలిచిపోయింది. దీంతో మాన్యువల్ పద్ధతినే కొనసాగిస్తున్నారు. తాజాగా ప్రతి వసతి గృహంలో బయోమెట్రిక్ హాజరు పద్ధతిని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక సహకారాన్ని టీఎస్టీఎస్ (తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్)కు అప్పగించింది. ఈక్రమంలో బీసీ సంక్షేమ శాఖ ప్రయోగాత్మకంగా బీసీ హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేయించింది. ఇందులో ప్రత్యేకంగా రూపొందించిన సాఫ్ట్వేర్ సాయంతో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 697 హాస్టళ్లున్నాయి. ఇందులో 257 పోస్టుమెట్రిక్ హాస్టళ్లు కాగా, 440 ప్రీమెట్రిక్ హాస్టళ్లు. కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ప్రీమెట్రిక్ హాస్టళ్లలో ఏర్పాటు చేసింది. మిషన్ల ఇన్స్టలేషన్ పూర్తి చేసిన యంత్రాంగం రోజువారీ హాజరు తీరును పరిశీలిస్తోంది. కమిషనరేట్‌లో కమాండ్ కంట్రోల్ వసతి గృహాల్లో హాజరు తీరును పరిశీలించేందుకు బీసీ సంక్షేమ శాఖ కమిషనరేట్‌లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. రోజువారీ హాజరు ఎలా ఉందో ఇక్కడ్నుంచి పర్యవేక్షిస్తారు. ఈ మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ప్రస్తుతం ఆధార్ ఎనేబుల్డ్ బయోమెట్రిక్ విధానం కావడంతో ప్రతి విద్యార్థి ఆధార్ సంఖ్యతో వేలిముద్రలు అనుసంధానమవుతాయి. విద్యార్థులు తమ వేలి ముద్రను మిషన్‌లో నమోదు చేసిన వెంటనే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. వెనువెంటనే హాజరు నమోదవుతుంది. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉంటుంది. విద్యార్థులతోపాటు సిబ్బంది కూడా హాజరు నమోదు చేయాలి. వాటి ఆధారంగా మెస్ చార్జీలు ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అన్ని సంక్షేమ హాస్టళ్లలో ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ పద్ధతిని ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతిగృహాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వంనిర్ణయించింది. గతంలో ఎస్టీ సంక్షేమ శాఖ పరిధిలోని కొన్ని హాస్టళ్లలో బయోమెట్రిక్ మిషన్లు ఏర్పాటు చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు నెలకొనడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. తాజాగా కొత్త మిషన్లతో సరికొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. 2019– 20 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరును పక్కాగా అమలు చేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. -
కొత్త గురుకులాలు ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీకి ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన 119 గురుకుల పాఠశాలల ఏర్పాటుపై సందిగ్ధం వీడలేదు. ప్రస్తుతమున్న గురుకులాలు చాలకపోవడం, క్షేత్రస్థాయి నుంచి అత్యధిక డిమాండ్ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త గా 119 గురుకుల పాఠశాలలను మంజూరు చేసింది. ఈ ఏడాది ఆగస్టులో ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. కానీ వీటిని 2019–20 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో వీటి ఏర్పాటుకు ఏడాది పాటు సమయాన్ని గురుకుల సొసైటీకి ఇచ్చింది. వీటిని ఏయే ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలనే అంశంపై ప్రభుత్వం స్పష్టతనివ్వలేదు. మరో 4 నెలల్లో విద్యా సంవత్సరం ముగియనుంది. వచ్చే ఏడాది మే నెలలోగా భవనాల ఏర్పాటుతో పాటు బోధన, బోధనేతర సిబ్బందిని నియమించు కోవాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికీ లొకేషన్లు ఖరారు చేయకపోవడంతో భవనాల పరిశీలన ప్రక్రియే ప్రారంభం కాలేదు. నియోజకవర్గానికో బాలబాలికల గురుకులం తెలంగాణ ఏర్పాటుకు ముందు రాష్ట్రవ్యాప్తంగా కేవలం 23 బీసీ గురుకుల పాఠశాలలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ టు పీజీ కార్యక్రమంలో భాగంగా గురుకుల పాఠశాలల ఏర్పాటుకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా 2017–18 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా 119 గురుకుల పాఠశాలలను ప్రారంభించింది. నియోజకవర్గానికి ఒకటి చొప్పున వీటిని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో కొన్నిచోట్ల బాలుర, కొన్నిచోట్ల బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసింది. గురుకుల పాఠశాలలకు భారీ డిమాండ్ రావడంతో కొత్త గురుకులాల్లో సీట్ల సర్దుబాటు యంత్రాంగానికి కష్టంగా మారింది. ఈ క్రమంలో మరిన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వచ్చింది. దీంతో ప్రభుత్వానికి బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు పంపడంతో వాటిని ఆమోదిస్తూ కొత్తగా మరో 119 గురుకులాలను మంజూరు చేసింది. వీటిని ప్రారంభిస్తే నియోజకవర్గానికో బాల, బాలికల గురుకులం అందుబాటులోకి రానుంది. ప్రస్తుత గురుకులాలన్నీ అద్దె భవనాల్లోనే.. ప్రస్తుతం గురుకుల పాఠశాలలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఒక గురుకుల పాఠశాలకు కనిష్టంగా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనం, మైదానం ఉన్న వాటిల్లోనే కొనసాగించాలని నిబంధన విధించింది. చాలాచోట్ల సౌకర్యవంతమైన భవనాలు లభించకపోవడం అధికారులకు తలనొప్పిగా మారింది. కొత్త గురుకులాలకు అద్దె భవనాలు లభించడం కష్టంగా మారింది. ప్రారంభ తేదీ ముంచుకొస్తున్నప్పటికీ.. లొకేషన్లపై స్పష్టత లేకపోవడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
బీసీ రుణాలపై వీడని సందిగ్ధత
బీసీ రుణాల పంపిణీ మళ్లీ మొదటికొచ్చింది. నాలుగేళ్లుగా స్వయం ఉపాధి రుణాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో రుణాల పంపిణీ ప్రక్రియకు విఘాతం కలిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నాలుగేళ్లుగా ప్రభుత్వం బీసీ సంక్షేమ శాఖకు ఇస్తున్న హామీలు బుట్టదాఖలవుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉద్యోగాలు ఎలాగూ లేవు.. కనీసం స్వయం ఉపాధితో జీవనం గడుపుదామని భావించిన బీసీ వర్గాలకు నిరాశే ఎదురవుతోంది. జిల్లా వ్యాప్తంగా బీసీ సంక్షేమ శాఖకు బీసీలు, ఎంబీసీలు, ఫెడరేషన్ల రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 20 వేలకు చేరుకుంది. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం 100 మందికి రూ.50 వేల చొప్పున 50 లక్షల రుణాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మిగతా దరఖాస్తుదారులు తమకు రుణాలు వస్తాయా లేదా అనే మీమాంసలో పడ్డారు. సాక్షి, కరీంనగర్: జనాభాలో సగభాగమున్న బీసీల సమస్యలను పరిష్కరించడమే తమ లక్ష్యమని, బడుగు, బలహీన వర్గాల సమగ్రాభివృద్ధే తమ ధ్యేయమని, కుల వృత్తులకు పెద్దపీట వేస్తామని, సంక్షేమం కోసం ఎన్ని కోట్లయినా వెచ్చించేందుకు వెనుకాడబోమని పదేపదే వేదికలపై వల్లెవేస్తున్న ప్రజాప్రతినిధుల మాటలు నీటిమూటలుగా మారుతున్నాయి. నాలుగేళ్లుగా బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రుణాల జాడే లేదు. ఫెడరేషన్ల పరిస్థితి అదే తీరు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళిక ఊసేలేదు. దీంతో బడుగులపై ప్రభుత్వం సవతితల్లి ప్రేమ చూపుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాయితీలతో ఆశలు.. ఎన్నడూ లేని విధంగా 2015–16 ఆర్థిక సంవత్సరానికి రుణప్రణాళికలో భారీ రాయితీలను ప్రకటించింది. గతంలో ఇంత భారీ మొత్తం ఇవ్వలేదు. ఇచ్చినా రూ.2 లక్షలు మించి ఇచ్చేవారు కాదు. రాయితీ రుణంలో 50 శాతం మించేది కాదు. ఈసారి ప్రభుత్వం రాయితీ మొత్తాన్ని పెద్ద మొత్తంలో పెంచింది. కేటగిరి 1,2,3 పేరిట ఈ మొత్తాన్ని పెంచినట్లు ప్రకటించింది. కేటగిరి 1 లో రూ.లక్షలోపు రుణం తీసుకుంటే 80 శాతం రాయితీ, రూ.2 నుంచి రూ.4 లక్షల వరకు 60 శాతం, ఆపై 50 శాతం రాయితీ వర్తింపజేసింది. దీంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో దరఖాస్తులు వెల్లువెత్తాయి. బీసీ కార్పొరేషన్లో 21,323 దరఖాస్తులు వచ్చాయి. ఫెడరేషన్ రుణాల పరిమితిని పెంచి రాయితీని పెంచారు. రూ.11 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు రాయితీ ప్రకటించారు. దీనికితోడు గౌడ సంఘానికి ప్రత్యేకంగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. దీంతో పెద్ద సంఖ్యలో ఫెడరేషన్స్ రుణాల కోసం దరఖాస్తులు వచ్చాయి. అందేది ఎప్పుడు..? బీసీ కార్పొరేషన్ ద్వారా 2015–16 సంవత్సరానికి మార్జిన్ మనీ కింద లక్ష్యం 434 యూనిట్లకు రూ.388.80 లక్షలు ఇవ్వగా 418 యూనిట్లకు రూ. 320.78 లక్షలకు మంజూరు ఇచ్చారు. హైదరాబాద్‌లోని బీసీ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచి 146 యూనిట్లకు రూ.108.64 లక్షల నిధులు మంజూరు కాగా, 272 యూనిట్లకు రూ. 212.06 లక్షలు మంజూరు చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చేతి వృత్తుల వారికి సావిత్రిబాయి పూలే అభ్యుదయ యోజన కింద 128 యూనిట్లకు రూ.121 లక్షలుగా లక్ష్యం నిర్దేశిస్తే 120 యూనిట్లకు రూ.93.40 లక్షలు మంజూరు పత్రాలు జారీ చేశారు. ఇందులో కేంద్ర కార్యాలయం నుంచి 102 యూనిట్లకు రూ.76.25 లక్షల నిధులు లబ్ధిదారుల చేతికి వచ్చాయి. ఇంకా 11 మందికి రూ.12.15 లక్షలు మంజూరు కావాల్సి ఉంది. మొత్తంగా 283 మంది లబ్ధిదారులకు రూ.224.21 లక్షల నిధులు రావాల్సి ఉంది. ఫెడరేషన్ల పరిస్థితీ అంతే.. జిల్లాలో వివిధ సామాజిక ఫెడరేషన్లలో 37 యూనిట్లకు రూ.432.50 లక్షలు మంజూరు ఇస్తే ఇప్పటివరకు 14 ఫెడరేషన్ యూనిట్ల కు రూ.168 లక్షలు మాత్రమే మంజూరు చే శారు. ఇంకా 23 ఫెడరేషన్లకు రూ.264.50 లక్షలు ఇవ్వాల్సి ఉంది. దీంతో ఫెడరేషన్ల సభ్యులు రుణాలకు ఎదురుచూస్తున్నారు. కమ్ముకున్న నీలినీడలు.. 2015–16, 2016–17 సంవత్సరాలకు మంజూరు చేసిన రుణాలకే రాయితీలు రాక లబ్ధిదారులు బ్యాంకులు, బీసీ అభివృద్ధి కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు 2017–18 ఆర్థిక సంవత్సరం ముగిసిపోయింది. ప్రస్తుతం 2018–19 ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడిచిపోతోంది. అయినా.. ఇప్పటివరకు పాత రుణాల జాడలేదు. కొత్త రుణాలకు సంబంధించిన ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బీసీ, ఎంబీసీలకు, ఫెడరేషన్లకు మూడు కేటగిరీలలో 100 మందిని ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు మంత్రి చేతుల మీదుగా అందజేశారు. మరో 20 వేల పైచిలుకు మంది దరఖాస్తు చేసుకున్న నిరుద్యోగులు మళ్లీ రుణాలు ఇస్తారో లేదో అనే సందేహంలో పడ్డారు. ఇప్పటికే స్టెప్‌కార్ ద్వారా ఇచ్చే రుణాలను ఎత్తివేసిన ప్రభుత్వం రాబోయే రోజుల్లో బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు మంగళం పాడుతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిన్నరగా ఎదురుచూస్తున్నా.. రూ.2 లక్షలు రుణం మంజూరు చేసి ఏడాదిన్నర గడుస్తోంది. ఇప్పటివరకు రుణం డబ్బులు బ్యాంకులో వేయలేదు. బ్యాంకుకు వెళ్లి అడిగితే ప్రభుత్వం ఇవ్వలేదని అంటున్నారు. బీసీ కార్పొరేషన్ అధికారుల వద్దకు వెళ్తే నేరుగా మీ ఖాతాకే లోన్ మొత్తం వస్తుందంటున్నారు. రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు లోన్ జాడే లేదు. – నాగవెల్లి లక్ష్మీనారాయణ, లబ్ధిదారుడు బీసీలను విస్మరించడం బాధాకరం.. జనాభాలో సగభాగమున్న బీసీలను దగా చేయడం బాధాకరం. భారీ రాయితీలు ప్రకటించి నిరుద్యోగులకు ఆశలు కల్పించి రుణాలు మంజూరు చేయకుండా కాలయాపన చేయడం బీసీల మనోభావాలను దెబ్బతీయడమే. నాలుగేళ్ల అనంతరం కేవలం 50 వేల చొప్పున రుణం ఇవ్వడం సరికాదు. – కేశిపెద్ది శ్రీధర్‌రాజు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభుత్వ ఆదేశాల మేరకే.. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. గ్రామసభలు, మున్సిపల్ వార్డు సభల ద్వారా ఎంపికై ఎంపీడీవోలు, మున్సిపల్ చైర్మన్ల ద్వారా వంద మందిని ఎంపిక చేశాం. ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున 50 లక్షలు అందించాం. మిగితా దరఖాస్తుదారులకు సంబంధించి బడ్జెట్ త్వరలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగానే పంపిణీ చేస్తాం. – రంగారెడ్డి, బీసీ సంక్షేమ శాఖ అధికారి -
పంద్రాగస్టున బీసీల రాయితీ పథకం ప్రారంభం: మంత్రి
సాక్షి, హైదరాబాద్: బీసీల ఆర్థికాభివృద్ధిలో భాగంగా ఈ నెల 15న అమల్లోకి రానున్న ప్రత్యేక రాయితీ పథకం ప్రారంభానికి అన్ని జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న చెప్పారు. సోమవారం జిల్లా కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పంద్రాగస్టు రోజున అన్ని జిల్లా కేంద్రాల్లో వంద మంది లబ్ధిదారులకు రాయితీ పథకం లబ్ధి చేకూర్చనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఒక్కొక్కరికి రూ.50 వేల చెక్కును అందిస్తామన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.2 వేల కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని, తక్షణ సాయం కింద రూ.725 కోట్లు విడుదల చేశామన్నారు. నిధులను జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి ఖాతాలో జమ చేసినట్లు తెలి పారు. రుణాల కోసం దళారులను ఆశ్రయించవద్దని ఎంపిక పారదర్శకంగా జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జేసీ, డీఆర్డీవో పీడీలు సభ్యులుగా, బీసీ సంక్షేమాధికారి కన్వీనర్‌గా ఉన్న కమిటీ ద్వారా ఎంపిక చేస్తుందని చెప్పారు. -
బీసీ రుణాల్లో వసూళ్ల పర్వం
సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత బీసీ కార్పొరేషన్ రాయితీ రుణాల పంపిణీకి చర్యలు చేపట్టడం కొందరు దళారీలకు వరంలా కలిసొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష మంది లబ్ధిదారులకు రూ.1,500 కోట్ల మేర రాయితీ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడంతో ఆశావహుల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. బీసీ కార్పొరేషన్, 11 బీసీ ఫెడరేషన్లకు కలిపి 5.75 లక్షల మంది ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు సమర్పించారు. వాటిని పరిశీలించి అర్హులను గుర్తించాలని బీసీ సంక్షేమ శాఖ సూచనలు చేయడంతో దళారీల కొత్త దందాకు తెరలేచింది. రాయితీ రుణాల కోసం వచ్చిన దరఖాస్తులను గ్రామాల వారీగా విభజించడంతో, గ్రామ స్థాయిలో సభలు నిర్వహించి దరఖాస్తుదారుల ప్రాథమిక జాబితాలు తయా రు చేస్తున్నారు. ఈక్రమంలో వారి పత్రాలను పరిశీలిస్తున్నారు. దీన్ని అదనుగా చేసుకున్న కొందరు వసూళ్లకు పాల్పడుతున్నారు. రాయితీ రుణం ఇప్పిస్తామని చెబుతూ అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమార్కులకు ప్రజాప్రతినిధులు సైతం అండగా ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ వసూళ్లపై తాజాగా బీసీ కార్పొరేషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నా యి. రంగారెడ్డి, నల్లగొండ, మేడ్చల్ జిల్లాలకు చెందిన పలువురు ఇటీవల సంక్షేమాధికా రులకు ఫిర్యాదు చేయడంతో వసూళ్ల పర్వం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఆరా తీస్తున్నారు. లక్ష్యాలు నిర్దేశించకముందే... బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల నుంచి రాయితీ రుణాల కోసం దరఖాస్తులు స్వీకరించినా.. వాటిని ఇప్పుడే ఆమోదించే పరిస్థితి లేదు. ఎందుకంటే 2018–19 వార్షిక ప్రణాళికకు ఇంకా ఆమోదం లభించలేదు. బీసీ కార్పొరేషన్ రూపొందించిన ప్రణాళికలో ఏమేరకు ఆమో దం వస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో అధికారులు దరఖాస్తుల స్వీకరణతోనే సరిపెట్టారు. ప్రణాళిక ఆమోదం తర్వాత నిర్దేశించిన లక్ష్యాన్ని జిల్లాల వారీగా విభజిస్తారు. మం డలాలు, గ్రామాలు, మున్సిపాలిటీల వారీగా విభజించిన తర్వాత లబ్ధిదారుల సంఖ్యను ఖరారు చేస్తారు. వార్షిక ప్రణాళికకు ఇప్పటికిప్పుడు ఆమోదం వచ్చినా.. విభజన ప్రక్రియకు మరో నెల సమయం పడుతుంది. ఇంత తతంగం ఉండగా... గ్రామాల్లో అర్హులను ఎంపిక చేస్తున్నట్లు చెప్పుకోవడంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. అర్హుల ఎంపికలో వసూళ్లు చేస్తున్నట్లు ఫిర్యాదులు వస్తుండగా, కొన్ని చోట్ల ఏకపక్షంగా జరుగుతున్నట్లు అధికారుల దృష్టికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుల పరిశీలన తర్వాత గ్రామ సర్పంచులు, మున్సిపల్ చైర్మన్లు రాయితీ రుణాలకు పేర్లను ప్రతిపాదిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపి క ఏకపక్షంగా సాగుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పలువురు సర్పంచులు, చైర్మన్లు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నారంటూ దరఖాస్తుదారులు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో పన్నెండు మంది సర్పంచులపై జిల్లా సంక్షేమాధికారికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం, అదేవిధంగా కరీంనగర్, మహబూబ్‌నగర్‌లోనూ దరఖాస్తుల పరిశీలన ఏకపక్షంగా సాగిందం టూ ఆర్జీదారులు అధికారులకు మొరపెట్టు కుంటున్నారు. కొన్నిచోట్ల సమాచారం ఇవ్వకుండానే గ్రామసభలు ముగించేశారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో జిల్లాల వారీగా లక్ష్యాలు నిర్దేశించిన తర్వాత మరోమారు పరిశీలన చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. -
రుణ పంపిణీ వేగవంతం చేయండి: స్పీకర్
సాక్షి, హైదరాబాద్: బీసీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు ఇచ్చే రాయితీ పథకాల అమలును వేగవంతం చేయాలని శాసనసభ స్పీకర్ మధుసుదనాచారి బీసీ సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం అసెంబ్లీ హాలులో బీసీ సంక్షేమ శాఖ కార్యక్రమాలపై మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, ఆర్థిక శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్‌కుమార్‌తో సమావేశం నిర్వహించారు. ఫెడరేషన్ల ద్వారా అమలు చేసే పథకాల లబ్ధిదారులను వేగవంతంగా పూర్తి చేస్తే రాయితీ పంపిణీకి మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్ పాల్గొన్నారు. -
బీసీ స్వయం ఉపాధి అర్హుల ఎంపిక విధివిధానాలు
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల నిరుద్యోగులకు బీసీ కార్పొరేషన్, ఫెడరేషన్ల ద్వారా మంజూరు చేసే స్వయం ఉపాధి యూనిట్ల పంపిణీకి సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రామాల్లో గ్రామ సభ, పట్టణాల్లో వార్డు సభలను నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నారు. పథకానికి కేటాయించిన బడ్జెట్లో 50% నిధులను సాంప్రదాయ వృత్తి దారులకు, మిగతా 50% జనరల్ స్కీంలకు కేటాయించనున్నారు. ఒక కుటుంబం నుంచి ఒక అభ్యర్థినే ఎంపిక చేయాలని, గతంలో లబ్ధి పొందిన వారిని ఎంపిక చేయకూడదని నిబంధన విధించారు. లబ్ధిదారుల్లో 33% మహిళలకు కేటాయించనున్నారు. పేదలకు, దివ్యాంగులకు, సంచార జాతుల వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ.1.5, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలు మించరాదు. -
3 వేల సీట్లు.. 24 వేల దరఖాస్తులు!
సాక్షి, హైదరాబాద్: బీసీ సంక్షేమ శాఖ పరిధిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల కాలేజీలకు ఆదరణ పెరుగుతోంది. ఇటీవల ఆయా కాలేజీలు సాధించిన మెరుగైన ఫలితాలతో వాటి పరపతి మరింత పైకి ఎగబాకుతోంది. తాజాగా ఈ కాలేజీల్లో సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ సైతం రికార్డు సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 19 బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలున్నాయి. ఒక్కో కాలేజీలో నాలుగు కోర్సులకు సంబంధించి 160 చొప్పున 3,040 సీట్లున్నాయి. వీటికి సంబంధించి రెండ్రోజుల క్రితం దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. నాలుగు కోర్సులకు సంబంధించి 24,327 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంపీసీ కేటగిరీలో 11 వేల మంది, బైపీసీలో 10 వేల మంది, సీఈసీలో 3 వేల మంది, ఎంఈసీలో దాదాపు వెయ్యి మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన అభ్యర్థులకు బీసీ గురుకులాల సొసైటీ ఈ నెల 26న రాతపరీక్ష నిర్వహించనుంది. సొసైటీ వెబ్సైట్లో విద్యార్థులకు హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. రాతపరీక్షలో వచ్చే మార్కుల ఆధారంగా అడ్మిషన్లు ఇవ్వనున్నట్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు పేర్కొన్నారు. డిగ్రీ కాలేజీల్లోనూ... మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల సొసైటీ పరిధి లో రెండు మహిళా డిగ్రీ కాలేజీలున్నాయి. వీటి పరి ధిలో డిగ్రీ ఫస్టియర్ కేటగిరీలో 240 సీట్లకు సంబం ధించి దరఖాస్తులు స్వీకరణ ప్రక్రియ గతవారం ముగిసింది. 5,589 మంది విద్యార్థులు దరఖాస్తు లు సమర్పించారు. వీరికి రాతపరీక్ష ఈ నెల 26నే నిర్వహించేందుకు సొసైటీ ఏర్పాట్లు చేసింది. హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. -
ఇక మీ ఇష్టమే..!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటులో బీసీ సంక్షేమ శాఖ సరికొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. యూనిట్ల స్థాపనకు బ్యాంకు రుణం తప్పనిసరి కాదని, ఆ నిర్ణయం లబ్ధిదారుకే వదిలేస్తున్నామని వెల్లడించిది. మొత్తం వ్యయాన్ని లబ్ధిదారు వ్యక్తిగతంగా భరిస్తే సబ్సిడీ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి దరఖాస్తుల్లో వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు 2018ృ19 వార్షిక సంవత్సరానికి దరఖాస్తుల స్వీకరణకు బీసీ కార్పొరేషన్‌తోపాటు 11 బీసీ ఫెడరేషన్లు ఉపక్రమించాయి. ఆర్థిక సహకార సంస్థ (ఫైనాన్స్ కార్పొరేషన్) ఇచ్చే రాయితీలు ఇప్పటివరకు బ్యాంకులిచ్చే రుణాలతో ముడిపడి ఉండేవి. యూనిట్ ప్రారంభించాలనుకున్న లబ్ధిదారు ముందుగా కార్పొరేషన్‌కు రాయితీ కోసం దరఖాస్తు చేసుకునేవారు. అక్కడి నుంచి ఆమోదం వచ్చాక రాయితీ డబ్బులు పోను మిగిలిన మొత్తానికి సమీప బ్యాంకులో రుణం పొందేందుకు అర్జీ పెట్టుకునేవారు. అక్కడ రుణం దొరికితేనే రాయితీ ఫలాలు అందేవి.. లేదంటే అంతే సంగతి. ఏళ్ల నాటి ఈ నిబంధనలకు సంక్షేమ శాఖ స్వస్తి పలికింది. రూ. లక్షకు రూ.80 వేల రాయితీ స్వయం ఉపాధి యూనిట్లపై బ్యాంకు రుణం పొందడం ఆషామాషీ కాదు. బ్యాంకు నిబంధనలు పాటిస్తేనే రుణం మంజూరవుతుంది. అన్ని విధాలా అనుకూలంగా ఉన్నా బ్యాంకర్ల సహకారం లేకుంటే రుణ మంజూరు గగనమే. దీంతో రుణాలందక లబ్ధిదారులు యూనిట్లు ఏర్పాటు చేయలేకపోతున్నారని కార్పొరేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో సొమ్ము మొత్తం లబ్ధిదారుడే భరిస్తే రాయితీ విడుదల చేసేందుకు సంక్షేమ శాఖ వెసులుబాటునిస్తోంది. రూ.లక్షతో ఏర్పాటు చేసే యూనిట్‌కు సర్కారు రూ.80 వేల రాయితీ ఇవ్వనున్నారు. రూ.2 లక్షలుంటే రూ.1.40 లక్షలు, రూ.5 లక్షలకు పైబడి ఉంటే 50 శాతం రాయితీ ఇస్తారు. రూ.1,400 కోట్లు..! మూడేళ్లుగా రాయితీలివ్వని బీసీ సంక్షేమ శాఖ.. ఈసారి భారీ ప్రణాళికతో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ఇందుకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించిన ఆ శాఖ.. ఈ నెల 21 వరకు గడువు విధించింది. అలాగే పెండిగ్లో ఉన్న దరఖాస్తులను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నట్లు ప్రకటించింది. బీసీ కార్పొరేషన్, బీసీ ఫెడరేషన్లకు ఈ సారి బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించిన నేపథ్యంలో లక్ష మందికి తగ్గకుండా లబ్ధిదారులను ఎంపిక చేసే వీలుంది. 2018ృ19 వార్షిక సంవత్సరం ప్రణాళికను బీసీ కార్పొరేషన్ ఇటీవల ప్రభుత్వానికి నివేదించింది. అక్కడి నుంచి ఆమోదం లభిస్తే దరఖాస్తులు పరిశీలన మొదలవుతుందని అధికారులు చెబుతున్నారు. -
గురుకుల్ సెట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం టీజీ గురుకుల్ సెట్ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది. అర్హతలివే... గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 నాటికి 9 నుంచి 11 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/విద్యాసంస్థలో నాల్గోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. దరఖాస్తు కోసం http:/tgcet. cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతుందని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్‌కుమార్ తెలిపారు. టీజీ గురుకుల్ సెట్ పరీక్ష ఏప్రిల్ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.tswreis.in వెబ్సైట్లో లేదా 1800 425 45678 హెల్ప్‌లైన్ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
బీసీ బడ్జెట్ రూ.7,500 కోట్లే!
సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల బడ్జెట్ గతం కంటే పెరగనుంది. తాజాగా 2018–19 బడ్జెట్ అంచనాల రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. ఆర్థికశాఖ రెండ్రో జుల క్రితం బీసీ సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది. గతేడాది బడ్జెట్ కంటే పెంచి అంచనాలు రూపొందించుకోవాలని సూచించింది. బీసీ సంక్షేమశాఖకు 2017–18లో రూ.5070.76 కోట్లు కేటాయించగా ఈసారి అదనంగా రూ.2,500 కోట్ల మేర పెంచే అవకాశముంది. ఇందులో ప్రగతిపద్దు కింద రూ.4,764.60 కోట్లు, నిర్వ హణ పద్దు కింద రూ.305.76 కోట్లు కేటాయించింది. దీనిలోనే అత్యంత వెనుకబడిన కులాల(ఎంబీసీ) కార్పొరేషన్‌కు రూ.1,000 కోట్లు కేటాయించింది. మిగతా మోత్తాన్ని కల్యాణలక్షి, ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి పథకాలకు కేటాయించింది. తాజాగా బీసీ బడ్జెట్‌ను రూ.7,500 కోట్ల మేర అంచనాలు రూపొందిస్తోంది. ఈసారి బీసీ కార్పొరేషన్‌కు సంతృప్తికర స్థాయిలో కేటాయింపులుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. కల్యాణలక్ష్మి, విదేశీ విద్యానిధి కింద వీలైనంత ఎక్కువమందికి అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిరుడు రజక, నాయిబ్రాహ్మణ ఫెడరేషన్లకు 500 కోట్లు కేటాయించింది. విశ్వబ్రాహ్మణ ఫెడ రేషన్‌కు రూ.200 కోట్లు కేటాయించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. ప్రత్యేక అభివృద్ధినిధి మాటేంటి..? వెనుకబడిన కులాల సమగ్ర అభివృద్ధిలో భాగంగా కేబినెట్ సబ్ కమిటీ బీసీ నివేదిక రూపొందించింది. మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన ఏర్పాటైన బీసీ కమిటీ సుదీర్ఘ సమాలోచనలు చేసి నివేదికకు తుదిరూపు ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ‘బీసీల అభ్యున్నతికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తాం. ఏకాభిప్రాయంతో ప్రాధాన్యతాక్రమంలో నివేదిక ఇస్తే వెంటనే మంజూరు చేస్తా’ అని హామీ ఇచ్చారు. అయితే తాజా బడ్జెట్ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైనా బీసీ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ‘బీసీ నివేదికపై అసెంబ్లీలో చర్చించాలి. అందుకే నివేదికను సీఎంకు ఇవ్వలేదు. సీఎం ఆదేశం వచ్చిన వెంటనే నివేదిక సమర్పిస్తాం. అసెంబ్లీలో చర్చిస్తాం’ అని మంత్రి రామన్న ‘సాక్షి’తో అన్నారు. -
బీసీ గురుకుల విద్యార్థులకు ఐఐటీ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: వెనుకబడ్డ తరగతుల (బీసీ) గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులకు శుభవార్త. ప్రతిభావంతులైన విద్యార్థులకు ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ప్రవేశ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని మహాత్మా జ్యోతిభాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలల సొసైటీ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా సీఓఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ) పేరిట శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. విద్యార్థులు ఇంటర్మీడియెట్ చదువుతున్నప్పుడే దీర్ఘకాలిక శిక్షణ ఇస్తే ప్రవేశ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులతో పాటు ప్రఖ్యాత విద్యా సంస్థల్లో సీట్లు వస్తాయని భావించిన అధికారులు ఈమేరకు చర్యలు వేగవంతం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 19 బీసీ గురుకుల జూనియర్ కాలేజీలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 5 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇందులో ప్రతిభావంతులను గుర్తించి వారికి ప్రత్యేక కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఇటీవల అర్హత పరీక్ష నిర్వహించిన యంత్రాంగం 360 మందిని అర్హులుగా గుర్తించింది. ఈ విద్యార్థులను సీఓఈ కేంద్రంలో శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు. ఒకటి రెండురోజుల్లో తరగతులు ప్రారంభం సీఓఈని ప్రస్తుతం హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. ఈ మేరకు హయత్‌నగర్ మండలం బాటసింగారం సమీపంలో ఉన్న ఓ ఇంజనీరింగ్ కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకున్నారు. ఇప్పటికే అర్హులను గుర్తించిన అధికారులు, ఒకట్రెండు రోజుల్లో అక్కడ తరగతులు ప్రారంభించనున్నారు. 360 మంది అభ్యర్థులను ఎంపిక చేయగా... ఇందులో ఇంటర్మీడియెట్ ఫస్టియర్‌కు చెందిన 180 మంది, సెకండియర్ చదువుతున్న 180 మంది విద్యార్థులు ఉన్నారు. వీరిలో సగంమంది బాలికలున్నారు. విద్యార్థులకు గురుకుల పాఠశాలలో నిర్వహించే తరగతులతో పాటు అదనపు శిక్షణ కోసం ప్రత్యేకంగా సబ్జెక్ట్ నిపుణులతో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ప్రధాన సబ్జెక్టులకు సంబంధించి అ«ధ్యాపకులను సైతం నియమించారు. ఈ కేంద్రాన్ని రెండ్రోజుల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న ప్రారంభించనున్నారు. వారాంతంలోగా తరగతులు ప్రారంభించనున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు ‘సాక్షి’కి తెలిపారు. -
ఆదివాసీల డిమాండ్‌పై స్పష్టత ఉంది
సాక్షి, ఆదిలాబాద్: ఆదివాసీల డిమాండ్‌పై ప్రభుత్వానికి స్పష్టత ఉందని అటవీ, పర్యావరణ, బీసీ సం క్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో నాగోబా జాతర సందర్భంగా శుక్రవారం నిర్వహించిన దర్బార్‌లో రామన్న మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా హక్కులను అమలు చేసే విషయంలో సీఎం కేసీఆర్ ప్రణాళికలు చేస్తున్నారని తెలిపారు. ఆదివాసీ, లంబాడీల మధ్య తలెత్తిన వివాదం సున్నితమైందని, ప్రభుత్వం తరఫున సీఎస్, డీజీపీలు ఇరువర్గాలతో చర్చించారని వివరించారు. నాగోబా దర్బార్‌లో ఆదివాసీలు తమ దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను ప్రభు త్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఎంపీ గోడం నగేశ్ మాట్లాడుతూ మేడారం జాతర తర్వాత మలి విడత చర్చలు జరిపి, వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రభు త్వం ఆలోచన చేస్తోందన్నారు. ఏజెన్సీ ధ్రువీకరణ పత్రాలు, ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో సీట్లు, ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు తదితర అంశాలలో ఆదివాసీలకు అన్యాయం జరగకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ జెడ్పీ చైర్పర్సన్ వి.శోభారాణి, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్, మంచిర్యాల జిల్లా కలెక్టర్, ఇన్చార్జి ఐటీడీఏ పీవో ఆర్వీ కర్ణన్, ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ విష్ణు ఎస్.వారియర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్టీ జాబితా నుంచి తొలగించాల్సిందే.. దర్బార్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి ఆదివాసీల నుంచి అర్జీలు స్వీకరించింది. సాధారణంగా దర్బార్‌లో ఆదివాసీలు తాము ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి అర్జీలు అందజేస్తారు. కానీ, ఈసారి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే ఏకైక డిమాండ్‌తో అర్జీలు అందజేయడం గమనార్హం. దర్బార్ వేదికపై నుంచి ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ ఇదే డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. పోటెత్తిన కేస్లాపూర్ దర్బార్ సందర్భంగా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి జాతరకు తరలివచ్చిన ఆదివాసీలతో కేస్లాపూర్ పోటెత్తింది. పరిసరాల్లో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఈ నెల 16న ప్రారంభమైన నాగోబా జాతర శుక్రవారం దర్బార్తో అధికారికంగా ముగిసింది. మరో రెండు, మూడు రోజులపాటు ఆదివాసీలు నాగోబాను దర్శించుకుంటారు. -
క్రీమీలేయర్‌కు ‘రెవెన్యూ’ కొర్రీలు!
చిక్కడపల్లి ప్రాంతానికి చెందిన ఓ మహిళ గురుకుల టీజీటీ ఉద్యోగానికి అర్హత సాధించింది. ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియలో భాగంగా క్రీమీలేయర్ సర్టిఫికెట్ సమర్పించాలని టీఎస్పీఎస్సీ స్పష్టం చేయడంతో ఆమె సమీప మీసేవా కేంద్రంలో దరఖాస్తు చేసుకుంది. కానీ ఓబీసీ జాబితాలో తన బొందిలి కులం లేకపోవడంతో రెవెన్యూ అధికారులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. బీసీ సంక్షేమ శాఖను ఆశ్రయించినా స్పష్టత రాకపోవడంతో ఆమె అయోమయంతో వెనుదిరిగింది. సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ద్వారా జరుగుతున్న నియామకాలకు ఎంపికయ్యే అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థి కుటుంబ వార్షికాదాయం రూ.6 లక్షలకు లోబడి ఉంటే నాన్ క్రీమీలేయర్‌గా పరిగణిస్తారు. దీంతో రిజర్వేషన్ల ఫలాలు పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఓబీసీ జాబితాలో కేవలం 87 కులాలే ఉన్నాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ప్రకారం బీసీ ఏ, బీ, సీ, డీ, ఈ కేటగిరీల్లో 119 కులాలున్నాయి. ఈ మేరకు 2016, జనవరి 30న జీవో–4 జారీ చేసింది. మండల రెవెన్యూ యంత్రాంగం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ జాబితాను కాదని కేంద్ర ప్రభుత్వం గుర్తించిన 87 కులాలకు మాత్రమే క్రీమీలేయర్ సర్టిఫికెట్లు ఇస్తామంటూ కొర్రీలు పెడుతున్నారు. దీంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అంతా అయోమయం... రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన బీసీ–డీ, బీసీ–ఈ కేటగిరీల్లోని వీరశైవలింగాయత్, లింగ బలిజ, సుందీ, కుర్మి, బెంగ్వా తదితర కులాలతోపాటు ముస్లిం కేటగిరీల్లోని 13 కులాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఓబీసీ జాబితాలో లేవు. ఇలాంటి కులాలు ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు బీసీ సంక్షేమ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దాదాపు 32 కులాల అభ్యర్థులు క్రీమీలేయర్ సర్టిఫికెట్లు పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. గురుకుల టీజీటీ ఉద్యోగాల్లో అర్హత సాధించిన నలుగురు అభ్యర్థులు ఇదే సమస్యపై బీసీ సంక్షేమ శాఖను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. మహిళలకు ‘కొత్త’చిక్కులు... క్రీమీలేయర్ సర్టిఫికెట్ల విషయంలో మహిళలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. ఈ విషయంలో వివాహితలే ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. మహిళా అభ్యర్థులు తండ్రి వివరాలతోనే ఉద్యోగాలకు దరఖాస్తులు సమర్పిస్తున్నారు. పదోతరగతి సర్టిఫికెట్లో కూడా తల్లి, తండ్రి పేర్లు, తండ్రి ఇంటిపేరు ఉన్నాయి. అయితే, అధికారులు క్రీమీలేయర్ సర్టిఫికెట్ ఇచ్చేటప్పుడు తండ్రి ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగాని, రూ.6లక్షలకు మించి ఆదాయాన్ని గాని కలిగి ఉంటే సదరు అభ్యర్థులు క్రీమీలేయర్ పరిధిలోకి వస్తున్నారు. దీంతో అలాంటివారు రిజర్వేషన్ అర్హత కోల్పోతున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ మహిళకు పదేళ్ల క్రితం వివాహంకాగా తన భర్త ఆదాయాన్ని కాకుండా ప్రభుత్వ ఉద్యోగి అయిన తండ్రి ఆదాయాన్ని పరిగణిస్తూ అధికారులు సర్టిఫికెట్లు జారీ చేశారు. దీంతో ఆమె అయోమయంలో పడింది. -
అర్ధాకలితోనే చదువులు
సాక్షి, అమరావతి: ప్లేట్ ఇడ్లీకి సరిపోయే డబ్బులిచ్చి దాంతో మూడు పూటలా తినమంటే ఏం చేస్తాం.. అర్ధాకలితోనే సరిపెట్టుకుంటాం. రాష్ట్రంలోని సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులది ఇప్పుడు ఇదే పరిస్థితి. నిత్యావసర ధరలు చుక్కలనంటుతున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వం ఇచ్చే మెస్ చార్జీలు సరిపోక విద్యార్థులు అర్ధాకలితోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఎదిగే వయసులో ఉన్న విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందక ఇబ్బంది పడుతున్నారు. 2012 డిసెంబర్లో అప్పటి ప్రభుత్వం సవరించిన మెస్ చార్జీలనే ఇప్పుడూ ఇస్తున్నారు. ఆ ప్రకారం 3 నుంచి 7వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులకు నెలకు రూ. 750, 8 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి నెలకు రూ. 850 మెస్ చార్జీలుగా ప్రభుత్వం ఇస్తోంది. అంటే 3 నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థికి రోజుకు రూ.25, 8 నుంచి 10 తరగతులు చదువుతున్న వారికి రోజుకు రూ. 28.33 ప్రభుత్వ కేటాయిస్తోంది. ప్రస్తుతం బయట మెస్‌ల్లో భోజనం చేసినా పూటకు కనీసం రూ. 60 చెల్లించాలి. ఈ నేపథ్యంలో రూ. 25తో హాస్టల్లో పెట్టే భోజనం విద్యార్థులకు ఎలా సరిపోతుందని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మెనూ అమలు చేయలేక.. హాస్టల్ విద్యార్థులకు ప్రభుత్వం నిర్ణయించిన మెనూ ప్రకారం ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి భోజనం పెట్టాలి. కేవలం రూ. 25తో రెండు పూటల అల్పాహారం, రెండు పూటల భోజనం ఎలా వస్తోందో కూడా ఈ ప్రభుత్వానికి ఆలోచనే లేకుండా పోయిందని విద్యార్థులు విమర్శిస్తున్నారు. వారం రోజుల్లో.. రెండు రోజులు ఉదయం ఉప్మా, ఆదివారం ఇడ్లీ లేదా ఉగ్గాని, మిగిలిన నాలుగు రోజుల్లో పొంగల్, పులిహోరా, పులగం, కిచిడీ పెట్టాలి. భోజనం కూడా మూడు నుంచి ఏడో తరగతి చదువుతున్న విద్యార్థులకు 150 గ్రాములు, 8 నుంచి 10 తరగతి వరకు చదువుతున్న వారికి 200 గ్రాముల అందించాలి. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు కూడా ఇవ్వాలి. ఈ మెస్ చార్జీల్లో నుంచే బియ్యంతో పాటు గ్యాస్, సరుకుల రవాణా చార్జీలు, ఇడ్లీ పిండి వాటి గ్రైండింగ్ చార్జీలతో పాటు విద్యుత్ బల్బ్ కాలిపోయినా ఖర్చుచేయాలి. ఇలాంటి పరిస్థితుల్లో మెనూను అమలు చేయడం వార్డెన్లకు తలకు మించిన భారం అవుతోందని విద్యార్థి సంఘ నేతలు చెబుతున్నారు. పెంపు దస్త్రం సీఎం వద్ద పెండింగ్ మెస్‌చార్జీల పెంపు దస్త్రం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దే పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రావెల కిశోర్‌బాబు ఉన్నపుడు మెస్ చార్జీల పెంపునకు ప్రతిపాదనలు రూపొందించారు. ఆ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించారు. ఇంతవరకు దానికి మోక్షం కలగలేదు. రద్దవుతున్న హాస్టళ్లు.. సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేస్తున్నది. దీంతో నిరుపేదలకు చదువు దూరమైపోతోంది. రద్దయిన హాస్టల్స్ నుంచి విద్యార్థులను రెసిడెన్షియల్ స్కూళ్లకు మారుస్తున్నట్లు ప్రభుత్వం చెబుతున్నా.. 50 శాతం మంది పిల్లలు డ్రాప్‌అవుట్స్‌గా మారుతున్నారు. సాంఘిక సంక్షేమ శాఖలో 1,259 హాస్టళ్లు ఉండగా 275 హాస్టళ్లను ఇప్పటి వరకు రద్దు చేశారు. ఈ సంవత్సరం మరో 300 హాస్టళ్లు రద్దు చేసేందుకు చర్యలు చేపట్టారు. గిరిజన సంక్షేమ శాఖలో 497 హాస్టల్స్ ఉండగా ఇప్పటి వరకు 358 హాస్టల్స్ రద్దయ్యాయి. రద్దయిన హాస్టల్స్‌లోని పిల్లలను రెసిడెన్సియల్స్‌లో చేర్పించినట్లు అధికారులు ప్రకటించారు. బీసీ హాస్టల్స్ 897 ఉండగా.. వాటిని ఏడాది రద్దు చేయడానికి బీసీ సంక్షేమ శాఖ చర్యలు మొదలు పెట్టింది. మూడు సంక్షేమ శాఖల కింద ఉన్న హాస్టళ్లలో పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థులు 1,88,917 మంది ఉన్నారు. ఎస్సీ హాస్టళ్లలో 88,214 మంది, ఎస్టీలో 13,034మంది, బీసీ హాస్టళ్లలో 87,669 మంది చదువుకుంటున్నారు. -
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
-
తెలంగాణ కోసం బాపూజీ అహర్నిశలు కృషి చేశారు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ కోసం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అహర్నిశలు కృషి చేశారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మంగళవారం సచివాలయంలో బాపూజీ 102వ జయంతి వాల్ పోస్టర్‌ను అసెంబ్లీ బీసీ కమిటీ చైర్మన్ వీజీ గౌడ్, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్‌లతో కలిసి మంత్రి ఆవిష్కరిం చారు. అనంతరం మాట్లాడుతూ.. బాపూజీ 102వ జయం తిని బుధవారం ఉదయం 10 గంటలకు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఇందిరా ప్రియదర్శిని హాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. బాపూజీ ఆశయాలను సాధించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ విజయ్‌కు మార్, అదనపు కార్యదర్శి సైదా, బాపూజీ 102వ జయంతి ఆహ్వాన కమిటీ వైస్ చైర్మన్లు గోషిక యాదగిరి, ఎస్.దుర్గయ్య గౌడ్, భాగ్యలక్ష్మి, సలహాదారులు గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. -
డిప్యుటేషన్లు వృథా ప్రయాసే!
అనంతపురం ఎడ్యుకేషన్: బీసీ సంక్షేమశాఖలో ఇటీవల చేసిన డిప్యుటేషన్లు వృథా ప్రయాసగా తయారయ్యాయి. అవసరం దృష్ట్యా కొందరు ఉద్యోగులను బీసీ కార్పొరేషన్‌కు డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. వారి స్థానాల్లో ఇన్చార్జ్ బాధ్యతలు తీసుకున్నవారు మిన్నకుండిపోవడంతో ఆయా హాస్టళ్లలో సంక్షేమం అటకెక్కుతోంది. మెనూ, బయోమెట్రిక్ అమలు అస్తవ్యస్తంగా మారుతోంది. కళ్యాణదుర్గం ఏబీసీడబ్ల్యూఓగా, ధర్మవరం డివిజన్‌కు ఇన్చార్జ్గా ఉన్న నరసయ్యను, హిందూపురం ఏబీసీడబ్ల్యూఓగా, పెనుకొండ డివిజన్‌కు ఇన్చార్జ్గా ఉన్న కృత్రికను డిప్యుటేషన్‌పై బీసీ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. అలాగే బీసీ సంక్షేమశాఖలో సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్‌ను, జూనియర్ అసిస్టెంట్ రాణిని కూడా డిప్యుటేషన్‌పై కార్పొరేషన్‌కు మార్చారు. ఈ క్రమంలో బీసీ సంక్షేమశాఖకు సంబంధించి కళ్యాణదుర్గం, ధర్మవరం డివిజన్ల ఇన్చార్జ్ బాధ్యతలను తాడిపత్రి డివిజన్ ఏబీసీడబ్ల్యూఓ రామాంజనేయులుకు, హిందూపురం, పెనుకొండ డివిజన్ల ఇన్చార్జ్ బాధ్యతలను అనంతపురం ఏబీసీడబ్ల్యూఓ మల్లికార్జునకు అప్పగించారు. అయితే వీరు ఇప్పటిదాకా ఆయా డివిజన్లకు వెళ్లనేలేదు. ఒక్క హాస్టల్‌ను కూడా సందర్శించలేదు. దీంతో ఆయా హాస్టళ్లలో పరిస్థితులు అస్తవ్యస్తంగా మారాయి. దాదాపు ఏ హాస్టల్లోనూ మెనూ అమలు కావడం లేదు. కనీసం కొత్త మెనూ బోర్డులు కూడా ఏర్పాటు చేయలేదు. మాతృశాఖపై మమకారం డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓలు మాతృశాఖపై మమకారంతో తిరిగి వెనక్కు వచ్చేందుకు కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు కూడా వారి గురించి పట్టించుకోలేదు. దీంతో వారు సొంతశాఖలో తమ పనుల్లోనే ఎక్కువగా నిమగ్నమవుతున్నారు. సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నా రోజులో ఎక్కువసేపు సంక్షేమశాఖ డీడీ కార్యాలయంలోనే ఉంటున్నారు. జూనియర్ అసిస్టెంట్ రాణిని ఇప్పటిదాకా కనీసం రిలీవ్ కూడా చేయలేదు. ఇటు బీసీ సంక్షేమం, అటు బీసీ కార్పొరేషన్ అధికారుల అలసత్వం కారణంగా ఇలాంటి పరిస్థితి నెలకొందని ఉద్యోగులు వాపోతున్నారు. క్యాంపులు వెళ్తున్నారు డిప్యుటేషన్‌పై వచ్చిన ఏబీసీడబ్ల్యూఓలు కళ్యాణదుర్గం, హిందూపురం డివిజన్లలో క్యాంపులు తిరుగుతున్నారు. అయినప్పటికీ కచ్చితంగా విధులు నిర్వర్తించాల్సిందే. ఆయా డివిజన్లలో రుణాల కోసం వచ్చిన దరఖాస్తులు పరిశీలించి ఫార్వర్డ్ చేయాలి. అలాగే బ్యాంకు లింకేజీ విషయమై బ్యాంకు అధికారులతో చర్చించి ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలి. – నాగముణి, బీసీ కార్పొరేషన్ ఈడీ తిరగాలంటే ఇబ్బంది డిప్యుటేషన్‌పై వెళ్లిన ఏబీసీడబ్ల్యూఓ స్థానాల్లో ఇన్చార్జ్ తీసుకున్నవారు ఆయా డివిజన్లలోని హాస్టళ్లను పర్యవేక్షించలేదనేది వాస్తవమే. ఒక్కొక్కరికి మూడు డివిజన్లు అప్పగించాం. తిరగాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. ఏదైనా అవసరముంటే డిప్యుటేషన్‌పై వెళ్లిన వారితోనే అనధికారికంగా సమాచారం తెప్పించుకుంటున్నాం. – రమాభార్గవి, బీసీ సంక్షేమశాఖ డీడీ -
భారీగా పెరగనున్న ‘బీసీ’ సీట్లు
- 246 హాస్టళ్లలో సీట్ల పెంపునకు బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు - సర్కారు ఆమోదిస్తే 5,500 సీట్లు పెరిగే అవకాశం సాక్షి, హైదరాబాద్: వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ పరిధిలో కొనసాగుతున్న కాలేజీ హాస్టళ్లలో త్వరలో సీట్లు పెరగనున్నాయి. క్షేత్రస్థాయిలో ఉన్న డిమాండ్ మేరకు సీట్ల సంఖ్యను పెంచాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో 246 పోస్టుమెట్రిక్ హాస్టళ్లున్నాయి. వీటిలో 110 హాస్టళ్లు బాలికల కోసం ఏర్పాటు చేయగా.. బాలుర కోసం 136 హాస్టళ్లున్నాయి. ఒక్కో వసతిగృహంలో సగటున వంద మంది విద్యార్థులను చేర్చుకోవచ్చని ప్రభుత్వం సూచించింది. కానీ స్థానిక పరిస్థితులు, విద్యార్థుల ఒత్తిడితో కొన్నిచోట్ల 150కి పైగా విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారు. అయినప్పటికీ అడ్మిషన్ల కోసం వందల సంఖ్యలో దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. రవాణా చార్జీలు భారంగా మారుతుండటం, తాజాగా మెస్ చార్జీలు పెంచడం, భోజన మెనూలోనూ భారీమార్పులు చోటుచేసుకోవడంతో సంక్షేమ శాఖ నిర్వహిస్తున్న కాలేజీ హాస్టళ్లకు డిమాండ్ పెరుగుతోంది. మొత్తంగా కాలేజీ హాస్టళ్లలో ప్రవేశాలకు విద్యార్థులు క్యూ కడుతుండటంతో బీసీ సంక్షేమ శాఖ ఈ మేరకు పరిస్థితిని ప్రభుత్వానికి నివేదించింది. 5,500 సీట్ల పెంపునకు ప్రతిపాదనలు... ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ ద్వారా 119 గురుకుల పాఠశాలలు ప్రారంభించారు. ఒక్కో గురుకులంలో 240 మంది చొప్పున 28,560 మంది విద్యార్థులను 5,6,7 తరగతుల్లో చేర్చుకున్నారు. ఇలా ప్రవేశాలు పొందిన వారిలో 4 వేల మంది విద్యార్థులు బీసీ హాస్టళ్ల నుంచి వచ్చినవారే. దీంతో ప్రీమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిన నేపథ్యంలో ఆ సంఖ్యను పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో భర్తీ చేస్తామని సంక్షేమ శాఖ పేర్కొంటూ ప్రభుత్వానికి నివేదిం చింది. ప్రస్తుతం కాలేజీ హాస్టళ్లకు సంబంధించి 5వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రవేశాల డిమాండ్‌ను అధిగమించేందుకు కొత్తగా 5,500 మందిని చేర్చుకునేందుకు అనుమతి కోరుతూ బీసీ సంక్షేమ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. -
హతవిధీ.. అందని ‘నిధి’!
ఫూలే విద్యా నిధి కింద ఎంపికైన విద్యార్థుల ఫీజు వెతలు - విదేశీ వర్సిటీల్లో చేరిన విద్యార్థులకు ఇప్పటికీ అందని ఆర్థిక సాయం - వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యలతో వివరాలన్నీ గల్లంతు - దీంతో మళ్లీ అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి - త్వరలో ప్రారంభం కానున్న రెండో సెమిస్టర్ - ఫీజులు కట్టాల్సి ఉండటంతో తీవ్ర ఆందోళనలో విద్యార్థులు మహాత్మ జ్యోతిబా ఫూలే విద్యా నిధి పథకం కింద ఎంపికైన అనూప్.. ఆర్నెల్ల క్రితం ఆస్ట్రేలియాలోని ఓ వర్సిటీలో ఎమ్మెస్ అడ్మిషన్ పొందాడు. ఈ మేరకు బోనఫైడ్తోపాటు ప్రవేశానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో సబ్మిట్ చేశాడు. ఈ వివరాల ఆధారంగా ఫీజు నిధులు విడుదల చేయాల్సి ఉండగా.. ప్రభుత్వం పైసా విదల్చలేదు. ఈ నెల 20న రెండో సెమిస్టర్ ప్రారంభమవుతుండటంతో వర్సిటీ యాజమాన్యం ఫీజు చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో తండ్రికి ఫోన్ చేసి డబ్బులు పంపించాలంటూ ఒత్తిడి తీవ్రం చేయడంతో అప్పు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. సాక్షి, హైదరాబాద్: మహాత్మ జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకం కింద ఆర్థిక సాయం వస్తుందనే ధీమాతో విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు వెళ్లిన విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కోర్సులో ప్రవేశాలు పొంది మొదటి సెమిస్టర్ ముగుస్తున్నా.. ప్రభుత్వం ఆర్థిక సాయం విడుదల చేయకపోవ డంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు. తల్లిదండ్రులకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఫీజు డబ్బులు సర్దుబాటు చేసి పంపాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. ప్రతిభావం తులైన బీసీ విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య అందించేందుకు ప్రభుత్వం 2016లో మహాత్మ జ్యోతిబా ఫూలే ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఎంపికైన లబ్ధిదారుడికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందజేస్తుంది. ఇప్పటివరకు 103 మంది విద్యార్థులు అర్హత సాధించగా.. వీరిలో దాదాపు సగం మంది ఆర్నెళ్ల క్రితమే విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందారు. ప్రస్తుతం ఆయా విద్యార్థులు రెండో సెమిస్టర్‌లోకి అడుగు పెట్టబోతున్నారు. సాధారణంగా విదేశీ వర్సిటీల్లో ఫీజుల చెల్లింపు వాయిదాల పద్ధతిలో ఉంటుంది. ఈ క్రమంలో ఓవర్సీస్ విద్యార్థులు తొలి విడత ఫీజును స్నేహితులు, బంధువుల వద్ద సర్దుబాటు చేసుకుని చెల్లించగా.. రెండో విడత ఫీజు చెల్లింపు సమయానికి ఆర్థిక సాయం అందుతుందని భావించారు. వారం రోజుల్లో రెండో సెమిస్టర్ ప్రారంభం కానుండగా సాయం అందకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సాంకేతిక చిక్కులతో ఇక్కట్లు బీసీ ఓవర్సీస్ విద్యా నిధి లబ్ధిదారులకు ప్రభుత్వం ఇప్పటికే నిధులు విడుదల చేసింది. 2 నెలల క్రితమే రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ అధికారులు జిల్లా కార్యాలయాలకు రూ.11 కోట్లు జమ చేశారు. లబ్ధిదా రుల ప్రవేశాలకు సంబంధించిన వివరాలు పరిశీలించి వారికి ఆర్థిక సాయం ఇవ్వాల్సి ఉండగా.. ఈ ప్రక్రియ ఇప్పటికీ ముందుకు సాగలేదు. విదేశీ వర్సిటీల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు బోనఫైడ్, ఐడీ కార్డు తదితర వివరాలు ఈపాస్ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. అలా విద్యార్థులు సమర్పించిన వివరాలను పరిశీలించి జిల్లా సంక్షేమ శాఖ అధికారులు ఆమోదించి నిధులు విడుదల చేయాలి. అయితే ఈపాస్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు నెలకొనడంతో పరిశీలన ప్రక్రియ పెండింగ్‌లో ఉండిపోయింది. చాలామంది విద్యార్థులు సమర్పించిన వివరాలు వెబ్సైట్లో కనిపించడం లేదు. మరికొందరు బోనఫైడ్, ఐడీ కార్డుల ఫొటోలను అందులో అప్లోడ్ చేసినప్పటికీ అవి చిన్న సైజులోకి మారిపోతున్నాయి. దీంతో జిల్లా సంక్షేమాధికారుల కు వీటి పరిశీలన కష్టంగా మారింది. మరోసారి పంపితేనే.. తాజాగా ఓవర్సీస్ అభ్యర్థుల నుంచి మరోమారు వివరాలు తెప్పించుకోవాలని బీసీ సంక్షేమ శాఖ భావిస్తోంది. ఆయా విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని పంపనుంది. మరోవైపు వెబ్సైట్లో నెలకొన్న సాంకేతిక సమస్యను పరిష్కరించాలని ఇప్పటికీ సీజీజీ (సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్)ని ఆదేశించింది. ఒకట్రెండు రోజుల్లో సమస్య పరిష్కారమవు తుందని, అనంతరం విద్యార్థుల నుంచి వివరా లు వచ్చాక పరిశీలిస్తామని, ఈ ప్రక్రియ పూర్త య్యేందుకు 10 రోజుల సమయం పడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈలోపు రెండో సెమిస్టర్ ప్రారంభం కానుండటంతో డబ్బులు చెల్లించకుంటే వర్సిటీల్లో ఇబ్బందులు వస్తా యని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. -
జిల్లాల పర్యటనకు బీసీ కమిషన్
⇒ బీసీ–ఈ కులాల సామాజిక స్థితులపై అధ్యయనం ⇒ 10 నుంచి 14 వరకు పర్యటనలు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: బీసీ కమిషన్ తొలిసారిగా క్షేత్రస్థాయిలో పర్యటించి బీసీ కులాల తీరును అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా తొలుత ‘బీసీ–ఈ’కులాల ఆర్థిక, సామాజిక స్థితిగతులను పరిశీలించనుంది. ఈ మేరకు పర్యటన షెడ్యూల్‌ను బీసీ సంక్షేమ శాఖ కమిషనర్, కమిషన్ సభ్య కార్యదర్శి జీడీ అరుణ జిల్లా కలెక్టర్లకు పంపారు. కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, సభ్యులు వకుళాభరణం కృష్ణమోహన్, ఈడిగ ఆంజనేయగౌడ్, జూలూరు గౌరీశంకర్‌లు రోజుకు రెండు జిల్లాల చొప్పున ఈనెల 10 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తారు. సర్వే నమూనాలు సిద్ధం.. బీసీ–ఈ కులాల తీరుపై అధ్యయనానికి ప్రత్యేక నమూనా పట్టిక (ప్రొఫార్మా)ను కమిషన్ రూపొందించింది. బీసీ–ఈలు అత్యధికంగా ఉన్న ప్రాంతాలు, గ్రామాల వివరాలను ఈనెల 9వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు తెలియజేయాలని కలెక్టర్లను కమిషన్ ఆదేశించింది. హిందీ, ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ బాషల్లో రూపొందించిన ఈ ప్రొఫార్మాను ప్రతి జిల్లాకు పంపింది. ఇందులో సామాజిక పరిస్థితులు, విద్య సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు, జీవన స్థితిగతులు తెలుసుకునేలా ప్రశ్నావళి ఉంది. అలాగే ప్రభుత్వం నుంచి ఏం ఆశిస్తున్నారనేది కూడా ఉంది. ప్రతి జిల్లాకు కనీసం 500 సర్వే పత్రాలు పూర్తిచేసి ఈ నెల 15 నాటికి బీసీ కమిషన్ కార్యాలయానికి పంపించాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. ఈ సర్వే పత్రాలను క్రోఢీకరించి వారి అవసరాలను ప్రభుత్వానికి కమిషన్ నివేదించనుంది. -
మంత్రుల శాఖల్లో మార్పులు
⇒ ఈటలకు బీసీ సంక్షేమశాఖ ⇒ జోగు రామన్నకు పౌరసరఫరాలు ⇒ ఒకట్రెండు రోజుల్లో మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు ⇒ సీఎం కేసీఆర్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే బడ్జెట్లో బీసీ కులాలు, అత్యంత వెనుక బడిన బీసీ కులాల (ఎంబీసీ) సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీలు, ఎంబీసీ వృత్తులపై అవగాహన ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఈటల ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ‘అవసరమైతే రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖ అప్పగిస్తాం. ఎంబీసీల అభ్యు న్నతికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది. జోగు రామన్న వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను ఈటలకు ఇచ్చి.. సివిల్ సప్లయిస్ శాఖను ఆయనకు అప్పగిద్దాం...’ అని ఇటీవల ఎంబీసీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. ‘పదవి ఉన్నా లేకున్నా బీసీల సంక్షే మానికి పని చేసేందుకు కట్టుబడి ఉంటా. శాఖల మార్పు విషయాన్ని మీరే ఆలోచిం చండి.. మీ నిర్ణయం. మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటా...’ అని ఈటల సైతం సమా వేశం అనంతరం సీఎంకు అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. దీంతో ఈటల వద్ద ఉన్న ఆర్థిక శాఖను యథాతథంగా ఉంచి బీసీ సంక్షేమ శాఖను అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది. బదులుగా మంత్రి జోగు రామన్నకు అటవీ శాఖను కొనసాగించి పౌర సరఫరాల శాఖను కేటాయిస్తారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు మంత్రులకు సంబం ధించిన శాఖల మార్పు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ లోపునే శాఖలను మారుస్తారా.. బడ్జెట్ సమావేశాలు ముగిశాక నిర్ణయం తీసు కుంటారా అనేది చర్చనీయాంశమైంది. -
28 వరకు విద్యానిధి దరఖాస్తు గడువు
సాక్షి, హైదరాబాద్: విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేయాలనుకున్న అభ్యర్థులు మహాత్మ జ్యోతిబా పూలే (ఎంజేపీ) ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద దరఖాస్తు చేసుకోవచ్చని బీసీ సంక్షేమ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నెల 28 సాయంత్రం 5 గంటల లోపు https://telanganaepass. cgg.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలంది. అభ్యర్థుల కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించొద్దని, వయసు జులై 1 నాటికి 35 ఏళ్లు మించకుండా ఉండాలని పేర్కొంది. అంతేకాకుండా టోఫెల్/ఐఈఎల్టీఎస్, జీఆర్ఈ/ జీమ్యాట్‌లో అర్హత సాధిస్తే సరిపోతుందని వివరించింది. -
వంద హాస్టళ్లకు తాళం
సంక్షేమ వసతిగృహాల్లో తగ్గుతున్న విద్యార్థులు తగినంతమంది విద్యార్థులు లేక హాస్టళ్ల మూత మూతబడుతున్న వాటిలో ఎస్సీ హాస్టళ్లే అత్యధికం ఈ ఏడాది 59 ఎస్సీ హాస్టళ్లలో చేరని విద్యార్థులు 35 బీసీ వసతి గృహాలదీ ఇదే పరిస్థితి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు తిరోగమన బాటలో పడ్డాయి. విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతుండడంతో క్రమంగా ఈ హాస్టళ్లకు తాళాలు పడుతున్నాయి. 2016–17 విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఏకంగా వంద వసతి గృహాలు మూతబడడం గమనార్హం. విద్యార్థులు చేరక పోవడంతోనే వీటిలో అధిక శాతం వసతి గృహాలను మూసివేశారు. మరికొన్నిచోట్ల మౌలిక వసతులు కొరవడడం, విద్యార్థుల సంఖ్య అత్యంత తక్కువగా ఉండడంతో వాటిని సమీప వసతిగృహాల్లో విలీనం చేశారు. తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో 1,360 హాస్టళ్లున్నాయి. వీటిలో 1,28,149 మంది విద్యార్థులున్నారు. వాస్త వానికి ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో 1,460 హాస్టళ్లలో విద్యార్థుల నమోదుకు అధికారులు ఉపక్రమించగా క్షేత్రస్థాయిలో స్పందన సంతృప్తికరంగా రాలేదు. దీంతో విద్యార్థుల సంఖ్య 20 లోపు ఉన్న వంద హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేశారు. ఒక హాస్టల్లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుండాలి. కానీ ఎస్సీ సంక్షేమ శాఖ హాస్టళ్ల లో ఈ సంఖ్య 75గా ఉంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే ప్రభుత్వానికి వాటి నిర్వహణ భారం తడిసి మోపెడవుతుంది. వంద మంది విద్యార్థులున్నా ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని నిర్వహించడం కష్టమని వసతిగృహ సంక్షేమాధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో విద్యార్థుల సంఖ్య సగటన 91గా ఉంది. అయితే ఎస్టీ సంక్షేమశాఖ పరిధిలో సగటున విద్యా ర్థుల సంఖ్య 181గా ఉంది. ఎస్టీ సంక్షేమంలోని హాస్టళ్లు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉంది. కాగా, ఈ ఏడాది మూతబడ్డ హాస్టళ్లల్లో 59 ఎస్సీ, 35 బీసీ, 6 ఎస్టీ హాస్టళ్లున్నట్లు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. ఇన్చార్జీల పాలనతో... మెజార్టీ హాస్టళ్లు ఇన్చార్జి సంక్షేమాధికారుల పాలనలోనే ఉన్నాయి. ఈ హాస్టళ్లకు పూర్తిస్థాయి సంక్షేమాధికారులు లేకపోవడంతో వాటి పర్యవేక్షణ గందరగోళంగా మారింది. వాస్తవానికి పూర్తి స్థాయిలో వసతిగృహ సంక్షేమాధికారి ఉంటే విద్యాసంవత్సరం ప్రారంభంలో గ్రామస్థాయిలో పర్యటించి విద్యార్థుల నమోదు సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకునే అవకాశముంటుంది. కానీ ఒక్కో వసతిగృహ సంక్షేమాధికారికి రెండు, అంతకంటే ఎక్కువ వసతిగృహాల నిర్వహణ బాధ్యతలుండ డంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కొన్నిచోట్ల ఉపాధ్యాయులు డెప్యూటేషన్ పద్ధతిలో సంక్షేమాధికారులుగా పనిచేస్తున్నారు. ఉదాహరణకు రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలంలో ఓ వసతిగృహ సంక్షేమాధికారి (హెచ్‌డబ్ల్యూఓ) రెండు పోస్టుమెట్రిక్ హాస్టళ్లు, రెండు ప్రీమెట్రిక్ హాస్టళ్లను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సదరు హెచ్‌డబ్ల్యూఓ ఒకేరోజు నాలుగు హాస్టళ్లకు హాజరు కావడం కష్టమే. దాంతో పర్యవేక్షణ లేక అక్కడ అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. -
పూలే ఓవర్సీస్ విద్యానిధికి 110 మంది ఎంపిక
అర్హుల వివరాలు వెల్లడించిన జోగురామన్న సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిభా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకానికి 110 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ పథకం కింద గత నెలలో దరఖాస్తులు స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖ.. వాటి పరిశీలన అనంతరం అర్హులను ఎంపిక చేసింది. మంగళవారం సచివాలయంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న, ఆ శాఖ కమిషనర్ జీడీ అరుణతో కలసి నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు వెల్లడించారు. మొత్తం 231 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 153 మంది ఇంటర్వూ్యకు హాజరయ్యారు. వీరిలో 142 మంది తుది ఎంపిక కార్యక్రమంలో పాల్గొనగా 110 మంది మాత్రమే ఎంపికయ్యారు. జీఆర్ఈ, జీమ్యాట్ తదితర వాటిల్లో స్కోర్ తక్కువగా ఉండడంతోనే కొందరు విద్యార్థులు అర్హత సాధించలేకపోయారని తెలిపారు. -
‘విద్యానిధి’.. స్పందన హతవిధి!
- రూ.20 లక్షల సాయమిస్తామన్నా దరఖాస్తు చేసుకోని విద్యార్థులు - నాలుగేళ్లుగా అర్హత సాధించింది 396 మందే - పథకంపై ప్రచారం చేయని సంక్షేమ శాఖలు సాక్షి, హైదరాబాద్: ‘విదేశాల్లో ఉన్నత విద్యకు ఆర్థిక సాయం రూ.20 లక్షలు. ఈ నిధులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు. ఇంకేముంది ఈ పథకాన్ని బోలెడు మంది సద్వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నారా..? అదేం లేదు.’ఇంతటి బృహత్తర అవకాశం ఉన్నప్పటికీ... అందిపుచ్చుకునే అభ్యర్థులు మాత్రం కరువయ్యారు. ఎస్సీ, ఎస్టీలలోని ప్రతిభావంతులైన పేద విద్యార్థుల్లో ఏటా ఆరు వందల మందికి ఈ అవకాశం కల్పిస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ... క్షేత్రస్థాయి నుంచి కనీసం 30 శాతం దరఖాస్తులు మించడం లేదు. వీటిలో అర్హత సాధించేది పదిహేను శాతం లోపే. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం దుస్థితి ఇది. అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద అర్హత సాధించిన లబ్ధిదారుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తంతో విదేశాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్, ఆపై విద్య అభ్యసించవచ్చు. గతంలో రూ.10 లక్షలుగా ఉన్న ఈ ఆర్థిక సాయం... తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వం రెట్టింపు చేసింది. బ్యాచ్‌లర్ డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించి, రూ.రెండు లక్షలలోపు కుటుంబ వార్షికాదాయం ఉంటే చాలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. శాఖాపరమైన మౌఖిక పరీక్షలో నెగ్గి, యునైటెడ్ స్టేట్స్ (యూఎస్), యునైటెడ్ కింగ్డమ్ (యూకే), సింగపూర్, కెనడా, ఆస్ట్రేలియా దేశాల్లోని యూనివర్సిటీల్లో పీజీ సీటు సాధించి ప్రయాణ ఖర్చులు భరిస్తే చాలు... పథకం కింద ఎంపికైన విద్యార్థికి రూ.10 లక్షల చొప్పున రెండు విడతల్లో రూ.20 లక్షలు బ్యాంకు ఖాతాలో జమచేస్తుంది. సులభతరమైన నిబంధనలున్నప్పటికీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడం గమనార్హం. లక్ష్య సాధనలో అధ్వానం... అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం లక్ష్యాల సాధన గత నాలుగేళ్లుగా నత్తనడకన సాగుతోంది. నాలుగేళ్ల కాలంలో ఎస్సీ అభివృద్ధి శాఖకు 1,200 యూనిట్లకు గాను కేవలం 331 మందికి రూ.66.20 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించారు. అదేవిధంగా ఎస్టీ కేటగిరీలో కేవలం 65 మందికి రూ. 13 కోట్లు సహాయాన్ని విద్యార్థుల ఖాతాలో జమచేశారు. లక్ష్యాల మేరకు నిధులున్నప్పటికీ... అర్హులు లేకపోవడంతో మిగులు మొత్తాన్ని ఆ శాఖ అధికారులు వెనక్కు పంపించేస్తున్నారు. తాజాగా వెనుకబడిన తరగతుల వర్గాల్లోని పేద విద్యార్థుల కోసం మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్సీస్ విద్యానిధి పథకాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. 2016–17 వార్షికంలో బీసీ సంక్షేమ శాఖ ద్వారా 3వందల మందికి ఆర్థిక సాయం అందించే వెసులుబాటు కల్పించింది. ఈమేరకు గతవారం వరకు ఆ శాఖ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించింది. కానీ క్షేత్రస్థాయి నుంచి 230 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సోమవారం ఇంటర్వూ్యలు నిర్వహించగా... అర్హుల జాబితాను ఖరారు చేయాల్సి ఉంది. -
గుడ్డిగా విమర్శిస్తున్నారు
విపక్ష నేతలపై మంత్రి జోగురామన్న ధ్వజం సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వంపై గుడ్డిగా విమర్శలు చేయడమే విపక్షాలు పని గా పెట్టుకున్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్న ధ్వజమెత్తారు. దేశం లో ఎక్కడా లేని విధంగా బీసీ సంక్షేమానికి నిధులు వెచ్చిస్తూ సంక్షేమ పథకాల అమల్లో అగ్రగామిగా రాష్ట్రం కొనసాగుతుంటే.. బీసీల ను ప్రభుత్వం మోసం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. బీసీ వర్గాల నుంచి ప్రధానిగా ఎదిగిన మోదీ హయాంలో వారి కోసం ఒక్క పథకమైనా మొదలుపెట్టకపోవడం బీసీలపై కేంద్ర నిర్లక్ష్య వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయలేని బీజేపీ నాయ కులు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని ప్రశ్నించారు. రెండున్నరేళ్లలో బీసీల కోసం రూ.7,365 కోట్లు కేటాయించి, ఇప్ప టివరకు రూ.4వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. బీసీ హాస్టళ్లకు వెంటనే రగ్గులు బీసీ హాస్టళ్లు, గురుకులాల్లోని విదార్థులకు వెంటనే రగ్గులు పంపిణీ చేయాలని అధికా రులను మంత్రి ఆదేశించారు. గురుకుల విద్యా సంస్థల్లోని కాం ట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ల వేతనాలు పెం చాలని సంబంధిత అధి కారులకు సూచించారు. సంక్షేమ హాస్టళ్ల విద్యార్థుల సమస్యలపై మంగళవారం సచి వాలయంలో మంత్రికి బీసీ సంక్షేమ సంఘం నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు వినతిపత్రం సమర్పించారు. బీసీ స్టడీ సర్కిళ్లలోని హాస్టళ్లలో బీసీల సీట్లను 90 శాతానికి పెంచాలని, సంక్షేమ విద్యార్థుల ఫీజు బకారుులు రూ.2,090 కోట్లు వెంటనే విడుదల చేయాలని కోరారు. నేడు మెక్సికో కాప్ సదస్సుకు మంత్రి మెక్సికోలో జరగనున్న కన్వెన్షన్ ఆన్ బయో లాజికల్ డైవర్సిటీ (కాప్-13) సదస్సులో పాల్గొనేందుకు మంత్రి జోగురామన్న బుధ వారం రాత్రి బయలుదేరనున్నారు. ఈ నెల 9 నుంచి 10 రోజుల పాటు మెక్సికోలోని కాన్కన్ నగరంలో జరగనున్న ఈ సదస్సులో మంత్రితో పాటు అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్ మీనా, బయోడైవర్సిటీ బోర్డు మెంబర్ సెక్రటరీ సి.సువర్ణ పాల్గొంటారు. -
స్తబ్ధతలో కల్యాణ లక్ష్మీ..
-పరిశీలనకు నోచుకోని దరఖాస్తులు -పెండింగ్‌లో 1372 దరఖాస్తులు -బీసీ,ఈబీసీలపై మొదలు కాని ప్రక్రియ సాక్షి,సిటీబ్యూరో కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల అమల్లో స్తబ్దత నెలకొంది. లబ్ధిదారుల ఎంపిక స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించటంతో దరఖాస్తులు పరిశీలనకు నోచుకొనని పరిస్థితి నెలకొంది. ఎస్సీ,ఎస్టీ,మైనారిటీలకు అమలు చేస్తున్న ఈ పథకాలు తాజాగా ఏఫ్రిల్ నుంచి బీసీ, ఈబీసీలకు కూడా వర్తింప చేస్తున్నది. గ్రేటర్ హైదరాబాద్‌లో కళ్యాణలక్ష్మీకి సంబంధించిన దరఖాస్తులు 1372 పరిశీలన దశ( పెండింగ్)లో ఉన్నాయి.ఆర్థికంగా బలహీనంగా ఉన్న షెడ్డ్యూల్ కులాలు, షెడ్డ్యూల్ తెగలు, ఈబీసీ వర్గాలకు చెందిన 18 ఏళ్లకు పైబడిన యువతుల వివాహాము కోసం కళ్యాణ లక్ష్మీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశ పెట్టింది.తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణాల్లో రూ.2లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షల లోపు ఉండాల్సి ఉంది. గ్రేటర్ కళ్యాణలక్ష్మీ పథకం కింద ఆర్థిక సహాయం కోసం ఎస్సీ,ఎస్టీ,బీసీ, ఈబీసీ వర్గాల నుంచి 2016-17 సంవత్సరంలో 4,200 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా, ఇప్పటి వరకు 3,288 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. దీనికి సంబంధించిన నిధులు కూడా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. అయితే... ఇటీవల పథకంలో మార్పులు చోటుచేసుకోవటంతో రిజిష్టరై పెండింగ్‌లో ఉన్న 1372 దరఖాస్తుల పరిశీలన,ఎంపికలో తీవ్ర జాప్యం జరుగుతుంది. ఇందులో బీసీ,ఈబీసీ వర్గాలకు సంబంధించిన 280 దరఖాస్తులు ఉన్నాయి. ఇవే కాక మిగతా జిల్లాల్లో కూడా ఈబీసీ దరఖాస్తుల పని అదే విధంగా ఉన్నాయి. మారిన విధానంతో చిక్కులు... గతంలో ఎస్సీ,ఎస్టీల దరఖాస్తులను ఆయా శాఖల జిల్లా అధికారులే పరిశీలించి నేరుగా వధువు బ్యాంక్ ఖాతాలోకి ఆన్లైన్లో రూ.51 వేలు బదిలీ చేసేవారు. మైనారిటీలకు సంబంధించి జిల్లాల్లో సొంత యంత్రాంగం లేనందున రెవెన్యూశాఖ (ఎమ్మార్వోలు) ద్వారా దరఖాస్తులను పరిశీలించేవారు. ఇప్పుడు ఈ పథకాల అమల్లో స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించారు. ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీ లబ్దిదారుల దరఖాస్తుల ఎంపిక బాధ్యత మొదలుకుని, వధువు తల్లి పేరిట ఆమెకే డమ్మీ చెక్కులను అందజేసే వరకు ఎమ్మెల్యేల పాత్ర ఉంటుంది. ఇక్కడే ఆయా శాఖల అధికారులకు చిక్కులు మొదలయ్యాయి. ఎమ్మెల్యేలకు ఆయా దరఖాస్తులను అందజేయడం, వాటిపై వారు సంతకం చేశాక కేవలం తహసీల్దార్ల ద్వారా పరిశీలన జరిపించి, వధువు తల్లి పేరిట చెక్కును సిద్ధం చేసి, డమ్మీ చెక్కును తయారు చేయించి, ఎమ్మెల్యేల పర్యటన వివరాలు తెలుసుకుని వారి ద్వారా నియోజకవర్గ లేదా మండల కేంద్రంలో చెక్కుల పంపిణీకి చర్యలు తీసుకోవడం తలకు మించిన భారంగా మారుతోంది. బీసీ,ఈబీసీలపై అందని ఆదేశాలు... ఎస్సీ,ఎస్టీ,మైనారిటీల దరకాస్తులను పరిశీలిస్తున్న విధంగానే బీసీ,ఈబీసీలవి కూడా ఎమ్మార్వోలే పరిశీలించాల్సి ఉండగా ఇప్పటివరకు రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలు అందలేదు. తమ శాఖ పరిధిలోని దరఖాస్తులను పరిశీలించాలని సీసీఎల్ఏను బీసీసంక్షేమశాఖ సంప్రదించి లేఖను కూడా అందజేసింది. అయితే సీసీఎల్ఏ నుంచి ఎమ్మార్వోలకు ఇంకా ఉత్తర్వులు అందలేదు. అంతేకాకుండా ఎమ్మార్వోలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్(సీజీజీ) అధికారులకు ఆన్లైన్లో దరకాస్తుల పరిశీలనకు ఇంకా లాగిన్లు ఇవ్వలేదు. ఈ పథకం కింద ప్రయోజనం కోసం తమకు వచ్చిన దరకాస్తుల జాబితాను ఎమ్మెల్యేలకు పంపించాలని ప్రభుత్వ ఉత్తర్వులో పేర్కొన్నారు. దీనితో ఎమ్మెల్యేలకు దరకాస్తులను పంపించి, వాటిపై ఆమోదం తీసుకోవడం కూడా మొదలు కాలేదు. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో తమకు కల్యాణ లక్ష్మీ పథకం కింద డబ్బులు వస్తాయో రావోనని ఈబీసీలు ఆందోళనలో ఉన్నారు. -
11 నుంచి దశలవారీగా కొత్త గురుకులాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ర్టంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న 103 ఎస్సీ గురుకుల పాఠశాలలు ఈ నెల 11 నుంచి దశలవారీగా ప్రారంభం కానున్నాయి. ఆ తరువాత పది పదిహేను రోజుల్లో అన్నింటినీ ప్రారంభించాలని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సొసైటీ ప్రణాళిక సిద్ధం చేసింది. జిల్లాలకు చెందిన మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు వారికి అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి ఈ పాఠశాలలను ఆరంభిస్తారు. వీటిల్లో తొలుత ఐదు, అనంతరం ఆరో తరగతి విద్యాబోధనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దాదాపు 8 వేల మందికి 5వ తరగతిలో ప్రవేశానికి సీట్లు కేటాయించారు. తరగతులను ప్రస్తుతం తాత్కాలిక భవనాల్లో నిర్వహించి, రెండు మూడు నెలల వ్యవధిలో కొత్త భవనాల్లోకి వాటిని తరలించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే షెడ్యూల్డ్ కులాల కోసం ఏర్పాటు చేయనున్న 30 మహిళా డిగ్రీ కాలేజీలను ఈ నెలాఖరులోగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పదిలోగా పార్ట్‌టైమ్ నియామకాలు... కొత్త గురుకులాలకు అవసరమైన శాశ్వత అధ్యాపకులు, సిబ్బందిని టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే నోటిఫికేషన్ ఇచ్చి ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక పూర్తిచేసేందుకు కనీసం ఆరు మాసాల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో అప్పటివరకు ఈ స్కూళ్లలో విద్యా బోధనకు పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పోస్టులు భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఇప్పటికే రాత పరీక్ష కూడా నిర్వహించారు. ఈ నెల 10 లోగా సదరు స్కూళ్లలో పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ ఉపాధ్యాయుల నియామకాన్ని పూర్తిచేయనున్నట్లు ఎస్సీ గురుకులాల సొసైటీ వర్గాల సమాచారం. ఇక డిగ్రీ కాలేజీల్లో ఈ నెల 20 కల్లా పార్ట్‌టైమ్, ఔట్సోర్సింగ్ లెక్చరర్ల భర్తీ పూర్తి చేస్తారు. ఒక్కో డిగ్రీ కాలేజీకి 20-25 మంది లెక్చరర్లు అవసరమని అంచనా. ఒక్కొక్కటిగా... మరోవైపు 71 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఇప్పటికే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. 50 ఎస్టీ గురుకుల పాఠశాలలకు సంబంధించిన పోస్టులు, బడ్జెట్ కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయి. ఈ విద్యాసంవత్సరం నుంచే 50 బీసీ గురుకులాల ప్రారంభంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ పాఠశాలలను ఎక్కడెక్కడ నెలకొల్పాలి, అవసరమైన టీచర్లు, సిబ్బంది వంటి అంశాలపై బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలను తయారు చేస్తోంది. వీటిపై ప్రభుత్వ ఆమోదముద్రపడగానే పోస్టుల భర్తీ, పాఠశాలల ఏర్పాటుకు చర్యలు చేపడతారు. -
ఫీజులు పెండింగ్
► బీసీ అధికారుల నిర్లక్ష్య ఫలితం ► రూ.172 కోట్లు విడుదల ► సుమారు రూ.90 కోట్లే ఖర్చు ► సాంకేతిక సమస్యతో నిలిచిన ప్రక్రియ ► విద్యార్థులకు ఇక్కట్లు కరీంనగర్ సిటీ: బీసీ సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యం జిల్లాలో విద్యార్థులకు శాపంలా పరిణమించింది. ఏళ్ల తరబడి రోడ్లెక్కి ఉద్యమాలు చేస్తే ప్రభుత్వం విడుదల చేసిన స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులను అధికారులు సకాలంలో ఖర్చుచేయకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది. స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ కింద జిల్లా బీసీ సంక్షేమ శాఖకు రూ.172 కోట్లను ప్రభుత్వం గత మే 8న విడుదల చేసింది. ఇందులో 2014-15 ఫ్రెష్, 2015-16 సంవత్సరాలకు సంబంధించిన విద్యార్థుల రెన్యువల్, ఫ్రెష్ ఫీజులున్నాయి. బకాయిలు విడుదల చేయాలనే ఒత్తిడితో ఎట్టకేలకు కేసీఆర్ ప్రభుత్వం మొత్తం ఏకకాలంలో విడుదల చేసింది. దీంతో విద్యార్థులు, కళాశాలలు ఊపిరి పీల్చుకున్నాయి. కాని ప్రభుత్వం విడుదల చేసిన నిధులను విద్యార్థుల, కళాశాలల ఖాతాలకు మళ్లించాల్సిన సంక్షేమశాఖ అధికారులు విపరీత జాప్యంచేశారు. దాదాపు నెలరోజుల సమయంలో సుమారు రూ.90 కోట్లు మాత్రమే ఖాతాల్లో వే సినట్లు సమాచారం. ఇందుకు సంబంధిత బిల్లులు చేసే అధికారులకు అవగాహన లేకపోవడం కొంత కాగా, కావాలని జాప్యం చేస్తున్నారనే అనుమానాలూ ఉన్నాయి. ఇదే సమయంలో ట్రెజరీ నుంచి బ్యాంక్‌లకు వెళ్లాల్సిన ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే ఇది నిజంగా సాంకేతిక సమస్య కాదని, ప్రభుత్వం విధించిన అనధికార ఫ్రీజింగ్లో భాగమేననే పలు సంఘాలు పేర్కొంటున్నాయి. ఏదేమైనా సమస్యను రెండు రోజుల్లో సరిచేస్తామని అధికారులు చెబుతున్నా బిల్లులకు సంబంధించి బీసీ సంక్షేమ శాఖ అధికారులు చేస్తున్న జాప్యంతో మరెన్ని సమస్యలు వస్తాయో అనే ఆందోళనను విద్యార్థులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు విడుదల చేసినా, సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులు, కళాశాలలు ఫీజుల కోసం మళ్లీ ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, కళాశాలలతో ‘ఒప్పందాలు’ పూర్తి కాకపోవడంతో కావాలనే బిల్లుల్లో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. ఏదేమైనా మొత్తం ఫీజు బకాయిలు వచ్చినందున జాప్యం చేయకుండా సకాలంలో చెల్లించాలని విద్యార్థులు కోరుతున్నారు. ‘బీసీ సంక్షేమ శాఖకు సంబంధించిన స్కాలర్షిప్, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు ఖాతాల్లో వేసే ప్రక్రియ సర్వర్ సమస్యతో తాత్కాలికంగా నిలిచిపోయింది. ఇప్పటికే మాకు వచ్చిన బిల్లులు దాదాపుగా ఖాతాల్లో వేశాం. ఒకట్రెండు రోజుల్లో సాంకేతిక సమస్యను సరిచేసి,ప్రక్రియను ప్రారంభిస్తాం’ అని డీటీవో శ్రీనివాస్ తెలిపారు. -
మైనారిటీల అభివృద్ధికి కృషి
► 12 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం ► దేశంలోనే ప్రథమంగా మైనారిటీ గురుకులాలు ► రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నిర్మల్ టౌన్ : మైనారిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన్, ల్యాండ్ సీలింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నిర్మల్‌లోని తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శనివారం ఆయన రాష్ట్ర గృ హనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్నతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజరాజేశ్వర గార్డెన్లో మైనార్టీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు. మైనారిటీల అభివృద్ధికి రూ.1,207 కోట్ల బడ్జెట్.. సీఎం కేసీఆర్ మైనార్టీల అభివ ృద్ధికి ఎన్నడూలేని విధంగా రూ.1,207 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం వద్ద ప్రజల పూర్తిస్థాయి సమాచారం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబసర్వేను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ క ృషి చేస్తున్నారన్నారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహం కోసం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి శుద్ధజలం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తిచేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను అభివ ృద్ధి చేసి రైతులకు సాగునీరు అందేలా క ృషి చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం.. సమైక్య పాలనలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం మైనారిటీలకు అందజేస్తున్న రుణాలను బ్యాంకర్ల సహకారంతో పూర్తిస్థాయిలో అందేలా చూస్తామన్నారు. నిర్మల్‌లోని మసీదుల అభివ ృద్ధికి రూ.26 లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అందించారు. అదే విధంగా ముస్లిం మత పెద్దలకు గౌరవ వేతనాలకు సంబంధించిన చెక్కులను అందించారు. జిల్లా అన్ని పథకాల అమలులో ముందంజలో ఉందని అన్నారు. కలెక్టర్ జగన్మోహన్, ఆర్డీవో శివలింగయ్యలను ఆయన ప్రశంసించారు. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మైనార్టీ శాఖ సెక్రెటరీ ఉమ్మర్ జలీల్, జేసీ సుందర్‌అబ్నార్, ఆర్డీవో శివలింగయ్య, తహసీల్దార్ జాడి రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంజీబిన్యాహియా తదితరులు పాల్గొన్నారు. -
అవకాశాలు కోల్పోతున్న రాష్ట్ర విద్యార్థులు
♦ కేంద్ర ఓబీసీ జాబితాలో 26 రాష్ట్ర బీసీ కులాలను చేర్చకపోవడంతో తీరని నష్టం ♦ ఇప్పటికే సిఫార్సులను కేంద్రానికి పంపామన్న బీసీ కమిషన్ చైర్మన్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వ నిర్ణయంలో జాప్యం, జాతీయ బీసీ కమిషన్ నుంచి సత్వర ఉత్తర్వులు రాకపోవడంతో రాష్ట్రానికి చెందిన విద్యార్థులు విద్య, ఉద్యోగ రంగాల్లో విలువైన అవకాశాలను కోల్పోతున్నారు. తెలంగాణ ఏర్పడి రెండేళ్లు కావొస్తున్నా ఇంకా కేంద్ర ఓబీసీ జాబితాలో రాష్ట్రానికి చెందిన 26 బీసీ కులాలను చేర్చకపోవడంతో ఈ వర్గాల విద్యార్థులు నష్టపోతున్నారు. జాతీయ స్థాయిలో వివిధ కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు, బ్యాంకు, ఎల్ఐసీ, ఇతర ప్రభుత్వ రంగాల పోటీ పరీక్షలకు హాజర య్యేందుకు, ఐఐటీ, ఇతర కోర్సుల్లో సీట్లు పొందడానికి ఇది అడ్డంకిగా మారుతోంది. రాష్ట్రంలో బీసీలుగా ఉన్నా కేంద్ర ఓబీసీ జాబితాలో లేకపోవడంతో జనరల్ కేటగిరిలోనే ఈ విద్యార్థులు పోటీ పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ కులాలను ఓబీసీ జాబితాలో చేర్చడంపై ఆయా సంఘాలు, వ్యక్తుల నుంచి బీసీ కమిషన్ అభిప్రాయాలను, వినతిపత్రాలను స్వీకరించింది. అయితే ఏడాది దాటినా దానిపై ఏ నిర్ణయం వెలువడక పోవడంతో ఈ వర్గాల విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. కేంద్ర జాబితాలో తెలంగాణ ఓబీసీలను చేర్చాలని, ఈ 26 కులాలకు సంబంధించి కూడా నిర్ణయం తీసుకోవాలని గత అక్టోబర్‌లోనే జాతీయ బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, మళ్లీ మరో లేఖ రాస్తామని ఇటీవలే బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న విలేకరులకు తెలిపారు. ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపాం ‘‘పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న విధం గా రెండేళ్ల వరకు ఏపీ జాబితాలో పొందుపరిచి న ఓబీసీ తెలంగాణకూ వర్తిస్తుంది. యూపీఎస్సీ, ఇతర పరీక్షలన్నిం టికీ అర్హత ఉంటుంది. తెలంగాణ బీసీ కులాలకు సంబంధించి విడిగా ఓబీసీ జాబితాను కేంద్రానికి పంపించాం. బీసీ కమిషన్ పరిశీలన మేరకు ఆయా అంశాల ప్రాతిపదికన ఏయే కులాలను కలపాలి, వేటిని తీసేయాలి అన్న దానిపై సిఫార్సులు చేశాం. అయితే వాటిని బయటపెట్టలేను. దీనిపై కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవాలి.’’ - బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య -
స్టడీ సర్కిళ్లకు కొత్త రూపు
♦ రాష్ట్ర సర్కారు నిర్ణయం ♦ నిరుద్యోగ అభ్యర్థులకు నిపుణులతో పక్కాగా శిక్షణ ♦ వీడియో బోధన, డిజిటల్ క్లాసులతో ఆధునిక హంగులు సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం వివిధ సంక్షేమ శాఖల పరిధిలో నడుస్తున్న స్టడీసర్కిళ్లకు కొత్తరూపునివ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఏదో మొక్కుబడిగా ఆయా పోటీపరీక్షలకు శిక్షణనిచ్చేలా కాకుండా వాటి ద్వారా అణగారిన వర్గాలకు కచ్చితమైన ప్రయోజనం కలిగేలా ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా నిరుద్యోగ యువతకు ఉపాధి, ఆయా రంగాల్లో నైపుణ్యాల మెరుగుదలకు చర్యలు చేపట్టనుంది. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ స్టడీసర్కిళ్ల ద్వారా ఆయా పోటీపరీక్షలకు శిక్షణను అందిస్తున్నా ఆశించిన మేర ఫలితాలు రావడం లేదు. ఈ స్టడీసర్కిళ్ల ద్వారా యూపీఎస్సీ (సివిల్స్ ప్రిలిమ్స్) మొదలుకుని పలు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకు శిక్షణనిస్తున్నారు. అయితే పలు అంశాల్లో అధ్యాపకుల కొరత, అభ్యర్థులకు కంప్యూటర్లు, ఇంటర్నెట్ తదితర ఆధునిక సౌకర్యాలు, రిఫరెన్స్ బుక్స్ వంటివి స్టడీసర్కిళ్లలో అందుబాటులో లేకపోవడం పెద్ద లోటుగా మారింది. ఈ నేపథ్యంలో సివిల్స్‌తో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాలకు శిక్షణనిస్తున్న ప్రైవేట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్లు అందిస్తున్న స్థాయిలో అధునాతన సదుపాయాలను కల్పించాలని నిర్ణయించింది. ప్రైవేట్ సంస్థల కంటే ఒక అడుగు ముందుకేసి వీడియోకాన్ఫరెన్స్ పద్ధతిలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేవిధమైన శిక్షణను అందించాలని యోచిస్తోంది. ఇకపై బ్యాచ్‌ల వారీగా తరగతులు నిరుద్యోగ అభ్యర్థులు సివిల్స్‌లో ర్యాంకులు సాధించి సత్తా చాటేలా చేయాలని బీసీ సంక్షేమశాఖ కార్యాచరణను రూపొందిస్తోంది. ఉదయం, సాయంత్రం పలు బ్యాచ్‌లుగా తరగతులను నిర్వహించనుంది. విద్యార్థుల సంఖ్యనూ 500కు పెంచాలని యోచిస్తోంది. ఐటీ, వెబ్‌డిజైన్, కాడ్ వంటివాటిలో శిక్షణనివ్వనుంది. ఎస్టీ స్టడీసర్కిళ్లలో డిజిటల్ తరగతులు డిజిటల్ క్లాస్‌రూమ్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఎస్టీ సంక్షేమశాఖ ప్రణాళికలు రూపొందించింది. ఎస్టీ స్టడీసర్కిళ్లకు విడిగా గవర్నింగ్‌బాడీని ఏర్పాటుచేసి, రిటైర్డ్ ఐఏఎస్, ప్రస్తుత సివిల్ సర్వీసెస్ అధికారులతో శిక్షణను అందించాలని నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5 జిల్లాల్లో ఎస్సీ స్టడీసర్కిళ్లు ఉండగా, ఈ ఏడాది మరో 5 జిల్లాల్లో వాటిని ప్రారంభించనున్నారు. -
పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న
దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్సైట్ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.300 కోట్లతో 58,820 మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆన్లైన్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇతరత్రా సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరిచూడనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బీసీల కల్యాణలక్ష్మి వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆన్లైన్లో http://epasswebsite.cgg.gov వెబ్సైట్ ద్వారా ఆయాపత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత నెల 1వ(ఏప్రిల్) తేదీ తర్వాత వివాహం చేసుకున్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను తెలిపారు. రాష్ట్రానికి చెందిన 32 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గత అక్టోబర్‌లోనే బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, ఈ విషయమై మరోసారి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు. అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల లోగోను మంత్రి ఆవిష్కరించారు. -
విధుల్లో చేర్చుకునేది లేదు
శ్రీకాకుళం టౌన్ : విధుల్లో చేర్చుకునేది లేదని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టేందుకు శ్రీకాకుళం చేరుకున్న బి.రవిచంద్రకు కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం స్పష్టం చేశారు. బుధవారం కలెక్టర్‌ను కలిసేందుకు డీబీసీ కలెక్టరేటుకు వచ్చారు. అయితే రిమ్స్‌లో జరిగిన సెమినార్‌కు వెళ్లిన కలెక్టర్ పి.లక్ష్మీనృసింహం ఎంతసేపటికీ రాకపోవడంతో మధ్యాహ్నం వరకు అక్కడే వేచి ఉన్నారు. ఆయనతోపాటు దళిత సంఘ నాయకుడు బేసి మోహనరావు కూడా కలెక్టరేటుకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు కలెక్టరు తన చాంబరులోకి చేరుకున్న తర్వాత తిరిగి రవిచందర్ ఆయన్ను కలిశారు. తనను విధుల్లోకి చేర్చుకోవాలని కోరారు. అయితే అందుకు కలెక్టరు తిర్కరించడంతో వెనుదిరిగారు. కలెక్టరుకు లేఖ.. రవిచంద్ర బీసీ సంక్షేమ శాఖాధికారిగా పనిచేస్తుండగా జూనియర్ అసిస్టెంట్ బాలరాజును సస్పెండ్ చేయాలని కలెక్టరు సూచించారు. ఆ సూచనను ధిక్కరించినందుకు రవిచంద్రను కలెక్టరు ఇటీవల ప్రభుత్వానికి సరెండర్ చేశారు. సరెండర్‌కు 10 కారణాలు చూపిస్తూ ఆదేశాలిచ్చారు. వాటిని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ముందుంచిన రవిచంద్ర తనకు జరిగిన అన్యాయంపై వివరణ ఇచ్చారు. దీనిపై ముఖ్యకార్యదర్శి సంతృప్తి వ్యక్తం చేశారు. సరెండర్‌కు గల కారణాలు సరైనవి కావంటూనే వాటిపై మీరెలాంటి చర్య తీసుకున్నారో వివరణ ఇవ్వాలని కలెక్టరుకు లేఖ పంపించారు. పది అంశాలను అందులో ప్రస్తావిస్తూనే ప్రస్తుత ఇన్చార్జి డీబీసీగా వ్యవహరిస్తున్న ధనుంజయరావుకు మెమో పంపించారు. అలాగే కలెక్టరు ఇచ్చిన సరెండర్ ఉత్తర్వులను రద్దు చేశారు. డీబీసీకి యథాతథ కల్పించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో డీబీసీ రవిచంద్ర బుధవారం తిరిగి విధుల్లోకి చేరడానికి కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే ఆయన్ను తిరిగి డ్యూటీలో చేర్చుకునేందుకు అభ్యంతరం తెలుపుతూ ఉపకార వేతనాల కుంభకోంలో ఆయన పాత్రను ప్రస్తావించి ప్రభుత్వానికి తిరిగి నివేదిక పంపించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు వస్తాయో వేచిచూడాల్సి ఉంది. -
బీసీల సంక్షేమానికి ప్రాధాన్యం
♦ రూ.8,832.15 కోట్లతో ఉప ప్రణాళిక అమలు ♦ బీసీ సబ్ ప్లాన్‌పై సమీక్షలో సీఎం చంద్రబాబు వెల్లడి సాక్షి, హైదరాబాద్: బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించి.. రుణాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. దేశంలో బీసీలకు ఉప ప్రణాళికను అమలు చేస్తున్న మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశేనని చెప్పారు. హైదరాబాద్‌లోని లేక్‌వ్యూ అతిథి గృహంలో ఆదివారం సబ్ ప్లాన్ అమలుపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ సంక్షేమ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 2016-17లో బీసీ సబ్ ప్లాన్‌కు రూ.8,832.15 కోట్లు కేటాయించామన్నారు. బీసీల్లో మత్స్యకారులు, రజకుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. అంతకుముందు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి మాట్లాడుతూ... దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ రుణాలందేలా చర్యలు తీసుకుంటామన్నారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ... ఉపాధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు.జిల్లాల్లో రుణ మేళాలు నిర్వహించి, రూ.126.79 కోట్లను పంపిణీ చేశామని వివరించారు. చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ... బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన వర్గాల వారికి వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రులు కె.అచ్చెన్నాయుడు, కిమిడి మృణాళిని, విప్‌లు కూన రవికుమార్, కాగిత వెంకట్రావు, బీసీ కార్పొరేషన్ ఛైర్మన్ రంగనాయకులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.