మంత్రుల శాఖల్లో మార్పులు
⇒ ఈటలకు బీసీ సంక్షేమశాఖ
⇒ జోగు రామన్నకు పౌరసరఫరాలు
⇒ ఒకట్రెండు రోజుల్లో మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు
⇒ సీఎం కేసీఆర్ నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: మంత్రుల శాఖల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకోనున్నాయి. వచ్చే బడ్జెట్‌లో బీసీ కులాలు, అత్యంత వెనుక బడిన బీసీ కులాల (ఎంబీసీ) సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో బీసీలు, ఎంబీసీ వృత్తులపై అవగాహన ఉన్న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖను అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ప్రస్తుతం ఈటల ఆర్థిక శాఖతో పాటు పౌర సరఫరాల శాఖకు ప్రాతినిధ్యం వహిస్తు న్నారు. ‘అవసరమైతే రాజేందర్‌కు బీసీ సంక్షేమ శాఖ అప్పగిస్తాం. ఎంబీసీల అభ్యు న్నతికి ఎలాంటి చర్యలు చేపట్టాలో ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది.
జోగు రామన్న వద్ద ఉన్న బీసీ సంక్షేమ శాఖను ఈటలకు ఇచ్చి.. సివిల్ సప్లయిస్ శాఖను ఆయనకు అప్పగిద్దాం...’ అని ఇటీవల ఎంబీసీ ప్రతినిధులతో జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి స్పష్టమైన సంకేతాలు జారీ చేశారు. ‘పదవి ఉన్నా లేకున్నా బీసీల సంక్షే మానికి పని చేసేందుకు కట్టుబడి ఉంటా. శాఖల మార్పు విషయాన్ని మీరే ఆలోచిం చండి.. మీ నిర్ణయం. మీ ఆదేశాల ప్రకారం నడుచుకుంటా...’ అని ఈటల సైతం సమా వేశం అనంతరం సీఎంకు అభిప్రాయాన్ని తెలిపినట్లు సమాచారం. దీంతో ఈటల వద్ద ఉన్న ఆర్థిక శాఖను యథాతథంగా ఉంచి బీసీ సంక్షేమ శాఖను అప్పగిస్తారనే ప్రచారం జోరందుకుంది.
బదులుగా మంత్రి జోగు రామన్నకు అటవీ శాఖను కొనసాగించి పౌర సరఫరాల శాఖను కేటాయిస్తారు. ఒకట్రెండు రోజుల్లోనే ఇద్దరు మంత్రులకు సంబం ధించిన శాఖల మార్పు నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. వచ్చే నెల 8 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభించా లని ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. ఈ లోపునే శాఖలను మారుస్తారా.. బడ్జెట్ సమావేశాలు ముగిశాక నిర్ణయం తీసు కుంటారా అనేది చర్చనీయాంశమైంది.