మైనారిటీల అభివృద్ధికి కృషి
► 12 శాతం రిజర్వేషన్ల అమలుకు కట్టుబడి ఉన్నాం
► దేశంలోనే ప్రథమంగా మైనారిటీ గురుకులాలు
► రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ
నిర్మల్ టౌన్ : మైనారిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కృషి చేస్తున్నారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ, రిలీఫ్, రిహాబిలిటేషన్, ల్యాండ్ సీలింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. నిర్మల్‌లోని తహసీల్దార్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శనివారం ఆయన రాష్ట్ర గృ హనిర్మాణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగురామన్నతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం రాజరాజేశ్వర గార్డెన్‌లో మైనార్టీ గురుకుల పాఠశాల అడ్మిషన్ల కోసం నిర్వహించిన లక్కీ డ్రా కార్యక్రమంలో పాల్గొన్నారు.
మైనారిటీల అభివృద్ధికి రూ.1,207 కోట్ల బడ్జెట్..
సీఎం కేసీఆర్ మైనార్టీల అభివ ృద్ధికి ఎన్నడూలేని విధంగా రూ.1,207 కోట్ల బడ్జెట్ కేటాయించారన్నారు. పథకాలను ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం వద్ద ప్రజల పూర్తిస్థాయి సమాచారం ఉండాలనే ఉద్దేశంతో సమగ్ర కుటుంబసర్వేను విజయవంతంగా నిర్వహించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు సీఎం కేసీఆర్ క ృషి చేస్తున్నారన్నారు. పేద కుటుంబాల్లోని ఆడపిల్లల వివాహం కోసం కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలను రాష్ట్రం ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రతీ ఇంటికి శుద్ధజలం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం మిషన్ భగీరథ పనులను వేగంగా పూర్తిచేస్తోందని చెప్పారు. మిషన్ కాకతీయలో భాగంగా చెరువులను అభివ ృద్ధి చేసి రైతులకు సాగునీరు అందేలా క ృషి చేస్తామన్నారు. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 24 గంటల పాటు విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం..
సమైక్య పాలనలో తెలంగాణకు అన్ని రంగాల్లో అన్యాయం జరిగిందన్నారు. ప్రభుత్వం మైనారిటీలకు అందజేస్తున్న రుణాలను బ్యాంకర్ల సహకారంతో పూర్తిస్థాయిలో అందేలా చూస్తామన్నారు. నిర్మల్‌లోని మసీదుల అభివ ృద్ధికి రూ.26 లక్షల చెక్కును డిప్యూటీ సీఎం ఈ సందర్భంగా అందించారు. అదే విధంగా ముస్లిం మత పెద్దలకు గౌరవ వేతనాలకు సంబంధించిన చెక్కులను అందించారు. జిల్లా అన్ని పథకాల అమలులో ముందంజలో ఉందని అన్నారు. కలెక్టర్ జగన్మోహన్, ఆర్డీవో శివలింగయ్యలను ఆయన ప్రశంసించారు. ఇందులో ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, మైనార్టీ శాఖ సెక్రెటరీ ఉమ్మర్ జలీల్, జేసీ సుందర్‌అబ్నార్, ఆర్డీవో శివలింగయ్య, తహసీల్దార్ జాడి రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ త్రియంబకేశ్వర్, మున్సిపల్ వైస్ చైర్మన్ అంజీబిన్‌యాహియా తదితరులు పాల్గొన్నారు.