పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న | Website louch for kalyana lakshmi to BCs | Sakshi
Sakshi News home page

పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న

Published Sat, May 14 2016 2:43 AM | Last Updated on Mon, Sep 4 2017 12:02 AM

పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న

పక్కాగా బీసీల కల్యాణలక్ష్మి: రామన్న

దరఖాస్తుల రిజిస్ట్రేషన్ కోసం వెబ్‌సైట్ ప్రారంభం
 
 సాక్షి, హైదరాబాద్: బీసీ, ఈబీసీల కల్యాణలక్ష్మి పథకాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఈ పథకం ద్వారా ఈ ఏడాది రూ.300 కోట్లతో 58,820 మందికి ప్రయోజనం చేకూర్చనున్నట్లు పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇతరత్రా సమాచారాన్ని రెవెన్యూ యంత్రాంగం ద్వారా సరిచూడనున్నట్లు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో బీసీల కల్యాణలక్ష్మి వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు.

ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో http://epasswebsite.cgg.gov వెబ్‌సైట్ ద్వారా ఆయాపత్రాలను జత చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. గత నెల 1వ(ఏప్రిల్) తేదీ తర్వాత వివాహం చేసుకున్నవారు ఈ పథకం కింద లబ్ధి పొందేందుకు అర్హులను తెలిపారు. రాష్ట్రానికి చెందిన 32 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరుతూ గత అక్టోబర్‌లోనే బీసీ కమిషన్‌కు లేఖ రాశామని, ఈ విషయమై మరోసారి లేఖ రాస్తామని మంత్రి చెప్పారు.  అనంతరం మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల లోగోను మంత్రి ఆవిష్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement