బకాయి ఫీజులు వచ్చాయోచ్!
2013-14 సంవత్సరానికి లైన్ క్లియర్
- బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త
- రూ. 28.31 కోట్లు విడుదల చేసిన సర్కారు
- ఎస్‌టీ, మైనారిటీ శాఖలకు కూడా త్వరలోనే
- ఉపకార వేతనాలకూ కలిగిన మోక్షం
ఇందూరు: 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖకు రూ.28.31 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్‌సీ విద్యార్థులకు రెండు నెలల క్రితమే నిధులు విడుదల చేసింది. ఎస్‌టీ, మై నారిటీ విద్యార్థుల ఫీజులను కూడా విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులు ఇంకా అందలేదు. మరో రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు.
అత్యధికంగా బీసీ విద్యార్థుల బకాయిలు చాల రోజులుగా పెడింగ్‌లో ఉన్నాయి. మైనారిటీ, ఎస్‌టీ సంక్షేమ శాఖలో కొద్ది బకాయిలున్నాయి. ప్రభుత్వం ఫీజులు ఇవ్వడం ఆలస్యం చేయడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూ లు చేశాయి. ప్రభుత్వం పరీక్షలకు ముందు స్పందించి ఉంటే విద్యార్థులకు ఫీజుల స మస్య ఉండేది కాదు. ఇపుడు ఫీజులను కళాశాలల యాజమాన్యాలు తిరిగి విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుంది.
నిధుల విడుదల ఇలా
బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ కింద రూ.17.91 కోట్లు, ఉపకారవేతనాలకు రూ. 8.01కోట్లు నిధులు విడుదలయ్యూరుు, ఈ బీసీ విద్యార్థులకు రీయింబర్స్‌మెంట్ కింద రూ.2.39 కోట్లు వచ్చారుు. ట్రెజరీలో బిల్ పాస్ కాగానే, నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమవుతాయి. ఈ పక్రియ మొత్తం జరిగేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు పే ర్కొం టున్నారు. ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో బకాయిలను విడుదల చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇంకా ఈ రెండు శాఖలకు అధికారికంగా ఉత్తర్వులను జారీచేయలేదు. రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని అం టున్నారు. ఎస్‌టీ విద్యార్థుల కు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ కలిపి మొత్తం రూ.1.20 కోట్ల అవసరం ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.4 కోట్ల వరకు కావాలి. ఈ రెండు శాఖలకు కూడా నిధులు విడుదలైతే 2013-14 సంవత్సరానికి సంబంధించిన బకాయిలకు తెరపడుతుంది.
‘కొత్త’ దరఖాస్తుల తేదీనే ఆలస్యం
దాదాపు జిల్లాలో గత సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించినట్లే. ఇక 2014-15 సంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థుల నుంచి దర ఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. నిజానికి దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తేదీని ప్రకటించి స్వీకరించాలి. కాని ఫాస్ట్ పథకం పేరిట ఆలస్యం చేయడం తో తేదీని సకాలంలో ప్రకటించలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చి నెలతో ముగియనుంది. ఈ నెలాఖరులోగా తేదీని ప్రకటిస్తేనే దరఖాస్తులు లెక్కలోకి వస్తాయి. ఆలస్యం జరిగితే ఆ ప్రభావం సంక్షేమ శాఖలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. వెంటనే తేదీని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.