Minority Department
-
హత్యకు గురైన మొదటి పిటిషనర్.. ప్రాణభయం ఉందన్న రెండో పిటిషనర్
సాక్షి, అమరావతి: కోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన ఇద్దరిలో ఓ పిటిషనర్ హత్యకు గురవడంతో రెండో పిటిషనర్‌గా ఉన్న 70 ఏళ్ల షేక్ ఫరీద్‌కు తగిన భద్రత కల్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు బుధవారం ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు ఈ భద్రతను కొనసాగించాలని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని తక్షణమే జిల్లా ఎస్పీకి వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశించారు. పల్నాడు జిల్లా, నర్సరావుపేట శ్రీరాంపురంలోని జామా మసీదు నిర్వహణను అధీనంలోకి తీసుకునేందుకు మైనారిటీ శాఖ ప్రయత్నిస్తోందని, మసీదు ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరమవకుండా చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని కోరుతూ షేక్ ఇబ్రహీం, షేక్ ఫరీద్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది టి.అనూప్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషన్‌ను ఉపసంహరించుకోకపోతే హతమారుస్తామంటూ కొందరు వ్యక్తులు పిటిషనర్లను బెదిరించారని చెప్పారు. మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు నర్సరావుపేట రామిరెడ్డి పేట వద్ద మొదటి పిటిషనర్ షేక్ ఇబ్రహీంను దారుణంగా హత్య చేశారని తెలిపారు. రెండో పిటిషనర్ షేక్ ఫరీద్‌కు సైతం ప్రాణహాని ఉన్నందున, ఆయనకు తగిన భద్రత కల్పించేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకుని, షేక్ ఫరీద్‌కు తగిన భద్రత కల్పించాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశించారు. తదుపరి విచారణను 28కి వాయిదా వేశారు. -
క్రమశిక్షణ తప్పితే కఠిన చర్యలు
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల టెలీకాన్ఫరెన్స్‌లో చంద్రబాబు హెచ్చరిక సాక్షి, అమరావతి: మంత్రివర్గ విస్తరణపై పలువురు నాయకులు శ్రుతి మించి ప్రవర్తించారని, క్రమశిక్షణ తప్పిన వారిపై చర్యలు తప్పవని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. వారి తీరు తనకు బాధ కలిగించిందన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణుల్లో భగ్గుమన్న ఆగ్రహ జ్వాల గురించి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో ప్రస్తావించారు. నాయకులు ఎవరికైనా అభ్యంతరాలుంటే తనతో నేరుగా చెప్పాలి కానీ ఇలా వ్యవహరించడం సరికాదన్నారు. మనందరి లక్ష్యం 2019 ఎన్నికల్లో గెలవడమేనన్నారు. అయినా అన్ని ప్రాంతాలు, వర్గాలకు ప్రాధాన్యం కల్పించామన్నారు. కొందరికి అర్హత ఉన్నా 26 మందికి మించి మంత్రి పదవులు ఇవ్వకూడదన్న నిబంధన అడ్డుగా మారిందన్నారు. ఇవన్నీ తెలిసి కూడా క్రమశిక్షణ తప్పేలా వ్యవహరించడం ఎంత వరకు సబబని ప్రశ్నించారు. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలు ముఖ్యం అనుకుంటే సహించేది లేదన్నారు. పార్టీ బాగు కోసం ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికైనా వెనుకాడనని చెప్పారు. ప్రజలు బాగుండాలంటే పార్టీ కూడా బాగుండాలన్న విషయాన్ని నేతలు అర్థం చేసుకోవాలన్నారు. మైనారిటీ శాఖను స్వయంగా పర్యవేక్షించాలని ఎంఏ షరీఫ్ సీఎంను కోరారు. దీనిపై ముఖ్యమంత్రి మాట్లాడుతూ మంత్రివర్గంలో మైనారిటీలకు అవకాశం కల్పించలేకపోయామని చెప్పారు. కానీ కేబినెట్ హోదా స్థాయి కలిగిన కార్పొరేషన్ పదవిని వారికి వారం.. పది రోజుల్లోనే ఇస్తానని చెప్పారు. కాగా, నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు కిమిడి కళావెంకట్రావు, కాల్వ శ్రీనివాసులు సోమవారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపారు. తాను 6వ తేదీన బాధ్యతలు స్వీకరిస్తానని కాల్వ పేర్కొన్నారు. -
మైనారిటీలపై ప్రభుత్వం చిన్నచూపు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు చాంద్ బాషా, ముస్తాఫా, అంజాద్ ధ్వజం సాక్షి,హైదరాబాద్: చంద్రబాబు ప్రభుత్వం ముస్లిం మైనారిటీల పట్ల చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్ బాషా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో పార్టీ ఎమ్మెల్యేలు అంజాద్ బాషా, మహ్మద్ ముస్తాఫా షేక్, కొరముట్ల శ్రీనివాసులు, ఎస్వీ మోహన్‌రెడ్డి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. బడ్జెట్ కేటాయింపుల్లో ముస్లిం మైనారిటీలకు ముష్టి వేసినట్లు రూ.250 కోట్లు కేటాయించిన ప్రభుత్వానికి మైనారిటీ సమస్యలపై చర్చించే దమ్ము కూడా లేదన్నారు. కనీసం చట్టసభలో మైనారిటీ సభ్యులకు మాట్లాడే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. ‘‘రెండేళ్ల కిందట బడ్జెట్లో రూ.246 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదు. 2015-16 బడ్జెట్లో రూ.376 కోట్లు మైనారిటీల సంక్షేమానికి కేటాయించి, బడ్జెట్ నివేదికలో మాత్రం రూ. 216 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. వాస్తవానికి రూ.165 కోట్లు మాత్రమే వ్యయం చేశారు’’ అని పేర్కొన్నారు. మైనారిటీల హాస్టళ్లకు రూ. 3.35 కోట్లు కేటాయించి రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. చాలా మంచి మైనార్టీ బడ్జెట్: మంత్రి పల్లె దక్షిణ భారతదేశంలోనే చాలా మంచి మైనార్టీ బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందని మైనారిటీ శాఖ మంత్రి పల్లె రఘునాధరెడ్డి అన్నారు. లోటు బడ్జెట్ రాష్ట్రమైనప్పటికీ మైనారిటీల మీద అభిమానంతో ఎక్కువ బడ్జెట్ కేటాయించామన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి పల్లె మాట్లాడారు. -
బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రణాళిక సంఘం సమీక్ష
సాక్షి, హైదరాబాద్: శాఖలవారీ పథకాలు, ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆయా శాఖలు 2016-17 బడ్జెట్ తయారీలో ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో ప్రణాళిక, ఆర్థిక, వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య, అటవీ, సహకార, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలసి బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు ఎ.కె.గోయల్, జి. ఆర్.రెడ్డి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, పశు సంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, అటవీశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్, విద్యాశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు, ఈ నెల 11న పబ్లిక్ రిలేషన్స్, రూరల్ డెవలప్మెంట్, రెవెన్యూ, ఆహారం, సివిల్ సప్లయిస్, ఇరిగేషన్, హోమ్, 12న మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, కామర్స్ డిపార్ట్మెంట్, ఎనర్జీ అండ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. -
పెళ్లి సింగిల్... మనీ డబుల్
సాక్షి, సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం అమలులో జరిగిన తప్పిదాన్ని మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు సరిదిద్దుతున్నారు. రెండు విభాగాల సమన్వయలోపం కారణంగా ఒక్కో లబ్ధిదారునికి రెండుమార్లు డబ్బులు జమకావడం తెలిసిందే. ఈ తప్పిదంపై ఇటీవల ‘డబుల్ ముబారక్’ పేరిట సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనిపై మైనార్టీ శాఖ అధికారులు స్పందించారు. హైదరాబాద్ నగరంలోని 142 మంది వధువుల బ్యాంక్ ఖాతాలో రెండుమార్లు డబ్బులు జమ అయిన ఘటనపై విచారించారు. వీరి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి నిధుల చెల్లింపులు నిలిపివేశారు. బ్యాంకర్లకు లేఖ రాసి లబ్ధిదారుల ఖాతాల్లో ఉన్న సుమారు రూ.54 లక్షలను రికవరీ చేసినట్లు తెలుస్తోంది. ఇక లబ్ధిదారులు ఇప్పటికే డ్రా చేసుకున్న రూ.17.42 లక్షలు రికవరీ చేసే విషయంపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. వాటిని తిరిగి ఇచ్చేందుకు కొందరు లబ్ధిదారులు మొండికేస్తుండగా, మరికొందరు తిరిగి చెల్లింపుల కోసం కొంత గడువు కోరుతున్నట్లు తెలుస్తోంది. తప్పిదం ఎవరిది? రెండుమార్లు డబ్బులు జమ చేసిన తప్పిదంపై చర్యలు ప్రశ్నార్థకంగా మారాయి. 2014-15 ఆర్థిక సంవత్సరం కింద దరఖాస్తు చేసుకున్న నగరానికి చెందిన 142 మంది లబ్ధిదారుల వివాహాలకు రూ.51 వేల చొప్పున ఆర్ధిక చేయూతకు మంజూరు ఇచ్చిన మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి రెండు సార్లు సబ్మిట్ చేశారు. ట్రెజరీ అధికారులు కూడా ఆఫ్‌లైన్‌లో చేసిన చెల్లింపులను గుర్తించకుండా నగదు విడుదల చేయడం తో లబ్ధిదారుల ఖాతాలో రెండుసార్లు నగదు జమ అయింది. అయితే ఇరు శాఖల అధికారులు దీన్ని సాంకేతిక తప్పిదంగా పేర్కొంటున్నారు. సీజీజీ రూపొం దిం చిన సాఫ్ట్వేర్ అనుసంధానంలో కొంత వ్యత్యాసమే సాంకేతిక తప్పిదానికి కారణమైందని వ్యాఖ్యానిస్తున్నారు. పూర్తి స్థాయిలో రికవరీ చేస్తాం షాదీ ముబారక్ పథకం కింద లబ్ధిదారులకు రెండుసార్లు జమ అయిన మొత్తాన్ని తిరిగి వసూలు చేస్తున్నాం. ఇప్పటికే బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి దాదాపు 72 శాతం రికవరీ చేశామని... లబ్ధిదారులు సహకరిస్తున్నారని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. -
డబుల్ ‘ముబారక్’!
షాదీ ముబారక్ పథకం అమలులో తప్పిదం లబ్దిదారుల ఖాతాలో రెండుసార్లు డబ్బులు జమ పొరపాటుపై మైనార్టీ, {sెజరీ శాఖల్లో ఆరా... సిటీబ్యూరో: షాదీ ముబారక్ పథకం కింద ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న 142 మంది లబ్దిదారులకు ‘డబుల్’ ముబారక్ లభించింది. అధికారుల తప్పిదం కారణంగా ఒక్కొక్కరిక ఖాతాల్లో రెండు పర్యాయాలు రూ.51 వేల చొప్పున మొత్తం లక్షా 2 వేల రూపాయలు జమ అయ్యాయి. ఈ తప్పిదాన్ని ఆలస్యంగా గుర్తించిన అధికారులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. వివరాల్లోకి వెళ్తే...2014-15 ఆర్థిక సంవత్సరానికి గాను షాదీ ముబారక్ పథకం కింద నగరానికి చెందిన 142 మంది ముస్లిం యువతుల వివాహాలకు రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించేందుకు మైనార్టీ శాఖ మంజూరు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు మైనార్టీ శాఖ అధికారులు ఈ- పాస్ ద్వారా రూ.72.42 లక్షల నిధుల విడుదల కోసం మూడు బిల్లులతో కూడిన లబ్ధిదారుల జాబితాను ట్రెజరీకి పంపించారు. సంబంధిత ట్రెజరీ అధికారులు వారి సాఫ్ట్వేర్ ఆధారంగా లబ్దిదారులకు నిధులు విడుదల చేసి బ్యాంకులో జమ చేశారు. కాగా, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఈ-పాస్‌లో లబ్దిదారుల జాబితా అలాగే కనిపించడంతో తిరిగి ట్రెజరీకి రీ సబ్మిట్ చేశారు. అప్పటికే నిధులు విడుదల చేసిన విషయాన్ని మరిచి ట్రెజరీ అధికారులు మరోమారు చెల్లింపులను ఆమోదించారు. వాస్తవంగా సీజీజీ రూపొందించిన సాఫ్ట్‌వేర్‌కు, ట్రెజరీ పే అండ్ అకౌంట్ సాఫ్ట్వేర్ ఇంటిగ్రేట్ కావడంలో కొంత వ్యత్యాసం ఉండటంతో పొరపాటు జరిగిపోయింది. మైనార్టీ సంక్షేమ శాఖ ఈ-పాస్ ద్వారా బిల్లులు సమర్పిస్తే వాటిని ఆన్లైన్లో కాకుండా రిజక్ట్ ఆప్షన్లో పెట్టి ఆఫ్‌లైన్‌లో చెల్లింపులు చేసి బ్యాంక్ ఖాతాకు అనుసంధానించారు. అయితే ఆఫ్‌లైన్ చెల్లింపులు గుర్తించని మైనార్టీ సంక్షేమ శాఖ మరోమారు మంజూరుకు బిల్లులు సబ్మిట్ చేయడం గందరగోళానికి దారితీసింది. రికవరీ కోసం తిప్పలు... రెండుసార్లు నిధుల మంజూరును గుర్తించిన సంబంధిత అధికారులు తక్షణమే లబ్దిదారుల ఖాతాల సీజ్‌కు బ్యాంకర్లను ఆదేశించారు. అప్పటికే కొన్ని ఖాతాల నుంచి డబ్బుల చెల్లింపులు జరిగిపోయాయి. కాగా, మూడు బిల్లులకు చెందిన లబ్దిదారుల ఖాతాలు పూర్తి స్థాయిలో సీజ్ కావడంతో అసలు ఆర్థిక చేయూత కూడా డ్రా చేయడానికి వీలులేకుండా పోయింది. దీంతో లబ్దిదారులు గగ్గోలు పెడుతున్నారు. మరోవైపు రెండుసార్లు డబ్బులు డ్రా చేసుకున్న వారిని ఫోన్ల ద్వారా సంప్రదించి తక్షణమే చెల్లించాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికలపై మజ్లిస్ పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే సంబంధిత అధికారిని మందలించినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ డెరైక్టర్ ఎంజే అక్బర్‌ను సంప్రదించగా...రెండుమార్లు ఆర్థిక సహాయం మంజూరైన మాట వాస్తవమేనని, అయితే దీనికి తమ శాఖకు సంబంధం లేదని పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం ట్రెజరీ పే అండ్ అకౌంట్ అధికారులను సంప్రదించాలని సూచించారు. -
బకాయి ఫీజులు వచ్చాయోచ్!
2013-14 సంవత్సరానికి లైన్ క్లియర్ - బీసీ, ఈబీసీ విద్యార్థులకు శుభవార్త - రూ. 28.31 కోట్లు విడుదల చేసిన సర్కారు - ఎస్టీ, మైనారిటీ శాఖలకు కూడా త్వరలోనే - ఉపకార వేతనాలకూ కలిగిన మోక్షం ఇందూరు: 2013-14 సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం ఎట్టకేలకు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖకు రూ.28.31 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వు లు జారీ చేసింది. దీంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఎస్సీ విద్యార్థులకు రెండు నెలల క్రితమే నిధులు విడుదల చేసింది. ఎస్టీ, మై నారిటీ విద్యార్థుల ఫీజులను కూడా విడుదల చేసినట్లు ప్రకటించినప్పటికీ ఉత్తర్వులు ఇంకా అందలేదు. మరో రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని ఆయా శాఖల అధికారులు పేర్కొంటున్నారు. అత్యధికంగా బీసీ విద్యార్థుల బకాయిలు చాల రోజులుగా పెడింగ్‌లో ఉన్నాయి. మైనారిటీ, ఎస్టీ సంక్షేమ శాఖలో కొద్ది బకాయిలున్నాయి. ప్రభుత్వం ఫీజులు ఇవ్వడం ఆలస్యం చేయడంతో కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూ లు చేశాయి. ప్రభుత్వం పరీక్షలకు ముందు స్పందించి ఉంటే విద్యార్థులకు ఫీజుల స మస్య ఉండేది కాదు. ఇపుడు ఫీజులను కళాశాలల యాజమాన్యాలు తిరిగి విద్యార్థులకు చెల్లించాల్సి ఉంటుంది. నిధుల విడుదల ఇలా బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద రూ.17.91 కోట్లు, ఉపకారవేతనాలకు రూ. 8.01కోట్లు నిధులు విడుదలయ్యూరుు, ఈ బీసీ విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కింద రూ.2.39 కోట్లు వచ్చారుు. ట్రెజరీలో బిల్ పాస్ కాగానే, నేరుగా విద్యార్థుల బ్యాంక్ ఖాతాలో నిధులు జమవుతాయి. ఈ పక్రియ మొత్తం జరిగేందుకు 10 నుంచి 15 రోజుల సమయం పడుతుందని అధికారులు పే ర్కొం టున్నారు. ఎస్టీ, మైనారిటీ విద్యార్థులకు కూడా పూర్తి స్థాయిలో బకాయిలను విడుదల చేసినట్లు ప్రకటించిన ప్రభుత్వం ఇంకా ఈ రెండు శాఖలకు అధికారికంగా ఉత్తర్వులను జారీచేయలేదు. రెండు మూడు రోజులలో వచ్చే అవకాశాలున్నాయని అం టున్నారు. ఎస్టీ విద్యార్థుల కు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ కలిపి మొత్తం రూ.1.20 కోట్ల అవసరం ఉంది. మైనారిటీ విద్యార్థులకు రూ.4 కోట్ల వరకు కావాలి. ఈ రెండు శాఖలకు కూడా నిధులు విడుదలైతే 2013-14 సంవత్సరానికి సంబంధించిన బకాయిలకు తెరపడుతుంది. ‘కొత్త’ దరఖాస్తుల తేదీనే ఆలస్యం దాదాపు జిల్లాలో గత సంవత్సరానికి సంబంధించిన ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించినట్లే. ఇక 2014-15 సంవత్సరానికి ఫ్రెష్, రెన్యూవల్ విద్యార్థుల నుంచి దర ఖాస్తులు స్వీకరించాల్సి ఉంది. నిజానికి దరఖాస్తులను ప్రభుత్వం ఆగస్టు, సెప్టెంబర్ నెలలో తేదీని ప్రకటించి స్వీకరించాలి. కాని ఫాస్ట్ పథకం పేరిట ఆలస్యం చేయడం తో తేదీని సకాలంలో ప్రకటించలేదు. ప్రస్తుత విద్యా సంవత్సరం మార్చి నెలతో ముగియనుంది. ఈ నెలాఖరులోగా తేదీని ప్రకటిస్తేనే దరఖాస్తులు లెక్కలోకి వస్తాయి. ఆలస్యం జరిగితే ఆ ప్రభావం సంక్షేమ శాఖలపై పడుతుందని అధికారులు చెబుతున్నారు. వెంటనే తేదీని ప్రకటించి దరఖాస్తులు స్వీకరించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.