సాక్షి, హైదరాబాద్: శాఖలవారీ పథకాలు, ప్రస్తుత అవసరాలకనుగుణంగా ఆయా శాఖలు 2016-17 బడ్జెట్ తయారీలో ప్రతిపాదనలు రూపొందించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు ఎస్. నిరంజన్‌రెడ్డి కోరారు. మంగళవారం సచివాలయంలో ప్రణాళిక, ఆర్థిక, వ్యవసాయం, మార్కెటింగ్, ఉద్యాన, పశు సంవర్థక, మత్స్య, అటవీ, సహకార, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల అధికారులతో కలసి బడ్జెట్ ప్రతిపాదనలపై సమీక్ష నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు ఎ.కె.గోయల్, జి. ఆర్.రెడ్డి, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బి.పి.ఆచార్య, పశు సంవర్థక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌చందా, అటవీశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్, వ్యవసాయ కార్యదర్శి సి.పార్థసారథి, గిరిజన సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి సోమేష్‌కుమార్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, మైనారిటీ శాఖ కార్యదర్శి ఉమర్‌జలీల్ తదితరులు పాల్గొన్నారు. బుధవారం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్, విద్యాశాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు, ఈ నెల 11న పబ్లిక్ రిలేషన్స్, రూరల్ డెవలప్‌మెంట్, రెవెన్యూ, ఆహారం, సివిల్ సప్లయిస్, ఇరిగేషన్, హోమ్, 12న మహిళా, శిశు సంక్షేమ శాఖ, ఆర్థిక, ప్రణాళిక, పరిశ్రమలు, కామర్స్ డిపార్ట్‌మెంట్, ఎనర్జీ అండ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు.
బడ్జెట్ ప్రతిపాదనలపై ప్రణాళిక సంఘం సమీక్ష
Published Wed, Feb 10 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 5:17 PM
Advertisement
Advertisement