బీసీ కార్పొరేషన్లకు చైర్మన్లను ప్రకటించిన అనంతరం వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆనందంతో డోలు వాయిస్తున్న బీసీ సంక్షేమ శాఖ మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్ తదితరులు
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు సమున్నత గౌరవం కల్పిస్తూ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వాటికి పాలక మండళ్లను నియమించింది. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమం దిశగా వడివడిగా చర్యలు చేపట్టింది. ప్రతి బీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌తోపాటు 12 మంది డైరెక్టర్లను నియమించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లను ఆయన ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, మహిళలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని వివరించారు. పాలక మండళ్లలో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లు చెప్పారు.
సంఘాల కంటే మిన్నగా: డిప్యూటీ సీఎం కృష్ణదాస్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ కులాలకు ప్రభుత్వంలో ఎంతో గౌరవం కల్పించారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకునే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా వెనుకబడిన వర్గాలకు అన్ని విధాల సాయం అందించి ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్పొరేషన్లు కుల సంఘాల కంటే మిన్నగా ఆయా కులాల కోసం పనిచేస్తాయన్నారు. పాలక మండళ్లు ఆయా కులాల ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని చెప్పారు.
మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో ఎంపీ మోపిదేవి, మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్‌కుమార్ యాదవ్
బడ్జెట్ కంటే మిన్నగా: మంత్రి బొత్స
బీసీలంటే వెన్నెముకలాంటి వారని ముఖ్యమంత్రి జగన్ చేతల్లో నిరూపించారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో నాయకత్వ పటిమను గుర్తించి గౌరవించిన సీఎంకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. బీసీలకు బడ్జెట్‌లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
ఆర్థిక, సామాజిక మార్పులే లక్ష్యం: ఎంపీ మోపిదేవి
గత ప్రభుత్వాలు బీసీలకు తాళ్లు, గేదెలు, ఇస్త్రీపెట్టెలు లాంటివి ఇచ్చి అదే సంక్షేమం అని మభ్యపుచ్చాయని, ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు విమర్శించారు. ఇప్పుడు వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. బీసీల బాధలను ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో స్వయంగా చూశారని, ఆయన హృదయంలో నుంచి ఈ కార్పొరేషన్ల వ్యవస్థ పుట్టుకొచ్చిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా బీసీల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, మాలగుండ్ల శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.
56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు
1. రజక కార్పొరేషన్: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా)
2. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం)
3. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం)
4. కుంచిటి వక్కలిగ: డాక్టర్ బి.నళిని (అనంతపురం)
5. వన్యకుల క్షత్రియ: కె.వనిత (చిత్తూరు)
6. పాల ఎకరి: తరిగొండ మురళీధర్ (చిత్తూరు)
7. ముదళియార్: తిరుపతూర్ గోవిందరాజన్ సురేష్ (చిత్తూరు)
8. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు)
9. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి)
10. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి)
11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి)
12. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి)
13. షేక్/షెయిక్: షేక్ యాసిన్ (గుంటూరు)
14. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు)
15. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు)
16. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు)
17. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్ (కడప)
18. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప)
19. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప)
20. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప)
21. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప)
22. విశ్వబ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్ (కృష్ణా)
23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా)
24. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్ (కృష్ణా)
25. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా)
26. వాల్మీకి/బోయ: డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు)
27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు)
28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు)
29. వీరశైవ లింగాయత్: వై.రుద్రగౌడ్ (కర్నూలు)
30. ముదిరాజ్/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్ (నెల్లూరు)
31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు)
32. బొందిలి: ఎస్.కిషోర్‌సింగ్ (నెల్లూరు)
33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు)
34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్ (ప్రకాశం)
35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం)
36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం)
37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం)
38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం)
39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం)
40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం)
41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం)
42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం)
43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం)
44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ)
45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ)
46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ)
47. యాత: పిల్లి సుజాత (విశాఖ)
48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ)
49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం)
50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం)
51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం)
52. దాసరి: డాక్టర్ రంగుముద్రి రమాదేవి (విజయనగరం)
53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి)
54. శెట్టిబలిజ: డాక్టర్ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి)
55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి)
56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి)
Comments
Please login to add a commentAdd a comment