Venugopalakrishna
-
ఈసీని కలిసిన వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, విజయవాడ: టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. టీడీపీ నేతలు దొంగ ఓట్లు చేర్పించడంలో సిద్ధహస్తులు. ప్రజలను ఏ విధంగా మోసం చేయాలనేది టీడీపీ ఆలోచన’’ అంటూ మండిపడ్డారు వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తుంది. టీడీపీ నేతలు అక్రమ మార్గంలో గెలిచేందుకే ప్రయత్నిస్తున్నారు. చాలమందికి రెండు రాష్ట్రాల్లో ఓట్లు ఉన్నాయి. వాటిని తొలగించాలని ఈసీని కోరాం. ఎవరికైనా సరే ఒకరికి ఒక ఓటు మాత్రమే ఉండాలి’’ అని వైఎస్సార్సీ నేతలు పేర్కొన్నారు. హైదరాబాద్, ఏపీలో 4 లక్షల 30 వేల 264 ఓట్లు ఉన్నాయి. ఆధారాలతో సహా ఎన్నికల కమిషన్‌కు అందించాం. డబుల్ ఎంట్రీలు తొలగించాలని సీఈవోను కోరాం. దేశంలో ఒకేచోట ఓటు ఉండాలనేది వైసీపీ విధానం. ఇలాంటి ఓట్లపై విచారణ జరిపించి తొలగించాలని కోరాం. -మంత్రి జోగి రమేష్ ఎన్నికలు పారదర్శకంగా జరగాలనేది సీఎం జగన్ ఆకాంక్ష. వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట. మోసాలు చేయడమే చంద్రబాబు ప్రధాన అజెండా. ఒక సామాజికవర్గం ఓట్లు ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఉన్నాయి. టీడీపీ ప్రలోభాలతో ప్రజలను లోబరుచుకుంటుంది. డూప్లికేట్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు తాను చేసిన తప్పులు ఇతరులపైకి నెడతారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియాలో అబద్ధాలు చెప్పాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. -మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఇదీ చదవండి: బాబు కోసం ఇంత బరితెగింపా!? -
9 నుంచి కులగణన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సారథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా చరిత్రాత్మకమైన కులగణన ప్రక్రియను డిసెంబర్ 9వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద శుక్రవారం తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మంత్రి వేణు మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జనగణన తప్ప కులగణన జరగలేదని చెప్పారు. సామాజిక సాధికారితకు చిరునామాగా నిలిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గొప్ప సంకల్పంతో కులగణన చేపట్టాలని నిర్ణయించారని తెలిపారు. కులాలతోపాటు అన్ని వర్గాల పేదల తలరాతలు మార్చడానికే సమగ్ర కులగణనను తమ ప్రభుత్వం చేపట్టిందని పునరుద్ఘాటించారు. ప్రజల జీవన స్థితిగతులను మార్చేందుకు కులగణన చాలా అవసరమని చెప్పారు. సమగ్ర కులగణనతో రాష్ట్రంలో పేదవాడి జీవితానికి భద్రత లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణన దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందని మంత్రి ధీమా వ్యక్తంచేశారు. బీసీలను అణగదొక్కిన చంద్రబాబు రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపడుతున్నట్లు ప్రకటించడంతో చంద్రబాబు సహా ప్రతిపక్షనేతలకు వెన్నులో వణుకుపుడుతోందని మంత్రి వేణు అన్నారు. చంద్రబాబు హయాంలో బీసీలను కేవలం ఓట్లు వేసేందుకు పనికివచ్చే యంత్రాలుగా చూశారని మండిపడ్డారు. విద్య అవకాశాలను అందుకోలేని, ఆర్థికంగా బలహీనంగా ఉన్న బీసీలతోపాటు అనేక వర్గాలను చంద్రబాబు ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అణగదొక్కారని ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అధికారంలో ఉన్నాననే అహంకారంతో ‘మత్స్యకారులను తోలుతీస్తా. నాయీబ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తా...’ అని అన్న మాటలు తనను ఎంతో బాధించాయని మంత్రి వేణు చెప్పారు. చంద్రబాబు వివక్షతో చూసిన కులాలను సీఎం వైఎస్ జగన్ అక్కున చేర్చుకున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల్లో ఆత్మన్యూనతాభావాన్ని తొలగించి వారు సగర్వంగా తలెత్తుకుని జీవించేలా సీఎం జగన్ అండగా నిలిచారని ప్రశంసించారు. కులగణనలో ఎవరి సూచనలు, సలహాలు తీసుకోలేదని టీడీపీ చేస్తున్న విమర్శల్లో నిజం లేదని మంత్రి కొట్టిపారేశారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా, ప్రాంతీయ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి అన్ని కులాల నాయకుల అభిప్రాయాలు సేకరిస్తున్నామని, వాటిని క్రోడీకరించి కులగణను సమర్థవంతంగా నిర్వహిస్తామని వివరించారు. అవసరమైతే మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నామని చెప్పారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకుంటే స్వాగతించాల్సిందిపోయి విమర్శించడం సరికాదని ఆయన హితవుపలికారు. -
కులగణనతో భావితరాలకు మరింత మేలు
సాక్షి, అమరావతి/బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహిస్తున్న సమగ్ర కుల గణన చరిత్రాత్మకమని, గొప్ప మనస్సుతో ఈ నిర్ణయం తీసుకున్న సీఎం వైఎస్ జగన్.. దేశానికే ఆదర్శంగా నిలిచారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ కొనియాడారు. ఏపీలో కుల గణన–2023పై ఆయా వర్గాల అభిప్రాయాల సేకరణకు ప్రభుత్వం రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 17న రాజమండ్రి, కర్నూలులో ప్రాంతీయ సమావేశాలు జరిగాయి. సోమవారం విశాఖ, విజయవాడలో నిర్వహించారు. ఈ నెల 24న తిరుపతిలో నిర్వహిస్తారు. విజయవాడ సమావేశంలో ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో కుల గణన చేపట్టాలని ఏడాది కిందట సీఎం జగన్ నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేసి చూపిస్తున్నారని, ప్రతిపక్షాలు దీనిని రాజకీయ కోణంలో చూడటం సరికాదన్నారు. ఇది సామాజిక కోణంలో తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో 723 కులాల సమగ్ర లెక్కలు తేల్చేందుకు కుల గణన ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. కుల గణనతో అందరి తలరాతలు మారతాయని, భావితరాలకు మరింత మేలు జరుగుతుందని మంత్రి వేణు వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. బడుగుల కోసం పుట్టిన కారణ జన్ముడు సీఎం జగన్ కర్నూలు ఎంపీ సంజీవ్‌కుమార్ మాట్లాడుతూ కుల గణన ప్రక్రియ పూర్తయితే జనాభా శాతం ప్రకారం అన్ని కులాలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. ఏపీ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ మారుమూడి విక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ అంబేడ్కర్, పూలే ఆలోచనా విధానంతో సీఎం జగన్ అట్టడుగు వర్గాలకు మేలు చేస్తున్నారని, రిజర్వేషన్లతో నిమిత్తం లేకుండా నామినేటెడ్ నుంచి కేబినేట్ పదవుల వరకు అట్టడుగు వర్గాలకు అగ్రపీఠం వేస్తున్నారని కొనియాడారు. పీడీఎఫ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్టు చెప్పారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ కుల గణన పూర్తయితే అనేక సామాజిక మార్పులకు శ్రీకారం చుట్టినట్లవుతుందని చెప్పారు. ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి మాట్లాడుతూ 92 ఏళ్ల తర్వాత జరుగుతున్న ఈ కుల గణన సామాజిక మార్పులకు నాంది పలుకుతూ అరుదైన రికార్డు సృష్టిస్తుందన్నారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపా శేషగిరి మాట్లాడుతూ కుల గణన ప్రక్రియలో కుల సంçఘాల పెద్దలను, ప్రతినిధులను భాగస్వామ్యం చేసి నూరు శాతం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేశన శంకరరావు మాట్లాడుతూ ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు ఆయా కుల నాయకులను కూడా అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర యాదవ మహాసభ అధ్యక్షుడు లాకా వెంగళరావు మాట్లాడుతూ కుల గణన జాబితాలను స్థానిక సచివాలయాల వద్ద ప్రదర్శనకు పెట్టి అభ్యంతరాలను కూడా స్వీకరించాలని చెప్పారు. సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర కుల గణన ప్రాంతీయ సదస్సులో జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ కులగణన సర్వే కారణంగా పాత కుల ధ్రువీకరణ పత్రాల నిలుపుదల గానీ, సంక్షేమ పథకాల నిలుపుదలగానీ జరగదన్నారు. యాప్ ద్వారా నిర్వహించే ఈ సర్వేలో సమాచార గోప్యతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు. ఈబీసీ కార్పొరేషన్ అదనపు ఎండీ మల్లికార్జునరావు మాట్లాడుతూ సర్వేపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయడం కోసం ఈ సదస్సులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. 1931 తర్వాత కుల గణన చేపట్టాలని సీఎం జగన్ తీసుకున్న నిర్ణయం సాహసోపేతమని పలు కార్పొరేషన్ల చైర్పర్సన్లు కొనియాడారు. ఉప కులాలకు కూడా వేర్వేరుగా గణన చేపట్టాలని పలు కుల సంఘాల ప్రతినిధులు సూచించారు. కుల గణన సమయంలో ధ్రువీకరణ పత్రాలను పరిశీలించాలని, అలాగే స్కూల్స్ నుంచి పొందిన పత్రాలను సమర్పించాలని.. లేకుంటే కొంత మంది స్వార్థంతో తప్పుడు సమాచారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. ఎస్టీ కులంలో చాలా మంది తప్పుడు ధ్రువీకరణ పత్రాలను పొందుతున్నారని.. ముఖ్యంగా ఒడిశా నుంచి వచ్చిన వారు ఎస్టీలుగా చెలామణి అవుతున్నారని పలువురు ఎస్టీ కులాల నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్లు జాన్ వెస్లీ, సూరిబాబు, పిల్లా సుజాత, సుజాత, రమాదేవి, అమ్మాజీ, మధుసూదనరావు, అనూష, అప్పలకొండ పాల్గొన్నారు. -
బిహార్‌లో కులగణనకు రాజకీయ కోణం ఉంది: మంత్రి వేణు గోపాలకృష్ణ
-
నైతికత వదిలేసిన చంద్రబాబు
కాకినాడసిటీ: రాష్ట్రంలో తమకు ప్రజాదరణ తగ్గిపోయిందని గ్రహించిన చంద్రబాబు తన కేడర్‌ను, నాయకులను నమ్మలేక జనసేనను పక్కన పెట్టుకొని రాజకీయ నైతికతను మొత్తం వదిలేశారని రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. కాకినాడలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2014లో చంద్రబాబుకు మద్దతు ఇచ్చిన పవన్ కల్యాణ్ తనను నమ్ముకున్న అనేక వర్గాలను హింసించడానికి తోడ్పడ్డాడని విమర్శించారు. పవన్ కల్యాణ్ ప్రతిసారీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ది అరాచక పాలన అంటున్నారని, పేదలు ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరీ వారి సంక్షేమం కోసం పాటు పడటమే అరాచకమా? వెనుకబడిన వర్గాల జీవితాలను మార్చడం కోసం పని చేయడం అరాచకమా? చెప్పాలని మంత్రి వేణు నిలదీశారు. -
‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే’
అమరావతి: గత కొన్ని రోజులుగా శాసనసభలో టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం, వాకౌట్ చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఏడు రోజులుగా డోలా వీరాంజనేయస్వామి పదేపదే స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారని, ఈరోజు స్పీకర్‌పై దాడికి దిగారన్నారు. ఈ రోజు శాసనసభ చరిత్రలో బ్లాక్ డే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో కూర్చొని దశ, దిశ చేస్తుంటాడని, సభకు రాడని మండిపడ్డారు మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం.. వాకౌట్ చేయడం ఇదే వారి పని. ఏడు రోజులుగా స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారు. ఈరోజు స్పీకర్ పై దాడికి దిగారు వెల్ లోకి వెళ్లడమే నేరం..పైగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. హద్దులు దాటి సభాపతి పై దాడి చేశారు. భర్తను కొట్టినమ్మ బావురుమన్నట్లుంది టీడీపీ తీరు. మాపై వారే దాడి చేసి...నింద మాపై వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చర్చ జరగకూడదనే పథకం ప్రకారం ఈరోజు గొడవ చేశారు’ అని మంత్రి తెలిపారు. -
వరద నీటిలో మంత్రి వేణు పడవ ప్రయాణం.. ముమ్మరంగా సహాయక చర్యలు
సాక్షి, కోనసీమ జిల్లా: గోదావరి ముంపు ప్రాంతాల్లో విస్తృతంగా సహాయక చర్యలను ప్రభుత్వం చేపట్టింది. కోటిపల్లిలో ముంపునకు గురైన ప్రాంతాల్లో స్వయంగా పడవలో వెళ్లి బాధితులకు బియ్యం, కందిపప్పును మంత్రి వేణుగోపాలకృష్ణ అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అత్యవసర మందులు, తాగునీరు, కిరోసిన్ అందుబాటులో ఉంచామన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు పెద్ద ఎత్తున సహాయక చర్యలు అందిస్తున్నామని మంత్రి వేణు పేర్కొన్నారు. చదవండి: బాబు పాపాలు.. పోలవరానికి శాపాలు గౌతమీ గోదావరి వరద తీవ్రతతో రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలో కే గంగవరం మండలంలో పలు లంకలు, కోటిపల్లి ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. లంకలతో పాటు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరింది. ఇళ్ల మధ్యకు వరద నీరు చేరుకోవడంతో పడవలపైన రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆరడుగుల మేర వరద నీరు నిలిచిపోవడంతో పాటు సమీపంలోనే గౌతమి గోదావరి ఉండటంతో మరో రెండు మూడు రోజులు పాటు ఇబ్బందులు తప్పేలా లేవని స్థానికులు చెబుతున్నారు. -
AP New Cabinet: జగన్ మార్క్.. సామాజిక న్యాయం
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: కేబినెట్ పునర్వవస్థీకరణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు అగ్రాసనం వేశారు. కేబినెట్ కూర్పులో పార్టీ అజెండా ప్రకారం ఎస్సీ, బీసీ వర్గాలకు మూడొంతులు ప్రాతినిధ్యం కల్పిస్తూనే సామాజిక సమతూకాన్ని కూడా పాటించారు. తొలి కేబినెట్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ప్రాతినిధ్యం వహించగా జిల్లాల పునర్విభజన తరువాత ఏర్పడుతున్న కేబినెట్లో ప్రాతినిధ్యం నాలుగుకు పెరిగింది. పార్టీపై నిబద్ధత, పనితీరు, సీనియారీటీ, నాయకత్వ పటిమ, సమర్థతలే కొలమానంగా మంత్రుల ఎంపిక జరిగింది. రెండేళ్లలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల టీమ్‌గా సీఎం కేబినెట్లోకి ఏరికోరి మంత్రులను తీసుకున్నారు. జిల్లాల విభజన తరువాత ఏర్పడ్డ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం లభించడంపై జిల్లాల్లో పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగితేలుతున్నాయి. తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్న పినిపే విశ్వరూప్, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, తానేటి వనితలకు మరోసారి చోటు కల్పించారు. కాకినాడ జిల్లా నుంచి ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాకు తొలిసారి కేబినెట్లో అవకాశం లభించింది. ఉమ్మడి జిల్లా నుంచి నలుగురుకి ప్రాతినిధ్యం కలి్పంచగా ఎస్సీల నుంచి ఇద్దరికి, బీసీల నుంచి ఒకరికి అవకాశం కల్పించారు. నాలుగోసారి మంత్రిగా విశ్వరూప్ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అనుంగ శిష్యుడైన విశ్వరూప్ నాలుగోసారి మంత్రి అవుతున్నారు. 2009లో వైఎస్ కేబినెట్లో తొలిసారి మంత్రిగా నియమితులైన విశ్వరూప్ వైఎస్ మరణానంతరం కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్లో కూడా కొనసాగారు. మంత్రిగా పదవీ కాలం ఆరు నెలలుండగానే మహానేతతో ఉన్న అనుబంధంతో పదవిని తృణప్రాయంగా విడిచిపెట్టి జగన్మోహన్రెడ్డి వెంట నడిచారు. ఆవిర్భావం నుంచి పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేసి కోనసీమలో ఎస్సీ సామాజికవర్గంతో పాటు ఇతర సామాజికవర్గాల్లో మంచి పట్టు సాధించి సమర్థత కలిగిన నేతగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే తొలి కేబినెట్లో ఉన్న విశ్వరూప్‌ను రెండోసారి కేబినెట్లోకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తీసుకున్నారు. విశ్వరూప్‌ను కేబినెట్లో కొనసాగించడం ద్వారా కోనసీమ జిల్లాలో బలమైన సామాజికవర్గాల పరంగా మంచి ముద్ర వేస్తారని నేతలు విశ్లేషిస్తున్నారు. విశ్వరూప్ వివాదరహితుడిగా ఉండడం రెండోసారి మంత్రి పదవి దక్కడానికి ఒక కారణమైంది. మరోసారి కేబినెట్లోకి వేణు బీసీ సంక్షేమశాఖా మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణను రెండోసారి కేబినెట్లోకి తీసుకున్నారు. వేణు ఎంపిక ద్వారా బలహీనవర్గాలలో బలమైన శెట్టిబలిజ సామాజికవర్గానికి సీఎం సముచిత ప్రాతినిధ్యం కల్పించారు. దివంగత మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు ముఖ్య అనుచరుడిగా ఆయన ఉండేవారు. కోనసీమలో రాజోలు ప్రాంతానికి చెందిన వేణు సమర్థతను గుర్తించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్, డీసీసీ అధ్యక్షుడిగా చేశారు. అనంతరం ఓదార్పు యాత్రలో జగన్మోహన్రెడ్డి వెంట నడిచిన వేణు నాటి నుంచి పార్టీ పట్ల విధేయతతో పనిచేశారు. శెట్టిబలిజల్లో బలమైన నేతగా ఉన్న వేణును రామచంద్రపురం నుంచి పోటీచేయించి ఎమ్మెల్యేను చేసి తొలి కేబినెట్లో మంత్రిగా కూడా చేశారు. ఇప్పుడు రెండోసారి కేబినెట్లో కూడా ప్రాతిని«ధ్యం కలి్పంచడం ద్వారా ఆ సామాజికవర్గానికి సముచిత స్థానం దక్కింది. వేణు వాగ్ధాటితో పార్టీ వాణిని బలంగా వినిపించడం, బీసీ సంక్షేమశాఖను సమర్థంగా నిర్వహించడం కూడా కలిసి వచ్చింది. శ్రమించిన వనితకు మరో చాన్స్ కొవ్వూరు నియోజకవర్గం ఏర్పాటు తరువాత తొలి మహిళా ఎమ్మెల్యే, మంత్రిగా తానేటి వనితకు రెండోసారి సీఎం జగన్మోహన్రెడ్డి మంత్రివర్గంలో అవకాశం కలి్పంచారు. 2012లో వైఎస్సార్ సీపీలో చేరిన వనిత అప్పటి నుంచి పార్టీ కోసం శ్రమించారు. సాధారణ గృహిణిగా ఉన్న వనిత తండ్రి, మాజీ ఎమ్మెల్యే జొన్నకూటి బాబాజీరావు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని పార్టీ ప్రగతిలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2019లో వైఎస్సార్ సీపీ నుంచి ఎమ్మెల్యే అయిన వనిత తొలి కేబినెట్లో స్త్రీశిశుసంక్షేమశాఖ మంత్రిగా సమర్థవంతమైన సేవలందించారు. జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా మహిళలకు ఆది నుంచి అత్యధిక ప్రాధాన్యం ఇస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొవ్వూరు నుంచి ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా ఉన్న వనితకు మంత్రి పదవి కట్టబెట్టారు. సమర్థత, పార్టీలో సామాజిక సమతూకాలను బేరీజు వేసుకుని వనితకు మరోసారి అవకాశం కల్పించడం ద్వారా ఎస్సీలలో మాదిగ సామాజిక వర్గానికి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రాతినిధ్యం కల్పించడంపై హర్షం వ్యక్తమవుతోంది. నిబద్ధతకు గుర్తింపు మూడు దశాబ్దాలపాటు తునిలో రాజకీయాలను శాసించిన యనమల వంటి రాజకీయ వటవృక్షాన్ని కూకటి వేళ్లతో పెకలించి వేసిన తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజాను ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్లో తొలిసారి తీసుకున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో ఒక సైనికుడిలా పనిచేస్తూ వరుసగా రెండు సార్వత్రిక ఎన్నికల్లో పోరాట పటిమతో పార్టీని విజయ పథం వైపు నడింపించడం తాజా మంత్రి వర్గంలో తీసుకోవడానికి దోహదం చేసింది. వాస్తవానికి తొలి కేబినెట్లోనే చాన్స్ దక్కుతుందని పార్టీ శ్రేణులు ఆశించాయి. చివరకు వివిధ సమీకరణల్లో ప్రభుత్వ విప్ లభించింది. అప్పుడే మలివిడత కేబినెట్లో బెర్త్ ఖాయమైంది. అందుకు అనుగుణంగానే కాకినాడ జిల్లా నుంచి రాజాను మంత్రి పదవి వరించింది. తుని నియోజకవర్గం నుంచి వరుసగా రెండు పర్యాయాలు యనమల సోదరుడిపై గెలుపొందడమే కాకుండా నియోజకవర్గ టీడీపీ నేతలకు సింహస్వప్నంగా నిలిచారు. 2014లో తొలిసారి ఎమ్మెల్యే అయినప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ వంటి అక్రమ కేసులతో వేధింపులు ఎదుర్కొన్నారు. వైఎస్సార్ సీపీని వీడి పారీ్టలోకి రావాలని పలు ప్రలోభాలకు గురిచేసినా లెక్క చేయకుండా పార్టీ పైన, అధినేత జగన్‌పైన ఎంతో విశ్వాసంతో పార్టీ వెన్నంటి నిబద్ధతతో నిలవడం కలిసి వచ్చింది. కాకినాడ జిల్లాలో ఏడు నియోజకవర్గాలుంటే ఆరు నియోజకవర్గాల నుంచి కాపు సామాజిక వర్గీయులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మలి కేబినెట్లో రాజాకు అవకాశం కల్పించి ఆ సామాజిక వర్గానికి పెద్ద పీటేశారు. తునిలో ఆ సామాజికవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే కావడం, మంత్రి కావడం ఇదే ప్రథమం. మంత్రి పదవి కూడా జగన్మోహన్రెడ్డి కేబినెట్లో దక్కడంతో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆ సామాజికవర్గీయుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కోనసీమకు జోడు పదవులు... జిల్లాల విభజన తరువాత కోనసీమకు జోడు పదవులు దక్కాయి. జిల్లాల పునర్విభజన తరువాత దాదాపు ఒకో జిల్లాకు ఒకో మంత్రి పదవి దక్కిన క్రమంలో కోనసీమ జిల్లాకు ఒకేసారి రెండు బెర్త్‌లు దక్కాయి. ఆ రెండు కూడా ఎస్సీ, బీసీలకే కట్టబెట్టడం ద్వారా ఆ వర్గాలపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానం తేటతెల్లం అవుతోంది. కోనసీమ జిల్లాలో అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీలకు రిజర్వు›కావడంతో ఆ సామాజికవర్గానికి ప్రాధాన్యం ఇచ్చినట్టయ్యింది. అమలాపురం నుంచి విశ్వరూప్, రామచంద్రపురం నుంచి వేణులను కేబినెట్లోకి తీసుకోవడం ద్వారా సీనియర్లను కొనసాగించినట్టయింది. వైఎస్సార్ సీపీకి తొలి నుంచి వెన్నంటి నిలుస్తోన్న ఎస్సీ, బీసీ సామాజికవర్గాలకు ఈ కేబినెట్లో సముచిత స్థానం కల్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బీసీలు, కాపులు, మాల, మాదిగలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడంపై పార్టీ శ్రేణుల్లోనే కాకుండా మూడు జిల్లాల ప్రజల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
మంత్రి వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్
రామచంద్రపురం(తూర్పుగోదావరి): రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. సంక్రాంతి సంబరాల అనంతరం ఈ నెల 17న ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కేబినెట్ సమావేశం ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురువారం మరోసారి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు -
సీఎం జగన్ వల్లే బీసీల అభివృద్ధి
సాక్షి, అమరావతి: బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ అధ్యక్షతన గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కులస్తుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సమాజంలో బీసీలు గర్వంగా తలెత్తుకొని తిరిగేలా వైఎస్ జగన్ సముచిత స్థానం కల్పించారని చెప్పారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. బీసీలు కుల వృత్తులకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో ఎదిగేందుకు ప్రభుత్వం తగిన సహకారమందిస్తోందని చెప్పారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని అర్థం చేసుకుని.. క్షేత్రస్థాయిలో చైతన్యం కల్పించాలని సూచించారు. సమావేశంలో వేమూరు ఎమ్మెల్యే డాక్టర్ మేరుగ నాగార్జున, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బీసీల సంక్రాంతి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని, వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని ఆయన చెప్పారు. స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన కులాలకు అండగా ఉంటానని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బీసీల కోసం ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి హాజరయ్యే వారికి పాస్‌లు జారీ చేస్తామని చెప్పారు. బీసీల కల నెరవేరబోతోంది: మంత్రి చెల్లుబోయిన వెనుకబడిన తరగతుల వారిని కల్చర్ ఆఫ్ ఇండియాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ వేసి, ఏడాది వ్యవధిలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించినట్టు వివరించారు. వారిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఒకే వేదికపై డైరెక్టర్లు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా బీసీలకు ముందే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, డీసీపీ హర్షవర్దన్‌రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
మరో 51,390 మందికి ‘జగనన్న చేదోడు’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పథకాలను అర్హత గల ప్రతి ఒక్కరికీ (సంతృప్త స్థాయిలో)అందించాలన్న లక్ష్యంలో భాగంగా ‘జగనన్న చేదోడు’ పథకం కింద మరో 51,390 మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నగదు బదిలీ చేయనుంది. ఈ పథకం కింద ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ కంప్యూటర్ బటన్ నొక్కి బదిలీ చేస్తారు. గతంలోనే 2,47,040 మంది రజకులు, టైలర్లు, నాయీబ్రాహ్మణులకు రూ.247.04 కోట్లను సీఎం జగన్ అందించారు. పొరపాటున ఇంకా ఎవరైనా మిగిలిపోతే పేర్లు నమోదు చేసుకునేందుకు నెల గడువు ఇస్తున్నామని, సాయం అందని అర్హులు కంగారుపడాల్సిన అవసరం లేదని సీఎం జగన్ ఆ సందర్భంగా స్పష్టం చేశారు. దీంతో ప్రభుత్వం ‘జగనన్న చేదోడు’ పథకం లబ్ధి పొందని వారి నుంచి మరోమారు దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా వచ్చిన దరఖాస్తులను వలంటీర్ల ద్వారా పరిశీలన జరిపించి అర్హులైన 51,390 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.51.39 కోట్లు బదిలీ చేయనున్నారు. -
మరో 4.39 లక్షల మంది అర్హులకు నేటి నుంచి సాయం
సాక్షి, అమరావతి: వివిధ పథకాల కింద అర్హత ఉండీ ఇప్పటివరకు సాయం అందని వారికి శనివారం నుంచి ఆయా పథకాల కింద సాయం అందించనున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చెప్పారు. వైఎస్సార్ కాపునేస్తం, వాహనమిత్ర, జగనన్న చేదోడు, నేతన్న నేస్తం, వైఎస్సార్ చేయూత పథకాలకు అర్హులై ఉండీ లబ్ధి కలగని 4.39 లక్షల మందికి ఈనెలలో వాటిని వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం విజయవాడలో కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజాతో కలిసి విలేకరులతో మాట్లాడారు. శనివారం (నేడు) కాపునేస్తం, 9న వాహనమిత్ర, 10న జగనన్న చేదోడు, 11న నేతన్న నేస్తం, 12న చేయూత పథకాల కింద 4.39 లక్షల మందికి ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందనివారికి అండగా ఉండేందుకు గ్రామ వలంటీర్ వ్యవస్థ ద్వారా సోషల్ ఆడిట్ నిర్వహించి లబ్ధిదారుల వివరాలు గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించామన్నారు. ఇప్పటికే ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో 28,19,000 మందికి ప్రయోజనం కలిగిందన్నారు. సీఎం జగన్ ప్రజాసేవ అనే తపస్సులో భాగమే ప్రజా సంకల్పయాత్ర అని పేర్కొన్నారు. జగన్లాగా ఇచ్చినమాట నిలుపుకొనే వ్యక్తులు అరుదన్నారు. కష్టపడ్డ నాయకుడు కనుకే కష్టాలు తెలిసి, కష్టపడ్డవారికి సంక్షేమ పథకాలు అందేలా చేశారు. కరోనా విపత్తులోనూ సంక్షేమ పథకాలు ఆగకుండా సాగుతున్నాయన్నారు. నాడు చంద్రబాబుది పథకాలు ప్రకటించి ఎగ్గొట్టాలనే లక్ష్యం ఉన్న ప్రభుత్వమని విమర్శించారు. -
‘పాలక’ పండగ
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు సమున్నత గౌరవం కల్పిస్తూ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వాటికి పాలక మండళ్లను నియమించింది. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమం దిశగా వడివడిగా చర్యలు చేపట్టింది. ప్రతి బీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌తోపాటు 12 మంది డైరెక్టర్లను నియమించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లను ఆయన ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, మహిళలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని వివరించారు. పాలక మండళ్లలో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లు చెప్పారు. సంఘాల కంటే మిన్నగా: డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కులాలకు ప్రభుత్వంలో ఎంతో గౌరవం కల్పించారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకునే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా వెనుకబడిన వర్గాలకు అన్ని విధాల సాయం అందించి ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్పొరేషన్లు కుల సంఘాల కంటే మిన్నగా ఆయా కులాల కోసం పనిచేస్తాయన్నారు. పాలక మండళ్లు ఆయా కులాల ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో ఎంపీ మోపిదేవి, మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ బడ్జెట్ కంటే మిన్నగా: మంత్రి బొత్స బీసీలంటే వెన్నెముకలాంటి వారని ముఖ్యమంత్రి జగన్ చేతల్లో నిరూపించారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో నాయకత్వ పటిమను గుర్తించి గౌరవించిన సీఎంకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. బీసీలకు బడ్జెట్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక, సామాజిక మార్పులే లక్ష్యం: ఎంపీ మోపిదేవి గత ప్రభుత్వాలు బీసీలకు తాళ్లు, గేదెలు, ఇస్త్రీపెట్టెలు లాంటివి ఇచ్చి అదే సంక్షేమం అని మభ్యపుచ్చాయని, ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు విమర్శించారు. ఇప్పుడు వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. బీసీల బాధలను ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో స్వయంగా చూశారని, ఆయన హృదయంలో నుంచి ఈ కార్పొరేషన్ల వ్యవస్థ పుట్టుకొచ్చిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా బీసీల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, మాలగుండ్ల శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు 1. రజక కార్పొరేషన్: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా) 2. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం) 3. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డాక్టర్ బి.నళిని (అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె.వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: తరిగొండ మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియార్: తిరుపతూర్ గోవిందరాజన్ సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి) 10. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి) 11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి) 12. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి) 13. షేక్/షెయిక్: షేక్ యాసిన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు) 15. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు) 16. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్ (కడప) 18. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప) 20. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప) 21. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప) 22. విశ్వబ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా) 26. వాల్మీకి/బోయ: డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు) 27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు) 28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు) 29. వీరశైవ లింగాయత్: వై.రుద్రగౌడ్ (కర్నూలు) 30. ముదిరాజ్/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్ (నెల్లూరు) 31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి: ఎస్.కిషోర్‌సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం) 36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం) 43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం) 44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పిల్లి సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం) 51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52. దాసరి: డాక్టర్ రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి) 54. శెట్టిబలిజ: డాక్టర్ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి) 55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి) -
బీసీలకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చలేదు
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు అధికారంలో ఉండగా బీసీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ మండిపడ్డారు. బీసీలను ఆయన కేవలం ఓటు బ్యాంక్‌గా మాత్రమే చూశారని ధ్వజమెత్తారు. బీసీ ఓటు బ్యాంక్‌తోనే టీడీపీ అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని బాబు పూర్తిగా మరిచిపోయి వ్యవహరించారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మంత్రి వేణు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే.. ► సంచార జాతుల వారు తమ సమస్యలను పాదయాత్రలో జగన్ దృష్టికి తెచ్చారు. వారికిచ్చిన హామీలన్నింటినీ సీఎం నెరవేర్చారు. ► చంద్రబాబు పాలనలో బీసీలు విసిగిపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది. ► వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, మాట్లాడుతూ.. సంచార జాతులను గత ప్రభుత్వాలు విస్మరించాయని ధ్వజమెత్తారు. ► సంచార జాతుల కోసం ప్రత్యేకంగా ఐదు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సంచార జాతులపై సదస్సు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం భారతదేశ విముక్త సంచార జాతుల 68వ స్వాతంత్య్ర దినోత్సవం అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు. మంత్రి చెల్లుబోయిన వేణు, జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి పాల్గొని మహాత్మా జ్యోతిరావ్ పూలే, వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సంచార జాతుల రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, గౌరవాధ్యక్షుడు గురుప్రసాద్ పాల్గొన్నారు. -
ఆవ భూముల్లో ఆవగింజంత అవినీతి లేదు
తాడితోట (రాజమహేంద్రవరం): ఆవ భూముల్లో ఆవ గింజంత కూడా అవినీతి జరగలేదని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమన్నారంటే.. ► రాష్ట్రంలో 30 లక్షల మంది మహిళల పేరిట ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని ప్రభుత్వం సంకల్పించింది. దీనిని అడ్డుకునేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ప్రచారానికి తెరతీశారు. ► హైదరాబాద్‌లో కాపురం ఉంటూ.. అవినీతి సొమ్ముతో అజీర్తి చేసి ఆవలింత వచ్చినప్పుడల్లా అవినీతి గురించి చంద్రబాబు మాట్లాడుతున్నారు. ► 30 లక్షల ఇళ్లు నిర్మించడం కోసం ఒక మోడల్ హౌస్‌ను సందర్శిస్తే కోట్లాది రూపాయలు అవినీతి జరిగిపోయిందని కొన్ని పత్రికలు కథనాలు ప్రచురిస్తున్నాయి. ► అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల కోసం 54 వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తుంటే కోర్టును ఆశ్రయించి పేదోళ్లకు అందకుండా ప్రయత్నిస్తున్నారు. ► ఆవ భూముల్లో రూ.500 కోట్లు అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. అక్కడ ఖర్చు చేసిందే రూ.170 కోట్లు అని తెలుసుకోవాలి. ► ఫోన్ ట్యాంపరింగ్ జరిగిందని ప్రధాన మంత్రికి చంద్రబాబు ఉత్తరం రాశారు. ఆధారాలు చూపించాలని డీజీపీ అడిగితే.. మీరెవరు అడగడానికి అని ప్రశ్నించిన వారే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాయడం విడ్డూరం. -
మనదేనయ్యా ఆ భూమి..
సాక్షి, రామచంద్రపురం: వెతుకుతున్న వస్తువు కాలికి తగిలినట్టు.. పేదలకు ఇళ్ల స్థలాలు అందించేందుకు భూమి కోసం అన్వేషిస్తుంటే అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి అధికారుల కంట పడింది.. అసలు ఆ భూమి ఎవరిదని ఆరా తీస్తే... ప్రభుత్వానిదే అని నిర్ధారణ అయింది. చివరికి రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ చొరవతో ఆ భూమిని స్వాధీనం చేసుకుని ఇళ్ల స్థలాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.. రామచంద్రపురం మండలం ద్రాక్షారామ పరిధిలో రూ.1.50 కోట్ల విలువైన సుమారు 2.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 99, 100లో ఈ భూమి వెల్ల సావరం దగ్గర్లో ఉంటుంది. ద్రాక్షారామ రెవెన్యూ పరిధిలోని ఆ మెరక భూమిలో 40 ఏళ్ల నుంచి కొబ్బరి చెట్లు ఉన్నాయి. ఆ ఫలాలను కొందరు అనుభవిస్తున్నారు. ఆ స్థలం సర్కారుదని ఎవరికీ తెలియదు. అంతేకాకుండా కొంత ఆక్రమణకు గురైంది. ఇదిలా ఉంటే పేదలందరికీ గూడు కల్పించేందుకు ప్రభుత్వం బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఎక్కడెక్కడ స్థలాలున్నాయో తెలుసుకునేందుకు అధికారులు జల్లెడ పట్టారు. అధికారులకు ద్రాక్షారామ పరిధిలోని ఆ భూమి కనిపించింది. అసలు ఎవరిదని అధికారులు రికార్డులు తిరగేశారు. చివరికి ప్రభుత్వానిదే అని తేలింది. ఈ విషయాన్ని ఎమ్మెల్యే చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే ఆయన ఆయా సర్వే నంబర్లలోని భూమిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి 2.70 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. పొక్లెయిన్‌తో చెట్లను తొలగించి చదును చేశారు. ద్రాక్షారామ పరిధిలోని ఇళ్లు లేని పేదలకు స్థలాలు కొనుగోలు చేసేందుకు అధికారులు ఎంతో శ్రమపడ్డారు. అనుకోకుండా విలువైన భూమిని గుర్తించి దానిని ఇళ్ల స్థలాలుగా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. దీంతో సుమారు 135 మంది లబ్ధిదారులకు మేలు జరగనుంది. ఈ స్థలాన్ని గుర్తించడంలో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారు. రెవెన్యూ అధికారుల సహకారంతో పేదలకు మేలు జరగనుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: రోల్‌మోడల్‌గా ఏపీ మా కంట పడింది.. గతంలో ఆ భూమిని ఎవరూ గుర్తించలేదు. ప్రస్తుతం సర్వే చేస్తుండగా మా కంట పడింది. ఎవరిదని ఆరా తీస్తే ప్రభుత్వానిదని తేలింది. రికార్డులన్నీ సక్రమంగానే ఉన్నారు. ఆ స్థలాన్ని పూర్తిగా సిద్ధం చేశాం. పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇస్తాం. – పి.తేజేశ్వరరావు, తహసీల్దార్, రామచంద్రపురం -
సీబీఐతో విచారణ జరిపించాలి
నారాయణరెడ్డి హత్యపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన సాక్షి, హైదరాబాద్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యోదంతంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. పక్కా ప్రణాళిక రూపొందించి నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేసి చంపితే, దీనికి రెండు కులాల మధ్య గొడవలు అంటూ ప్రచారం చేయడం దారుణమని, దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజం ఏమిటో మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన తనయుడి ప్రోద్బలంతోనే నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఎపుడో గ్రామం వదలి వెళ్లిన వారిని తిరిగి రప్పించి పక్కా ప్రణాళికతో నారాయణరెడ్డిని హత్య చేయించారని విమర్శించారు.