సీబీఐతో విచారణ జరిపించాలి | Investigate with CBI says | Sakshi
Sakshi News home page

సీబీఐతో విచారణ జరిపించాలి

Published Fri, May 26 2017 1:10 AM | Last Updated on Sat, Jun 23 2018 10:47 AM

సీబీఐతో విచారణ జరిపించాలి - Sakshi

సీబీఐతో విచారణ జరిపించాలి

 నారాయణరెడ్డి హత్యపై వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి చెల్లుబోయిన
 
సాక్షి, హైదరాబాద్‌: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యోదంతంలో నిజానిజాలు నిగ్గు తేలాలంటే, ఏ స్థాయిలో కుట్ర జరిగిందో బయటకు రావాలంటే సీబీఐ చేత విచారణ జరిపించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ డిమాండ్‌ చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడారు.

పక్కా ప్రణాళిక రూపొందించి నారాయణరెడ్డిని నిరాయుధుడిని చేసి చంపితే,  దీనికి రెండు కులాల మధ్య గొడవలు అంటూ ప్రచారం చేయడం దారుణమని, దీన్ని బట్టి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నైజం ఏమిటో మరోసారి రుజువైందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, ఆయన తనయుడి ప్రోద్బలంతోనే నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేశారని చెప్పారు. ఎపుడో గ్రామం వదలి వెళ్లిన వారిని తిరిగి రప్పించి పక్కా ప్రణాళికతో నారాయణరెడ్డిని హత్య చేయించారని  విమర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement