
రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది.
రామచంద్రపురం(తూర్పుగోదావరి): రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలోని మంత్రి కార్యాలయం నుంచి శుక్రవారం ఒక ప్రకటన వెలువడింది. సంక్రాంతి సంబరాల అనంతరం ఈ నెల 17న ఆయన అనారోగ్యంగా ఉండటంతో కరోనా టెస్టులు నిర్వహించగా నెగిటివ్ వచ్చింది. కేబినెట్ సమావేశం ఉండటంతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం గురువారం మరోసారి కరోనా టెస్ట్ చేయించగా పాజిటివ్‌గా తేలింది. అయితే సంక్రాంతి సంబరాలకు వచ్చిన వారెవ్వరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని మంత్రి స్పష్టం చేశారు
చదవండి: గుడివాడలో టీడీపీకి భంగపాటు