‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే’ | Minister Venugopala Krishna Takes On Chandrababu And Co | Sakshi
Sakshi News home page

‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే’

Published Mon, Mar 20 2023 7:54 PM | Last Updated on Mon, Mar 20 2023 8:17 PM

Minister Venugopala Krishna Takes On Chandrababu And Co - Sakshi

అమరావతి: గత కొన్ని రోజులుగా శాసనసభలో టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం, వాకౌట్‌ చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఏడు రోజులుగా డోలా వీరాంజనేయస్వామి పదేపదే స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారని, ఈరోజు స్పీకర్‌పై దాడికి దిగారన్నారు.  ఈ రోజు శాసనసభ చరిత్రలో బ్లాక్‌ డే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో కూర్చొని దశ, దిశ చేస్తుంటాడని, సభకు రాడని మండిపడ్డారు మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్‌ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు.

‘సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం.. వాకౌట్ చేయడం ఇదే వారి పని. ఏడు రోజులుగా స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారు. ఈరోజు స్పీకర్ పై దాడికి దిగారు  వెల్ లోకి వెళ్లడమే నేరం..పైగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. హద్దులు దాటి సభాపతి పై దాడి చేశారు. భర్తను కొట్టినమ్మ బావురుమన్నట్లుంది టీడీపీ తీరు. మాపై వారే దాడి చేసి...నింద మాపై వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చర్చ జరగకూడదనే పథకం ప్రకారం ఈరోజు గొడవ చేశారు’ అని మంత్రి తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement