AP Assembly Budget Session 2023
-
ఉత్తరాంధ్ర నుంచే వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, విశాఖపట్నం: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ ప్రణాళికలు రచిస్తోంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రచారంపై ఫోకస్ పెట్టింది పార్టీ. ఇందులో భాగంగా ఉత్తరాంధ్ర నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించింది. ఈ నెల 25న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనుంది. ఈ క్రమంలో సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు ముఖ్య నేతలతో గురువారం కీలక సమావేశం నిర్శహించారు. తొలి బహిరంగ సభ ద్వారా ఉత్తరాంధ్ర కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశా నిర్దేశం చేయనున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ప్రతి నియోజవర్గం నుంచి ఆయుదు ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ద ఉందని.. అందుకే ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ఉద్దేశం చేస్తారని తెలిపారు. సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్రాన్ని అయిదు జోన్లుగా విభజించి కేడర్ సమావేశాలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో ముఖ్యమంత్రి సమావేశం అవుతారని చెప్పారు. రెండు నెలల్లో జరిగే ఎన్నికలకు పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నట్లు తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా చర్చిస్తారని తెలిపారు. ఇది ఒకరకంగా ఎన్నికల శంఖారావం అనుకోవచ్చన్నారు. ఎన్నికలకు పార్టీని గేరప్ చేసే దిశగా మీటింగులు జరగనున్నాయని బొత్స పేర్కొన్నారు. ‘ఎవరికి ఎమ్మెల్యే..ఎవరికి ఎంపి టికెట్ ఇవ్వాలన్నది సీఎం జగన్ మోహన్ రెడ్డి నిర్ణయిస్తారు. ఈ పార్టీ వ్యక్తుల కోసం కాదు వ్యవస్థ కోసం ఏర్పాటు చేశారు. టికెట్లు ఇవ్వలేదన్న భావం మా నేతల్లో లేదు. కేశినేని నాని ఎందుకు పార్టీ నుంచి వెళ్లి పోయారు. అసలైన ఓటర్లు వుండేలా చూసే భాధ్యత ఎన్నికల కమిషన్‌ది. ఏపీతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి మాకు ముఖ్యం. విశాఖలో ఏ ప్రాజెక్ట్ వచ్చినా అది రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి హయాంలోనే. రుషికొండలో ఐటీ సెజ్...అచ్యుతాపురం బ్రాండెక్స్ కంపెనీలు వైఎస్సార్ హయాంలో వచ్చినవే. చంద్రబాబు హయాంలో ఉత్తరాంధ్ర విశాఖలో ఏమైనా ప్రాజెక్టులు వచ్చాయా చెప్పండి. టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్టు కాంట్రాక్ట్ పనులు రద్దు చేయించారు. ‘సంక్రాంతి సెలవులు పొడిగింపు విద్యార్థులు తల్లిదండ్రులు అభ్యర్థనపై ఇచ్చాం. పురందేశ్వరి మాట్లాడే ముందు ఆలోచించు. 22వ తేదీన సెలవు కావాలంటే ప్రభుత్వానికి ప్రతిపాదన పెట్టొచ్చు. ప్రభుత్వం పరిశీలిస్తుంది. విశాఖలో వివిధ సంస్థలకు భూముల కేటాయింపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతిపాదనలే. ఆ ప్రాజెక్టుల గురించి ఆ ప్రభుత్వమే సమాధానం చెప్పాలి’ అని అన్నారు. చదవండి: గుడివాడలో టీడీపీ-జనసేన శ్రేణుల ఓవరాక్షన్ -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
అది దొంగల రాజ్యం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ‘అమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. కాంట్రాక్టు సంస్థలను బెదిరించి మరీ భారీ వసూళ్లు చేశారు. తన మనుషుల ద్వారా బోగస్ కంపెనీలు సృష్టించి సబ్ కాంట్రాక్టుల రూపంలో నిధులు కొల్లగొట్టారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. ‘ఇది మనం చెబుతోంది కాదు. ఆదాయ పన్ను శాఖ అధికారుల సోదాల్లో బట్టబయలైన అవినీతి బాగోతం. ఐటీ శాఖ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడించిన వాస్తవం’ అని వెల్లడించారు. ‘అమరావతిలో భవన నిర్మాణ కాంట్రాక్టు కంపెనీలపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తే ఈ అవినీతి బండారం బయట పడింది. అందుకే చంద్రబాబుకు ఐటీ శాఖ నోటీసులు ఇచ్చింది’ అని తెలిపారు. అమరావతి నిర్మాణాల విషయంలో చంద్రబాబు అవినీతిపై ఐటీ శాఖ నోటీసులు జారీ చేసిన అంశంపై శాసనసభలో శుక్రవారం నిర్వహించిన చర్చలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగించారు. ‘చంద్రబాబు తమను బెదిరించడంతోనే ఆయన చెప్పిన బోగస్ కంపెనీలకు నిధులు మళ్లించామని షాపూర్జీ–పల్లోంజీ కంపెనీ ప్రతినిధులు ఐటీ శాఖకు ఇచ్చిన వాంగ్మూలంలో అంగీకరించారు. మరో నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి తామే నిధులు వసూలు చేసి, చంద్రబాబుకు అందించామని వెల్లడించార’ని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ వ్యవహారంలో చంద్రబాబు నిధులను కొల్లగొట్టిన తీరును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇలా వివరించారు. ఐటీ దాడులతో వెలుగులోకి.. ► మొట్టమొదటగా ఆదాయ పన్ను శాఖ (ఐటీ శాఖ) అధికారులు షాపూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ నివాసంలో 2019 నవంబర్‌లో సోదాలు నిర్వహించారు. అక్కడ మొత్తం సమాచారం లభించింది. ఆ తర్వాత 2020 ఫిబ్రవరిలో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ నివాసంలో సోదాలు చేశారు. దాంతో మరింత సమాచారం లభించింది. ► ఆదాయ పన్ను శాఖ పరిశోధన విభాగం ఆ మొత్తం సమాచారాన్ని క్రోడీకరించి ఆదాయ పన్ను అప్రైజల్ రిపోర్ట్‌ను తయారు చేసింది. తాము నిర్వహించిన దాడుల్లో లభించిన ఆధారాల ప్రకారం సంబంధిత వ్యక్తులను పిలిపించారు. తాము సేకరించిన ఆధారాలను ఆ వ్యక్తులకు చూపించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. ఆ వాంగ్మూలాలపై వారు సంతకాలు కూడా పెట్టారు. వాటన్నింటి ఆధారంగా ఐటీ అధికారులు చంద్రబాబుకు ఇప్పుడు నోటీసులు పంపారు. చంద్రబాబు అవినీతి బాగోతం ఇలా.. ► అమరావతిలో నిర్మాణాల కాంట్రాక్టుల్లో చంద్రబాబు భారీగా అవినీతికి పాల్పడ్డారు. అందుకోసం పక్కాగా స్కెచ్ వేశారు. 2019 జనవరి, ఫిబ్రవరిలో చంద్రబాబు షాఫూర్జీ పల్లోంజీ కంపెనీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్‌ను పిలిపించుకుని తన పీఏ శ్రీనివాస్‌ను కలవమని చెప్పారు. దాంతో మనోజ్.. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌ను కలిశారు. ► షాపూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ పనులు చేసింది. అందులో తన కమీషన్లు వసూలు చేసేందుకు బాబు.. శ్రీనివాస్‌ను రంగంలోకి దింపారు. వినయ్ నంగల్లా, విక్కీ జైన్ అనే ఇద్దరిని మనోజ్‌కు శ్రీనివాస్ అటాచ్ చేశారు. వీరిలో వినయ్ నంగల్లా మూడు కంపెనీలు, విక్కీ జైన్ రెండు కంపెనీలు సృష్టించారు. ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇవ్వమన్నారు. వాళ్ల నుంచి తాము డబ్బులు తీసుకుంటామని చంద్రబాబు పీఏ శ్రీనివాస్ మనోజ్‌తో చెప్పారు. ► దాంతో వినయ్ నంగల్లా హయగ్రీవమ్, అన్నై షలాఖా అనే కంపెనీలను మనోజ్‌కు అటాచ్ చేశారు. విక్కీ జైన్.. నయోలిన్, ఎవరెట్ అనే రెండు కంపెనీలను అటాచ్ చేశారు. మనోజ్‌కు వాళ్లెవరో కూడా తెలియదు. తాము ఇలా డబ్బులు ఇవ్వలేమని, కావాలంటే పార్టీకి ఫండ్ ఇస్తామని షాపూర్జీ పల్లోంజీ కంపెనీ చెప్పింది. తాము చెప్పినట్లు ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని మనోజ్‌ను శ్రీనివాస్ బెదిరించారు. ఆ విషయాన్ని మనోజ్ ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో కూడా వెల్లడించారు. ఆ వాంగ్మూలం కాపీలు కూడా ఉన్నాయి. ► ఆ కంపెనీలకు బోగస్ సబ్ కాంట్రాక్టుల కింద డబ్బులు ఇచ్చిన తర్వాత వాటిని వసూలు చేసి చంద్రబాబుకు అప్పగించే బాధ్యతను ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్, శ్రీకాంత్, అనికేత్ బలోటాలకు అప్పగించారు. ఇదీ ఈ మోడస్ ఆఫ్ ఆపరెండీ. ఐటీ అధికారులు ఈ సమాచారాన్ని అంతా ఆ కంపెనీల ప్రతినిధుల నుంచి వాంగ్మూలంగా తీసుకుని ఐటీ అప్రైజల్ రిపోర్ట్ తయారు చేశారు. దాన్ని చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు చూపించారు. అదంతా వాస్తవమేనని శ్రీనివాస్ అంగీకరించి సంతకాలు కూడా చేశారు. ► శ్రీనివాస్‌తోపాటు రఘు, మిగిలిన వారిని కూడా ఐటీ అధికారులు ప్రశ్నించారు. వాళ్లు కూడా అదంతా వాస్తవమేనని అంగీకరించి సంతకాలు కూడా చేశారని ఐటీ అప్రైజల్ రిపోర్ట్ వెల్లడిస్తోంది. ► చంద్రబాబుకు దుబాయిలో కూడా రూ.15.14 కోట్లను దినార్ల రూపంలో క్యాష్‌గా ఇచ్చినట్టు ఐటీ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో మనోజ్ అంగీకరించారు. దాంతోనే ఐటీ అధికారులు చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో కూడా చంద్రబాబుకు ఇలానే మూడు నెలల్లో రూ.371 కోట్లు అందాయి. ఆ కుంభకోణంలో చంద్రబాబుకు డబ్బులు చేర్చిన యోగేశ్ గుప్తానే ఈ వ్యవహారంలో కూడా ఉన్నారు. కోట్ల మళ్లింపునకు కోడ్ భాష ► ఆర్వీఆర్ రఘు వాట్సాప్ చాట్లను ఐటీ అధికారులు పరిశీలించగా.. ఈ అక్రమ ఆర్థిక లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మనోజ్ వాసుదేవ్ సన్నిహితుడు యోగేశ్ గుప్తా నివాసంపై కూడా ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో నిధుల మళ్లింపులో కూడా యోగేశ్ గుప్తా కీలక పాత్ర పోషించారు. బోగస్ ఇన్వాయిస్లు సృష్టించి ప్రజాధనాన్ని కొల్లగొట్టడంలో ఆయనదే ప్రధాన భూమిక. ► ఈ అక్రమ లావాదేవీలను మనోజ్ కోడ్ భాషలో తన ఈ–మెయిల్ ఐడీకే మెయిల్ చేసుకుని భద్ర పరిచినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. ఎవరెవరికి ఎంతెంత మొత్తం చెల్లించింది కోడ్ భాష ‘టన్నుల’ రూపంలో పేర్కొన్నట్టుగా పూర్తి వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్‌కు 3 టన్నులు, ఢిల్లీకి 3 టన్నులు, ముంబాయికి 3.5 టన్నులు.. ఇలా భారీగా నిధులను మళ్లించిన గుట్టును ఐటీ అధికారులు ఛేదించారు. ఇది రూ.2 వేల కోట్ల దోపిడీ ► ఐటీ అధికారులు విశాఖపట్నం, విజయవాడ, కడప, ఢిల్లీ, పూణేల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌తోపాటు మరికొందరిపై జరిపిన దాడుల్లో లెక్కల్లో చూపని రూ.రెండు వేల కోట్లు దొరికినట్టు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ 2020 ఫిబ్రవరి 13న ఒక ప్రకటనలో వెల్లడించింది. 40 చోట్ల జరిపిన తనిఖీల్లో బోగస్ సబ్ కాంట్రాక్ట్ కంపెనీలు, ఇన్వాయిసులు, బిల్లులు ఇతర ఆధారాలు లభించాయని చెప్పింది. ► రెండో దశ దర్యాప్తులో భాగంగా ఐటీ అధికారులు 2022 సెప్టెంబర్ 28న చంద్రబాబుకు నోటీస్ ఇచ్చారు. ఈ కేసును డీసీఏసీ–సెంట్రల్ సర్కిల్‌కు బదిలీ చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో త్వరలో చంద్రబాబును కూడా విచారణకు పిలవనున్నారు. ► 2019లో అర్జంటుగా డబ్బులు ఇవ్వాలని మనోజ్ వాసుదేవ్‌కు చంద్రబాబు చెప్పారు. హయగ్రీవా, అన్నై షలాఖా అనే సంస్థలకు రూ.52.50 కోట్లు.. నవోలిన్, ఎవరెట్ కంపెనీలకు రూ.62.90 కోట్లు చొప్పున మనోజ్ చెల్లించారు. చంద్రబాబు ఆదేశాలతో మనోజ్.. ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి కూడా డబ్బులు వసూలు చేసి ఇప్పించారు. ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధులు అతుల్ సోని, బాల వెంకటేశ్ ఫినిక్స్ ఇన్ఫ్రా, ఫోర్ ట్రేడింగ్, లక్ స్టోన్ అండ్ కో బోగస్ కంపెనీల ఖాతాల్లో రూ.41.90 కోట్లు జమ చేశారు. మొత్తం రూ.157.3 కోట్లు మళ్లించారు. ► ఈనాడు రామోజీరావు కుమారుడు కిరణ్ వియ్యంకుడు ఆర్వీఆర్ రఘుతోపాటు కృష్ణ, నారాయణ, శ్రీకాంత్, అనికెత్ బల్దోటాలకు ఈ రూ.157.3 కోట్లు చేరాయి. వారు ఆ నిధులను నేరుగా చంద్రబాబుకు చేర్చారు. ఈ వ్యవహారంలో నారా లోకేశ్ పీఏ రాజేశ్ కిలారి కీలక పాత్ర పోషించారు. ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్ ► ఇంతకు ముందు కూడా ఇదే రాష్ట్రం.. ఇదే బడ్జెట్. అప్పటి ప్రభుత్వం కన్నా అప్పుల గ్రోత్ రేటు ఇప్పుడు తక్కువ. ఇదే బడ్జెట్‌తో మన ప్రభుత్వం నేరుగా బటన్ నొక్కి డీబీటీ ద్వారా ప్రతి అక్క, చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు జమ చేసి ప్రయోజనం కలిగిస్తోంది. నాలుగేళ్లు పూర్తికాక ముందే మన ప్రభుత్వం ఇప్పటికే రూ.2 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేసింది. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా బటన్ నొక్కిన వెంటనే అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. ► ఇంతకు ముందు చంద్రబాబు ప్రభుత్వంలో కూడా ఇదే బడ్జెట్. అయినప్పటికీ ఎందుకు అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి, వారి కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్లలేదు? ఆ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? దోచుకో, పంచుకో, తినుకో అనే డీపీటీ స్కీం ఎలా చేశారో మొన్న కూడా చెప్పాం. ఈ రోజు మళ్లీ చెబుతున్నాం. గత ప్రభుత్వం ఎలా ఉండేది.. మనందరి ప్రభుత్వంలో ఎలాంటి మార్పు వచ్చిందో, ఎంత మంచి జరుగుతోందో రాష్ట్ర ప్రజలందరూ ఆలోచించాలి. ఈడీ పట్టుకోదనే కేడీ చంద్రబాబు ధీమా ఇంతగా ప్రజాధనాన్ని కొల్లగొట్టినా, తనను ఏ ఈడీ కూడా పట్టుకోదనే ఈ కేడీ చంద్రబాబు ధీమా. సీమెన్స్ కేసులో రూ.371 కోట్లు దోచేసిన చంద్రబాబు ఈ కేసులో రూ.172.44 కోట్లు దోపిడీ చేసినట్లు ఇప్పటిదాకా తేలింది. అమరావతి పేరిట ఏదో చేస్తున్నానని ప్రజలను మభ్యపెడుతూ ఇక్కడ చేసింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోపిడీ ఆధారాలతో బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజలకు ముఖం ఎలా చూపిస్తావ్ చంద్రబాబూ.. అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణానికి చ.అడుగుకు రూ.12 వేలు చొప్పున దోచి పెట్టారు. ఇలా దోచేసిన డబ్బును ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే పనులను చంద్రబాబు ఖర్చు చేస్తున్నారు. ఆ రోజు అధికారాన్ని అడ్డుపెట్టుకుని మా ఎమ్మెల్యేలు 23 మందిని కొన్నారు. నేడు మరో నలుగురిని ప్రలోభాల ద్వారా లాక్కున్నారు. బాబు దోపిడీలో దోచుకో పంచుకో తినుకో(డీపీటీ) బ్యాచ్‌లోని రామోజీరావుకూ వాటాలు అందాయి. అందుకే చంద్రబాబు ఎంత అవినీతికి పాల్పడినా ఈనాడు పత్రికలో రామోజీ రాయరు. ఈటీవీలో చూపరు. చంద్రబాబు, రామోజీరావు తోడు దొంగలు. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి. -
అమరావతిలో బాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత నెలకొన్న సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి ఒక అవకాశంగా మార్చుకున్నారని, విచ్చలవిడిగా ప్రజాధనం లూటీ చేశారన్నారు ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఈ కేడీని ఏ ఈడీ పట్టుకోలేదన్న ధీమాతోనే చంద్రబాబు అడ్డగోలుగా అవినీతికి పాల్పడ్డారని తెలిపారాయన. చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతిపై అసెంబ్లీలో ఇవాళ చర్చ జరిగింది. ఈ మేరకు ప్రకటన చేస్తూ.. అందుకు సంబంధించిన వివరాలను అసెంబ్లీ సాక్షిగా వెల్లడించారు మంత్రి అమర్నాథ్. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం లూటీ చేశారు. ప్రజాధనాన్ని చంద్రబాబు దోచుకుతిన్నారు. ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది. ఆ అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి. అమరావతి ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాల నుంచి టీడీపీ పార్టీ ఫండ్స్ కోసం డబ్బులు డిమాండ్ చేశారు. చంద్రబాబు చేసిన దొపిడీ ప్రజలకు తెలియాలి. బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు. ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లించారు. చివరగా ఆ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి. చంద్రబాబు, టీడీపీకి రూ.143 కోట్లు అందాయని తెలిపారు మంత్రి అమర్నాథ్. సచివాలయం, కోర్టు నిర్మాణాల్లో భారీ అవినీతి జరిగింది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక కూడా ఇచ్చింది. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు నిర్మాణాలను షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది. మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి. మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు. తన పీఏ ఇచ్చే ఆదేశాలను ఫాలో కావాలని ఆయనకు బాబు చెప్పారు. చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది. అంతేకాదు.. కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది. దాదాపు రూ.2 వేల కోట్ల అవినీతి జరిగిందన్న అమర్నాథ్.. ఈ మేరకు ఓ ఆంగ్ల పత్రిక కథనాన్ని సభలో ప్రదర్శించారు. షాపూర్ జీ పల్లోంజి సంస్థకు రూ.8వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు. అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత. దోచుకోవడానికి చంద్రబాబు అలవాటు పడ్డారని విమర్శించారు మంత్రి అమర్నాథ్. -
ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి!
సాక్షి, అమరావతి: పాదయాత్ర, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ బోయ, వాల్మీకి కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్న ఆ రెండు కులాలకు న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదే సమయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి అన్యాయం జరగకుండా చూస్తామని స్పష్టం చేశారు. జోనల్ వ్యవస్థ వారికి రక్షణగా ఉంటుందని, చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదని తెలిపారు. బోయ, వాల్మీకి సామాజిక వర్గం అధికంగా నివసించే రాయలసీమ ప్రాంతం ఇతర జోన్లో ఉంటుందని వివరించారు. ఇక దళిత క్రైస్తవులకు ఆర్థిక, సామాజిక న్యాయం చేసేందుకు వారికి ఎస్సీ హోదా నిరాకరించకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. మతం మారినంత మాత్రాన దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక పరిస్థితిలో ఎలాంటి మార్పు రాదని చెప్పారు. అందుకే దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా నిరాకరించకూడదనే తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతున్నామన్నారు. ఈ మేరకు శాసనసభ శుక్రవారం విడివిడిగా రెండు తీర్మానాలను ఆమోదించింది. ఈ సందర్భంగా చర్చలో ముఖ్యమంత్రి జగన్ ఏమన్నారంటే.. మాట మేరకు వాల్మీకి, బోయలకు న్యాయం నా సుదీర్ఘ పాదయాత్ర సమయంలో బోయ, వాల్మీకి సామాజిక వర్గాల వారు నన్ను కలిసి 70 ఏళ్లుగా ఎస్టీ హోదా కోసం పోరాడుతున్నట్లు వాపోయారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో తమవారికి ఎస్టీ హోదా ఉందని, పక్కనే ఉన్న బళ్లారి జిల్లాలోనూ తమ కులస్తులకు ఎస్టీ హోదా ఉందని చెప్పారు. కానీ రాయలసీమ జిల్లాల్లో ఉన్న తమకు ఎస్టీ హోదా ఇవ్వకపోవడంతో దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఎస్టీలలో చేర్చాలని బోయ, వాల్మీకి కులాల వారు కోరడంతో అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని హామీ ఇచ్చా. అయితే ఎస్టీ హోదా ఇవ్వడం రాష్ట్ర పరిధిలోని అంశం కాదు. అది కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది. కానీ చేతనైనంత సాయం చేయాల్సిన బాధ్యత, మానవత్వం మనలో ఉండాలి. ఆ మానవత్వంతోనే వారికి ఎస్టీ హోదా కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత బోయ, వాల్మీకి కులాల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వారి చరిత్ర, స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్‌కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించాం. ఆ సామాజిక వర్గం ఎక్కువగా ఉండే రాయలసీమ జిల్లాల్లో కమిషన్ విస్తృతంగా పర్యటించి అధ్యయనం చేసింది. వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక, సామాజిక స్థితిగతులు, గత చరిత్రను క్షుణ్నంగా పరిశీలించి నివేదిక సమర్పించింది. బోయ, వాల్మీకి సహా అనుబంధ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఏకసభ్య కమిషన్ సిఫార్సులను పరిగణలోకి తీసుకుని వాల్మీకి, బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి తీర్మానాన్ని పంపుతున్నాం. ఏజెన్సీలో ఎస్టీలకు అన్యాయం జరగదు.. బోయ, వాల్మీకి కులాలకు ఎస్టీ హోదా కల్పించాలన్న సిఫారసులపై కొందరు షెడ్యూల్(ఏజెన్సీ) ప్రాంతాల్లో దుష్ప్రచారం చేస్తున్నారు. వాటిని నమ్మొద్దు. ఈ విషయంపై కమిషన్ కూడా ఒక నివేదిక ఇచ్చింది. ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీలకు భరోసా కలిగిస్తూ వారికి కొన్ని విషయాలు చెప్పాల్సిన బాధ్యత ఈ సభ మీద ఉంది. కమిషన్ నివేదికలో కూడా ఈ విషయాలు పొందుపరిచారు. కమిషన్ చెప్పినట్లుగా మన రాష్ట్రంలో సిక్స్ పాయింట్ ఫార్ములా, జోనల్ వ్యవస్థ ఉన్నాయి. దీంతో చదువులు, ఉద్యోగాల విషయంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలపై ఎటువంటి ప్రభావం ఉండదు. కారణం.. ఏజెన్సీ ప్రాంతాలన్నీ వేరే జోన్లోకి వస్తాయి కాబట్టి. రాయలసీమ ప్రాంతం వేరే జోన్లో ఉంటుంది. బోయ, వాల్మీకిలను ఎస్టీలలో చేర్చడం వల్ల ఏజెన్సీ ప్రాంతాల్లోని ఎస్టీల చదువులు, ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదు. వారి ఉద్యోగాలు వారికే ఉంటాయి. నాన్ జోనింగ్ ఉద్యోగాల మీదే అంతో ఇంతో ప్రభావం ఉంటుంది. కేవలం గ్రూప్–1 ఉద్యోగాలే నాన్ జోనింగ్ పరిధిలోకి వస్తాయి. గత పదేళ్లలో రాష్ట్రంలో కేవలం 386 గ్రూప్–1 ఉద్యోగా>లకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు. వాటిలో ఆరు శాతం ఎస్టీ రిజర్వేషన్ అంటే కేవలం 22 ఉద్యోగాల మీదే పోటీ ఉంటుంది. మిగిలినవి అన్నీ జిల్లాలకు సంబంధించిన ఉద్యోగాలు. అవన్నీ జోన్లకు సంబంధించినవే. మొత్తం ఉద్యోగాల్లో ఇవే 99 శాతం వరకూ ఉంటాయి. కాబట్టి ఏజన్సీ ప్రాంతాల్లోని ఎస్టీలకు ఎలాంటి అన్యాయం జరగదు. ఇవన్నీ ఏజెన్సీ ప్రాంతంలోని ఎస్టీ సోదర సోదరీ మణులకు తెలియజేయాల్సిన బాధ్యత నాపై ఉంది. గిట్టనివారు ఓట్ల కోసం చేసే దుష్ప్రచారాన్ని నమ్మొద్దని కోరుతున్నా. ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనులు, ఆదివాసీల హక్కులు, ప్రయోజనాలకు ఎలాంటి భంగం కలగదని మీ జగనన్నగా మాట ఇస్తున్నా. ఒకరికి న్యాయం చేస్తున్నామంటే.. మరొకరికి అన్యాయం చేస్తున్నట్టు కాదు. అన్యాయం చేయాలనే అభిప్రాయంగానీ, ఉద్దేశంగానీ వైఎస్సార్సీపీకి మరీ ముఖ్యంగా మీ జగనన్నకు ఏమాత్రం లేదు. నా రాజకీయ ప్రయాణం మొదలైన తరువాత ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకున్నారు. నా జీవితం చివరి వరకు కూడా వారిని అలానే గుండెల్లో పెట్టుకుంటా. వారికి ఇసుమంతైనా అన్యాయం చేయనని హామీ ఇస్తున్నా. వాయిస్ ఆఫ్ ది వాయిస్‌లెస్.. ఈ రెండు తీర్మానాలతో ఆ సామాజిక వర్గాలకు జరుగుతున్న అన్యాయాన్ని మనం సరిదిద్దినట్లు అవుతుంది. మనమంతా పాలకులం. మనం వాయిస్ ఆఫ్ ద వాయిస్‌లెస్ (గొంతులేని వారికి గొంతుకగా) ఉండాల్సిన అవసరం ఉంది. అలా చేయనప్పుడు మనం ఈ స్థానాల్లో ఉండటం కూడా వృథా అని నేను నమ్ముతున్నా. ఈ రెండు విషయాల్లో ఇంతకంటే మనం చేయగలిగేదేమీ లేదని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ అన్యాయానికి గురైన వారికి సాధ్యమైనంతవరకు మంచి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అందుకే వాల్మీకి, బోయ కులాలు, దళిత క్రైస్తవులకు న్యాయం చేసేందుకు ఈ చట్ట సభ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపుతున్నాం. దళిత క్రైస్తవుల సామాజిక, ఆర్థిక న్యాయం కోసమే ఎస్సీ హోదా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా నిరాకరించకూడదని రెండో తీర్మానం చేశాం. నాన్న (వైఎస్సార్) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలా తీర్మానం చేశారు. మళ్లీ ఈ రోజు చట్టసభలో ఇదే తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. ఈ విషయంపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. ఇందులో ఏపీ తరఫున ఇంప్లీడ్ అయ్యి మన వాదన వినిపిస్తున్నాం. ఎందుకు ఇంత గట్టిగా చెబుతున్నామంటే దళితులు ఇంతకు ముందు ఆచరిస్తున్న మతాన్ని విడిచి మరో మతంలోకి వెళ్లినంత మాత్రాన వారి సామాజిక, ఆర్థిక పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అందరికీ తెలుసు. మతం అన్నది నాలుగు గోడల మధ్య ఆ మనిషికి, దేవుడికి మధ్య ఉన్న సంబంధం. ఒక మనిషి మరో మతంలోకి వెళ్తే ఎవరికీ అన్యాయం జరగదు. కేవలం మత మార్పిడి వల్లే వీరికి రావాల్సిన ఎస్సీ హక్కులు రాకుండా పోవడం అన్యాయమని కచ్చితంగా నమ్ముతూ సభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిస్తున్నాం. -
ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం.. ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా
Updates: ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు. సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్లో నిధులు రైతన్నల పక్షపాత బడ్జెట్ గ్రామ స్వరాజ్య బడ్జెట్ ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్ ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్స్టాల్మెంట్లు, వైఎస్సార్ మత్యకార భరోసా జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత అక్టోబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన నవంబర్‌లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత డిసెంబర్లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత డిసెంబర్లో జగనన్న చేదోడు జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్ జనవరిలో వైఎస్సార్ ఆసరా జనవరిలో జగనన్న తోడు రెండో విడత జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000) ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత మార్చిలో ఎంఎస్ఎంఈ ప్రోత్సహకాలు సీఎం జగన్ ప్రసంగం మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి నవంబర్, 2019లో మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు చేసింది చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌తో కలిసి డీల్ చర్చించారు బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్ మనోజ్ దుబాయిలో సీబీఎన్‌కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం ►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది ►కోట్లలో అవినీతి జరిగింది ►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది ►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది ►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు ►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు ►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది ►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి ►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు ►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు ►బోగస్ ఇన్వాయిస్లతో నిధులు మళ్లించారు ►ఆర్వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు ►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది ►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు ►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు ►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి ►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి ►స్కిల్ స్కామ్‌లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు ►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు ►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత 03:17PM అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం ►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం ►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు ►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం ►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది ►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం ►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది ►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం ►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు ►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు ►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు ►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు ►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు Time: 03:10 PM ►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం ► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం ►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున ►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున ►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం ►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు ►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు. ►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం Time: 02:00 PM ►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున ►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్మెంట్ ►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం ►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు ►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు ►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం ►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం ►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం Time: 10:31 AM ►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు ►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం Time: 9:50 AM ►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం. ►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం ►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్. ►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు. ►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి. Time: 9:30 AM ►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు. ►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు. ►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. -
Polavaram Project: పూర్తి చేసేది మేమే
పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్య ప్రాజెక్టుగా నిర్మిస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ప్రాజెక్టు. దీనికోసం కేంద్రం నిధులిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వానిది పర్యవేక్షణ బాధ్యత. అయితే డబ్బులు రావడంలో ఆలస్యమవుతోందన్న కారణంతో పనులు ఆగిపోకూడదని భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ కోసం మన డబ్బులు రూ.2,600 కోట్లు ఇచ్చాం. అవి కేంద్రం నుంచి తెచ్చుకోవడం కోసం వాళ్ల చుట్టూ తిరుగుతున్నాం. ఈ వాస్తవాలను పట్టించుకోకుండా ఎల్లో మీడియా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తుందో, ఎవరెవరి హయాంలలో ప్రాజెక్టు కోసం ఏం చేశారో గమనించాలి. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును పూర్తి చేసేది మీ జగనే. ► సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ‘పోలవరం ప్రాజెక్ట్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం. పోలవరం అంటే వైఎస్సార్... వైఎస్సార్ అంటే పోలవరం. పోలవరం ప్రాజెక్టును ప్రారంభించింది నాన్నే.. పూర్తి చేసేది ఆయన కొడుకుగా నేనే. మీ జగనే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబుకు పోలవరం అంటే ఏమిటో తెలియదని, ఆ ప్రాజెక్ట్ పేరు పలకడమే రాదని, అటువంటి చంద్రబాబుకు అసలు పోలవరం ప్రాజెక్ట్ పేరు ఎత్తే అర్హతే లేదని విమర్శించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఏటీఎంగా వాడుకున్నారని సాక్షాత్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీనే నిర్వచించారని గుర్తు చేశారు. చంద్రబాబు, ఆయన గజ దొంగల ముఠా పోలవరం ప్రాజెక్టును పీల్చిపిప్పి చేసి యథేచ్ఛగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్ట్ అంశంపై శాసనసభలో గురువారం స్వల్ప కాలిక చర్చలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘పోలవరం ప్రాజెక్ట్‌పై ఎల్లో మీడియాలో ఇటీవల వచ్చిన కథనాన్ని చూశాం. అసలు పనులు చేసింది చంద్రబాబేనంటూ ఒక అభూత కల్పనతో కలరింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించారు. చంద్రబాబు తాను ప్రజలకు మంచి చేసీ ఇదిగో ఫలానా మంచి చేశాను అని చెప్పి రాజకీయాలు చేయరు. కేవలం ఒక ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు.. వీళ్ల మీద ఆధారపడి మాత్రమే చంద్రబాబు రాజకీయాలు చేస్తారు. ఒక అబద్ధాన్ని గొప్పగా వందసార్లు చెప్పించే చెప్పి అదే నిజమేనేమో అని భ్రమ కల్పించేలా గోబెల్స్ ప్రచారం చేయగల గొప్ప వ్యక్తి చంద్రబాబు. మాకున్న ఇబ్బంది, వాళ్లకున్న అనుకూలత ఇదే. అందులో భాగంగానే పోలవరం ప్రాజెక్ట్ పనులు చేసింది చంద్రబాబేనంటూ ఎల్లో మీడియాలో అభూత కల్పన సృష్టించేందుకు యత్నిస్తోంది. పోలవరం అనే పదం పలికే అర్హత చంద్రబాబుకు, తెలుగుదేశం పార్టీకి.. వీళ్లను మోస్తున్న ఈనాడు దినపత్రిక రామోజీరావుకు ఉందా అని నేను అడుగుతున్నాను’ అని అన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. పోలవరం వైఎస్సార్ డ్రీమ్ ప్రాజెక్టు ► 2004లో నాన్నగారు వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యాక పోలవరం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారు. అంత వరకు వీళ్లకు ఈ ప్రాజెక్టు గురించి తెలుసా? 2004కు ముందు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు ఏం వెలగబెట్టారు? చంద్రబాబు 1995లో మొట్టమొదటసారిగా ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2014 వరకు అంటే 19 ఏళ్ల పాటు కనీసం ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడారా? అప్పుడు రామోజీరావు, రాధాకృష్ణ, టీవీ5 ఏ గాడిదలు కాస్తున్నారు? వీళ్లంతా ఈరోజు పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు కట్టారని, ఉరుకులు, పరుకులు తీయించారని కలరింగ్ ఇస్తున్నారు. ► పోలవరం చంద్రబాబు ఒక్కరికే ఏటీఎం కాదు. చంద్రబాబుకు ఒక గజ దొంగల ముఠా ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అనే బ్యాచ్. ఈనాడు దినపత్రిక రామోజీరావు కొడుకు వియ్యంకుడుకి కూడా ఇది ఏటీఎం. నవయుగ అనే ఒక సంస్థ రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిలో పనులిచ్చారు. ఇంకా కొందరు ఉన్నారు. సుధాకర్ యాదవ్.. అప్పట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు. నామినేషన్ పద్ధతిలో పనులు తీసుకుని యథేచ్ఛగా దోచేశారు. వీళ్లు ఏ స్థాయిలో దోచారంటే చివరకి ప్రధాన మంత్రే పోలవరం ప్రాజెక్ట్ వాళ్ల ఏటీఎం అని నిర్వచించారు. నిధుల పారుదల మీదే టీడీపీ ధ్యాస ► వీళ్లు ఏ స్ధాయిలో దోచేశారు అన్నదానికి చిన్న ఉదాహరణ.. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ చేశాం. పనులు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా కేటాయించాం. ఆ విధానంలో ఒక్క పోలవరం ప్రాజెక్ట్‌లోనే ఖజానాకు రూ.800 కోట్లు ఆదా అయింది. టీడీపీ ప్రభుత్వంలో పోలవరం పేరు చెబితే వారి జేబుల్లోకి నిధులు పారేవి. ఆ నిధులు లెక్కలు చూసుకునేందుకు ఈ పెద్దమనిషి చంద్రబాబు ప్రతి సోమవారం పోలవరం వెళ్లేవారు. ► ఒక్కో ప్రాజెక్టు కట్టడానికి ఒక్కో పద్ధతి ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం పనులు చేసుకుంటూ వెళ్తే.. అనుకున్న వ్యవధిలో ప్రాజెక్టు సంపూర్ణంగా పూర్తై ఫలితాలు ఇస్తుంది. అప్పట్లో వాళ్ల దృష్టంతా నిధుల పారుదల మీదే. పోలవరం ప్రాజెక్టును పీల్చి పిప్పి చేసి డబ్బులు ఎలా తీసుకోవాలన్నదానిపైనే వాళ్ల ధ్యాసంతా. అందుకే ఎక్కువ డబ్బులొచ్చే పనులు ముందు.. తక్కువ డబ్బులొచ్చే పనులు తర్వాత చేస్తూ వెళ్లారు. ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ డిజైన్. ► పోలవరంలో గోదావరి దాదాపుగా 2,400 మీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ ప్రవాహాన్ని మళ్లించి డ్యామ్ నిర్మించాలి. ఇలా నీళ్లు మళ్లించాలంటే ముందుగా స్పిల్ వే నిర్మించాలి. స్పిల్ వే మీదుగా గోదావరి నదిని మళ్లించిన తర్వాతే ఈ 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి ప్రవాహంలో మొదటి కాఫర్ డ్యామ్ కట్టాలి. ఆ తర్వాత దిగువ నుంచి నీళ్లు రాకుండా రెండో కాఫర్ డ్యాం నిర్మించాలి. ఇలా కట్టడం ద్వారా మధ్యలో నీళ్లు రాకుండా చేసిన తర్వాత ఎర్త్ కమ్ ర్యాక్ ఫిల్ డ్యాం నిర్మించాలి. అంటే ప్రధాన డ్యామ్ నిర్మించాలి. ఇదీ పద్దతి. చంద్రబాబు హయాంలో అసంపూర్ణంగా పనులు ► చంద్రబాబు ప్రభుత్వం స్పిల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసింది. పునాదులు తర్వాత గేట్లు పెట్టడం వంటివన్నీ అసంపూర్ణంగా వదిలేశారు. మరోవైపు 2,400 మీటర్ల వెడల్పు ఉన్న గోదావరి నదీ ప్రవాహంలో ఏకంగా ఒకవైపు మొదటి కాఫర్ డ్యామ్, ఇంకోవైపు రెండో కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టారు. ► కాఫర్ డ్యామ్ పూర్తయితేగానీ నీళ్లు రాలేని పరిస్థితి. అలాంటప్పుడు నీళ్లు ఇంకోవైపు డైవర్ట్ చేసే స్పిల్‌వే పని అవ్వకుండా కాఫర్ డ్యామ్ ఎలా పూర్తి చేస్తారు? అప్పుడు 2,400 మీటర్ల వెడల్పున ప్రవాహం ఎలా వెళ్తుంది? స్పిల్ వే పూర్తి కాలేదు. అఫ్రోచ్ ఛానెల్ పనులు జరగలేదు. స్పిల్ ఛానెల్ పనులు జరగలేదు. ఇలాంటప్పుడు నీళ్లు ఎలా మళ్లిస్తారు? ► కాబట్టి కాఫర్ డ్యామ్ పనులు కూడా ఆగిపోయాయి. కారణం సీజన్ వచ్చిందంటే గోదావరి నదిలో నీళ్లు వదిలేయాలి. మరో ఆప్షన్ లేదు. మెయిన్ లైన్లోంచే నీళ్లు వదలాలి. 2,400 మీటర్ల స్థానంలో 1,600 మీటర్ల మేర కాఫర్ డ్యామ్ కట్టి రెండు గ్యాప్‌లు నాలుగు వందలు మీటర్లు చొప్పున వదిలారు. అప్పుడు నీళ్లు ఉధృతంగా వచ్చే చోట కేవలం రెండు గ్యాపుల్లో నుంచి ప్రవహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో డయాఫ్రమ్ వాల్‌ను దెబ్బ తీసింది. కాఫర్ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు పడ్డాయి. ► బుద్ధి ఉన్న వారెవరైనా.. స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యామ్ పనులు ఎలా ముట్టుకున్నారని గడ్డి పెట్టాల్సింది. కానీ అలా చేయలేదు. కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండా డయాఫ్రమ్ వాల్ అంటే మెయిన్ డ్యామ్‌కు పునాది గోడ వేశారు. ఇలా ఎందుకు కట్టారు.. బుద్దుందా అని రెండో ప్రశ్న అడగాలి. ► మనం అధికారంలోకి వచ్చాక 2020లో గోదావరిలో ఎప్పుడూ ఊహకందని విధంగా వరద వచ్చింది. గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద. స్పిల్ వే మీదుగా నీళ్లు మళ్లించలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు స్పిల్‌వేలో పియర్స్ పౌండేషన్, గేట్లు పెట్టే పనులు జరుగుతున్నాయి. నీళ్లు అటువైపు మళ్లించడం సాధ్యం కాలేదు. రెండో వైపున చిన్న చిన్న గ్యాపుల్లోంచి నీళ్లు రావాలి. దాంతో కోతకు గురైంది. 12–18 నెలల్లో ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం ► మనం అధికారంలోకి వచ్చాక వీటన్నింటినీ రిపేరు చేస్తూ అడుగులు ముందుకు వేశాం. అఫ్రోచ్ ఛానెల్ మీదుగా స్పిల్ ఛానెల్‌ను, స్పిల్ ఛానెల్ దిగువన పైలెట్ ఛానెల్‌ను పూర్తిగా నిర్మించాం. ఈ రోజు స్పిల్‌వే అన్ని రకాలుగా పూర్తైంది. నీళ్లు కూడా స్పిల్ వే మీదుగా వస్తున్నాయి. 48 గేట్లు పెట్టాం. అందువల్లే గోదావరి వందేళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరద వచ్చినా సమర్థవంతంగా స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగాం. ► ఎగువ కాఫర్ డ్యామ్‌ను గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసింది. ఆ రెండు ఖాళీలను కూడా పూర్తి చేశాం. జరిగన నష్టాన్ని ఇసుక వేసి వైబ్రో కంపాక్షన్ చేసి.. అన్ని రకాలుగా ఎగువ కాఫర్ డ్యామ్ పూర్తి చేశాం. మెయిన్ డ్యామ్‌లో భాగమైన గ్యాప్ 3 వద్ద కాంక్రీటు పనులు పూర్తి చేశాం. ► 2021 జూన్ 11న గోదావరి వరద ప్రవాహాన్ని స్పిల్‌వే మీదుగా మళ్లించాం. అనూహ్య వరదల కారణంగా కాఫర్ డ్యామ్ దెబ్బతినకుండా అప్పటికప్పుడు ఒక మీటరు ఎత్తు కూడా పెంచగలిగాం. దిగువ కాఫర్ డ్యామ్‌లో కోతకు గురైన ప్రదేశాన్ని కూడా పూడ్చాం. పనుల సీజన్ మొదలు కాగానే ఎంత వేగంగా పనిచేయాలో అంతవేగంగా పని చేశాం. ► ఇప్పటికి పోలవరం నిర్మాణంలో స్పిల్ వే పూర్తయింది. డెడ్‌స్టోరేజీ ద్వారా, రివర్స్సూస్ ద్వారా గోదావరి డెల్టాకు నీరిచ్చే పరిస్థితి ఉంది. ఈ మధ్య కాలంలోనే ఎన్‌హెచ్‌పీసీ వాళ్లు డిజైన్స్ క్లియరెన్స్ కూడా ఇచ్చారు కాబట్టి ఈ సీజన్లో పనులు వేగంగా పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. ► వర్షాకాలం వచ్చినా మెయిన్ డ్యామ్ నిర్మిస్తున్నాం. 2022 నవంబర్‌లో తిరిగి దిగువ కాఫర్ డ్యామ్ పనులు మొదలుపెట్టాం. 2023 ఫిబ్రవరి 14 నాటికి దిగువ కాఫర్ డ్యామ్ పనులను విజయవంతంగా పూర్తి చేశాం. ఎన్‌హెచ్‌పీసీ వారి ద్వారా డయాఫ్రం వాల్ టెస్టులు చేసి, ఆ రిపోర్టులను సీడబ్ల్యూసికి, డ్యామ్ డిజైన్ రివ్యూ ఫ్యానెల్‌కు పంపించాం. వాళ్లు ఈ ఏడాది మార్చి 3, 4 తేదీల్లో ప్రాజెక్టును సందర్శించి సమావేశం నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్న ప్రదేశాలలో సమాంతరంగా డయాఫ్రం వాల్ కట్టాలని నిర్ణయించాం. అ పనులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. మరో 12 నెలల నుంచి 18 నెలల వ్యవధిలో ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేసేలా కార్యాచరణ వేగవంతం చేశాం. పోలవరం కోసమే ప్రధానితో సమావేశం ► సాంకేతికంగా అన్ని రకాల అనుమతులు లభించినందున ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తాం. అందుకు అవసరమైన కేంద్ర ప్రభుత్వం సహకారం కోరేందుకే నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశాను. ప్రధానికి వివరించిన అజెండాలో ఈ పాయింట్ కూడా ఉంది. ఈ ప్రాజెక్టు రూ.55,656.87 కోట్లకు సవరించిన అంచనాలను కేంద్ర కేబినెట్ ఆమోదించాలి. అందుకు సమయం పడుతుంది కాబట్టే అడ్హాక్ గ్రాంట్ కింద రూ.15 వేల కోట్లు కేటాయించమని ప్రధానిని కోరాం. ► సవరించిన అంచనాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినప్పుడు ఆ మేరకు సర్దుబాటు చేసుకోవచ్చని చెప్పాం. ఈ రూ.15 వేల కోట్లు పూర్తిగా డ్యామ్ ఎత్తు 45.7 మీటర్ల వరకు నిర్మించడానికి సరిపోతుంది. దాంతో పాటు 41.15 మీటర్ల వరకు పూర్తిగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస ప్యాకేజీకి కూడా సరిపోతుంది. ► తర్వాత కనీసం మూడేళ్లలో దశల వారీగా డ్యామ్‌లో నీటిని నింపుకుంటూ పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి వస్తుంది. అందులో ఎలాంటి తప్పూ లేదు. కావాలనే కొందరు సృష్టిస్తున్న అపోహలను నమ్మొద్దు. కేంద్ర ప్రభుత్వానికి కూడా చెబుతున్నాం. భూసేకరణ, పునరావాస ప్యాకేజీకి మేం వివరాలు ఇస్తాం.. మీరే డీబీటీ బటన్ నొక్కి వారి ఖాతాల్లో డబ్బులు వేయండి.. వారికి పరిహారం చెల్లించండి అని చెప్పాం. అంతా పద్ధతి ప్రకారం జరుగుతోంది. కొందరు ఉన్నవి లేనట్టుగా ఇష్టం వచ్చినట్లు మాట్లాడ్డం సరికాదు. 45.7 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తాం ► ప్రజల్లో అపోహలు సృష్టించేందుకే డ్యామ్ ఎత్తు తగ్గిస్తున్నామని మాటి మాటికి దుష్ప్రచారం చేస్తున్నారు. 41.15 మీటర్ల ఎత్తుకే కడుతున్నారని చంద్రబాబు, ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లంతా ఒక పద్ధతి ప్రకారం దుష్ప్రచారం చేస్తున్నారు. ప్రజలందరికీ ఒక విషయం స్పష్టంగా చెబుతున్నాను. డ్యామ్ పూర్తి ఎత్తు మేరకు అంటే 45.7 మీటర్లకు నిర్మిస్తాం. ► డ్యామ్ భద్రత కోసం సీడబ్లూసీ నిబంధనలను అనుసరించి ఒకేసారి డ్యామ్ అంతా నింపకూడదు. సీడబ్ల్యూసీ గైడ్ లైన్స్ ప్రకారం నిల్వ సామర్థ్యంలో మొదటి ఏడాది 1/3వ వంతు,, రెండవ ఏడాది 2/3వ వంతు, మూడవ ఏడాది గరిష్ట స్థాయిలో నీటిని నిల్వ చేయాలి. ► తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించి డ్యామ్‌లో నీటిని నిల్వ చేస్తాం. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం సర్దుబాటు చేయడానికి రెండేళ్ల వ్యవధి ఉంటుంది. కేంద్రం నిధులు ఇవ్వగానే ఆ తర్వాత రెండేళ్లలో నిర్వాసితులకు పునరావాసం కల్పించి పూర్తి స్థాయిలో.. అంటే 194.6 టీఎంసీలను నిల్వ చేస్తాం. అప్పుడు నిర్వాసితుల పునరావాస ప్యాకేజీ ఇవ్వడానికి కూడా వాళ్లకు సమయం వెసులుబాటు కూడా ఉంటుంది. ► నిర్వాసితులకు మరింత మేలు చేసేందుకు ప్రతి ముంపు కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నాం. ఆ హామీ ప్రకారం కేబినెట్లో తీర్మానం చేసి జీవో కూడా ఇచ్చాం. 41.15 మీటర్లు వచ్చే లోపు అదనంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరో రూ.550 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మేం సిద్ధంగా ఉన్నాం. -
అందుకే ప్రధానిని కలిశా: ఏపీ సీఎం జగన్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కోసమే తాను ప్రధానిని కలిశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పోలవరంపై జరిగిన చర్చలో గురువారం ఆయన ప్రసంగించారు. టీడీపీ హయాంలో పోలవరం పనులు.. అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగాయి. ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పద్ధతి ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు కోసమే ప్రధానిని కలిశా. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సహాయం కోసమే చర్చించా. తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను అని సీఎం జగన్ అసెంబ్లీ ద్వారా తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. డ్యామ్ ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యాం నిర్మాణం జరుగుతుంది. సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు తొలి దశలో 41.15 మీటర్లవరకు కడతాం అని పేర్కొన్నారాయన. పోలవరంలో ప్రతీ ముంపు కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి తీరతామని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు. అత్యంత ప్రాధాన్యతగా పోలవరం నిర్మాణం చేపడుతున్నామని, పోలవరం పూర్తి చేసేది ముమ్మాటికీ జగనేనని, యెల్లో మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మొద్దని మరోసారి కోరారు సీఎం జగన్. ఇదీ చదవండి: పోలవరం పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదు -
పోలవరం పూర్తి చేసేది నేనే: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైన రాలేదని, ప్రాజెక్టు కోసం ఆయన చేసింది ఏమీ లేదని, అసలు పోలవరం అనే పేరు పలికే అర్హత బాబుకు లేదని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. గురువారం పోలవరంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను. అవన్నీ అసత్య కథనాలు. పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ అభూత కల్పనలతో ఎల్లో మీడియా వార్తలు రాసింది. గోబెల్స్ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు. అసలు పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? అని సీఎం జగన్ అసెంబ్లీ సాక్షిగా నిలదీశారు. సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు?. 1995 నుంచి 2014 వరకు చంద్రబాబు నోటి వెంట పోలవరం అనే పేరు ఒక్కసారైనా రాలేదు. పైగా టీడీపీ హయాంలో పోలవరం నిధులను యథేచ్చగా దోచేశారు. టీడీపీ హయాంలో ఎక్కువగా డబ్బు వచ్చే పనులను ముందు చేశారు. తక్కువ డబ్బులు వచ్చే పనుల్ని తర్వాత చేపట్టారు. స్పిల్ వే పనుల్ని అసంపూర్ణంగా పునాదుల స్థాయిలోనే వదిలేసి.. కాఫర్ డ్యాం పనుల్ని మొదలుపెట్టారు. కాఫర్ డ్యామ్‌లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయి. అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదు. అసలు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాం పనుల్ని ఎలా పూర్తి చేస్తారు?. అసలు బుద్ధి ఉన్నవాళ్లెవరైనా ఇలా చేస్తారా?. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని సీఎం జగన్ గుర్తు చేశారు. ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ విధానం.వాళ్ల ధ్యాస అంతా డబ్బు స్వాహా పైనే పెట్టారు. చంద్రబాబుకు పోలవరం ఏటీఎం అని స్వయంగా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా సరే యెల్లో మీడియా పనులు ఆయనే చేశారంటూ తప్పుడు కథనాలు రాస్తోంది. వాటిని ఎవరూ నమ్మొద్దు. టీడీపీ హయాంలో పోలవరం నిర్మాణం ఒక్క అడుగైనా జరిగిందా? అని ప్రశ్నించారాయన. చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదని సీఎం జగన్ స్పష్టం చేశారు. పోలవరం కలల ప్రాజెక్టు అని దివంగత మహానేత వైఎస్ఆర్ చెప్పారు. పోలవరాన్ని ప్రారంభించింది మా నాన్నే వైఎస్ఆరే.. పూర్తి చేసేది ఆయన కుమారుడైన నేనే(సీఎం జగన్ తనను తాను ఉద్దేశిస్తూ..) అని ఉద్ఘాటించారు సీఎం జగన్. అసలు పోలవరం అంటే వైఎస్ఆర్.. వైఎస్ఆర్ అంటే పోలవరం అని పేర్కొన్నారాయన. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేశామని తెలిపిన సీఎం జగన్.. తమ ప్రభుత్వ హయాంలో ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యిందని తెలిపారాయన. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉందని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. స్పిల్‌వే పూర్తి చేసి 48 గేట్లు పూర్తి చేశాం. ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేశాం. గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా.. స్పిల్‌వే ద్వారా వరదను నియంత్రించగలిగామని అసెంబ్లీలో ఆయన స్పష్టం చేశారు. -
‘పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది’
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్ట్‌పై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రాజెక్ట్ నిర్మాణంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవలం పూర్తి అయితే ఏపీకి అనేక లాభాలు ఉన్నాయన్నారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ.. పోలవరానికి మొదట్లో శ్రీరామపాద సాగర్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత పోలవరం ప్రాజెక్ట్‌గా మార్చారు. పోలవరం నిండితే శ్రీశైలం నుంచి రాయలసీమకు నీరందిచే అవకాశం ఉంటుంది. ఇరిగేషన్ సస్యశ్యామలం చేయాలని ఆనాడు భావించి మహానేత వైఎస్సార్ జలయజ్ఞం ప్రారంభించారు. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడంతోపాటు మహానేత వైఎస్సార్ అన్ని అనుమతులు తీసుకువచ్చారు. గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చినా వైఎస్సార్ మాత్రమే పోలవరంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇరిగేషన్‌ను సస్యశ్యామలం చేయాలని జలయజ్ఞం తీసుకువచ్చారు. పోలవరం ప్రతీ నీటి బొట్టుపై వైఎస్సార్ అని ఉంటుంది. పోలవరం పూర్తి చేసేది మేమే. మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది. ఇది దైవ నిర్ణయం. మా ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్మాణానికి సంబంధించిన రూ. 2,600 కోట్ల పెండింగ్ నిధులు కేంద్రం నుంచి రావాలి అని స్పష్టం చేశారు. పోలవరం చంద్రబాబు ఏటీఎం.. ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు. విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్‌గా ప్రకటించారు. పోలవరానికి అయ్యే ప్రతీ పైసాను కేంద్రమే భరిస్తుంది అని అన్నారు. జాతీయ ప్రాజెక్ట్ అయినా మేమే కడతాం అని చంద్రబాబు అన్నారు. కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్ట్‌ను చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు?. 2013, 2014 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది. అందుకు చంద్రబాబుకు కూడా అంగీకరించారు. తర్వాత పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే అన్నారు. చంద్రబాబు హయాంలో 48 శాతం మాత్రమే ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. పోలవరాన్ని తామే నిర్మాస్తామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి. టీడీపీ హయాంలో దోచుకో.. పంచుకో.. తినుకో అన్న పద్దతిలో పోలవరం నిధులను చంద్రబాబు కాజేశారు. రామోజీ బంధువుదే నవయుగ.. రామోజీకి అత్యంత సమీప బంధువులదే నవయుగ కంపెనీ. అలాంటి నవయుగ కంపెనీకి పోలవరం కాంట్రాక్ట్ ఇచ్చారు. చంద్రబాబుకు డబ్బులు కావాల్సినప్పుడల్లా పోలవరం నిధులను వాడుకున్నారు. టీడీపీ హయాంలో డయాఫ్రం వాల్ నిర్మాణం కాకుండానే కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టారు. టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్లే గత వరదల్లో తీవ్ర నష్టం జరిగింది. మీరు నాశనం చేసిన డయాఫ్రం వాల్‌ను మేము కట్టాము. టీడీపీ తప్పిదం వల్ల రూ.2022 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: లోకేష్ యాత్రలో డబ్బుల గోల.. సోషల్ మీడియాలో వైరల్ -
పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం: సీఎం జగన్
Updates: 03:45PM అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంగా సీఎం జగన్ ప్రసంగం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని పనులు పూర్తి చేస్తాం గోదావరిలో భారీ స్థాయిలో వరద వచ్చినా స్పిల్ వే ద్వారా వరదను నియంత్రిచగలిగాం పోలవరం పనులన్నీ ఓ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి స్పిల్ వే పూర్తి చేసి 48 గేట్లు ఏర్పాటు చేశాం ఎగువ, దిగువ కాఫర్ డ్యాంలు పూర్తి చేశాం ఎల్లో మీడియా తప్పుడు కథనాలు నమ్మొద్దు 45. 7 మీటర్ల ఎత్తు వరకూ డ్యాం నిర్మాణం జరుగుతుంది సీడబ్యూసీ సిఫారసుల మేరకు తొలిదశలోనే 41.15 మీ వరకూ కడతాం పోలవరం ప్రాజెక్ట్ కోసమే ప్రధానిని కలిశా తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను పోలవరం అంటే వైఎస్సార్.. వైఎస్సార్ అంటే పోలవరం పోలవరం ప్రారంభించింది మా నాన్నే.. పూర్తి చేసేది ఆయన కుమారుడే 1995 నుంచి 2014 వరకూ చంద్రబాబు నోటివెంట పోలవరం పేరు ఒక్కసారైనా రాలేదు టీడీపీ హయాంలో పోలవరం ఒక్క అడుగైనా ముందుకు వెళ్లలేదు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు ఏం చేశారు చంద్రబాబు, దత్తపుత్రుడు సహా ఎల్లో మీడియాకు పోలవరం పేరు పలికే అర్హత లేదు పోలవరంపై ఎల్లో మీడియాలో కథనాలు చూశాను గోబెల్స్ ప్రచారం చేయడంలో బాబు సిద్ధహస్తుడు పోలవరంపై ఎల్లో మీడియా అసత్య కథనాలు పోలవరం పనులు చంద్రబాబే చేశారంటూ ఎల్లో మీడియా అభూత కల్పనలతో వార్తలు రాసింది పోలవరం అనే పదాన్ని పలికే అర్హత బాబుకు ఉందా? టీడీపీ ద్యాస అంతా డబ్బు స్వాహాపైనే పెట్టింది టీడీపీ హయాంలో పోలవరం నిధులు యధేచ్చగా దోచేశారు పోలవరం కలల ప్రాజెక్టు అని వైఎస్సార్ చెప్పారు చంద్రబాబుకు పోలవరం ఏటీఏం అని ప్రధానే అన్నారు టీడీపీ హయాంలో ఎక్కువ డబ్బు వచ్చే పనులు ముందు చేశారు తక్కువ డబ్బు వచ్చే పనులు తర్వాత చేపట్టారు ఇదీ టీడీపీ పోలవరం ఇంజనీరింగ్ విధానం టీడీపీ హయాంలో స్పిల్ వే పనులను పునాదుల స్థాయిలోనే వదిలేసి కాఫర్ డ్యాం పనులు మొదలు పెట్టారు స్పిల్ వే పూర్తి కాకుండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు స్పిల్ వే పనులు అసంపూర్ణంగా వదిలేశారు అప్రోచ్ చానల్ పనులు కూడా జరగలేదు స్పిల్ వే పూర్తి కాకండా కాఫర్ డ్యాంలు ఎలా పూర్తి చేస్తారు టీడీపీ అనాలోచిత నిర్ణయం వల్ల డయా ఫ్రం వాల్ దెబ్బతింది బుద్ధి ఉన్న వారెవరైనా ఇలా చేస్తారా తమ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 800 కోట్లు ఆదా చేసింది ఇప్పటికే స్పిల్ వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది మంత్రి అంబటి రాంబాబు ప్రసంగం ప్రచారం కోసం పోలవరాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి చంద్రబాబు జాతీయ ప్రాజెక్టు అయినా మేము కడతా అని చంద్రబాబు అన్నారు 2013-14 ధరల ప్రకారమే పోలవరానికి నిధులు ఇస్తామని కేంద్రం చెప్పింది అందుకు చంద్రబాబు కూడా అంగీకరించారు పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని ప్రధానే అన్నారు విభజన తర్వాత పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు పోలవరానికి అయ్యే ప్రతిపైసాను కేంద్రమే భరిస్తుంది అన్నారు కేంద్రం నిర్మించాల్సిన ప్రాజెక్టును చంద్రబాబు ఎందుకు తీసుకున్నారు తామే కడతామని ఎందుకు అన్నారో సమాధానం చెప్పాలి మా హయాంలోనే పోలవరం పూర్తి అవుతుంది పోలవరం పూర్తి చేసేది మేమే ►ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు(గురువారం) పోలవరం ప్రాజెక్టుపై స్వల్ప కాలిక చర్చ చేపట్టారు. దీపిలో భాగంగా పోలవరం ప్రాజెక్టును టీడీపీ నిర్లక్ష్యం చేసిందని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జయము జయము చంద్రన్న పాటను ధనలక్ష్మీ ప్రస్తావించారు. ఆ పాటకు ఆస్కార్ ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు ఎమ్మెల్యే ధనలక్ష్మీ. శాసనమండలి: సామాన్యుడికి అన్ని రకాలుగా సహకరించాలనేదే ప్రభుత్వ పాలసీ అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. వెల్ఫేర్ వద్దు అని ప్రతిపక్షాలు చెప్పగలవా? గ్రోత్‌లో టాప్-5 రాష్ట్రాల్లో ఏపీ ఉంది. లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నాం. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. విద్య, వైద్య రంగంలో కీలక సంస్కరణలు తీసుకువచ్చాం. 13 వేల గ్రామ పంచాయతీల్లో వైఎస్సార్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం’’ అని మంత్రి అన్నారు. ►మన ప్రభుత్వ విధానాలపై పొరుగు రాష్ట్రాలు ఆసక్తికరంగా ఉన్నాయని ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. ►విత్తనం నుంచి విక్రయం దాకా అండగా ఆర్మీకేలు ఉన్నాయని ఎమ్మెల్యే జోగారావు అన్నారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపారన్నారు. రైతులకు అండగా నిలుస్తున్నాం: మంత్రి కాకాణి ►రైతులకు అండగా నిలిచేలా సీఎం జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. పంటనష్టం జరిగితే సీజన్ ముగిసేలోపే పరిహారం అందజేస్తున్నామన్నారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా వైఎస్సార్ ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. సీఎం జగన్ ఏపీ అభివృద్ధికి పునాది వేస్తున్నారు: కిలారి రోశయ్య ►సీఎం జగన్ రాష్ట్ర అభివృద్ధికి పునాది వేస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. రైతులకు గ్రామీణ స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రతిపంటకు గిట్టుబాటు ధర లభిస్తోందన్నారు ఆ ఘనత సీఎం జగన్‌దే: మంత్రి మేరుగ నాగార్జున ►పేద పిల్లలకు ఇంగ్లీష్ చదువులు చెప్పిస్తున్న ఘనత సీఎం జగన్‌దేనని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తున్న మనస్సున సీఎం వైఎస్ జగన్ అని ఆయన అన్నారు. ►భావితరాల గుండెల్లో సీఎం జగన్ నిలిచిపోతారు: మంత్రి ఆదిమూలపు సురేష్ ►ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నోత్తరాలతో ప్రారంభమయ్యాయి. సభలో పలు బిల్లులు, పలు శాఖల డిమాండ్లకు సభ్యులు ఆమోదం తెలపనున్నారు. పోలవరం ప్రాజెక్టుపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. -
టీడీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలి: మంత్రి రోజా
సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులు చేసిన తప్పును సమర్ధించుకోవడానికి మా పార్టీ నేతలపై నిందలు వేయడం సిగ్గుచేటు. వాళ్లకు ఎమ్మెల్సీ వస్తే ఏమీ జరిగిపోదు అంటూ కామెంట్స్ చేశారు. కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు. అయినా ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. వారి సంబరాలు చేసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అహంకారంతో అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం. బీసీ అయిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు కరెక్ట్?. వారు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గుచేటు. జీవో నంబర్-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్-1 తీసుకొచ్చాం. జీవో నంబర్-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. 2024లో సీఎం జగనన్న వన్స్ మోర్ అని ప్రజలే అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు. ఇది కూడా చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ -
సీఎం జగన్‌ను కలిసిన వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని శాసనసభలోని ఆయన కార్యాలయంలో సోమవారం వైఎస్సార్సీపీ దళిత ఎమ్మెల్యేలు కలిశారు. శాసనసభలో పార్టీ ఎమ్మెల్యే టి.జె.ఆర్.సుధాకర్‌బాబుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే దాడిచేసిన ఘటనను ముఖ్యమంత్రికి వివరించారు. టీడీపీ ఎమ్మెల్యే దాడిలో సుధాకర్‌బాబు మోచేతికి అయిన గాయం చూపించారు. సీఎంను కలిసిన వారిలో ఉప ముఖ్యమంత్రి కె.నారాయణస్వామి, హోంశాఖ మంత్రి తానేటి వనిత, రవాణాశాఖ మంత్రి పినిపే విశ్వరూప్, ఎమ్మెల్యేలు మేకతోటి సుచరిత, అలజంగి జోగారావు, కిలివేటి సంజీవయ్య, వి.ఆర్.ఎలీజ, తిప్పేస్వామి, కంబాల జోగులు, వరప్రసాద్, కొండేటి చిట్టిబాబు, ఆర్థర్, తలారి వెంకట్రావు, రక్షణనిధి తదితరులున్నారు. చదవండి: స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే' -
టీడీపీ ‘సామాజిక’ చిచ్చు
సాక్షి, అమరావతి: సామాజికవర్గాల మధ్య చిచ్చుపెట్టేలా టీడీపీ సభ్యులు సభలో ప్రవర్తిస్తున్నారని శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం విమర్శించారు. వాయిదా తీర్మానానికి ఆర్డర్లో రావాలని చెప్పినా వినిపించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. గౌరవం ఇవ్వలేని ప్రతిపక్షం ఉన్న సభలో సభాపతిగా ఉండటం బాధగా ఉందన్నారు. తన విధులను త్రికరణశుద్ధిగా నిర్వర్తించాలనే ఆలోచనతో సభను నడిపిస్తున్నట్లు చెప్పారు. తనకు పార్టీలపైనా, ఏ ఒక్క సభ్యుడిపైనా ప్రత్యేక అభిమానం లేదన్నారు. కానీ, టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనను ఇన్నాళ్లూ మౌనంగా సహించానన్నారు. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం అసెంబ్లీలో చోటుచేసుకున్న ఘటనలపై స్పీకర్ స్పందిస్తూ.. ‘సభాపతి స్థానానికి కొన్ని పద్ధతులుంటాయి. వాటిని పట్టించుకోకుండా టీడీపీ సభ్యులు పోడియంపైకి వచ్చి నినాదాలు చేస్తారు. చైర్‌ను చుట్టుముట్టి గుద్దుతారు. నా ముఖంపై వేళ్లు చూపిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. డోలా బాలవీరాంజనేయస్వామి ప్రవర్తించిన తీరు హేయంగా ఉంది. అచ్చెన్నాయుడు అయితే ఎత్తుగా ఉండటంతో కింద నుంచే సభ కనిపించకుండా నా ముఖానికి ఎదురుగా ప్లకార్డు అడ్డుపెడతారు. రామకృష్ణబాబు స్టీరియో కామెంట్లు చేస్తారు. అయినా మౌనంగానే భరించాను.. సహించాను. ఎమ్మెల్యే ఏలిజా (వైఎస్సార్సీపీ) వచ్చి మా హక్కులు రక్షించాలని కోరుతుంటే.. టీడీపీ సభ్యుడు నా ముఖానికి అడ్డుగా పెట్టిన ప్లకార్డును పక్కకు జరిపాను. అది కింద పడిపోయింది. అంతే.. వెంటనే స్పీకర్ కొట్టేశారంటూ గోలచేశారు. ఇలా చేయమని మీకు ఎవరు చెప్పి పంపిస్తున్నారు? ఇది మంచి సంస్కారం కాదు’.. అని టీడీపీ సభ్యులకు తమ్మినేని హితవు పలికారు. విలువైన సభా సమయం వృథా.. ఇక సభలో సభ్యులందరికీ సమాన హక్కులు ఉంటాయని స్పీకర్ స్పష్టంచేశారు. ఇది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు సభా సమయాన్ని, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు మైక్ ఇస్తుంటే సభను తప్పుదారి పట్టిస్తున్నారని.. సభ జరుగుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని.. కచ్చితంగా సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నారు. ఆర్డర్ ప్రకారమే సభను నడిపిస్తాం నిజానికి.. సభలో వాయిదా తీర్మానం అనేది ప్రశ్నోత్తరాల తర్వాత వస్తుందని స్పీకర్ చెప్పారు. గత ప్రభుత్వంలో 5–3–2016న అప్పటి సభలోనూ ఇదే చెప్పారన్నారు. ‘టీడీపీ వాళ్లు చెప్పింది వాళ్లకే గుర్తులేకపోవడం దురదృష్టకరం. ప్రొసీడింగ్ చదవకుండా సభలో గందరగోళం సృష్టించి, అగౌరవపరచడం దారుణం. ప్రశ్నోత్తరాలు జరుగుతుంటే.. అచ్చెన్నాయుడు వాయిదా తీర్మానమిచ్చి ‘మీరు ఇప్పుడే చదవాలి’ అంటారు. ఇదా సీనియారిటీ? సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసి తొలిసారిగా గవర్నరుగా వచ్చిన వ్యక్తి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించిన రోజు నుంచి ఇప్పటివరకు విపక్ష సభ్యుల ప్రవర్తన, అసభ్య పదజాలాన్ని అందరూ చూస్తున్నారు. జాతీయ మీడియా సైతం అటెన్షన్ చేసేలా గవర్నర్ రాకను కూడా తప్పుపట్టారు. గవర్నర్ రావడం కూడా టెబుల్ అజెండానా? దీనిని బీఏసీలో పెట్టాలనడం ఏమిటి? ఇది గవర్నర్ ఆఫీసు, అసెంబ్లీ సెక్రటేరియట్ మధ్య ఉండాల్సింది. కనీసం అది తెలుసుకోకుండా టీడీపీ సభ్యులు మాట్లాడటం శోచనీయం. ఏ శాసనసభలోనూ ఎవరూ టీడీపీ సభ్యుల్లా ప్రవర్తించి ఉండరు’.. అని స్పీకర్ అన్నారు. అది బీసీలకు ఇచ్చిన గౌరవం ‘సీఎం జగన్ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ.. నా మైనార్టీలు అని ధైర్యంగా చెప్పుకోగలిగిన గొప్ప నాయకుడు. నన్ను సభాపతిగా చేశారంటే.. సీఎం బలహీనవర్గాలకు ఇచ్చిన గౌరవం అది. ఇప్పుడు టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవడానికి పెద్ద సమయం పట్టదు. కానీ, వాళ్లు కూడా సభకు రావాలి. ప్రజా సమస్యలపై చర్చించాలి. ఇదే నా అభిమతం’.. అని స్పీకర్ అన్నారు. ఎర్రగీత దాటితే ఆటోమేటిగ్గా సస్పెన్షన్ ‘అసెంబ్లీ గౌరవాన్ని పెంచేలా ఎందరో మహానుభావులు స్పీకర్‌గా సేవలందించారు. వ్యక్తి ఎవరన్నది ముఖ్యం కాదు. సభాపతి స్థానంలో ఎవరున్నా గౌరవించాలి. సభ్యులు నిరసన వ్యక్తంచేయడంలో అభ్యంతరంలేదు. కానీ, టీడీపీ సభ్యులకు సభాపతి స్థానం, సభావిలువలపై గౌరం లేదు. టీడీపీ సభ్యుల తీరు గర్హనీయం. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అందుకే సభ్యులు కారణం లేకుండా సభలో నినాదాలు చేయడం, చైర్ వద్దకు రావడం, వెల్‌లో బైఠాయించడం చేస్తే ఆటోమేటిగ్గా సస్పెండ్ అయ్యేలా రూలింగ్ ఇస్తున్నాం’ అని స్పీకర్ ప్రకటించారు. -
స్పీకర్‌పై వికృత చేష్టలు.. దాడి 'అసెంబ్లీకి బ్లాక్ డే'
సాక్షి, అమరావతి: ఈసారి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచి సభను అడ్డుకోవడమే లక్ష్యంగా నిత్యం రచ్చరచ్చ చేస్తున్న టీడీపీ సభ్యుల దుశ్చర్య సోమవారం పరాకాష్టకు చేరుకుంది. ఏకంగా సభాపతి తమ్మినేని సీతారాంపై దాడికి తెగబడ్డారు. సభా సంప్రదాయాలను తుంగలో తొక్కుతూ చరిత్రలో ఎన్నడూలేని విధంగా టీడీపీ ఎమ్మెల్యేలు తమ వికృత చేష్టలను బయటపెట్టారు. సభాపతిపై దాడిని అడ్డుకునేందుకు వచ్చిన మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనా దాడిచేశారు. చివరకు మార్షల్స్‌ను కూడా పిడిగుద్దులు గుద్దుతూ భౌతిక దాడులకు పాల్పడ్డారు. శాసనసభ చరిత్రలో మాయని మచ్చగా మిగిలిన ఈ ఘటనపై స్పీకర్ తమ్మినేని తీవ్ర మనస్తాపంతో సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా వారు నినాదాలు చేస్తూ నానా రచ్చచేశారు. సభ ప్రారంభం కాగానే గలాటా.. సభ సోమవారం ఉదయం ప్రారంభం కాగానే జీఓ–1 రద్దు మీద తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ముందుగా వాయిదా తీర్మానం చదివి వినిపించాలని టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్ చేయగా.. ‘వాయిదా తీర్మానం ఎప్పుడు చర్చకు అనుమతించాలో నాకు తెలుసు.. ముందు మీరు కూర్చోండి’ అంటూ స్పీకర్ కోరారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానంపై నిర్ణయం తీసుకుంటానని చెబుతూ స్పీకర్ క్వశ్చన్ అవర్‌ను ప్రాంభించారు. ఈ సమయంలో మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు సంబంధించిన ప్రశ్నకు సమాధానం చెబుతుండగానే అచ్చెన్నాయుడు స్పీకర్ వైపు వేలు చూపిస్తూ ముందు తామిచ్చిన వాయిదా తీర్మానాన్ని సభలో చదివి వినిపించాలంటూ బిగ్గరగా కేకలు వేశారు. దీనిపై స్పీకర్ అసహనం వ్యక్తంచేస్తూ ‘చైర్‌ను మీరు డిక్టేట్ చేస్తున్నారా?’ అనడంతో టీడీపీ సభ్యులంతా ప్లకార్డులతో వెల్‌లోకి దూసుకొచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. స్పీకర్ పోడియం ఎదుట వైఎస్సార్సీపీ సభ్యులను నెట్టివేస్తున్న టీడీపీ సభ్యులు చర్చలో పాల్గొనాలని ఎంత చెప్పినా... ‘సభ ప్రారంభమై పట్టుమని పది నిమిషాలు కూడా కాకుండానే మీరు ఇలా ప్రవర్తించడం సరికాదు.. దయచేసి పద్ధతి మార్చుకోండి..’ అని స్పీకర్‌తో సహా మంత్రులు హితవు పలికినా టీడీపీ సభ్యులు వినిపించుకోకుండా వెల్ నుంచి పోడియంపైకి ఎక్కి స్పీకర్ చైర్‌కు ఇరువైపులా చేరి పెద్దఎత్తున నినాదాలు చేయడం మొదలుపెట్టారు. మరోవైపు.. స్పీకర్ టేబుల్‌పై ఉన్న పుస్తకాలు, పత్రాలు చించివేస్తూ ఆయన ముఖంపైకి విసరడం ప్రారంభించారు. కిందనున్న ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ శాసనసభ సిబ్బంది వద్ద ఉన్న ప్రొసీడింగ్స్ కాపీలను పోడియంపైనున్న ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబుకు అందించగానే అతను వాటిని చించి స్పీకర్‌పై విసరడం మొదలుపెట్టారు. ఓ వైపు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే మరోవైపు స్పీకర్ చైర్‌ను చేతులతో కొడుతూ కాగితాలు చించి విసిరారు. ఈ సమయంలో స్పీకర్ ఏమాత్రం సంయమనం కోల్పోకుండా ‘దయచేసి పోడియం దిగి మీ మీ స్థానాల్లో వెళ్లి కూర్చోండి. ప్రశ్నోత్తరాల్లో పాల్గొనండి’.. అంటూ పదేపదే విజ్ఞప్తి చేసినా టీడీపీ సభ్యులు ఆయన్ను పట్టించుకోకుండా గొడవ చేస్తూనే ఉన్నారు. ఎస్సీ ఎమ్మెల్యేలపై దాడి.. అదే సమయంలో.. తమ హక్కులు కాపాడాలంటూ వెల్ బయటి నుంచి విన్నవిస్తున్న చింతలపూడి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వీఆర్ ఎలీజా సభాపతిపై జరుగుతున్న దాడిని గమనించి పోడియం పైకెళ్లి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని అడ్డుకోవడంతో ఆయనను టీడీపీ సభ్యులు తోసేసారు. స్పీకర్‌తోపాటు సహచర ఎమ్మెల్యే ఎలీజాపై టీడీపీ సభ్యులు భౌతిక దాడి చేస్తుండడంతో సంతనూతలపాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్‌బాబు పోడియంపైకి వచ్చి వారిని అడ్డుకోబోయారు. ఆయనపైనా దాడికి పాల్పడుతూ పక్కకు తోసేయడంతో సుధాకర్‌బాబు పోడియం హ్యాండ్ రెయిలింగ్‌పై పడిపోయారు. దీంతో సుధాకర్‌బాబు ఎడమ మోచేతికి గాయమైంది. పట్టుతప్పితే ఆయనకు పెద్ద ప్రమాదమే జరిగేది. టీడీపీ సభ్యుల దాడిలో గాయపడిన దళిత ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అయినా, టీడీపీ సభ్యుల అరాచకం ఆగలేదు. సుధాకర్‌బాబుతో పాటు ఎలీజాపై దాడిచేస్తూనే ఉన్నారు. వారి నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు సభలో ఉన్న మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు వెల్ నుంచి పైకి వెళ్లబోతుండగా వారిని తోసుకుంటూ టీడీపీ సభ్యులు కిందకు వచ్చేశారు. ఈ దశలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సస్పెన్షన్ అయ్యాక.. మార్షల్స్‌పై పిడిగుద్దులు అర్ధగంట అనంతరం సభ తిరిగి ప్రారంభమైన తర్వాత టీడీపీ సభ్యులను ఒకరోజు సస్పెన్షన్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. సస్పెండ్ చేసినందున దయచేసి సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించినా, వారు అక్కడే బైఠాయించబోయారు. బయటకు పంపేందుకు ప్రయత్నిస్తున్న మార్షల్స్‌పైనా పిడిగుద్దులతో దాడికి దిగారు. చివరికి డోలాను బలవంతంగా ఎత్తుకుని బయటకు తీసుకెళ్లగా, ఆయన వెంట మిగిలిన టీడీపీ సభ్యులు కవ్విస్తూ బయటకెళ్లారు. డిప్యూటీ సీఎంపై ‘డోలా’ అనుచిత వ్యాఖ్యలు తనపై జరిగిన దాడితో పాటు సభలో టీడీపీ సభ్యుల దుశ్చర్యకు మనస్తాపం చెందిన స్పీకర్ సీతారాం సభ నుంచి తన చాంబర్లోకి వెళ్లిపోయారు. ఇంతలో మార్షల్స్ టీడీపీ సభ్యులను బలవంతంగా వారి స్థానాల దగ్గరకు తీసుకెళ్లారు. రోజూ రచ్చచేయడం టీడీపీ సభ్యులకు అలవాటుగా మారిందని, ఈరోజు ఏకంగా సభాపతిపైనే దాడులకు తెగబడ్డారంటూ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనడంతో.. ‘నువ్వొక డిప్యూటీ సీఎం అంట్రా.. పనికిమాలిన నా కొడకా’.. అంటూ డోలా బాలవీరాంజనేయ స్వామి పరుష పదజాలంతో నానా దుర్భాషలాడడంతో మిగిలిన సభ్యులు ఆయన్ని వారించారు.అక్కడ నుంచి స్పీకర్, సీఎం, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ సభ్యులు రెచ్చగొట్టేలా నినాదాలు చేస్తూనే ఉన్నారు. అటెండర్‌ను తోసేసి స్పీకర్‌పైకి దూసుకొచ్చి.. ఈ సమయంలో టీడీపీ సభ్యుల తీరుకు నిరసనగా మంత్రులు, ఎమ్మెల్యేలు సభలో మాట్లాడుతుండగా, స్పీకర్ అటెండర్‌ను పక్కకు తోసేసిన టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి స్పీకర్‌కు అడ్డంగా నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఓ వైపు వీరాంజనేయస్వామి, మరోవైపు వెలగపూడి రామకృష్ణబాబు తదితరులు చైర్‌పై స్పీకర్ చేతులు కూడా పెట్టుకోనీయకుండా ఇబ్బంది కల్గిస్తూ స్పీకర్ ముఖానికి ప్లకార్డులు అడ్డంపెట్టారు. అచ్చెన్నాయుడు, బుచ్చయ్యచౌదరి, చినరాజప్ప కూడా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయస్వామి స్పీకర్ ముఖంపై ప్లకార్డును అడ్డంగా పెట్టడంతో పాటు ఆయనపై చేయిచేసుకున్నారు. ప్ల్లకార్డు స్పీకర్ కంటికి తగలడంతో ఆయన దాన్ని పక్కకు తోసివేయడంతో అది కిందపడింది. దీంతో డోలా బాలవీరాంజనేయస్వామితో పాటు టీడీపీ సభ్యులు స్పీకర్ చైర్ చుట్టూ మూగి ఆయనపై దాడికి తెగబడ్డారు. -
‘స్కిల్డ్’ క్రిమినల్ బాబే
బటన్ నొక్కితే... నేను బటన్ నొక్కితే డీబీటీ ద్వారా నా అక్కచెల్లెమ్మలు, ప్రజల ఖాతాల్లోకి డబ్బులు వెళ్తున్నాయి. టీడీపీ హయాంలో చంద్రబాబు బటన్ నొక్కగానే ప్రభుత్వ ఖాతా నుంచి అటూ ఇటు తిరిగి ఆయన ఖాతాలోకి డబ్బులు వచ్చాయి. ఇంతకంటే ఇంకేం కావాలి? స్కిల్ స్కామ్‌లో నిధుల విడుదలపై కొందరు ఆర్థిక శాఖ అధికారులు కొర్రీలు వేసినా వెంటనే డబ్బులివ్వాలని అప్పటి ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశిస్తూ చంద్రబాబు నోట్ ఫైల్లో పేర్కొన్నారు. ఇంకో నోట్ ఫైల్లో సీఎం చంద్రబాబు చెప్పారు కాబట్టి నిధులు నేరుగా విడుదల చేశామని చీఫ్ ఫైనాన్స్ సెక్రటరీ రాశారు. ఈ స్కామ్‌లో ఇన్ని సాక్షాధారాలను నేను చూపిస్తున్నా. ఈ కుంభకోణంలో చంద్రబాబే ప్రధాన ముద్దాయి అనడానికి ఇంతకన్నా ఏం కావాలి...? – శాసనసభలో సీఎం జగన్ సాక్షి, అమరావతి: ‘స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో ప్రధాన ముద్దాయి చంద్రబాబే. స్కిల్డ్ క్రిమినల్ చంద్రబాబు చేసిన స్కామ్ ఇది. ఉద్యోగులు, విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ పేరుతో టీడీపీ ప్రభుత్వం అతిపెద్ద స్కామ్‌కు పాల్పడింది’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శాసనసభ వేదికగా ప్రజలకు వాస్తవాలను బహిర్గతం చేశారు. చంద్రబాబు, ఆయన మనుషులు ఓ దొంగల ముఠాగా ఏర్పడి లోపాయికారీ ఒప్పందంతో రూ.371 కోట్లను షెల్ కంపెనీల ద్వారా కాజేశారని ఆధారాలతో సహా వెల్లడించారు. ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ఎందుకు నోరు మెదపలేదు..? దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. “సీమెన్స్ కంపెనీకే తెలియకుండా ఆ సంస్థ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రాజెక్టును సృష్టించింది. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకుంది. చంద్రబాబు అవినీతి స్కిల్ ఇదీ’ అని మండిపడ్డారు. “కనీసం డీపీఆర్ లేదు. రూల్స్ బేఖాతర్.. ప్రొసీజర్స్ బేఖాతర్.. పద్ధతులు, సంప్రదాయాలు అన్నీ బేఖాతర్. చంద్రబాబు చెప్పిందే వేదం’ అని దుయ్యబట్టారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణంపై శాసనసభలో సోమవారం చర్చలో ముఖ్యమంత్రి జగన్ మాట్లాడారు. ఈ స్కామ్ జరిగిన తీరును వివరిస్తూ జీవోలు, ఎంవోయూలను సభలో స్లైడ్స్ ద్వారా ప్రదర్శిస్తూ మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగం వివరాలు ఇవీ.. “షెల్’ డబ్బులు బాబు ఇంటికి రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, దేశ చరిత్రలోనే నిరుద్యోగులు, విద్యార్థుల పేరిట జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది. స్కిల్లింగ్ పేరుతో డబ్బులు దోచేయడం చంద్రబాబుకు మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. వంద రూపాయల పని చేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని ఆ పది కూడా దోచుకున్న మాదిరిగా ఈ వ్యవహారం ఉంది. అమెరికా, యూరప్‌లో లాటరీ తగిలింది.. 10 మిలియన్ డాలర్లు మీ పేరు మీద వచ్చాయి. అర్జెంట్‌గా రూ.10 లక్షలు కట్టండి.. ఆ తరువాత 10 వేల మిలియన్ డాలర్లు వస్తాయని చెబుతుంటారు. అదే మాదిరిగా సీమెన్స్ పేరుతో స్కామ్ జరిగింది. ఇలాంటి గొప్ప స్కామ్‌ను నడిపిన వ్యక్తి నారా చంద్రబాబే. అక్షరాలా రూ.371 కోట్ల ప్రజాధనాన్ని మాయం చేశారు. ఈ డబ్బును షెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్లీ చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. న్యాయ పరిభాషలో పార్టనర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీజర్స్ లాంటిదీ ఈ స్కామ్. కేబినెట్ తీర్మానం, జీవోలకు విరుద్ధంగా ఒప్పందం కేబినెట్లో ఒకటి చెప్పి ఆ ప్రకారం జీవో జారీ చేశారు. వాటికి విరుద్ధంగా ఒప్పందం చేసుకున్నారు. ఆ తరువాత మరో ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేశారు. ప్రజాధనాన్ని దోచేయడంలో చంద్రబాబు చాతుర్యం చూడాలంటే స్కిల్ స్కామ్‌ను ఉదాహరణగా చెప్పవచ్చు. విదేశాల్లో షెల్ కంపెనీలకు ఈ స్కామ్ పాకింది. ఆ తరువాత మళ్లీ వివిధ రూపాల్లో మన దేశానికి వచ్చింది. ఈ స్కామ్‌పై జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఈడీ, సీఐడీ.. అన్నీ దర్యాప్తు చేస్తున్నాయి. ముందుగానే ఊహించి.. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి..? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి..? చట్టానికి దొరక్కుండా ఏ ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి..? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి..? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి..? ఇవన్నీ ముందుగానే ఊహించుకుని రూపకల్పన చేశారు. ఒక క్రిమినల్ మాత్రమే ఇలా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ ఆయన. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన రెండు నెలలకే ఈ స్కిల్ స్కామ్ ఊపిరి పోసుకుంది. ఇందుకోసం తనకు కావాల్సిన మనుషులను చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లోకి తీసుకొచ్చారు. ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? సీమెన్స్ కంపెనీలో ఓ ఉన్నతోద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడి ద్వారా దోపిడీకి పాల్పడ్డారు. ఈ ప్రాజెక్టు ఖర్చు రూ.3,356 కోట్లు. ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం, సీమెన్స్ కంపెనీ 90 శాతం భరిస్తుందన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఓ ప్రైవేట్ కంపెనీ రూ.3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా..? పోనీ చంద్రబాబు ముఖాన్ని చూసి ఇస్తారా...? రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్టు తీసుకోవాలంటే ఒక పద్ధతి ఉంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు...? ప్రభుత్వం వాటా ఎంత? మిగిలిన వారి వాటా ఎంత..? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది..? మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు..? ప్రతి స్ధాయిలో ఖర్చు ఎంత ఉంటుంది..? ఏ రకంగా నిధులు వస్తాయి..? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది..? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది..? ఇలా అన్ని కోణాల్లోనూ ఆధ్యయనం చేసి అందుబాటులో ఉన్న ఉత్తమ విధానాలను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులోకి తేవాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను సర్టిఫైడ్ చేయాలి. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ముందస్తుగానే ఆ కంపెనీలో లాలూచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు రూపొందించిన డీపీఆర్‌ను స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక నోట్ పెట్టించారు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. చంద్రబాబుకు మాత్రమే ఇటువంటిది సాధ్యం. నిబంధనలకు పూర్తి విరుద్ధంగా.. గత ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి, ఆపై స్ధాయిలో చూసీ చూడనట్లు వదిలేశారు. ఏకంగా స్పెషల్ ఐటెమ్‌గా కేబినెట్లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం, వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అధ్యయనం చేయని, ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఇలా కేబినెట్‌కు నోట్ పెట్టడం నిబంధనలకు పూర్తి విరుద్ధం. చంద్రబాబు పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, ఆయన చెప్పిందే వేదం అన్నట్లు నడిపించారు. ఎల్లో మీడియా రాయదు.. దత్తపుత్రుడు ప్రశ్నించడు ఈ స్కామ్.. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తవ్వింది కాదు. చంద్రబాబు హయాంలోనే ఇది బయటకు పొక్కింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తుంటే వీళ్లంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ).. ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు, ఎవరూ రాయరు, ఎవరూ చూపరు, ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. గ్రాంట్ అనే పదమే లేకుండా ఒప్పందం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని, 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని జీవోలో చెప్పారు. ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90 శాతం ఖర్చును సీమెన్స్, డిజైన్‌టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని, మిగిలిన 10 శాతం అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని చెప్పారు. ప్రాజెక్టు వ్యయంలో పది శాతం, పన్నులతో కలిపి రూ.371 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని చెప్పారు. మిగిలిన రూ.3 వేల కోట్లను సీమెన్స్ సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా ఉదారంగా ఇస్తుందంటూ కేబినెట్లో చెప్పారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద వచ్చిందంటే ఆ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆ పదమే ఎక్కడా కనిపించలేదు. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం వాటా కాస్తా రూ.330 కోట్లు ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. కుంభకోణానికి ఇక్కడే బీజం పడింది. ఒప్పంద పత్రంలో వివరాలు నింపాల్సిన చోట ఖాళీగా విడిచిపెట్టారు. ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు? చంద్రబాబు స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టుపై ఈ రకంగా ఒప్పందాలు జరుగుతాయా? ఇన్ని వందల కోట్ల రూపాయలను ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా? సీమెన్స్ నుంచి పైసా రాలేదు గత ప్రభుత్వం 10 శాతం నిధులను విడుదల చేసినప్పుడు సీమెన్స్ కంపెనీ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. అసలు ఆ ప్రాజెక్టు గురించే ఆ కంపెనీకి తెలియదు. గత ప్రభుత్వం ఐదు దఫాల్లో రూ.371 కోట్లు విడుదల చేసింది. ఆ మొత్తం షెల్ కంపెనీల నుంచి చంద్రబాబుకు చేరిన వెంటనే దఫాల వారీగా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేశారు. నోట్ ఫైల్స్ మాయం.. క్లీనింగ్ ఆపరేషన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి ఒక విజిల్ బ్లోయర్ టీడీపీ హయాంలోనే 2018లో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఏసీబీ విచారణ మొదలు పెట్టినా ఆ తరువాత అందిన ఆదేశాలతో ఆ ఫైలును పక్కనపెట్టేసింది. ఏసీబీ దర్యాప్తు చేయకుండా ఎవరు అడ్డుకున్నారు? ఏసీబీ ముఖ్యమంత్రికి రిపోర్టు చేస్తుంది. ఈ వ్యవహారం గురించి బయటకు పొక్కడంతో ప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్ ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా బోగస్ ఇన్వాయిస్లతో “సెన్ వ్యాట్’ కోసం క్లెయిమ్ చేశాయి. కోట్ల రూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. 2017లోనే ఇది బయటపడింది. వాళ్లు బయటపెట్టినా చంద్రబాబు ప్రభుత్వం స్పందించలేదు. ఎందుకంటే సాక్షాత్తూ చంద్రబాబే ఈస్కామ్‌లో అడుగులు వేయించారు కాబట్టి! ఆధారాలతో రుజువైనా ఎల్లో మీడియా గగ్గోలు ఈ స్కామ్‌పై ఇప్పుడు సీఐడీ దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేస్తుంటే ఇదంతా రాజకీయ కక్ష సాధింపంటూ ఎల్లో మీడియా గగ్గోలు పెడుతోంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ బాధ వర్ణనాతీతం. ఇన్ని ఆధారాలతో రుజువై అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అంటున్నాయి. ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా నలుగురిని అరెస్టు చేసింది. సీమెన్స్ మాజీ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. దొరికిపోవడంతో.. ఇంత దారుణంగా స్కామ్ చేసి దొరికిపోయారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగల ముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 తట్టుకోలేక ఉక్రోషంతో బాధపడుతున్నాయి. ఇన్ని దారుణాలు చేసిన ఈ గజదొంగల ముఠా చట్టం నుంచి తప్పించుకునేందుకు వేస్తున్న ఎత్తులు అన్నీఇన్నీ కావు. నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. వీళ్లను మళ్లీ ఏ రోజూ రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గర్లోనే ఉన్నాయి. సభ సాక్షిగా ప్రజలకు వాస్తవాలు.. ఈ విషయంపై చర్చ జరుగుతుంటే వక్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ల దగ్గర మీడియా సంస్థలు ఎక్కువ ఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్ధం చేయగలరు. ఒక అబద్ధాన్ని నిజం చేయగలరు. అంతటి స్కిల్డ్ మ్యాన్ పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. ఈ సభ ద్వారా వాస్తవాలు ఏమిటో ప్రజలకు తెలియజేయాలనే సాక్ష్యాలు, ఆధారాలను చూపిస్తున్నాం. అలాంటి స్కీమ్లే లేవన్న సీమెన్స్ మన అధికారులే కాకుండా ఈ వ్యవహారంపై సీమెన్స్ కంపెనీ కూడా అంతర్గతంగా విచారించింది. సీఆర్పీసీ 164 కింద వాంగ్మూలం ఇచ్చారు. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో, ఎంఓయూలతో తమకు ఎలాంటి సంబంధం లేదని సీమెన్స్ కంపెనీ కోర్టుకు చెప్పింది. ఇది సీమెన్స్ అంతర్గతంగా విచారణ జరిపి ఇచ్చిన రిపోర్టు. తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ మేనేజ్మెంట్నుగానీ లీగల్ టీమ్నుగానీ సంప్రదించలేదని కూడా కోర్టుకు వెల్లడించింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్, ఆర్థిక సహాయంతో కూడిన కార్యక్రమాలను సీమెన్స్ ఎప్పుడూ నిర్వహించలేదని, అసలు అలాంటి స్కీమ్‌లు ఏవీ తమ సంస్థలో లేవని కూడా స్పష్టం చేసింది. వారి అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అందజేశారు కూడా. అంటే రూ.371 కోట్లు తమకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. మరి ఆ డబ్బులు ఎవరికి చేరాయి? అటు తిరిగి ఇటు తిరిగి షెల్ కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకున్నారు. రూ.371 కోట్లను చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు. ఆనేక షెల్ కంపెనీల ద్వారా ఆ డబ్బు చేతులు మారి మనీల్యాండరింగ్‌తో వీళ్ల చేతుల్లోకి వచ్చింది. -
‘శాసనసభ చరిత్రలో ఈరోజు బ్లాక్‌డే’
అమరావతి: గత కొన్ని రోజులుగా శాసనసభలో టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం, వాకౌట్ చేయడమే వారు పనిగా పెట్టుకున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ఏడు రోజులుగా డోలా వీరాంజనేయస్వామి పదేపదే స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారని, ఈరోజు స్పీకర్‌పై దాడికి దిగారన్నారు. ఈ రోజు శాసనసభ చరిత్రలో బ్లాక్ డే అని మంత్రి వేణుగోపాలకృష్ణ స్పష్టం చేశారు. ప్రతిపక్ష నాయకుడు ఎక్కడో కూర్చొని దశ, దిశ చేస్తుంటాడని, సభకు రాడని మండిపడ్డారు మంత్రి. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా మీడియా పాయింట్ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడారు. ‘సభ్య సమాజం తలదించుకునేలా టీడీపీ సభ్యులు వ్యవహరిస్తున్నారు. టీడీపీ సభ్యులు చర్చ లేవనెత్తడం.. వాకౌట్ చేయడం ఇదే వారి పని. ఏడు రోజులుగా స్పీకర్‌ను దుర్భాషలాడుతున్నారు. ఈరోజు స్పీకర్ పై దాడికి దిగారు వెల్ లోకి వెళ్లడమే నేరం..పైగా ప్లకార్డులతో నిరసన తెలిపారు. హద్దులు దాటి సభాపతి పై దాడి చేశారు. భర్తను కొట్టినమ్మ బావురుమన్నట్లుంది టీడీపీ తీరు. మాపై వారే దాడి చేసి...నింద మాపై వేస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చర్చ జరగకూడదనే పథకం ప్రకారం ఈరోజు గొడవ చేశారు’ అని మంత్రి తెలిపారు. -
దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ దేశ చరిత్రలోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం అతిపెద్దదని స్పష్టం చేశారు. విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది అని తెలిపారు. ‘స్కిల్ పేరిట గత ప్రభుత్వం అడ్డంగా దోచుకుంది. రాష్ట్రంలోనే కాదు దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. డబ్బులు కొట్టేయడంలో చంద్రబాబు చూపించిన అతిపెద్ద స్కిల్ ఇది. రూ.371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు. ఈ డబ్బులను షెల్ కంపెనీ ద్వారా మళ్లించారు. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. పక్కా స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ ఇది. నారా చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. కేబినెట్లో ఒకటి చెప్పి వాస్తవంగా మరొకటి చేశారు. ఈ స్కామ్ ఏపీలో మొదలై విదేశాలకు పాకింది. సీఎం జగన్ తన ప్రసంగంలో ఏమన్నారంటే... నిరుద్యోగుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం. ఈ రోజు రాష్ట్ర చరిత్రలోనే కాకుండా దేశ చరిత్రలోనే నిరుద్యోగులు,విద్యార్ధుల పేరిట జరిగిన అతిపెద్ద స్కాం గురించి ఈ సభలోనాలుగు మాటలు చెప్పాలి. స్కిల్ పేరిట ఏ రకంగా గత ప్రభుత్వంలో దోచేశారు అన్నది సభలో ఉన్న ఎమ్మెల్యేలు అందరికీ తెలియాలి. అదే విధంగా సభ ద్వారా ప్రజలకు కూడా అవగతం కావాలి. అందుకనే ప్రత్యేకంగా ఈ అంశంపైన మరింత క్లారిటీ ఇవ్వడంతో పాటు అందరికీ తెలియాలి అన్న ఉద్దేశ్యంతో నాలుగు మాటలు సభ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. దోపిడీ– బాబుకి తెలిసిన స్కిల్ స్కిల్లింగ్ ద్వారా నిజంగా పిల్లల స్కిల్స్ అభివృద్ధి చేసి తద్వారా ఉద్యోగాలలో వాళ్లకు వచ్చే అవకాశాలను మెరుగుపర్చాలని ఏ ప్రభుత్వమైనా ఆలోచన చేయాలి. కానీ ఆ స్కిల్లింగ్ పేరుతో ఏకంగా డబ్బులు దోచేయడం అన్నది... ఇది నిజంగా చంద్రబాబునాయుడు గారికే మాత్రమే తెలిసిన గొప్ప స్కిల్. ఇటువంటి స్కిల్ ద్వారా ఏ రకంగా మన పిల్లలకు నష్టం జరిగింది, ఏ రకంగా ఒక వ్యవస్ధను భ్రష్టుపట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి ? అన్నది రాష్ట్ర ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. ఈ స్కాం ఎలా ఉందంటే.. రూ.100 పనిచేస్తామని చెప్పి రూ.10 అడ్వాన్స్‌గా తీసుకుని దాన్ని కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందో.. ఈస్కాం కూడా అలాగే ఉంటుంది. విదేశీ లాటరీ తరహాలో స్కాంకు పాల్పడ్డారు. అమెరికాలో కానీ, యూరప్ లో కానీ మీకు లాటరీ తగిలింది. 10 మిలియన్ డాలర్లు మీ పేరుమీద వచ్చాయి. అర్జెంటుగా మీరు రూ.10 లక్షలు డబ్బులు కట్టండి. అది కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన 10 మిలియన్ డాలర్లు వస్తాయని చెప్పి ఆ రూ.10 లక్షలు కట్టించుకుని వాటిని కూడా ఎత్తేసే కార్యక్రమం ఏమాదిరిగా జరుగుతుందో అదే విధంగా ఈ రాష్ట్రంలో కూడా ఈ సీమెన్స్ పేరుతో పెద్ద స్కాం జరిగింది. స్కాం నడిపింది చంద్రబాబే... ఇలాంటి ఒక స్కాంను నడిపిన వ్యక్తి సాక్షాత్తూ నారా చంద్రబాబునాయుడు గారేనని నా ప్రసంగంలో రకరకాల ఆధారాలతో సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలిసేలా చూపిస్తాను. ప్రభుత్వం సొమ్ము రూ.371 కోట్లు. ఈ డబ్బు హారతి కర్పూరంలా మాయమైపోయింది. ఈ స్కాం గురించి మనం చర్చిస్తున్నాం. ఈ డబ్బు సెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ ద్వారా మరలా సెల్ కంపనీల నుంచి చంద్రబాబునాయుడు గారి దగ్గరకి వచ్చిన పరిస్థితి. స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం... ఇది స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కాం. పార్టనర్స్ ఆఫ్ క్రైం ప్రొసీడ్స్ అనే పదానికి అర్ధం కూడా చెబుతుంది. అధికార దుర్వనియోగం పరిధిలోనికి కూడా వస్తుంది. కేబినెట్లో ఒకటి చెప్పి.. ఆ మేరకు ఒక జీవో విడుదల చేశారు. ఆ తర్వాత కేబినెట్ సమావేశం, జీవోతో సంబంధం లేకుండా వేరొక ఒప్పందం చేసుకుని డబ్బులు కొట్టేసే కార్యక్రమం జరిగింది. ప్రజా ధనాన్ని దోచేయడంలో చంద్రబాబు గారి చాతుర్యం చూడాలంటే... దానికి సరైన ఉదాహరణ సరిగ్గా ఈ స్కిల్ స్కాం. ఇది రాష్ట్రంలో మొదలై విదేశాలకు కూడా సెల్ కంపెనీల ద్వారా పాకిన పరిస్థితి. ఆ తర్వాత అటునుంచి మరలా డబ్బులు మన దేశంలోకి, హైదరాబాద్‌లోకి వచ్చాయి. ఈ స్కాం మన సీఐడీతో మొదలు పెడితే జీఎస్టీ, ఇంటెలిజెన్స్, ఇన్‌కమ్‌టాక్స్, ఈడీ ఇలా ఏజెన్సీలన్నీ దర్యాప్తు చేస్తున్న స్కాం. ఇలా దోచేసిన సొమ్మును సెల్ కంపెనీల ద్వారా విదేశాలకు అక్కడ నుంచి మరలా దేశంలోకి తెప్పించి, దేశం నుంచి ఏకంగా చంద్రబాబు నివాసం ఉంటున్న హైదరాబాద్‌కు తరలించారు. పద్ధతి ప్రకారం రూ.371 కోట్ల దోపిడీ... చంద్రబాబు గారు ఆయన మనుషులు ఒక పద్ధతి ప్రకారం, ఒక వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి ఒకటి కాదు, రెండు కాదు స్కిల్ డెవలప్మెంట్ పేరుతో ఏకంగా రూ.371 కోట్లు దోచేశారు. యూత్‌కు శిక్షణ పేరుతో ఈ డబ్బంతా దోచేయడం అన్నింటికన్నా బాధాకరం. ఈ డబ్బు దోచేయడానికి చంద్రబాబుగారి విజన్ ఏంటో బాగా కనిపిస్తోంది. చేయని స్కిల్ డెవలప్మెంట్ ఎలా చూపించాలి ? దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలి ? చట్టానికి దొరక్కుండా ఏయే ఫైల్స్‌ను ముందుగానే మాయం చేయాలి ? దర్యాప్తు జరిగితే తప్పించుకోవడానికి ఏం చేయాలి ? అసలు విచారణ జరగకుండా ఏం చేయాలి ? ఇవన్నీ కూడా ముందుగానే ఊహించుకుని ఈవిజన్ రూపకల్పన చేసినట్టుగా రకరకాల అడుగుల్లో కనిపిస్తోంది. అవినీతికి విజన్... ఇవన్నీ ముందుగానే ఊహించుకుని ఇంత గొప్ప విజన్‌తో ఈ కార్యక్రమాలు చేసిన పరిస్థితులు చూస్తే.. ఒక క్రిమినల్ మాత్రమే ఈ విధంగా చేయగలుగుతాడు. అవినీతికి నిజంగానే విజన్ అతడు. చంద్రబాబు గారు జూన్ 2014లో అధికారం చేపట్టిన రెండు నెలలకే ఈస్కిల్ డెవలప్మెంట్ స్కాం ఊపిరి పోసుకుంది. దీనికోసం తమకు కావాల్సిన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో తీసుకొచ్చి పెట్టారు. ప్రభుత్వంలో ఒక పూర్తి స్ధాయి చర్చలేదు. ఏదైనా ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు, మనం ఏదైనా అప్రూవ్ చేయాల్సివచ్చినప్పుడు ప్రభుత్వంలో పూర్తి స్థాయి చర్చ జరగాలి. కానీ అటువంటిది ఎక్కడా చర్చ జరగలేదు.ఒక డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు చేయించాలి. ఒక ఆలోచన ఏ రకంగా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందనేది పేపర్ మీద పెట్టి డీపీఆర్ చేయించాలి. అది కూడా లేదు. ఖర్చు ఎంతవుతుందనేది నిర్ధారణ చేయించాలి. అది కూడా లేదు. కనీసం టెండర్ లాంటి ప్రక్రియ కూడా ఈ ప్రాజెక్టులో లేదు. సీమెన్స్ ఉద్యోగితో లోపాయికారి లాలూచీ... ఇది ఒక చంద్రబాబునాయుడు గారికి మాత్రమే ఇటువంటి కార్యక్రమం సాధ్యమవుతుంది. సీమన్స్ ఇండియా అన్న కంపెనీలో ఒక ఉన్నత ఉద్యోగిగా ఉన్న వ్యక్తితో లోపాయికారీగా వీళ్లు లాలూచీ పడ్డారు. అతడిని వాడుకుని ఈప్రాజెక్టు పేరుతో దోపిడీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు మొత్తం ఖర్చు రూ.3,356 కోట్లు అయితే.. ఇందులో ప్రభుత్వ వాటా పదిశాతం. అని చెప్పారు. 90 శాతం సీమెన్స్ పెట్టుకుంది అని చెప్పారు. ఒక ప్రైవేటు సంస్ధ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 90శాతం పెట్టుకుందని స్కాంలో రూపకల్పన చేశారు. దాదాపుగా రూ.3000 కోట్లు ప్రైవేటు సంస్ధ అయిన సీమెన్స్ ఇస్తుందని ప్రచారం చేసుకున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ఒక ప్రైవేటు కంపెనీ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇస్తుందా ? ఆలోచన చేయడానికైనా సాధ్యపడుతుందా ? చంద్రబాబు నాయుడు గారి అందమైన మొహాన్ని చూసి ఏమైనా ఇస్తున్నారా ? ఏరకంగా ఒక ప్రయివేటు సంస్ధ రూ.3వేల కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుంది ? సాధారణంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక ప్రాజెక్టును తీసుకోవాలనంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది. ప్రాజెక్టు ఎలా అమలు చేస్తారు ? దీనిలో ప్రభుత్వం వాటా ఎంత ? మిగిలి వారి వాటా ఎంత? ప్రభుత్వం ఏ రూపంలో ఈ డబ్బులు ఖర్చు చేస్తుంది. మిగిలిన వారు తమ వాటా డబ్బును ఏ రూపంలో ఇస్తారు ? ప్రతిస్ధాయిలో కూడా ఖర్చు ఎంత ఉంటుంది ? ఏ రకంగా నిధులు వస్తాయి? టార్గెట్ ఎప్పటికి పూర్తవుతుంది ? ఏ స్ధాయిలో ఎవరి బాధ్యత ఎంత ఉంటుంది ? ఇలా అన్నిరకాల కోణాల్లోనూ ఆధ్యయనం చేసి... అవైలబుల్ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు లోనికి తీసుకుని రావాలి. ఇవన్నీ పూర్తయిన తర్వాత డీపీఆర్‌ను కూడా సర్టిఫైడ్ చేయాల్సి ఉంటుంది. ఇవేవీ ఇక్కడ జరగలేదు. డీపీఆర్ కూడా తయారు చేయలేదు. ఇదివరకే చెప్పుకున్నట్టు.. ముందస్తుగానే ఆ కంపెనీలో ఉన్న లాలాచీ పడ్డ ఇద్దరు వ్యక్తులు.. తమకు తాముగా తయారుచేసుకున్న ఒక అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఒక నోట్ పెట్టించారు. అంటే వాళ్లంతట వాళ్లే ఒక మనిషిని గుర్తించి, ఆ మనిషి దగ్గర నుంచి ఆ కంపెనీ పేరుతో ఒక ప్రతిపాదన పెట్టించి, దాన్ని ఏమాత్రం కూడా అధ్యయనం చేయకుండా విచారణచేయకుండా ఆ అంచనా వ్యయాన్ని డీపీఆర్‌గా చూపిస్తూ స్కిల్ డెవలప్మెంట్ నుంచి నోట్ పెట్టించారు. అన్ని రూల్స్‌ను బేఖాతరు చేస్తూ... ప్రభుత్వంలో సెక్రటరీ స్ధాయి కానీ, ఆ పై స్ధాయి కానీ అన్నింటినీ టోటల్‌గా ఓవర్ లుక్ చేశారు. ఏకంగా స్పెషల్ ఐటెంగా కేబినెట్లోకి ఈ నోట్‌ని తీసుకొచ్చారు. కేబినెట్లోకి రావడం వెంటనే ఓకే చెప్పడం, ఆ తర్వాత జీవో విడుదల కావడం అన్నీ ఆగమేఘాల మీద జరిగిపోయాయి. అ«ధ్యయనం చేయని ఎవరో ఇచ్చిన డీపీఆర్‌ను ఈ పద్ధతిలో కేబినెట్‌కు నోట్ పెట్టడం అన్నది.. నియామకాలకు, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. కానీ బాబుగారి పాలనలో ఆన్నీ పూర్తిగా బేఖారు చేసిన పరిస్థితులు. ఆయన పాలనలో రూల్స్ బేఖాతర్, ప్రొసీజర్స్ బేఖాతర్, పద్దతులు, ట్రెడిషన్స్ అన్నీ కూడా బేఖాతర్. ఆయన చెప్పిందే వేదం అన్నట్టు నడిపించారు. చంద్రబాబు టైంలోనే బయటపడిన స్కాం... ఈ స్కాం అన్నది మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తవ్వింది కాదు. చంద్రబాబు గారు హయాంలోనే దీన్ని సెంట్ కనిపిస్తూ వచ్చింది. ఇదే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎల్లో మీడియా ఏ ఒక్కరూ మాట్లాడలేదు. చివరకు వీరి దత్తపుత్రుడు కూడా అడగలేదు. ఎవరైనా ఇంత మొత్తంలో ప్రజల డబ్బు యధేచ్చగా కాజేస్తూ ఉంటే ఎందుకు వీళ్లంతా మౌనంగా ఉన్నారు. ఇంతకముందు నేను చెప్పాను. దోచుకో, పంచుకో, తినుకో ( డీపీటీ ) ఇదే వీళ్ల విధానం. ఎవరూ అడగరు. ఎవరూ రాయరు. ఎవరూ చూపరు. ప్రశ్నిస్తానన్నవాడు ప్రశ్నించడు. ఒప్పందంలో పచ్చి అవినీతి.. ఈ ఒప్పందం గురించి వస్తే.. ఇంతకంటే పచ్చి అవినీతి ఎక్కడా చూసి ఉండం. కారణం కేబినెట్లో ఒక విధంగా, ఆ కేబినెట్ తీర్మానం మేరకు జీవో ఇచ్చిన జీవోలో ఒక విధంగా ఉండి.. ఒప్పందం ఇంకో విధంగా ఉంది. కనీసం అదైనా కేబినెట్‌కు వచ్చిందో ?లేదో ? వచ్చిందని జీవో విడుదల చేశావు. కనీసం దాన్నైనా ఒప్పందంలోకి తీసుకువచ్చావా అంటే అదీ లేదు. కేబినెట్లోకి తీసుకొచ్చి, జీవో రూపంలో ఇచ్చింది ఒకటైతే, దానికి విరుద్ధంగా ఒప్పందం మరోలా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్కిల్ డెవలప్మెంట్ కోసం రాష్ట్రంలో 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని, ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ అని 5 టెక్నికల్ స్కిల్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్స్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. కేబినెట్ ఆధారంగా జీవో విడుదల చేశారు. ఒక్కో క్లస్టరులో ఒక్కో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు రూ.546 కోట్లు ఖర్చు చేస్తామని, ఇందులో 90శాతం ఖర్చును సీమెన్స్ మరియు డిజైన్ టెక్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అందిస్తుందని మిగిలిన పది శాతం ఖర్చును అంటే ఒక్కో సెంటర్‌కు రూ.50 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాలని జీవోలో స్పష్టంగా చెప్పారు. ఈ లెక్కన ప్రాజెక్టు వ్యయంలో పదిశాతం అంటే పనులతో కలుపుకుని రూ.370 కోట్లను ప్రభుత్వం చెల్లిస్తుందని జీవోలో రాశారు. మిగిలిన రూ.3వేల కోట్లు సీమెన్స్ సంస్ధ ఈ ఒప్పందం ప్రకారం గ్రాంట్ ఇన్ ఎయిడ్‌గా... ప్రైవేటు సంస్ధ ఉదారంగా మనకు ఇస్తుందని కేబినెట్లోకి తీసుకొచ్చారు. జీవో విడుదల చేశారు. ఏదైనా ప్రాజెక్టు ఖర్చులో భాగంగా గ్రాంట్ ఇన్ ఎయిడ్ వచ్చిందని అంటే.. ఈ డబ్బును మనం తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఉదారంగా మనకు ఉచితంగా ఇచ్చినట్టు అర్ధం. అయితే కేబినెట్ నిర్ణయానికి ఈ జీవోకు విరుద్ధంగా ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. ఆసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ఒప్పందానికి వచ్చేసరికి 90 శాతం గ్రాంట్ ఇన్ ఎయిడ్ అన్న ప్రస్తావన పూర్తిగా ఎగిరిపోయింది. అసలు ఈ పదమే ఎక్కడా కనిపించదు. ప్రభుత్వం ఇవ్వవలసిన 10 శాతం కంట్రిబూషన్ కాస్తా ఫైనాన్సియల్ అసిస్టెన్స్‌గా మారిపోయింది. ప్రభుత్వం ఇవ్వాల్సిన 10 శాతం కంట్రిబ్యూషన్‌ను ఫైనాన్షియల్ అసిస్టెన్స్‌గా మార్చేశారు. మొత్తం ఒప్పందం చూస్తే.. కేబినెట్ నిర్ణయం, తద్వారా వచ్చిన జీవోకు పూర్తిగా విరుద్ధంగా ఒప్పందం స్వరూపమే మార్చివేసారు. స్లైడ్స్ ద్వారా కేబినెట్ నిర్ణయం, జీవో ఆ తర్వాత ఎంఓయూను అసెంబ్లీలో వివరించిన సీఎం. కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపి జీవో ఇచ్చారు. జీవో తర్వాత ఒక తప్పుడు వ్యవస్ధను క్రియేట్ చేశారు. ఆ తర్వాత వీళ్ల చేసుకున్న ఒప్పందం చూస్తే.. పదిశాతం కాంట్రిబ్యూషన్ అన్న పదం ఎగిరిపోయింది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద రూ.330 కోట్లు ఇచ్చేటట్టుగా నామకరణం చేసారు. ఇక్కడ స్కాంకు బీజం పడింది. కుదుర్చుకున్న ఒప్పంద పత్రంలో ఏ లెటర్ఆధారంగా ఏ తేదీన జారీ చేసిన ఏ జీవో ఆధారంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్న వివరాలేవీ పేర్కొనలేదు. అన్నీ ఖాలీలు ఉంచారు. ఒప్పందం వివరాలూ మాయం.... ఈ వివరాలు నింపాల్సిన చోట నింపకుండా ఖాలీగా విడిచిపెట్టారు. కనీసం ఏ తేదీన ఒప్పందం కుదిరిందన్న విషయాన్ని కూడా డాక్యుమెంట్లో రాయలేదు. జీవోలో ఉన్నది ఒప్పందంలో లేనప్పుడు ఎలా సంతకాలు చేశారు ? జీవో వేరు, ఒప్పందం వేరు. చంద్రబాబునారి స్క్రిప్ట్, డైరెక్షన్ లేకుండానే ఇంత పెద్ద ప్రాజెక్టు పై ఈరకంగా ఒప్పందాలు జరుగుతాయా ? ఇన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వగలుగుతారా ? ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దోచుకో, పంచుకో, తినుకో అన్నదానికి ఏ రకంగా అడుగులు పడ్డాయన్నది ఊహకందని విధంగా జరుగుతుంది. ప్రభుత్వం నుంచి పదిశాతం డబ్బులు విడుదల చేసినప్పుడు, సీమెన్స్ నుంచి రావాల్సిన గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఒక్క పైసా కూడా రాలేదు. ఉదారంగా సీమెన్స్ నుంచి మనకు ఇవ్వాల్సింది ఒక్క పైసా కూడా రాకుండానే... ఐదు దఫాల్లో కేవలం మూడు నెలలు కాలంలోనే ప్రభుత్వం రూ.370 కోట్లు విడుదల చేసింది. అంటే ప్రభుత్వం నుంచి ఇన్స్టాల్మెంట్ పోతుంది ఆ మొత్తం సెల్‌కంపెనీల ద్వారా చంద్రబాబుకు చేరిన వెంటనే మళ్లీ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఇస్తారు. డబ్బులు ఇవ్వడం వీళ్లు రూట్ చేసుకోవడం.. వీళ్లకు రావాల్సింది తీసుకోవడం, మరలా సెకెండ్ ఇన్స్టాల్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. నేను బటన్ నొక్కితో డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి, నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లోకి వెళ్తుంది. గత ప్రభుత్వంలో చంద్రబాబునాయుడు బటన్ నొక్కితే అంతా ప్రభుత్వ ఖాతా నుంచి అటు తిరిగి, ఇటు తిరిగి బాబు ఖాతాల్లోకి వచ్చే డీపీటీ కార్యక్రమం. ఇంత దారుణంగా జరిగాయి. ఈ డబ్బు విడుదలపై ఆర్ధికశాఖ అధికారులు ప్రశ్నిస్తే...ఎవరు విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చారంటే. సాక్షాత్తూ చంద్రబాబే. ఈ విషయాన్ని అప్పటి ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ తన నోట్ ఫైల్లో .. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే విడుదల చేయమని ఆదేశాలు ఇచ్చినట్టు తాను నోట్ ఫైల్లో చెప్పారు. ఇంకోక నోట్ ఫైల్లో .. చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి నిధులు విడుదల చేయమని చీఫ్ సెక్రటరీ నేరుగా ఫైల్‌పై రాశారు. ప్రధాన ముద్దాయి చంద్రబాబే... ఈ స్కాంలో ఇన్ని సాక్ష్యాధారాలు నేను చూపిస్తున్నాను. చంద్రబాబు గారు ప్రధాన ముద్దాయి అవునా ?కాదా ? అని చెప్పడానికి ఇంకా నిదర్శనాలు కావాలా అని అడుగుతున్నాను ? ప్రభుత్వం నుంచి విడుదల చేసిన ఈ డబ్బు ఎక్కడికి పోయింది. తీగలాగితే డొంకంతా కదిలింది. ఇక్కడ మన అధికారులే కాదు. సీమెన్స్ సంస్ధ అధికారులు కూడా ఇంటర్నల్ ఎంక్వైరీ చేశారు. సీఆర్పీసీ 164 కింద ఏకంగా మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు, తమకు ఎలాంటి సంబధం లేదని కోర్టులో చెప్పారు. ఇది సీమెన్స్ వాళ్లు అంతర్గతంగా విచారణ చేసుకుని ఇచ్చిన రిపోర్టు. వాళ్లు 164 కింద మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం ఒక అంశం అయితే... ప్రభుత్వం జారీ చేసిన జీవోకు, ఎంఓయూకు తమకూ ఎలాంటి సంబందం లేదని... వాళ్లు కోర్టుకు తెలిపడం మరొక అంశం అయితే తమ కంపెనీలో పనిచేసే సుమన్ బోస్ అనే వ్యక్తి మేనేజిమెంట్‌కు కానీ, లీగల్ టీంకు కానీ సంప్రదించలేదని సీమెన్స్ కోర్టుకు తెలియజేశారు. అంతే కాకుండా సీమెన్స్ ఎలాంటి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కానీ ఆర్ధిక సహాయంతో కూడిన కార్యక్రమాలు ఎప్పుడూ నిర్వహించలేదని, ఇలాంటి స్కీంలు ఏవీ కూడా తమ సంస్ధలో లేవని చెప్పారు. వాళ్ల అంతర్గత విచారణ రిపోర్టులు మనకు అధికారికంగా అందజేశారు. అంటే రూ.370 కోట్లు డబ్బులిచ్చారు. ఆ డబ్బులు మాకు రాలేదని సీమెన్స్ వాళ్లు చెబుతున్నారు. అంటే ఈ డబ్బులు ఎవరికి పోయాయి ? అటు తిరిగి ఇటు తిరిగి సెల్‌కంపెనీల ద్వారా వీళ్లు హైదరాబాద్‌కి తెప్పించుకునే కార్యక్రమం జరుగుతుంటే మనం ఏ ప్రపంచంలో ఉన్నామని ఆలోచన చేయమని అడుగుతున్నాను. రూ.370 కోట్లు గత ప్రభుత్వంలో చంద్రబాబు ఆయన మనుషులు పూర్తిగా తినేశారు. ఈ డబ్బు ఒకటి రెండు కాదు ఇప్పటివరకు ఆనేక సెల్‌కంపెనీల ద్వారా చేతులు మారి మనీల్యాండరింగ్ చేసి వీళ్ల చేతుల్లోకి వచ్చింది. వాస్తవంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కాం గురించి ఒక వ్యక్తి రాష్ట్రంలో ఏసీబీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. 2018 జూన్‌లో అంటే వాళ్ల ప్రభుత్వంలోనే ఒక విజిల్ బ్లోయర్ ఈ స్కాం గురించి ఏసీబీకి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ కూడా ఏసీబీ విచారణ మొదలు పెట్టి.. ఆ తర్వాత వారికి వచ్చిన ఆదేశాలతో విచారణ ముందుకు కొనసాగించకుండా ఏసీబీ ఆ ఫైలును పక్కనపెట్టేశారు. విచారణనూ అడ్డుకున్నారు... ఏసీబీని విచారణ చేయకుండా ఎవరు అడ్డుకున్నారు. ఏసీబీ రిపోర్ట్స్ టు సీఎం. ఇది ఎప్పుడైతే జరిగిందో ఈప్రాజెక్టుకు సంబంధించిన నోట్ ఫైల్స్‌ను మాయం చేశారు. క్లీనింగ్ఆపరేషన్ మొదలుపెట్టారు. ఎంత తెలివైన నేరస్థుడైనా... ఎక్కడో ఒక చోట ఏదో ఒక పొరపాటు చేస్తాడు. వివిధ శాఖల్లో ఉన్న షాడో ఫైల్స్ ద్వారా ఈ మొత్తం వ్యవహారం బయటపడింది. అన్నీ బయటకొస్తున్నాయి. ఈ స్కిల్ స్కాంలో ప్రధాన పాత్ర పోషించిన పీవీఎస్పీ– స్కిల్లర్, డిజైన్ టెక్ ఈ రెండు కంపెనీలు సర్వీసు టాక్స్ కట్టకుండా సెన్ వ్యాట్ కోసం క్లెయిమ్ చేశాయి. ఎంత గొప్పగా వీళ్లు రచన చేసినా ఇది ఎక్కడ బయటకు వచ్చిందంటే... దేవుడి మొట్టికాయలు వేయాలనుకున్నప్పుడు ఎక్కడో కచ్చితంగా పడతాయి. ఇన్ని కోట్లరూపాయల మేర క్లెయిమ్ చేయడంతో జీఎస్టీ అధికారులకు అనుమానం వచ్చింది. ఆ కంపెనీల లావాదేవీలపై పూర్తిస్ధాయిలో దృష్టి పెట్టారు. ఈ డబ్బులు బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్టుగా జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు వెల్లడించారు. 2017లోనే ఇది బయటపడింది. గత ప్రభుత్వంలోనే జీఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్లు ఇది బోగస్ ఇన్వాయిసెస్తో సైఫనాప్ చేసినట్లు చెప్పారు. వాళ్లు బయటపెట్టినా బాబుగారి ప్రభుత్వంలో స్పందన లేదు. ఎందుకు స్పందించలేదు అంటే... ఈ స్కాంలో సాక్షాత్తూ చంద్రబాబునాయుడు గారే అడుగులు వేయించారు. చివరకు సీమెన్స్ సంస్ధ అంతర్గత విచారణ చేసి వాళ్లు తేల్చిన విషయాలు కూడా మన ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఎల్లో మీడియా గగ్గోలు ఈ విషయాలన్నింటినీ మన సీఐడీ దర్యాప్తు చేస్తూ.. స్కాంకు సహకరించిన వారిని అరెస్టు చేస్తుంటే.. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో మీడియా గగ్గోలు పెడుతుంది. ఆసలు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్ల బాధ వర్ణనాతీతం. ఇంత దారుణమైన స్కాం జరుగుతుంటే... ఇన్ని ఆధారాలతో రుజువయ్యే పరిస్థితులు కనిపిస్తుంటే.. దీని మీద అరెస్టులు జరుగుతుంటే రాజకీయ కక్ష సాధింపు అని ఎల్లో పార్టీ, ఎల్లో మీడియా చెబుతున్నాయి. నిజమేమిటంటే ఈ కేసులో కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నలుగురిని అరెస్టు చేసింది. ఆ నలుగురిని అరెస్టు చేసి ఈడీ ట్వీట్ కూడా చేసింది. అందులో ఏముందంటే సీమెన్స్ ఇండస్ట్రీ ఎక్స్ ఎండీ సౌమ్యాద్రిశేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్‌ను, డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైయివేటు లిమిటెడ్ ఎండీ వికాస్ వినాయక్ కన్వేల్కర్, ఎక్స్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ముకుల్ చంద్ర అగర్వాల్‌ను, ఆధరైజ్డ్ సిగ్నటరీ ఆఫ్ స్కిల్లార్ ఎంటర్ ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ సురేష్ గోయల్‌ను అరెస్టు చేసి వాళ్లను పీఎంఎల్ఏ కోర్టులో ప్రవేశపెట్టి, 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి తీసుకుంది. పట్టుబడిన గజదొంగల ముఠా... ఇంత దారుణంగా స్కామ్ చేసి పట్టుబడిన తర్వాత వీళ్లు దొరికిపోతున్నారు కాబట్టి చంద్రబాబులో ఇంత భయం. ఈ గజదొంగలముఠా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 తట్టుకోలేక ఆక్రోషంతో బాధపడుతున్నారు. బమ్మిని తిమ్మిని చేయడానికి, తిమ్మిని బమ్మిని చేయడానికి చాలా కష్టపడుతున్నారు. ఇవి వాస్తవాలైతే... ఇవేవీ వాస్తవాలు కాదని అటు తిప్పి, ఇటు తిప్పి కథలు, కథలు అల్లి చంద్రబాబును కాపాడ్డానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో ఈ గజదొంగల ముఠా ఎంత దారుణంగా వ్యవహరించిందో చెప్పడానికి ఇవే నిదర్శనాలు. డీపీటీ అని నేను చెప్పినదానికి సాక్ష్యాధారాలు. ఇది చంద్రబాబుగారు చేసిన నిలువుదోపిడీ బాగోతం. ఈ గజదొంగల ముఠా ఇన్ని దారుణాలు చేసి చట్టం నుంచి తప్పించుకోవడానికి చేస్తున్న ఎత్తులు..అన్నీ ఇన్నీ కాదు. నేరగాళ్లకు ఎప్పుడైనా సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తారు. ప్రజలు ఇప్పటికే మొట్టికాయలు వేశారు. ఇటువంటి గజదొంగల ముఠాను ఇక మళ్లీ ఏరోజు కూడా రాజ్యాధికారంలో చూడకుండా ఇంకా గట్టిగా మొట్టికాయలు వేసే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఈ విషయం మీద చర్చ జరుగుతుంది. వక్రీకరించే కార్యక్రమాలు రకరకాలుగా జరుగుతున్నాయి. వాళ్ల దగ్గర మీడియా సంస్ధలు ఎక్కువగాఉన్నాయి. వాళ్లు ఒక నిజాన్ని అబద్దం చేయగలుగుతారు. ఒక అబద్దాన్ని నిజం చేయగలుగుతారు. అంతా స్కిల్డ్ మ్యాన్‌పవర్, స్కిల్డ్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ల దగ్గర ఉంది. వాస్తవాలు ప్రజలకూ తెలియాలి... కాబట్టి కనీసం ఈ సభ ద్వారానైనా వాస్తవాలేంటి అన్నది మన ఎమ్మెల్యేలకే కాకుండా, ప్రజలందరికీ తెలియజెప్పే ప్రయత్నంలో భాగంగా సాక్ష్యాలు, ఆధారాలతో చూపించాం అని సీఎం తన ప్రసంగం ముగించారు. -
చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు: కన్నబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై సోమవారం కూడా చర్చ జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కన్నబాబు కీలక అంశాలను వెల్లడించారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ అని ఆరోపణలు చేశారు. కాగా, కన్నబాబు మాట్లాడుతూ.. 201-19 మధ్య చంద్రబాబు కొన్ని సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్, అమరావతి, ఫైబర్ నెట్ వంటి సినిమాలు తీశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఓ గజదొంగల ముఠా కథ. చంద్రబాబు అధికారం చేపట్టిన రెండు నెలల వ్యవధిలోనే రూ. 3,356 కోట్ల ప్రాజెక్ట్ అని మోసం చేశారు. సీమెన్స్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. 10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి డబ్బులు రిలీజ్ చేశారు. ప్రాజెక్ట్ డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే ఆమోదం తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ లేకుండా నిధులు మళ్లించారు. ఒప్పందం చేసుకున్న సీమెన్స్ కంపెనీకి కాకుండా షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలించారు. తప్పు జరినప్పుడు చంద్రబాబు ఎందుకు నోరెత్తలేదు. స్కామ్‌తో మాకు సంబంధంలేదని సీమెన్స్ కంపెనీ ప్రకటించింది. సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే వాళ్ల మనుషులని అర్థం. చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన ఒప్పందం ఇదే. గంటా సుబ్బారావు, లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలోనే స్కాం జరిగింది. చంద్రబాబు హయాంలో జరిగిన ఈ స్కాం గురించి ఎల్లో మీడియా ఒక్క మాట కూడా రాయలేదు. మేం అధికారంలోకి వచ్చాకే స్కామ్ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబు గొప్ప చోర కళాకారుడు. తన బాబు తన స్కిల్ చూపించి రూ.371 కోట్లు కొట్టేశారు. ప్రజా ధనాన్ని చంద్రబాబు.. లూటీ చేశారు. అన్ని వ్యవస్థలను మేనేజ్ చేసే స్కిల్ చంద్రబాబుకు ఉంది. ఈ స్కామ్‌పై పూర్తి దర్యాప్తు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. ఇది కూడా చదవండి: టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్! -
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం.. పోడియం వద్దకొస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్!
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో తనపై టీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించడం పట్ల స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో టీడీపీ నేతలు చేసిన దౌర్జన్యాన్ని ఆయన ఖండించారు. తాను గౌతమ బుద్దుడు కాదన్న తమ్మినేని..లైన్ దాటకుండా నిరసన తెలిపే హక్కు సభ్యులకు ఉందన్నారు. ఇకపై పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని స్పీకర్ కీలక రూలింగ్ ఇచ్చారు. టీడీపీ సభ్యులు సభను అగౌరవ పరిచారని విమర్శించారు. సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయమైన చర్యగా అభివర్ణించారు. టీడీపీ సీనియర్ సభ్యులే తనపై దాడులు చేయడం దురదృష్టకరమన్నారు. నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?.. బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? అంటూ స్పీకర్ మండిపడ్డారు. తన చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదని స్పష్టం చేశారు. తనకు సభ్యులంతా సమానమేనన్న తమ్మినేని.. సభలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు చూడలేదని తెలిపారు. స్పీకర్ చైర్‌ను టచ్ చేసి ముఖంపై ప్లకార్డులు ప్రదర్శించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంత జరిగినా టీడీపీ సభ్యుల వైఖరిని మౌనంగానే భరించానని తెలిపారు. ‘సభలో దాడులు చేయమని టీడీపీ సభ్యులకు ఎవరు చెప్పారు?. సభను సజావుగా నడిపించడమే నా కర్తవ్యం. సభ్యుల హక్కులు పరిరక్షించడం నా బాధ్యత. టీడీపీ నేతలు పేపర్లు చించి నాపై వేస్తుంటే.. పూలు చల్లుతున్నారనే భావించా. ఎమ్మెల్యే ఎలీజాను టీడీపీ సభ్యులు నెట్టేశారు. సభా సమయం, ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రోజాను ఏడాది సస్పెండ్ చేశారు. సభలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తారు. టీడీపీ నేతల తీరు మారాలి’ అని స్పీకర్ వ్యాఖ్యానించారు. కాగా సోమవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు.స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. చదవండి: టీడీపీ నేతల దాడి: ‘ఇది బ్లాక్ డే.. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లోనే’ -
ఏపీ అసెంబ్లీ.. స్పీకర్‌పై టీడీపీ సభ్యుల దాడి!
సాక్షి, అమరావతి:టీడీపీ సభ్యుల తీరు రోజురోజుకూ శ్రుతిమించుతోంది. సభా కార్యకలాపాలను అడ్డుకోవడమే కాక.. ఏకంగా సహచర సభ్యులు, స్పీకర్ పట్ల అనుచితంగా వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏడో రోజు సభ కొలువైంది. అయితే, ప్రశ్నోత్తరాల సమయం నుంచే టీడీపీ సభ్యులు గందరగోళం సృష్టించి దౌర్జన్యానికి దిగారు.స్పీకర్ తమ్మినేని సీతారామ్‌పై టీడీపీ సభ్యులు దాడికి పాల్పడ్డారు. స్పీకర్ చైర్ ఎక్కి ఆయన ముఖంపై ఫ్లకార్డులు అడ్డుగా పెట్టారు. పేపర్లు చింపి ఆయనపై విసిరేశారు. తమ్మినేని ఎంత విజ్ఞప్తి చేసినా పట్టించుకోకుండా ఆయన పట్ల దురుసుగా ప్రవర్తించారు. సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చేరుకున్నారు. వారిపై కూడా టీడీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే సుధాకర్ బాబుపై దూషణలకు దిగారు. వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను గోరంట్ల బుచ్చయ్య చౌదరి నెట్టేశారు. దీంతో వెల్లంపల్లి కిందపడబోయారు. డిప్యూటీ సీఎం నారాయణస్వామిని టీడీపీ ఎమ్మెల్యే డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి దూషించారు. పచ్చపార్టీ నేతల తీరును వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. ఇది బ్లాక్ డే గా అభిప్రాయపడ్డారు. చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు: సీఎం జగన్
Live Update అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై సీఎం వైఎస్ జగన్ ప్రసంగం Time: 03:32PM ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు సీమెన్స్సంస్థ కూడా ఇంటర్నెల్ దర్యాప్తు జరిపింది ప్రభుత్వ జీవోతో తమకు సంబంధం లేదని సీమెన్స్చెప్పింది తీగ లాగితే డొంక కదిలింది షెల్ కంపెనీల ద్వారా తిరిగి మళ్లీ చంద్రబాబు జేబులోకే డబ్బులు ఈ స్కాంపై గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు వచ్చింది. సర్వీస్ ట్యాక్స్ కట్టకపోవడంతో జీఎస్టీ అధికారులు కూపీ లాగారు. 2017లో ఈ స్కామ్‌ను జీఎస్టీ అధికారులు వెలికితీశారు స్కిల్లర్, డిజైన్‌టెక్ సర్వీస్ ట్యాక్స్ కట్టకుండా క్లెయిమ్ చేశారు. ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించినట్టు గుర్తించారు. విదేశీ లాటరీ తరహాలో స్కామ్‌కు పాల్పడ్డారు రూ. 371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు చంద్రబాబు చేతిలో ఎక్కువ మీడియా ఉంది.. నిజాన్ని అబద్దం చేయగలడు.. అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు బాబును కాపాడేందుకు ఈ గజదొంగల ముఠా ప్రయత్నాలు చేస్తోంది స్కిల్డ్ క్రిమినల్స్ చేసిన అతిపెద్ద స్కామ్ ఇది 90 శాతం సీమెన్స్, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు సుమారు రూ. 3 వేల కోట్లు సీమెన్స్ఇస్తుందని ప్రచారం చేశారు ఒక ప్రైవేట్ కంపెనీ ఎక్కడైనా రూ. 3 వేల కోట్ల గ్రాంట్ ఇస్తుందా? డీపీఆర్‌ను సైతం తయారు చేయించలేదు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఖర్చు రూ. 3,356 కోట్లు ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం.. అంటే రూ. 371 కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు మిగిలిన 3 వేల కోట్లు సీమెన్స్ ఇస్తుందని జీవోలో చెప్పారు గ్రాంట్‌గా ఇస్తే మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కానీ ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనే ప్రస్తావనే లేదు జీవో వేరే.. ఒప్పందం వేరే.. మరి సంతకాలు ఎలా చేశారు 3 నెలల కాలంలోనే 5 దఫాల్లో రూ. 371 కోట్లు విడుదల చేశారు చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుందా నేను బటన్ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.. చంద్రబాబు బటన్ నొక్కితే ఆయన ఖాతాల్లోకి సొమ్ము రూ. 371 కోట్లు చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు మనీలాండరింగ్ ద్వారా ఆయన చేతుల్లోకి డబ్బు వచ్చింది చంద్రబాబు బటన్ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్ ఇది రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే అతిపెద్ద స్కామ్ ఇది దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్ చేశారు ఇవన్నీ ఒక్క క్రిమినల్ మాత్రమే చేయగలడు బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్ ఊపిరి పోసుకుంది వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371 కోట్లు కొట్టేశారు లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారు చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేపడితే పూర్తి చర్చ జరగాలి సీమెన్స్ అనే ప్రైవేట్ సంస్థ రూ. 3 వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారు సీమెన్స్ కంపెనీలోని వ్యక్తితో లాలూచీ పడ్డారు ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు నోరు మెదపలేదు? దత్తపుత్రుడు కూడా ఈ స్కామ్‌పై ప్రశ్నించలేదు ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదు దోచుకు, పంచుకో, తినుకో అన్నదే వారి విధానం ఎవడూ రాయడు, ఎవడూ చూపడు, ఎవడూ అడగడు జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు కేబినెట్ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారు 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవో చెప్పారు ఒక క్లస్టర్‌కు రూ. 546 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు Time: 03:26PM ►ఇండస్ట్రీస్, స్కిల్‌ను కనెక్ట్ చేస్తున్నాం: మంత్రి గుడివాడ అమర్నాథ్ ►ఇప్పటి వరకు 72.5 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించాం. ►స్కిల్ డెవలప్మెంట్ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు. ►రూ. 3,356 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి మోసం చేశారు. Time: 03:10PM చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్ డెవలప్మెంట్ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ. ►సీ అంటే చంద్రబాబు.. మెన్ అంటే ఆయన మనుషులు అని అర్థం: కన్నబాబు ►చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన్ ఒప్పందం అదే. ► రాష్ట్రంలో మొదలై విదేశాలకు పాకిన కుంభకోణం ► దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు ► హవాలా మార్గంలో మళ్లీ దేశంలోకి సొమ్ముల మళ్లింపు ► చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్ స్కామ్ ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ. ► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు ► తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెట్టిన బాబు. ► సీమెన్స్ ముసుగు తొడిగి అక్కడ ఉద్యోగితో లోపాయికారీ ఒప్పందం ► కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటంఎగా కేబినెట్ ఆమోదం. ►సీమెన్ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు. ►10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డబ్బులు విడుదల చేశారు. ►ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్లేకుండానే గ్రీన్ సిగ్నల్ ► రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం. ► జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న బాబు సర్కార్. ► ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి జోవోల అంశాలు కనుమరుగు. ► ప్రభుత్వం ఇచ్చే దాన్ని ఆర్థిక సహాయంగా పేర్కొంటూ ఒప్పందం. ► జీవో అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ► ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. ► డబ్బు విడుదలకు ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలు. ► వాటిని కొట్టేసి.. తానే స్వయంగా విడుదల చేసిన చంద్రబాబు. ► తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్. ► జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి వచ్చిన స్కామ్. ► ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. Time: 02:30PM ►శాసన సభకు ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయి: స్పీకర్ తమ్మినేని ►ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలు అడ్డుకోవడం, స్పీకర్‌ను దూషించడం, అనైతికంగా వ్యవహరిస్తే వరుసగా 5 సెక్షన్లపాటు సస్పెండ్ చేయొచ్చు. Time: 01:30PM ►పలు శాఖల అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో చర్చ. ►వివిధ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రులు Time: 12:50PM ►టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున ►చంద్రబాబు టీడీపీ సభ్యులను రెచ్చగొట్టి పంపిస్తున్నారు. ►బీసీ వ్యక్తి స్పీకర్‌గా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు. ►ఎస్సీ సభ్యులను పురిగొల్పి స్పీకర్‌పై దాడి చేయిస్తున్నారు. ►రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు. Time: 12:20PM ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం ►తాను గౌతమ బుద్దుడు కాదన్న స్పీకర్ ►సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయం. ►పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్ సస్పెన్షన్ చేస్తానని రూలింగ్ ఇచ్చిన స్పీకర్. Time: 11:50AM ►టీడీపీ సీనియర్ సభ్యులే దాడులు చేయడం దురదృష్టకరం: స్పీకర్ తమ్మినేని ►నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా? ►బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా? ►నా చైర్ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదు. Time: 11:20AM ►టీడీపీ సభ్యులకు సంస్కారం లేదు: మంత్రి విడదల రజని ►సభలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చేశారు. ►చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారు. ►టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే జీవో నెం.1 ►స్పీకర్‌పై టీడీపీ సభ్యులు భౌతికంగా దాడి చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్. ►టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ►టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై కూడా దాడి చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ►సభలో గొడవలు సృష్టించాలనేదే టీడీపీ కుట్ర. ►బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు. Time: 10:40AM ►చంద్రబాబుకు దాడులు చేయించడం అలవాటే: మంత్రి సీదిరి అప్పలరాజు. ►బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది. ►సభలో కావాలనే టీడీపీ సభ్యులు దాడులు చేశారు ►స్పీకర్ అటెండర్‌ను పక్కకు నెట్టేశారు. ►టీడీపీ సభ్యుల దాడులను టీవీల్లో ప్రదర్శించాలి. ►సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరం: మంత్రి అంబటి. ►చంద్రబాబు సభకు రాకుండా దాడులు చేయిస్తున్నారు. ►టీడీపీ సభ్యులకు స్పీకర్ అంటే గౌరవం లేదు. ►టీడీపీ సభ్యులు నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే ఎలీజా. ►సభాపతిని టీడీపీ సభ్యులు అవమానించారు. ►టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలి. Time: 10:10AM ► ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ ► ఒకరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసిన స్పీకర్ Time: 10:00AM ►స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు. ►వైఎస్సార్సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు. ►సుధాకర్ బాబుపై దూషణలకు దిగిన టీడీపీ సభ్యులు. ►వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నెట్టేసిన బుచ్చయ్య చౌదరి. ►బుచ్చయ్య చౌదరి నెట్టడంతో కిందపడబోయిన వెల్లంపల్లి. ►డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా దూషణలు. ►టీడీపీ ఎమ్మెల్యే డోలా నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుధాకర్ బాబు. ►చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు. ►దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాలి. ►సభలో గొడవ చేయించింది చంద్రబాబే. ►టీడీపీ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించారు. Time: 9:35AM ►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల దౌర్జన్యం. ►స్పీకర్ పట్ల వద్ద టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన. ►పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరిన టీడీపీ సభ్యులు. ►స్పీకర్ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని టీడీపీ సభ్యులు ►స్పీకర్ ముఖంపై ఫ్లకార్డు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోలా. ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం అసహనం. ►సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్ అసంతృప్తి. Time: 9:20AM ► చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ►పట్టభద్రుల ఎన్నిక ప్రత్యేకమైన ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఎన్నిక.. ►చంద్రబాబు చేసుకున్నవి ఆఖరి విజయోత్సవాలు. ►2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు. ►అసెంబ్లీలో చంద్రబాబు శాశ్వతంగా అడుగుపెట్టే అవకాశం లేదు. ►ఏపీలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది. ►నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది. ►నష్టపోయిన రైతుకు ఇన్పుట్ సబ్సిడీలోపాటు బీమా పరిహారం కల్పిస్తాం. ►రైతులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. ►ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి అంబటి రాంబాబు ►సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు. ►ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు ►సభలో అచ్చెన్నాయుడు భాష సరిగా లేదు: మంత్రి కొట్టు సత్యనారాయణ ►జీవో నెం1 అందరికీ వర్తిస్తుంది. సాక్షి, అమరావతి: ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం పలు శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించనుంది. 10 సవరణ బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు. -
టీడీపీ స్కిల్ స్కాంపై మంత్రి బుగ్గన కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు. ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు. ఇంకా ఏమన్నారంటే.. జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు. ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల. డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం. వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు. తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు. జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది. ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు. ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం. మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్. ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి. అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు. ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ. కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ. రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం. దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు. గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు. సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు. రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు. రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్‌కు ఎంవోయూ చేసుకున్నారు. డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు. ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి. జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు. ఫేక్ ఇన్వాయిస్లతో నిధులు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు. స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు. రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు. సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు. 10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల. గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది. సుమన్ బోస్కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు. నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు. చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు. -
‘స్మార్ట్ మీటర్లపై టీడీపీ, కమ్యూనిస్టులు తప్పుడు ప్రచారం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని వ్యవసాయ పంపుసెట్లకు గానూ 18.57 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర-సాంకేతిక, గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఆదివారం శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... 1)స్మార్ట్ మీటర్లు కొనుగోలు, ఇన్స్టలేషన్, నిర్వహణ కోసం మొత్తం రూ. 3,406.14 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. అలాగే మీటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు, రక్షణ అనుబంధ పరికరాల కోసం 2286.22 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేయడం జరిగింది. 5692.36 కోట్లు ఆయా సంవత్సరాల బడ్జెట్ లలో కేటాయించడం ద్వారా దీనిని ప్రభుత్వం భరిస్తోంది. 2) కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం లిమిట్ పెంచడానికి పెట్టిన కండీషన్ కోసం రైతులకు ఇచ్చే విద్యుత్ కు మీటర్లు పెట్టామని తెలుగుదేశం సభ్యులు ఆరోపించడం భావ్యం కాదు. రైతులందరికి మేలు చేసేలా వారు వినియోగించిన విద్యుత్ బిల్లులను డిబిటి ద్వారా డబ్బులు వారి ఖాతాలకు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం స్మార్ట్ మీటర్లు భిగించడం ద్వారా ఏ రైతు ఎంతమేర విద్యుత్ ను వినియోగిస్తున్నాడనే లెక్కలు తేల్చడం కోసమే పైలెట్ ప్రాజెక్ట్ గా శ్రీకాకుళం జిల్లాలో దీనిని ప్రారంభించాము. అక్కడ డిఆర్బిఎ మీటర్లు పెట్టాం. 1.9.2020, జిఓ నెం. 22 ప్రకారం శ్రీకాకుళం జిల్లాలో 18వేల ఉచిత వ్యవసాయ కనెక్షన్లు ఉండటం వల్ల అందుబాటులో ఉన్న ఐఆర్‌డిఎ మీటర్లు, అనుబంధ సామగ్రితో ఈ జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ గా అమలు చేశాం. 3) శ్రీకాకుళం జిల్లాల్లో 2021 ఆర్థిక సంవత్సరంలో ఉచిత విద్యుత్ కోసం వినియోగించిన విద్యుత్ 101.5 మిలియన్ యూనిట్లు ఉంటే మీటర్లు ఏర్పాటు వల్ల 67.76 మిలియన్ యూనిట్ల వినియోగం జరిగినట్లు తేలింది. అంటే ఏడాదికి 33.75 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం తక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగింది. అలాగే పైలెట్ ప్రాజెక్ట్ తర్వాత శ్రీకాకుళం జిల్లాలో 2022 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ వినియోగదారుల సంఖ్య పెరిగిప్పటికీ విద్యుత్ వినియోగం మాత్రం 33% తగ్గింది. 4) ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఉచిత వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు పెట్టలేదు. డొమెస్టిక్ మాటర్లు మాత్రమే పెట్టారు. ప్రతిచోటా మనకంటే రెట్టింపు ఉన్నాయి. స్మార్ట్ మీటర్ల కోసం 2021లో 6480.12 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవడం జరిగింది. అప్పటి రేట్ల ప్రకారం అధిక వ్యయం అవుతుండటంతో సదరు టెండర్లను రద్దు చేయడం జరిగింది. కరోనా పాండమిక్ తరువాత రేట్లు కొంత మేర తగ్గడంతో తిరిగి 2022లో అప్పటి రేట్ల ప్రకారం రూ.5692.35 కోట్లతో సవరించిన అంచనాలతో టెండర్లు పిలిచాం.టెండర్ ఫైనాన్షియల్ బిడ్ ప్రాసెస్ లో ఉంది. దీనిని ఎవరికో ఇచ్చేశామని, మాకు కావాల్సిన వారికి కట్టబెట్టామనే విధంగా మాట్లాడటం కూడా సరికాదు. 5) తెలుగుదేశం సభ్యులు మాట్లాడుతూ ఇంధనశాఖ స్పెషల్ సీఎస్ విజయానంద్ ప్రభుత్వంకు రాసిన లేఖలో స్మార్ట్ మీటర్లు అవసరం లేదని పేర్కొన్నట్లుగా సభలో మాట్లాడారు. అది వాస్తవం కాదు. మీటర్ల ఏర్పాటుపై అన్ని రకాల మీటర్లను పరిశీలించి చర్యలు తీసుకోవాలని ఆయన లేఖలో రాశారు. దీనిని వక్రీకరించి మాట్లాడటం దురదృష్టకరం. 6) చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్ పై ఎం మాట్లాడారో అందరికీ తెలుసు. ఉచిత విద్యుత్ ఇచ్చే తీగెలపై దుస్తులు ఆరేసుకోవాలని ఆయన మాట్లాడలేదా? వ్యవసాయం దండగ అని అనలేదా? ఈ ప్రభుత్వం రైతులకు పగటిపూటే తొమ్మిది గంటల పాటు నాణ్యమైన విద్యుత్ ను వ్యవసాయం కోసం ఉచితంగా అందిస్తోంది. తెలుగుదేశం హయాంలో అర్థరాత్రి ఇచ్చే ఉచిత విద్యుత్ వల్ల ఎంత మంది రైతులు చీకట్లో పాము కాటుకు గురయ్యారు, ఎంత మంది విద్యుత్ షాక్ తో మృతి చెందారో తెలుగుదేశం సభ్యులు లెక్కలు చెప్పాలి. ఇప్పుడు వ్యవసాయ కనెక్షన్ లకు స్మార్ట్ మీటర్లు భిగించాలనే నిర్ణయం కోసం వాస్తవంగా ఉచిత వ్యవసాయ కనెక్షన్ల ద్వారా ఎంత వినియోగం అవుతుందో తెలుసుకునేందుకే. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకే. ఇది కూడా కేంద్రప్రభుత్వం, సెంట్రల్ రెగ్యులేటరీ అథారిటీ మార్గదర్శకాల ప్రకారమే స్మార్ట్ మీటర్లను అమరుస్తున్నాం. దీనిపై టీడీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు డిబిటి కోసం స్వచ్ఛందంగా బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నారు. ఇప్పటి వరకు కేవలం 10,025 మంది రైతులు మినహా మిగిలిన రైతులంతా ఖాతాలను తెరిచారు అని మంత్రి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
చంద్రబాబు, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్
సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. కాగా, మంత్రి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలు 175 నియోజకవరాగల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడించారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీకి అంత నమ్ముకం ఉంటే లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదు?. మేము గెలిస్తే డబ్బులతో గెలిచామంటున్నారు. టీడీపీ గెలిస్తే ప్రజా తీర్పు అంట?. కానీ.. వైఎస్సార్సీసీ మాత్రం ప్రజా తీర్పుతో గెలిచింది. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. వైఎస్సార్సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు అంటూ కామెంట్స్ చేశారు. -
రైతులను గుర్రాలతో తొక్కించిన చరిత్ర చంద్రబాబుది: కన్నబాబు
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి కన్నబాబు టీడీపీ, చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బషీర్‌బాగ్‌లో రైతలును కాల్చి చంపింది ఎవరూ? అని కన్నబాబు ప్రశ్నించారు. నిడదవోలు కాల్దరి గ్రామంలో రైలు పట్టాలపై ధర్నా చేస్తున్న రైతులపై కాల్పులు జరిపితే ఇద్దరు రైతులు చనిపోయారని గుర్తు చేశారు. ఏలూరు కలెక్టరేట్లో రైతులపై బాబు లాఠీచార్జ్ చేయించారని ప్రస్తావించారు. హైదరాబాద్‌లో రైతులను గుర్రాలతో తొక్కించారని మండిపడ్డారు. ‘2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ అమలు చేసినప్పుడు లెఫ్ట్ పార్టీలు చంద్రబాబును ప్రపంచ బ్యాంకు జీతగాడు అన్నాయి. విద్యుత్ బిల్లులు కట్టలేదని మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలో రైతులకు సంకెళ్లు వేసి వ్యానులో తరలించిన చరిత్ర చంద్రబాబుది. రైతులను రోజుల తరబడి జైళ్లలో పెట్టించాడు. పార్టీలు మారటం గురించి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నాడు. పార్టీ లేదు.. బొక్కా లేదు అన్న వ్యక్తి అచ్చెన్నాయుడు. చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, టీడీపీలో చేరి మామ నుంచి పార్టీని లాక్కున్నాడు. రాష్ట్రంలో చంద్రబాబు చేతికి అందని పార్టీ వైఎస్సార్ సీపీ మాత్రమే’నని కన్నబాబు ధ్వజమెత్తారు. చదవండి: ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ -
చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం: ఎమ్మెల్యే కేతిరెడ్డి
Live Updates ఏపీ అసెంబ్లీ రేపటి(సోమవారం)కి వాయిదా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీచ్.. చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్ స్కామ్‌లోనే రూ.371 కోట్లు దోపిడీ చంద్రబాబు అధికారంలో వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు తన మనుషులను స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో పెట్టిన చంద్రబాబు కేవలం ఒక నోట్ ఆధారంగా స్పెషల్ ఐటైంగా కేబినెట్ ఆమోదం ప్రాజెక్టు డీపీఆర్, సర్టిఫికేషన్ లేకుండానే గ్రీన్ సిగ్నల్ రూ.3356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న చంద్రబాబు సర్కారు ఒప్పందం సమయానికి వచ్చేసరికి జీవోలోని అంశాలు కనుమరుగు జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు మంత్రి రోజా సవాల్ టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. టీడీపీకి అంత నమ్మకం ఉంటే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన లోకేష్ ఎందుకు పోటీ చేయలేదు. వైఎస్సార్సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు. 2:20PM ఏపీ శానసమండలి రేపటికి వాయిదా Time: 01:40 PM చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చ 2014లో చంద్రబాబు ఇంటింటికి ఉద్యోగం అన్నారని.. నిరుద్యోగ భృతి ఇస్తామని మోసం చేశారంటూ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాంపై చర్చలో ఆయన మాట్లాడుతూ.. ఈఎస్ఐ, అమరావతి, స్కిల్ డెవలప్మెంట్లో అక్రమాలకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ‘‘గంటా సుబ్బారావు అక్రమంగా రూ.371 కోట్లు మళ్లించారు. షెల్ కంపెనీల ద్వారా కోట్లు దోచుకున్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే స్కిల్ డెవలప్మెంట్ స్కాం జరిగింది’’ అని కేతిరెడ్డి మండిపడ్డారు. Time: 12:00PM ►ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు సస్పెండ్ అయ్యారు. టీడీపీకి చెందిన 11 మంది సభ్యులను ఒకరోజుపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని ప్రకటించారు. Time: 11:20AM ►శాసనమండలిలో టీడీపీ సభ్యుల తీరుపై ఛైర్మన్ మోషేన్ రాజు ఆగ్రహం. ►మండలికి సంబంధంలేని అంశాలను ప్రస్తావించడం పట్ల అసంతృప్తి. ►ఎమ్మెల్సీ డిక్లరేషన్ ఇవ్వలేదంటూ టీడీపీ వాయిదా తీర్మానం. ►డిక్లరేషన్ అంశం ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశం. ►ఈ అంశం మండలికి సంబంధించినది కాదు. ►టీడీపీ సభ్యులు కావాలనే సభా సమయాన్ని వృథా చేస్తున్నారు. ►డిక్లరేషన్ అంశం మండలికి సంబంధించినది కాదు: ఉమ్మారెడ్డి. ►సభకు సంబంధంలేని అంశాలను చర్చించాలని టీడీపీ సభ్యులు గొడవ చేయడం మంచిది కాదు. Time: 10:40AM ►అచ్చెన్నాయుడికి క్యారెక్టర్ లేదు: మంత్రి జోగి రమేష్ ►పగటిపూట నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ప్రభుత్వం మాది. ►మాది రైతు పక్షపాత ప్రభుత్వం. ►ఉచిత విద్యుత్ దండగని మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు: మాజీ మంత్రి కన్నబాబు. ►చంద్రబాబు పుట్టుక కాంగ్రెస్, మామను చీట్ చేసి పార్టీని లాక్కున్నాడు. ►ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు టీడీప నేతలకు లేదు. Time: 10:10AM ►ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు: జక్కంపూడి రాజా ►రైతుల సమస్యలను ఆర్బీకేలు పరిష్కరిస్తున్నాయి. Time: 9:40AM ►రుణమాఫీ హామీ ఇచ్చి చంద్రబాబు మోసం చేశారు: ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ►మ్యానిఫెస్టోలో చెప్పినదానికంటే రైతులకు అదనంగా సాయం చేస్తున్నాం. ►వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 అందిస్తున్నాం. ►ఆర్బీకేల ద్వారా రైతులకు నూతన సాంకేతిక పరిజ్ఙానం అందిస్తున్నాం. Time: 9:15AM ►రైతులను మోసం చేసిన ఘనుడు చంద్రబాబు: ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి ►రైతులకు రూ. 900 కోట్ల బకాయి పెట్టిన వ్యక్తి చంద్రబాబు. ►చంద్రబాబు, కరువు కవల పిల్లలు. ►చంద్రబాబు హయాంలో మూడేళ్లు కరువే. ►మా ప్రభుత్వంలో ఒక్క కరువు మండలం లేదు. ►ఆర్బీకేల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నాం. ►పండించిన పంటకు కూడా గిట్టుబాటు ధర కల్పిస్తున్నాం. సాక్షి, అమరావతి: ఆరో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం పలు శాఖల డిమాండ్లపై చర్చ జరగనుంది. అదే విధంగా గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, యువతకు స్కిల్ డెవలప్మెంట్పై చర్చ కొనసాగనుంది. అటు శాసన మండలిలో 10 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభ ప్రారంభం కానుంది. మండలిలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్, సమగ్ర భూ సర్వేపై సభ్యులు చర్చించనున్నారు. -
తొమ్మిది పద్దులకు శాసనసభ ఆమోదం
సాక్షి, అమరావతి: శాసనసభ సమావేశాల్లో భాగంగా శనివారం బడ్జెట్ పద్దులకు ఆమోదం లభించింది. ఇందులో భాగంగా రూ.89,232.55 కోట్ల విలువైన తొమ్మిది పద్దులను సభ ఆమోదించింది. అనంతరం వీటిపై సభ్యులు చర్చించారు. తర్వాత వారు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇచ్చారు. 2023–24 వార్షిక బడ్జెట్లో భాగంగా రోడ్లు–భవనాలు, జలవనరులు, ఇంధన, అటవీ, పర్యావరణ, శాస్త్ర– సాంకేతిక, గృహనిర్మాణం, బీసీ, సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల నిర్వహణ పద్దులు ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. రూ.21,756.69 కోట్లు వెచ్చించాం మైనార్టీల సంక్షేమం అంటే నాడు వైఎస్సార్ గుర్తొస్తే.. నేడు వైఎస్ జగన్ గుర్తొస్తారు. మైనార్టీల సంక్షేమానికి చంద్రబాబు గత ఐదేళ్లలో రూ.2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే.. మా ప్రభుత్వం 45 నెలల కాలంలోనే రూ.21,756.69 కోట్లు వెచ్చించింది. దేశంలోనే తొలిసారిగా మైనార్టీలకు సబ్‌ప్లాన్ తీసుకొచ్చిన ప్రభుత్వం మాది. – అంజాద్‌బాషా, ఉప ముఖ్యమంత్రి బీసీల కోసం ఆలోచించే ప్రభుత్వం సీఎం జగన్ బీసీల జీవితాల్లో మార్పు కోసం అనేక నిర్ణయాలు తీసుకున్నారు. 56 బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు నవరత్నాలతో ఆర్థిక భరోసా కల్పిస్తున్నారు. బీసీల సంక్షేమం కోసం నిరంతరం ఆలోచించే ప్రభుత్వం ఇది. – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి 17 వేల జగనన్న కాలనీలు ఏపీలో 13 వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ప్రతి మహిళకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల ఆస్తిని సీఎం జగన్ ఇంటి స్థలం రూపంలో అందించారు. ఇంకా ఎక్కడైనా అర్హులు ఉంటే వారికి కూడా ఇళ్ల స్థలాలు అందిస్తాం. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రాజెక్టులపై దృష్టి పెట్టాలి రాష్ట్రంలో ఇరిగేషన్‌పై పేటెంట్ రైట్ వైఎస్సార్‌కే ఉంది. పోలవరం నిర్మాణంతోపాటు సర్ ఆర్థర్ కాటన్ కట్టడాల ఆధునికీకరణ పనులు ఆయన హయాంలోనే జరిగాయి. ఇప్పుడు వాటిపై దృష్టి సారించాల్సిన సమయం వచ్చింది. దెబ్బతిన్న కాటన్ ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి. కోనసీమ ప్రాంతంలో నీరందని పరిస్థితి ఉంటే రైతుల ఆయిల్ ఇంజన్లకు నగదు ఇవ్వాలి. ముంపు చర్యలను కూడా శాశ్వతంగా పరిష్కరించాలి. – చిర్ల జగ్గిరెడ్డి, ప్రభుత్వ విప్ గతం కంటే అధికంగా కేటాయింపులు గతేడాదితో పోలిస్తే గిరిజన సంక్షేమానికి 18 శాతం అదనంగా ఈసారి బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది. సబ్‌ప్లాన్ కింద 13 శాతం ఎక్కువగా కేటాయింపులు చేసింది. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్లలో గిరిజనుల సంక్షేమానికి రూ.12,600 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. జగన్ ప్రభుత్వం 45 నెలల్లోనే రూ.16,975 కోట్లు ఖర్చు చేసింది. ఐదేళ్లు పూర్తయ్యే సరికి రూ.22 వేల కోట్లు ఖర్చు చేయనున్నాం. – పీడిక రాజన్నదొర, ఉప ముఖ్యమంత్రి మైనార్టీల అభ్యున్నతికి అండగా.. రాష్ట్ర ప్రభుత్వం పేదలకు విద్య, వైద్యం, ఇళ్లు, సంక్షేమ పథకాలతో భరోసా ఇస్తోంది. విద్య దగ్గర నుంచి పెళ్లి వరకు అన్ని రకాల సాయం అందిస్తూ మైనార్టీల అభ్యున్నతికి అండగా నిలుస్తోంది. వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణకు మరింత పటిష్ట చర్యలు చేపట్టాలి. – హఫీజ్‌ఖాన్, ఎమ్మెల్యే రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలి గత ప్రభుత్వం చేసిన పాపాలకు రోడ్లపై తిరగలేని పరిస్థితి ఉంది. పైగా ఇప్పుడే రోడ్లు దెబ్బతిన్నట్టు టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. ఈ బడ్జెట్లో రూ.9 వేల కోట్లకుపైగా రోడ్లకు కేటాయించడం హర్షణీయం. ఆయా రోడ్ల పనులను వేగంగా పూర్తి చేయాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ విద్యుత్ ఉత్పత్తి పెరిగింది ఇప్పటి వరకు మా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌కు రూ.27,800 కోట్లు ఖర్చు చేసింది. ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలను తగ్గించాలని కేంద్రం చెప్పినట్టు స్మార్ట్ మీటర్లు పెడుతుంటే టీడీపీ దుష్ప్రచారం చేస్తోంది. సమృద్ధిగా వర్షాలు పడటంతో డ్యాములు నిండాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తి పెరిగింది. – కిలారి రోశయ్య, ఎమ్మెల్యే అన్ని రంగాల్లో గిరిజనులు ముందుకు సామాజికంగా, రాజకీయంగా గిరిజనులను పైకి తీసుకొస్తున్న ఏకైక ప్రభుత్వం మాది. గతంలో ఎన్నడూ లేని విధంగా గిరిజనులు ప్రస్తుతం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఆంగ్లంలోనూ విద్యనభ్యసిస్తున్నారు. గురుకులాల్లో ఆరోగ్య, భద్రత చర్యలను మరింత మెరుగుపర్చాలి. ప్రస్తుత హైస్కూళ్లను ఇంగ్లిష్ మీడియం కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయాలి. అటవీ ఉత్పత్తుల సంతల ఆధునికీకరణ, ప్రాసెసింగ్ యూనిట్ల అభివృద్ధి చేపట్టాలి. – విశ్వాసరాయ కళావతి, ఎమ్మెల్యే వైఎస్సార్ తర్వాత జగన్ ఒక్కరే.. పేదలకు ఇళ్లే స్వర్గసీమ. మహానేత వైఎస్సార్ తర్వాత పేదలకు ఇళ్ల గురించి ఆలోచించిన వ్యక్తి.. సీఎం జగన్. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇస్తే.. మా రాయదుర్గం నియోజకవర్గంలోనే 13 వేల మందికి పట్టాలు ఇచ్చారు. – కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే ఎస్సీలకు ఇంటింటికీ సంక్షేమం.. రాష్ట్రంలో ఎస్సీలకు ఇంటింటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఎస్సీల సంక్షేమానికి గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.33 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మా ప్రభుత్వం నాలుగేళ్లలోనే రూ.52 వేల కోట్లు ఖర్చు చేసింది. – కొరముట్ల శ్రీనివాసులు, ప్రభుత్వ విప్ బీసీలకు ఉన్నత పదవులు.. దేశ చరిత్రలోనే ఎక్కడా లేనివిధంగా 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీలను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి పథంలో నడిపిస్తోంది. చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటే.. నేడు జగన్ ప్రభుత్వంలో బీసీలకు ఉన్నత పదవులు దక్కుతున్నాయి. – ఉమాశంకర్ గణేష్, ఎమ్మెల్యే రాష్ట్ర మహిళలకు ఆర్థికంగా అగ్రస్థానం ఓఈసీడీలోని అభివృద్ధి చెందిన 38 దేశాల్లో అవలంబిస్తున్న యాక్షన్ ప్లాన్ మన రాష్ట్రంలో అమలవుతోంది. దేశంలోనే మన రాష్ట్ర మహిళలు ఆర్థికంగా అగ్రస్థానంలో నిలుస్తున్నారు. మహిళా భద్రత, శిశు సంరక్షణకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అర్హులైన దివ్యాంగులకు అవసరమైన సాయాన్ని సత్వరం అందించేలా మరింత కృషి చేయాలి. – కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్యే -
గేమ్ ఛేంజర్.. పారిశ్రామిక ప్రగతి దిశగా అడుగులు
సాక్షి, అమరావతి: రేపటి తరాల భవిష్యత్, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం పరితపిస్తున్న, శ్రమిస్తున్న నాయకుడు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి.. రాష్ట్రంలో ఉన్న అపార వనరులను సరైన రీతిలో వినియోగించుకోవడం ద్వారా పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తున్నారని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అన్నారు. ఇటీవల విశాఖపట్నంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’ (ఏపీ జీఐఎస్)పై శాసనసభలో శనివారం స్వల్పకాలిక చర్చ నిర్వహించారు. ఈ చర్చలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా, పలువురు ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఆ సదస్సులో రూ.13,11,468 కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదిరాయన్నారు. ఈ క్రమంలో 6,07,383 మందికి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిలో జీఐఎస్ గేమ్ చేంజర్ అని కొనియాడారు. వ్యూహాత్మక విధానాలతో విజయం రాష్ట్ర ప్రభుత్వం సమ్మిట్ నిర్వహించడానికి ముందు రోడ్‌షోలు, వివిధ దేశాల దౌత్యవేత్తలతో సమావేశాలు, కర్టెన్‌రైజర్ కార్యక్రమాలు నిర్వహించాం. తద్వారా తీసుకున్న చర్యలు, వ్యూహాత్మక విధానాల ద్వారా విజయం సాధించాం. కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరి, ప్రపంచంలోనే దిగ్గజ పారిశ్రామికవేత్తలు అయిన రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ, కరణ్ అదానీ, నవీన్ జిందాల్, భారత్ బయోటెక్ కృష్ణా ఎళ్ల, జీఎంఆర్ గ్రూప్స్, జీఎం రావు, ఇతరులు సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇంధన శాఖలో రూ.9.05 లక్షల కోట్లు, పరిశ్రమలు, వాణిజ్యంలో రూ.3.38 లక్షల కోట్లు, పర్యాటక శాఖలో రూ.22,096 కోట్లు, ఐటీ, ఐటీ అనుబంధ రంగాల్లో రూ.41 వేల కోట్లు, వ్యవసాయ శాఖలో రూ.3,435 కోట్లు, పశు సంవర్థక శాఖలో రూ.1,020 కోట్లు చొప్పున రూ.13.11 లక్షల కోట్ల పెట్టుబడులతో 386 ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పెట్టుబడులకు వాస్తవ రూపం తీసుకు రావడం కోసం సీఎస్ అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో వరుసగా మూడేళ్లలో రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. కొత్తగా పరిశ్రమలు నెలకొల్పే వారి కోసం వైఎస్సార్ వన్ కింద 23 శాఖలకు సంబంధించి 96 క్లియరెన్స్‌లు 21 రోజుల్లో ఇస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది ఏపీ ప్రభుత్వమే. గత టీడీపీ ప్రభుత్వ హయాంతో పోలిస్తే రాష్ట్రం నుంచి ఎగుమతులు బాగా పెరిగాయి. అప్పట్లో ఏటా సగటున రూ.90 వేల కోట్ల లోపు మాత్రమే ఎగుమతులు ఉండేవి. మా ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం నుంచి 2019–20లో రూ.1.04 కోట్లు, 2020–21లో రూ.1.24 లక్షల కోట్లు, 2021–22లో రూ.1.43 లక్షల కోట్లు, 2022–23లో డిసెంబర్ వరకు రూ.1.18 లక్షల కోట్ల చొప్పున ఎగుమతులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మూడు పారిశ్రామిక కారిడార్లు ఉన్నాయి. వీటి పరిధిలో 48 వేల ఎకరాల భూమి పరిశ్రమలు నెలకొల్పడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసిన ఏకైక ప్రభుత్వం కూడా మాదే. ఇదివరకెన్నడూ లేని విధంగా సీఎం జగన్ ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్, ఇతరత్రా చర్యలతో ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా 13 లక్షల మందికిపైగా ఉపాధి లభించింది. బకాయిలతో కలిపి రూ.2800 కోట్ల మేర ప్రోత్సాహకాలు అందించాం. మూడేళ్లలో రూ.56 వేల కోట్లకు పైగా పెట్టుబడులతో 111 భారీ పరిశ్రమలు తీసుకుచ్చాం. వీటిలో 73 వేల మందికిపైగా ఉపాధి పొందుతున్నారు. మరో 88 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రూ.16 వేల కోట్లతో మరో మూడు పోర్టులు, తొమ్మిది ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం. రాష్ట్రానికి మంచి చేయాలని ఆలోచించిన నాయకులు నాడు వైఎస్సార్, నేడు సీఎం జగన్ మాత్రమే. టీడీపీ ప్రచారం అంతా అవాస్తవం. చంద్రబాబుకు చెందిన హెరిటేజ్ సంస్థను మేం ఇబ్బంది పెట్టామా? అనకాపల్లి జిల్లాలో ఉన్న హెరిటేజ్ ప్లాంట్ నాలుగేళ్లుగా పన్ను చెల్లించలేదు. – గుడివాడ అమర్నాథ్, పరిశ్రమల శాఖ మంత్రి విప్లవాత్మక మార్పులతో పెట్టుబడులు సీఎం జగన్ అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు కాబట్టే రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయి. పరిశ్రమలకు విద్యుత్ శాఖ వెన్నెముక లాంటిది. ఇటీవల విశాఖలో మొత్తం రూ.13 లక్షల కోట్ల ఎంవోయూల్లో ఇంధన శాఖకు సంబంధించే రూ.8,85,515 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. 2017లో చంద్రబాబు రూ.85,571 కోట్ల ఎంవోయూలు చేసుకుని 45,895 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పినప్పటికీ ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. 2018లో రూ.67,115 కోట్లతో ఎంవోయూలు చేసుకుంటే ఇందులో కూడా ఉద్యోగాలు జీరోనే. మేం చేసుకున్న ఒప్పందాలన్నీ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాం. భూమి, నీళ్లు, ఇతర వనరులను సమర్థవంతంగా వాడుకునేలా కొత్త పాలసీలు తెచ్చాం. ఏ రాష్ట్రానికైనా పవర్ ఇచ్చేలా 2020లో రెన్యూవబుల్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ పాలసీని తీసుకువచ్చాం. దీంతో సోలార్, ఎనర్జీ సంస్థలు వచ్చాయి. 29 పంప్డ్ స్టోరేజీ హైడ్రో పవర్ ప్రాజెక్టుల టెక్నికల్ కమర్షియల్ ఫీజబుల్ రిపోర్ట్ సిద్ధం చేశాం. మరికొన్ని చిన్న ప్రాజెక్టులకు నివేదికలు తయారు చేస్తున్నాం. మన దేశంలో 2030 నాటికి ఏడాదికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలనే భారత ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపడుతున్నాం. పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టుల స్థాపనలో ఎకరాకు రూ.31 వేలు చొప్పున రైతులకు లీజు లభిస్తుంది. – మంత్రి పెద్దిరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి ఆయనకు లోకజ్ఞానం ఉందా? దేశంలోనే అతిపెద్ద పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమ్మిట్‌కు మాత్రమే వచ్చారంటే సీఎం జగన్ పట్ల వారు ఎంత నమ్మకంగా, సానుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఓ నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ నిర్వహించి.. దారిన పోయే వారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారు. ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా? పారిశ్రామిక వేత్తల గురించి కనీస అవగాహన ఉందా? పరిశ్రమలు తరలిపోతున్నాయి.. పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సులకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. దేశంలోనే అత్యధిక వృద్ధి రేటుతో సీఎం అద్భుతంగా పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్ అంబానీ సమ్మిట్‌లో అన్నారు. జే అంటే జగన్.. జే అంటే జోష్.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జగన్‌తోనే సాధ్యమని పునీత్ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్ ఏం కావాలి? సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారు. పర్యాటక రంగంలో రూ.21,941 కోట్ల పెట్టుబడులతో 129 ఎంవోయూలు చేసుకున్నాం. – ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి టార్చ్ బేరర్ సీఎం జగన్ 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలు, ఆశలను తన భుజస్కందాలపై వేసుకుని వాటిని నెరవేర్చడానికి ప్రయాణం చేస్తున్న టార్చ్ బేరర్ సీఎం జగన్. ఈ ప్రయాణంలో భాగంగా రాష్ట్ర యువత భవిష్యత్‌కు భరోసానిచ్చేలా గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. తద్వారా దేశంతో పాటు, ప్రపంచాన్నే రాష్ట్రం వైపు చూసేలా చేశారు. ఈ సమ్మిట్ విజయవంతం అవ్వడంతో టీడీపీ నాయకులకు మైండ్ బ్లాంక్ అయింది. దీంతో వాళ్లు ఏం మాట్లాడుతున్నారో వాళ్లకే అర్థం కావడం లేదు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు తెచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కన్నా దోపిడీ చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో రూ.రెండు వేల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర లోకేశ్ ది. సీమెన్స్ కుంభకోణం రూపంలో రూ. 371 కోట్లు దోపిడీ చేశారు. ఈ కుంభకోణంపై ప్రస్తుతం దర్యాప్తు నడుస్తోంది. – అబ్బయ్య చౌదరి, ఎమ్మెల్యే -
‘సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్’
సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు. మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్. జీఐఎస్‌తో సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో పెట్టుబడులు చూపించారు. మేం దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్. జీఐఎస్‌తో సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జీఐఎస్ సక్సెస్ చూసి ఎల్లో బ్యాచ్‌కు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. జీఐఎస్ సక్సెస్ చూసి లోకేష్‌కు మైండ్ బ్లాంక్ అయ్యింది. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మాది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు. -
ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా..
Live Updates Time: 03:00PM ► ఏపీ అసెంబ్లీ ఆదివారానికి వాయిదా పడింది. ►సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్: మంత్రి రోజా ►జీఐఎస్ ద్వారా జగనన్న బ్రాండ్ ఏంటో తెలిసింది. ►పరిశ్రమల ద్వారా 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. ►రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. ►టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని.. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పి కొట్టాం. ►దిగ్గజ పారిశ్రామికవేత్తలంగా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. ►జె అంటే జగన్. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. ►జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. ►రాష్ట్రంలో సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు తెచ్చారు: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ►ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు ►పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి Time: 02:30PM ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. ఐదోరోజు తాజాగా విశాఖలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ సందర్భంగా.. జీఐస్ ద్వారా రూ. 13 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు ఏపీకి వచ్చాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అసెంబ్లీలో వెల్లడించారు. పాతికే దేశాల నుంచి ప్రతినిధులు జీఐఎస్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వ విధానాలపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించారు. అనేక రంగాల్లో ఎంవోయూలు కుదుర్చుకున్నాం అని ఆయన వెల్లడించారు. రికార్డు వ్యవధిలో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నాం. రాష్ట్రంలో కొత్తగా ఆరు లక్షల మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధాన దృష్టి సారించినట్లు తెలిపారాయన. ఇక.. అగ్ర పారిశ్రామికవేత్తలు వస్తే.. ప్రతిపక్షం ఓర్వలేకపోతోంది. అంబానీ, అదానీ ఏపీకి వస్తే టీడీపీ బాధేంటో అర్థం కావట్లేదు. ఏపీకి పెట్టుబడులు రావడం టీడీపీకి ఇష్టం లేదు. సీఎం జగన్ బ్రాండ్ చూసి ఏపీకి పెట్టుబడులు వస్తున్నాయి. రాష్ట్రంలోని పాలనపై పారిశ్రామికవేత్తలకు విశ్వాసం ఉంది అని మంత్రి గుడివాడ అమర్నాథ్ వెల్లడించారు. Time: 02:00PM ►దేశంలోనే మొట్టమొదటిసారిగా మైనారిటీలకు కూడా సబ్ ప్లాన్ తీసుకువచ్చిన ప్రభుత్వం వైఎస్సార్సీపీనే అని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తెలిపారు. మైనారిటీ సబ్ ప్లాన్ కింద రూ.4,203 కోట్లు ఇవాళ బడ్జెట్లో కేటాయించామని, గతంలో ఏ ప్రభుత్వం మైనారిటీలకు ఈ స్థాయిలో నిధులు కేటాయించలేదని చెప్పారు. ►సంక్షేమ శాఖ పద్దులపై జరిగిన చర్చలో మంత్రి అంజాద్‌బాషా మాట్లాడారు. చంద్రబాబు హయాంలోనే మైనారిటీలకు ప్రాతినిధ్యం లేని ప్రభుత్వం నడిచిందని మంత్రి గుర్తు చేశారు. మైనారిటీలకు ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. 2019 ఎన్నికలకు మూడు నెలల ముందు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చి మమ అనిపించారని తెలిపారు. మైనారిటీ ఓట్ల కోసమే ఆ రోజు చంద్రబాబు మూడు నెలల మంత్రి పదవి ఇచ్చి మభ్యపెట్టాలని చూశారని మండిపడ్డారు. Time: 12:30PM ►నవరత్నాల పథకాల యాడ్స్‌పై శాసనమండలిలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ క్లారిటీ ఇచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో నవరత్నాల పథకాలు అమలు అవుతున్నాయన్నారు. ►పథకాలకు సంబంధించిన సమాచారం ప్రజలకు తెలియజేయడానికి యాడ్స్ ఇస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో ఎక్కడ వివక్షత లేదని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 128 కోట్ల రూపాయల యాడ్స్ ఇచ్చామని తెలిపారు. ►‘గత తెలుగుదేశం ప్రభుత్వం యాడ్స్ కోసం 449 కోట్లు ఖర్చు చేసింది. యాడ్స్ ఇచ్చే వ్యవహారంలో పారదర్శకత లేదు. ఇష్టానుసారంగా ఎవరికి పడితే వాళ్లకి యాడ్స్ ఇచ్చారు. రాష్ట్రానికి సంబంధం లేని ఇతర రాష్ట్రాలకు చెందిన పేపర్లకు కూడా యాడ్స్ ఇచ్చారు’ అని తెలిపారు. Time: 12:00PM ►ఆర్ అండ్ బీ శాఖ డిమాండ్స్ చర్చలో పాల్గొన్న ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ►రోడ్లను నిర్లక్ష్యం చేసిన చేసిన ఘనత చంద్రబాబుదే. ►కేంద్రం ఇచ్చిన నిధుల్ని కూడా బాబు ఖర్చుచేయలేకపోయారు. ►కేంద్రమిచ్చిన నిధుల కన్నా ఎక్కువ ఖర్చు చేసిన ఘనత జగన్ ప్రభుత్వానిది. ►రోడ్ల నిర్వహణపై ఎల్లో మీడియా అసత్య కథనాలు Time: 11:10AM శాసనమండలి ►24వ తేదీలోపు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనపై స్పందిస్తారు: మంత్రి అంబటి రాంబాబు. ►రాష్ట్రానికి సంబంధించి అనేక అంశాలపై చర్చించేందుకు సీఎం ఢిల్లీ వెళ్లారు. ►సభకు అంతరాయం కలిగించే విధంగా టీడీపీ ఎమ్మెల్సీలు చేయడం సిగ్గుచేటు ►చంద్రబాబు డైరెక్షన్లోనే టీడీపీ ఎమ్మెల్సీలు మాట్లాడుతున్నారు. Time: 11:00AM ►ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అధికారిక పర్యటనే: మంత్రి బొత్స సత్యనారాయణ ►ఇప్పటికిప్పుడు ఢిల్లీ పర్యటనపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అనటం దారుణం. ►సమాధానం చెప్పకపోతే మేము బాయ్‌కాట్ చేస్తామని చెప్పడం సమంజసం కాదు. ►ముందుగానే ప్రిపేర్ అయి వచ్చి బాయ్‌కట్ చేస్తామని చెప్తున్నారు. Time: 10:10AM ►ప్రతిపక్షానిది బాధ్యతా రాహిత్యం.. నాది బాధ్యత: స్పీకర్ తమ్మినేని ►సభను సజావుగా నడిపించాల్సిన బాధ్యత నాపై ఉంది. ►చరిత్రలో కళంకితుడిగా ఉండాలనుకోవట్లేదు. ►సభా నాయకుడు నాకు గొప్ప బాధ్యత అప్పగించారు. ►ఆ బాధ్యతల మేరకే సహనంగా ఉంటున్నా. Time: 09:50AM ►సభా కార్యకలాపాలను పదేపదే అడ్డుకున్న టీడీపీ. ►స్పీకర్‌పై పేపర్లు చింపి విసిరేసిన టీడీపీ సభ్యులు. ►అసెంబ్లీ నుంచి ఒకరోజు పాటు టీడీపీ సభ్యుల సస్పెండ్. ► ఉద్దానం ప్రాంత ప్రజలకు, భావితరాలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం అండగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఉద్దానం ప్రజలకు శాశ్వత పరిష్కారం ఇవ్వాలనే తపన, చిత్తశుద్ధితో ముఖ్యమంత్రి సీఎం జగన్ పనిచేస్తున్నారని, రూ.742 కోట్ల వ్యయంతో 100 కిలోమీటర్ల తాగునీటి పైపులైన్ నిర్మిస్తున్నామన్నారు. ►జూన్‌లో పైపులైన్ నిర్మాణ పనులు పూర్తవుతాయని, ఆ ప్రాంతానికి సురక్షితమైన తాగునీరు అందుతుందని చెప్పారు. ఉద్దానం ప్రాంత ప్రజలకు ఇబ్బందిలేకుండా రానున్న కాలంలో పలాస డయాలసిస్ యూనిట్ 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని రూ.50 కోట్లతో నిర్మించనున్నామన్నారు. ఆ ఆస్పత్రిలో 151 మంది మెడికల్ స్టాఫ్‌ను అందుబాటులో ఉంచి ఉద్దానం ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించబోతున్నామని చెప్పారు. Time: 09:30AM ►సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర ప్రయోజనాలపై చర్చించారని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విభజన వల్ల పెండింగ్‌లో ఉన్న సమస్యలపై చర్చించారని తెలిపారు. పోలవరం నిధులపై ప్రధానితో సీఎం చర్చించారని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలపై చర్చిద్దామా? టీడీపీ హయాంలో పోలవరంలో జరిగిన తప్పులపై చర్చిద్దామా?. చంద్రబాబు హయాంలో చేసిన అప్పులు, పెట్టిన బకాయిలపై చర్చిద్దామా?’’ అంటూ మంత్రి బుగ్గన సవాల్ విసిరారు. Time: 09:15AM ►అసెంబ్లీలో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ► సీఎం జగన్ ఢిల్లీ పర్యటన వివరాలు బహిర్గతం చేయాలంటూ నిరసన ►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి, అమరావతి: అయిదో రోజు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. అనంతరం గ్లోబల్ ఇన్వెస్టెమెంట్ సమ్మిట్, యువత స్కిల్ డెవలప్మెంట్ శిక్షణపై చర్చ జరగనుంది. అటు శాసనమండలిలో ఉదయం 10 గంటలకు ప్రశ్నోత్తరాల అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. -
CM YS Jagan: స్పీచ్ అదిరింది.. వాస్తవాలు కళ్లకు కట్టారు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నడక నేల మీదే అంటూ చేసిన ప్రసంగానికి అనుగుణంగానే ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమర్పించిన బడ్జెట్ వాస్తవిక ధోరణితో ఉందని చెప్పాలి. ఈ ప్రభుత్వం కీలకంగా భావించే తన ఎన్నికల మానిఫెస్టోలో ఏవైతే చెప్పిందో వాటిని ఆచరించే క్రమంలో బడ్జెట్ లో నవరత్నాల స్కీమ్ లకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. అదే సందర్భంలో అభివృద్ది, పరిశ్రమలు, సాగునీరు తదితర రంగాలను కూడా సమతుల్యంగా చేసుకునే యత్నం చేసింది. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చకు ముఖ్యమంత్రి జవాబు చెప్పారు. ఆ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు అర్దవంతంగా ఉన్నాయి. 'నా నడక నేలమీదే!. సామాన్యులతోనే నా ప్రయాణం, నా లక్ష్యం పేదరిక నిర్మూలనే" అని ఆయన పేర్కొన్నారు. తన ఎకనామిక్స్, తన పాలిటిక్స్ ఇదే అని, తన తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ ఇదని.. ఇవన్నీ కలిపితే మీ జగన్ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు సహజంగానే అందరిని ఆకట్టుకుంటాయి. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు ఎవరూ ఇలాంటి ప్రసంగాలలో ఇంత బలంగా సెంటిమెంట్‌ను చొప్పించలేకపోయారనే చెప్పాలి వారు తమ ప్రభుత్వం సాధించిన విజయాలు, భవిష్యత్తులో చేయదలచిన కార్యక్రమాల గురించి మాట్లాడి, చివరికి ఎవరివైనా కొటేషన్లు ప్రస్తావించి ముగిస్తుండేవారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఏకంగా గ్రాఫిక్స్, ఊహాజనిత లెక్కలతో ఏమార్చే ప్రయత్నం చేసేవారన్న విమర్శలు ఉండేవి. జగన్ అలాకాకుండా వాస్తవిక ధోరణిలో మాట్లాడారు. అదే టైమ్‌లో జగన్ తనే సొంతంగా కొటేషన్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంది. నడక, నేల, సామాన్యులు, ఎకనామిక్స్, పాలిటిక్స్, హిస్టరీ, అన్నీ కలిపి జగన్ అన్నది ఆయన కొటేషన్ గా చెప్పాలి. తన ప్రభుత్వం గత నాలుగేళ్లుగా సామాన్యుడి కోసమే పని చేసిందని వక్కాణించి వివరించారు. పేదలు, పెత్తందార్ల మధ్య తేడాను, వారి మధ్య సహజంగా జరిగే పెనుగులాటను జగన్ తన ప్రసంగంలో కొట్టొచ్చినట్లు చెప్పే యత్నం చేశారు. నవరత్నాల స్కీమ్‌ల ద్వారా నేరుగా పేదల ఖాతాలలోకి సుమారు రెండు లక్షల కోట్ల నగదును బదిలీ చేసిన వైనాన్ని వివరించి, తద్వారా అవినీతి లేకుండా చేయగలిగామని, పేదల సంక్షేమాన్ని కాపాడుకున్నామని, వారి ఆర్దిక పురోభివృద్దికి కృషి చేశామని జగన్ చెప్పారు. పేద కుటుంబాలు ఆర్దికంగా బాగుపడితేనే పేద కులాలు కూడా బాగుపడతాయని, వారికి సాధికారికత కల్పిస్తేనే సమాజం బాగుపడుతుందన్న తన విధానాన్ని ఆయన తేటతెల్లం చేశారు. ప్రభుత్వం చేపట్టిన అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ భోధన, పరిపాలనలో సంస్కరణలు, ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు, రైతు భరోసా, విలేజ్ క్లినిక్స్, చేయూత, కాపు నేస్తం, చేనేత నేస్తం.. ఇలా ఆయా కార్యక్రమాలన్నీ పేదల పురోగతికి ఉద్దేశించినవేనని జగన్ అన్నారు. ఈ స్కీమ్ లన్నిటిలోను మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఆయన వివరించారు. అటు ప్రభుత్వ పరంగా, ఇటు రాజకీయపరంగా స్త్రీలకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాముఖ్యతను తెలియచెప్పారు. అదే టైమ్‌లో పరిశ్రమలు, ఇతర అభివృద్ది రంగాలలో చేస్తున్న కృషిని కూడా ఆయన వివరించారు. ఎన్నికల సంవత్సరంలో తమ ఎజెండా మారదని ఆయన చెప్పకనే చెప్పారు. తమకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో, పేదల అభ్యున్నతి కూడా అంతే ముఖ్యమని నిర్మొహమాటంగా తెలిపారు. ఐటి ఎంత ప్రధానమో, వ్యవసాయం కూడా అంతే ప్రధానమని తేల్చారు. ఈ రకంగా తమ ప్రభుత్వ వైఖరిని ప్రజలకు కుండబద్దలు కొట్టినట్లు చెప్పారని అనుకోవచ్చు. గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధిని ఆయన కళ్లకు కట్టినట్లు చెప్పేయత్నం చేశారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచి ఒకే మాట మీద ఉన్నారని చెప్పవచ్చు. ఎన్నికల మానిఫెస్టోని దగ్గరపెట్టుకుని వాటిని తు.చా తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రిగా జగన్ నిలిచిపోతారు. 98.5 శాతం హామీలను నెరవేర్చిన సీఎంగా ఆయన రికార్డు సృష్టించారు. జగన్ చేసిన స్పీచ్‌కు అనుగుణంగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ఉన్నట్లు కనబడుతుంది. పార్టీ విధానం, ముఖ్యమంత్రి ఆలోచనలను మేళవించి ఆయన బడ్జెట్‌ను రూపొందించారు. తన సహజ శైలిలో అబ్దుల్ కలాం, వివేకానంద, జఫర్సన్, రవీంద్రనాద్ ఠాగూర్ వంటి వారి కొటేషన్లను చెప్పడమే కాకుండా గజేంద్రమోక్షం సన్నివేశంలోని పద్యాన్ని కూడా ఆలపించి అందరిని ఆకర్షించారు. చదవండి: రామోజీ.. ఆరోజున జరిగింది మర్చిపోయారా? బడ్జెట్లో సామాజిక పెన్షన్ లకు 21 వేల కోట్ల రూపాయలు కేటాయించడం విశేషం. వచ్చే జనవరి నుంచి ఇచ్చిన హామీ ప్రకారం వృద్దుల పెన్షన్‌ను మూడువేల రూపాయలు చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. దానికి అనుగుణంగా బుగ్గన బడ్జెట్ ను కేటాయించారు. సుస్థిరాభివృద్ది విధానంగా జీవనోపాధి, సాధికారికత, సామాజిక భద్రత, పారిశ్రామికాభివృద్ది సాధన తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన వివరించారు. వ్యవసాయం, నీటిపారుదల, రవాణా,రోడ్లు, విద్యుత్ తదితర రంగాలకు సుమారు 67 వేల కోట్ల రూపాయలు కేటాయించారు.విద్యారంగానికి రికార్డు స్థాయిలో 32 వేల కోట్ల రూపాయలు ఇవ్వబోతున్నట్లు ఆయన ప్రకటించారు. మరో వైపు వివిధ సంక్షేమ స్కీమ్ లకు 54 వేల కోట్లు కేటాయించినట్లు బుగ్గన తెలిపారు. మొత్తం మీద పరిశీలిస్తే జగన్ ముఖ్యమంత్రి అవడానికి ముందు ఏమి చెప్పారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఏటా దానిని ఆచరించి చూపుతున్నారు. అదే బుగ్గన బడ్జెట్ లో ప్రతి ఏటా కనిపిస్తుంది. ఈ రకంగా మాటకు కట్టుబడి ఉన్న ప్రభుత్వంగా జగన్ ప్రభుత్వం ప్రజలలో గుర్తింపు పొందుతుందని చెప్పాలి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
AP: 2021-22లో భారీగా తగ్గిన అప్పులు.. కాగ్ నివేదిక చెప్పింది ఇదే..
సాక్షి, అమరావతి: 2021-22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర అప్పులు భారీగా తగ్గాయి. దీంతో ఆ ఏడాది ద్రవ్య లోటు అదుపులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ అకౌంటెంట్ జనరల్ ఖరారు చేసిన అకౌంట్స్ ప్రకారం.. 2021–22 ఆర్థిక ఏడాదిలో ద్రవ్య లోటు రూ.25,011 కోట్లుగా ఉందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ గురువారం అసెంబ్లీలో 2023–24 వార్షిక బడ్జెట్ సమర్పణ సందర్భంగా వెల్లడించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 2.08 శాతంగా ఉందని మంత్రి తెలిపారు. అంతేకాక.. ఇది ఎఫ్ఆర్బీఎం నిబంధనల కన్నా తక్కువన్నారు. వాస్తవానికి.. ఆ ఏడాది బడ్జెట్ అంచనాల్లో ద్రవ్యలోటు రూ.37,029 కోట్లుగా ప్రతిపాదించారు. అలాగే, 2021–22 ఆర్థిక ఏడాది రెవెన్యూ లోటు రూ.8,610 కోట్లుగా కాగ్ ఖరారు చేసిందని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 0.72 శాతంగా ఉందని మంత్రి వివరించారు. మరోవైపు.. ద్రవ్య లోటు, రెవెన్యూ లోటును తగ్గించేందుకు 2023–24 ఆర్థిక ఏడాది బడ్జెట్లో గట్టి ప్రయత్నమే చేశారు. 2023–24 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,83,008.96 కోట్లకు చేరుతాయని, ఇది రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 33.32 శాతంగా ఉంటుందని బడ్జెట్ పత్రాల్లో ప్రభుత్వం స్పష్టంచేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) ముగిసే నాటికి రాష్ట్ర అప్పులు రూ.4,26,233.92 కోట్లుగా ఉంటాయని పేర్కొంది. చదవండి: అక్కచెల్లెమ్మలకు అగ్రపీఠం -
ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా
Updates: ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. ►శాసనమండలిలో తెలుగుదేశం పార్టీ సభ్యులకు మంత్రి విడదల రజిని సవాల్ విసిరారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాలం చెల్లిన మందులు చెల్లిస్తున్నారంటూ టీడీపీ ఆరోపణలపై ఆమె మండిపడ్డారు. దమ్ముంటే చెల్లని మందులు ఎక్కడ ఉన్నాయో చూపించాలి.. ఏ ఆసుపత్రికైనా వెళ్ధాం రండి.. అంటూ మంత్రి సవాల్ చేశారు. దళితుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి నాగార్జున దళితుల సంక్షేమానికి పెద్దపీట వేశామని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. దళితుల సంక్షేమానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దళితుల కోసం రూ.52 వేల కోట్లకు పైగా ఖర్చుపెట్టామన్నారు. దేశం గర్వించేలా విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు: మంత్రి కాకాణి డ్రిప్ ఇరిగేషన్‌కు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు.సూక్ష్మసేద్యంలో ఏపీకి దేశంలో మంచి గుర్తింపు లభించిందన్నారు. అవసరమైనవారందరికీ డ్రిప్ సదుపాయాన్ని అందిస్తామని మంత్రి అన్నారు. రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ: మంత్రి దాడిశెట్టి ►రోడ్ల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని రోడ్లు, భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. రహదారుల నిర్వహణకు ఏపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. 10,359 కిలోమీటర్ల రోడ్లకు మరమ్మతులు పూర్తి చేశామన్నారు. ఎఫ్డీఆర్ టెక్నాలజీతో కొత్త రోడ్లను పూర్తి చేశామని మంత్రి అన్నారు. ► నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభయ్యాయి. ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ►కాసేపట్లో నాలుగో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చర్ అవర్‌తో అసెంబ్లీ ప్రారంభం కానుంది. అనంతరం బడ్జెట్‌పై చర్చ జరగనుంది. శాసనమండలిలో 10 గంటలకు ప్రశ్నోత్తరాలు ప్రారంభమవుతుంది. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. అనంతరం బడ్జెట్‌పై శాసనమండలి చర్చ చేపట్టనుంది. -
టీడీపీ దుష్ట పన్నాగం.. సభలో అడుగడుగునా అడ్డంకులు
సాక్షి, అమరావతి: టీడీపీ సభ్యులు గురువారం శాసనసభలో దుష్టçపన్నాగానికి తెరతీశారు. ఆర్థికమంత్రి బుగ్గన గురువారం బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు ఉపక్రమించగానే సభలోకి వచ్చిన టీడీపీ సభ్యులు నినాదాలు అరుపులతో బడ్జెట్ ప్రసంగం వినపడనీయకుండా గందరగోళం సృష్టించారు. టీడీపీ సభ్యుడు వెలగపూడి రామకృష్ణబాబు పెద్దగా నినాదాలు చేస్తుంటే, మరో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్రావు చిత్తు కాగితాల ముక్కలను స్పీకర్‌పైకి, గాలిలోకి విసిరారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా అడ్డుపడటం మంచిది కాదని, ఏమైనా అభ్యంతరాలుంటే బడ్జెట్ చర్చలో తెలపవచ్చని మంత్రులు, స్పీకర్ చెప్పినా వారు వెనక్కు తగ్గకపోగా మరింత రెచ్చిపోయారు. సీఎం జగన్ జోక్యం చేసుకుని టీడీపీ తీరును తప్పుబట్టారు. వార్షిక బడ్జెట్‌ను ప్రజలంతా ఆసక్తిగా చూస్తారని, అలాంటి బడ్జెట్ ప్రసంగానికి అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిందిగా స్పీకర్‌ను కోరారు. బడ్జెట్ ప్రసంగం ప్రజలకు వినపడకూడదనే కుతంత్రంతోనే వారు గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం మండిపడ్డారు. సభ సజావుగా జరిగేలా, ప్రజలకు బడ్జెట్ ప్రసంగం వివరంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..ప్రజల ఆకాంక్షలను అడ్డుకోవడం సరికాదని, ఇష్టం లేకపోతే వాకౌట్ చేసి వెళ్లిపోవాల్సిందిగా కోరారు. టీడీపీ సభ్యుల తీరులో మార్పు లేనందున తప్పని పరిస్థితుల్లో కఠిన నిర్ణయం తీసుకుంటున్నానంటూ టీడీపీకి చెందిన 14 మంది సభ్యులను ఒకరోజు పాటు సమావేశాల నుంచి సస్పెండ్ చేశాకే, బుగ్గన ప్రవేశపెట్టిన తీర్మానానికి సభ ఆమోదం తెలిపింది. సస్పెండ్ అయిన తర్వాత కూడా సభ్యులు వెళ్లకుండా గొడవ చేస్తుండటంతో మార్షల్స్ వారిని బయటకు పంపించారు. -
సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానం
సాక్షి, అమరావతి: సుస్థిరాభివృద్ధే ప్రభుత్వ విధానమని, ఇందుకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేస్తూ 2023–24 బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నామని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. జీవనోపాధి, సాధికారత, సామాజిక భద్రత, పారిశ్రామికాభివృద్ధే ప్రధానం అని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా 2023–24 సంవత్సరానికి రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ను గురువారం ఆయన శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన అనే సూత్రాల సమ్మేళనంగా మేనిఫెస్టోను రూపొందించామని, అధికారం చేపట్టిన తొలి సంవత్సరమే 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను అమలు చేశామని తెలిపారు. కోవిడ్ వంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ నాలుగేళ్లల్లో గణనీయమైన పురోగతిని సాధించామన్నారు. ఈ నాలుగేళ్లలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు, 1.34 లక్షల ప్రభుత్వ ఉద్యోగుల నియామకం, 2.65 లక్షల మంది వలంటీర్ల నియామకం, 51,488 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావడంతో పాటు 15,715 పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగు పరిచామని చెప్పారు. 3,707 వైఎస్సార్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాలు, 461 పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్మాణం, 30.65 లక్షల మందికి ఇళ్ల పట్టాల పంపిణీ వంటి అనేక కార్యక్రమాలను అమలు చేశామని తెలిపారు. దాదాపు 21 పథకాల ద్వారా లబ్ధిదారులకు నాలుగేళ్లల్లో డీబీటీ ద్వారా రూ.1.97 లక్షల కోట్లు జమ చేశామన్నారు. 2023–24లో డీబీటీ విధానంలో రూ.54,228 కోట్లు పంపిణీ చేసే విధంగా కేటాయింపులు చేశామని చెప్పారు. 2018–2019 ఆర్థిక సంవత్సరంలో స్థిర ధరల ప్రకారం మన జీఎస్డీపీ వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలోనే 22వ స్థానంలో ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అభివృద్ధి విధానాల కారణంగా 2021–2022 లో 11.43 శాతం వృద్ధితో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. వచ్చే ఏడాది జీఎస్డీపీ 10% వృద్ధితో రూ.14,49,501 కోట్లకు చేరుతుందని అంచనాగా ఉందన్నారు. రైతులకు చేదోడుగా ఉంటూ గత నాలుగేళ్లల్లో వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ కింద ఇప్పటి వరకు రూ.27,063 కోట్లు రైతుల ఖాతాల్లో వేయడమే కాకుండా వచ్చే ఏడాది కోసం రూ.4,020 కోట్లు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఇప్పటి వరకు రూ.6,872 కోట్లు ఇవ్వగా, వచ్చే ఏడాది కోసం రూ.1,600 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి కోసం రూ.3,000 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మంత్రి బుగ్గన ఇంకా ఏం చెప్పారంటే.. పారిశ్రామిక మౌలిక వసతులకు పెద్ద పీట ► రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతికి పెద్ద పీట వేస్తోంది. విశాఖలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు వచ్చిన అద్భుతమైన స్పందనే ఇందుకు నిదర్శనం. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ప్లై్లబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ప్రముఖ పారిశ్రామిక సంస్థలు ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి. ► ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశం కలిగింది. 378 అవగాహన ఒప్పందాలు కుదరడం ఎంతో గర్వించదగ్గ విషయం. ► విశాఖ–చెన్నై కారిడార్‌లో పారిశ్రామిక క్లస్టర్స్‌తో పాటు ఎంఎస్ఎంఈ యూనిట్లను ప్రోత్సహించేలా బడ్జెట్లో కేటాయింపులు చేస్తున్నాం. ► 2023–24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు, వాణిజ్యం కోసం రూ.2,602 కోట్లు కేటాయిస్తున్నాం. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు ► రాష్ట్రంలో దాదాపు 32,725 కిలోమీటర్ల మేర ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కిలోమీటర్ల పొడవున ఉన్న బి.టి.రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకున్నాం. ► రూ.400 కోట్లతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. రూ.2,205 కోట్లతో 8,268 కి.మీ.రాష్ట్ర రహదారులు, జిల్లా ప్రధాన రహదారులను అభివృద్ధి చేశాం. రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్ కింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ.పొడవుగల రోడ్లకు సంబంధించి రూ.391 కోట్లతో 46 పనులు మంజూరయ్యాయి. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023–24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ.9,118 కోట్లు కేటాయిస్తున్నాం. పేదరిక నిర్మూలన, ప్రజలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను అందించడమే మా ప్రభుత్వ ప్రధాన ధ్యేయం. దీనికి అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంతో 2023–24 బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్రవేశ పెడుతున్నాం. ఏటా 50,000 మందికి నైపుణ్య శిక్షణ ► స్థానిక యువతకు ఉపాధి లభించేలా నైపుణ్య శిక్షణకు పెద్ద పీట వేస్తున్నాం. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో కనీసం ఒక స్కిల్ హబ్ చొప్పున మొత్తం 192 నైపుణ్య కేంద్రాలు, జిల్లా కేంద్రంలో ఒక స్కిల్ కాలేజీ, రాష్ట్ర స్థాయిలో స్కిల్ యూనివర్సిటీ ద్వారా ఏటా 50,000 మందికి శిక్షణ ఇప్పించేలా కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. ఇందుకోసం 154 కార్పొరేట్స్‌తో 18 రంగాల్లో శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. ► వచ్చే ఏడాది నైపుణ్య శిక్షణ కోసం రూ.1,166 కోట్లు కేటాయిస్తున్నాం. పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తున్నాం. రూ.22,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా 181 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద 2023 సంవత్సరం చివరి నాటికి 30.2 లక్షల శాశ్వత గృహాలను అర్హులైన లబ్ధిదారులందరికీ అందించడానికి వైఎస్ జగన్ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకోసం 2023–24 సంవత్సరానికి రూ.5,600 కోట్లు కేటాయిస్తున్నాం. -
ఐదవసారీ అభివృద్ధి దారే
మరోసారి సంక్షేమ,అభివృద్ధి బడ్జెట్ మంచి చదువు, మంచి వైద్యం, మంచి ఆరోగ్యం, రైతుల్లో సంతోషం, నా అక్క చెల్లెమ్మల్లో సాధికారత, జోరైన పారిశ్రామికాభివృద్ధి ప్రధాన లక్ష్యాలుగా మరోసారి సంక్షేమ–అభివృద్ధి బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం. అసమానతలు తగ్గించి, పేదరికాన్ని నిర్మూలించే దిశగా ఈ బడ్జెట్ ద్వారా మరో అడుగు ముందుకేశాం. – సీఎం వైఎస్ జగన్ కళ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నా దాన్ని కనీసం ఆలోచనల్లోనైనా అందుకోలేనంత దూరంలో ఎక్కువ మంది ఉండిపోతే.. ఆ అభివృద్ధికి అర్థం ఉందా? అందుకే... నాలుగేళ్ల కిందట రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పటి నుంచీ సామాన్యులతోనే ప్రయాణిస్తున్నారు వైఎస్ జగన్మోహన్రెడ్డి. ఎన్ని సవాళ్లెదురైనా మనసా వాచా మ్యానిఫెస్టోనే అనుసరిస్తున్నారు. చదువు రూపంలో ఆస్తిని అందించటం... ఆరోగ్య పరిరక్షణతో అప్పులపాలు కాకుండా చూడటం... రైతన్నలను, మహిళల్ని, అవ్వాతాతలను ఆదుకుని ఆర్థిక, సామాజిక చక్రాన్ని ముందుకు నడిపించటమే తొలి ప్రాధాన్యాలుగా చేసుకున్నారు. సామాజికంగా... ఆర్థికంగా వెనకబడిన వారిని ముందుకు తెస్తేనే అభివృద్ధికి అర్థం ఉంటుందన్నది ఆయన ఎకనమిక్స్.ఈ 5వ బడ్జెట్లో కూడా స్పష్టంగా కనిపించింది అదే!!. సాక్షి, అమరావతి: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నెరవేర్చడమే లక్ష్యంగా అన్ని వర్గాల అభ్యున్నతికి అండగా నిలిచే అభివృద్ధి, సంక్షేమ సమతుల్యతతో కూడిన బడ్జెట్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం గురువారం అసెంబ్లీకి సమర్పించింది. జెండర్ బేస్డ్ బడ్జెట్ ద్వారా సమాజంలో సగం ఉన్న మహిళలకు ప్రత్యేక కేటాయింపులు చేశారు. పిల్లలకు కూడా ప్రత్యేక కేటాయింపులు చేయడం విశేషం. అన్ని రంగాల్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనగా వరుసగా ఐదోసారి రూ.2,79,279.27 కోట్లతో 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ.2,28,540.71 కోట్లుగా, మూల ధన వ్యయం రూ.31,061 కోట్లుగా ఉంటుందని అంచనా వేసినట్లు బుగ్గన పేర్కొన్నారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.23,316.70 కోట్లు రెవెన్యూ లోటు, రూ.54,587.52 కోట్లు ద్రవ్య లోటు ఉంటుందని అంచనా వేశామని తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్యలోటు 1.54 శాతం ఉంటుందని, రెవెన్యూ ఆదాయం రూ.2,06,224.01 కోట్లుగా అంచనా వేశామన్నారు. ఇందులో కేంద్ర పన్నుల వాటా నుంచి రూ.41,338.02 కోట్లు వస్తాయని, కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.46,834.64 కోట్లు వస్తాయని అంచనా వేసినట్లు తెలిపారు. రెవెన్యూ లోటుతో పాటు ద్రవ్య లోటును అదుపులో పెట్టే చర్యలు తీసుకున్నట్లు బడ్జెట్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. అంతకు ముందు సీఎం అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశమై 2023–24 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. నవరత్నాలకు పెద్దపీట ఎప్పటిలాగే మేనిఫెస్టోలోని నవరత్నాల పథకాల కొనసాగింపునకు బడ్జెట్లో తగిన కేటాయింపులు చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికలతో పాటు మైనార్టీ యాక్షన్ ప్రణాళిక పేరుతో భారీ ఎత్తున నిధులు కేటాయించారు. మొత్తం మీద రాష్ట్రంలోని ఐదు కోట్ల ప్రజానీకాన్ని సంతృప్తి పరిచే స్థాయిలో బడ్జెట్ ప్రతిపాదనలు చేశారు. మరో పక్క వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, సాగునీటి రంగాల్లో మౌలిక రంగాలకు పెద్ద పీట వేశారు. బడ్జెట్లో ఎక్కడా దాపరికాలు లేకుండా పూర్తి పారదర్శకత ప్రదర్శించారు. ఏయే రంగాల్లో ఏయే పథకాలకు ఎన్ని నిధులు కేటాయించింది స్పష్టంగా వివరించారు. అవ్వా తాతల సామాజిక పెన్షన్లను వచ్చే ఏడాది జనవరిలో నెలకు 3 వేల రూపాయలు చేస్తామని ప్రకటించారు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ పెన్షన్ కానుకకు ఏకంగా రూ.21,434 కోట్లు కేటాయించారు. నవరత్న పథకాల్లోని అన్ని వర్గాలకు బడ్జెట్ కేటాయింపులు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాలకు చెందిన లబ్ధిదారులకు అందజేసే అన్ని సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ఆయా సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా అమలు చేస్తామని స్పష్టం చేసింది. సచివాలయాలకు కేటాయింపులు చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, మత్స్యకారులు, దర్జీలు, చేనేత కార్మికులు, కాపులు, లాయర్లకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. గ్రామ, వార్డు వలంటీర్లు.. గ్రామ, పట్టణ సచివాలయాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. నేరుగా నగదు బదిలీ చేసే 22 నవరత్నాల పథకాలకు బడ్జెట్లో రూ.54,228 కోట్లు కేటాయించారు. మహిళల పథకాలకు ప్రత్యేకంగా రూ.77,914.43 కోట్లు, పిల్లల పథకాలకు ప్రత్యేకంగా రూ.20,593.38 కోట్లు కేటాయించారు. బీసీ ఉప ప్రణాళికకు రూ.38,605 కోట్లు, ఎస్సీ ఉప ప్రణాళికకు రూ.20,005 కోట్లు, ఎస్టీ ఉప ప్రణాళికకు రూ.6,929 కోట్లు, మైనార్టీ కాంపొనెంట్‌కు రూ.4,203 కోట్లు కేటాయించారు. సంక్షేమానికి రూ.51,345 కోట్లు, సాధారణ విద్యా రంగానికి రూ.32,198 కోట్లు, ఆరోగ్య రంగానికి రూ.15,882 కోట్లు, వ్యవసాయ అనుంబంధ రంగాలకు రూ.14,043 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.17,531 కోట్లు కేటాయించారు. రైతుల సంక్షేమంపై శ్రద్ధ రైతుల సంక్షేమంపై శ్రద్ధ చూపుతూ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. రైతులకు సంబంధించిన అన్ని పథకాలకు కేటాయింపులు కొనసాగించారు. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడమే లక్ష్యంగా జల వనరుల శాఖకు రూ.11,908 కోట్లు కేటాయించారు. మన బడి నాడు–నేడు కార్యక్రమానికి రూ.3500 కోట్లు.. వైద్య ఆరోగ్య రంగంలో నాడు–నేడు కార్యక్రమానికి రూ.2214.21 కోట్లు కేటాయించారు. పేదల గృహ నిర్మాణాలకు రూ.6291.70 కోట్లు, కాపుల సంక్షేమానికి రూ.4,887 కోట్లు, వైఎస్సార్ ఈబీసీ నేస్తంకు రూ.610 కోట్లు కేటాయించారు. రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రూ.6,546 కోట్లు, డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య శ్రీకి రూ.2,400 కోట్లు, గడప గడపకు మన ప్రభుత్వానికి రూ.532 కోట్లు కేటాయించారు. 2022–23 సవరించిన అంచనాలు 2022–23 ఆర్థిక సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం బడ్జెట్ వ్యయం రూ.2,40,509.34 కోట్లుగా ఉంటుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. రెవెన్యూ వ్యయం రూ.2,05,555.95 కోట్లు కాగా, మూల ధన వ్యయం రూ.16,846.69 కోట్లు అని తెలిపారు. 2022–23 ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు దాదాపు రూ.29,107 కోట్లు కాగా, ఇదే కాలానికి ద్రవ్యలోటు రూ.47,716 కోట్లు అని చెప్పారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 2.21 శాతం కాగా, ద్రవ్య లోటు 3.62 శాతంగా ఉందని పేర్కొన్నారు. -
పేదవర్గాలకు భరోసాను కల్పించే అద్భుతమైన బడ్జెట్ ఇది
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో గురువారం రాష్ట్ర ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ 2023-24 సంవత్సరానికి 2 లక్షల 79వేల కోట్ల రూపాయల అంచనాతో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద వర్గాలకు భరోసాను కల్పించే బడ్జెట్‌గా రాష్ట్ర సమాచార పౌరసంబంధాలు, బీసీ సంక్షేమం,, సినిమాటోగ్రఫీ శాఖామంత్రి సిహెచ్. శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. గురువారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పేదరికంపై పోరాటం చేసే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పేదల సంక్షేమానికి మంచి బడ్జెట్ రూపకల్పన చేశారన్నారు. ఈ బడ్జెట్ ప్రసంగాన్ని వినకుండానే బడ్జెట్‌ను చూడకుండానే ప్రతిపక్ష సభ్యులు సభలో గొడవ చేసి సభ నుండి సస్పెండ్ చేయించుకుని వళ్ళిపోడవం చాలా దురదృష్టకరమని దీనిని ప్రజలు గమనించాలని సూచించారు.బడ్జెట్ ప్రసంగం అయ్యాక బాధ్యత గల ప్రతిపక్షంగా వారి అభిప్రాయాలను తెలియ జేయవచ్చు గాని ఆవిధంగా చేయకుండా ముందుగానే సభ నుండి వెళ్ళిపోయారని చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో 2లక్షల 79 వేల కోట్ల రూ.లు బడ్జెట్లో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని ఏకంగా 80 వేల కోట్ల రూ.లు కేటాయించడం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. అదే విధంగా వ్యవసాయ రంగానికి కూడా అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి 43వేల కోట్ల రూపాయలు కేటాయించారని అన్నారు. బడ్జెట్లో అన్ని రంగాలకు సమాన ప్రాధాన్యతను కల్పించడం జరిగిందని తెలిపారు. అభివృద్ధి సంక్షేమ పధకాలు అమలులో ముఖ్యంగా సంక్షేమ పధకాలు దళారుల ప్రమేయం లేకుండా నేరుగా లబ్దిదారులకే అందేలా ప్రత్యక్ష నగదు బదిలీ(డిబిటి)విధానం ద్వారా అర్హులైన పేదలందరికీ అందేలా చేయడం జరుగుతోందన్నారు.పేదరిక నిర్మూలకు ధనం,విద్య అత్యంత ప్రధానం అని భావించి ఆదిశగా పేదరిక నిర్మూలనకు సీఎం జగన్ అన్ని విధాలా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, కాపు, మహిళా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి తగిన రీతిలో నిధులు కేటాయిండం అభినందనీయమని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు బీసీలు, బడుగు బలహీన వర్గాల తరుపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. -
రామోజీ.. ఆరోజున జరిగింది మర్చిపోయారా?
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తెలుగుదేశం, ఈనాడు మీడియా సెల్ఫ్ గోల్స్ వేసుకుంటున్నాయి. ముఖ్యంగా గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవమానించారంటూ టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రకటన చేయడం, దానిని ఈనాడు ప్రచురించడం పెద్ద వివాదమైంది. ఈ అంశంలో తెలుగుదేశం, ఈనాడు ఆత్మరక్షణలో పడ్డాయి. అలాగే విద్యా రంగానికి సంబంధించి వేసిన ప్రశ్నలో టీడీపీ ఎమ్మెల్యే వీరాంజనేయులు స్కూళ్ల మూసివేత అంటూ చేసిన ఆరోపణపై బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించడంతో మరోసారి ప్రతిపక్షం ఇరుకున పడింది. ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రతిపక్షం, ఈనాడు తదితర టీడీపీ మీడియా సంస్థలు వాస్తవాలతో నిమిత్తం లేకుండా తప్పుడు ప్రచారం చేయబోయి బొక్క బోర్ల పడుతున్నాయి. శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున గవర్నర్ వచ్చి ప్రసంగం చేయడం సంప్రదాయం. గవర్నర్‌కు ముఖ్యమంత్రి , శాసనసభ స్పీకర్, శాసనమండలి ఛైర్మన్లు స్వాగతం చెప్పి సభలోకి తీసుకు వస్తారు. ఇది ఎప్పుడూ జరిగే విషయమే. ఈసారి గవర్నర్ కొంత భిన్నంగా స్పీకర్ ఛాంబర్లోకి వెళ్ళి కొద్దిసేపు ఉన్నారు. ఇలాంటి ఘటనలను రిపోర్టు చేయడం తప్పు కాదు. కాని దానిని వక్రీకరించి, జరగని దానిని జరిగినట్లు టీడీపీ సభ్యులు ఆరోపించడం, దానిని ఒక ప్రముఖ దినపత్రిక ప్రచురించడం చాలా పెద్ద తప్పు అని చెప్పాలి. గవర్నర్ తన వ్యక్తిగత అవసరం రీత్యా స్పీకర్ చాంబర్లోకి వెళ్లారు. ఆ సందర్భంగా వీరంతా కొన్ని నిమిషాలపాటు అక్కడ కూర్చున్నారు. తదుపరి శాసనభలోకి వచ్చి ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఆ క్రమంలో కూడా ఆయన గొంతు నొప్పితో బాధపడుతూ అప్పుడప్పుడూ మంచినీరు కూడా తీసుకోవడం అంతా చూశారు. ఈ వ్యవహారంపై కేశవ్‌కు ఎవరు బ్రీఫ్ చేశారో తెలియదు కానీ, ఆయన అన్ని విషయాలు తెలుసుకోకుండానే గవర్నర్‌కు అవమానం జరిగినట్లు మీడియా ముందు కామెంట్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ కోసం గవర్నర్ నజీర్ ఎదురు చూసినట్లు ఆయన ఆరోపించారు. దీనిని ఈనాడు దినపత్రిక ప్రచురించింది. నిజానికి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మీడియావారు ఎవరైనా సరే వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. కానీ, బహుశా టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియా తమకు తలనొప్పి వస్తుందేమోనని భయపడి కేశవ్‌కు చెప్పి మాట్లాడించి ఉండవచ్చు. గతంలో కూడా ఇలా అనేకసార్లు మీడియా చెప్పే మాటలు నమ్మి నేతలు ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టేవారు. అప్పట్లో ఏదైనా తేడా వస్తే తాను అలా అనలేదని బుకాయించడానికి అవకాశం ఉండేది. ఆ రోజుల్లో సోషల్ మీడియా, వీడియో రికార్డింగ్ సదుపాయం ఉండేదికాదు. దానిని అడ్డం పెట్టుకుని నేతలు తప్పించుకునేవారు. కానీ, ఇప్పడు సోషల్ మీడియా, పూర్తి స్థాయిలో వీడియో చిత్రీకరణ జరుగుతోంది. ఏపీ శాసనసభలోకి గవర్నర్ కాన్వాయ్ వస్తున్న సన్నివేశాల మొదలు తిరిగి ఆయన వెళ్లిపోయేంతవరకు అంతా వీడియో రికార్డు అయింది. దాంతో కేశవ్ చేసిన ఆరోపణలపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇది కేశవ్ చెబితే రాశారా?.. లేక ఈనాడు తప్పుడు కథనం రాసిందా? అన్నది తేల్చాలని , వీరిపై సభా హక్కుల ఉల్లంఘన పెట్టాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డితో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలు, మంత్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శాసనసభలో దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. ఈనాడు అధినేత రామోజీరావు నిత్యం అసత్యాలు వండి వార్చుతూ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నారని సభ్యులు ఆరోపించారు. ఈ కేసులో రామోజీని సభకు రప్పించాలని కూడా కొందరు డిమాండ్ చేశారు. కేశవ్ దీనిపై సమాధానం ఇస్తూ తొలుత అటుఇటుగా మాట్లాడినా, ఆయన మీడియాతో చెప్పిన విషయాలను కూడా బుగ్గన ప్రదర్శించడంతో అవాక్కవాల్సి వచ్చింది. దీనిపై ఆయన ఏదో వివరణ ఇవ్వడానికి ప్రయత్నించినా, వైఎస్సార్సీపీ నేరుగా గవర్నర్‌ను కించపరిచారని అన్నారా? లేదా? మీరు అనకపోతే ఈనాడు కావాలని తప్పుడు వార్త రాసిందా? అన్నది చెప్పాలని డిమాండ్ చేసింది. దీంతో టీడీపీ, ఈనాడు పత్రిక డిఫెన్స్‌లో పడ్డాయి. కేశవ్ చేసింది గవర్నర్‌ను కించపరిచే విధంగా ఉందని, అందువల్ల ఆయనను, ఆ మీడియా సమావేశంలో పాల్గొన్న మరో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడిని సభ నుంచి ఈ సెషన్ అయ్యేంతవరకు సస్పెండ్ చేయాలని నిర్ణయించగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమోదించారు. వీరి సస్పెన్షన్‌పై ఆందోళనకు దిగిన ఇతర టీడీపీ సభ్యులను కూడా ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. సాధారణంగా ప్రతిపక్షం సభలో ఏదైనా ప్రజా సమస్యలపైన పోరాడినట్లు కనిపించి సస్పెండ్ అవ్వాలని కోరుకుంటుంది. కానీ, ఇలా అబద్దాలు చెప్పి సస్పెండ్ అవడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. కేశవ్ ప్రకటనను ప్రచురించిన ఈనాడుపై చర్య తీసుకునే విషయాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని భావించారు. మీడియా రూల్స్ ప్రకారం తప్పుడు సమాచారంతో ప్రకటన చేయడం ఎంత తప్పో, దానిని ప్రచురించి ప్రచారం చేయడం కూడా అంతే తప్పుగా పరిగణించవలసి ఉంటుంది. అందులోనూ సభా వ్యవహారాలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ఎవరో చేసిన ప్రకటనను తాము ప్రచారం చేశామని అంటే చెల్లదన్నది సూత్రం. కాకపోతే ఈ రోజుల్లో వాటిని పెద్దగా పట్టించుకోవడం లేదు. పట్టించుకుంటే మాత్రం అది సీరియస్ విషయమే అవుతుంది. గతంలో కూడా రామోజీరావుకు ఇలాంటి అనుభవం లేకపోలేదు. అప్పట్లో శాసనమండలిని ఉద్దేశించి ఈనాడులో పెట్టిన ఒక శీర్షిక వివాదాస్పదం అయింది. దాన్ని సభ తీవ్రంగా తీసుకుని రామోజీని సభకు పిలిపించాలని తీర్మానించింది. ఆ తరుణంలో రామోజీ హైకోర్టు నుంచి రక్షణ పొందారు. ఆయనను నిర్భందించి మండలికి తీసుకు వెళ్లాలని వచ్చిన ఆనాటి సిటీ పోలీస్ కమిషనర్ విజయరామరావు ఆ స్టే ఉత్తర్వును అనుసరించి వెనక్కి వెళ్లిపోయారు. ఆ తర్వాత కూడా మీడియాపై సభలో చర్చలు జరిగినా, మరీ సీరియస్ అయిన సందర్భాలు తక్కువే. ఈసారి ప్రివిలేజ్ కమిటీ దీనిని ఏ విధంగా టేకప్ చేస్తుందన్నది వేరే విషయం. కానీ, ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పుడు ప్రకటన చేశారన్న విమర్శను తెలుగుదేశం పార్టీ, తప్పుడు వార్తను ప్రచురించారన్న విమర్శను ఈనాడు ఎదుర్కొన్నాయి. కొద్ది రోజుల క్రితం టీడీపీ నేత ఒకరిని పోలీసులు కొట్టారంటూ పాత ఫోటోలు వేసి ప్రతిష్టను దెబ్బ తీసుకున్న ఈనాడు మరోసారి శాసనసభ విషయంలో అప్రతిష్టపాలైంది. దానిని సహజంగానే వైఎస్సార్సీపీ అడ్వాంటేజ్‌గా తీసుకోగలిగింది. అసలే ఈనాడును దుష్టచతుష్టయంలో ఒక భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆరోపిస్తున్న నేపథ్యంలో వీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. కానీ, అలాకాకుండా కేవలం అహంతో వ్యవహరిస్తూ ఇలాంటి కథనాలు రాస్తున్నారు. మరో అంశం ఏమిటంటే ఏపీలో ప్రాథమిక స్కూళ్లను మూసివేశారంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే వీరాంజనేయులు ఆరోపించారు. దానిపై మంత్రి బొత్స సత్యనారాయణ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. టీడీపీ హయాంలో ఐదువేల స్కూళ్లు మూతపడగా, వాటిలో మూడువేల స్కూళ్లను తాము తెరిచామని చెప్పారు. ఎక్కడ స్కూళ్లు మూతపడ్డాయో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అలా మూతపడినట్లు రుజువు చేస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. ప్రత్యేకించి వీరాంజనేయులు నియోజకవర్గంలో ఫలానా గ్రామంలో స్కూల్ మూతపడిందని చెప్పాలని బొత్స డిమాండ్ చేశారు. దానికి టీడీపీ నీళ్లు నమలవలసి వచ్చింది. వైఎస్సార్సీపీపై ఏదో ఒక వ్యతిరేక వార్త రాసే పనిలో భాగంగా ఈనాడు పత్రిక ఆ స్కూల్ మూతపడిందనో లేక ఇంకొకటనో రాసేది. దానిని నమ్మి టీడీపీ ఎమ్మెల్యే సభలో మాట్లాడి పరువు పోగొట్టుకున్నారన్నమాట. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ -
Ap Budget: నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల కేటాయింపులు
సాక్షి, అమరావతి: సంక్షేమమే తమ ధ్యేయమంటూ జన రంజక బడ్జెట్ ప్రవేశపెట్టి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ నీటి వనరుల అభివృద్ధికీ ప్రాధాన్యమిచ్చింది. ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతు శ్రేయస్సు దిశగా చేస్తున్న కృషిని వెల్లడించారు. మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీలను పెన్నార్ డెల్టా సిస్టం, కావలి కెనాల్, కనుపూరు కాలువల క్రింద ఆయకట్టును స్థిరీకరించడానికి సీఎం జగన్ పెన్నా నదిపై పనులను సెప్టెంబర్ 6, 2022 న ప్రారంభించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల నందు 68 చెరువుల ప్రాజెక్టు పూర్తయి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్టు ద్వారా కరువు పీడిత ప్రాంతంలో గల సుమారు 100 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందుబాటులోకి రానుండటంతో ప్రజల చిర కాలస్వప్నం నెరవేరనున్నది. పోలవరం సాగునీటి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఏపీ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతను ఇస్తోంది. ఇప్పటి వరకు ప్రధాన ఆనకట్ట, కాలువ పనులు 79.07 శాతం పూర్తయ్యాయి. పునర్నిర్మాణ, పునరావాస పనులు ఏక కాలంలో పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుతో పాటు అన్ని జిల్లాలలో జలయజ్ఞం కింద సత్వర సాగునీటి సౌకర్యానికి భరోసాతో కూడిన తాగునీరు అందించడానికి, పరిశ్రమలకు నీరు అందించేందుకు చేపట్టిన అన్ని ప్రధాన ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. శ్రీకాకుళం జిల్లాలో మెరుగైన నీటిపారుదల సౌకర్యాన్ని అందించే దిశగా, నాగావళి మరియు వంశధార నదుల అను సంధానాన్ని, 2023 మార్చి నాటికి మరియు వంశధార ప్రాజెక్ట్ రెండవ దశలోని స్టేజ్-2 పనులను 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. నల్లమల సాగర్ నీరందించేందుకుగాను పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ ఈ ఆర్థిక సంవత్సరంలో పూర్తి కానుంది. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశ, రెండవ దశలను డిసెంబర్ 2023 నాటికి పూర్తి చేయడానికి ప్రణాళిక రూపొందించాంమని, గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్ట్ మొదటి దశను మార్చి 2025 నాటికి, రెండవ దశను మార్చి 2026 నాటికి పూర్తి చేయడానికి తమ ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి బుగ్గన తెలిపారు. పంట కోత సమయంలో ఎదురయ్యే ప్రతికూల విపత్తులను నివారించడానికి చాలా సంవత్సరాల తరువాత మొదటిసారిగా గోదావరి డెల్టాకు జూన్ 1, 2022న కృష్ణా డెల్టాకు జూన్ 10, 2022న నీటిని విడుదల చేశాం. జూలై 31, 2022న నాగార్జున సాగర్ ప్రాజక్టు కాలువలకు ముందస్తుగా నీటిని విడుదల చేయడం వలన రైతులు ఖచ్చితమైన పంట దిగుబడిని సాధించగలిగారని మంత్రి అన్నారు. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి నీటి వనరుల అభివృద్ధికి 11,908 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. -
Ap Budget 2023-24: పరిశ్రమలు, వాణిజ్యానికి రూ. 2,602 కోట్ల కేటాయింపు
సాక్షి, అమరావతి: పరిశ్రమలు, మౌలిక సదుపాయల అభివృద్ధి ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపడమే కాక, వివిధ రంగాలలో ఉత్పాదక సామర్థ్యాలను వెలికితీస్తూ, ఉపాధి కల్పనను ప్రోత్సహిస్తుంది. ఇటీవల విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సుకు అద్భుతమైన స్పందన వచ్చి, ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఏపీ రాష్ట్రం పటిష్టతను ఈ సదస్సు నిరూపించింది. 8,000 మందికి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎన్టీపీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ గ్రూప్, జిందాల్ స్టీల్ అండ్ వపర్, భారత్ బయోటెక్, జీఎంఆర్ గ్రూప్, దాల్మియా గ్రూప్, రెన్యూ పవర్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, సెంచురీ ఫ్లైబోర్డ్స్, శ్రీ సిమెంట్, రామ్‌కో సిమెంట్స్, అపోలో హాస్పిటల్స్‌తోపాటు అనేక ఇతరప్రముఖ పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ప్రతిపాదించాయి. ఈ సదస్సులో 48 దేశాల నుంచి రాయబారులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్, పోలాండ్, డెన్మార్క్,న ఆర్వే, నెదర్లాండ్స్, సింగపూర్, జపాన్ల నుంచి ఏడు అంతర్జాతీయ వ్యాపార ప్రతినిధుల బృందాలు ఏపీ పారిశ్రామిక సామర్థ్యాలపై ఎంతో ఆసక్తిని కనబరిచాయి. ఈ అవకాశాలను అన్వేషించడానికి యూఏఈ, నెదర్లాండ్స్, వియత్నాం, పశ్చిమ ఆస్ట్రేలియా దేశాలతో నాలుగు సమావేశాలు జరిగాయి. 13.42 లక్షల కోట్ల రూపాయల అంచనా పెట్టుబడితో ఏపీలో 6 లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించే అవకాశంతో, 378 అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడంతో ఈ సదస్సు ముగియడం ఎంతో గర్వించదగ్గ విషయం. ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు నుంచి వచ్చిన ఈ విశేష, స్పందన, అనుకూలమైన ప్రభుత్వ పారిశ్రామిక అభివృద్ధి విధానానికి, విశ్వసనీయతకు నిదర్శనం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. పెట్టుబడిదారుల అన్ని అవసరాల కోసం సింగిల్ డెస్క్ పోర్టల్ సర్వర్లు వన్ స్టాప్ షాప్‌గా ఉంటాయి. దీనిలో భాగంగా ఏప్రిల్ 2019, నుంచి 36,972 దరఖాస్తులు స్వీకరించండి. వాటిలో 36,049 దరఖాస్తులు ఆమోదించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిసెంబర్ 31, 2022 వరకు, 13 పెద్ద, భారీ ప్రాజెక్ట్‌లు 15,099 కోట్ల రూపాయల పెట్టుబడి, 12,490 మందికి ఉపాధిని కల్పించి వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించాయి. అదే విధంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎమ్ఎస్ఎమ్ఈ) రంగంలో 7,742 కోట్ల రూపాయల పెట్టుబడితో 54,430 యూనిట్లు 2,11,219 మందికి ఉపాధి కల్పనతో ఉత్పత్తిలోకి ప్రవేశించాయి. చదవండి: AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల డిసెంబర్ 2022 వరకు, పారిశ్రామిక ప్రోత్సాహకాల క్రింద జనరల్ కేటగిరీలోని 902 సూక్ష్మ చిన్న మరియు మధ్యతరహా (ఎం.ఎస్.ఎం.ఈ.) యూనిట్లకు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన 448 యూనిట్లకు, షెడ్యూలు కులాలకు చెందిన 3,748 యూనిట్లకు షెడ్యూలు తెగలకు చెందిన 602 యూనిట్లకు మొత్తం 482 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. అలాగే ఈ ప్రభుత్వం క్లస్టర్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోంది. సూక్ష్మ, చిన్న తరహా సంస్థలు-క్లస్టర్ అభివృద్ధి (ఎమ్ఎస్ఈసీడీపీ) ప్రాజెక్టుల కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ ప్రభుత్వం ఐదు క్లస్టర్ల నిర్మాణానికి అనుమతిని పొందింది. అంతే కాకుండా మన రాష్ట్రం జాతీయ పారిశ్రామిక వాడల అభివృద్ధి సంస్థ విశాఖపట్నం నోట్లోని నక్కపల్లి క్లస్టర్, శ్రీకాళహస్తి-ఏర్పేడు నోడ్లోని చిత్తూరు సౌత్ క్లస్టర్, విశాఖపట్నం-చెన్నై పారిశ్రామిక కారిడార్ (వీసీఐసీ) కింద కడప నోడ్ కొప్పర్తి క్లస్టర్ ఈ మూడు పారిశ్రామిక వాడల అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు ఆమోదం తెల్పింది. 3,155 ఎకరాలలో కొప్పర్తి సమీపంలో వైఎస్సార్ జగనన్న భారీ పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తోంది. ఈ పారిశ్రామిక వాడ బహుళ ఉత్పత్తుల భారీ పారిశ్రామిక పార్క్ గా 25,000 కోట్ల రూపాయల పెట్టుబడులతో 75,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. భారీ పారిశ్రామిక వాడకు ఆనుకుని వైఎస్సార్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌ను కూడా అభివృద్ధి చేస్తోంది దీని ద్వారా సుమారు 10 వేల కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాలని 25,000 మందికి ఉపాధిని కల్పించే అవకాశం ఉంటుంది. జిందాల్ స్టీల్ వర్క్స్ కంపెనీ 3,300 కోట్ల రూపాయల పెట్టుబడితో, సంవత్సరానికి రెండు మిలియన్ టన్నులు ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో కడప ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నది. దీని మొదటి దశలో 1000 ఉద్యోగాల వరకు ప్రత్యక్ష ఉపాధిని, రెండవ దశలో ప్రత్యక్షంగా 2,500 ఉద్యోగాలను, పరోక్షంగా 10,000 మందికి ఉపాధిని కల్పిస్తుంది. ఈ ప్రాజెక్టు కడప ప్రాంత ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. ► 2023-24 ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమలు మరియు వాణిజ్యం కోసం 2,602 కోట్ల రూపాయల కేటాయించింది. రవాణా, రహదారుల మౌలిక సదుపాయాలు రాష్ట్రంలో దాదాపు 32,725 కి.మీ. ప్రధాన జిల్లా రహదారులు, జిల్లాల్లోని ఇతర రోడ్ల నిర్వహణతోపాటు 4,000 కి.మీ పొడవున ఉన్న బి.టి. రోడ్లను పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవడమైంది. రూ. 400 కోట్ల రూపాయలతో దెబ్బతిన్న రోడ్ల నిర్వహణ, అత్యవసర మరమ్మతులను ప్రభుత్వం చేపట్టింది. 2,205 కోట్ల రూపాయలతో 8,268 కి.మీ. రాష్ట్ర రహదారుల, జిల్లా ప్రధాన రహదారుల అభివృద్ధిని సాధించింది. 'రహదారుల అనుసంధాన ప్రాజెక్ట్' క్రింద కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాలకు 437.59 కి.మీ. పొడవుగల రోడ్లకు సంబంధించి 391 కోట్ల రూపాయలతో 46 పనులను మంజూరు చేయడమైనది. డిసెంబర్ 2022 నాటికి 383.66 కి.మీ. పొడవు మేర రహదారి పనులు పూర్తయ్యాయి. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి రవాణా, రహదారుల మరియు భవనాల శాఖకు 9,118 కోట్ల రూపాయల కేటాయించింది. -
AP Budget 2023-24: పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,873 కోట్ల
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సుస్థిరమైన జీవనోపాధిని కల్పించడానికి, గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతమైన ఆస్తులను సృష్టించడానికి 16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి కల్పనా హామీ పథకం (ఎమ్‌జీఎన్‌ఆర్‌జీఎస్) అమలు చేస్తోంది. ఈ ఆస్తులలో 10,917 గ్రామ సచివాలయ భనాలు, 10,243 వ్యవసాయ ఉత్పత్తులను నిల్వచేసే నిర్మాణాలు, 8,320 భారత్ నిర్మాణ సేవా కేంద్రాలు, ఎక్కువ మోతాదులో పాల శీతలీకరణ చేసే 3,734 పాల శీతలీకరణ యూనిట్లు, నీటి సంరక్షణా కట్టడాలు ఉన్నాయి. డిసెంబర్ 2022 నాటికి ఈ రంగంలో సుమారుగా 18,39 కోట్ల పని దినాలు కల్పించాయి. అంతేగాక 98 శాతం చెల్లింపులు 15 రోజులలోపు చేశారు. ఉచితంగా బోరు బావులు తవ్వి పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ, తద్వారా సాగు యోగ్యమైన భూములకు నీటిపారుదల సౌకర్యాన్ని పెంచేవిధంగా సీఎం జగన్.. సన్న, చిన్నకారు రైతుల కోసం వైఎస్సార్ జలకళ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 28, 2020న ప్రారంభించారు. ఇప్పటి వరకు 17,047 బోరు బావులు తవ్వడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వంలో కుళాయి కనెక్షన్ల ద్వారా సుమారు 65 లక్షల ఇళ్లకు సురక్షిత మంచినీటిని అందించింది. జగనన్న కొత్త హౌసింగ్ కాలనీలతో సహా 2024 సంవత్సరం నాటికి రాష్ట్రంలోని అన్ని కుటుంబాలు వీటి కిందకు తీసుకురాబడతాయి. అంతేగాక 250 అంతకంటే ఎక్కువ జనాభా ఉండి రహదారుల అనుసంధానం లేని అన్ని నివాసాలకు అనుసంధానించడానికి 'ఆంధ్రప్రదేశ్ గ్రామీణ రహదారి ప్రాజెక్టు'ను అమలు చేస్తోంది. ఇప్పటివరకు 1,737 కి.మీ. రహదారుల పొడవుతో సుమారు 1,198 ఆవాసాలు ఈ ప్రాజెక్టు క్రింద అనుసంధానం చేయబడ్డాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3,692 కి.మీ. రహదారి పొడవుతో అదనంగా 2,461 ఆవాసాలను కలుపుటకు ఈ ప్రాజెక్టు క్రింద ప్రణాళిక చేయబడింది. ప్రయోజనకరమైన ఈ రహదారుల అనుసంధానం వలన మార్కెట్ మెరుగుపడి రోజువారీ వేతనాల పెరుగుదలకు దారితీసింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి 15,873 కోట్ల రూపాయల కేటాయించింది. చదవండి: AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా.. -
CM Jagan Photos: జన రంజక ఏపీ వార్షిక బడ్జెట్ 2023-24 (ఫొటోలు)
-
AP Budget 2023-24: విద్యా రంగానికి పెద్దపీట.. ఎన్ని కోట్లు కేటాయించారంటే!
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మన బడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి, పాఠ్యాంశ సంస్కరణలు, మరుగుదొడ్ల నిర్వహణ నిధి (టీఎమ్‌ఎఫ్), పాఠశాల నిర్వహణ నిధి(ఎన్.ఎమ్, ఎఫ్), సమీకృత పాఠ్యాంశ, పరిపాలన సంస్కరణల వంటి కార్యక్రమాలను, విధి విధానాలను ప్రవేశపెట్టడం ద్వారా పాఠశాల విద్యలో పరివర్తన యుగానికి నాంది పలికింది. ప్రభుత్వ పాఠశాలలో విద్యను మెరుగుపరిచి రాష్ట్ర విద్యార్థులను ప్రపంచ స్థాయిలో పోటీ పడేలా చేయడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లక్ష్యాన్ని సాధించే దిశగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేక దృశ్య మాధ్యమ తరగతులు, విద్యా పునాదిని వేసే ప్రాథమిక పాఠశాలలో స్మార్ట్ టీవీ గదులు నిర్మించేందుకు ప్రభుత్వం ఆమెదం తెలిపింది. ఉపాధ్యాయులకు 60,000 ట్యాబ్‌లను, కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు(సీబీఎస్ఈ) సూచించిన విధానంలో 2024-25 విద్యా సంవత్సరంలో 10 వతరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే ప్రస్తుత 8వ తరగతి విద్యార్థులకు 4.6 లక్షల ట్యాబ్‌లను పంపిణీ చేసింది. జగనన్న అమ్మ ఒడి. వినూత్నమైన, విశిష్టమైన జగనన్న అమ్మ ఒడి కార్యక్రమాన్ని అమలు చేయడం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా హాజరు శాతం తగ్గకుండా ప్రభుత్వం చూస్తోంది. ఈ పథకం కింద 2019-20 సంవత్సరం నుంచి 44 లక్షల 50 వేల మంది తల్లులకు.. 84 లక్షల మంది పిల్లలకు ప్రయోజనం చేకూర్చేందుకు ఏటా సూమారు రూ. 19,618 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తూ రావడం జరుగుతోంది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న అమ్మ ఒడి పథకం కోసం రూ.6,500 కోట్లు కేటాయించింది. మన బడి నాడు-నేడు మన బడి నాడు-నేడు కార్యక్రమం కింద 15,715 పాఠశాలలో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు పెద్ద, చిన్నచిన్న మరమత్తుల పనులు,మరుగుదొడ్ల నిర్వహణ, విద్యుద్ధీకరణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు, వంట శాలలను అనే 10 మౌలిక సదుపాయాలు ఆధునీకరిస్తుంది సీఎం జగన్ ప్రభుత్వం.. ఈ కార్యక్రమం కింద మొదటి, రెండవ దశలలో మొత్తం 22,344 పాఠశాలలో పనులు చేపట్టారు. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి మన బడి నాడు-నేడు కార్యక్రమం కిందరూ. 3,500 కోట్లు కేటాయించింది. జగనన్న విద్యాకానుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతాన్ని మెరుగుపరిచేందుకు. యూనిఫామ్‌లు, బూట్లు, సాక్స్‌లు, పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, స్కూల్ బెల్ట్, మాస్క్‌ల సెట్లతో కూడిన ‘టీచింగ్-లెర్నింగ్ మెటీరియల్’ను విద్యార్థి కిట్ల రూపంలోప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం కిద 47.4 లక్షల మంది పిల్లలకు లబ్ధి చేకూర్చేందుకు ఇప్పటి వరకు రూ. 2,368 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది ►2023-24 బడ్జెట్లో జగనన్న విద్యాకానుక కోసం రూ.560 కోట్లు కేటాయించారు. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పాలిటెక్నిక్, ఐటీఐ, ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీతో పాటు ఉన్నత కోర్సులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించే జగనన్న విద్యా దీవెన పథకం ప్రభుత్వం అమలు చేస్తోంది. 2019 నుంచి ఈ పథకం కింద 9,249 కోట్ల రూపాయలను పంపీణి చేశారు ►2013-24 ఆర్థిక సంవత్సరానికి జగనన్న విద్యాదీవెన పథకం కోసం రూ. 2.841 కోట్లు కేటాయించింది. ►జగనన్న వసతి దీవెన పథకం కోసం రూ. 2,200 కోట్ల కేటాయింపు జరిగింది. ►2023-24 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్య కోసం రూ. 29,690 కోట్ల రూపాయలు కేటాయించింది. ►ఉన్నత విద్య కోసం రూ. 2,064 కోట్లు కేటాయించింది. -
అసెంబ్లీ నుంచి 14 మంది టీడీపీ సభ్యుల సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యులు ఓవరాక్షన్ చేశారు. బడ్జెట్ ప్రవేశపెడుతుండగా ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంపై పేపర్లు విసిరారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌కు సీఎం సిఫార్సు చేశారు. బడ్జెట్ ప్రసంగానికి అడ్డు తగలడంతో టీడీపీ నేతలపై స్పీకర్ తమ్మినేని సీతారాం చర్యలు తీసుకున్నారు. 14 మంది టీడీపీ సభ్యులను ఒక్కరోజు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా అసెంబ్లీలో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ. 2,79,279 కోట్తో 2023,24 వార్షిక బడ్జెట్ రూపొందించారు. రెవెన్యూ వ్యయం రూ. 2,28,540 కోట్లు.. మూలధన వ్యయం రూ. 31,061 కోట్లుగా పేర్కొన్నారు. చదవండి: రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ -
AP Budget 2023-24: రూ.2,79,279 కోట్లతో జన రంజక వార్షిక బడ్జెట్
Live Updates రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ శాసనసభలో ప్రవేశ పెట్టారు. ►రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు ►మూలధన వ్యయం రూ.31,061 కోట్లు ►రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు ►ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు ►జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం ►ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం 2023 బడ్జెట్ కేటాయింపులు.. ►వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు ►వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు ►జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు ►జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు ►వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు ►డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు ►రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు ►వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు ►జగనన్న చేదోడు-రూ.350 కోట్లు ►వైఎస్సార్ వాహనమిత్ర-రూ.275 కోట్లు ►వైఎస్సార్ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు ►వైఎస్సార్ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు ►మత్స్యకారులకు డీజీల్ సబ్సీడీ-రూ.50 కోట్లు ►రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు ►లా నేస్తం-రూ.17 కోట్లు ►జగనన్న తోడు- రూ.35 కోట్లు ►ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు ►వైఎస్సార్ కల్యాణమస్తు-రూ.200 కోట్లు ►వైఎస్సార్ ఆసరా-రూ.6700 కోట్లు ►వైఎస్సార్ చేయూత-రూ.5000 కోట్లు ►అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు ►మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు ►ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు ►వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు ►మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు ►జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు ►పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు ►పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు ►స్కిల్ డెవలప్మెంట్ రూ. 1,166 కోట్లు ►యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు ►షెడ్యూల్ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు ►షెడ్యూల్ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు ►వెనుకబడిన తరగతుల సంక్షేమం- రూ. 38,605 కోట్లు ►కాపు సంక్షేమం- రూ.4,887 కోట్లు ►మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు ►పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు ►పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు ►రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు ►నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్)- రూ.11,908 కోట్లు ►పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు ►ఎనర్జీ- రూ.6,456 కోట్లు ►గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు ►గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు ♦ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన ♦సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల ♦దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్ కార్డుల జారీ ♦ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం ♦రాష్ట్రంలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు ♦ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్వాడీ కేంద్రాలు ♦విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు ♦మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు ♦సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు ♦వైఎస్సార్ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు ♦17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు. ♦లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది ♦వైఎస్సార్ సున్నా వడ్డీ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి బుగ్గన ♦వైఎస్సార్ చేయూత కింద రూ.5వేల కోట్లు కేటాయింపు ♦విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం ♦టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం ♦నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి ♦స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ♦ఆంధ్రప్రదేశ్ వృద్ధి 11.43 శాతం ♦సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి ♦2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు ♦2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లతో 10 శాతం వృద్ధిగా అంచనా ♦రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు ♦రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది ♦పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ ♦16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నాం ♦గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించాం ♦వైఎస్సార్ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వాం ♦కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు ♦మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి ♦విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు ♦ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి ♦చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు ♦పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్లతో ఒప్పందాలు ♦విజయవాడ స్వరాజ్ మైదానంలో అంబేద్కర్ స్మృతివనం ♦125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన ♦జీఐఎస్ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి బుగ్గన ♦సమ్మిట్ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు ♦378 ఎంవోయూలు కుదుర్చుకున్నాం అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్ చేయాలని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌కు పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్ సస్సెండ్ చేశారు. Time: 10: 11 AM ►బడ్జెట్ ప్రసంగాన్ని రాష్ట ప్రజలంతా చూస్తున్నారు: సీఎం జగన్ ►బడ్జెట్ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదు: సీఎం జగన్ Time: 10:07 AM ► బడ్జెట్లో పోతన భగవత పద్యాన్ని చదివిన మంత్రి బుగ్గన ► రవీంద్రనాథ్ ఠాగూర్ కవితను ఉదహరించిన మంత్రి రాజేంద్రనాథ్ Time: 10:04 AM ► అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు. Time: 9:05 AM ►మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశముంది. ►ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం.. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం. ►ఉదయం 10 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన. ►రూ. 2. 79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ఉండే అవకాశం. ►నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం. ►మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్ బేస్డ్ బడ్జెట్ ►మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు. ►వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట ►వ్యవసాయ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ►మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం అంజాద్ భాషా Time: 8:26 AM బడ్జెట్లో పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం: మంత్రి బుగ్గన పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు. Time: 8:11 AM ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సచివాలయానికి బయల్దేరారు. కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. Time: 07:41 AM బడ్జెట్ ప్రతులకు ప్రత్యేక పూజలు బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి చేరుకున్నారు. బడ్జెట్ ప్రతులకు మంత్రి, అధికారులు పూజలు చేశారు. Time: 07:33 AM బడ్జెట్ కాపీతో సచివాలయానికి బయలేర్దిన మంత్రి బుగ్గన బడ్జెట్ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సచివాలయానికి బయలేర్దారు. బడ్జెట్ ప్రతులకు పుజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. శాసనసభలో బుగ్గన, మండలిలో అంజాద్ బాషా.. ►వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షిక బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం జెండర్ బేస్డ్ బడ్జెట్ సిద్ధం చేసింది. ►రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రానున్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా. నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉదయం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించనున్నారు. ►శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు. నవరత్నభరితంగా బడ్జెట్.. ►నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మిళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు. ►గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థకు బడ్జెట్లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నవరత్నాలతో పేదల్లో సాధికారత
గత ప్రభుత్వంలో గాలి మాటలు విన్నాం. ఏం మాట్లాడారో, ఏం చేశారో చూశాం.అందుకు తగ్గట్లు గ్రాఫిక్స్ అలాగే ఉండేవి. అదిగో మైక్రోసాఫ్ట్.. అదిగో బిల్‌గేట్స్ అనేవారు. అదిగో బుల్లెట్ ట్రెయిన్ అని గొప్పలు చెప్పేవారు. మన ప్రభుత్వం అలా కానేకాదు. ఏం చెప్పామో అది చేసి చూపిస్తున్నాం. ప్రతి ఇంటికి మంచి చేశాం. సామాజిక న్యాయం, మహిళా న్యాయం, రైతన్నలకు న్యాయం.. వీటన్నింటిని దైవ కార్యంగా భావించి నిబద్ధతతో అడుగులు ముందుకు వేస్తున్నాం. ఇలాంటి ప్రభుత్వానికి దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు ఎప్పటికీ ఉండాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: నవరత్నాల ద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు పేదరికాన్ని అధిగమించేలా చర్యలు తీసుకున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన ప్రసంగించారు. అమ్మ ఒడి చదివించే తల్లులకు రూ.15 వేలు సహాయం చేస్తుండటం ఒక్క మనరాష్ట్రంలో మాత్రమే కనిపిస్తోందన్నారు. ఇప్పటి వరకు ఈ పథకం ద్వారా 44.48 లక్షల మంది తల్లులకు రూ.19,674 కోట్లు సాయం చేశామని చెప్పారు. 75 శాతం అటెండెన్స్ ఉండాలని చెప్పి ఓ మంచి మేనమామగా తాపత్రయ పడి పిల్లల చదువుల కోసం ఆరాటపడుతూ తెచ్చిన గొప్ప పథకం ఇదని తెలిపారు. రైతు భరోసా పథకం ద్వారా 52.38 లక్షల మంది రైతులకు నాలుగేళ్లలో రూ.27,062 కోట్లు సాయం అందించామన్నారు. కౌలు రైతులు, ఆర్వోఎఫ్ఆర్ రైతులకు సైతం ఈ సాయం అందిస్తున్న ప్రభుత్వం మనదేనని తెలిపారు. బీమా ప్రీమియంగా రైతులు ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం కూడా లేకుండా బీమా భారాన్ని మోస్తున్నామన్నారు. ఇలా ఇప్పటి వరకు 44.05 లక్షల మంది రైతులకు రూ.6,872 కోట్లు పరిహారంగా అందించామని తెలిపారు. ఇన్పుట్ సబ్సిడీ, సున్నావడ్డీ, పగటిపూటే తొమ్మది గంటల ఉచిత విద్యుత్, ఎంఎస్పీకి ఏమాత్రం తగ్గకుండా ఆహార ధాన్యాల కొనుగోలు, ధాన్యం సేకరణ, ఆర్బీకేల ద్వారా ఈ–క్రాపింగ్.. ఇలా ప్రతి విషయంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని చెప్పారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ► 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు ఆర్థికంగా అండ దండలు అందిస్తున్న వైయస్సార్ చేయూత వంటి పథకం రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశంలో కూడా ఎప్పుడూ, ఎక్కడా లేదు. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 26.40 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.14,129 కోట్లు అందించాం. ► ఐటీసీ, పీ అండ్ జీ, రిలయెన్స్, అమూల్ వంటి పెద్ద పెద్ద సంస్థలను తీసుకుని వచ్చి ఆ అక్కచెల్లెమ్మల జీవనోపాధికి మార్గాలు చూపుతూ.. బ్యాంకులను మమేకం చేస్తూ వాళ్లకు దారి చూపించిన గొప్ప వ్యవస్థను తీసుకొచ్చాం. సున్నా వడ్డీతో అక్కచెల్లెమ్మలకు భరోసా ► పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు అండగా నిలబడేందుకు వైఎస్సార్ ఆసరా ద్వారా రూ.25 వేల కోట్లను నాలుగు విడతల్లో వారికి చెల్లిస్తామని మాట ఇచ్చాం. ఆ మేరకు ఇప్పటికే రెండు విడతల్లో రూ.12,758 కోట్లు 78.74 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతిలో పెట్టాం. మూడో విడత చెల్లింపునకు సిద్ధంగా ఉన్నాం. ► గత ప్రభుత్వ నిర్వాకం వల్ల ఎన్పీఏల కింద 18 శాతం అక్కచెల్లెమ్మల ఏ, బి గ్రేడ్ సంఘాలన్నీ సీ, డీ గ్రేడ్‌లోకి దిగజారిపోయాయి. ఇవాళ అవుట్ స్టాండింగ్ లోన్స్ కేవలం 0.5 శాతమే ఉన్నాయి. అంటే 99.5 శాతం ఇవాళ అక్కచెల్లెమ్మలు సంతోషంగా లోన్లు కడుతున్నారు. ► వైఎస్సార్ కాపునేస్తం ద్వారా 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ ఈబీసీ నేస్తం ద్వారా 3.94 లక్షల మందికి రూ.595 కోట్లు ఇచ్చాం. ఉద్యోగాలు, ఉపాధి కల్పనతో పెరిగిన వృద్ధి రేటు ► ఐదున్నర కోట్ల జనాభాలో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. మన ప్రభుత్వం వచ్చాక ఆ సంఖ్యను ఆరు లక్షలకు పెంచాం. అంటే 50 శాతం ఉద్యోగాలను పెంచాం. పెద్ద, పెద్ద పరిశ్రమలు మిగిలినవి అన్నీ చూసుకుంటే మరో 20 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కువ ఉద్యోగాలు ఎంఎస్ఎంఈ సెక్టారులోనే ఉన్నాయి. ఒక్కో ఎంఎస్ఎంఈ యూనిట్ కనీసం 10 మందికి ఉపాధి కల్పిస్తుంది. ► ఇంతకు ముందున్న 1.10 లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్లకు అదనంగా మరో 1.56 లక్షల యూనిట్లు ఏర్పాటయ్యాయి. వీటిని ప్రోత్సహిస్తూ పెండింగ్‌లో ఉన్న ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్‌లను క్లియర్ చేస్తూ వాటికి ప్రభుత్వం తోడుగా ఉందని భరోసా ఇస్తున్నాం. ► వృద్ధి రేటుకు బూస్ట్‌నిచ్చే మరొక రంగం స్వయం ఉపాధి. వైఎస్సార్ మత్స్యకార భరోసా ద్వారా 1.20 లక్షల మంది మత్స్యకారులకు రూ.422 కోట్లు సాయం చేశాం. వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా 82 వేల కుటుంబాలకు రూ.778 కోట్లు అందించాం. వాహనమిత్ర, జగనన్న తోడు, జగనన్న చేదోడు, లా నేస్తం వంటి పథకాలతో తోడుగా నిలబడ్డాం. ► జగనన్న చేదోడు ద్వారా పుట్‌పాత్‌ల మీద కూరగాయలు అమ్ముకునేవారు, తోపుడు బండ్లమీద వ్యాపారులు.. ఇలాంటి 15 లక్షల మందికి తోడుగా నిలబడ్డాం. వీటితో పాటు 30.75 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. సిమెంటు, స్టీలు అమ్మకాలతో మార్కెట్ పెరిగి కార్మికులకు ఉపాధి పెరిగింది. తద్వారా వృద్ధిరేటులో ఏపీ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచింది. అక్కచెల్లెమ్మల భద్రతకు కీలక నిర్ణయాలు ► మనందరి ప్రభుత్వంలో గ్రామ, వార్డు స్థాయిలో 15 వేల మంది మహిళా పోలీసులను నియమించాం. మహిళల భద్రత కోసం దిశ యాప్ తీసుకొచ్చాం. ఇప్పటికే 1.36 కోట్ల అక్క చెల్లెమ్మలు డౌన్లోడ్ చేసుకున్నారు. ► దిశ బిల్లు కూడా తీసుకొచ్చాం. అది ఉమ్మడి జాబితా (కాంకరెన్స్ లిస్ట్)లో అంశం కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కోసం పంపాం. దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశ పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. ► నా మంత్రి మండలిలో, మన ప్రభుత్వం ఇచ్చే నామినేటెడ్ పదవులు, ఆలయ బోర్డులు, ఏఎంసీలు, స్థానిక సంస్థల్లో.. ఎందులో చూసినా సామాజిక న్యాయంతో పాటు రాజకీయ న్యాయం కూడా అంతే ప్రస్ఫుటంగా కనిపిస్తుందని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఆ పదవుల్లో కనీసం సగం వాటా అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా, సగం వాటా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇచ్చేలా అడుగులు ముందుకు వేశాం. కోవిడ్‌ను దీటుగా ఎదుర్కొన్నాం ► కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొన్న అగ్రగామి రాష్ట్రాల్లో మన రాష్ట్రం కూడా ఒకటి. వైద్య రంగంలో కనీవినీ ఎరగనిరీతిలో ప్రివెంటివ్ కేర్‌లో ఒక కొత్త అధ్యాయానికి తెరతీస్తూ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. ► గ్రామాలు, పట్టణాల్లో 10,550 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లను ఏర్పాటు చేశాం. వాటితోపాటు పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రులు, డిస్ట్రిక్ట్ ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు కార్యక్రమంతో పూర్తిగా మారుస్తున్నాం. -
నా నడక నేల మీదే
నాకు పరిశ్రమలు ఎంత ముఖ్యమో వ్యవసాయం అంతే ముఖ్యం. ఐటీ ఎంత ముఖ్యమో చిరు వ్యాపారులు, నా బీసీ, ఎస్సీ, ఎస్టీ, కులవృత్తుల్లో ఉన్న వారు కూడా అంతే ముఖ్యం. వారు ఎలా బతకగలుగుతున్నారన్నది కూడా అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో నెల నెలా పింఛన్లు తీసుకుంటున్న అవ్వాతాతలు కూడా అంతే ముఖ్యం. మనందరి ప్రభుత్వం ద్వారా సంక్షేమం, అభివృద్ధి పథకాలతో డబ్బులందుకుంటున్న నిరుపేద అక్క చెల్లెమ్మలు, వారి కుటుంబాలు, వారి బాగోగులు కూడా అంతే ముఖ్యమని చెప్పడానికి గర్వపడుతున్నాను. వారి సామాజిక, రాజకీయ, ఆర్థిక, విద్య, లింగ వివక్షలేని సాధికారతలు అంతకన్నా ముఖ్యం. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, అమరావతి: ‘నా నడక నేల మీదే. నా ప్రయాణం సామాన్యులు, పేదలతోనే. నా యుద్ధం పెత్తందార్లతో. నా లక్ష్యం పేదరిక నిర్మూలన’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన సిద్ధాంతాన్ని విస్పష్టంగా ప్రకటించారు. పేద కుటుంబాలు ఆర్థికంగా బలపడితేనే పేద కులాలు బాగుంటాయని అన్నారు. పేద కుటుంబాలు, పేద కులాలను బలపరుస్తూ.. వారికి అన్ని సాధికారతలు కల్పిస్తేనే సమాజం బాగుంటుందని చెప్పారు. ‘సమాజంలోని అన్ని ప్రాంతాలను బలపరిస్తేనే రాష్ట్రం బాగుంటుందని నేను నమ్మాను. దానిని ఆచరించి ఫలితాలు చూపించాను. ఇదే నా ఎకనామిక్స్. ఇదే నా పాలిటిక్స్. ఇదే నేను నా తండ్రిని చూసి నేర్చుకున్న హిస్టరీ. ఇవన్నీ కలిపితేనే మీ జగన్’ అని తన పాలనా విధానాన్ని ఆవిష్కరించారు. శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై బుధవారం ఆయన ప్రసంగిస్తూ గత నాలుగేళ్లలో చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని గణాంకాలతో సహా వివరించారు. తమ ప్రభుత్వ విధానాల మౌలిక స్వరూపాన్ని, లక్ష్యాలను శాసనసభ వేదికగా విశదీకరిస్తూ తన రాజకీయ విధానాన్ని పునరుద్ఘాటించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. 98.5 శాతం హామీలు నెరవేర్చాం ► మన ప్రభుత్వం వచ్చి దాదాపు 45 నెలలు కావస్తోంది. నాలుగేళ్లు గడవకముందే 98.5 శాతం మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాం. కులం, మతం, ప్రాంతం, వర్గంతో పాటు ఎవరికి ఓటు వేశారన్నది కూడా చూడకుండా మంచి చేస్తామని చెప్పాం. దాన్ని ఆచరణలో చూపించాం. జన్మభూమి కమిటీలను పూర్తిగా రద్దు చేశాం. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పు తీసుకు రాగలిగాం. ► పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. ఈ మూడు తరాలకు మేలు చేసేలా రూ.1,97,473 కోట్లు నేరుగా నగదు బదిలీ పథకం (డీబీటీ) ద్వారా అంటే నేరుగా బటన్ నొక్కి లబ్ధిదారులకు అందించాం. ► మన పరిపాలనలో ఇంటింటికి.. మనిషి మనిషికి ఏ విధంగా మేలు జరిగిందన్నది గడప గడపకు వెళ్లి వివరాలతో చెబుతున్నాం. మంచి జరిగిందని భావిస్తే మనందరి ప్రభుత్వానికి, మీ బిడ్డ ప్రభుత్వానికి మద్దతు పలకండని మన ఎమ్మెల్యేలు ఇంటింటికి వెళ్లి చెప్పగలిగేలా 45 నెలల పరిపాలన సాగిందని సగర్వంగా చెబుతున్నాం. ► 13 జిల్లాలు ఇప్పుడు 26 జిల్లాలు అయ్యాయి. ప్రతి జిల్లాలో ప్రజలకు పరిపాలన, సేవలు రెట్టింపయ్యాయి. రాష్ట్రంలో 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేశాం. వీటిలో 1,34,000 మంది మన పిల్లలు శాశ్వత ఉద్యోగులుగా కనిపిస్తున్నారు. 600 పౌర సేవలు లంచాలు, వివక్షకు తావులేకుండా గ్రామ స్థాయిలోనే అందిస్తున్నాం. 50 ఇళ్లకు ఓ వలంటీర్ చొప్పున 2,65,000 మంది ప్రతి ఇంటికి మంచి చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో పౌర సేవల్లో ఇదో గొప్ప విప్లవం. ► దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో 10,778 రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ఏర్పాటు చేశాం. ఇందులో విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు ప్రతి ఒక్క రైతులకు తోడుగా నిలిచాం. ఆర్బీకేలలో 10,778 మంది అగ్రికల్చర్, హార్టికల్చర్ గ్రాడ్యుయేట్లు సేవలు అందిస్తున్నారు. వైద్య ఆరోగ్య రంగం మీద ప్రధానంగా దృష్టి సారించాం. గత ప్రభుత్వంలో ఇలాంటి సేవలు లేవు. భూ వివాదాలకు శాశ్వత ముగింపు ► గతంలో మండలానికి ఓ సర్వేయర్ ఉంటే గొప్ప. లంచాలు ఇస్తే తప్ప మనకు టైమ్ ఇచ్చేవారు కాదు. అలాంటిది ఈ రోజు గ్రామ, వార్డు సచివాలయాల్లో 10,185 మంది సర్వేయర్లను నియమించాం. వారి ద్వారా వందేళ్ల తర్వాత సమగ్ర భూసర్వే చేపట్టి.. కబ్జాలు, భూవివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెప్పే పలికేలా అడుగులు వేస్తున్నాం. ► మరో 7 వేల మెగావాట్లను యూనిట్ కేవలం రూ.2.49కే మరో 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉండేలా చేస్తున్నాం. ఏడాదికి 17 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వ్యవసాయానికి పగటి పూటే అందుబాటులో ఉండేలా చేస్తూ ఉచిత విద్యుత్ పథకానికి ఢోకా లేకుండా చేస్తున్నాం. ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌లో నంబర్ వన్ ► ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడేళ్లుగా దేశంలోనే నంబర్‌వన్ స్థానం మన రాష్ట్రానికే దక్కిందని చెప్పడానికి గర్వపడుతున్నా. అందువల్లే రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా పారిశ్రామిక సంస్థలు, పారిశ్రామికవేత్తలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. మొన్న దావోస్‌లో, నిన్న విశాఖలో ప్రత్యక్షంగా చూశాం. ► 28 రాష్ట్రాల మన దేశంలో 2021–22కుగాను అత్యధికంగా 11.23 శాతం ఆర్థిక వృద్ధి రేటుతో రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచి జీఎస్డీపీ గ్రోత్‌రేట్ నమోదు చేసింది. 14.02 శాతం తలసరి ఆదాయం పెరిగిన రాష్ట్రంగా కూడా నిలిచింది. ఊరూరా స్పష్టమైన మార్పు ► 45 నెలల పాలనలో ఏ గ్రామాన్ని తీసుకన్నా జగన్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. 600 సేవలు అందిస్తున్న సచివాలయాలు, వలంటీర్లు, ఆర్బీకేలు, ఇ–క్రాప్, పంట కోనుగోలు, వైఎస్సార్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిటీ డాక్టర్ కాన్సెప్ట్, అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్ ద్వారా వర్క్ ఫ్రం హోమ్ కోసం డిజిటల్ లైబ్రరీల నిర్మాణం, ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు, అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలు, వాటిలో నిర్మిస్తున్న ఇళ్లు.. కాలనీలు కనిపిస్తాయి. ► నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారుల గడప వద్దకే అందిస్తున్నాం. ఇందుకోసం 9,260 డెలివరీ వ్యాన్లను అందుబాటులోకి తీసుకొచ్చాం. విద్యా విప్లవంతో పెద్ద పెద్ద చదువులు ► గత ప్రభుత్వంలో ప్రభుత్వ బడులు శిథిలమైన స్థితిలో ఉండేవి. నాడు–నేడు ద్వారా వాటి రూపురేఖలు పూర్తిగా మార్చేస్తున్నాం. ప్రభుత్వ బడిని సీబీఎస్ఈ ఇంగ్లిష్ మీడియంతో తీర్చిదిద్దగలుగుతున్నాం. 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తున్నాం. గోరుముద్ద మెనూ నుంచి పిల్లల డ్రెస్ వరకు అన్నింటా కూడా ఒక మేనమామలా శ్రద్ధ చూపుతున్నా. ఫలితంగా మన పిల్లలు పెద్ద చదువుల వైపు దూసుకెళ్తున్నారు. ► జగనన్న విద్యా దీవెన పథకంతో వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్, వసతి దీవెనతో పిల్లలు అందరికీ తోడుగా ఉంటున్నాం. కొన్నాళ్ల తర్వాత ఆరో తరగతి నుంచి ప్రతి క్లాస్రూమ్ డిజిటల్ క్లాస్రూమ్ అవుతుంది. ఇంటరేక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌తో పిల్లలకు చదువులు చెబుతారు. దాంతో ప్రభుత్వ బడులతో పోటీ పడేందుకు కార్పొరేట్ బడుల వాళ్లు కూడా ఇదే మాదిరి అనుసరించాల్సిన పరిస్థితి వస్తుంది. ► ఇప్పటికే 15,200కుపైగా ఉన్న ప్రభుత్వ బడులు ఆరో తరగతి నుంచి ఉన్న 5,800 బడుల్లో 30,230 క్లాస్‌రూమ్‌లో ఈ జూన్‌లో బడులు తెరిచే నాటికే ఇంటరేక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్‌తో డిజిటల్ క్లాస్ రూములు అందుబాటులోకి వస్తున్నాయి. మన బడి నాడు–నేడుతో దాదాపు 45 వేల స్కూళ్లు, కాలేజీల రూపురేఖలు మారుతున్నాయి. -
అసెంబ్లీ సాక్షిగా బుక్కైన టీడీపీ నేతలు, ఎల్లో మీడియా.. ఇప్పుడేమంటారో?
అసెంబ్లీ సాక్షిగా టీడీపీ బండారం బయటపడింది. ఎల్లో మీడియా ఫేక్ ప్రచారానికి అసెంబ్లీ వేదికగా మంత్రి బుగ్గన చెక్ పెట్టారు. దీంతో ఎల్లో బ్యాచ్.. ఒక్కసారి షాకై నోరు మూసుకున్నారు. చెరపకురా చెడేవు.. అన్న సామెత పచ్చ బ్యాచ్ పక్కాగా సూట్ అవుతుంది. లేనది ఉన్నట్టు చూపించి నమ్మించాలనే వారి ఐడియాలు ఎప్పుడూ తుస్సుమంటూనే ఉన్నాయి. దీంతో, ఖంగుతినడం పరిపాటిగా మారిపోయింది. అయినప్పటికీ ఫేక్ ప్రచారం మాత్రం ఆగడం లేదు. అయితే, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వాగతం పలకలేదని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాసుకొచ్చింది. దీనికి టీడీపీ సభ్యులు వంత పాడారు. దీంతో, ఎల్లో మీడియా ఫేక్ ప్రచారాన్ని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఖండించారు. ఈ క్రమంలో టీడీపీ తప్పుడు ప్రచారాలకు వీడియోలతో సహా చెక్ పెట్టారు. అసలు వాస్తవాలను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ బయటపెట్టారు. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని.. కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారాంను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు కోరారు. కాగా, గవర్నర్‌కు స్వాగతం పలుకుతున్న వీడియోను మంత్రి బుగ్గన.. అసెంబ్లీలో ప్లే చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి ఈ అంశాన్ని ప్రస్తావించారు. గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని వీడియోతో సహా చూపించారు. టీడీపీవీ అన్ని తప్పుడు ఆరోపణలేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదన్నారు. గవర్నర్‌కు ఏవిధంగా సీఎం జగన్ స్వాగతం పలికారో వీడియోలో చూపించారు. దీంతో, టీడీపీ నేతల బండారం బయటపడింది. అనంతరం, స్పీకర్ తమ్మినేని కూడా ప్రోటోకాల్ ప్రకారమే.. గవర్నర్ నజీర్‌ను సీఎం జగన్ స్వాగతం పలికారని చెప్పారు. దీనికి ఆయనే ప్రత్యక్ష సాక్షినని స్పష్టం చేశారు. మరోవైపు.. రాజ్యాంగ వ్యవస్థలపై బురద చల్లేలా టీడీపీ సభ్యులు, ఈనాడు వ్యవహరిస్తున్నాయని ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలని శాసనసభ వ్యవహారాల మంత్రికి స్పీకర్ సూచించారు. ఈ అంశాన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటున్నట్టు తెలిపారు. తప్పుడు ప్రచారాలపై తప్పకుండా చర్యలుంటాయని హెచ్చరించారు. -
ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ఏపీ రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయ వ్యవస్థలో గొప్ప మార్పులను తీసుకొచ్చామన్నారు. మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంథం అని నిరూపించామని స్పష్టం చేశారు. అలాగే.. నాకు ఇండస్ట్రీ రంగం ఎంత ముఖ్యమో.. వ్యవసాయం అంతే ముఖ్యం. నాకు ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ముఖ్యమో.. అవ్వతాతలు కూడా అంతే ముఖ్యం. ఉద్యోగులు, పెన్షనర్లు అందరూ ప్రభుత్వానికి ముఖ్యమే. గత ప్రభుత్వానివి అన్నీ గాలి మాటలే. గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నానని స్పష్టం చేశారు. - నా నడక నేలమేద, నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే.. - నా యుద్ధం.. పెత్తందార్లతోనే.. - నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే.. - ఇదే నా ఎకనామిక్స్.. ఇదే నా పాలిటిక్స్.. - ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్న హిస్టరీ.. ఇవన్నీ కలిపితేనే మీ జగన్. ‘పాలనలో పారదర్శకత తీసుకువచ్చేలా నాలుగేళ్ల పాలన సాగింది. మేనిఫెస్టోలో చెప్పిన 98.5 శాతం హామీలు అమలు చేశాం. కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం. అందరికీ మంచి చేశాం. విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం. ప్రతీ ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మనస్ఫూర్తిగా చెప్పగలుగుతున్నాను. లంచాలకు తావులేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోంది. నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు బాగున్నప్పుడే అభివృద్ధి. డీబీటీ ద్వారా రూ.1,97,473 కోట్లు లబ్ధిదారులకు అందించాం. గడప గడపకు వెళ్లి మేం చేసిన మంచిని చెప్తున్నాం. రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి. సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నాయి. ప్రతీ 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సేవలందిస్తున్నారు. 15004 గ్రామ/వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం. గ్రామ/వార్డు సచివాలయాల్లో లక్షా 34వేల మందికి ఉద్యోగాలు కల్పించాం. ప్రతీ ఇంటికి 2.60 లక్షల మంది వాలంటీర్లు మంచి చేస్తున్నారు. రైతన్నలకు అండగా ఆర్బీకేలు.. గ్రామస్థాయిలో తీసుకొచ్చిన గొప్ప మార్పు ఆర్బీకేలు. దేశంలోనే తొలిసారిగా 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశాం. ఇంత మంది అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్లు రైతన్నలకు తోడుగా ఉన్నారు. విత్తనం నుంచి పంట కొనుగోలు దాకా రైతన్నకు తోడుగా ఆర్బీకేలున్నాయి. రైతన్నలను చేయి పట్టుకొని నడిపించే వ్యవస్థ గ్రామస్థాయిలోనే ఉంది. 10,185 మంది సర్వేయర్లు గ్రామస్థాయిలో సేవలందిస్తున్నారు. కబ్జాలు, భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం పలికేలా అడుగులు వేస్తున్నాం. పౌర సేవల్లో ఇది గొప్ప విప్లవం. వ్యవసాయానికి పగటిపూటే ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 45 నెలల పాలనలో సీఎం జగన్ మార్క్ స్పష్టం కనిపిస్తోంది. గ్రామస్థాయిలో గొప్ప అభివృద్ధిని చూపించగలిగాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఫస్ట్ ప్లేస్.. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరుసగా మూడోసారి అగ్రస్థానంలో నిలిచాం. రాష్ట్రంలోని 6 పోర్టులు కాకుండా మరో 4 పోర్టులకు పనులు జరుగుతున్నాయి. పారిశ్రామిక రంగంలో తిరుగులేని మార్పునకు శ్రీకారం చుట్టాం. గతంలో లేని విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి. 2021-22 మధ్య 11.2శాతం ఆర్థిక వృద్ధి రేటుతో ఏపీ మొదటి స్థానంలో నిలిచింది. 14.02శాతానికి తలసరి ఆదాయం పెరిగింది. మన ప్రభుత్వంలో 64లక్షల మంది పెన్షన్ అందుకుంటున్నారు. మన ప్రభుత్వంలోనే పెన్షన్‌ను రూ.2750కు తీసుకెళ్లాం. వచ్చే జనవరి నుంచి 3వేల రూపాయల పెన్షన్ తీసుకుంటారు. రోల్ మోడల్ స్టేట్‌గా ఏపీ.. ఏపీ రోల్ మోడల్ స్టేట్‌గా మారింది. రేషన్‌ను నేరుగా ఇంటికే వచ్చి ఇచ్చే వ్యవస్థ దేశంలో ఎక్కడైనా ఉందా?. డెలివరీ వాహనాల ద్వారా నాణ్యమైన రేషన్ సరుకులు ఇస్తున్నాం. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశాం. రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ క్లాసులు రాబోతున్నాయి. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ క్లాసులు ఉంటాయి. జూన్ నాటికి ప్రభుత్వ స్కూల్స్‌లో డిజిటల్ క్లాస్ రూమ్‌లు వస్తాయి. కార్పొరేట్ బడులు ప్రభుత్వ పాఠశాలలతో పోటీపడేలా మార్పు తెచ్చాం. ఎవరూ ఊహించని రీతిలో ప్రభుత్వ బడుల్లో మార్పులు తీసుకువచ్చాం. నాడు-నేడు కింద 40వేల ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మార్పులు తెచ్చాము. ట్యాబ్‌ల విషయంలో ప్రైవేటు స్కూల్స్ సైతం పోటీకి రావచ్చు. రానున్న రోజుల్లో ప్రభుత్వ బడులతో ప్రైవేటు పాఠశాలలు పోటీ పడతాయి. ఐటీసీ, రిలయన్స్, అమూల్ వంటి పెద్దపెద్ద సంస్థల్ని తీసుకొచ్చాం. సున్నా వడ్డీతో అక్కచెల్లెమ్మలను ఆదుకుంటున్నాం. మన ప్రభుత్వంలో 99.5 శాతం అక్కచెల్లెమ్మలు సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలో పొదుపు సంఘాలను దెబ్బతీయడం చూశాం. మన ప్రభుత్వంలో అక్కచెల్లెమ్మలకు రూ.25వేల కోట్లు అందజేశామన్నారు. కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచింది. 11.2 శాతం వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదు. ఆర్థిక నిపుణులే అధ్యయం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది. వైఎస్సార్ నేతన్న హస్తం కింద 82వేల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించామని స్పష్టం చేశారు. రైతు భరోసా కింద రైతన్నలకు రూ.27వేల కోట్లు అందించాం. రైతు బీమా భారం మొత్తం ప్రభుత్వమే భరిస్తుంది. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.14,129 కోట్లు అందించాం. గతంలో గ్రామాల్లో మహిళా పోలీసులే ఉండేవారు కాదు. గ్రామ, వార్డు స్థాయిలో 15వేల మంది పోలీసులను నియమించాం. రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాం. ఎంఎస్ఎంలకు ప్రభుత్వం అండగా ఉంది. వ్యవసాయంపై 62శాతం జనాభా ఆధారపడి ఉంది. 30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించాం. బలహీనవర్గాలకు తోడుగా నిలిచింది. మేం అధికారంలోకి వచ్చాక మరో 1.50లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. దిశ యాప్‌తో దిశ బిల్లును కూడా తీసుకొచ్చాం. వైద్య రంగలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. గ్రామస్థాయిలో 10,500 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామన్నారు. -
గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?: స్పీకర్ తమ్మినేని సీరియస్
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని అన్నారు. సభకు తలవంపులు రాకూడదు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.సెషన్స్ మొత్తం సస్పెండ్ అయిన వారిలో పయ్యావుల, రామానాయుడు, కోటంరెడ్డి ఉండగా.. మిగతా టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌లో ఉన్నారు. గవర్నర్‌పై అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. -
అసెంబ్లీ సాక్షిగా వీడియోలతో వాస్తవాలను బయటపెట్టిన మంత్రి బుగ్గన
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు. ‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్‌ను కోరారు. చదవండి: జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్ -
జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్నాథ్
సాక్షి, అమరావతి: రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్లో ఆయన మాట్లాడుతూ, ‘‘ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదు.. జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. కాపు కులాన్ని మూటగట్టి బాబుకు అమ్మేయాలన్నదే లక్ష్యం. 175కు 175 స్థానాల్లో పోటీ చేసే ధైర్యం లేదు. నీది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన’’ అంటూ మంత్రి నిప్పులు చెరిగారు. పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా?: కరణం ధర్మశ్రీ పవన్ పవర్ స్టారా..? ఫ్లవర్ స్టారా అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. నీ మాటలు అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. ‘‘కాపు కులం అంతా సీఎం జగన్ వైపే ఉంది. రాజకీయంలో ఓ అజెండా ఉండాలి. జనసేన తొత్తుల పార్టీ’’ అంటూ కరణం ధర్మశ్రీ దుయ్యబట్టారు. చదవండి: అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స -
సామాజిక ఆర్థిక సర్వే విడుదల చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: శాసనసభలోని సీఎం చాంబర్లో 2022-23 సామాజిక ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. అనంతరం ప్రణాళికశాఖ కార్యదర్శి విజయ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ ప్రగతిలో ఏపీ నంబర్ వన్ అన్నారు. రూ.13.17 కోట్లు జీఎస్డీపీ నమోదైందన్నారు. గతంతో పోల్చితే రూ.1.18 లక్షల కోట్లు జీఎస్డీపీ పెరిగిందని ఆయన వివరించారు. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ ‘‘వ్యవసాయం లో 13.18 శాతం, పరిశ్రమలలో 16.36 శాతం, సేవా రంగంలో 18.91 శాతం వృద్ధి నమోదైంది. 36 శాతం కంట్రీబ్యూషన్ వ్యవసాయం నుంచి వస్తోంది. అన్ని రంగాల్లోనూ అభివృద్ధి కనిపిస్తోంది. ఆలిండియా యావరేజ్ కన్నా ఏపీ తలసరి ఆదాయం ఎక్కువ. ఏపీ అభివృద్ధి 16.2 శాతం నమోదైంది. విద్య, ఆరోగ్య రంగాల్లో అనుహ్య అభివృద్ధి సాధించాం. శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి’’ అని విజయ్‌కుమార్ వెల్లడించారు. చదవండి: అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స -
అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ‘‘మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్ విసిరారు. ‘‘ఏ ఊరులో స్కూల్ మూతపడిందో ప్రతిపక్షాలు చెప్పాలి. ఎక్కడైనా ఒక్క స్కూల్‌ని మూసివేసి ఉంటే సభలో చెప్పాలి. విద్యాశాఖపై ప్రతి నెలా రెండుసార్లు సీఎం సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారు’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్ -
అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
సాక్షి, అమరావతి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై అసెంబ్లీలో మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారంటూ దుయ్యబట్టారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి నిప్పులు చెరిగారు. ‘‘శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి: మంత్రి బుగ్గన వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. -
ఇదే నా ఎకనామిక్స్.. ఇదే నా పాలిటిక్స్: అసెంబ్లీలో సీఎం జగన్
Time: 04:00 PM అసెంబ్లీలో సీఎం జగన్ ►నా లక్ష్యం.. పేదరిక నిర్మూలనే ►గత ప్రభుత్వం గాల్లో నడిస్తే.. నేను నేలపై నడుస్తున్నా ►నా యుద్ధం పెత్తందార్లుతోనే.. ఇదే నా ఎకనామిక్స్.. ఇదే నా పాలిటిక్స్ ►నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే ►ఇదే మా నాన్నను చూసి నేర్చుకున్నా హిస్టరీ ►ఇవన్నీ కలిపితే మీ జగన్ ►30.75 లక్షల ఇళ్ల పట్టాలు అందించాం. ►అభివృద్ధిలో దేశానికే ఏపీ రోల్ మోడల్‌గా నిలిచింది. ►ఏ రాష్ట్రంలో లేని విధంగా దిశ యాప్‌ను తీసుకొచ్చాం. ►ఇప్పటికే దిశ పోలీస్ స్టేషనలు ప్రతిచోట కనిపిస్తున్నాయి. ►రాష్ట్రంలో 1.36 కోట్ల మంది దిశయాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ►11.28 శాతం ఆర్థిక వృద్ధి రేటు ఏ రాష్ట్రంలోనూ లేదు. ►ఆర్థిక నిపుణులే అధ్యయనం చేసేలా ఆర్థిక వృద్ధి రేటు ఉంది. ►రాష్ట్రంలో ఉద్యోగుల సంఖ్య 4 లక్షల నుంచి 6 లక్షలకు పెంచాం. ►ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంది. ►మనం వచ్చాక మరో 1.50 లక్షల ఎంఎస్ఎంఈలు వచ్చాయి. ►వ్యవసాయంపై 62% జనాభా ఆధారపడి ఉంది. ►30.75 లక్షల మందికి ఇళ్ల పట్టాలు అందించాం. ►వైద్యరంగంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌ను తీసుకొచ్చాం. ►గ్రామ స్థాయిలో 10,500 వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు ఏర్పాటు చేశాం. ►విలువలు, విశ్వసనీయతే పునాదులుగా పనిచేస్తున్నాం. ►లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారులకు మేలు జరుగుతోంది. ►డీటీబీ ద్వారా లబ్ధిదారులకు రూ. 1,97,473 కోట్లు అందించాం. ►నిన్నటి కంటే నేడు, నేటి కంటేరేపు బాగున్నప్పుడే అభివృద్ధి. ►గడప గడపకు వెళ్లి మేము చేసిన మంచిని చెప్తున్నాం. ►రాష్ట్రంలో జిల్లాల పెంపుతో సేవలు మరింత చేరువయ్యాయి. ►సచివాలయాల్లో దాదాపు 600 సేవలు అందుతున్నాయి. ►ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ సేవలందిస్తున్నారు. ►మేనిఫెస్టోలో 98.5 శాతం హామీలను నెరవేర్చాం. ►మేనిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని నిరూపించాం. ►రాజకీయ వ్యస్థలో గొప్ప మార్పును తీసుకొచ్చాం. ►పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా నాలుగేళ్ల పాలన సాగింది. ►కులం, మతం, ప్రాంతం, పార్టీని చూడకుండా పథకాలు అమలు చేశాం. ► ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామని మనస్పూర్తిగా చెప్పగలుగుతున్నా. Time: 3:40 PM ఎమ్మెల్యే కళావతి ప్రసంగం ► మహిళల రక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది ►మహిళలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ►సీఎం జగన్ పాలనలో గిరిజనులకు న్యాయం జరుగుతోంది. ► గిరిజన ప్రాంతంలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. Time: 3:00 PM సీఎం జగన్ నాలుగేళ్ల పాలన ఓ సక్సెస్ స్టోరీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ప్రతి పేద కుటుంబానికి మేలు జరుగుతోందని, దేశంలోనే అత్యుత్తమ నమూనాగా సీఎం జగన్ పాలన ఉందని కన్నబాబు స్పష్టం చేశారు. సీఎం జగన్ నాలుగేళ్ల పాలన ఓ సక్సెస్ స్టోరీ అని, సంక్షేమం, అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్‌గా కేరాఫ్‌గా మారిందని పేర్కొన్నారు. ‘మేనిఫెస్టోలో ప్రతి హామీని అమలు చేసిన ప్రభుత్వం మాది. మేనిఫెస్టో కనబడకుండా చేసిన ఘనత టీడీపీది. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలే పెత్తనం చేశాయి. ప్రభుత్వంపై బురద చల్లడమే ఎల్లో మీడియా పనిగా పెట్టుకుంది’ అని మండిపడ్డారు. Time: 02:17PM టీడీపీవి తప్పుడు ఆరోపణలని మంత్రి బుగ్గన విమర్శించారు. గవర్నర్‌పై టీడీపీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని హితవుపలికారు. టీడీపీ వ్యవహార శైలి సభా హక్కుల ఉల్లంఘనే అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. Time: 02:17PM పార్థసారథి ప్రసంగం విద్య, వైద్య రంగాల్లో ప్రభుత్వం గొప్ప ప్రగతి సాధించింది ప్రభుత్వ పాఠశాలు నేడు కార్పోరేట్‌కు ధీటుగా రూపుదిద్దుకుంటున్నాయి ప్రభుత్వ స్కూళ్లలో నేడు టాయిలెట్లు మెరుగుపడ్డాయి స్కూళ్లలో నాడు-నేడు కోసం ప్రభుతం 16 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థతో పేదలకు మేలు జరుగుతోంది సీఎం జగన్ పాలనలో పేదలకు నేరుగా లబ్ది చేకూరుతోంది చంద్రబాబు దిగజారి మాట్లాడుతున్నారు వాలంటీర్ వ్యవస్థను దేశ ప్రధానే ప్రశంసించారు Time: 01:57 PM టీడీపీ సభ్యుల సస్పెన్షన్ గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. దీనిపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు. Time: 01:19 PM ►చంద్రబాబు, ఎల్లో మీడియా తోడు దొంగలు: మాజీ మంత్రి కన్నబాబు ►ఎల్లోమీడియా వక్రీకరిస్తోంది ►టీడీపీ నేతలు ఎన్ని అబద్ధాలు ఆడుతున్నారో గవర్నర్‌కు అర్థమైంది ►భయానక పరిస్థితులు సృష్టించే కుట్ర చేస్తున్నారు ►రాజ్యాంగ వ్యవస్థను కించపర్చేలా వ్యవహరిస్తున్నారు Time: 01:14 PM ►మమ్మల్నీ ఎదుర్కొనే ధైర్యం మీకు ఉందా?: మంత్రి జోగి రమేష్ ►పయ్యావుల కేశవ్ ప్రివిలేజ్ కమిటీకి క్షమాపణ చెప్పాలి ►ఈనాడులో అడ్డగోలుగా వార్తలు ఎలా రాస్తారు? ►బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి Time: 12:38 PM గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారం: మంత్రి బుగ్గన గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదని టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు. Time: 12:26 PM ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్: పవన్ పవర్ స్టార్ కాదని.. ఫ్లవర్ స్టార్ అంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేశారు. ‘‘నీ మాటలు అన్నీ విడ్డూరంగా ఉన్నాయి. కాపు కులం అంతా సీఎం జగన్ వైపే ఉంది. రాజకీయంలో ఓ అజెండా ఉండాలి. జనసేన తొత్తుల పార్టీ’’ అని కరణం ధర్మశ్రీ దుయ్యబట్టారు. Time: 12:16 PM ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్: రాజకీయ సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ఏ ఉద్దేశంతో నిన్న సభ పెట్టారో పవన్‌కే తెలీదు.. జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది అంటూ మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు. Time: 11:56 AM శాసనసభలోని సీఎం చాంబర్లో సోషియో ఎకనామిక్ సర్వేను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విడుదల చేశారు. Time: 10:17 AM సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారు: మంత్రి బొత్స చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్ విసిరారు. Time: 9:54 AM సీఎం జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు: అబ్బయ్య చౌదరి సీఎం జగన్ పాలనలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయని ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి అన్నారు. ‘‘రైతుల కోసం సీఎం జగన్ ఎన్నో చేశారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారు.. సీఎం జగన్ వ్యవసాయం పండగ అంటున్నారు’’ అని అబ్బయ్య చౌదరి అన్నారు. Time: 9:50 AM కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి.ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అన్ని చర్యలు చేపడుతున్నామని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసునని మంత్రి అన్నారు. ‘‘టీడీపీ అడిగిన దానికి నేను సమాధానం చెప్పాను. ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు’’ అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. Time: 9:40 AM ఇలా వ్యవహరించడం ఇది సమంజసం కాదు: స్పీకర్ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తీరుపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సమస్యలు ఉంటే వినతి పత్రం సభ నిబంధనలకు అనుగుణంగా ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. సభలో ఇలా వ్యవహరించడం సమంజసం కాదన్నారు. Time: 9:31 AM అసెంబ్లీకి బయల్దేరిన సీఎం జగన్ తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీకి బయలుదేరారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. Time: 9:24 AM వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదు: మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యక్తిగత అంశాలకు సభలో చోటులేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ‘‘ప్రజా సమస్యలు ఏమైనా ఉంటే సంబంధింత మంత్రులు, అధికారులకు వినతిపత్రం ఇస్తే పరిష్కరిస్తాం. ఎక్కడ ఏ వేదిక మీద ఎలా ప్రస్తావించాలో తెలుసుకోవాలి’’ అంటూ మంత్రి బుగ్గన హితవు పలికారు. Time: 9:15 AM నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి: మంత్రి అంబటి కోటంరెడ్డి సభను అడ్డుకునేందుకే వచ్చారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. శ్రీధర్‌రెడ్డిపై టీడీపీకి ఇప్పుడు ప్రేమ వచ్చిందా?. కోటంరెడ్డి నమ్మకద్రోహి.. చంద్రబాబు, టీడీపీ కోసం ఆయన పని చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు. శ్రీధర్‌రెడ్డి.. టీడీపీతో చేతులు కలిపారు. దురుద్దేశ్యంతోనే కోటంరెడ్డి ఆందోళన చేస్తున్నాడు. నైతిక విలువలేని వ్యక్తి శ్రీధర్‌రెడ్డి. చంద్రబాబు మెప్పుకోసం కోటంరెడ్డి మాట్లాడుతున్నాడు. నమ్మకద్రోహం చేసినవారికి పుట్టగతులు లేకుండా పోతాయి’’ అంటూ మంత్రి అంబటి నిప్పులు చెరిగారు. Time: 9:11 AM ►టీడీపీ సభ్యులు.. సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు ►ఏపీ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటోందని మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు Time: 9:05 AM ►రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ చేపట్టారు. ►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రిప్లై ఇవ్వనున్నారు. ఇటీవల మరణించిన ఎమ్మెల్సీలు చల్లా భగీరథరెడ్డి, బచ్చుల అర్జునుడికి శాసనసభ సంతాపం తెలపనుంది. -
సంక్షేమం తోడుగా 'అభివృద్ధి'
కులం, మతం, ప్రాంతం, రాజకీయం చూడకుండా డీబీటీ విధానం ద్వారా పారదర్శకంగా అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేసిందని చెప్పడానికి సంతోషంగా ఉంది. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి ఫలాలు అందించడమే లక్ష్యంగా, రాష్ట్ర సమగ్రాభివృద్ధే ధ్యేయంగా మా ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. – గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ సాక్షి, అమరావతి: సమాజంలో ఏ ఒక్కరూ వెనుక పడకూడదనే లక్ష్యంతో నవరత్నాలనే గొడుగు కింద సమ్మిళిత పాలన నమూనాతో సంక్షేమ వ్యవస్థను ప్రభుత్వం రూపొందించిందని గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ అన్నారు. అన్ని వర్గాల వారి అభ్యున్నతే లక్ష్యంగా, రాష్ట్ర సుస్థిర ప్రగతే ప్రభుత్వ అగ్ర ప్రాధాన్యతగా ఉందని చెప్పారు. 2023–24 రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు మంగళవారం ఆయన ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. రాష్ట్రంలో గడిచిన 45 నెలల్లో డీబీటీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు రూ.1.97 లక్షల కోట్ల మొత్తాన్ని జమ చేశామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ క్రియాశీల నాయకత్వంలో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే ప్రయాణంలో నాలుగేళ్లు పూర్తయిందని చెప్పారు. ఈ క్రమంలో సమర్థవంతమైన ప్రభుత్వ విధానాల అమలుతో 2021–22లో 11.43 శాతం జీఎస్డీపీ వృద్ధి రేటు సాధించామన్నారు. ఇది దేశంలోని అన్ని రాష్ట్రాలకంటే అత్యధికం అని స్పష్టం చేశారు. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు, నాడు–నేడు కింద మౌలిక సదుపాయాల కల్పన పనులు చేపట్టామన్నారు. 15,004 సచివాలయాల ద్వారా పాలనలో పారదర్శకత, వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని, ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలను అందించామని చెప్పారు. 2022–23 ముందస్తు అంచనాలు ప్రస్తుత ధరలలో 16.22 శాతం సమగ్ర వృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత ధరలలో రాష్ట్ర తలసరి ఆదాయం 2021–22లో రూ.1,92,517 నుంచి 14.02 శాతం ప్రోత్సాహక వృద్ధిరేటుతో రూ.2,19,518కు చేరిందన్నారు. ఈ సమావేశంలో గవర్నర్ ఇంకా ఏమన్నారంటే.. గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందజేస్తున్న సీఎం జగన్ విద్యా సంస్కరణలతో బంగారు బాట ► 2020 జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పాఠ్యప్రణాళిక సంస్కరణలను అమలు చేస్తున్నాం. 2020–21 నుంచి మన బడి నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రూ.3,669 కోట్లతో తొలి దశలో 15,717 పాఠశాలలను, రెండో దశ కింద రూ.8 వేల కోట్లతో 22,344 పాఠశాలలను అభివృద్ధి బాట పట్టించాం. మూడేళ్లలో రూ.16,021.67 కోట్లతో 57,189 పాఠశాలలు, 3,280 ఇతర విద్యా సంస్థలలో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నది మా ప్రభుత్వ యోచన. ► ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం కింద 84 లక్షల మంది పిల్లలను పాఠశాలలకు పంపడానికి 44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్ల మొత్తాన్ని అందించాం. ప్రతి తల్లికి ఏటా రూ.15 వేల చొప్పున ఇస్తున్నాం. ► రూ.690 కోట్ల విలువైన బైజూస్ కంటెంట్ ప్రీలోడ్ చేసిన ట్యాబ్‌లను 4.60 లక్షల మంది విద్యార్థులు, 60 వేల మంది టీచర్లకు పంపిణీ చేశాం. ఆరో తరగతి, ఆపై తరగతుల వరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్‌ను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నాం. ఈ ప్యానెల్స్‌ను 5,800 పాఠశాలల్లోని 30,213 తరగతి గదుల్లో నెలకొల్పేందుకు ప్రణాళిక రూపొందించాం. ఇంగ్లిష్ మీడియం అమలు చేయడంతో పాటు ద్విభాషా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశాం. ఇంగ్లిష్ ల్యాబ్‌లను ఏర్పాటు చేశాం. ► స్కూల్ డ్రాపౌట్స్‌ను తగ్గించి జీఈఆర్‌ను మెరుగు పరచడానికి జగనన్న విద్యా కానుక కింద ప్రభుత్వ, ప్రభుత్వేతర ఎయిడెడ్ పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి చదివే 47.4 లక్షల మంది విద్యార్థులకు బూట్లు, బ్యాగ్‌లు, పుస్తకాలు, ఇతర వస్తువులతో కూడిన కిట్ల పంపిణీకి 2020–21 నుంచి రూ.2,368 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేశాం. ఆరోగ్యకరమైన సమాజం ► డా.వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రొసీజర్లు 2,446 నుంచి 3,255కు పెంపు. రాష్ట్రంలో 1.41 కోట్ల కుటుంబాలకు (95 శాతం కుటుంబాలు) వర్తింపు ► ఆరోగ్య ఆసరా కింద 15.65 లక్షల మందికి రూ.971.28 కోట్ల సాయం ► రాష్ట్రంలో సమర్థవంతంగా మాతా, శిశు సంరక్షణ సేవల అమలు ► గ్రామీణ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఫ్యామిలీ డాక్టర్ విధానం ► వైఎస్సార్ టెలిమెడిసిన్ కింద 2.83 కోట్ల కన్సల్టెన్సీల నమోదు. ఇది దేశంలో 35 శాతం వాటా ► నాడు–నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధి. 17 వైద్య కళాశాలల ఏర్పాటు. వచ్చే విద్యా సంవత్సరంలో 5 కళాశాలలు ప్రారంభం. వైద్య ఆరోగ్య శాఖలో 48,639 పోస్టుల భర్తీ సామాజిక భద్రతలో విప్లవం ► వైఎస్సార్ సంపూర్ణ పోషణ, వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాల ద్వారా 35.7 లక్షల మంది గర్భిణిలు, పాలిచ్చే తల్లులు, పిల్లల పోషకాహారం కోసం రూ.6,141 కోట్ల ఖర్చు ► నవ రత్నాలు– పేదలందరికీ ఇళ్లు పథకం కింద 30.65 లక్షల మంది మహిళలకు ఇళ్ల స్థలాలు.. వీరిలో 21.25 లక్షల మందికి గృహాల మంజూరు. 4.4 లక్షల గృహాల నిర్మాణం పూర్తి. కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.32,909 కోట్ల ఖర్చు ► వైఎస్సార్ పింఛన్ కానుక కింద 64.45 లక్షల మందికి రూ.66,823.79 కోట్లు . ► వైఎస్సార్ నేతన్న నేస్తం కింద 81,783 మందికి రూ.788.5 కోట్ల సాయం ► వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద .20 లక్షల మందికి రూ.422 కోట్లు ► జగనన్న చేదోడు కింద 3.30 లక్షల మంది రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీలకు రూ.927.49 కోట్లు ► వైఎస్సార్ బీమా కింద మృతుల కుటుంబాలు, క్షతగాత్రులకు రెండేళ్లలో రూ.512 కోట్లు ► వైఎస్సార్ వాహనమిత్ర కింద 2.74 లక్షల మంది డ్రైవర్లకు రూ.1,041 కోట్ల సాయం ► వైఎస్సార్ లా నేస్తం ద్వారా 4,248 మంది జూనియర్ లాయర్లకు రూ.35.4 కోట్లు ► జగనన్న తోడు కింద 15.31 లక్షల వీధి వ్యాపారులకు రూ.2,470.3 కోట్ల మేర సాయం ► స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేలా చట్టం. అన్ని నామినేటెడ్ పోస్టులు, నామినేటెడ్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ► 2019 ఏప్రిల్ 11 నాటికి 78.74 లక్షల మంది ఎస్ఎస్జీ మహిళలు బ్యాంక్‌లకు బకాయిపడ్డ రుణ మొత్తంలో రూ.12,758 కోట్లు చెల్లింపు ► వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కింద 1.02 కోట్ల మంది ఎస్‌హెచ్‌జి మహిళలకు రూ.3,615 కోట్ల సాయం ► వైఎస్సార్ చేయూత కింద బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలు 26.7 లక్షల మందికి మూడు విడతల్లో రూ.14,129 కోట్ల చెల్లింపు ► వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద మూడు విడతల్లో 3.94 లక్షల మందికి రూ.595.86 కోట్లు ► వైఎస్సార్ కాపు నేస్తం కింద 3.56 లక్షల మందికి రూ.1,518 కోట్లు ► వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అల్ప సంఖ్యాక వరాల్లోని యువతుల పెళ్లికి ఆర్థిక సాయం ►వైఎస్సార్ స్వేచ్ఛ పథకం కింద రూ.25.33 కోట్ల ఖర్చు ► ఆపదలో ఉన్న మహిళలను రక్షించేలా దిశ యాప్. 1.36 కోట్ల డౌన్లోడ్లు ► 2021–22 నుంచి ‘జెండర్’ బడ్జెట్ సుస్థిర వ్యవసాయానికి భరోసా సుస్థిర వ్యవసాయానికి భరోసా ► 2020–21లో వ్యవసాయ రంగంలో 11.3 శాతం, ఉద్యానవన రంగంలో 12.3 శాతం, పశు సంవర్థక రంగంలో 11.7 శాతం, మాంసం ఉత్పత్తిలో 10.3 శాతం వృద్ధి రేటు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుపరిపాలన సూచికలో (జీజీఐ) మొదటి స్థానం. ► వైఎస్సార్ రైతు భరోసా–పీఎం కిసాన్ యోజన కింద రైతులకు ఐదేళ్లలో రూ.67,500 కోట్లు. 10,778 రైతు భరోసా కేంద్రాలు. వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద 44.55 లక్షల మంది రైతులకు రూ.6,872 కోట్ల బీమా చెల్లింపు. ► 147 వైఎస్సార్ అగ్రి టెస్టింగ్ ల్యాబ్‌లు, జిల్లా స్థాయిలో 11 ప్రయోగశాలలు, జోనల్ స్థాయిలో 4 రీజనల్ కోడింగ్ కేంద్రాల ఏర్పాటు. 73.88 లక్షల మంది రైతులకు రూ.1,834.55 కోట్ల సున్నా వడ్డీ. 22.22 లక్షల మంది రైతులకు రూ.1,911.78 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ. శీతలు గిడ్డంగులు, ప్రాసెసింగ్ యూనిట్లు, రూ.27,800 కోట్ల విలువైన ఉచిత విద్యుత్. 10 ఎకరాల లోపు ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ కింద రూ.2,647 కోట్లు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా రూ.7 లక్షలకు పెంపు. దశల వారీగా, ప్రాధాన్యత క్రమంలో నీటి పారుదల ప్రాజెక్టుల పూర్తి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో బెస్ట్ ► పరిశ్రమల స్థాపన, నిర్వహణ కోసం 21 రోజుల్లో సింగిల్ డెస్క్ సిస్టమ్ ద్వారా అన్ని అనుమతుల మంజూరు. ఇతరత్రా సహకారం ద్వారా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో మూడేళ్ల పాటు వరుసగా ఏపీకి మొదటి స్థానం. ► ఈ నెల 3, 4 తేదీలలో విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతంగా నిర్వహణ. రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించి 378 అవగాహన ఒప్పందాలు. 16 కీలక రంగాల్లో 6 లక్షల ఉద్యోగావకాశాలు. రాష్ట్ర పారిశ్రామిక కేంద్రంగా విశాఖపట్నం నగరాన్ని తీర్చిదిద్దడానికి ప్రణాళిక. రాష్ట్రంలో కొత్తగా 69 భారీ, మెగా పరిశ్రమలు. ► వైఎస్సార్ నవోదయం కింద ఎంఎస్ఎంఈల బలోపేతానికి తోడ్పాటు. రూ.19,115 కోట్ల పెట్టుబడితో 1.52 లక్షల యూనిట్లు. 13.63 లక్షల మందికి ఉపాధి. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ కింద 23,236 ఎంఎస్ఎంఈలకు రూ.2,086 కోట్ల ప్రోత్సాహకాలు. ► ఏపీ లాజిస్టిక్ హబ్‌గా, ఆగ్నేయ ఆసియాకు గేట్వేగా రాష్ట్రం. 6 నిర్వాహక ఓడరేవులు ఉండగా, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ, మచిలీపట్నంలో కొత్తగా ఏర్పాటు. రెండు దశల్లో తొమ్మిది ఫిషింగ్ హార్బర్లు నిర్మాణం. వైజాగ్– చెన్నై, చెన్నై– బెంగళూరు, హైదరాబాద్– బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్ల అభివృద్ధి. -
ఏపీ కేబినెట్ తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే..
సాక్షి, అమరావతి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో పలు అంశాలకు ఆమోద ముద్ర పడింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో 45 అంశాలపై చర్చించగా, 15 అంశాలకు ఆమోదం లభించింది. దీనిలో భాగంగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రి వేణు గోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి జగన్‌ను మంత్రులు అభినందించారని వేణు గోపాలకృష్ణ తెలిపారు. ఆస్కార్ అవార్డు సాధించిన నాటు నాటు పాట బృందానికి ముఖ్యమంత్రి కేబినెట్లో అభినందనలు తెలిపారన్నారు.. ఏప్రిల్ 1వ తేదీన ఆర్బీఐ సెలవు, రెండో తేదీన ఆదివారం కావడంతో ఏపీ వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ 3వ తేదీన ఉంటుందన్నారు. విశాఖను రాజధానిగా ఆహ్వానించారు పారిశ్రామిక దిగ్గజాలు, కేంద్ర మంత్రులు కూడా విశాఖను రాజధానిగా ఆహ్వానించిన విషయాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ మరోసారి తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గతంలోనే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోనూ విశాఖ కేంద్రంగా పాలన సాగుతుందని చెప్పారన్నారు. ఈ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గవర్నర్ ప్రసంగం కొనసాగుతుండగా టీడీపీ సభ్యులు ఎందుకు వెళ్లిపోయారో అర్థం కాలేదన్నారు మంత్రి. వారు రాజకీయ పరిణితి కోల్పోయినట్లు కనిపిస్తోందని, పోలవరంలో తప్పులు చేసింది చంద్రబాబేనన్నారు. ఏపీ కేబినెట్లో ఆమోదించిన పలు అంశాలు ఇవే.. జిల్లా గ్రంథాలయాల సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంపు ఎయిడెడ్ ప్రైవేటు విద్యాసంస్థల్లో టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది పదవీ విరమణ వయస్సును 60 నుంచి 62 ఏళ్ళకు పెంచుతూ నిర్ణయం హైస్కూళ్ళల్లో నైట్ వాచ్ మ్యాన్ ల నియామకానికి ఆమోద ముద్ర పడింది.. నెలకు ఆరు వేల రూపాయల గౌరవ వేతనం టాయిలెట్ నిర్వహణా నిధి నుంచి చెల్లించే విధంగా నిర్ణయం ఏపీఐఐసీ చేసిన 50 ఎకరాల లోపు కేటాయింపులను ర్యాటిఫై చేసిన క్యాబినెట్ అమలాపురం కేంద్రంగా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కు క్యాబినెట్ ఆమోదం ఏపీ గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం బిల్లు - 2023 కు ఆమోదం ఎక్సైజ్ చట్టం సవరణకు ఆమోదం అన్ని దేవస్థానాల బోర్డులలో ఒక నాయీ బ్రాహ్మణుడిని సభ్యుడిగా నియమించాలన్న ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం. దేవాలయాల్లో క్షుర ఖర్మలు చేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీసం నెలకు 20వేలు కమిషన్ అందించాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం. కనీసం వంద పనిదినాలు ఉన్న క్షురకులకు ఇది వర్తింపు. పట్టాదారు పాస్ బుక్స్ ఆర్డినెన్స్-2023 సవరణకు కేబినెట్ ఆమోదం -
కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి గ్రీన్ సిగ్నల్
-
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 బిల్లులకు ఆమోదం
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్. కొత్త ఇండస్ట్రియల్ పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ముందుగా, స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. చదవండి: ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్ -
24 వరకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, 16న బడ్జెట్.. బీఏసీలో నిర్ణయం
సాక్షి, అమరావతి: స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశం అనంతరం చీఫ్ విప్ ప్రసాదరాజు మీడియాతో మాట్లాడుతూ, రేపు(బుధవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఉంటుందని తెలిపారు. బడ్జెట్ సెషన్ కావడంతో శని, ఆదివారాల్లోనూ(18,19) సమావేశాలు కొనసాగుతాయన్నారు. 21, 22 అసెంబ్లీ సమావేశాలకు సెలవు ప్రకటించామన్నారు. సంక్షేమం, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ప్రవేశపెడతామన్నారు. ప్రతిపక్ష నేతను కూడా సభకు ఆహ్వానిస్తున్నామన్నారు. ప్రతిపక్షం లేవనెత్తే అంశాలపై చర్చకు సిద్ధమని ప్రసాదరాజు అన్నారు. కాగా, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ అన్నారు. చదవండి: ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్ -
ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్ అబ్దుల్ నజీర్
సాక్షి, అమరావతి: అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలిపారు. వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా 11.43 శాతం గ్రోత్ రేటును సాధించామని, ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తొలిసారి గవర్నర్ ప్రసంగించారు. అవినీతికి తావులేకుండా తమ ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందని గవర్నర్ పేర్కొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని అన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని తెలిపారు. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ‘GSDPలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా ఉన్నాం. పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్యను అందిస్తున్నాం. DBT ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చేసి పౌష్టికాహారం అందిస్తున్నాం. రూ. 3,669 కోట్లతో పాఠశాలలను ఆధునికరిస్తున్నాం. ఏపీలో తలసరి ఆదాయం రూ. 2.19 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోని యువత ప్రపంచ స్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చాం. విద్యా సంస్కరణలు అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం. 44.49 లక్షల మంది తల్లులకు రూ.19, 617.60 కోట్లు ఆర్థిక సాయం. విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్. విద్యార్థులకు రూ. 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ. జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు. 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీడిజైన్. మండలంలో కనీసం 2 జూ.. కళాశాలలు ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైన రాష్ట్రం ఏపీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో కనీసం 2 జూనియర్ కళాశాలల ఏర్పాటు. జగనన్న గోరుముద్దతో ఇప్పటి వరకు. రూ.3,239 కోట్లు ఖర్చుతో 43.26 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి. జగనన్న విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్మెంట్. జగనన్న విద్యాదీవెన కింద 24.75 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 9,249 కోట్లు చెల్లించాం. హాస్టల్, మెస్ ఛార్జీల కోసం..రూ. 20 వేలు చెల్లిస్తున్నాం. ఈ పథకం కింద 18.77 లక్షల మంది విద్యార్థులకు 3,366 కోట్లు పంపిణీ చేశాం. ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ కడపలో డా. వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ. రాష్ట్రంలో కొత్తంగా 17 మెడికల్ కాలేజీల ఏర్పాటు. కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం. విజయనగరంలో జేఎన్టీయూ-గురజాడ, ఒంగోలులో ఆంధ్రకేసరి యూనివర్సిటీ ఏర్పాటు చేశాం. కర్నూలులో కస్టర్ యూనివర్సిటీ. ఉన్నత విద్య కోసం 14 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ఏర్పాటు. వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు. పీహెచ్సీలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు. రూ. 971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు. మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ. ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక. ప్రతి నెల 64.45 లక్షల మందికి రూ. 66,823.79 కోట్లు పెన్షన్ల పంపిణీ. వైఎస్సార్ నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు. 81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ. రూ. 971 కోట్లతో ఆరోగ్య ఆసరా పథకం అమలు. జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ.927,49 కోట్లు పంపిణీ. ప్రజల ఇంటి వద్దకే ఫ్యామిలీ డాక్టర్. జగనన్న తోడు పథకం కింద సున్నా వడ్డీకి 15.31 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 2,470.3 కోట్లు పంపిణీ చేశాం. వైఎస్సార్ వాహనమిత్ర కింద 2.74 లక్షల మందికి రూ. 1,041 కోట్లు. వైఎస్సార్ చేయూత కింద ఎస్టీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 3 విడతల్లో రూ. 14,129 కోట్ల పంపిణీ. 78.74 లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళలకు రెండు విడతలుగా రూ. 12,758 కోట్లు విడుదల. రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు స్థానిక సంస్థలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. నామినేట్ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు. మహిళల భద్రత కోసం దిశ యాప్ ప్రారంభించాం. ఆపదలో ఉన్న మహిళల వద్దకు నిమిషాల్లో పోలీసులు. రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు. ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు. 137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. 15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజ వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది. స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు. గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది. మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది. పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసినట్లు గవర్నర్ తన ప్రసంగంలో తెలిపారు. -
ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు: గవర్నర్ అబ్దుల్ నజీర్
Time: 12:19 PM ఈ నెల 16న బడ్జెట్.. బీఏసీ నిర్ణయం.. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. ఈ నెల 16న బడ్జెట్ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. Time: 11:18 AM ►రాష్ట్రంలో 56 కొత్త బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం ►ఎస్సీల కోసం 3, ఎస్టీల కోసం ఒక కార్పొరేషన్ ►ఎస్సీ, ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 4 డిప్యూటీ సీఎం పోస్టులు ►జడ్పీ ఛైర్మన్ పోస్టుల్లో 70 శాతం ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ►137 కార్పొరేషన్ ఛైర్మన్ పోస్టుల్లో 58 శాతం పోస్టులను ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ►15.14 లక్షల ఎస్సీ, 4.5 ఎస్టీ కుటుంబాలకు జగజ్జీవన్ జ్యోతి కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ►ప్రతి గ్రామ సచివాలయంలో ఆర్బీకే సెంటర్ ►వ్యర్థరహిత, చెత్త రహిత గ్రామాలే లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తోంది. ►స్వచ్ఛసర్వేక్షణ్‌లో ఏపీ ముందంజలో ఉంది ►గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ ద్వారా ఏపీకి భారీకి పెట్టుబడులు ►గుడ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ప్రథమస్థానంలో ఉంది ►మాంసం ఉత్పత్తిలో ఏపీ రెండో స్థానంలో ఉంది ►పాల ఉత్పత్తిలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. Time: 11:01 AM గవర్నర్ ప్రసంగం.. ♦వైద్యశాఖ ద్వారా 1.4 కోట్ల హెల్త్ కార్డులు ♦పీహెచ్సీలలో ఇద్దరు డాక్టర్లు ఉండేలా చర్యలు ♦వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పేదలకు ఇళ్లు ♦ప్రతి నెల ఒకటో తేదీన వైఎస్సార్ పింఛన్ కానుక ♦వాలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ల పంపిణీ ♦2024 నాటికి అర్హులైన ప్రజలకు శాశ్వత గృహాలు ♦మహిళల పేరిట 30.65 లక్షల ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ ♦నేతన్న నేస్తం కింద నేత కార్మికులకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సాయం ♦81,783 మంది నేత కార్మికులకు రూ.788.5 కోట్ల పంపిణీ ♦జగనన్న చేదోడు ద్వారా 3.36 లక్షల మందికి రూ. 927,49 కోట్లు ♦వైఎస్సార్ బీమా కింద రెండేళ్లలో రూ.512 కోట్లు జమ చేశాం Time: 10:51 AM ♦విద్యా సంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్ ♦విద్యార్థులకు రూ.690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్‌ల పంపిణీ ♦జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్యపుస్తకాలు, ఇంగ్లీష్ ల్యాబ్‌లు ♦2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశ సంస్కరణలు అమలు ♦1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు రీడిజైన్ ♦జగనన్న గోరుముద్దతో 43.26 లక్షల మందికి విద్యార్థులకు లబ్ధి ♦జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ.3,239 కోట్లు ఖర్చు ♦ఆర్థికభారం లేకుండా ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ Time: 10:42 AM గవర్నర్ ప్రసంగం.. ♦రాష్ట్రంలో కొత్తగా 17 మెడికల్ కాలేజీలు ♦కూరుపాంలో గిరిజన ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశాం ♦కడపలో డా.వైఎస్సార్ ఆర్కిటైక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ వర్శిటీ ♦అమ్మ ఒడి ద్వారా 80 లక్షల మంది పిల్లలకు ఆర్థిక సాయం ♦44.49 లక్షల మంది తల్లులకు రూ.19,617.60 కోట్లు ఆర్థిక సాయం Time: 10:15 AM ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందడుగు వేసిందని, వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. తొలిసారి ఆయన అసెంబ్లీలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తోందన్నారు. నవరత్నాలు, అభివృద్ధి సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. అవినీతికి తావులేకుండా అర్హులందరికీ నేరుగా లబ్ధి చేకూరుతోందని చెప్పారు. నాలుగేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామన్నారు. వినూత్నంగా వాలంటీర్ వ్యవస్థ అమలు చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. ►అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు. ►కులాలు, మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు. ►వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో అనూహ్య ప్రగతి సాధిస్తున్నాం. ►11.43 శాతం గ్రోత్ రేటును సాధించాం. ►ఆర్థికాభివృద్ధిలో ఏపీ ముందంజలో ఉంది. ►మనబడి నాడు-నేడు పథకాలతో విద్యారంగంలో సంస్కరణలు. Time: 10:00 AM ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్ధేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ►గవర్నర్ నజీర్‌కు స్వాగతం పలికిన సీఎం జగన్ ►అసెంబ్లీకి చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ Time: 9:47 AM అసెంబ్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి చేరుకున్నారు. కాసేపట్లో గవర్నర్ ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ►కాసేపట్లో శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ►స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ సమావేశం ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ►కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. ►కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్‌ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ►ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది.