AP Budget 2023-24: Finance minister Buggana presents Rs 2,79,279 crore - Sakshi
Sakshi News home page

AP Budget 2023 Highlights:: రూ.2,79,279 కోట్లతో జన రంజక వార్షిక బడ్జెట్‌

Published Thu, Mar 16 2023 7:27 AM | Last Updated on Thu, Mar 16 2023 3:16 PM

Ap Assembly Session 2023 24 Budget Live Updates - Sakshi

Live Updates
రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌
అన్ని వర్గాల సంక్షేమంతో పాటు సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం జనరంజక బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79 వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ శాసనసభలో ప్రవేశ పెట్టారు.

రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు
మూలధన వ్యయం రూ.31,061 కోట్లు
రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు
ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు
జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం
ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతం

2023 బడ్జెట్‌ కేటాయింపులు..
వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక​‍- రూ.21,434.72 కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా రూ.4,020 కోట్లు
జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
వైఎస్సార్‌- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
వైఎస్సార్‌ కాపు నేస్తం- రూ. 550 కోట్లు

జగనన్న చేదోడు-రూ.350 కోట్లు
వైఎస్సార్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు
వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు
వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు
మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు
రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు
లా నేస్తం-రూ.17 కోట్లు

జగనన్న తోడు- రూ.35 కోట్లు
ఈబీసీ నేస్తం-రూ.610 కోట్లు
వైఎస్సార్‌ కల్యాణమస్తు-రూ.200 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా-రూ.6700 కోట్లు
వైఎస్సార్‌ చేయూత-రూ.5000 కోట్లు
అమ్మ ఒడి-రూ.6,500 కోట్లు
మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
ధర స్థిరీకరణ నిధి-రూ.3,000 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణ- రూ. 1,212 కోట్లు

మనబడి నాడు-నేడు రూ.3,500 కోట్లు
జగనన్న విద్యా కానుక రూ.560 కోట్లు
పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి రూ.15,873 కోట్లు
పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు
యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు

షెడ్యూల్‌ కులాల సంక్షేమం-రూ.20,005 కోట్లు
షెడ్యూల్‌ తెగల సంక్షేమం-రూ. 6,929 కోట్లు
వెనుకబడిన తరగతుల సంక్షేమం​- రూ. 38,605 కోట్లు
కాపు సంక్షేమం​- రూ.4,887 కోట్లు
మైనార్టీల సంక్షేమం- రూ. 4,203 కోట్లు
పేదలందరికీ ఇళ్లు రూ.5,600 కోట్లు
పరిశ్రమలు, వాణిజ్యం- రూ.2,602 కోట్లు
రోడ్లు, భవనాల శాఖ- రూ.9,118 కోట్లు
నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు
పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు
ఎనర్జీ- రూ.6,456 కోట్లు
గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు
గడపగడకు మన ప్రభుత్వం రూ.532 కోట్లు

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 4.25 కోట్ల మందికి ప్రయోజనం: మంత్రి బుగ్గన
సరుకుల పంపిణీ 84 శాతం నుంచి 94 శాతానికి పెరుగుదల
దరఖాస్తు చేసిన 21 రోజుల్లోనే రేషన్‌ కార్డుల జారీ
ఇప్పటి వరకు 48.75 లక్షల దరఖాస్తుల పరిష్కారం
రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలు
ప్రభుత్వ పాఠశాలలకు సమీపంలోనే అంగన్‌వాడీ కేంద్రాలు
విద్యార్థులకు మెరుగైన భోజనం కోసం అదనంగా రూ.వెయ్యి కోట్లు
మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమానికి రూ. 3,951 కోట్లు
సుస్థిర అభివృద్ధి, సుపరిపాలన ఇవే ప్రభుత్వ లక్ష్యాలు
వైఎస్సార్‌ ఆసరా కింద రూ.6,700 కోట్లు కేటాయింపు
17 జిల్లాల్లో 2.50 లక్షల మంది మహిళా పాడి రైతులు ఉన్నారు.
లీటర్‌కు రూ.5 నుంచి రూ.20 వరకు ధర లభిస్తుంది

వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.వెయ్యి కోట్లు కేటాయింపు: మంత్రి బుగ్గన
వైఎస్సార్‌ చేయూత కింద రూ.5వేల కోట్లు కేటాయింపు
విద్యకు పేదరికం అడ్డుకాకూడదనే అమ్మఒడి పథకం
టీచింగ్‌ లెర్నింగ్‌ మెటీరియల్‌ను విద్యార్థులకు అందిస్తున్నాం
నాడు-నేడు కింద ప్రభుత్వ స్కూళ్ల అభివృద్ధి

స్థూలవృద్ధిలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది
ఆంధ్రప్రదేశ్‌ వృద్ధి 11.43 శాతం
సుస్థిర అభివృద్ధిలో నవరత్నాలు ప్రతిబింబిస్తున్నాయి
2022-23 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల ప్రకారం స్థూల ఉత్పత్తి రూ.13,17,728 కోట్లు
2023-24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.14,49,501 కోట్లతో 10 శాతం వృద్ధిగా అంచనా
రాష్ట్రంలో 62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడ్డారు
రైతు లేనిదే రాజ్యం లేదని విశ్వసించే ప్రభుత్వం మాది
పాల ఉత్పత్తిలో 5వ స్థానంలో ఏపీ

16 ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నాం
గతేడాది 18.39 కోట్ల పనిదినాలు కల్పించాం
వైఎస్సార్‌ జలకళ కింద 17,047 బోరు బావులు తవ్వాం
కుళాయి కనెక్షన్ల ద్వారా 65 లక్షల ఇళ్లకు మంచినీరు
మౌలిక వసతులు, సేవలు మెరుగుపరిచే మోడల్‌ పట్టణాలుగా మంగళగిరి, తాడేపల్లి
విశాఖలో మౌలిక సదుపాయాల అభివృద్ధి
175 నియోజకవర్గాల్లో 192 నైపుణ్య కేంద్రాలు
ఐటీఐలో నైపుణ్యాభివృద్ధి కోసం మౌలిక సదుపాయాల అభివృద్ధి
చురుగ్గా 67 క్రీడా వికాస కేంద్రాల నిర్మాణ పనులు
పర్యాటక రంగంలో రూ.22 వేల కోట్లతో ఒప్పందాలు
విజయవాడ స్వరాజ్‌ మైదానంలో అంబేద్కర్‌ స్మృతివనం
125 అడుగుల అంబేద్కర్‌ కాంస్య విగ్రహ ప్రతిష్ఠాపన

జీఐఎస్‌ ద్వారా 13.42 లక్షల కోట్ల పెట్టుబడులు: మంత్రి బుగ్గన
సమ్మిట్‌ ద్వారా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు
378  ఎంవోయూలు కుదుర్చుకున్నాం

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. ఇష్టం లేకుంటే సభ నుంచి వాకౌట్‌ చేయాలని స్పీకర్‌ సూచించారు. బడ్జెట్‌కు పదేపదే అడ్డు తగలడంతో ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను స్పీకర్‌ సస్సెండ్‌ చేశారు.

Time: 10: 11 AM
బడ్జెట్‌ ప్రసంగాన్ని రాష్ట ప్రజలంతా చూస్తున్నారు: సీఎం జగన్‌
బడ్జెట్‌ ప్రసంగానికి టీడీపీ అడ్డుపడటం సరికాదు: సీఎం జగన్‌

Time: 10:07 AM
బడ్జెట్‌లో పోతన భగవత పద్యాన్ని చదివిన మంత్రి బుగ్గన
రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ కవితను ఉదహరించిన మంత్రి రాజేంద్రనాథ్‌

Time: 10:04 AM
అసెంబ్లీలో 2023-24 ఏపీ వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.

Time: 9:05 AM
మూడో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాసేపట్లో బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రవేశపెట్టనున్నారు. రూ.2.79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ ఉండే అవకాశముంది.

►ముగిసిన ఏపీ కేబినెట్‌ సమావేశం.. 2023-24 వార్షిక బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోదం.
►ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి బుగ్గన.
►రూ. 2. 79 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్‌ ఉండే అవకాశం.
►నవరత్నాలకు నిధుల కేటాయింపుల్లో అధిక ప్రాధాన్యం.
►మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌
►మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు.
►వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ, పేదల ఇళ్లకు పెద్దపీట
►వ్యవసాయ బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్న మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి
►మండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న డిప్యూటీ సీఎం అంజాద్‌ భాషా

Time: 8:26 AM
బడ్జెట్‌లో పేదలు, బలహీన వర్గాలకు ప్రాధాన్యం: మంత్రి బుగ్గన
పేదలు, బలహీన వర్గాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అన్నారు. విద్య, వైద్యం,మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పరిపాలనాపరమైన మార్పులు చేసిన వాటికి కేటాయింపులు చేశామన్నారు.

Time: 8:11 AM
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయానికి బయల్దేరారు. కాసేపట్లో క్యాబినెట్ భేటీ జరగనుంది. సీఎం అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉద­యం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించను­న్నారు.

Time: 07:41 AM
బడ్జెట్‌ ప్రతులకు ప్రత్యేక పూజలు
బడ్జెట్‌ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సచివాలయానికి చేరుకున్నారు. బడ్జెట్‌ ప్రతులకు మంత్రి, అధికారులు పూజలు చేశారు.

Time: 07:33 AM
బడ్జెట్‌ కాపీతో సచివాలయానికి బయలేర్దిన మంత్రి బుగ్గన
బడ్జెట్‌ కాపీతో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సచివాలయానికి బయలేర్దారు. బడ్జెట్‌ ప్రతులకు పుజలు నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు.

శాసనసభలో బుగ్గన, మండలిలో అంజాద్‌ బాషా..
వరుసగా ఐదో దఫా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నవరత్నాల పథకాలు అమలు కొనసాగిస్తూ అన్ని వర్గాలకు అండగా నిలిచేలా రాష్ట్ర ప్రభుత్వం 2023–24 వార్షి­క బడ్జెట్‌కు రూపకల్పన చేసింది. ఈ ఏడాది కూడా మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం జెండర్‌ బేస్డ్‌ బడ్జెట్‌ సిద్ధం చేసింది.

రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో వచ్చే నిధులను వాస్తవ రూపంలో బేరీజు వేస్తూ వార్షిక బడ్జెట్‌ రూపొందించారు. కేంద్రం నుంచి పన్నుల వాటా రూపంలో రూ.41,388 కోట్లు రా­ను­న్నాయి. మొత్తం మీద 2023 – 24 వార్షిక బడ్జెట్‌ రూ.2.79 లక్షల కోట్లుగా ఉండనుందని అంచనా.

నేటి ఉదయం మంత్రిమండలి ఆమోదం
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ఐదో బడ్జెట్‌ జనరంజకంగా ఉండనుంది. ఉదయం 8 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. అనంతరం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేం­ద్రనాథ్‌ 2023–24 వార్షిక బడ్జెట్‌ను ఉద­యం 10 గంటలకు అసెంబ్లీకి సమర్పించను­న్నారు.

శాసన మండలిలో డిప్యూటీ ముఖ్యమంత్రి అంజాద్‌ బాషా బడ్జెట్‌ను చదవనున్నారు. వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్త­యిన వెంటనే ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపిస్తారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్‌ను పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చదవనున్నారు.

నవరత్నభరితంగా బడ్జెట్‌..
నవరత్నాలను ప్రతిబింబించేలా బడ్జెట్‌ను తీర్చిదిద్దారు. వృథా, దుబారా, ఆర్భాటపు వ్యయాలకు తావు లేకుండా అందరి సంక్షేమం, అన్ని రంగాల అభివృద్ధిని సమ్మి­ళితం చేస్తూ ఆయా రంగాలకు బడ్జెట్‌లో కేటాయింపులు చేశారు. అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతు భరోసా, పేదల గృహాలతో పాటు వ్యవసాయం, సాగునీరు, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇచ్చారు. వైఎస్సార్‌ కళ్యాణమస్తు, వైఎస్సార్‌ షాదీ పథకాలకు తగినన్ని కేటాయింపులు చేయనున్నారు.

గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ­కు బడ్జెట్‌లో తగిన కేటాయింపులు ఉండనున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ విద్యా సంస్థలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో ప్రత్యే­కం­గా నిధులు కేటాయింపులు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉప ప్రణాళికలను ప్రత్యేకంగా రూపొందించారు. మహిళలు, పిల్లల కోసం ప్రత్యేకంగా కేటాయింపులు చేయనున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరా కోసం సబ్సిడీకి తగినన్ని నిధులు కేటాయించనున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement