Updates:
ద్రవ్య వినిమయ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత ఏపీ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఏపీ శాసనమండలి కూడా నిరవధికంగా వాయిదా పడింది. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లును ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రవేశపెట్టారు.
ద్రవ్య వినిమయ బిల్లుపై సీఎం వైఎస్ జగన్ ప్రసంగించారు. తమ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అక్క చెల్లెమ్మల పక్షపాత బడ్జెట్ గా ఏపీ సీఎం జగన్ చెప్పారు. రైతన్నల పక్షపాత బడ్జెట్, గ్రామ స్వరాజ్ బడ్జెట్‌గా ఉందన్నారు. గత నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ క్యాలండర్ ను విడుదల చేసి దాని ప్రకారంగా నిధులను విడుదల చేస్తుందని సీఎం జగన్ వివరించారు.
సీఎం వైఎస్ జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు
- మావి అక్కా చెల్లెమ్మల, రైతన్నల పక్షపాత బడ్జెట్‌లు
- ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రతి బడ్జెట్‌లో నిధులు
- రైతన్నల పక్షపాత బడ్జెట్
- గ్రామ స్వరాజ్య బడ్జెట్
- ఏ నెలలో ఏ సంక్షేమ కార్యక్రమం చేస్తామో క్యాలెండర్ ద్వారా తెలియజేస్తున్నాం
- సంక్షేమ క్యాలెండర్ ద్వారా అన్ని పథకాలు అమలు చేస్తున్నాం: సీఎం జగన్
- ఏప్రిల్‌లో జగనన్న వసతి దీవెన అందిస్తాం
- వైఎస్సార్ ఆసరా రేపట్నుంచి మొదలవుతుంది
- ఏప్రిల్ 5 వరకూ వైఎస్సార్ ఆసరా కార్యక్రమం
- మేలో వైఎస్సార్ భరోసా, రైతు కిసాన్ కార్యక్రమం
- మేలో జగనన్న విద్యా దీవెన, కల్యాణమస్తు మొదటి ఇన్‌స్టాల్‌మెంట్‌లు, వైఎస్సార్ మత్యకార భరోసా
- జూన్‌లో జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాకానుక, వైఎస్సార్ లా నేస్తం తొలి విడత కార్యక్రమాలు
- జూలైలో జగనన్న విదేశీ విద్యా దీవెన తొలి విడత
- జూలైలో వైఎస్సార్ నేతన్న నేస్తం, ఎంఎస్‌ఎంఈ ప్రోత్సహకాలు, జగనన్న తోడు తొలి విడత కార్యక్రమం, వైఎస్సార్ సున్నా వడ్డీ(ఎస్‌హెచ్‌జీ) కార్యక్రమం
- జూలైలో వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా రెండో విడత
- ఆగస్టులో జగనన్న విద్యా దీవెన రెండో విడత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ వాహన మిత్ర
- సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత
- అక్టోబర్‌లో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్
- అక్టోబర్‌లో జగనన్న వసతి దీవెన
- నవంబర్‌లో వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాలు, వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా మూడో విడత
- నవంబర్‌లో జగనన్న విద్యా దీవెన మూడో విడత
- డిసెంబర్‌లో జగనన్న విదేశీ విద్యా దీవెన రెండో విడత
- డిసెంబర్‌లో జగనన్న చేదోడు
- జనవరిలో వైఎస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్
- జనవరిలో వైఎస్సార్ ఆసరా
- జనవరిలో జగనన్న తోడు రెండో విడత
- జనవరిలో వైఎస్సార్ లా నేస్తం రెండో విడత
- జనవరిలో పెన్షన్ పెంపు(రూ. 3,000)
- ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన నాల్గో విడత
- ఫిబ్రవరిలో కల్యాణ మస్తు, షాదీ తోఫా నాల్గో విడత
- ఫిబ్రవరిలో ఈబీసీ నేస్తం
- మార్చిలో జగనన్న వసతి దీవెన రెండో విడత
- మార్చిలో ఎంఎస్‌ఎంఈ ప్రోత్సహకాలు
సీఎం జగన్ ప్రసంగం
- మొదటిసారిగా షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి
- నవంబర్, 2019లో మనోజ్‌పై ఐటీ సోదాలు జరిగాయి
- ఆ తర్వాత చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌పై ఐటీ దాడులు చేసింది
- చంద్రబాబు పీఏ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ్‌తో కలిసి డీల్ చర్చించారు
- బోగస్ కంపెనీలతో నిధులు మళ్లించారు
- ఎల్ అండ్ టీ నుంచి కూడా డబ్బులు ఇప్పించేందుకు మనోజ్ ప్రయత్నించారు
- అమరావతిలో జరిగిన నిర్మాణాల్లో భారీ అవినీతి: సీఎం జగన్
- మనోజ్ దుబాయిలో సీబీఎన్‌కు రూ. 1514 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది
- రామోజీరావు కొడుకు వియ్యంకుడు రఘు కూడా దీంట్లో భాగస్వామి
మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రసంగం
►చంద్రబాబు పీఏ అవినీతిపై ఐటీ శాఖ నివేదిక ఇచ్చింది
►కోట్లలో అవినీతి జరిగింది
►దాదాపు రూ. 2 వేల కోట్ల అవినీతి జరిగింది
►కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్లు ఐటీ శాఖ చెప్పింది
►ప్రజా ధనాన్ని చంద్రబాబు దోచుకున్నారు
►సంక్షోభాన్ని చంద్రబాబు తన అవినీతికి అవకాశంగా మార్చుకున్నారు
►ఏపీ సచివాలయ నిర్మాణంలో భారీ అవినీతి జరిగింది
►చంద్రబాబు అవినీతిపై పత్రికల్లో కథనాలు వచ్చాయి
►మనోజ్ వాసుదేవ్ 2019లో చంద్రబాబుని కలిశారు
►మనోజ్ వాసుదేవ్ షాపూర్ జీ పల్లోంజి సంస్థ ప్రతినిధి
►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు
►బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లించారు
►ఆర్‌వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు
►పీఏ శ్రీనివాస్ ఇచ్చే ఆదేశాలను పాటించమని ఆయనకు బాబు చెప్పారు
►బోగస్ ఇన్వాయిస్‌లతో నిధులు మళ్లించారు
►ఆర్‌వీఆర్ రఘు, కృష్ణ, నారాయణ్ సంస్థలకు నిధులు మళ్లింపు
►అసెంబ్లీ సచివాలయం, హైకోర్టు నిర్మాణాల షాపూర్ జీ పల్లోంజి చేపట్టింది
►ఈ సంస్థకు రూ. 8 వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు ఇచ్చారు
►బోగస్ కంపెనీలు, వోచర్లతో నిధులు మళ్లించారు
►చివరిగా ఈ డబ్బులన్నీ చంద్రబాబుకు చేరాయి
►మొత్తం చంద్రబాబు, టీడీపీ రూ. 143 కోట్లు అందాయి
►స్కిల్ స్కామ్‌లో రూ. 372 కోట్లు చంద్రబాబు కొట్టేశారు
►కేబినెట్ ఆమోదానికి, ఎంవోయూకు సంబంధం ఉండదు
►అమరావతిలో చంద్రబాబు కట్టింది గోరంత.. కొట్టేసింది కొండంత
03:17PM
అసెంబ్లీలో సీఎం జగన్ ప్రసంగం
►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం
►దళిత క్రిస్టియన్లను ఎస్సీల్లో చేర్చాలని తీర్మానం
►అసెంబ్లీలో ఆమోదించిన ఆ రెండు తీర్మానాలను కేంద్రానికి పంపుతున్నాం
►పాదయాత్రలో ఎస్టీల్లో చేర్చాలని బోయ, వాల్మీకి కులస్థులు కోరారు
►ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బోయ, వాల్మీకి కులస్థుల స్థితిగతుల కోసం ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేశాం
►రాయలసీమ జిల్లాల్లో ఆ కులాలు ఆర్థిక, సామాజిక స్థితిగతులను ఏకసభ్య కమిషన్ తెలుసుకుంది.. ప్రభుత్వానికి నివేదిక అందించింది
►కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ తీర్మానం
►ఉమ్మడి ఏపీలో దివంగత నేత వైఎస్సార్ హయాంలో తీర్మానం జరిగింది
►మళ్లీ ఇప్పుడు మన హయాంలో తీర్మానం చేస్తున్నాం
►ఏజెన్సీలో ఉన్న ఎస్టీ కులాలపై దీని ప్రభావం ఉండదు
►గిట్టనివారు ఓట్ల కోసం దీనిపై దుష్ప్రచారం చేస్తున్నారు
►ఎస్టీలు నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారు
►నా ప్రభుత్వంలో వాళ్లకు అన్యాయం జరగదు
►గిరిజనులు, ఆదివాసీలకు ఈ తీర్మానాలతో ఇబ్బంది ఉండదు
Time: 03:10 PM
►దళిత క్రిస్టియన్లను ఎస్సీల జాబితాలోకి చేర్చాలని ఏకగ్రీవ తీర్మానం
► బోయ, వాల్మీకి కులాలను ఎస్టీల్లో చేర్చాలని తీర్మానం
►తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రి మేరుగు నాగార్జున
►అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు: మేరుగు నాగార్జున
►లబ్ధిదారుల ఇంటి వద్దకే సంక్షేమం అందిస్తున్న ప్రభుత్వం
►మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా సంక్షేమ ఫలాలు
►గత టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో దోచుకున్నారు.
►బోయ, వాల్మీకి కులాలను ఎస్టీలో చేర్చాలన్న తీర్మానానికి సభ ఆమోదం
Time: 02:00 PM
►విద్యా దీవెన పథకం పేదలు చదువు కోవడానికి ఏర్పాటు చేశాం: మంత్రి నాగార్జున
►పేదల కుటుంబాల స్థితిగతుల ఆధారంగా ఫీజు రీయింబర్స్‌మెంట్
►ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఈ పథకం
►వసతి దీవెన ద్వారా కూడా విద్యార్థుల ఖర్చులకు హాస్టల్ ఫీజు చెల్లింపు
►మత్స్యకార భరోసా కింద రూ.10వేలు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ: మంత్రి అప్పలరాజు
►వేట నిషేధం సమయంలో మత్స్యకారులకు సాయం
►హిందూ ధర్మ ప్రచారం, పరిరక్షణకు చర్యలు: మంత్రి కొట్టు సత్యనారాయణ
►ఈ ఏడాది 2900 దేవాలయాలను నిర్మిస్తాం
►ఈ ఏడాది దూపదీప నైవేద్యాల కోసం నిధులు కేటాయించాం
Time: 10:31 AM
►ప్రతి పేదవాడికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ధర్మాన ప్రసాదరావు
►పేదల ఇళ్ల కోసం భూముల్ని కొనుగోలు చేశాం
Time: 9:50 AM
►సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి
►31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం.
►జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయం
►31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడం ఒక చరిత్ర: మంత్రి జోగి రమేష్.
►జగనన్న కాలనీల్లో శాశ్వత మౌలిక సదుపాయాలు.
►త్వరలోనే జగనన్న కాలనీలు పూర్తవుతాయి.
Time: 9:30 AM
►అసెంబ్లీ సభా కార్యకలాపాలకు టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించి రెడ్‌లైన్‌ను టీడీపీ సభ్యులు క్రాస్ చేశారు. స్పీకర్ పదేపదే హెచ్చరించినా పోడియం వద్ద టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. స్పీకర్ ఛైర్ దగ్గరకు టీడీపీ సభ్యులు దూసుకెళ్లారు. దీంతో అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు.
►టీడీపీ హయాంలో ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చారని వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని మండిపడ్డారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడుతూ, ఆరోగ్యశ్రీలో 3,138 ప్రొసీజర్లు పెంచిన ఘనత సీఎం జగన్‌దన్నారు.
►తొమ్మిదో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ద్రవ్య వినిమయ బిల్లును సభలో ప్రవేశపెట్టనున్నారు.
►బోయ, వాల్మీకిలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ బీసీ సంక్షేమశాఖ మంత్రి వేణుగోపాల కృష్ణ తీర్మానాన్ని ప్రవేశ పెట్టనున్నారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీల జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ మంత్రి మేరుగ నాగార్జున తీర్మానం ప్రవేశపెట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment