సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా టీడీపీ హయాంలో జరిగిన స్కిల్ స్కామ్‌పై చర్చ జరిగింది. ఈ క్రమంలో మంత్రి బుగ్గన, ఎమ్మెల్యే కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీలో కన్నబాబు మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం ఓ దొంగల ముఠా కథ. డబ్బులు కొట్టేసే కార్యక్రమంలో టీడీపీ వాళ్లకు ఉన్న స్కిల్ ఎవరికీ లేదు. నిరుద్యోగులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేసింది. చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన నెలరోజులకే ప్రతిపాదన తెచ్చారు. ప్రతిపాదన రాగానే కేబినెట్‌లో ప్రవేశపెట్టి ఆమోదించారు. రూ. 3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఏదైనా ప్రాజెక్ట్ ముందుకొస్తే డీపీఆర్ ఇవ్వాలి. డీపీఆర్ సిమెన్స్ కంపెనీ ఇవ్వకుండా ఇతరులు ఇచ్చారు. కంపెనీ ఇవ్వకుండా ఇతరులు డీపీఆర్ ఎలా తయారు చేస్తారు. ఒక కంపెనీకి ప్రభుత్వం రూ.3వేల కోట్లు ఖర్చు పెడుతుందా?. ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగలేదన్నారు. ఈ స్కాంలో నిందితులు ఎవరో తేల్చి త్వరగా చర్యలు తీసుకోవాలి అని అన్నారు.
ఆర్థిక మంత్రి బుగ్గన మాట్లాడుతూ.. జీవో, ఎంవోయూకి తేడా ఉంది. రూ.371 కోట్లు ఇచ్చే ముందు సరైన వివరాలు పేర్కొనలేదు. లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు. చంద్రబాబు హయంలో కేవలం స్కిల్ స్కాం ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ జరిగింది. ఫేక్ ఇన్వాయిస్‌లతో నగదు కాజేశారు. ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు అని ఆరోపించారు.
ఇంకా ఏమన్నారంటే..
జీవోలోని అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు.
ఒక్కపైసా సీమెన్స్ నుంచి రాకుండానే డబ్బు విడుదల.
డబ్బు విడుదలకు ఆర్థికశాఖ అధికారుల అభ్యంతరం.
వాటిని కొట్టేసి తానే స్వయంగా నిధులు విడుదల చేయించిన చంద్రబాబు.
తర్వాత షెల్ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్ చేశారు.
జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి ఈ స్కాం వెలుగులోకి వచ్చింది.
ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్ కంపెనీలుగా గుర్తింపు.
ఒక్క పైసా కూడా తమకు ముట్టలేదన్న సీమెన్స్ గ్లోబల్ టీం.
మరిన్ని ఆధారాలను ఇచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్.
కొంత డబ్బు హైదరాబాద్, పుణే వెళ్లిందని ఆధారాలిచ్చిన సీమెన్స్ గ్లోబల్ టీమ్.
ఇవన్నీ కూడా చంద్రబాబు హయాంలోనే వెలుగు చూశాయి.
అయినా వాటన్నింటినీ దాచేసిన చంద్రబాబు సర్కారు.
ముఖ్యమంత్రి హోదాను అడ్డుపెట్టుకుని ఏసీబీని తొక్కిపెట్టిన చంద్రబాబు.
ఈ కేసులో ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేసిన ఈడీ, సీఐడీ.
కేసును మరింత ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న సీఐడీ.
రాష్ట్రంలో మొదలై.. విదేశాలకు పాకిన కుంభకోణం.
దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు.
గంటా సుబ్బారావు అనే అనధికార ప్రైవేట్ వ్యక్తిని ఏపీఎస్ఎస్డీసీకి సీఈవోగా నియమించారు.
సీఎఫ్ఎంఎస్ కార్పొరేషన్‌కి, సీఈవోగా కూడా ప్రైవేట్ వ్యక్తినే పెట్టుకున్నారు.
రిటైర్డ్ అధికారి లక్ష్మీనారాయణ అనే వ్యక్తిని డైరెక్టర్‌గా నియమించారు.
రూ.370 కోట్ల విలువైన సాఫ్ట్ వేర్‌కు ఎంవోయూ చేసుకున్నారు.
డిజ్ టెక్ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్టులో ఏ భాగస్వామ్యం లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు.
ఏమీ చేయకుండా డిజ్ టెక్ కంపెనీకి రూ.370 కోట్లు అప్పనంగా ఇచ్చేశారు.
ఎంవోయూపై గంటా సుబ్బారావు, సుమన్ బోస్, సంతోష్ సారాల సంతకాలున్నాయి.
జీవోకి, ఎంవోయూకి తేడా ఉంది.
రూ.371 కోట్లను ఇచ్చే ముందు సరైన వివరాలు నమోదు చేయలేదు.
లెటర్ నెంబర్, డేటా లేకుండానే నిధులు విడుదల చేశారు.
చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ద్వారానే రూ.371 కోట్లు కాజేశారు.
ఫేక్ ఇన్వాయిస్‌లతో నిధులు కాజేశారు.
ఎలాంటి ఒప్పందాలు లేకుండా పలు కంపెనీలకు నిధులు మళ్లించారు.
స్కిల్ డెవలప్మెంట్ పేరుతో టీడీపీ నేతలు భారీగా దోచుకున్నారు.
రూ.3,300 కోట్ల పెట్టుబడి అని మోసం చేశారు.
సీమెన్స్ 90శాతం పెట్టుబడి పెడుతుందని అబద్ధాలు చెప్పారు.
10శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని చెప్పి రూ.371 కోట్లు విడుదల.
గంటా సుబ్బారావు, సుమన్ బోస్ మధ్య ఈ ఒప్పందం జరిగింది.
సుమన్ బోస్‌కి, సీమెన్స్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదు.
అయినా సీమెన్స్ పేరుతో రూ.371 కోట్లు దోచుకున్నారు.
నిధులు విడుదలకు అభ్యంతరం తెలిపిన ఆర్థికశాఖ అధికారులు.
చంద్రబాబు చెప్పినందువల్లే అధికారులు డబ్బు రిలీజ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment