AP Assembly Budget Session 2023-24, March 20th Day 7 Live Updates In Telugu And Latest News - Sakshi
Sakshi News home page

AP Assembly Session Live Updates: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు: సీఎం జగన్‌

Published Mon, Mar 20 2023 9:15 AM | Last Updated on Mon, Mar 20 2023 5:40 PM

Ap Assembly Budget 2023 24 Session March 20 Day 7 Live Updates - Sakshi

Live Update

అసెంబ్లీలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం

Time: 03:32PM

  • ఈ స్కామ్‌లో ప్రధాన ముద్దాయి చంద్రబాబు
  • సీమెన్స్‌సంస్థ కూడా ఇంటర్నెల్‌ దర్యాప్తు జరిపింది
  • ప్రభుత్వ జీవోతో తమకు సంబంధం లేదని సీమెన్స్‌చెప్పింది
  • తీగ లాగితే డొంక కదిలింది
  • షెల్‌ కంపెనీల ద్వారా తిరిగి మళ్లీ చంద్రబాబు జేబులోకే డబ్బులు
  • ఈ స్కాంపై గత ప్రభుత్వ హయాంలోనే ఫిర్యాదు వచ్చింది. 
  • సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకపోవడంతో జీఎస్టీ అధికారులు కూపీ లాగారు. 
  • 2017లో ఈ స్కామ్‌ను జీఎస్టీ అధికారులు వెలికితీశారు
  • స్కిల్లర్‌, డిజైన్‌టెక్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ కట్టకుండా క్లెయిమ్‌ చేశారు. 
  • ఫేక్‌ ఇన్‌వాయిస్‌లను సృష్టించినట్టు గుర్తించారు. 
  • విదేశీ లాటరీ తరహాలో స్కామ్‌కు పాల్పడ్డారు
  • రూ. 371 కోట్లు హారతి కర్పూరంలా మాయం చేశారు
  • చంద్రబాబు చేతిలో ఎక్కువ మీడియా ఉంది.. నిజాన్ని అబద్దం చేయగలడు.. అబద్ధాన్ని నిజం చేయగలుగుతారు
  • నేరగాళ్లకు సరైన సమయంలో దేవుడు మొట్టికాయలు వేస్తాడు
  • బాబును కాపాడేందుకు ఈ గజదొంగల ముఠా ప్రయత్నాలు చేస్తోంది

  • స్కిల్డ్‌ క్రిమినల్స్‌ చేసిన అతిపెద్ద స్కామ్‌ ఇది
  • 90 శాతం సీమెన్స్‌, 10 శాతం ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు
  • సుమారు రూ. 3 వేల కోట్లు సీమెన్స్‌ఇస్తుందని ప్రచారం చేశారు
  • ఒక ప్రైవేట్‌ కంపెనీ ఎక్కడైనా రూ. 3 వేల కోట్ల గ్రాంట్‌ ఇస్తుందా?
  • డీపీఆర్‌ను సైతం తయారు చేయించలేదు
  • ఈ ప్రాజెక్ట్‌ మొత్తం ఖర్చు రూ. 3,356 కోట్లు
  • ఇందులో ప్రభుత్వ వాటా 10 శాతం.. అంటే రూ. 371 ​కోట్లు ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు
  • మిగిలిన 3 వేల కోట్లు సీమెన్స్‌ ఇస్తుందని జీవోలో చెప్పారు
  • గ్రాంట్‌గా ఇస్తే మళ్లీ తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు
  • కానీ ఒప్పందంలో ఎక్కడా గ్రాంట్‌ ఇన్ ఎయిడ్‌ అనే ప్రస్తావనే లేదు
  • జీవో వేరే.. ఒప్పందం వేరే.. మరి సంతకాలు ఎలా చేశారు
  • 3 నెలల కాలంలోనే 5 దఫాల్లో రూ. 371 కోట్లు విడుదల చేశారు
  • చంద్రబాబు పాత్ర లేకుండా ఇంత పెద్ద స్కామ్‌ జరుగుతుందా
  • నేను బటన్‌ నొక్కితే లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు.. చంద్రబాబు బటన్‌ నొక్కితే ఆయన ఖాతాల్లోకి సొమ్ము

  • రూ. 371 కోట్లు చంద్రబాబు, ఆయన మనుషులు తినేశారు
  • మనీలాండరింగ్‌ ద్వారా ఆయన చేతుల్లోకి డబ్బు వచ్చింది
  • చంద్రబాబు బటన్‌ నొక్కితే తిరిగి ఆయన ఖాతాలోకే సొమ్ము
  • డబ్బులు దోచేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య
  • విద్యార్థుల పేరుతో జరిగిన అతిపెద్ద స్కామ్‌ ఇది
  • రాష్ట్రంలోనే కాదు..దేశంలోనే  అతిపెద్ద స్కామ్‌ ఇది

  • దోచేసిన డబ్బును ఎలా జేబులోకి తెచ్చుకోవాలో చంద్రబాబుకు తెలుసు
  • ఇన్వెస్టిగేషన్‌ చేస్తే ఏం చేయాలో బాబు పక్కాగా ప్లాన్‌ చేశారు
  • ఇవన్నీ ఒక్క క్రిమినల్‌ మాత్రమే చేయగలడు
  • బాబు అధికారంలోకి వచ్చిన 2 నెలలకే ఈ స్కామ్‌ ఊపిరి పోసుకుంది
  • వ్యూహం ప్రకారం ముఠాగా ఏర్పడి రూ. 371 కోట్లు కొట్టేశారు
  • లోపాయికారీ ఒప్పందంతో దోపిడీకి పాల్పడ్డారు
  • చంద్రబాబు టెండర్ల ప్రక్రియ కూడా చేపట్టలేదు
  • ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ చేపడితే పూర్తి చర్చ జరగాలి
  • సీమెన్స్‌ అనే ప్రైవేట్‌ సంస్థ రూ. 3 వేల కోట్లు ఇస్తుందని ప్రచారం చేశారు
  • సీమెన్స్‌ కంపెనీలోని వ్యక్తితో లాలూచీ పడ్డారు
  • ఈ స్కామ్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఎందుకు నోరు మెదపలేదు?
  • దత్తపుత్రుడు కూడా ఈ స్కామ్‌పై ప్రశ్నించలేదు
  • ఇంత పెద్ద అవినీతి ఎక్కడా చూడలేదు
  • దోచుకు, పంచుకో, తినుకో అన్నదే వారి విధానం
  • ఎవడూ రాయడు, ఎవడూ చూపడు, ఎవడూ అడగడు
  • జీవోలో ఉన్నది వేరు.. ఒప్పందంలో ఉన్నది వేరు
  • కేబినెట్‌ నిర్ణయం, ఒప్పందానికి సంబంధం లేకుండా జీవో స్వరూపాన్ని మొత్తం మార్చేశారు
  • 6 క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని జీవో చెప్పారు
  • ఒక క్లస్టర్‌కు రూ. 546 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పారు

Time: 03:26PM
►ఇండస్ట్రీస్‌, స్కిల్‌ను కనెక్ట్‌ చేస్తున్నాం: మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
►ఇప్పటి వరకు 72.5 శాతం ప్లేస్‌మెంట్స్‌ కల్పించాం.
►స్కిల్‌ డెవలప్‌మెంట్‌ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు.
►రూ. 3,356 కోట్ల ప్రాజెక్టు అని చెప్పి మోసం చేశారు.

Time: 03:10PM

చంద్రబాబు హయాంలో జరిగిన స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌పై అసెంబ్లీలో చర్చ.
►సీ అంటే చంద్రబాబు.. మెన్‌ అంటే ఆయన మనుషులు అని అర్థం: కన్నబాబు
►చంద్రబాబు కుదుర్చుకున్న సీమెన్‌ ఒప్పందం అదే.
► రాష్ట్రంలో మొదలై విదేశాలకు పాకిన కుంభకోణం
► దోచిన ప్రజాధనం విదేశాలకు తరలింపు
► హవాలా మార్గంలో మళ్లీ దేశంలోకి సొమ్ముల మళ్లింపు
► చంద్రబాబు హయాంలో కేవలం స్కిల్‌ స్కామ్‌ ద్వారానే రూ. 371 కోట్లు దోపిడీ.

► చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 2-3 నెలలకే స్కాం మొదలు
► తన మనుషులను స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో పెట్టిన బాబు.
► సీమెన్స్‌ ముసుగు తొడిగి అక్కడ ఉద్యోగితో లోపాయికారీ ఒప్పందం
► కేవలం ఒక నోట్‌ ఆధారంగా స్పెషల్‌ ఐటంఎగా కేబినెట్‌ ఆమోదం.
►సీమెన్‌ 90 శాతం పెట్టుబడి పెడుతుందని అబద్దాలు చెప్పారు.
►10 శాతం ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డబ్బులు విడుదల చేశారు.
►ప్రాజెక్టు డీపీఆర్‌, సర్టిఫికేషన్‌లేకుండానే గ్రీన్‌ సిగ్నల్‌
► రూ.3,356 కోట్ల ప్రాజెక్టుకు చంద్రబాబు ప్రభుత్వం ఆమోదం.
► జీవోలో ఇదే అంశాన్ని పేర్కొన్న బాబు సర్కార్‌.

► ఒప్పందం దగ్గరకు వచ్చేసరికి జోవోల అంశాలు కనుమరుగు.
► ప్రభుత్వం ఇచ్చే దాన్ని ఆర్థిక సహాయంగా పేర్కొంటూ ఒప్పందం.
► జీవో అంశాలు, సంబంధిత లేఖలను ప్రస్తావించకుండానే సంతకాలు.
► ఒక్కపైసా సీమెన్స్‌ నుంచి రాకుండానే డబ్బు విడుదల.
► డబ్బు విడుదలకు ఆర్థిక శాఖ అధికారుల అభ్యంతరాలు.
► వాటిని కొట్టేసి.. తానే స్వయంగా విడుదల చేసిన చంద్రబాబు.
► తర్వాత షెల్‌ కంపెనీల ద్వారా మనీ లాండరింగ్‌.
► జీఎస్టీ అధికారుల ఆరాతో వెలుగులోకి వచ్చిన స్కామ్‌.
► ఈడీ, సెబీ సోదాల్లో అవన్నీ షెల్‌ కంపెనీలుగా గుర్తింపు.

Time: 02:30PM
►శాసన సభకు ఎన్నో విశేషాధికారాలు ఉన్నాయి: స్పీకర్‌ తమ్మినేని
►ఉద్దేశపూర్వకంగా సభా కార్యక్రమాలు అడ్డుకోవడం, స్పీకర్‌ను  దూషించడం, అనైతికంగా వ్యవహరిస్తే వరుసగా 5 సెక్షన్లపాటు సస్పెండ్‌ చేయొచ్చు.

Time: 01:30PM
►పలు శాఖల అభివృద్ధి అంశాలపై అసెంబ్లీలో చర్చ.
►వివిధ సవరణ బిల్లులను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మంత్రులు

Time: 12:50PM
►టీడీపీ సభ్యులు రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు: మంత్రి మేరుగ నాగార్జున
►చంద్రబాబు టీడీపీ సభ్యులను రెచ్చగొట్టి పంపిస్తున్నారు.
►బీసీ వ్యక్తి స్పీకర్‌గా చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారు.
►ఎస్సీ సభ్యులను పురిగొల్పి స్పీకర్‌పై దాడి చేయిస్తున్నారు.
►రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారు.

Time: 12:20PM
►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ ఆగ్రహం
►తాను గౌతమ బుద్దుడు కాదన్న స్పీకర్‌
►సభలో టీడీపీ సభ్యుల ప్రవర్తన హేయం.
►పోడియం దగ్గరకు వస్తే ఆటోమెటిక్‌ సస్పెన్షన్‌ చేస్తానని రూలింగ్‌ ఇచ్చిన స్పీకర్‌.

Time: 11:50AM
►టీడీపీ సీనియర్‌ సభ్యులే దాడులు చేయడం దురదృష్టకరం: స్పీకర్‌ తమ్మినేని
►నాపై దురుసుగా ప్రవర్తించడం సీనియారిటీనా?
►బడగు, బలహీన వర్గాలంటే ఇంత చిన్న చూపా?
►నా చైర్‌ వద్దకు వచ్చే హక్కు సభ్యులకు లేదు.

Time: 11:20AM
►టీడీపీ సభ్యులకు సంస్కారం లేదు: మంత్రి విడదల రజని
►సభలో టీడీపీ సభ్యులు రౌడీయిజం చేశారు.
►చంద్రబాబు ప్రచార పిచ్చితో అమాయకులు బలయ్యారు.
►టీడీపీ మారణకాండకు అడ్డుకట్ట వేసేందుకే జీవో నెం.1

►స్పీకర్‌పై టీడీపీ సభ్యులు భౌతికంగా దాడి చేశారు. మంత్రి పినిపే విశ్వరూప్‌.
►టీడీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.

►టీడీపీ సభ్యులు మార్షల్స్‌పై కూడా దాడి చేశారు. మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ
►సభలో గొడవలు సృష్టించాలనేదే టీడీపీ కుట్ర.
►బీసీలంటే చంద్రబాబుకు చిన్నచూపు.

Time: 10:40AM
►చంద్రబాబుకు దాడులు చేయించడం అలవాటే: మంత్రి సీదిరి అప్పలరాజు.
►బీసీ, ఎస్సీ, ఎస్టీలను అవమానించిన చరిత్ర చంద్రబాబుది.
►సభలో కావాలనే టీడీపీ సభ్యులు దాడులు చేశారు
►స్పీకర్‌ అటెండర్‌ను పక్కకు నెట్టేశారు.
►టీడీపీ సభ్యుల దాడులను టీవీల్లో ప్రదర్శించాలి.

►సభలో టీడీపీ సభ్యుల తీరు బాధాకరం: మంత్రి అంబటి.
►చంద్రబాబు సభకు రాకుండా దాడులు చేయిస్తున్నారు.
►టీడీపీ సభ్యులకు స్పీకర్‌ అంటే గౌరవం లేదు.

►టీడీపీ సభ్యులు నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే ఎలీజా.
►సభాపతిని టీడీపీ సభ్యులు అవమానించారు.
►టీడీపీ సభ్యులపై అట్రాసిటీ కేసు పెట్టాలి.

Time: 10:10AM
► ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్‌
► ఒకరోజు టీడీపీ సభ్యులను సస్పెండ్‌ చేసిన స్పీకర్‌

Time: 10:00AM
►స్పీకర్‌కు రక్షణగా పోడియం వద్దకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు.
►వైఎస్సార్‌సీపీ సభ్యులపై దాడికి దిగిన టీడీపీ సభ్యులు.
►సుధాకర్‌ బాబుపై దూషణలకు దిగిన టీడీపీ సభ్యులు.
►వారించిన వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నెట్టేసిన బుచ్చయ్య చౌదరి.
►బుచ్చయ్య చౌదరి నెట్టడంతో కిందపడబోయిన వెల్లంపల్లి.
►డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై టీడీపీ ఎమ్మెల్యే డోలా దూషణలు.

►టీడీపీ ఎమ్మెల్యే డోలా నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే సుధాకర్‌ బాబు.
►చంద్రబాబుకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు.
►దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు పెట్టాలి.
►సభలో గొడవ చేయించింది చంద్రబాబే.
►టీడీపీ ఎమ్మెల్యేలతో మాపై దాడి చేయించారు.

Time: 9:35AM
►ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల దౌర్జన్యం.
►స్పీకర్‌ పట్ల వద్ద టీడీపీ నేతల అనుచిత ప్రవర్తన.
►పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరిన టీడీపీ సభ్యులు.
►స్పీకర్‌ విజ్ఞప్తి చేసినా పట్టించుకోని టీడీపీ సభ్యులు
►స్పీకర్‌ ముఖంపై ఫ్లకార్డు పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే డోలా.
►టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం అసహనం.
►సభా సమయాన్ని వృథా చేయడంపై స్పీకర్‌ అసంతృప్తి.

Time: 9:20AM
► చంద్రబాబు, టీడీపీ నేతలు ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నారు: మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
►పట్టభద్రుల ఎన్నిక ప్రత్యేకమైన ప్రాధాన్యత క్రమంలో జరిగిన ఎన్నిక..
►చంద్రబాబు చేసుకున్నవి ఆఖరి విజయోత్సవాలు.
►2024 ఎన్నికలు చంద్రబాబుకు చివరి ఎన్నికలు.
►అసెంబ్లీలో చంద్రబాబు శాశ్వతంగా అడుగుపెట్టే అవకాశం లేదు.

►ఏపీలో అకాల వర్షాల కారణంగా పంట నష్టం వాటిల్లింది.
►నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుంది.
►నష్టపోయిన రైతుకు ఇన్‌పుట్‌ సబ్సిడీలోపాటు బీమా పరిహారం కల్పిస్తాం.
►రైతులకు సీఎం జగన్‌ భరోసా ఇచ్చారు.

►ప్రశ్నోత్తరాలు అడ్డుకోవడం సరికాదు: మంత్రి అంబటి రాంబాబు
►సభలో కావాలనే టీడీపీ సభ్యులు గొడవ చేస్తున్నారు.
►ప్రజా సమస్యలపై టీడీపీ సభ్యులకు చిత్తశుద్ధి లేదు

►సభలో అచ్చెన్నాయుడు భాష సరిగా లేదు: మంత్రి కొట్టు సత్యనారాయణ
►జీవో నెం1 అందరికీ వర్తిస్తుంది.

సాక్షి, అమరావతి: ఏడో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. అనంతరం పలు శాఖల డిమాండ్లను అసెంబ్లీ ఆమోదించనుంది. 10 సవరణ బిల్లులను సభలో మంత్రులు ప్రవేశపెట్టనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement