Minister Roja Challenges To TDP Leaders In AP Assembly - Sakshi
Sakshi News home page

చంద్రబాబు, బాలకృష్ణకు మంత్రి రోజా సవాల్‌

Published Sun, Mar 19 2023 3:27 PM | Last Updated on Sun, Mar 19 2023 6:26 PM

Minister Roja Challenges TDP Leaders In AP Assembly - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్‌ విసిరారు. టీడీపీకి దమ్ముంటే రాజీనామా చేసి ఎన్నికలకు రావాలి. చంద్రబాబు, బాలకృష్ణ, అచ్చెన్నాయుడు రాజీనామా చేసి ఎన్నికలు వస్తారా? అని ప్రశ్నించారు. 

కాగా, మంత్రి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ.. ప్రజలు 175 నియోజకవరాగల్లో జరిగిన అన్ని ఎన్నికల్లో టీడీపీ ఓడించారు. సింబల్‌పై ఏడేళ్ల నుంచి టీడీపీ గెలిచిన దాఖలాలు లేవు. టీడీపీకి అంత నమ్ముకం ఉంటే లోకేష్‌ను ఎందుకు పోటీలో పెట్టలేదు?. మేము గెలిస్తే డబ్బులతో గెలిచామంటున్నారు. టీడీపీ గెలిస్తే ప్రజా తీర్పు అంట?. 

కానీ.. వైఎస్సార్‌సీసీ మాత్రం ప్రజా తీర్పుతో గెలిచింది. కొద్ది మంది ఓటర్లు ప్రత్యేక ఎన్నికల్లో గెలుపు కాదు.. ప్రజా తీర్పుతో గెలుపొందాము. వైఎస్సార్‌సీపీ దెబ్బ ఎలా ఉంటుందో 2019లో చూపించాము. మళ్లీ 2024లో కూడా చూపిస్తాము. పులివెందులలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఓడించే మగాడు పుట్టలేదు అంటూ కామెంట్స్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement