సాక్షి, అమరావతి: అసెంబ్లీ ఐదో రోజు బడ్జెట్ సమావేశాల సందర్బంగా విశాఖపట్నం గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్‌పై చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సమ్మిట్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు కీలక వ్యాఖ్యలు చేశారు. యువతకు ఉపాధి కల్పించే రంగాలపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలిపారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలంతా జీఐఎస్‌కు వచ్చినట్టు స్పష్టం చేశారు. అనేక రంగాల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నామన్నారు.
మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఇంధన రంగంలో భారీగా పెట్టుబడులు వచ్చాయి. పరిశ్రమల ద్వారా వేలాది మంది యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు.
మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ యూత్ ఐకాన్. జీఐఎస్‌తో సీఎం వైఎస్ జగన్ ఖ్యాతి విశ్వవ్యాప్తం అయ్యింది. పరిశ్రమల ద్వారా ఆరు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం జగన్ పట్ల పారిశ్రామికవేత్తలు విశ్వాసంతో ఉన్నారు. టీడీపీ నేతల గోబెల్స్ ప్రచారాన్ని గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌తో తిప్పికొట్టాం. దిగ్గజ పారిశ్రామికవేత్తలంతా ఒకే వేదికపైకి రావడం ఎన్నడూ లేదు. జె అంటే జగన్.. జె అంటే జోష్ అని పారిశ్రామికవేత్తలే చెప్పారు. జీఐఎస్‌తో సీఎం జగన్ ట్రెండ్ సెట్టర్ అని మరోసారి రుజువు చేశారు. పర్యాటక రంగంలో 129 ఎంవోయూలు కుదుర్చుకున్నాం. 40 ఇయర్స్ అని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్రానికి అన్యాయం చేశారు. చంద్రబాబు హయంలో ప్రచారం ఎక్కువ.. పెట్టుబడులు తక్కువ అని ఎద్దేవా చేశారు.
అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. చంద్రబాబు గ్రాఫిక్స్‌తో పెట్టుబడులు చూపించారు. మేం దిగ్గజ పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తీసుకొచ్చాం. రూ.13లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు తెచ్చాం. గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ సూపర్ హిట్. జీఐఎస్‌తో సీఎం జగన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. జీఐఎస్ సక్సెస్ చూసి ఎల్లో బ్యాచ్‌కు గ్యాస్ ట్రబుల్ వచ్చింది. జీఐఎస్ సక్సెస్ చూసి లోకేష్‌కు మైండ్ బ్లాంక్ అయ్యింది. లోకేష్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదు. మాది గ్రాఫిక్స్ ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment