సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు కోసమే తాను ప్రధానిని కలిశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా పోలవరంపై జరిగిన చర్చలో గురువారం ఆయన ప్రసంగించారు.
టీడీపీ హయాంలో పోలవరం పనులు.. అనాలోచిత నిర్ణయాలతో ముందుకు సాగాయి. ఫలితంగా తీవ్ర నష్టం వాటిల్లింది. కానీ, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఓ పద్ధతి ప్రకారం పనులు ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికే స్పిల్‌వే.. అప్పర్ కాఫర్ డ్యాం పూర్తయ్యింది. ప్రస్తుతం గోదావరి డెల్టాకు నీరు అందించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే పోలవరం ప్రాజెక్టు కోసమే ప్రధానిని కలిశా. ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సహాయం కోసమే చర్చించా. తాత్కాలిక పనుల కోసం రూ. 15 వేల కోట్లు అడిగాను అని సీఎం జగన్ అసెంబ్లీ ద్వారా తెలిపారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచురిస్తోంది. డ్యామ్ ఎత్తుపై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోంది. 45.7 మీటర్ల ఎత్తు వరకు డ్యాం నిర్మాణం జరుగుతుంది. సీడబ్ల్యూసీ సిఫార్సుల మేరకు తొలి దశలో 41.15 మీటర్లవరకు కడతాం అని పేర్కొన్నారాయన. పోలవరంలో ప్రతీ ముంపు కుటుంబానికి గతంలో ఇచ్చిన హామీ మేరకు రూ. 10 లక్షల చొప్పున ఇచ్చి తీరతామని సీఎం జగన్ మరోసారి ప్రకటించారు.
అత్యంత ప్రాధాన్యతగా పోలవరం నిర్మాణం చేపడుతున్నామని, పోలవరం పూర్తి చేసేది ముమ్మాటికీ జగనేనని, యెల్లో మీడియాలో వచ్చే తప్పుడు కథనాలను నమ్మొద్దని మరోసారి కోరారు సీఎం జగన్.
ఇదీ చదవండి: పోలవరం పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదు
Comments
Please login to add a commentAdd a comment