
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ‘‘మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్ విసిరారు.
‘‘ఏ ఊరులో స్కూల్ మూతపడిందో ప్రతిపక్షాలు చెప్పాలి. ఎక్కడైనా ఒక్క స్కూల్‌ని మూసివేసి ఉంటే సభలో చెప్పాలి. విద్యాశాఖపై ప్రతి నెలా రెండుసార్లు సీఎం సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారు’’ అని మంత్రి స్పష్టం చేశారు.
చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్
Comments
Please login to add a commentAdd a comment