minister botsa satyanarayana
-
బాబు బెయిల్ పై మంత్రి బొత్స షాకింగ్ విషయాలు..!
-
ఈ కేసులో ఇంకా చాలామంది ఉన్నారు : బొత్స సత్యనారాయణ
-
ఐరాసకు ఏపీ విద్యార్థులు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: మన రాష్ట్రానికి చెందిన ప్రభుత్వ పాఠశాలల 10 మంది విద్యార్థులు ఐక్యరాజ్యసమితిలో ఈ నెల 16 నుండి జరిగే సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు (ఎస్డీజీ) సదస్సుకు హాజరవడం గర్వకారణమని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐ.రా.స.లో అడుగుపెట్టడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద, బలహీన వర్గాలకు చెందిన పిల్లల అభ్యున్నతికి చేస్తున్న కృషికి నిదర్శనం అన్నారు. ఈ సదస్సులో పాల్గొనడానికి అమెరికా పయనం అవుతున్న విద్యార్థులతో బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ ప్రయాణంలోను, అమెరికాలోను తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించి, సూచనలు చేశారు. నార్త్ అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ పర్యటన విజయవంతం చేసుకోవాలని అన్నారు. ఎనిమిది మంది బాలికలు, ఇద్దరు బాలురతో కూడిన ప్రతినిధుల బృందాన్నిపూర్తి ప్రభుత్వ వ్యయంతోనే ఈ అమెరికాకు తీసుకెళ్తున్నట్లు అధికారులు ఈ సందర్భంగా వివరించారు. ఈ పర్యటనలో భాగంగా విద్యార్థులకు అవసరమైన అన్ని వసతులు కల్పించామని తెలిపారు. వారం రోజుల పాటు ఈ పర్యటన ఉంటుందన్నారు. చదవండి: సెప్టెంబర్ 30 నుంచి ఆరోగ్య సురక్ష: సీఎం జగన్ -
ఏపీ, ఈఏపీసెట్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
-
అసెంబ్లీలో టీడీపీకి మైండ్ బ్లోయింగ్ రిప్లై ఇచ్చిన మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: చంద్రబాబు హయాంలో 5వేల స్కూళ్లను మూసేశారని, సీఎం జగన్ ప్రభుత్వ స్కూళ్లకు ప్రాణం పోశారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ ‘‘మా హయాంలో ఏ ఒక్క స్కూలు మూతపడలేదు.. ఏ ఊరులో స్కూలు మూతపడిందో చెప్పాలి’’ అంటూ మంత్రి బొత్స సవాల్ విసిరారు. ‘‘ఏ ఊరులో స్కూల్ మూతపడిందో ప్రతిపక్షాలు చెప్పాలి. ఎక్కడైనా ఒక్క స్కూల్‌ని మూసివేసి ఉంటే సభలో చెప్పాలి. విద్యాశాఖపై ప్రతి నెలా రెండుసార్లు సీఎం సమీక్ష చేస్తున్నారు. రాష్ట్రంలో విద్య అభివృద్ధి కోసం సీఎం కృషి చేస్తున్నారు’’ అని మంత్రి స్పష్టం చేశారు. చదవండి: అసెంబ్లీకి అందుకే వచ్చావా?.. కోటంరెడ్డిపై మంత్రి అంబటి ఫైర్ -
ఇలాంటి వక్రీకరణల వెనుక ఉద్దేశం ఏంటి?: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సమీక్ష నిర్వహించారు. సీఎం ఆదేశాల మేరకు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని విద్యాశాఖ అధికారులు వివరించారు. నాడు-నేడు కింద పనుల కోసం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.1120 కోట్లు విడుదలయ్యాయి. 2023-24 విద్యా సంవత్సరంలో స్కూళ్లు తెరిచే నాటికి విద్యా కానుకను అందించేలా కచ్చితమైన ప్రణాళిక వేసుకున్నామని, ఇప్పటికే టెండర్లు ప్రక్రియ ప్రారంభించామని అధికారులు తెలిపారు. స్కూళ్ల నిర్వహణ అంశాలపై క్రమం తప్పకుండా సచివాలయ ఉద్యోగుల నుంచి నివేదికలు తెప్పించుకోవాలన్న సీఎం ఆదేశాలను అమలు చేస్తున్నామని, క్రమం తప్పకుండా నివేదికలు వస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. చదవండి: అనంత వర్షాలపై సీఎం జగన్ సమీక్ష.. 2వేల తక్షణ సాయం ఈ నివేదికలను అనుసరించి ఎలాంటి అలసత్వం లేకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే స్కీంకు సంబంధించి ట్యాబ్‌లు రావడం మొదలయ్యిందని అధికారులు తెలిపారు. లక్షన్నరకు పైగా ట్యాబ్‌లు అందుబాటులో ఉన్నాయని, మిగిలినవి కూడా త్వరలోనే వస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ట్యాబ్‌లు వచ్చాక దాంట్లోకి కంటెంట్‌ను లోడ్ చేసే పనులు కూడా వెంటనే మొదలు కావాలని సీఎం అన్నారు. 8వ తరగతి విద్యార్థులకు, టీచర్లకు కలిపి మొత్తంగా 5,18,740 ట్యాబ్‌లు ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ముందుగా టీచర్లకు పంపిణీ చేసి, అందులో కంటెంట్‌పై వారికి అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. అంతేకాక బైజూస్ ఇ–కంటెంటును 4 వ తరగతి నుంచి 10వ తరగతి వరకూ అందిస్తామన్నారు. ట్యాబ్‌లు పొందిన వారు కాకుండా ఈ తరగతులకు చెందిన మిగిలిన విద్యార్థులు కూడా అందుబాటులోకి తీసుకు రావడానికి విద్యార్థులు తమ ఇంట్లో ఉన్న సొంత ఫోన్లలో ఈ కంటెంటును డౌన్లోడ్ చేసే అవకాశం కల్పిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీంతో పాటు పాఠ్యపుస్తకాల్లో కూడా ఈ కంటెంట్ పొందుపరచాలని అధికారులకు సీఎం ఆదేశించారు. డిజిటల్ పద్ధతుల్లోనే కాకుండా హార్డ్ కాపీల రూపంలో కూడా ఈ కంటెంట్ అందుబాటులో ఉంటుందన్న సీఎం.. ఆ మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్లో బయట వేల రూపాయల ఖర్చయ్యే కంటెంట్‌ను ఉచితంగా వారి వారి సెల్ఫోన్లో డౌన్లోడ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు. దురదృష్టవశాత్తూ దీన్నికూడా వక్రీకరించి కొన్ని మీడియ సంస్థలు కథనాలు రాస్తున్న విషయంపై సమావేశంలో ప్రస్తావన కొచ్చింది. విద్యా సంబంధిత కార్యక్రమాలు, వారికి మంచి చేసే నిర్ణయాలను కూడా రాజకీయాల్లోకి లాగడం అత్యంత దురదృష్టకరమన్న సీఎం అన్నారు. స్కూలు పిల్లలనుకూడా రాజకీయాలను నుంచి మినహాయించడంలేదని, వారిని కూడా అందులోకి లాగుతున్నారని సీఎం అన్నారు. నాడు-నేడు రెండో విడత పనుల పరిస్థితిని సీఎంకు వివరించిన అధికారులు ♦స్కూళ్లలో నాడు-నేడు కింద కల్పించిన సౌకర్యాలు, వాటి నిర్వహణపై ఆడిట్ చేయించామన్న అధికారులు ♦ఎక్కడ సమస్య వచ్చినా వెంటనే చర్యలు తీసుకునే విధానాన్ని అమలు చేస్తున్నామన్న అధికారులు ♦తరగతి గదులను డిజిటలైజేషన్ చేస్తున్నందున ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు చేయాలన్న సీఎం ♦జనవరి– ఫిబ్రవరి నాటికి ప్రతి స్కూల్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం ఏర్పాటు అవుతుందన్న అధికారులు ♦ఆడిట్లో గుర్తించిన అంశాలన్నింటిపై కూడా దృష్టిపెట్టాలన్న సీఎం ♦మరింత పకడ్బందీగా విద్యాకానుక అందించడానికి చర్యలు తీసుకుంటున్న అధికారులు ♦వచ్చే విద్యాసంవత్సరానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందన్న అధికారులు ♦ఏప్రిల్ నాటికే విద్యాకానుక కిట్లను సిద్ధంచేస్తున్నామన్న అధికారులు ♦పిల్లలకు ఇచ్చే యూనిఫారం క్లాత్ సైజును పెంచేందుకు సీఎం అంగీకారం ♦అలాగే స్టిచ్చింగ్ ధరలు కూడా పెంచేందుకు సీఎం అంగీకారం ♦ప్రస్తుతం జతకు రూ.40 ఇస్తుండగా, ఇకపై రూ. 50 ఇవ్వనున్న ప్రభుత్వం ♦అలాగే 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకూ మీడియం సైజు స్కూలు బ్యాగు, 6 నుంచి 10వ తరగతి వరకూ పెద్ద బ్యాగు ఇస్తున్నామన్న అధికారులు ♦నాణ్యతను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థను థర్డ్ పార్టీగా పెడుతున్నట్టు తెలిపిన అధికారులు ♦షూ సైజులు కూడా ఇప్పుడే తీసుకుని ఆ మేరకు షూలను నిర్ణీత సమయంలోగా తెప్పిస్తామన్న అధికారులు ♦అంగన్వాడీ పిల్లలు పీపీ–1,2 పూర్తిచేసుకోగానే వారు స్కూళ్లలో తప్పకుండా చేర్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్న అధికారులు ♦ప్రభుత్వ పాఠశాలలపై వక్రీకరణలు ఒక స్థాయికి మించి చేస్తున్నారు: సీఎం ♦ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియంను చదవలేక మానేస్తున్నారన్నట్టుగా వక్రీకరణలు చేస్తున్నారు: సీఎం ♦ఇలాంటి వక్రీకరణలు చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? ♦మంచి మాటలు చెప్పి.. పిల్లల భవిష్యత్తుకు నైతిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన వాళ్లు ఇలాంటి వక్రీకరణలు చేస్తున్నారు: సీఎం ♦స్కూళ్లు మరింత మెరుగైన నిర్వహణ కోసం, మండల విద్యాశాఖ అధికారితో పాటు మరో అధికారిని పెడుతున్నామన్న అధికారులు ♦సెర్ఫ్‌లో పనిచేస్తున్న (ఏపీఎం) అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లను నాన్ అకడమిక్ వ్యవహారాలను పర్యవేక్షించడానికి నియమిస్తున్నామన్న అధికారులు ♦అక్టోబరు17 నుంచి కూడా ఈ విధానం అమల్లోకి వస్తుందన్న అధికారులు జగనన్న గోరుముద్ద పథకంపైనా సీఎం సమీక్ష ♦నేరుగా స్కూళ్లకే సార్టెక్స్ బియ్యం పంపిణీ ♦కోడిగుడ్లు పాడవకుండా ఉండేందుకు అనుసరించదగ్గ విధానాలపైనా చర్చ ♦మధ్యాహ్న భోజనం నాణ్యతను కచ్చితంగా పాటించాలన్న సీఎం విద్య, వైద్య, వ్యసాయం రంగంలో విప్లవాత్మక మార్పు ♦విద్యా, వ్యవసాయం, ఆరోగ్యం రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం: సీఎం ♦ఈ మూడేళ్లలో ఈ మూడు రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చాం ♦ఎన్నడూలేని రీతిలో డబ్బు ఈ మూడురంగాలపై ఖర్చుచేశాం ♦ప్రభుత్వం తలెత్తుకుని గర్వంగా చెప్పుకునేట్టుగా ఈ మూడు రంగాల్లో పనులు చేశాం ♦ఇంత చేస్తున్నా.. దురదృష్టవశాత్తూ రాష్ట్రంలో రాజకీయాలు చాలా అన్యాయంగా నడుస్తున్నాయి ♦ఓ వర్గ మీడియా నిరంతరం దుష్ప్రచారం చేస్తోంది ♦ఇలాంటి వాటిని ఎదుర్కొంటూ లక్ష్యాలవైపు అడుగులు వేయాలి: అధికారులకు సీఎం నిర్దేశం ఈ సమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ ఎం వి శేషగిరిబాబు, స్టేట్ అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్ఎస్ఏ) బి శ్రీనివాసులు, విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, నాడు నేడు కార్యక్రమం డైరెక్టర్ డాక్టర్ ఆర్ మనోహరరెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్(ఎస్‌సీఈఆర్‌టి) బి ప్రతాప్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఏపీకి టీడీపీ అవసరం లేదు : మంత్రి బొత్స
-
వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తాం : మంత్రి బొత్స సత్యనారాయణ
-
తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: పాదయాత్ర ముసుగులో టీడీపీ చేస్తోంది రియల్ ఎస్టేట్ యాత్ర అని ప్రజలు గ్రహించాలని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన బొత్స.. ‘విశాఖ వచ్చి రాజధాని వద్దు అంటే ఆ ప్రాంత ప్రజలు ఎందుకు ఒప్పుకుంటారు. పాదయాత్రను రైతుల ముసుగులో టీడీపీ చేస్తోంది. అది రియల్ ఎస్టేట్ యాత్ర అని తెలుసుకోవాలి. లాండ్ పూలింగ్‌లో భూములు ఇవ్వడం ఇది మొదటిసారి కాదు కదా? పోలవరంకు ఇస్తే త్యాగం చేసినట్లు. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి మంచి పరిహారం ఇచ్చాం. అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి మా ప్రభుత్వం విధానం. రైతులకు ఇచ్చిన అగ్రిమెంట్ ప్రకారం ముందుకెళ్తాం. స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీస్తే ఉత్తరాంధ్ర బాగా వెనుకబడి ఉంది. ఐదు లక్షల కోట్లు మట్టిలో పోసి తగలెయ్యాలా? 10 వేల కోట్లతో విశాఖ అభివృద్ధి చెందతుంది. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు. నేను మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకు అనేక ప్రాజెక్టులు తెచ్చాను.’ అని స్పష్టం చేశారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదీ చదవండి: సీఎం జగన్ స్పీచ్ ముందు ఆ నిరసనలకు విలువే లేకుండా పోయింది -
మాది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం : మంత్రి బొత్స
-
సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక: మంత్రి బొత్స
సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. -
చట్టం తనపని తాను చేసుకుపోతుంది: మంత్రి బొత్స
సాక్షి, విజయనగరం: ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారని.. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అనంతబాబు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుపోతుందన్నారు. అందులో ప్రభుత్వం జోక్యం చేసుకోదన్నారు. కాగా, డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును పోలీసులు విచారిస్తున్నారు. విచారణ పూర్తికాగానే అనంతబాబును రిమాండ్‌కు తరలిస్తామని ఏఎస్పీ పేర్కొన్నారు. 19వ తేదీ రాత్రి సుబ్రహ్మణ్యం వెంట ఉన్న స్నేహితులను పోలీసులు విచారిస్తున్నారు. చదవండి: కొండెక్కిన కోడి.. కిలో చికెన్ అంత ధరా? -
‘అనధికార సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా?’
సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని.. ప్రజలు అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా అని ప్రశ్నించారు. ప్రజలను గందరగోళ పరిచే విధంగా మీడియా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు. చదవండి: మమత వ్యాఖ్యలపై మౌనమేల బాబు? పన్నులు కట్టకపోతే జప్తులు అనేది ఎప్పటి నుంచో ఉందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదన్నారు. స్థానిక సంస్థలు సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలన్నారు. ఆస్తి పన్ను వసూలు కోసం ఇంటి ముందు బ్యానర్ కడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. బలవంతపు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. -
రైతుల కష్టసుఖాలు మాకు తెలుసు
-
పట్టణ ప్రాంతాల్లో ప్రస్ఫుటమైన మార్పే లక్ష్యంగా క్లాప్ కార్యక్రమం
విజయవాడ : పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, పారిశుధ్ద్య నిర్వహణను ప్రణాళికా బద్దంగా నిర్వహిస్తూ రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) గా తీర్చిదిద్దాలని పురపాలక కమిషనర్లను మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశించారు. పట్టణ ప్రాంతాల్లోని ప్రజలందరూ పరిశుభ్ర వాతావరణంలో జీవించేలా ప్రస్ఫుటమైన మార్పులు కనిపించాలన్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా కమిషనర్లందరూ సమగ్రమైన కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి నిర్లిప్తత వద్దని , ఈ విషయాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఆకస్మిక తనిఖీలు కూడా నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. వంద రోజుల ప్రణాళికతో జూలై నెలలో ప్రారంభం కానున్న క్లాప్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం నాడు పట్టణ స్థానిక సంస్థల కమిషనర్లతో విజయవాడలోని ఎఎంఆర్ డీఎ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, కార్యదర్శి రామమనోహర్, సిడిఎంఎ ఎం.ఎం.నాయక్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ఎండి సంపత్, ఎపియుఐఎఫ్ డిసి ఎండి బసంత్ కుమార్, టిడ్కో ఎండి శ్రీధర్, మెప్మా ఎండి విజయలక్ష్మి, ఇంజనీరింగ్ ఛీప్ చంద్రయ్య తదితర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. పురపాలక కమీషనర్లందరూ ఉదయమే క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలని తద్వారా పౌరులకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పట్టణాల్లోని నివాస , వాణిజ్య ప్రాంతాల నుంచి వచ్చే వ్యర్ధాల సేకరణ, తరలింపు కోసం త్వరలో 3100 ఆటోలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి తెలిపారు. ఈ ఆటోల ద్వారా వ్యర్ధాల తరలింపునకు అవసరమైన రూట్ మ్యాప్ ను సిద్ధం చేసుకోవాలన్నారు. అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ పాలసీ తదితరాలకు అనుగుణంగా అమలు చేయాల్సిన కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ఇందుకోసం ఆయా మున్సిపాలిటీల్లో కొన్ని వార్డులను ఎంపిక చేసుకోవాలన్నారు. క్లాప్ కార్యక్రమం తాలూకు లక్ష్యాలు, ఉద్దేశ్యాలు కలిగే ప్రయోజనాలపై ప్రజలందరికీ అవగాహన కల్పించడంలో కమిషనర్లు కీలక భూమిక వహించాలన్నారు. చదవండి: మూడు రాజధానులు మా విధానం : మంత్రి బొత్స -
చరిత్రలో లేని విధంగా ఇళ్లు నిర్మాణం : సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నామని.. సౌకర్యవంతంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, మురికివాడలుగా మారకూడదని స్పష్టం చేశారు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ వేసుకోవాలని సీఎం తెలిపారు. సుందరీకరణపై ప్రత్యేక శ్రద్ద పెట్టండి, ప్రతీ ఒక్క లేఔట్‌ను రీవిజిట్ చేసి దానికి తగిన విధంగా అందంగా, అహ్లాదంగా తీర్చిదిద్దాలని చెప్పారు. పేదల ఇళ్ల నిర్మాణంపై క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై సమగ్రంగా సమీక్షించారు. మౌలిక సదుపాయాల విషయంలో పలు సూచనలు చేశారు. 15 లక్షల ఇళ్ల నిర్మాణం ఇళ్ల నిర్మాణానికి ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదలచేయాలన్నదానిపై ఒక ప్రణాళిక వేయాలని సీఎం జగన్ ఆదేశించారు. దీనివల్ల పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని పేర్కొన్నారు. తొలి విడతలో దాదాపు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు వెల్లడించారు. మిగతా వారినుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం తెలిపారు. మూడు ఆప్షన్లలో ఏ ఆప్షన్ ఎంచుకున్నా.. లబ్ధిదారుకు రాయితీపై సిమెంటు, స్టీల్‌ను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్మాణ సామగ్రి కూడా అందరికీ అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. మంచి జీవన ప్రమాణాలు ఉండాలి అన్ని ఇళ్లనూ జియో ట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. పేదల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తిచేయాలని, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ప్రజలకు మంచి జీవన ప్రమాణాలు అందాలని ఆకాంక్షించారు. రోడ్లు, భూగర్భ డ్రైనేజీ, పార్క్‌లు ఇతరత్రా మౌలిక సదుపాయాలు ఉండాలని స్పష్టం చేశారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్వాడీ ఉండాలని, ప్రతి 1,500 నుంచి 5వేల ఇళ్లకు గ్రంథాలయం అందుబాటులో ఉండాలని తెలిపారు. పట్టణాలు, నగరాల్లో మధ్య తరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలనే అంశంపై సీఎం జగన్ సమీక్షించారు. ఈ సందర్భంగా కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. కాలనీల్లో ఆహ్లాదం ఆరోగ్యం అందించే మొక్కలను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్‌కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ప్రతీప్ కుమార్, పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి వై.శ్రీలక్ష్మి, స్టేట్ హౌజింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: ప్లాంట్‌పై అసెంబ్లీ తీర్మానం చేస్తాం: సీఎం జగన్ ఉన్నత విద్యకు కొత్త రూపు: సీఎం జగన్ -
సోమువీర్రాజు బాధ్యతగా ప్రవర్తించాలి
అనంతపురం: ఆలయాలపై దాడుల కేసులకు సంబంధించి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై సోమువీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలపై మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తిపై నిరాధారమైన ఆరోపణలు చేయడం సోమువీర్రాజు స్థాయికి తగదని హితవు పలికారు. జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షడిగా వ్యవహరిస్తున్న ఆయన.. బాధ్యతగా ప్రవర్తించాలని సూచించారు. ఆలయాలపై దాడులకు పాల్పడిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయటం డీజీపీ చేసిన తప్పా అని మంత్రి బొత్స ప్రశ్నించారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసు వ్యవస్థ తమ పని తాము చేసుకుంటూ పోతుంటే.. ప్రతిపక్ష పార్టీలు ఏకంగా డీజీపీనే టార్గెట్ చేయడం వారి బరితెగింపుకు నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే దుష్టశక్తులు ఎంతటివారైనా వదిలపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఆలయాలపై దాడులకు సంబంధించి నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. కుట్ర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన చంద్రబాబు రాష్ట్రంలో మనుగడ అసాధ్యమని తెలిసి మతి భ్రమించి వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టడమే లక్ష్యంగా టీడీపీ, బీజేపీ, జనసేనలు కలిసి కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఎం జగన్మోహన్రెడ్డికి మంచి పేరు రాకూడదనే చంద్రబాబు ఆధ్వర్యంలోని దుష్టశక్తులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. బీజేపీ రథయాత్రపై స్పందిస్తూ.. యాత్రలు చేసుకునే హక్కు ఎవరికైనా ఉంటుందని పేర్కొన్నారు. -
లోకేష్‌బాబుకు మినహా బాబు ఎవరికైనా ఉద్యోగమిచ్చారా?
విజయనగరం: రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస పరిణామాలను క్షుణ్ణంగా గమనిస్తున్న ప్రజలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వైఖరిని ఛీ కొడుతున్నా, ఆయన బుద్ధి మాత్రం మారడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు లభిస్తున్న ఆదరణను చూసి ఓర్వలేని చంద్రబాబు పిచ్చిపట్టినట్లుగా వ్యవహరిస్తున్నారని మంత్రి బొత్స పేర్కొన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అండ్ కో ఆధ్వర్యంలో జరుగుతున్న కుతంత్రాలు బట్టబయలవుతున్నా ఆయనలో కనీస పశ్చాత్తాపం అనేది కూడా లేకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో ప్రజలు షాక్ ఇచ్చినా బాబు ఆలోచనా విధానంలో ఏమాత్రం మార్పులేదని చురకలు వేశారు. గతంలో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, ఇప్పుడు రైతుల కోసం మొసలి కన్నీరు కార్చడం విడ్డూరంగా ఉందని మంత్రి బొత్స ఎద్దేవా చేశారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆయన హయాంలో లోకేశ్‌బాబుకు మినహా ఎవరికి ఉద్యోగాలు కల్పించారని ప్రశ్నించారు. కమీషన్ల కోసం అమరావతిని, దోపిడీ నిమిత్తం పోలవరం ప్రాజెక్ట్‌ను వాడుకున్నారని విమర్శలు గుప్పించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన ఆయన.. పేదలకు ఏనాడైనా ఇళ్ల పట్టాలిచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసి, విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేస్తే బాబుకు ఎందుకు అంత ఆక్రోశం అని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. మాన్సస్ చరిత్ర గురించి ఏమాత్రం అవగాహన లేని చంద్రబాబు.. ట్రస్ట్ అంతర్గత విషయాల్లో తల దూర్చడం తగదన్నారు. ఆనంద గజపతి రాజు ట్రస్ట్ చైర్మన్ గా ఉండటం ఇష్టం లేని అశోక గజపతి రాజు మాన్సస్ రద్దు కోసం లేఖ రాసిన విషయాన్ని గుర్తు చేశారు. కాగా, రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ విజయదుందుభి మోగిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.