సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక: మంత్రి బొత్స  | Minister Botsa Satyanarayana Wishes Teachers Day | Sakshi
Sakshi News home page

సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక: మంత్రి బొత్స 

Published Sun, Sep 4 2022 7:05 PM | Last Updated on Sun, Sep 4 2022 7:13 PM

Minister Botsa Satyanarayana Wishes Teachers Day - Sakshi

ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు.

సాక్షి, విజయవాడ: ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా రాష్ట్రంలోని టీచర్లకు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ శుభాకాంక్షలు తెలిపారు. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులు ఎంతో కీలక భూమిక వహిస్తారని అటువంటి వారిని గురుపూజోత్సవం నాడు సన్మానించుకోవడం చాలా ముదావహమని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చదవండి: పవన్ కల్యాణ్‌ని తిట్టిస్తున్నారని చంద్రబాబు చెప్పడం దేనికి సంకేతం? 

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ అనేక సంస్కరణలు అమలు చేస్తున్నారని, వాటి ద్వారా విద్యార్ధులకు మెరుగైన ప్రమాణాలతో విద్య అందేలా  ఉపాధ్యాయులందరూ పునరంకితం కావాలన్నారు. ఉపాధ్యాయులంటే కేవలం తరగతి గదులకే పరిమితం కాదని, తల్లి దండ్రుల తరువాత పిల్లలు ఎక్కువగా గడిపేది టీచర్లతోనే అని, పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసేది వారేనని ఉపాధ్యాయుల సేవలను కొనియాడారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా సాంకేతికతను అందిపుచ్చుకుని విద్యా రంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని మంత్రి ఆకాంక్షించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement