సాక్షి, అమరావతి: ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఉండాలనేది ప్రభుత్వ విధానమని.. ప్రజలు అధికారికంగా కుళాయి కనెక్షన్లు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడుతూ, అనధికారికంగా జరిగే సంఘటనలకు ఈనాడు మద్దతు పలుకుతుందా అని ప్రశ్నించారు. ప్రజలను గందరగోళ పరిచే విధంగా మీడియా వ్యవహరించకూడదని ఆయన హితవు పలికారు.
చదవండి: మమత వ్యాఖ్యలపై మౌనమేల బాబు?
పన్నులు కట్టకపోతే జప్తులు అనేది ఎప్పటి నుంచో ఉందన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టి జప్తు చేయడం ప్రభుత్వం ఉద్దేశం కాదన్నారు. స్థానిక సంస్థలు సక్రమంగా నిర్వహించాలంటే పన్నులు సక్రమంగా చెల్లించాలన్నారు. ఆస్తి పన్ను వసూలు కోసం ఇంటి ముందు బ్యానర్ కడితే తప్పేముందని ఆయన ప్రశ్నించారు. బలవంతపు పన్ను వసూలు చేయాలని ప్రభుత్వం ఎక్కడా ఆదేశించలేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment