
సాక్షి, అమరావతి: ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం సీరియస్ అయ్యారు. గవర్నర్‌ను కించపరిస్తే సహించాలా?.. దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంటామని అన్నారు.
సభకు తలవంపులు రాకూడదు. ప్రివిలేజ్ కమిటీ ముందు వీడియో ప్రదర్శిస్తామన్నారు. తప్పుడు ప్రచారాలపై కఠిన చర్యలు ఉంటాయని స్పీకర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ నుంచి 12 మంది టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. శాసనసభ సమావేశాలు ముగిసేంత వరకు ఈ సస్పెన్షన్ అమలులో ఉంటుందని తెలిపారు.సెషన్స్ మొత్తం సస్పెండ్ అయిన వారిలో పయ్యావుల, రామానాయుడు, కోటంరెడ్డి ఉండగా.. మిగతా టీడీపీ సభ్యులు ఒకరోజు సస్పెన్షన్‌లో ఉన్నారు. గవర్నర్‌పై అసత్య ప్రచారం చేసినందుకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.