సాక్షి, తిరుపతి: టీడీపీ నేతలపై మంత్రి ఆర్కే రోజా సీరియస్ అయ్యారు. టీడీపీ నాయకులు చేసిన తప్పును సమర్ధించుకోవడానికి మా పార్టీ నేతలపై నిందలు వేయడం సిగ్గుచేటు. వాళ్లకు ఎమ్మెల్సీ వస్తే ఏమీ జరిగిపోదు అంటూ కామెంట్స్ చేశారు.
కాగా, మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. 2019 నుండి ఎక్కడా గెలవకపోవడంతో టీడీపీ నాయకులు పిచ్చెక్కిపోయారు. టీడీపీకి అనుకోకుండా మూడు ఎమ్మెల్సీలు వచ్చాయి. ఆ ఎమ్మెల్సీలు సొంత ఓట్లు, సింబల్‌తో గెలవలేదు. అయినా ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్టు సంబరాలు చేసుకుంటున్నారు. వారి సంబరాలు చేసుకుంటే మాకేమీ అభ్యంతరం లేదు. కానీ, అహంకారంతో అసెంబ్లీలో స్పీకర్‌ను అవమానించి దాడి చేయడం దురదృష్టకరం.
బీసీ అయిన స్పీకర్‌ను అవమానించి దాడికి యత్నించడం ఎంత వరకు కరెక్ట్?. వారు చేసిన తప్పులను సమర్థించుకోవడానికి మా నాయకులపై నిందలు వేయడం సిగ్గుచేటు. జీవో నంబర్-1 కోసం తీర్మానం ఇచ్చిన టీడీపీ ఎప్పుడైనా ప్రజా సమస్యల కోసం వాయిదా తీర్మానం ఇచ్చారా?. చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చితో 11 మందిని చంపేస్తే ప్రజా రక్షణ బాధ్యతతో జీవో నంబర్-1 తీసుకొచ్చాం. జీవో నంబర్-1 ప్రజలకు రక్షణ కల్పించడానికే అని అన్నారు. 2024లో సీఎం జగనన్న వన్స్ మోర్ అని ప్రజలే అంటున్నారు. టీడీపీ అధికారంలోకి రావడం పగటి కలే. టీడీపీ నాయకులు నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అని చురకలు అంటించారు.
ఇది కూడా చదవండి: స్కిల్ స్కాంలో చంద్రబాబు ఏ1 ముద్దాయి: మంత్రి మేరుగ
Comments
Please login to add a commentAdd a comment