
సాక్షి, అమరావతి: గవర్నర్ ప్రసంగంపై ఎల్లో మీడియా దుష్ప్రచారాన్ని అసెంబ్లీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ తిప్పికొట్టారు. గవర్నర్ ప్రసంగాన్ని కొందరు హేళనగా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో ఆయన మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగంపై ఎల్లోమీడియా దుష్ప్రచారం చేస్తోందన్నారు. పయ్యావుల బండారాన్ని మంత్రి బుగ్గన బయటపెట్టారు. గవర్నర్‌కు సీఎం స్వాగతం పలకలేదనే టీడీపీ తప్పుడు ప్రచారంపై వీడియోలతో సహా వాస్తవాలను మంత్రి బయటపెట్టారు.
టీడీపీవి అన్నీ తప్పుడు ఆరోపణలు. గవర్నర్‌కు మేము ఇచ్చినంత మర్యాద ఎవరూ ఇవ్వలేదని మంత్రి బుగ్గన వివరించారు. గవర్నర్‌కు స్వాగతం పలికిన వీడియోను ఆయన ప్రదర్శించారు. గవర్నర్ పట్ల గౌరవ సభ పట్ల అమర్యాదగా ప్రవరిస్తున్నారని, టీడీపీ తన వక్రబుద్ధిని మార్చుకోవాలని మంత్రి బుగ్గన హితవు పలికారు.
‘‘అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలి. ఎల్లో మీడియా కూడా బాధ్యతరహితంగా వార్తలు రాసింది. టీడీపీ వ్యవహారశైలి సభా హక్కుల ఉల్లంఘనే. తప్పుడు ఆరోపణలు చేసినవారితో పాటు అవాస్తవాలు ప్రచురించిన వారిపైనా తీవ్ర చర్యలు తీసుకోవాలి. అసత్య ప్రచారాలపై ప్రివిలేజ్ కమిటీకి రిఫర్ చేయాలి’’ అని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ స్పీకర్‌ను కోరారు.
చదవండి: జెండా పవన్‌ది.. అజెండా టీడీపీది: మంత్రి అమర్‌నాథ్
Comments
Please login to add a commentAdd a comment