సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ.. 15 బిల్లులకు ఆమోదం | Ap Cabinet Meeting Chaired By Cm Ys Jagan | Sakshi
Sakshi News home page

సీఎం వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన కేబినెట్‌ భేటీ.. 15 బిల్లులకు ఆమోదం

Published Tue, Mar 14 2023 1:02 PM | Last Updated on Tue, Mar 14 2023 3:39 PM

Ap Cabinet Meeting Chaired By Cm Ys Jagan - Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్‌ సమావేశం ముగిసింది. 45 అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో చర్చించగా,  అసెంబ్లీలో ప్రవేశపెట్టే 15 బిల్లులకు ఆమోదం తెలిపింది కేబినెట్‌. కొత్త ఇండస్ట్రియల్‌ పాలసీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. 2023-27 పారిశ్రామిక విధానానికి కేబినెట్‌ ఆమోద ముద్ర వేసింది. 

ముందుగా, స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. 24 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎసీ నిర్ణయించింది. 9 రోజుల పాటు ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు జరగనున్నాయి. ఈ నెల 16న బడ్జెట్‌ ప్రవేశపెట్టాలని బీఏసీలో నిర్ణయించారు. సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, జోగి రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.
చదవండి: ఏపీలో నాలుగేళ్లుగా సుపరిపాలన: గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement