
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఈ నెల 18 నుంచి నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 55,607 అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసాన్ని మెరుగుపరిచేలా జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఇస్తారు. ఇందుకోసం సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్‌ఫర్మేషన్ (సాల్ట్) ప్రోగ్రాం సాంకేతిక సహకారం అందించనుంది.
మొదటి విడత ఈనెల 18 నుంచి 20 వరకు, రెండో విడత 22, 24, 25 తేదీల్లో నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,344 ఉన్నత పాఠశాలలే కేంద్రంగా ఈ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.9.45కోట్లు కేటాయించింది. కాగా, శిక్షణలో పాల్గొనే అంగన్‌వాడీ సిబ్బందికి రోజువారీ గౌరవ భృతి ఇవ్వాలని ఏపీటీఎఫ్ అమరావతి అధ్యక్షుడు సి.వి.ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment