BC corporations
-
చెప్పినదానికన్నా మిన్నగా బీసీలకు గౌరవం
సాక్షి, అమరావతి: అధికారంలోకి రాక ముందు ఏలూరులో జరిగిన బీసీ గర్జనలో చెప్పిన దాని కన్నా మిన్నగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు రాష్ట్రంలో బీసీలకు గౌరవం కల్పించినట్లు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ఒక సామాన్య బీసీ కులంలో పుట్టిన తనను డిప్యూటీ సీఎం చేయడమే అందుకు నిదర్శనమన్నారు. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో సోమవారం జరిగిన వర్చువల్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. మేమెందుకు బీసీలుగా పుట్టలేదా అని మిగిలిన కులాల వారు అసూయ చెందేలా రాష్ట్రంలో బీసీల సంక్షేమం అమలవుతోందని చెప్పారు. బీసీలకు ఎంతో మేలు చేస్తున్న సీఎం జగన్‌ను కాపాడుకోవాల్సిన కనీస ధర్మం బీసీలుగా మనపైనే ఉందన్నారు. ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోవడం ద్వారా మనం మన కులాలను అన్ని రకాలుగా బలోపేతం చేసుకుంటూనే మరో పక్క సీఎంకి అండదండలు అందిస్తూ ముందుకు సాగాలని ఆయన కోరారు. రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ బీసీలకు ఇంత పెద్దపీట వేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎవరూ లేరన్నారు. బీసీలు ఉన్నతస్థాయికి ఎదిగేలా వారికి అన్ని రంగాల్లో సీఎం జగన్ సముచిత ప్రాధాన్యత కల్పిస్తున్నారని తెలిపారు. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన స్థలంలోనే బీసీ కార్పొరేషన్ చైర్మన్ల చేత ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. బీసీ కార్పొరేషన్ కార్యాలయాలను బుధవారం ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందరూ హాజరుకావాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, గ్రూపు రాజకీయాలకు అతీతంగా ఆయా కులాల సంక్షేమంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. తద్వారా పార్టీ పటిష్టతకు కృషిచేస్తూనే బలమైన నాయకులుగా ఎదగాలని కోరారు. మీటింగ్‌లో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దేశంలో కొత్త చరిత్రకు శ్రీకారం
సాక్షి, అమరావతి: బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. ‘బీసీల సంక్రాంతి’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు.. అగ్రవర్ణాల్లో పేదలు సామాజికంగా, ఆర్థికంగా, సదుపాయాల పరంగా నాలుగు మెట్లు పైన ఉండటమే అభివృద్ధి అని నమ్మి ఓ ఉద్యమంలా పని చేస్తున్నామని తెలిపారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తుంటే దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రసంగంలో ముఖ్యాంశాలు ఇవీ.. ఏడాదిన్నర క్రితం ఇదే చోట... ఇదే స్థలంలో 18 నెలల ముందు మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు. ఇప్పుడు అదే వేదిక మీద మీరందరూ ప్రమాణ స్వీకారం చేయడం నా మనసుకు ఎంతో సంతోషాన్నిస్తోంది. కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లుగా నియమితులైన మిమ్మల్ని చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల ముందే వచ్చిందా అన్నట్లుగా ఉంది. 56 కార్పొరేషన్ల చైర్మన్లలో 29 మంది నా అక్క చెల్లెమ్మలే. 672 మంది డైరెక్టర్లలో 336 మంది నా అక్క చెల్లెమ్మలే ప్రమాణ సీక్వారం చేశారని గర్వంగా చెబుతున్నా. మహిళాభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టాం. ప్రతి ఇంట్లోనూ సంతోషం.. నా 3,648 కి.మీ పాదయాత్రలో ప్రజల కష్టాలు, బాధలు చూశా. ఓ గ్రామంలో వెయ్యిమంది ఉంటే నాడు కనీసం ఇద్దరు ముగ్గురికి కూడా మేలు జరిగిన దాఖలాలు కనిపించ లేదు. అది కూడా టీడీపీ జెండా మోసినట్లు సర్టిఫికెట్ చూపిస్తే కానీ, జన్మభూమి కమిటీలు ఒప్పుకుంటే కానీ రాలేదు. ఆ స్థాయిలో దిగజారిన కార్పొరేషన్ వ్యవస్థలో మార్పులు తెచ్చాం. బీసీ పేద వర్గాల ప్రతి ఇంట్లోనూ సంతోషం కనిపించాలి. నాడు చెప్పా.. నేడు అమలు చేశా మనం అధికారంలోకి వస్తే బీసీల జీవితాలు మారుస్తానని నాడు మాట ఇచ్చా. 90 శాతం వాగ్దానాలు అమలు చేశాం. పేదలకు తోడుగా నిలబడకపోతే ప్రభుత్వం ఉండి ఏం ప్రయోజనం? అని నేను ప్రతి రోజూ అనుకుంటూ ఉంటా. వారికి తోడుగా నిలబడడం కోసమే దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని అనుకుంటా. ఐదేళ్లలో విదిల్చింది రూ.19,329 కోట్లు.. 2014 మేనిఫెస్టోలో టీడీపీ ఏం చెప్పిందో చూశాం. 118 వాగ్దానాలు ఇచ్చి కనీసం 10 శాతం కూడా అమలు చేయలేదు. బీసీలకు ఏటా రూ.10 వేల కోట్లు ఇస్తామని చెప్పింది. అంటే ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు బీసీల కోసం ఖర్చు చేయాల్సి ఉంటే కేవలం రూ.19,329 కోట్లు మాత్రమే విదిల్చింది. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు.. మనందరి ప్రభుత్వం వచ్చాక బీసీ అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశామని సగర్వంగా చెబుతున్నా. 2.88 కోట్ల బీసీ కుటుంబాలకు మేలు చేయగలిగాం. ఒక్కో కుటుంబంలో ఆరేడు పథకాలు కూడా అందాయి. ఇక బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, అట్టడుగున ఉన్న ఈ పేద వర్గాల కోసం మొత్తం రూ.59,317 కోట్లు చేశాం. తద్వారా 4.45 కోట్ల మందికి మేలు చేయగలిగాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 1.30 లక్షల మంది ఉద్యోగుల్లో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు 83 శాతం వరకు ఉన్నారు. ఏడాదిన్నరలో దాదాపు నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ స్వరాజ్యాన్ని చూస్తున్నాం. అభివృద్ధి అంటే ఇదీ.. పిల్లలు మంచి చదువులు చదువుకుంటే అది అభివృద్ధిగా భావించి 100 శాతం అక్షరాస్యత కోసం కృషి చేస్తున్నాం. కాళ్లు అరిగేలా తిరగకుండా, లంచాలు ఇవ్వకుండా మన గ్రామంలోనే పనులు జరిగితేనే అభివృద్ధి జరిగినట్లు. సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇళ్లు వెతుక్కుంటూ వస్తేనే అభివృద్ధి అంటారు. నిలువ నీడ లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు ఇస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల రూపురేఖలను నాడు–నేడు ద్వారా మారుస్తున్నాం. అభివృద్ధిపై కోవిడ్ సమయంలో కూడా నాలుగు అడుగులు ముందుకే వేశాం కానీ ఒక్క అడుగు కూడా వెనక్కు వేయలేదు. ఏడాదిన్నరలో ప్రత్యేకంగా ఇవీ – శాశ్వత ప్రాతిపదికన బీసీ కమిషన్ ఏర్పాటు – క్యాబినెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు దాదాపు 60 శాతం పదవులు. – ఐదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. – సౌమ్యుడైన శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారామ్ కూడా బీసీనే. – గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో కనీసం ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. మేం నలుగురిని రాజ్యసభకు పంపితే అందులో ఇద్దరు బీసీలే ఉన్నారు. – నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు పనుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50 శాతం. అందులో సగం అక్క చెల్లెమ్మలకు ఇచ్చేలా చట్టం. హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు.. బీసీల సంక్రాంతి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, అంజాద్‌బాషా, మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, అనిల్‌కుమార్ యాదవ్, గుమ్మనూరు జయరామ్, ఎం.శంకరనారాయణ, ముత్తంశెట్టి శ్రీనివాస్, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), పేర్ని వెంకట్రామయ్య (నాని), కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్, సీదిరి అప్పలరాజు, పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, గోరంట్ల మాధవ్, మార్గాని భరత్, వైఎస్సార్సీపీ బీసీ అధ్యయన కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాంతోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బీసీలకు 18 నెలల్లో రూ.38,519 కోట్లు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే చరిత్రను తిరగరాస్తూ బలహీనవర్గాలను బలపరిచేలా మరో అడుగు ముందుకు వేశాం. బీసీలకు ఈ స్థాయిలో పదవులు ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి. అందులో 50 శాతం పదవులు నా అక్క చెల్లెమ్మలకు ఇవ్వడం మహిళాభ్యుదయంలో మరో చరిత్ర. అధికారంలోకి వస్తే బీసీల జీవితాలను మారుస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చా. ఈ 18 నెలల్లో అది చేసి చూపించా. బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. దిగిపోయిన పాలకుడి చెడిపోయిన బుర్ర.. ఈ అభివృద్ధి అంతా ఎక్కడ చూస్తారో అని ప్రజలను మభ్యపెట్టేందుకు గత పాలకులు ప్రయత్నిస్తున్నారు. ఒక దిగిపోయిన పాలకుడు చెడిపోయిన బుర్రతో చేస్తున్నారు. ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రాజధాని అక్కడే పెట్టాలని ముందే నిర్ణయించి, బినామీలతో భూములు కొనిపించి ఇప్పుడు వాటి విలువ ఎక్కడ పడిపోతుందోనని ఆందోళన చేస్తున్నాడు. ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తుంటే అలా ఉంటుంది. ఒక మంచి బుర్ర పని చేస్తే అభివృద్ధి ఇలా ఉంటుందని చూస్తే ఎవరికైనా తెలుస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం సాక్షి, అమరావతి: కొత్తగా నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, 672 మంది డైరెక్టర్లు గురువారం ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన ‘బీసీల సంక్రాంతి’ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ వారితో పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు. తమ కులాల్లోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వానికి తమ కులాలకు మధ్య వారధిగా ఉంటామని బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్లు ప్రతిజ్ఞ చేశారు. ప్రజలకు అభివాదం చేస్తున్న సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రికి జ్ఞాపిక అందిస్తున్న మంత్రులు చెల్లుబోయిన, శంకర నారాయణ, జయరాం, ఎమ్మెల్యేలు పార్థసారథి, జోగి రమేశ్ -
కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి: సీఎం జగన్
-
దేశ చరిత్రలో ఇదే తొలిసారి: సీఎం జగన్
సాక్షి, విజయవాడ : మహిళా అభ్యుదయంలో మరో చరిత్రకు శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ నెల రోజుల ముందే వచ్చిందా అన్నట్లు ఉందని తెలిపారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం ఏర్పాటు చేసిన బీసీ సంక్రాంతి వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. వేదిక మీదకు చేరుకొని జ్యోతిరావ్ పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అననంతరం సీఎం మాట్లాడుతూ.. ఇదే వేదికపై 18 నెలల క్రితం సీఎంగా ప్రమాణ స్వీకారం చేశానని తెలిపారు. బీసీ కార్పొరేషన్లలో అత్యధిక శాతం నా అక్కాచెల్లెమ్మలే ఉండటం సంతోషంగా ఉందన్నారు. వెనుకబడిన వర్గాలకు ఈ స్థాయిలో పదవులు దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని, అందులోనూ సగభాగం మహిళలకు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేదన్నారు. చదవండి: బీసీ సంక్రాంతి సభ ప్రారంభం.. ‘బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. గత ప్రభుత్వం వెనుకబడిన కులాల వెన్నుముక విరిచిన పరిస్థితిని చూశాం. ఎన్నికల హామీల్లో ఇచ్చిన నిలబెట్టుకుంటూ వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎన్నికల మ్యానిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావిస్తాను. అయిదుగురు డిప్యూటీ సీఎంలలో నలుగురు ఎస్సీ, ఎస్టీ, మెనార్టీ వర్గాలకు చెందినవారే. కేబినెట్ కూర్పులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 60 శాతం పదవులు ఇచ్చాం. శాసనసభ స్పీకర్ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. 4 రాజ్యసభ సీట్లలో ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించాం.’ అని తెలిపారు. “బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నదే మన ప్రభుత్వ లక్ష్యం” — YS Jagan Mohan Reddy (@ysjagan) December 17, 2020 కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి ‘నామినేటెడ్ పదవులు, పనుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. మీ సామాజిక వర్గంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా బాధ్యత తీసుకోవాలి. రాకీయాలకు సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు. టీడీపీ అధికారంలో ఉండగా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసింది. కార్పొరేషన్లలో సమూల మార్పులు రావాలి. రాజకీయాల ప్రసక్తి లేకుండా అర్హులందరికీ సంక్షేమం అందాలి. ఆ బాధ్యతను మీరందరూ స్వీకరించాలి. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం. 18 నెలల్లోనే 90శాతానికి పైగా హామీలను నెరవేర్చాం. టీడీపీ హయాంలో ఐదేళ్లలో బీసీలకు చేసిందేమీలేదు. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా ద్వారా బీసీలకు రూ.6140 కోట్లు పెట్టుబడి సాయం అందించాం. సున్నా వడ్డీ పథకం ద్వారా 7.14 లక్షల బీసీ కుటుంబాలకు లబ్ది. ఈనెల 25న 31లక్షల మందికిపైగా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. 15 రోజులపాటు ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తారు. కోర్టు అనుమతి రాగానే లబ్ధిదారుల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తాం.’ అని సీఎం జగన్ పేర్కొన్నారు. “బీసీలంటే వెనుకబడిన వర్గాలు కాదు, మన సంస్కృతికి వెన్నుముక కులాలు. చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా నామినేటెడ్ పదవులు, పనుల్లో బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించాం. 18 నెలల్లోనే బీసీల సంక్షేమం కోసం రూ.38,519 కోట్లు ఖర్చు చేశాం” pic.twitter.com/KoCMbcLSMW — YS Jagan Mohan Reddy (@ysjagan) December 17, 2020 ‘‘జగనన్న చేదోడు కింద 2.98 లక్షల మందికి రూ.298 కోట్లు అందించాం. ఆరోగ్యశ్రీతో 5.24 లక్షల మంది బీసీ కుటుంబాలకు లబ్ది జరిగింది. వైఎస్ఆర్ పెన్షన్ కింద 18 నెలల్లో రూ.25వేల కోట్లు ఖర్చు చేశాం. వైఎస్ఆర్ పెన్షన్‌తో 61.94 లక్షల మందికి లబ్ధి చేకూరింది. 90.37 లక్షల మంది డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ అందించాం. ఆసరా, చేయూత పథకాలతో అక్కాచెల్లెమ్మలకు తోడుగా నిలిచాం విద్యాదీవెనతో 18.57 లక్షల మందికి రూ.3857 కోట్లు అందించాం. విద్యా కానుక పథకానికి రూ.648 కోట్లు ఖర్చు చేశాం. 42.34లక్షల మందికి లబ్ది. గోరుముద్ద పథకంతో 32.52 లక్షల మంది విద్యార్థులకు మేలు జరిగింది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణతో 30.16లక్షల మందికి లబ్ధి చేకూరింది. నాడు-నేడుతో ఆస్పత్రుల రూపురేఖలను పూర్తిగా మార్చుతున్నాం’ అని సీఎం పేర్కొన్నారు. -
పండగ వాతావరణంలా బీసీ సంక్రాంతి సభ
సాక్షి, అమరావతి: విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం బీసీ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయ 10 గంటలకు ప్రారంభమైన ఈ సభలో బీసీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. నెల రోజుల ముందే సంక్రాంతి పండగ వచ్చిందనే విధంగా బీసీలు సంబరాలు జరుపుకున్నారు. బీసీ సంక్రాంతి సభకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతిరావ్ పూలే, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ప్రజనుద్దేశించి ప్రసంగించారు. దేశ, రాష్ట్ర చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం.. వాటికి చైర్మన్లు, డైరెక్టర్లను ప్రకటించడం తెలిసిందే. కేబినేట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 60 శాతం మంత్రి పదవులు కల్పించగా, నామినేట్ పదవుల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించారు. చదవండి: బీసీల సంక్రాంతి వెనుకబడిన కులాల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ప్రతీ సంక్షేమ పథకం కార్పొరేషన్ల ద్వారానే అమలు చేయననున్నారు. ఒక్కో కార్పొరేషన్లో 13 మంది డైరెక్టర్లు ఉన్నారు. దీని ద్వారా 2కోట్ల 83లక్షల 57వేల మంది బీసీలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రూ.37,931 కోట్ల మేర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. ఈ నేపథ్యంలో వారందరి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహిస్తున్నారు. ఇందులో సగానికి పైగా పదవులను మహిళలకు కేటాయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మహిళలకు ప్రాధాన్యం బీసీలు అంటే నమ్మకానికి ప్రతీక అని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. బీసీలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని, నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించామని తెలిపారు. గత పాలకులు బీసీల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. బీసీలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్న ఏకైక సీఎం జగన్ అని ప్రశంసించారు. 139 కులాలకు కార్పొరేషన్లు ప్రకటించిన ఘనత సీఎం జగన్‌దే కార్పొరేషన్ పదవులలో మహిళలకు ప్రాధాన్యం ఇచ్చారని ఎమ్మెత్యే విడదల రజనీ అన్నారు. సంక్షేమ పథకాల్లో బీసీలే అధికంగా లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. బీసీల అభివృద్ధికి సీఎం జగన్ కృషిచేస్తున్నారన్నారు. పేద బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి సీఎం జగన్ అని కొనియాడారు. రాజకీయ చరిత్రలోనే ఇదొక సువర్ణాధ్యాయమని ఎంపీ మోపిదేవి వెంకట రమణ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి, బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. పేదలకు అండగా నిలిచారు దేశం అంతా వైఎస్ జగన్మోహన్రెడ్డి లాంటి ముఖ్యమంత్రి కావాలని కోరుకుటున్నారని పుదుచ్చేరి మంత్రి మల్లాడి కృష్ణారావు తెలిపారు. ఈ రోజు వెనుకబడిన జాతులకు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని ఆయన అన్నారు. మాట నిలుపునే మనిషి మడమ తిప్పని సీఎం వైఎస్ జగన్‌ను తమిళనాడు, పుదుచ్చేరి రాష్టాలు కోరుకుంటున్నాయన్నారు. కరోనా సమయంలో పధకాలతో పేదలకు అండగా నిలిచారని అభివర్ణించారు. 139 బీసీ కులాలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు. వెనుకబడిన జాతుల వ్యక్తిగా తమ పార్టీకి సేవ చేస్తానని స్పష్టం చేశారు. సంక్రాంతి, క్రిస్మస్ కన్నా వెనుకబడిన జాతులకు ఈరోజు స్వాతంత్ర్యం వచ్చిన రోజు అని అన్నారు. ఆ బాధ్యత మనందరిపై ఉంది వెనుక బడిన జాతులకు వెన్నుపోటు పొడిచి నాయకులను గతంలో చూశామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘నేడు తన క్యాబినెట్లో బీసీలకు ఏడుగురురికి.. మంత్రులుగా వెనుక బడిన వారికి అయిదు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారు. 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఇచ్చిన ఘనత జగన్మోహన్రెడ్డిది. ఇద్దరు బీసీ నాయకులను రాజ్యసభకు పంపారు. ఇలాంటి మహానాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రతిప్రక్ష నాయకుడు చేస్తున్న కుతంత్రాలు, సింహాల్లా తిప్పి కొట్టాలి. విద్యా, వైద్యంలో బడుగులకు ప్రాధాన్యత ఇచ్చారు. మరో 30 సంవత్సరాలు రాష్ట్రానికి సీఎంగా జగన్మోహన్రెడ్డి కొనసాగుతారు.’ అని పేర్కొన్నారు. బీసీలు అంటే భారత దేశ సాంస్కృతిక అన్న నాయకుడు సీఎం జగన్మోహన్రెడ్డి అని మంత్రి వేణుగోపాల్ కృష్ణ అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు,673 డైరెక్టర్ల పోస్టుల్లో మహిళలకు పెద్ద పీట వేశారన్నారు. బీసీల గుండెల్లో గుడి కట్టుకున్న వ్యక్తి జగన్మోహన్రెడ్డి అని, బీసీ అధ్యాయన కమిటీతో వెనుక బడిన కులాలు గుర్తించారన్నారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకున్న నేత సీఎం జగన్ అని పేర్కొన్నారు. బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు బీసీలకు సంక్రాంతి నెల ముందే వచ్చిందని ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి పేర్కొన్నారు. దేశంలో అన్ని వర్గాలు అభివృద్దే దేశ అభివృద్ధి అని అంబేద్కర్ తెలిపారని, ఆయన ఆశయాలతో సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. ‘3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకున్నారు. బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతుయి. దేశంలో బీసీ కులాల 139 బీసీ కులాలు ఉన్నాయి. ప్రతి కులాన్ని వదిలి పెట్టకుండా 56 కార్పొరేషన్లు ,673 డైరెక్టర్ల ఇచ్చారు. గత పాలకులు కేవలం బీసీలను ఓటు బ్యాంకుగానే చూశారు. బీసీ వర్గాలకు మేలు చేసిన మహానాయకుడు సీఎం జగన్. అని అన్నారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు, కృష్ణ దాస్,అంజాద్ బాష, మంత్రులు, బొత్ససత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్,వేణుగోపాల కృష్ణ, శంకర్ నారాయణ, జయరాం, సీదిరి అప్పల్ రాజు,అవంతి శ్రీనివాస్,కొడాలి నాని,పేర్ని నాని,కన్నబాబు, అదిమూలపు సురేష్, ఎంపీలు,బాల శౌరి, మోపిదేవి వెంకట రమణ, సుభాష్ చంద్రబోస్,భరత్, నదిగాం సురేష్, తదితరులు హాజరయ్యారు. -
బీసీల్లో పుట్టడం అదృష్టం: మంత్రి చెల్లుబోయిన
సాక్షి, విజయవాడ: బీసీల్లో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ 56 బీసీ కార్పొరేషన్లతో సీఎం జగన్ చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. 50 శాతానికిపైగా మహిళలకు పదవులిచ్చి పూలే ఆశయాలు నెరవేర్చారని తెలిపారు. రాజకీయ ప్రాధాన్యత కల్పించటంతో బీసీల్లో ఆత్మనూన్యతా భావం పోయిందన్నారు. ప్రతి బీసీ ఇంట్లో సీఎం జగన్ ఉంటారని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబును బీసీలు అసహ్యించుకోవటంతో మతి భ్రమించి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. (చదవండి: ‘టీడీపీ నిర్వాకం వల్లే రోడ్లన్నీ గుంతలు’) -
ఆ నిర్ణయం దేశానికే ఆదర్శం..
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశానికే దిశా నిర్దేశమని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. గుంటూరు కన్వెన్షన్ హాల్లో జరిగిన చాత్తాద శ్రీవైష్ణవ వెల్ఫేర్, డవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల అభినందన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని కులాలకు సమన్యాయం చేస్తూ వారి అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు. (చదవండి: రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన) ‘‘రాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉండగా వాటిలో కేవలం నాలుగైదు కులాలే మాత్రమే రాజకీయంగా, ఆర్థికంగా మనుగడ సాగిస్తున్నాయి. వైఎస్ జగన్ పాదయాత్రలో బీసీ కుల సంఘాల నాయకుల సమస్యలు విని వారి స్థితిగతులు తెలుసుకున్నారు. బీసీ కులంలోని అట్టడుగు వర్గాలకు కూడా ఆర్థిక, రాజకీయంగా సమన్యాయం కల్పించేందుకు 139 కులాలని కలుపుకుంటూ 56 కార్పొరేషన్లు ఛైర్మన్లు, డైరెక్టర్లను నియమించారు. సీఎం జగన్ నిర్ణయాన్ని దేశంలోనే పలు రాష్ట్రాలు ఆదర్శప్రాయంగా తీసుకుంటున్నాయని’’ మోపిదేవి పేర్కొన్నారు. (చదవండి: ‘రాజ్యాంగ వ్యతిరేక శక్తులెవరో తేల్చుకుంటాం’) మత్స్యకారుల అభివృద్ధికి అనేక కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ మోపిదేవి తెలిపారు. మత్స్య సంపద ఉత్పత్తిలో ఏపీ మొదటిస్థానంలో ఉందని పేర్కొన్నారు. చేపలు వేటాడే విధానంలో చిన్న చిన్న సమస్యలున్నాయి. ఐలా వలలతో వేటాడొద్దని ముందే చెప్పాం. అవగాహన లేకపోవడంతో ఐలా వలలు వాడుతున్నారని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాలో మత్స్యకారుల మధ్య తలెత్తిన సమస్యను పరిష్కరిస్తామని ఎంపీ మోపిదేవి పేర్కొన్నారు. -
బీసీల సంక్రాంతి
లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఇటీవల నియమితులైన 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈనెల 11న ప్రమాణ స్వీకారం చేయనున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి పేరుతో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని, వారిపట్ల తనకున్న ప్రేమ, నమ్మకాన్ని చాటనున్నారని ఆయన చెప్పారు. స్టేడియంలో ప్రమాణ స్వీకార ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బీసీ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వెలంపల్లి శ్రీనివాసరావు, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో డిక్లరేషన్ ప్రకటించి వెనుకబడిన కులాలకు అండగా ఉంటానని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారన్నారు. ఆ హామీని నిలబెట్టుకుంటూ రాష్ట్రంలో ఉన్న 139 బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. బీసీల కోసం ఇన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదన్నారు. ఈ కార్యక్రమాన్ని 6 వేల మంది ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనువుగా ఏర్పాట్లు చేస్తున్నామని, దీనికి హాజరయ్యే వారికి పాస్‌లు జారీ చేస్తామని చెప్పారు. బీసీల కల నెరవేరబోతోంది: మంత్రి చెల్లుబోయిన వెనుకబడిన తరగతుల వారిని కల్చర్ ఆఫ్ ఇండియాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుర్తించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. బీసీ కార్పొరేషన్ల ఏర్పాటు కోసం అధ్యయన కమిటీ వేసి, ఏడాది వ్యవధిలో 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించినట్టు వివరించారు. వారిలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఒకే వేదికపై డైరెక్టర్లు, చైర్మన్లు ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా బీసీలకు ముందే సంక్రాంతి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యే జోగి రమేష్, బీసీ సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ప్రవీణ్‌కుమార్, కార్యదర్శి బి.రామారావు, డీసీపీ హర్షవర్దన్‌రాజు, వైఎస్సార్సీపీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి పాల్గొన్నారు. -
బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం
సాక్షి, విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బీసీల సంక్రాంతి సభ ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మల్లాది విష్ణు, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బీసీల కార్పొరేషన్ల ఏర్పాటు ఓ చారిత్రక నిర్ణయం అని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో 56 కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఈ నెల 11న ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు.బీసీల సంక్రాంతి పేరుతో ఈ సభను నిర్వహిస్తామని ఆయన చెప్పారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ గత పాలకులు బీసీలను వెనుకబడిన తరగతులగానే చూశారని.. బీసీలను వెన్నెముకగా సీఎం వైఎస్ జగన్ భావించారని తెలిపారు. చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు పెద్దపీట వేశారని, బీసీ హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని ఆయన పేర్కొన్నారు. (చదవండి: ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్) -
ఆ ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది
సాక్షి, విశాఖపట్నం: బీసీ కార్పొరేషన్లలో సగం మహిళకే కేటాయించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. తమది బీసీల పార్టీ అని, నామినేటెడ్ పనులు, పదవుల్లో బీసీలకు 50 శాతం అవకాశం కల్పించారని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కేబినెట్లో బడుగు బలహీన పెద్దపీట వేసిన ఘనత కూడా సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. ఇక గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో బడుగు బలహీన వర్గాల్లో 86 శాతం మందికి లబ్ది చేకూరిందని పేర్కొన్నారు. గవర కార్పొరేషన్ ఏర్పాటు నేపథ్యంలో స్థానిక గురజాడ కళాక్షేత్రంలో సీఎం జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతాభినందన సభ ఏర్పాటు చేశారు. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యేలు బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమరానాథ్, పెట్ల ఉమామ శంకర్ గణేష్, తిప్పల నాగిరెడ్డి, గొల్ల బాబూరావు, గవర, మత్స్యకార కార్పొరేషన్ చైర్మన్లు బొడ్డేడ ప్రసాద్, కోలా గురువులు, కేకే రాజు, దాడి రత్నాకర్, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.(చదవండి: బాబు మార్కు రాజకీయం.. బీసీలకు విలువలేని పదవులు) ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. గవర కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్నికైన ప్రసాద్‌కు అభినందనలు తెలిపారు. ‘‘గవర అంటే గౌరవనీయులు అని అర్ధం. భారతదేశ చరిత్రలో బీసీ కార్పొరేషన్లు చిరస్థాయిగా నిలిసిపోతాయి. బీసీలకు రాజకీయంగా మేలు చేయాలనే ఉద్దేశంతోనే సీఎం జగన్ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలు అంటే సమాజానికి వెన్నుముక వంటి వారని సీఎం భావిస్తారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల 15 నెలల్లో రెండు వేల కోట్ల పైగా బీసీలకు 25 వేల కోట్ల లబ్ది చేకూరింది’’ అని పేర్కొన్నారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు బీసీలను కేవలం రాజకీయాల కోసమే వాడుకున్నారని విజయసాయిరెడ్డి విమర్శించారు. బీసీలకు 10 వేల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. బీసీ డిక్లరేషన్ పేరు చెప్పి బీసీలను మోసం చేసిన చంద్రబాబుకు వారి పేరు ఎత్తే అర్హత లేదని చురకలు అంటించారు.(చదవండి: కేంద్ర బృందాన్ని పంపినందుకు ధన్యవాదాలు) బీసీలు అంటే బ్యాక్‌బోన్ కాస్ట్ బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్రెడ్డికి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరానాథ్ ధన్యవాదాలు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా బీసీ కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని, బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్యాస్ట్ కాదు బ్యాక్ బోన్ క్యాస్ట్‌గా సీఎం గుర్తించారని హర్షం వ్యక్తం చేశారు. ఇక ఎంపీ సత్యవతి మాట్లాడుతూ.. ‘‘గవర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు. బీసీలందరూ ఆయనకు రుణపడి ఉంటారు. ఎల్లప్పుడూ ఆయన వెంటే ఉంటారు’’ అని పేర్కొన్నారు. -
‘బీసీ ప్రజలకు చరిత్రలో లిఖించే రోజు’
సాక్షి, పశ్చిమగోదావరి : దేశ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతో లిఖించే విధంగా బీసి కులాలను గుర్తించి 139 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. ఏలూరు వేదికగా జరిగిన బీసి గర్జనలో బీసీలకు ఇచ్చిన హమీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేశారన్నారు. ఏలూరులో మంగళవారం బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరక్టర్లకు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎంపీ భరత్ మాట్లాడుతూ.. ప్రతి బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పలు నిర్ణయాలు తీసుకున్నారన్నారు. బీసీలు ముఖ్యమంత్రికి ఎల్లవేళలా రుణపడి ఉంటారన్నారు. చదవండి: బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ వర్గాల ప్రజలకు ఈ రోజు చరిత్రలో లిఖించే రోజు అని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెలుగుదేశం హయంలో చంద్రబాబు నాయుడు బీసీలను కేవలం ఓట్ల బ్యాంకుగా మాత్రమే చూశారని విమర్శించారు. బీసీలకు మాయ మాటలు చెప్పి వారిని అణగదొక్కారన్నారు. బీసీకు రాజ్యాధికారం ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్న మంత్రి రాష్ట్రంలోని వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను గుర్తించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. చదవండి: బీసీలంతా వైఎస్ జగన్‌కు రుణపడ్డాం మహిళ పక్షపాతిగా సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి తానేటి వనితా అన్నారు. ఏలూరులో నిర్వహించిన బీసీ గర్జనలో బీసీలు తమ పార్టీకి వెనుముక అంటూ వైఎస్ జగన్ చెప్పారని గుర్తు చేశారు. ప్రతి బిడ్డను చదివించేందుకు అమ్మవడి అనే పథకాన్ని తీసుకువచ్చారని, దిశ అనే చట్టం మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలోను తీసుకురాలేదని పేర్కొన్నారు. పోలవరం, రాజధాని అంశంలో ప్రజలకు ఆలోచనల దిశగా ముఖ్యమంత్రి వెళ్తున్నారని, ఎన్నో లక్షల మందికి ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి అయితే భవిష్యత్తు పొతుందని టీడీపీ అడ్డుకుంటుంని మండిపడ్డారు. చదవండి: బీసీ కార్పొరేషన్లతో సామాజిక విప్లవం ఈ సమావేశంలో మంత్రులు ఆళ్లనాని, తానేటి వనితా, ఎమ్మెల్యేలు కొఠారు అబ్బాయ చౌదరి, జీఎస్ నాయుడు, ఏలీజా, కారుమూరి నాగేశ్వరరావు, పుప్పాల వాసుబాబు, తల్లారి వెంకట్రావు, ముదునూరి ప్రసాదరాజు, ఎంపీ మార్గాని భరత్, డీసీఎమ్ఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ, డీసీబీసీ చైర్మన్ కవూరు శ్రీనివాస్, జిల్లాకు చెందిన కార్పొరేషన్ చైర్మన్లు గుబ్బల తమ్మయ్య, ఇళ్ల భాస్కరరావు,పేండ్ర వీరన్న,అనంతలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
బీసీల దమ్ము ఎంతో చూపిస్తాం..
సాక్షి, విజయవాడ: బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దేశానికే ఆదర్శంగా నిలిచారని మంత్రి కొడాలి నాని అన్నారు. సోమవారం కృష్ణా జిల్లాలోని నలుగురు బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, 34 మంది డైరెక్టర్లకు తమ్మలపల్లి కళాక్షేత్రంలో సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, పార్థసారధి, జోగి రమేష్, వసంత కృష్ణప్రసాద్, దూలం నాగేశ్వరరావు, జగన్మోహన్రావు, కైలే అనీల్, కొక్కిలిగడ్డ రక్షణ నిధి, నేతలు బొప్పన భవకుమార్,దేవినేని అవినాష్, పూనూరు గౌతంరెడ్డి పాల్గొన్నారు. (చదవండి: జగన్ సారథ్యంలో రాష్ట్రాభివృద్ధి పరుగులు) ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ‘‘బీసీలకు అండగా నిలిచిన ఎన్టీఆర్‌ని చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పార్టీని లాక్కొని బీసీలను ఓటు బ్యాంకుగా మార్చేశారు. బీసీలకు ఎన్టీఆర్ లేని లోటును దివంగత మహానేత వైఎస్సార్ తీర్చారు. ఐదేళ్ల పాలనలో అందరి హృదయాల్లో చెరగని ముద్రలా నిలిచారు. తండ్రి లేని లోటుని తనయుడు వైఎస్ జగన్ తీరుస్తున్నారు. బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. బీసీ విద్యార్థుల విద్యోన్నతికి వైఎస్ జగన్ బాటలు వేస్తున్నారు. చైర్మన్లు, డైరెక్టర్లు చిత్తశుద్ధితో పనిచేసి పదవులకు న్యాయం చేయాలి. మరో 30 ఏళ్లు వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని’’ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. (చదవండి: గ్రామాల రూపురేఖలు మార్చాం: సీఎం జగన్) అన్ని రంగాల్లో బీసీలకు పెద్దపీట: పెద్దిరెడ్డి బీసీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కృష్ణి చేస్తున్నారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. 56 బీసీ కార్పొరేషన్లకు ఛైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను నియమించాం.బీసీలకు అన్ని రంగాల్లో పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థతో యువతకు ఉద్యోగావకాశాలు కల్పించామని పెద్దిరెడ్డి పేర్కొన్నారు. బీసీల అభ్యున్నతికి బాటలు: మోపిదేవి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి బాటలు వేశారని ఎంపీ మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. ‘‘ కొన్ని సామాజిక వర్గాలకే పరిమితమైన పదవులను సీఎం జగన్ విస్తృత పరిచారు. చిన్న చిన్న కులాల నుంచి కూడా ప్రతినిధులకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించారు. కార్పొరేషన్ చైర్మన్లు,డైరెక్టర్లు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేయాలి. బీసీల జీవితాల్లో సీఎం జగన్ వెలిగించిన చిరుజ్యోతి మహోజ్వల జ్యోతిగా మారుతుందని’’ మోపిదేవి పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో విప్లవాత్మక మార్పులు: పార్థసారధి బలహీన వర్గాల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పార్థసారధి అన్నారు. రాజకీయ పార్టీలు ఇప్పటి వరకు కల్లబొల్లి మాటలతో మభ్యపెట్టాయన్నారు. 70 శాతం ఉన్న వెనకబడిన కులాలను ఓటు బ్యాంకుగానే చూశారన్నారు. దివంగత మహానేత వైఎస్సార్ పాలనలో బీసీలకు న్యాయం జరిగిందని పేర్కొన్నారు. బీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్మెంట్ పెట్టారని తెలిపారు. ఇంటికో ఇంజనీర్ ఉన్నాడంటే అది వైఎస్సార్ చలువేనన్నారు. ఇప్పుడు అదే తరహాలో ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలు గురించి ఆలోచించారని, బీసీ కులాల సమస్యల పరిష్కారానికి కమిటీ వేసి నివేదికలు తెప్పించుకున్నారన్నారు. బీసీ గర్జనలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చారని తెలిపారు. సమస్యలు చెప్పేందుకు వెళ్తే బలహీనవర్గాల వారిని తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తానన్న వ్యక్తి చంద్రబాబు అని దుయ్యబట్టారు. కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్లలో యాభై శాతం మహిళలకే కేటాయించిన గొప్ప వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని పేర్కొన్నారు. వైఎస్ జగన్‌కు బీసీలు, మహిళలు రుణపడి ఉండాలని పార్థసారధి అన్నారు. బాధ్యతాయుతంగా పనిచేయాలి: మల్లాది విష్ణు బడుగు,బలహీన వర్గాలకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. బీసీ నేత మోపిదేవి వెంకటరమణకు ఇస్తున్న ప్రాధాన్యతే అందుకు నిదర్శనమని చెప్పారు. కార్పొరేషన్ ఛైర్మన్లు, డైరెక్టర్లు బాధ్యతాయుతంగా పనిచేసి లక్ష్యాలను సాధించాలని విష్ణు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్ మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ కాస్ట్ కాదు.. బ్యాక్ బోన్ అని చాటి చెప్పిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ అని కొనియాడారు. చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి: జోగి రమేష్ బీసీలలో 2019 ఎన్నికల్లోనే చైతన్యం రగిలిందని ఎమ్మెల్యే జోగి రమేష్ పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో బీసీల దమ్మెంతో చూపిస్తాం. ‘‘139 కులాలు బీసీలో ఉన్నాయని గుర్తించిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్. పాదయాత్రలో చెప్పిన విధంగా బీసీల అభ్యున్నతికి బాటలు వేశారు. అసెంబ్లీ మొదటి సెషన్లోనే బీసీలకు 50 శాతం అవకాశాలకు చట్టం తెచ్చారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ బాటలో అడుగులు వేద్దామని’’ ఆయన పిలుపునిచ్చారు. జగనన్న పాలనలో బీసీలకు చట్టసభల్లో కూడా అవకాశాలు పెరుగుతాయన్నారు. బీసీలను చిన్నచూపు చూసిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలని జోగి రమేష్ పేర్కొన్నారు. -
హస్తకళల కళాకారులకూ ఏటా రూ.10 వేలు
హస్తకళలపై ఆధారపడిన వారికి ప్రయోజనం కల్పించే విధంగా రెండు ఆన్లైన్ స్టోర్లు ప్రారంభిస్తున్నాం. తద్వారా మన కళలు, చేతి వృత్తులను బతికించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ కళలు సగర్వంగా తలెత్తుకుని నిలబడాలన్నది ప్రభుత్వ లక్ష్యం. సాక్షి, అమరావతి: హస్తకళల ద్వారా జీవనోపాధి పొందుతున్న వారికి కూడా ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం అందించనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. మన జీవితంలో ఎన్నో రకాలుగా సేవలందిస్తున్న వివిధ వృత్తుల వారికి గౌరవం ఇస్తూ.. దేశ చరిత్రలో కనీవినీ ఎరగని విధంగా 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, పదవులు ఇచ్చామన్నారు. చేనేత, హస్త కళల ఉత్పత్తులకు మరింతగా మార్కెటింగ్ కల్పించేందుకు ‘ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్’ను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ ► రాష్ట్రంలో ప్రాచుర్యం పొందిన కళలు, వృత్తులకు ఆప్కో ఆన్లైన్ స్టోర్, లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా జాతీయ, అంతర్జాతీయంగా మరింతగా మార్కెటింగ్ సదుపాయం లభిస్తుంది. ఇది ఆయా వృత్తుల కళాకారులకే కాకుండా, వారి ఉత్పత్తులకు కూడా ప్రపంచ వ్యాప్తంగా మంచి ఆదరణ లభించేలా చేస్తుంది. ► అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్ర, అజియో, పేటీఎం, గో కోప్, మిర్రా వంటి ఈ–ప్లాట్‌ఫామ్‌లలో కూడా చేనేత, హస్త కళల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆ మేరకు ఆయా సంస్థలతో లేపాక్షి, ఆప్కో ఒప్పందాలు చేసుకున్నాయి. ► ఆప్కో ఆన్లైన్ స్టోర్ ద్వారా ఆర్డర్ చేసి మంగళగిరి, వెంకటగిరి, మాధవరం, బందరు, రాజమండ్రి, ఉప్పాడ, వెంకటగిరి, ధర్మవరం, చీరాల తదితర చేనేత, పట్టు, కాటన్ చీరలు, వ్రస్తాలు, డ్రెస్ మెటీరియల్స్, బెడ్షీట్లు పొందవచ్చు. ► లేపాక్షి వెబ్ స్టోర్ ద్వారా కొండపల్లి, ఏటికొప్పాక, పెడన, చిత్తూరు కలంకారీ ఉత్పత్తులు, దుర్గి రాతి శిల్పాలు, బుడితిలో తయారయ్యే ఇత్తడి వస్తువులు, శ్రీకాకుళం ఆదివాసీ పెయింటింగ్‌లు, ఉదయగిరిలో చెక్కతో తయారయ్యే కళాఖండాలు, బొబ్బిలి వీణ, ధర్మవరం తోలు బొమ్మలు పొందవచ్చు. హస్త కళాకారులకు మంచి జరగాలి ► ఒక వైపు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్‌కు అవకాశం, మరోవైపు ఏటా రూ.10 వేల ఆర్థిక సహాయం వల్ల హస్త కళాకారులకు మంచి జరగాలన్నది ప్రభుత్వ ఆకాంక్ష. ఇప్పుడు ప్రకటించిన రూ.10 వేల సాయాన్ని ఫిబ్రవరి తర్వాత ఇస్తాం. ► జిల్లాల్లో ప్రసిద్ధి పొందిన హస్త కళల ఉత్పత్తులు ఉంటే, వాటిని కూడా ఈ వెబ్ స్టోర్స్‌లోకి తీసుకురావాలి. ఇప్పుడు చేనేత కారుల కోసం నేతన్న నేస్తం పథకం ఉంది కాబట్టే, ఆ రంగం బతుకుతోంది. అలాంటి వృత్తులు బతకాలంటే ప్రభుత్వ సహాయం, అండగా నిలవడం ఎంతో అవసరం. ► ముఖ్యమంత్రి జగన్ ఆప్కో– లేపాక్షి ఆన్లైన్ పోర్టల్ ప్రారంభించిన తర్వాత ఒక చీర కొనుగోలు చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. -
'20 ఏళ్లలో ఎన్నో అవమానాలు'
సాక్షి, ప్రకాశం: సంవత్సరాలుగా పోరాడిన బీసీలకు దక్కని రాజ్యాధికారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమైందని ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు. 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పోరేషన్లు ఏర్పాటుచేయడం, 56 మందిని చైర్మన్లుగా, 728 మందిని డైరెక్టర్లుగా ఎంపిక చేస్తూ సీఎం తీసుకున్న నిర్ణయంపై జిల్లాలోని బీసీలంతా హర్షం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మంగళవారం చీరాల నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేశారు. చీరాలలోని గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహానికి, జ్యోతిరావు పూలే విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ.. 'బీసీ మహిళగా ఉన్న తనను 20 ఏళ్లపాటు చంద్రబాబు ఎన్నో అవమానాల పాలు చేశాడు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీట వేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి' అని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు కరణం వెంకటేష్ మాట్లాడుతూ.. 'పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు. ఏడాదిన్నర కాలంలోనే అన్ని వర్గాలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేరువ చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్‌కే దక్కుతుంది' అని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ అమృతపాణి, మాజీమంత్రి పాలేటి రామారావు, బీసీ కమిషన్ మెంబర్ ముసలయ్య పాల్గొన్నారు. -
‘అప్పుడు అంతు చూస్తా, తోక కోస్తా అన్నారు’
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. అధికారంలో ఉండగా బీసీల అభివృద్ధిని మరచిన బాబు ప్రతిపక్షంలో కూర్చుని వారిని ఉద్ధరిస్తానని బీరాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు ఆయన ట్విటర్లో.. ‘అధికారంతో విర్రవీగిన రోజుల్లో అంతు చూస్తా, తోక కోస్తా అని బీసీలను.. చంద్రబాబు ఈసడించిన వీడియోలు సోషల్‌మీడియాలో ఇప్పటికీ చక్కర్లు కొడుతున్నాయి. పవర్ పోయాక పార్టీ పదవులు విదిలిస్తే ఎవరూ నమ్మరు చంద్రబాబు. విస్తరిలో వడ్డించేటప్పుడే ఆకలి మంటను గుర్తించాలి, వాటిని ఎత్తేసేటప్పుడు కాదు’అని విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. (చదవండి: అవినీతి నేతకు అధ్యక్ష పదవా?) -
బీసీ కార్పొరేషన్ల ఏర్పాటుపై రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు
సాక్షి, నెట్వర్క్: బీసీ కులాలకు ప్రాధాన్యత కల్పిస్తూ కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సోమవారం పలుచోట్ల పూలె, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహాలకు క్షీరాభిషేకం నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బీసీలకు పెద్దపీట వేశారంటూ బీసీ సంఘాలు, ప్రజాప్రతినిధులు, మహిళలు సంబరాలు జరుపుకున్నారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, బొత్స సత్యనారాయణ, పేర్ని వెంకట్రామయ్య, కొడాలి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, మేకా ప్రతాప అప్పారావు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు నగరంపాలెంలో మంత్రులు శ్రీరంగనాథరాజు, హోం మంత్రి మేకతోటి సుచరిత, అనంతపురంలో మంత్రి మాలగుండ్ల శంకర్‌నారాయణ పాల్గొన్నారు. చిత్తూరులో ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, ఎంపీ రెడ్డెప్ప, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పూలే విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. శ్రీకాకుళంలో రాష్ట్ర మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు తదితరులు వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. వైఎస్సార్ కడప జిల్లాలో పులివెందుల, వేముల, లింగాల, బద్వేలు, రైల్వేకోడూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కమలాపురం, చాపాడు, రాజంపేట తదితర ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. విజయనగరం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు శంబంగి వెంకటచినప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, బడ్డుకొండ అప్పలనాయుడు, కడుబండి శ్రీనివాసరావు, అలజంగి జోగారావు, పీడిక రాజన్నదొర తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో కర్నూలు, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, డోన్, కోడుమూరు, నంద్యాల, ఆత్మకూరు, నందికొట్కూరు తదితర ప్రాంతాల్లో సంబరాలు జరిగాయి. విశాఖలో బీచ్‌రోడ్డు, విశాఖ దక్షిణ, మధురవాడ, ఎన్ఏడీ జంక్షన్, కొత్త గాజువాక, పిలకవానిపాలెంల్లో సంబరాలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కార్పొరేషన్లతో... బీసీల్లో ప్రతి కులానికీ గుర్తింపు
సాక్షి, అమరావతి: బీసీ కులాల్లోని నాయకుల గుర్తింపునకు ప్రత్యేకంగా రాజకీయ, ప్రభుత్వ పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పాన్ని పలువురు బీసీ సంఘాల నేతలు అభినందిస్తున్నారు. ఇప్పటి వరకు మాటలకే పరిమితమైన రాజకీయ నాయకులు తప్ప ఆచరణలో చూపినవారు లేరని ఆయా సంఘాల నేతలు పేర్కొంటున్నారు. దేశంలోనే మొదటిసారిగా సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం బీసీ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా 56 మంది చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లుగా ఎంపికయ్యారని, ఇప్పటికే ఎమ్మెల్యేలు, స్పీకర్, ఉప ముఖ్యమంత్రి పదవి, మంత్రి పదవులు ఇవ్వడంలోనూ బీసీలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని ఆయా సంఘాల నేతలు పేర్కొన్నారు. అణగారిన కులాల్లో ఆత్మ విశ్వాసం దేశంలోనే బీసీలను ఈ స్థాయిలో గౌరవించిన రాజకీయ నాయకులు ఎవరూ ఇంతవరకు లేరు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా అణగారిన బీసీ కులాల్లో ఆత్మ విశ్వాసం పెరిగింది. సీఎం నిర్ణయంతో భిక్షాటన, సంచార జాతుల వారూ పాలనలో భాగస్వాములు అయ్యారు. చైర్మన్లకు ప్రొటోకాల్ ఉంటుంది. కాబట్టి అధికారులు కూడా వారి విన్నపాలు మన్నిస్తారు. బీసీల్లో ఆర్థిక సమానత్వం ఏర్పడుతుంది. అభివృద్ధి ఫలాలు అట్టడుగు స్థాయికి వెళతాయి. – ఆర్.కృష్ణయ్య, అధ్యక్షుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మంచి వ్యవస్థకు శ్రీకారం బీసీలకు రాజ్యాధికారం అందని ద్రాక్ష కాదని సీఎం వైఎస్ జగన్ నిరూపించారు. కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా మంచి వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బీసీల్లోని దాదాపు అన్ని కులాల నాయకులకు గుర్తింపు వచ్చింది. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్లు గ్రామ స్థాయిలో బీసీల వృత్తులపై అధ్యయనం చేయాలి. – పి.హనుమంతరావు, బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శుభ పరిణామం కార్పొరేషన్ల ఏర్పాటు శుభ పరిణామం బీసీ కులాలకు తగిన గుర్తింపు ఇలాంటి పదవుల ద్వారానే వస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం కాకూడదు. – కేశన శంకర్రావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వృత్తులను ప్రోత్సహించాలి బీసీల్లో కుల వృత్తులకు జీవం పోసేందుకు ఇది దోహద పడుతుంది. కార్పొరేషన్లకు తగిన నిధులు కేటాయించడం ద్వారా ఆయా కులాలను ఆర్థికంగా ఆదుకోవచ్చు. జిల్లా స్థాయిలోనూ ఈ కార్పొరేషన్లకు ఒక కమిటీ ఉంటే బాగుంటుంది. – టి. వేణుగోపాల్ యాదవ్, జాతీయ యాదవ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వ అద్భుతాల్లో ఇది ఒకటి సీఎం వైఎస్ జగన్ చేసిన అద్భుతాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ బడుల్లో నాడు–నేడుతోపాటు బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటు ఒకటి.ఎన్టీఆర్ ఒక స్థాయిలో బీసీల్లో రాజకీయ నాయకత్వ పెంపునకు పునాది వేశారు. వైఎస్ జగన్ అన్ని స్థాయిల్లో పునాదులు వేశారు. – కిర్ల కృష్ణారావు, సామాజిక సేవకుడు, కార్మిక నాయకుడు 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం చంద్రబాబు కేవలం 11 బీసీ కార్పొరేషన్లను మాత్రమే ఏర్పాటు చేసి తక్కిన కులాలకు తీరని అన్యాయం చేశారు. వైఎస్ జగన్ బీసీల్లోని అట్టడుగు వర్గాల వారికి న్యాయం చేస్తూనే అందులో 50% మంది మహిళలుండేలా చేయడం విశేషం. అధికారానికి ఏళ్ల తరబడి దూరంగా ఉన్న వారికి అధికారంతో కూడిన హక్కులు కల్పించారు. – డాక్టర్ ఎంవీవీఎస్‌ఎన్ మూర్తి, అఖిలభారత బీసీ ఫెడరేషన్ రాష్ట్ర సెక్రెటరీ జనరల్, ఎంబీసీ రాష్ట్ర అధ్యక్షుడు -
బీసీ కార్పొరేషన్లు.. రాజ్యాధికారానికి బీజం
దేశంలో సకల పీడనలకు గురై, పేదరికంతో మగ్గుచున్న బడుగులకు మహాత్మా జ్యోతిరావ్ ఫూలే విముక్తి కల్పిస్తే, అణగారిన వర్గాల ఆర్థిక పురోభివృద్దికి బాటలు వేసిన గొప్ప నేత వైఎస్ జగన్. బీసీ కులాలకు కార్పొరేషన్ల ఏర్పాటుతో పాటు వాటి చైర్మన్ల నియామకం గురించిన ప్రకటనపై ఏపీ ప్రజలు నీరాజనాలుపడుతున్నారు. ఈ చర్యతో వైఎస్ జగన్ బీసీలకు రాజ్యాధికారం అనివార్యమని చెప్పినట్లయింది. వైఎస్ జగన్ నేతృత్వంలోని ఏపీ ప్రభుత్వం 139 బీసీ కులాలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ 56 బీసీ కులాల కార్పొరేషన్లు ఏర్పాటు చేయడంతో బీసీ జాతికి ఒక చరిత్రాత్మక విజయంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. దీన్ని రాజ్యాధికారం దిశగా బీసీలు వేస్తున్న తొలి అడుగులుగా భావిస్తున్నారు. ప్రతి కార్పొరేషన్లో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించే విధంగా చైర్మన్, డైరెక్టర్ల పదవుల్లో ఆయా కులాల ప్రాతినిధ్యానికి అవకాశం కల్పిస్తూ, బీసీ, కార్పొరేషన్లో కూడా 50 శాతం మహిళలకు డైరెక్టర్లుగా.. చైర్మన్‌గా అవకాశం కల్పిస్తూ మహాత్మా జ్యోతిరావ్ పూలే, సావిత్రీబాయి ఆలోచనలను సాకారం చేసిన వైఎస్ జగన్ నిర్ణయాన్ని ఏపీలోని బీసీ కుల సంఘాలు స్వాగతించి బ్రహ్మరథం పట్టడం విశేషం. ఆయన తీసుకున్న ఈ గొప్ప నిర్ణయాన్ని బీసీలు ఎన్నటికీ మర్చిపోలేరు. విద్య, ఉద్యోగాలకు దూరమైన ప్రజలను చైతన్యపరిచే దిశగా చర్యలు చేపట్టిన వైఎస్ జగన్ దానికి బీసీ కార్పొరేషన్లతో శ్రీకారం చుట్టి, చరిత్ర పుటల్లో్ల నిలిచి నారని విద్యావంతులు, మేధావులు హర్షం వ్యక్తం చేయడం గమనార్హం. కాగా 2019, ఫిబ్రవరిలో ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, ఏపీ సీఎం వైఎస్ జగన్ వెనుకబడిన కులాలకు పెద్దపీట వేసినారు అనడంలో అతిశయోక్తి లేదు. బడుగుల స్థితిగతులను అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో వారికి కావాల్సినటువంటి అవసరాలు గుర్తించి, ఆర్థిక పురోభివృద్ధికి దోహదపడే అంశాలను తెలుసుకుని, సమాజంలో గౌరవం లేనటువంటి జీవితాలను బాగుచేయాలన్న ఉద్దేశంతో తండ్రి బాటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీసీ, కార్పొరేషన్లు ప్రతి కులానికి ఏర్పాటు చేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేసిన సంగతి విదితమే. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అట్టడుగు వర్గాల్లో 30 వేలకు పైగా జనాభా ఉన్న ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం చరిత్రాత్మక నిర్ణయం. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న నిర్ణయం వైఎస్ జగన్ ఎట్టకేలకు తీసుకోవడంతో బడుగు, బలహీన వర్గాల, ఆయా జాతుల, కులాల సంతోషానికి అవధుల్లేవు. ఈ నిర్ణయం వైఎస్ రాజశేఖరరెడ్డి వారసత్వానికి నిలువెత్తు నిదర్శనం. కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రోజు వెనుకబడిన కులాల జీవితాల్లో వెలుగు నింపిన రోజుగా నిలిచిపోతుంది. తరతరాలుగా మారని బీసీ కులాల తలరాతను, బీసీలు పడ్డ కష్టాలను అర్థం చేసుకుని, 70 ఏళ్లుగా అట్టడుగు వర్గాల గురించి మాట్లాడేవాళ్ళు ఎవరూ లేని నేపథ్యంలో.. బీసీ కార్పొరేషన్లపై వైఎస్ జగన్ తీసుకున్న సాహసోపేత నిర్ణయం ద్వారా ఆయా కులాల ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. నిజంగానే ఇది చరిత్రలో మరిచిపోలేని ఒక చారిత్రక నిర్ణయమనీ, బడుగులకు దీనివల్ల విముక్తి కలుగుతుందని మేధావులు భావిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి అణగారిన వర్గాలకు ఉన్నత విద్య దూరమవుతుందని గ్రహించి, అందరికీ ఉన్నతవిద్య చదివే అవకాశం కల్పించడంలో భాగంగా బలహీన వర్గాలకు చెందిన విద్యార్థుల ట్యూషన్ ఫీజును తిరిగి చెల్లించేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ అనే ఒక గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం కారణంగా రాష్ట్ర ఖజానాపై అపారమైన భారం పడ్డప్పటికీ ఆయన లెక్కచేయలేదు. ఇంజనీరింగ్, మెడిసిన్, ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్ కోర్సులతో సహా ప్రొఫెషనల్ కోర్సులను అభ్యసిస్తున్న వెనుకబడిన తరగతి వర్గాలకు చెందిన విద్యార్థులకు 2008లో వైఎస్సార్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి, బడుగుల ఆరాధ్యదైవంగా మిగిలారాయన. ఇప్పటికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయన పెట్టిన పథకం తమ పిల్లలకు కలిగించిన మేలు అంతా ఇంతా కాదని కృతజ్ఞతలు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఇంటిలో వైఎస్ఆర్ గుర్తులు ఇప్పటికీ మిగిలే ఉన్నాయనడంలో అతిశయోక్తి లేదు. సరిగ్గా ఆయన వారసత్వంలోనే నడుస్తూ నేడు వైఎస్ జగన్ బడుగులకు కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఏపీలోని బడుగు ప్రజలకు శుభపరిణామం. దేశంలో ఏ నేతకూడా చేపట్టని విధంగా వైఎస్ జగన్ తీసుకున్న ఈ నిర్ణయం బడుగుల ఆర్థిక పురోభివృద్ధికి ఎంతో మేలు చేకూరుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. డా. సంగని మల్లేశ్వర్ వ్యాసకర్త జర్నలిజం విభాగాధిపతి, కాకతీయ విశ్వవిద్యాలయం ‘ మొబైల్: 98662 55355 -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు!
అమరావతి : కార్పొరేషన్ల ఏర్పాటుతో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి బీసీలు రాజకీయ, ఆర్థిక, సామాజిక న్యాయం కోసం పోరాటం చేస్తున్నారన్నారు. గతంలో దళితులు, బీసీలు ముఖ్యమంత్రులు అయినప్పటికీ బహుజనులకు సరైన ప్రాధాన్యత దక్కలేదని తెలిపారు. అక్టోబర్ 18 సువర్ణాక్షరాలతో లిఖించిన రోజని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సరైన గౌరవం దక్కిన రోజని కొనియాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి గొప్ప మానవతావాది అని, వెనుకబడిన తరగతుల మహానాయకుడని పేర్కొన్నారు. మహిళలకు 50శాతం రిజర్వేషన్లతో పాటు రాజ్యసభ సీట్ల కేటాయింపుల్లో బీసీలకే ప్రాధాన్యతనిచ్చినట్టు వివరించారు. శ్రీకాకుళం జిల్లా నుంచి వెనుకబడిన కులాల వారికి గుర్తింపు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. -
బీసీలకు బాసటగా..
సాక్షి, అమరావతి: బీసీ కులాల అభివృద్ధి దిశగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం బలమైన బాటలు వేసింది. ఎన్నికల హామీ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 139 బీసీ కులాలకు 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి పాలక మండళ్లను నియమించారు. 56 మంది చైర్మన్లలో 29 మంది మహిళలు కాగా 27 మంది పురుషులు ఉన్నారు. 672 మంది బీసీలకు డైరెక్టర్లుగా పదవులు దక్కాయి. ఎప్పుడూ లేని విధంగా బీసీ వర్గాలకు ఇన్ని పదవులు దక్కడంతో అన్ని జిల్లాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశ చరిత్రలో ఇంతవరకు ఎవరూ ఇటువంటి సాహసోపేత నిర్ణయం తీసుకోలేదని, ఎన్నో ఏళ్లుగా బీసీ కులాలు కంటున్న కలలు నిజమయ్యాయని పేర్కొంటున్నారు. బీసీల్లో ఎంతో మంది సంచార జాతుల వారున్నారు. ఇకపై వారంతా ప్రభుత్వ సాయాన్ని పొందేందుకు ఓ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసి అదే కులానికి చెందిన వారిని చైర్మన్‌గా నియమించి భరోసా కల్పించింది. అతి తక్కువ జనాభా కలిగిన బీసీ కులాలు కూడా అందరితో సమానంగా ప్రయోజనం పొందేలా చర్యలు చేపట్టింది. బీసీల్లో కొన్ని కులాల జనాభా 500 లోపే ఉంది. మరికొన్ని కులాల గురించి పెద్దగా తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి. వీరందరికీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధి చేకూరనుంది. కులాల ప్రాతిపదికన ఇంత పెద్ద సంఖ్యలో కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. 50 శాతం మహిళా రిజర్వేషన్.. బీసీ కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో 13 జిల్లాలకు ప్రాతినిథ్యం దక్కింది. డైరెక్టర్లు, చైర్మన్లుగా నామినేటెడ్ పదవుల నియామకాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించారు. ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్సీపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్లను అమలు చేయడంతో మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. 2.71 కోట్ల మందికి రూ.33,500 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన 16 నెలల వ్యవధిలోనే 2,71,37,253 మంది బీసీల సంక్షేమం కోసం రూ.33,500 కోట్లు ఖర్చు చేసింది. బీసీల కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేసిన ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు లేదు. బీసీలకు నామినేటెడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికే దక్కింది. కార్పొరేషన్ల ద్వారా ఆర్థిక సాయం.. బీసీ కార్పొరేషన్ల ద్వారా సంక్షేమ ఫలాలు అందించేందుకు ఏడాదికి దాదాపు రూ.20 వేల కోట్ల వరకు ఖర్చు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. బీసీలకు అన్ని రకాల ఆర్థిక సాయాలను ఈ కార్పొరేషన్ల ద్వారా అందచేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేసే అధికారాన్ని కూడా కార్పొరేషన్ ఎండీకి కల్పిస్తారు. -
‘పాలక’ పండగ
సాక్షి, అమరావతి: బలహీన వర్గాలకు సమున్నత గౌరవం కల్పిస్తూ డిక్లరేషన్‌లో ప్రకటించిన ప్రకారం బీసీల అభివృద్ధి కోసం 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం వాటికి పాలక మండళ్లను నియమించింది. పాదయాత్ర హామీని నిలబెట్టుకుంటూ బీసీల సంక్షేమం దిశగా వడివడిగా చర్యలు చేపట్టింది. ప్రతి బీసీ కార్పొరేషన్‌కు చైర్మన్‌తోపాటు 12 మంది డైరెక్టర్లను నియమించినట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని గ్రామీణాభివృద్ధిశాఖ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ కార్పొరేషన్ల చైర్మన్ల పేర్లను ఆయన ప్రకటించారు. మొత్తం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని, మహిళలకు 50 శాతానికిపైగా పదవులిచ్చామని వివరించారు. పాలక మండళ్లలో అన్ని జిల్లాలకూ ప్రాతినిధ్యం కల్పించినట్లు చెప్పారు. సంఘాల కంటే మిన్నగా: డిప్యూటీ సీఎం కృష్ణదాస్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ కులాలకు ప్రభుత్వంలో ఎంతో గౌరవం కల్పించారని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఎక్కడో వ్యవసాయం చేసుకునే తనకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారని, ఏలూరు బీసీ డిక్లరేషన్ సభలో ప్రకటించిన విధంగా వెనుకబడిన వర్గాలకు అన్ని విధాల సాయం అందించి ఆదుకుంటున్నారని కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్పొరేషన్లు కుల సంఘాల కంటే మిన్నగా ఆయా కులాల కోసం పనిచేస్తాయన్నారు. పాలక మండళ్లు ఆయా కులాల ప్రజలకు జవాబుదారీగా ఉంటాయని చెప్పారు. మీడియాతో మాట్లాడుతున్న మంత్రి వేణుగోపాలకృష్ణ. చిత్రంలో ఎంపీ మోపిదేవి, మంత్రి బొత్స, డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు శంకర్ నారాయణ, అనిల్‌కుమార్ యాదవ్ బడ్జెట్ కంటే మిన్నగా: మంత్రి బొత్స బీసీలంటే వెన్నెముకలాంటి వారని ముఖ్యమంత్రి జగన్ చేతల్లో నిరూపించారని పురపాలకశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. బలహీన వర్గాల్లో నాయకత్వ పటిమను గుర్తించి గౌరవించిన సీఎంకు హ్యాట్సాఫ్ చెబుతున్నానన్నారు. బీసీలకు బడ్జెట్లో ఇచ్చిన దానికంటే ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక, సామాజిక మార్పులే లక్ష్యం: ఎంపీ మోపిదేవి గత ప్రభుత్వాలు బీసీలకు తాళ్లు, గేదెలు, ఇస్త్రీపెట్టెలు లాంటివి ఇచ్చి అదే సంక్షేమం అని మభ్యపుచ్చాయని, ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు విమర్శించారు. ఇప్పుడు వారు రాజకీయంగా, ఆర్థికంగా ఎదిగేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. బీసీల బాధలను ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో స్వయంగా చూశారని, ఆయన హృదయంలో నుంచి ఈ కార్పొరేషన్ల వ్యవస్థ పుట్టుకొచ్చిందని చెప్పారు. ప్రణాళికాబద్ధంగా బీసీల్లో ఆర్థిక, సామాజిక మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అనిల్‌కుమార్, మాలగుండ్ల శంకర్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు. 56 బీసీ కార్పొరేషన్లు – చైర్మన్ల వివరాలు 1. రజక కార్పొరేషన్: సుగుమంచిపల్లి రంగన్న (అనంతపురం జిల్లా) 2. కురుబ/కురుమ: కోటి సూర్యప్రకాశ్‌బాబు (అనంతపురం) 3. తొగట/తొగట వీరక్షత్రియ: గడ్డం సునీత (అనంతపురం) 4. కుంచిటి వక్కలిగ: డాక్టర్ బి.నళిని (అనంతపురం) 5. వన్యకుల క్షత్రియ: కె.వనిత (చిత్తూరు) 6. పాల ఎకరి: తరిగొండ మురళీధర్ (చిత్తూరు) 7. ముదళియార్: తిరుపతూర్ గోవిందరాజన్ సురేష్ (చిత్తూరు) 8. ఈడిగ: కె.శాంతి (చిత్తూరు) 9. గాండ్ల/తెలికుల: సంకిస భవానీప్రియ (తూర్పు గోదావరి) 10. పెరిక: పురుషోత్తం గంగాభవాని (తూర్పు గోదావరి) 11. అగ్నికుల క్షత్రియ: భండన హరి (తూర్పు గోదావరి) 12. అయ్యారక: ఆవల రాజేశ్వరి (తూర్పు గోదావరి) 13. షేక్/షెయిక్: షేక్ యాసిన్ (గుంటూరు) 14. వడ్డెర: దేవళ్ల రేవతి (గుంటూరు) 15. కుమ్మరి/శాలివాహన: మందేపుడి పురుషోత్తం (గుంటూరు) 16. కృష్ణబలిజ/పూసల: కోలా భవాని (గుంటూరు) 17. యాదవ: నన్యంపల్లి హరీష్‌కుమార్ (కడప) 18. నాయీబ్రాహ్మణ: సిద్ధవటం యానాదయ్య (కడప) 19. పద్మశాలి: జింకా విజయలక్ష్మి (కడప) 20. నూర్‌బాషా/దూదేకుల: అస్పరి ఫకూర్‌బి (కడప) 21. సగర/ఉప్పర: గనుగపెంట రమణమ్మ (కడప) 22. విశ్వబ్రాహ్మణ: తోలేటి శ్రీకాంత్ (కృష్ణా) 23. గౌడ: మాడు శివరామకృష్ణ (కృష్ణా) 24. వడ్డెలు: సైదు గాయత్రీసంతోష్ (కృష్ణా) 25. భట్రాజు: కూరపాటి గీతాంజలీదేవి (కృష్ణా) 26. వాల్మీకి/బోయ: డాక్టర్ ఎ.మధుసూదన్ (కర్నూలు) 27. కూర్ని/కరికాల భక్తులు: బుట్టా శారదమ్మ (కర్నూలు) 28. బెస్త: తెలుగు సుధారాణి (కర్నూలు) 29. వీరశైవ లింగాయత్: వై.రుద్రగౌడ్ (కర్నూలు) 30. ముదిరాజ్/ముత్రాసి: కోర్న వెంకటనారాయణ ముదిరాజ్ (నెల్లూరు) 31. జంగం: వలివేటి ప్రసన్న (నెల్లూరు) 32. బొందిలి: ఎస్.కిషోర్‌సింగ్ (నెల్లూరు) 33. ముస్లిం సంచారజాతులు: సయ్యద్ ఆసిఫా (నెల్లూరు) 34. చాత్తాద శ్రీవైష్టవ: టి.మనోజ్‌కుమార్ (ప్రకాశం) 35. ఆరెకటిక/కటిక: దాడ కుమారలక్ష్మి (ప్రకాశం) 36. దేవాంగ: బీకర సురేంద్రబాబు (ప్రకాశం) 37. మేదర : కేత లలిత నాంచారమ్మ (ప్రకాశం) 38. కళింగ: పేరాడ తిలక్ (శ్రీకాకుళం) 39. కళింగ కోమటి/కళింగ వైశ్య: అందవరపు సూరిబాబు (శ్రీకాకుళం) 40. రెడ్డిక: దుక్కా లోకేశ్వరరావు (శ్రీకాకుళం) 41. పోలినాటి వెలమ: పి.కృష్ణవేణి (శ్రీకాకుళం) 42. కురకుల/పొండర: రాజపు హైమావతి (శ్రీకాకుళం) 43. శ్రీశయన: చీపురు రాణి (శ్రీకాకుళం) 44. మత్స్యకార: కోలా గురువులు (విశాఖ) 45. గవర: బొడ్డేడ ప్రసాద్ (విశాఖ) 46. నగరాలు: పిల్లా సుజాత (విశాఖ) 47. యాత: పిల్లి సుజాత (విశాఖ) 48. నాగవంశం: బొడ్డు అప్పలకొండమ్మ (విశాఖ) 49. తూర్పు కాపు/గాజుల కాపు: మామిడి శ్రీకాంత్ (విజయనగరం) 50. కొప్పుల వెలమ: నెక్కల నాయుడుబాబు (విజయనగరం) 51. శిష్ట కరణం: కంటి మహంతి అనూష పట్నాయక్ (విజయనగరం) 52. దాసరి: డాక్టర్ రంగుముద్రి రమాదేవి (విజయనగరం) 53. సూర్యబలిజ: శెట్టి అనంతలక్ష్మి (పశ్చిమ గోదావరి) 54. శెట్టిబలిజ: డాక్టర్ గుబ్బల తమ్మయ్య (పశ్చిమ గోదావరి) 55. అత్యంత వెనుకబడినవర్గాలు: పెండ్ర వీరన్న (పశ్చిమ గోదావరి) 56. అతిరస కార్పొరేషన్: ఎల్లా భాస్కర్‌రావు (పశ్చిమ గోదావరి) -
'ఏపీ ప్రభుత్వ నిర్ణయం చారిత్రాత్మకం'
సాక్షి, అమరావతి : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆదివారం సాక్షి టీవీతో మాట్లాడుతూ హర్షం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. ' దేశంలో ఎవరు కూడా విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోలేదు.ఇతర రాష్ట్రాల్లో బీసీ లు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఎవరూ కూడా ఇలా కార్పొరేషన్ లకు బీసీలను నియమించలేదు. బీసీలకు నాయకత్వం ఇవ్వడం శుభపరిణామం. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తారు. సమగ్రంగా అభివృద్ధికి కృషి చేస్తున్నారు.ఇంత చిన్న వయస్సులో ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాజకీయంగా ఎవరు ఎదగకూడదు అనే మాత్రమే చూశారు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు..బీసీ కార్పొరేషన్ లలో మహిళలకు పెద్ద పీట వేయడం గొప్ప విషయం. రాష్ట్ర అభివృద్ధి, బీసీల సమగ్రాభివృద్ధి పట్ల సీఎం జగన్ ఉన్న కృషిని గర్వించదగ్గ విశేషం. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు బి.వై.రామయ్య మాట్లాడుతూ... చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే నిర్ణయాలు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకోవడం హర్షనీయం. 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధికి అడుగు వేస్తున్నారు.కర్నూలు జిల్లా ను బిసి జిల్లా గా మార్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుంది.అతి తక్కువ కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేసి సంక్షేమ పథకాలను అమలు చేశారు.33 వేల కోట్ల రూపాయలను సంక్షేమ పథకాలకు ఉపయోగించారు.10 వేల కోట్ల రూపాయలను బిసిలకు ఖర్చు చేస్తున్నామని చంద్రబాబు నాయుడు బిసిలను మోసం చేశారు.ప్రభుత్వ పాఠశాలల్లో నాడు నేడు కార్యక్రమాలు నిర్వహించి, రాష్ట్రంలోని పేద విద్యార్థులకు అమ్మ ఒడి, జగనన్న విద్య కానుకలను అందిస్తున్నారు.108,104 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ పథకాలను అమలు చేసి, కరోనా వైరస్ సమయంలో కూడా ఉచితంగా సేవలందిస్తున్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేశారు. పేదల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలో బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బీసీలకు 670 డైరెక్టర్లను ఏర్పాటు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్. బీసీ కార్పొరేషన్ లలో 50 శాతం మహిళలకు కల్పించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసిన వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కావడం విశేషం. (చదవండి : ‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’) పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ... సీఎం వైఎస్ జగన్ బీసీలకు పెద్ద పీట వేశారు. బీసీ గర్జనలో ఇచ్చిన మాటను వైఎస్ జగన్ ఈ రోజు అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. బీసీలు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా నిర్ణయాలు తీసుకున్నారు.బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు చేయూత క్రితం సహాయం అందిస్తున్నారు. చెప్పిన మాట అమలు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ కృషి చేశారు. స్వాతంత్య్రం వచ్చిన అప్పటి నుంచి ఇలాంటి నిర్ణయాలు నేను చూడలేదు. విజయవాడ విశ్వ బ్రాహ్మణ కమిషన్ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ మాట్లాడుతూ.. ఇచ్చిన మాటకు కట్టుబడిన కుటుంబం వైఎస్సార్ కుటుంబం. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు బీసీలకు పెద్ద పీట వేసిన వ్యక్తి వైఎస్ జగన్.56 కార్పొరేషన్స్ ఏర్పాటు చేసి బీసీల బంగారు భవిష్యత్తుకు తోడ్పాటు అందించారు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.డాక్టర్ బిఆర్ అంబేడ్కర్, పూలే కళలు కన్న కలలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అమలు చేస్తున్నారు.బాబు వస్తే జాబు వస్తుంది చెప్పి మోసం చేశాడు చంద్రబాబు, యువభేరి లో చంద్రబాబు ను ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు, బెదిరింపు చేశారు. ప్రతి సంక్షేమ పథకాలలో మహిళలకు ఎక్కువగా ప్రాధాన్య ఇచ్చారు.బీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, డైరెక్టర్లను కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు కృతజ్ఞతలు. -
‘చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది’
సాక్షి, విశాఖపట్నం : బీసీల అభివృద్ధి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో పార్టీ బీసీ నేతలు సంబరాలు జరుపుకున్నారు. వైఎస్సార్, జ్యోతిరావుపూలే విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి వేణుగోపాలకృష్ణ, ఎమ్మెల్యే జోగి రమేష్, పార్టీనేతలు లేళ్ల అప్పిరెడ్డి, చల్లపల్లి మోహనరావు తదితరులు పాల్గొన్నారు. (చదవండి : 56 బీసీ కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..) సీఎం జగన్‌కు ధన్యవాదాలు బీసీలకు 56 కార్పొరేషన్లు ఇవ్వడంపై వైఎస్సార్సీపీ నగర కార్యాలయంలో సంబరాలు నిర్వహించారు. జిల్లా నుంచి నూతనంగా ఎన్నికైన చైర్మన్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ మాట్లాడుతూ.. గతంలో ఎప్పుడూ లేని విధంగా బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంతో బీసీలందరూ పండగ చేసుకుంటున్నారని చెప్పారు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీఎం జగన్ ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఈ రోజు చరిత్రలో నిలిచిపోయే రోజు దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు సీఎం జగన్ 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. దేశ చరిత్రలో నిలిచిపోయే రోజు ఇది అని ప్రశంసించారు. చంద్రబాబు నాయుడు బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారే తప్ప చేసిందేమి లేదని విమర్శించారు. బీసీలకు అధికారంలో భాగస్వామ్యం కల్పించడం కోసం సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. బీసీల గుండెల్లో చిరస్థాయిగా సీఎం జగన్ నిలిచిపోతారని పేర్కొన్నారు. -
బీసీ కార్పొరేషన్లకు వారంలో నియామకాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం పెద్దఎత్తున 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తున్నామని, మరో వారం రోజుల్లో వాటి పదవుల్లో నియామకాలు చేస్తామని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఎన్నికలకు ముందు సీఎం వైఎస్ జగన్.. బీసీలకిచ్చిన మాట ప్రకారం వీటిని ఏర్పాటుచేసి వారికి రాజకీయ ప్రాధాన్యం, ప్రాతినిధ్యం కల్పిస్తున్నామని ఆయనన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం బొత్స మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ► ఎన్నికల ముందు ఏలూరులో భారీఎత్తున బీసీ గర్జన పెట్టాం. ఆ సభలో జగన్ మాట్లాడుతూ.. బీసీల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేలా వారి అభ్యున్నతి కోసం అన్ని చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఆ ప్రకారమే 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేయబోతున్నాం. ఇదో అద్భుతం. ► రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా ఏనాడూ ఇలా మేనిఫెస్టోలోని ప్రతి అంశాన్ని నెరవేర్చిన సందర్భాల్లేవు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఎన్నో మంచి కార్యక్రమాలను అమలుచేశారు. మళ్లీ నేడు జగన్ నేతృత్వంలో అంతకంటే ఎక్కువగా జరుగుతున్నాయి. ► చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అస్తవ్యస్తం చేసినప్పటికీ సీఎం జగన్ చక్కదిద్దుతున్నారు. ► కరోనా కష్టకాలంలో కూడా కోట్లాది మందికి సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తుంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అంటూ టీడీపీ నాయకులు ఏడుస్తున్నారు. ► పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తే ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలం అవుతుందా? ► దేవాలయాల ట్రస్ట్ బోర్డులుగానీ, మార్కెట్ యార్డు కమిటీలుగానీ, ఇతర కార్పొరేషన్లలోగానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం అవకాశం కల్పిస్తామని మాట ఇచ్చి ముఖ్యమంత్రి జగన్ చట్టం చేశారు. ► వివిధ స్థాయిల్లో సంప్రదింపులు జరిపి 139 కులాలకు 56 కార్పొరేషన్లు అవసరమని తేల్చారు. వీటికి అధ్యక్షులు, కమిటీలు వేస్తున్నారు. వీటిలో సగం పదవులు బీసీ మహిళలకు ఇస్తున్నారు. బీసీలకు ఇంత గౌరవం దక్కుతున్నందుకు.. జగన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నందుకు నాకు గర్వంగా ఉంది. -
బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీ రేపే
సాక్షి, అమరాతి: బీసీ కార్పొరేషన్ల నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం బుధవారం ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా భారీగా బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం..ఎన్నడూలేని విధంగా పెద్ద సంఖ్యలో కులాలకు ప్రాతినిథ్యం కల్పించనుంది. ఆయా కులాల ఆర్థిక, సామాజిక ప్రగతికి కార్పొరేషన్లు తోడ్పాటు అందించనున్నాయి. మొత్తంగా 56 కులాలకు ప్రభుత్వం కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. వన్నికుల క్షత్రియ, అగ్నికుల క్షత్రియ, బెస్త, ఈడిగ, నాగవంశీయులు, పులనాటి వెలమ తదితర కులాలకూ కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 30 వేల పైబడి జనాభా ఉన్నవారందరికీ కార్పొరేషన్ల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక నామినేటెడ్ పదవుల్లో పురుషుల కన్నా మహిళలకు ఎక్కువ పోస్టులు కేటాయించనున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లుగా 29 మంది మహిళలను, 27 మంది పురుషులను ప్రభుత్వం ఎంపిక చేయనుంది. అలాగే.. డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు 50 శాతం ఇచ్చే అవకాశం ఉంది. అన్ని జిల్లాలకూ ఛైర్మన్ పదవుల్లో ప్రాతినిథ్యం కల్పించనున్నారు. డైరెక్టర్ల పదవుల్లోనూ వీలైనన్ని జిల్లాలకు కేటాయింపులు ఉండనున్నాయి. (చదవండి: ‘స్పందన’పై సీఎం జగన్ సమీక్ష.. కలెక్టర్లకు సూచనలు) జిల్లా పురుషులు స్త్రీలు మొత్తం అనంతపురం 2 2 4 చిత్తూరు 2 2 4 తూర్పుగోదావరి 1 3 4 గుంటూరు 2 2 4 కడప 2 2 4 కృష్ణా 2 3 5 కర్నూలు 2 2 4 నెల్లూరు 2 2 4 ప్రకాశం 2 2 4 శ్రీకాకుళం 3 3 6 విశాఖ 2 3 5 విజయనగరం 2 2 4 పశ్చిమగోదావరి 3 1 4 27 29 56