సూర్యాపేట రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందజేసే సబ్సిడీ రుణాలు సకాలంలో గ్రౌండింగ్ చేయాలని లీడ్‌బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. సోమవారం సూర్యాపేట మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగిన జాయింట్‌మండల్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. యూనిట్ నెలకొల్పే లబ్ధిదారులకు మాత్రమే రుణం మంజూరు చేయాలన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు 15 శాతం రుణాలు అందజేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సీజన్‌కు గాను రైతులకు రూ.1400 కోట్ల రుణాలు అందజేసే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ పథకం ద్వారా రెండో విడత 2015-16 సంవత్సరానికి గాను 25 శాతం నగదులో సగాన్ని జూన్ నెలలో, సగం జూలై నెలలో రైతుల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుందన్నారు.
2014-15 సంవత్సరంలో ఐకేపీ ద్వారా సమభావన సంఘాలకు ఇప్పటివరకు రూ.493 కోట్టు అందజేయడం జరిగిందని తెలిపారు. సమభావ సంఘాల సభ్యులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించడం లేదని, మండలస్థాయిలో రికవరీ టీంలు ఏర్పాటు చేసుకోనిన రుణాలు రికవరీ చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో సమీక్షించారు. సమావేశంలో ఎస్సీ కార్పొరేషన్ ఈఓ జే.కృష్ణమూర్తి, డీపీఎంయూ యాంకర్‌పర్సన్ రమణ, సూర్యాపేట ఎంపీడీఓ నాగిరెడ్డితో పాటు వివిధ మండలాల ఎంపీడీఓలు, తహశీల్దార్‌లు, ఏఓలు, ఏపీఎంలు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
సబ్సిడీ రుణాలను సకాలంలో గ్రౌండింగ్ చే యాలి
Published Mon, Jun 22 2015 11:32 PM | Last Updated on Sat, Sep 15 2018 2:43 PM
Advertisement
Advertisement